
ఫణేశ్వరరెడ్డి(ఫైల్)
శిరివెళ్ల(నంద్యాల జిల్లా): మండల పరిధిలోని గోవిందపల్లె గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఎం.ఫణేశ్వరరెడ్డి(23) రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్‌ఐ జలీల్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు ఫణేశ్వరరెడ్డి నంద్యాల ఆర్‌జీఎం కాలేజీలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. రెండు ఏడాదిలో కొన్ని సబెక్టులు ఫెయిల్ అయ్యాడు.
చదవండి: కొడుకును చూసి షాక్ తిన్న తండ్రి.. సినిమా స్టోరీని తలపించింది..
కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై నంద్యాలకు బయల్దేరాడు. సాయంత్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. బైక్ నంబర్ ఆధారంగా అక్కడి రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని నంద్యాలకు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment