hanging
-
Balidan Diwas: నవ్వుతూ ఉరికంబం ఎక్కిన విప్లవవీరులు
ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు నాడు జరిగిన ఉద్యమంలో ఎందరో మహనీయులు ప్రాణం త్యాగం చేశారు. వారిలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు కూడా ఉన్నారు. వీరు ఆంగ్లేయుల దురాగతానికి బలయ్యారు. ఈ ఘటన జరిగింది ఈరోజే(డిసెంబరు 19). అందుకే వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం.అది 1927, డిసెంబర్ 19.. భారతదేశానికి చెందిన ముగ్గురు విప్లవ వీరులు ఉరికంబాన్ని ముద్దాడారు. ఆంగ్లేయులు వీరిని ఉరితీశారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లను ఎప్పటికీ మరువలేం. వీరిని గుర్తుచేసుకుంటూ దేశంలో డిసెంబర్ 19ని బలిదాన్ దివస్‌గా జరుపుకుంటారు.రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు కాకోరి ఘటనకు కారకులుగా పేర్కొంటూ నాటి బ్రిటీష్ ప్రభుత్వం వారికి ఉరిశిక్ష విధించింది. 1925, ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్‌లోని కాకోరి- అలంనగర్ మధ్య చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, సింగ్ తదితర విప్లవవీరులు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో వీరు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటన అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ పోలీసుల నుండి తప్పించుకున్నారు. అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్‌లు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో బ్రిటీషర్లు వారికి ఉరిశిక్ష విధించారు. ఈ సంఘటనను చరిత్రలో కాకోరి సంఘటనగా పిలుస్తారు. ఈ ఉదంతంలో పాల్గొన్న మరికొంతమంది విప్లవవీరులను బ్రిటీషర్లు జైలులో బంధించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్‌లు స్వాతంత్యోద్యమంలో బ్రిటీషర్లను ఎదురించిన తీరు విషయానికొస్తే..ఠాకూర్ రోషన్ సింగ్ఈయన 1894, జనవరి 22న యూపీలోని షాజహాన్‌పూర్‌లోని నెవాడా గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు జగదీష్ సింగ్ అలియాస్ జంగీ సింగ్. ఠాకూర్ రోషన్ సింగ్ చదువు పూర్తిచేశాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. అలాగే గురితప్పని షూటర్‌గానూ పేరొందారు. కాకోరి ఘటనలో భాగస్వామి అయిన అతనిని తొలుత ఆంగ్లేయులు విచారించారు. న్యాయమూర్తి హామిల్టన్ అతనికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. తరువాత దానిని మరణశిక్షగా మార్చారు. ఈ నేపధ్యంలో రోషన్ సింగ్ నవ్వుతూ ఉరికంబం ఎక్కారు.రామ్ ప్రసాద్ బిస్మిల్ఈయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పోరాట యోధునిగా పేరుగాంచారు. ఈయన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో జన్మించారు. కాకోరి సంఘటనలో ప్రధాన పాత్ర పోషించారు. 1918లో జరిగిన మెయిన్‌పురి ఘటనలో కూడా రామ్ ప్రసాద్ బిస్మిల్ కీలకంగా వ్యవహరించారు. ఈయన గేయ రచయితగానూ పేరొందారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ తన 30 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్అష్ఫాఖుల్లా ఖాన్ కూడా షాహన్జహాన్పూర్లో జన్మించారు. కాకోరి ఘటనలో కీలక పాత్ర పోషించారు. అష్ఫాక్ ఉల్లా ఖాన్ ఉర్దూ భాషలో ఉత్తమ కవిగా పేరొందారు. ఈయన పండిట్ రాంప్రసాద్ బిస్మిల్‌కు అత్యత సన్నిహితుడు.ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు -
భార్య కాపురానికి రాలేదని.. యువకుడు తీవ్రనిర్ణయం
కేటీదొడ్డి: భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఇర్కిచేడుకు చెందిన సంగీతను నీలహల్లికి చెందిన వీరేష్‌తో ఏడాది క్రితం వివాహమైంది. జీవనోపాధికి హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. దసరా సందర్భంగా నీలహల్లికి వచ్చారు. అక్కడ నుంచి సంగీతను తల్లిదండ్రులు ఇర్కిచేడుకు తీసుకెళ్లారు. పండుగ అయిపోయింది.. హైదరాబాద్ వెళ్దామని భర్త అడగగా, వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెంది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఎంతకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు వాకాబు చేసిన ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి పుల్లమ్మ కుమారుడు కనబడటం లేదని కేటీదొడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బుధవారం మండలంలోని కొండాపురం రైల్వేస్టేషన్ పక్కన వ్యవసాయ పొలంలో కుర్వ వీరేష్ (25) చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కుర్వ వీరేష్‌గా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఉరి
జునాగఢ్: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లా చార్వాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విమల్ చుదాసామా ఇంట్లో ఓ యువకుడు(28) అనుమాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ శవమై కనిపించాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే విమల్తోపాటు అతడి అత్త, మామ వేధింపులే కారణమంటూ ఆ లేఖలో ఉందని వివరించారు. బలవన్మరణానికి పాల్పడిన యువకుడిని నితిన్ పర్మర్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని చనిపోయినట్లు చెప్పారు. చనిపోయిన యువకుడు నితిన్ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువేనని తెలిసిందని అన్నారు. అయితే, ఎమ్మెల్యే విమల్ వాదన మరోలా ఉంది. నితిన్‌ను ఎవరో హత్య చేశారని, తనను అప్రతిష్టపాలు చేయడానికే ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని, నకిలీ సూసైడ్ నోట్‌ను సృష్టించారని ఆరోపించారు. నితిన్ చావుకు తానే కారణం అంటూ రాజకీయ ప్రత్యర్థులు నిందలు మోపుతున్నారని వాపోయారు. -
రైల్వే ట్రాక్ ఎలా వేలాడుతుందో చూడండి..
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు షిమ్లా సమ్మర్ హిల్‌లో ఒక చోట రైల్వే ట్రాక్ కింద ఉన్న భూభాగం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతూ ఉంది. కాకపోతే ఇది సాధారణ రైల్వే ట్రాక్ కాదు. యునెస్కో వారు పర్యాటకం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనిపై టాయ్ ట్రైన్ ప్రయాణిస్తుంటుంది. షిమ్లా సమ్మర్ హిల్ హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంలో ఒక భాగం. ఈ ట్రాక్ పైన వెళ్లే టాయ్ ట్రైన్ ప్రయాణం చాలా మందికి బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసే యునెస్కో వారి ప్రత్యేక ఆకర్షణ. ఈ ట్రాక్ కక్ల నుండి షిమ్లా వైపుగా 96 కి.మీ. ప్రయాణిస్తుంటుంది. ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన హిమాలయాల సొగసులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు దర్శనమిస్తాయి. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ట్రాక్ కింద భూభాగం కొట్టుకుపోవడంతో ఈ ట్రాక్ గాలిలో వేలాడుతోంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే టాయ్ ట్రైన్ రాకపోకలు ప్రస్తుతానికైతే నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం రూ.15 కోట్లు వ్యయం అవుతుందని దాని కోసం సుమారు నెలరోజుల సమయం పడుతుందని రైల్వే అధికారలు చెబుతున్నారు. ఇదే షిమ్లా సమ్మర్ హిల్ సమీపంలో మరొక దేవాలయం కూడా భారీ వర్షాలకు నేలకొరిగింది. భారీ సంఖ్యలో భక్తులు సావాన్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా ఈ దేవాలయం కుప్పకూలింది. విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపడుతుండగా శిథిలాల్లో 13 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రహదారులు నదులను తలపిస్తుంటే నదులు మాత్రం నీటిప్రవాహానికి పోటెత్తుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో మాత్రం ఘాట్ రోడ్డు పొడవునా కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నష్టం వాటిల్లిందని 60 మంది ప్రాణాలు కోల్పోగా ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించేందుకు కనీసం రూ.10,000 కోట్లు ఖర్చవుతుందని దానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అన్నారు. "Guys this is very scary" Heavy damage to Kalka-Shimla railway track due to heavy rain and landslides. The earth below the track and been washed away at one place.#Himachal #HimachalPradeshRains #HimachalFloods #himachalrains #HimachalPradesh #TRAIN @AshwiniVaishnaw pic.twitter.com/E4V8jIS2uZ — कालनेमि (Parody) (@kalnemibasu) August 14, 2023 ఇది కూడా చదవండి: చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్ -
ఆఖరి ఉరికి 48 ఏళ్లు
రాష్ట్రంలో ఉరిశిక్ష అమలు చేసి అర్ధ శతాబ్దం సమీపిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఔను నిజమే. వివిధ పరిస్థితుల నేపథ్యంలో శిక్షల అమలులో ఆలస్యం అనివార్యమవుతోంది. దేశంలో కేంద్ర కారాగారాలన్నింటిలోనూ ఈ శిక్ష పడిన ముద్దాయిలు వివిధ అప్పీళ్లతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఉరి తీసేందుకు వీలున్న ఏకైక సెంట్రల్ జైలు ఇక్కడే ఉంది. ఎక్కడ ఉరి శిక్ష పడినా ముద్దాయిని ఇక్కడి సెంట్రల్ జైలుకు తరలిస్తారు. ఈ జైలులో ఇప్పటివరకూ 48 మందిని ఉరి తీసినట్లు సమాచారం. స్వాతంత్య్రం వచ్చాక 27 మందిని ఉరి తీశారు. ఆఖరిసారిగా 1976 ఫిబ్రవరి 22న అనంతపురానికి చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. అప్పటి నుంచి అంటే ఈ 47 ఏళ్ల కాలంలో ఉరి శిక్ష అమలు కాలేదు. 1997 మార్చిలో ఇద్దరిని ఉరి తీయాల్సి వచ్చినా అనూహ్య పరిణామాల మధ్య సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్ష అమలు కాలేదు. – డెస్క్, రాజమహేంద్రవరం 1602లో డచ్‌వారి హయాంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగార భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ హయాంలో 1864లో దీనిని జైలుగా మార్చారు. 1870లో దీనికి పూర్తి జైలు రూపం వచ్చింది. 1990లో దీనిని ఆధునీకరించారు. పాత కట్టడం ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించగానే ఎడమ వైపు ఉరి (హ్యాంగ్) సెల్ ఉండేది. తర్వాత కొత్తగా నిర్మించిన జైలు పరిపాలనా భవనం కింది భాగంలోకి దీనిని మార్చారు. దేశంలో భూగర్భ హ్యాంగ్ సెల్ ఇదొక్కటేనని చెబుతారు. తలారీ కోసం తలనొప్పులు ఉరిశిక్షను అమలు చేసే తలారీ (హ్యాంగ్‌మన్) పోస్టు అంటూ ప్రత్యేకంగా ఉండదు. శిక్ష అమలు చేసినప్పుడల్లా తలారీ ఎంపిక తలనొప్పిగానే పరిణమిస్తుంది. ఈ శిక్ష అమలు చేసేవారికి మనో నిబ్బరం ఉంటాలి. అనారోగ్యం లేదా గుండె సంబంధ సమస్యలు ఉండకూడదు. సాధారణంగా ఉరిశిక్షను అమలు చేసే వ్యక్తి కుటుంబం నుంచి వారసత్వంగా ఎవరో ఒకరు ముందుకు వస్తుంటారు. 1997లో ఇక్కడి జైలులో ఉరి శిక్ష అమలు కావాల్సి ఉండగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కృష్ణా జిల్లా తిరువూరు సబ్‌జైలులో పని చేసిన ధర్మరాజు సంసిద్ధత తెలిపారు. అధికారులు ఆయనను రాజమహేంద్రవరానికి డిప్యుటేషనుపై తీసుకువచ్చారు. తీరా వచ్చాక ఆఖరి సమయంలో ఉరి అమలు కాలేదు. అచ్చం సినిమా తరహాలోనే.. 1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసులో చలపతిరావు, విజయ వర్ధన్‌లకు 1995లో గుంటూరు సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. 1997 మార్చి 14న ముద్దాయిల క్షమాభిక్ష పిటిషన్‌ను అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ తిరస్కరించారు. దీంతో అదే నెల 29న వీరిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. శిక్ష అమలుకు ముందు రోజు మార్చి 28న రాష్ట్రపతి శంకర్దయాళ్శర్మను జ్ఞాన్‌పీట్ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవితో పాటు మరికొందరు ప్రముఖులు కలిశారు. క్షమాభిక్ష వినతిని మరోసారి పరిశీలించాలని అభ్యర్థించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించారు. దీంతో వారు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడేవరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అభ్యర్థించారు. ఆ రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసు విచారించి రాష్ట్రపతి నిర్ణయం వెలువడేంత వరకూ శిక్ష అమలు చేయవద్దని ఆదేశించింది. అర్ధరాత్రి దాటాక నిర్ణయం రావడంతో సినిమా తరహాలో చివరి క్షణంలో శిక్షను నిలిపివేశారు. తర్వాత రాష్ట్రపతి నారాయణన్ వీరి ఉరి శిక్షను జీవితకాల కారాగార శిక్షగా మార్చాలని నిర్ణయించారు. ముద్దాయిల్లో విజయ వర్ధన్ ఇప్పటికీ 30 ఏళ్లుగా రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. చలపతిరావు మరో జైలులో ఉన్నారు. రోజూ ప్రాణ సంకటమే.. ఉరి శిక్ష అమలు చేస్తే క్షణాల్లో ప్రాణం పోతుంది. కానీ శిక్ష అమలవుతుందో లేదో తెలియక ఏళ్ల తరబడి ఆశనిరాశల మధ్య నలిగిపోతున్నారు ఉరి శిక్ష ఖైదీలు. 2021లో ఉరి శిక్ష పడిన మున్నా గ్యాంగ్‌కు చెందిన కొందరు ఇక్కడి కేంద్ర కారాగారంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 18 మంది ఉరి శిక్ష ఖైదీలున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. పై కోర్టులకు అప్పీలు వంటి వివిధ దశల్లో వీరి కేసులు కొనసాగుతున్నాయి. 1997లో తన ఉరి శిక్ష యావజ్జీవ ఖైదుగా మారిన నేపథ్యంలో 30 ఏళ్లకు పైబడి కారాగారంలో ఉంటున్నానని చిలకలూరిపేట బస్సు దహనం కేసు ఖైదీ విజయ వర్ధన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రత్యామ్నాయ విధానాలపై కమిటీ ఉరి శిక్షకు ఇకపై ఉరి పడుతుందా.. మరణ శిక్ష అమలులో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉంది. సున్నితమైన ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. మరణ శిక్ష కింద ఉరి కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలని 2017లో న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలాల ధర్మాసనం ఈ ఏడాది మార్చి చివరిలో విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి దీనిపై సమాధానం చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు. ఆ రాత్రి ఎప్పటికీ గుర్తే.. 1975లో జైళ్ల సర్వీసులో చేరాను. రాజమండ్రిలో ఇద్దరిని ఉరి తీయాలని తెలిసింది. తీస్తానని ముందుకు వచ్చాను. తిరువూరు నుంచి డిప్యుటేషనుపై రాజమండ్రికి బదిలీ చేశారు. తెల్లవారితే ఉరి అనగా ఆ రాత్రి జైలులోనే ఉన్నాను. నిద్ర పట్టలేదు. మనసంతా ఆలోచనలే. నా చేతుల మీదుగా ఇద్దరు ప్రాణాలు పోతాయనే ఆలోచన ఇబ్బంది పెట్టేది. కర్తవ్యం కదా అని సమాధానం చెప్పుకునేవాడిని. ఒంటిగంటన్నర తర్వాత కలత నిద్రలోకి జారుకున్నాను. ఇంతలో సహచరులు వచ్చి లేపి శిక్ష అమలు కావడం లేదన్నారు. ఆ సమయంలో ముద్దాయిల కంటే ఎక్కువగా సంతోష పడ్డాను. 2007లో రిటైరయ్యాను. ఇప్పటికీ రామమండ్రి జైలులో ఉరి రాత్రి గుర్తుకొస్తూనే ఉంటుంది. – ధర్మరాజు, కాపవరం, కోరుకొండ మండలం ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు ప్రస్తుతం కేంద్ర కారాగారంలో మరణ శిక్ష పడిన ఖైదీలు 18 మంది వరకూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ శిక్ష పడినా అమలుకు ఇక్కడికే తీసుకువస్తారు. 47 ఏళ్లుగా శిక్ష అమలు చేయనప్పటికీ హ్యాంగ్ సెల్లో ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేపడుతుంటాం. ఉరికంబం గదిలో ఐరన్ లివర్, కింద నిలబడే ఐరన్ పలకలను జాగ్రత్తగా ఉండేలా చూస్తాం. ఆదేశాలొస్తే అమలుకు సిద్ధంగా ఉంటాం. – రాహుల్, సూపరింటెండెంట్, కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం జాప్యం అనివార్యం శిక్ష పడిన తర్వాత ఖైదీలకు వివిధ పై కోర్టుల్లో అప్పీలుకు అవకాశం ఉంటుంది. తర్వాత హోం శాఖ ద్వారా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వీలుంటుంది. ఈ దశలు దాటడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే కొన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముద్దాయి జీవితానికి సంబంధించిన అంశాలు పైకోర్టులు పరిశీలిస్తాయి. ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మరీ క్రూరం, అత్యంత అమానవీయ సంచలన కేసుల్లో మినహా మిగిలిన కేసులన్నింటికీ ప్రొసీజర్ వల్ల జాప్యం అనివార్యం. – ఎం.విశ్వేశ్వరరావు,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ -
కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు!
'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన హాస్యనటుడు మైక్ బటాయే జూన్ 1న మరణించిన సంగతి తెలిసిందే. అతను మొదట గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. కానీ తాజాగా వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో అతను ఉరి వేసుకోవడం వల్ల మరణించాడని వెల్లడైంది. గతంలో కూడా ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా గుండె జబ్బులు ఉన్నట్లు ఎలాంటి చరిత్ర లేదని తెలిసింది. కాగా.. జూన్ 1న మిచిగాన్‌లోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. (ఇది చదవండి: స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి) మైక్ బటాయే కెరీర్ మైక్ బటాయే సూపర్‌హిట్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్లో మూడు ఎపిసోడ్లలో డెన్నిస్ మార్కోవ్స్కీగా కనిపించాడు. అంతేకాకుండా 'ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా,' 'స్లీపర్ సెల్,' 'ది బెర్నీ మాక్ షో,' 'బాయ్ మీట్స్ వరల్డ్,' 'ఎవ్రీబడీ లవ్స్ రేమండ్' వంటి షోలలో కూడా నటించాడు. వీటితో మైక్ బటాయే న్యూయార్క్ గోతం, లాస్ ఏంజిల్స్ లాఫ్ ఫ్యాక్టరీ, కామెడీ స్టోర్, ది ఇంప్రూవ్, ఐస్‌హౌస్ వంటి ప్రముఖ కామెడీ క్లబ్‌లలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. (ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్.. ఈసారి ఏకంగా!) -
నొప్పి లేకుండా మరణ శిక్షలేమున్నాయ్?
ఢిల్లీ: మరణశిక్షపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి లేకుండా శిక్షించే విధానాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరడుగట్టిన నేరస్తులైనప్పటికీ.. మరణం గౌరవప్రదంగా ఉండాలని, ఇది ఎంతో ముఖ్యమైన అంశమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఉరి శిక్ష విధానం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో దేశంలోని పలు లా యూనివర్సిటీలను భాగం చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తొలుత వచ్చేవారానికి ఈ అంశంపై పరిశీలనను వాయిదా వేసింది కోర్టు. అయితే.. అటార్నీ జనరల్ విజ్ఞప్తితో మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. చెల్లెలి జీవితం ఆమె ఇష్ట ప్రకారమే జరగాలి’
అన్నానగర్(చెన్నై): తనకు ఇష్టం లేని కోర్సులో చేరలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆవడి, గోవర్ధనగిరికి చెందిన విజయన్, జయలక్ష్మి దంపతుల కుమారుడు బాలాజీ (17) ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం విజయన్ పొంగల్ పండుగకు దస్తులు కొనేందుకు భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఇంట్లో బాలాజీ, అతని చెల్లెలు ఉన్నారు. గదిలోకి వెళ్లిన బాలాజీ ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన అతని చెల్లెలు లోపలికి వెళ్లి చూడగా బాలాజీ ఉరివేసుకుని కనిపించాడు. కేకలు వేయడంతో స్థానికులు అతన్ని కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ పురుషోత్తమన్ విచారణ జరిపారు. బాలాజీ తల్లిదండ్రులకు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘‘ అమ్మా, నాన్న నన్న క్షమించండి. మీరు నన్ను బాగా చూసుకున్నారు. మీరు కోరుకున్న కోర్సు చదవడం నాకు ఇష్టం లేదు. నా జీవితం నా ఎంపిక కాదు. చెల్లెలి జీవితం ఆమె ఇష్ట ప్రకారమే జరగాలని’’ పేర్కొన్నాడు. బాలాజీ నీట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడని..అయితే తల్లిదండ్రులు వేరే కోర్సులో చేరేందుకు దరఖాస్తు ఫారం ఇచ్చి ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజులుగా తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. చదవండి: విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా.. -
అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా!
ఇటీవల మోగ జీవాల పట్ల కొంత మంది మనుషులు అత్యంత హేయంగా ప్రవర్తిస్తున్నారు. అదీకూడా కుక్కలపై అత్యంత ఘోరమైన అకృత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి కుక్క మెడకు గొలుసు వేసి దాన్ని తన బైక్‌కి కట్టి ఈడ్చుకెళ్లడం, అంతకముందు ఒక కుక్క పదేపదే మొరుగుతుందని ఇటుకతో కొట్టి చంపేయడం వంటి కిరాతకాలకు ఒడిగడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడూ ముగ్గురు వ్యక్తులు ఒక కుక్క చనిపోయేలా ఉరి వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు ఒక కుక్కను చిత్రహింసలకు గురిచేసి, ఆ కుక్క మెడకు ఉరి వేసి ఆనందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఒక బిల్డింగ్ కనస్ట్రక్షన్ సైట్ వద్ద ముగ్గురు దుండగులు ఒక కుక్క మెడను గొలుసుతో ఒక గోడకు ఉరిలా వేలాడి దీసి రకరకాలుగా హింసించడం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఐతే పోలీసులు ఈ ఘటన మూడు నెలల క్రితం జరిగిన ఘటన అని, సదరు వ్యక్తులకు పిలిపించి నోటీసులు జారీ చేశామని తెలిపారు. बेजुबान की बेरहमी से हत्या!#Ghaziabad : लोनी के पास ट्रॉनिका सिटी के इलाइचीपुर से कुत्ते को बेरहमी से मार देने का वीडियो हुआ वायरल, कुत्ते को जंजीर से लटका कर मारने का वीडियो वायरल हुआ है। मामले में पुलिस कर रही जांच पड़ताल। #Viralvideo@ghaziabadpolice @Uppolice pic.twitter.com/LTSsBBFz3F — निशान्त शर्मा (@Nishantjournali) November 14, 2022 (చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్) -
షాకింగ్ ఘటన: ఉరి సీన్ రిహార్సల్లో విషాదం
సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఒక నాటకాన్ని రిహర్సల్ చేస్తూ బాలుడు మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కోలార్‌లోని ఎస్ఎల్వీ స్కూల్లో 12 ఏళ్ల సంజయ్ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి వచ్చేవారం స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భగత్ సింగ్ బయోగ్రఫీకి సంబంధించిన నాటకాన్ని వేయనున్నాడు. అందులో భాగంగానే ఇంట్లో రిహార్సల్ చేస్తున్నాడు సంజయ్. ఈ మేరకు సంజయ్ భగత్ సింగ్‌ని ఆంగ్లేయులు ఉరితీసే ఘట్టాన్ని రిహర్స్ల్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఉరి పడిపోయింది. దీంతో సంజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. దురదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అతడి కుటుంబికులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా సంజయ్ మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్కూల్లో జరగనున్న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగానే ఈ నాటకాన్ని ప్రతిరోజు సంజయ్ రిహార్సల్ చేస్తున్నాడని కుటుంబికులు చెబుతున్నారు. అందులో భాగంగానే శనివారం రాత్రి కూడా రిహార్సల్ చేసి ఇలా విగత జీవిగా మారాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు తల్లిదండ్రులు. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం సదరు సాంస్కృతిక కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడమే గాక సంజయ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. (చదవండి: ఇంట్లోకి మొసలి ఎంట్రీ... బిక్కుబిక్కుమంటూ రాత్రంతా ఆ కుటుంబం....) -
లాక్డౌన్లో కూలీలను విమానంలో పంపించిన రైతు ఆత్మహత్య
న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్లో తన వద్ద పని చేసే కార్మికులను విమానంలో స్వరాష్ట్రానికి పంపించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రైతు పప్పన్ సింగ్ గెహ్లోట్(55) ఇక లేరు. ఢిల్లీలోని ఓ ఆలయంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలిపోరా ప్రాంతంలోని తన ఇంటి ఎదురుగా ఉన్న గుడిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని పేరొన్న సూసైడ్ నోట్ లభించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పెంపించినట్లు వెల్లడించారు. ఢిల్లీ అలిపొరా ప్రాంతంలో పుట్టగొడుగుల సాగు చేస్తారు పప్పన్ సింగ్. ఆయన వద్ద బిహార్‌కు చెందిన పలువురు కార్మికులు పని చేస్తున్నారు. 2020లో కరోనా మహమ్మారి కట్టడి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కార్మికులు స్వరాష్ట్రం చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తన వద్ద పని చేసే కార్మికులకు విమాన టికెట్లు కొనుగోలు చేసి బిహార్‌కు పంపించారు పప్పన్ సింగ్. దీంతో దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ తర్వాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి లాక్డౌన్ ఎత్తివేసిన క్రమంలో మళ్లీ విమానంలోనే వారిని తిరిగి పని ప్రదేశానికి తీసుకొచ్చారు రైతు. ఇదీ చదవండి: నితీశ్ బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు -
సరిహద్దుల్లో కలకలం.. చెట్టుకు వేలాడుతూ అమ్మాయిల డెడ్‌బాడీలు
దేశ సరిహద్దుల్లో చెట్టుకు ఉరివేసుకుని ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం సంచలనంగా మారింది. వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ ఘటన ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లా ఠాకూర్గంజ్ వద్ద ఓ రేగు చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ ముగ్గురు మైనర్లు కనిపించారు. ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వారిది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ముగ్గురు మైనర్లు కరీనా గణేష్(16), కల్పనా గణేశ్(16), అంజలి గణేశ్(17).. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించడంలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బసంత పాఠక్ తెలిపారు. ఈ మేరకు వారి పేరెంట్స్ మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, వీరు ముగ్గురు సుంకోషి టీ గార్డెన్లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. Three teenage girls have been found dead in mysterious circumstances in a tea estate in Jhapa.Karina Ganesh (16), Kalpana Ganesh (16) and Anjali Ganesh (17). They used to work for the tea estate there but were missing since Saturday morning.Police are taking the bodies in hospita pic.twitter.com/vL2Vxs3W5R — Santosh Bam (@SantoshBam8) July 24, 2022 ఇది కూడా చదవండి: ప్రియురాలు ఎంత పని చేసింది.. లవర్స్ ఇలా కూడా ఉంటారా! -
అయ్యో.. సుప్రజ ఎందుకిలా చేశావ్..
సాక్షి, సత్యసాయి: ఓడీ చెరువు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసరెడ్డి కుమార్తె సుప్రజ (26) కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సుప్రజ కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున కడుపునొప్పి తీవ్రమై భరించలేక ఇంటి పైకప్పు కొండీకి చీరతో ఉరి వేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నాన్న దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి, తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఏమైందో ఏమో తెలియదు కానీ ఉదయం తలుపు తెరచి చూస్తే..
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని దుర్గగుడి వీధిలో మధుస్మిత మహాపాత్రో(45) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. రెండు నెలల క్రితమే భర్త చనిపోవడంతో మనోవేదనకు గురైన ఈమెని బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈమె ఓ అద్దె ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉదయం ఆమె ఇంటి తలుపులు తెరిచి ఉండకపోవడంపై సందేహం వ్యక్తం చేసిన ఇరుగుపొరుగు వారు ఆమెని పలిచారు. అయినా ఆమె ఇంటి లోపలి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు విరగ్గొట్టి, చూడగా ఉరికి వేలాడుతున్న మధుస్మిత మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి మృతదేహం తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: సుగుణ తలుపులు తీయ్.. కిటికీలో నుంచి చూడగా..
సాక్షి, విశాఖపట్నం: ఎంవీపీకాలనీ సెక్టార్–6లోని ఓ ఇంట్లో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పత్రుల సుగుణ(25), దూడ ఉపేంద్ర దంపతులు రెండు నెలలుగా సెక్టార్–6లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సుగుణ మద్దిలపాలెంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కొంత సమయం తర్వాత ఉపేంద్ర ఇంటికి వచ్చి సుగుణ తలుపులు తీయ్ అంటూ గట్టిగా అరిచాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పుసర్ల సూర్యారావు వచ్చి ఏమైందని అడిగాడు. తలుపులు తీయడం లేదని ఉపేంద్ర బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ కిటికీలో నుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇంటి యజమాని సూర్యారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చదవండి: (మసాజ్‌సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
ఫోన్ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్‌రూంలోకి వెళ్లి..
సాక్షి,పహాడీషరీఫ్( రంగారెడ్డి): తరచూ ఫోన్ మాట్లాడుతుందని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ వివరాల ప్రకారం.. మల్లాపూర్ బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన పోలోజు ఆంజనేయచారి కుమార్తె దివ్యశ్రీ (21) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తరచూ ఫోన్ మాట్లాడుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు వెళ్లి వాష్‌రూంలోనే ఉరేసుకుంది. ఆంజనేయచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో.. శంకర్పల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్పల్లి పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. శంకర్పల్లి సీఐ మహేశ్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన ఆంజనేయులు (28), స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. తరుచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆంజనేయులు ఇంట్లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి భార్య చూసే సరికి భర్త మరొక గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి.. -
ఏడాది కిందట పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య!
కోలారు: తాలూకాలోని కల్వమంజలి గ్రామంలో ఉరివేసుకున్న స్థితిలో చైత్ర (25) అనే వివాహిత శవమైంది. ఆమె భర్త వెంకటేష్ నరసాపురం పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో కార్మికుడు. అతడు డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన సమయంలో భార్య ఇంట్లో ఉరికి వేలాడుతోంది. వీరికి యేడాది క్రితమే పెళ్లయింది. కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించేవారని తెలిసింది. వారే హత్య చేశారని మృతురాలి అక్క శ్వేత ఆరోపిస్తోంది. ఘటన తరువాత భర్త, కుటుంబీకులు పరారయ్యారు. సిఐ శివరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం
Taliban Hangs To Helicopter: అమెరికా-నాటో దళాలు అఫ్గన్ నేలను విడిచిన తర్వాత తాలిబన్లు రెచ్చిపోతున్నారంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాందహార్‌లో ఓ వ్యక్తిని చంపి.. అమెరికా గస్తీ హెలికాప్టరుకు వేలాడదీసి గగనతంలో తాలిబన్లు తిప్పిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అమెరికా రాజకీయ వేత్తలు, నటుల నుంచి మొదలు.. భారత జర్నలిస్టులు, మీడియా హౌజ్‌ల దాకా ఇదొక అఘాయిత్యంగా పేర్కొంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే.. అయితే అది తప్పుడు వార్త. మిలియన్ల మంది షేర్ చేసిన ఈ వీడియో నిజం కాదని నిర్ధారణ అయ్యింది. పన్నెండు సెకండ్ల వీడియో వీడియో బిల్డింగ్‌ల మధ్య ఓ వ్యక్తి వేలాడుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమెరికా పాట్రోలింగ్ హెలికాఫ్టర్ ఉపయోగించి.. ఓ వ్యక్తిని తాలిబన్లు చంపి ఉరేగించారని, ప్రజలకు భయంకరమైన సందేశాన్ని పంపారంటూ పలువురు భారత జర్నలిస్టులు వరుసపెట్టి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై అమెరికాలో రాజకీయ దురమారం సైతం చెలరేగింది. కానీ, ఇది విషాదం కాదని.. సంబురం అని ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. Afghan pilot flying this is someone I have known over the years. He was trained in the US and UAE, he confirmed to me that he flew the Blackhawk helicopter. Taliban fighter seen here was trying to install Taliban flag from air but it didn’t work in the end. https://t.co/wnF8ep1zEl — BILAL SARWARY (@bsarwary) August 31, 2021 అమెరికా దళాలు ఖాళీ చేశాక.. అమెరికా మిలిటరీ యుద్ధ సామాగ్రి మొత్తాన్ని తాలిబన్లు స్వాధీనపర్చుకున్నారు. సంబురంగా జెండాలు ఎగరేసి వేడుకలు చేసుకున్నారు. కాందహార్‌లో జెండాను ఎగరేయడానికి బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ద్వారా ఓ ఫైటర్‌ను ఉపయోగించుకున్న సందర్భం అది. టబుసమ్ రేడియో అనే పేజీ నుంచి వైరల్ అయ్యింది. అఫ్గన్ రేడియో స్టేషన్ అగస్టు 30న టెలిగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. కాందహార్‌లోని గవర్నర్ కార్యాలయం మీద జెండా ఎగరేయడానికి ఆ తాలిబన్ మెంబర్ ప్రయత్నించాడు. ఫుల్ లెంగ్త్ వీడియోలో చేతులు ఊపడం కూడా చూడొచ్చు. అమెరికా భద్రత దళాల ఉపసంహరణ సందర్భంగా తాలిబన్ల సంబురంలో భాగంగా ఈ ఘటన జరిగింది. కేవలం అక్కడే కాదు.. చాలాచోట్ల జెండాను ఎగరేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. చదవండి- తాలిబన్లు మంచోళ్లు: క్రికెటర్ -
బిడ్డకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
వేలూరు: భర్త మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతుండడంతో మనస్తాపానికి గురైన భార్య కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన రాణిపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. కావేరిపాక్యం సమీపంలోని సిత్తంజి గ్రామానికి చెందిన దయాలన్‌కు భార్య వెన్నిల(35), కుమార్తెలు కీర్తి, హరిత(3) ఉన్నారు. కూలి పనులు చేసే దయాలన్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను మరోసారి భార్యతో గొడవపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వెన్నిల ఓ కుమార్తెను తీసుకుని ఇంటి వెనుక వైపు వచ్చింది. చీరతో హరితకు ఉరివేసి అదే చీరతో ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం తల్లీకుమార్తెలు చెట్టుకు వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవ్యలూరు పోలీసులు మృతదేహాలను వాలాజ ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. -
భగత్‌సింగ్ నాటకం.. ఉరి రిహార్సల్స్ చేస్తుండగా విషాదం
బదౌన్(యూపీ): స్వాతంత్య్ర దినోత్సవం రోజు భగత్‌సింగ్ నాటక ప్రదర్శన ఇచ్చి, గ్రామస్తుల మెప్పు పొందాలనుకున్న బాలుడి ఆశలు నెరవేరలేదు. అదే నాటకం కోసం సాధన చేస్తూ ప్రాణాలొదిలాడు. భగత్‌సింగ్‌కు బ్రిటిష్ అధికారులు ఉరి వేసే దృశ్యాన్ని ప్రాక్టీస్ చేస్తుండగా నిజంగానే ఉరి బిగుసుకోవడంతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా కున్వర్గావ్ పోలీసుస్టేషన్ పరిధిలోని బాబత్ గ్రామంలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూరేసింగ్ కుమారుడు శివం(10) చదువులో చురుగ్గా ఉంటాడు. ఆటపాటల్లో మేటి. గురువారం తన తోటి పిల్లలతో కలిసి భగత్‌సింగ్ నాటకంలో ఉరివేసే దృశ్యం రిహార్సల్స్‌లో పాల్గొన్నాడు. ఇందులో శివం కథానాయకుడు భగత్‌సింగ్ పాత్ర పోషిస్తున్నాడు. రిహార్సల్స్‌లో భాగంగా శివం తన మెడకు ఉరితాడు తగిలించుకున్నాడు. ఇంతలోనే కాళ్ల కింద ఉన్న పీట జారిపోయింది. శివం మెడకు తాడు బిగుసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే వచ్చి శివంను కిందికి దించారు. తాడును తొలగించారు. అప్పటికే అతడు ఊపిరాడక మృతిచెందాడు. తమకు సమాచారం ఇవ్వకుండానే శివం మృతదేహానికి అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారని పోలీసులు చెప్పారు. -
టీవీ కోసం అక్కతో గొడవ.. క్షణికావేశంలో దారుణం
తిరువనంతపురం: టీవీ చూడడం కోసం అక్కతో గొడవపడిన చెల్లి క్షణికావేశంలో ఇంట్లోని కిటీకీ గ్రిల్స్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇడుక్కికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన అక్క, కజిన్‌తో కలిసి టీవీ చూస్తుంది. తనకు నచ్చిన చానెల్ పెట్టుకుంటానంటూ అక్క దగ్గర్నుంచి రిమోట్ లాక్కొని చానెల్ మార్చింది. దీంతో బాలిక అక్క ఆమె దగ్గర్నుంచి రిమోట్ లాక్కుని మేము పెట్టిందే చూడాలంటూ పేర్కొంది. దీంతో అక్కతో గొడవపడిన చెల్లి బెడ్రూంకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని కిటికీ గ్రిల్స్‌కు తాడు కట్టి ఉరి వేసుకుంది. గదిలోకి వెళ్లిన బాలిక ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానమొచ్చిన ఆమె నానమ్మ బయటికి వెళ్లి చూసింది. అప్పటికే ఆమె కిటికీ గ్రిల్స్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి సదరు బాలికను కిందకు దింపి పరిశీలించగా.. అప్పటికే చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. -
కన్నకూతురుపై తండ్రి దారుణం.. అనుమానాస్పద స్థితిలో మృతి
అగర్తల: త్రిపుర నార్త్ జిల్లాలో ఒక వ్యక్తి తన ఇంటికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రెండు రోజుల క్రితం 17 ఏళ్ల కన్నకూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళవారం సదరు వ్యక్తి తన ఇంటికి కొద్ది దూరంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కాగా వ్యక్తి మృతిపై ప్రాథమిక విచారణ జరుగతుందని.. అది ఆత్మహత్యా.. లేక హత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ భానుపద చక్రవర్తి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ..
-
బ్యాంకులో ఉరివేసుకున్న బ్యాంక్ మేనేజర్
కన్నూర్: కేరళ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా బ్యాంక్ మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోక్కిలంగడి కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కె.స్వప్న(38) శుక్రవారం ఉదయం 9 గంటలకు బ్యాంకు కార్యాలయంలో ఉరి వేసుకొని చనిపోయారు. మరొక మహిళా బ్యాంకు ఉద్యోగి ఉదయం 9 గంటలకు పని నిమిత్తం బ్యాంకు కార్యాలయంలోకి వెళ్లగానే మేనేజర్ ఉరివేసుకుని కనిపించడం చూసి బ్యాంకు అలారం నొక్కారు. వెంటనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, బ్యాంకు సిబ్బంది కలిసి ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం కుతుపరంబా తాలూకా ఆసుపత్రికి తరలించారు. కుతుపరంబా ఎసీపీ కెజి సురేష్, ఎస్ఐ కెటి సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీటివి విజువల్స్ తనిఖీ చేశారు. పోలీసులు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఆమె పని ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో వ్రాయబడింది. స్వప్నను సెప్టెంబర్ 2020లో తోక్కిలంగడి బ్రాంచ్‌లో పోస్ట్ చేశారు. కన్నూర్‌లోని నిర్మలగిరిలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. త్రిసూర్ జిల్లాలోని మన్నూతి స్వప్న స్వస్థలం. చదవండి: విషాదం: పెళ్లయిన నాలుగు నెలలకే.. -
తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య
ముంబై: తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కొడుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తహసిల్ పరిధిలోని వకిల్‌వాడి ప్రాంతంలో నేడు ఉదయం జరిగింది. వకిల్‌వాడి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కుర్రాడు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ కరోనా సమయంలో ఇంట్లో నుంచే ఆన్లైన్ తరగతులు విన్న తర్వాత పడుకొని టెలివిజన్ చూస్తున్నాడు. అతనిని గమనించిన తల్లి టీవీని సరిగ్గా కూర్చొని చూడాలని టీవీని స్విచ్ ఆఫ్ చేసింది. దింతో మనోవేదనకు గురైన అతను అక్కడ నుంచి బాత్రూంకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత ఈ విషయాన్న తల్లి, సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కేజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి -
పాతిపెట్టిన శవాలను తీసి మళ్లీ ఉరేశారు
పడుకున్న శవాన్ని లేపి మరీ చంపేస్తా.. ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది. ఏదో డైలాగు చెప్పడం వరకూ ఓకేగానీ.. నిజంగా అలా చంపుతారా ఎవరైనా? ఎందుకు చంపరు.. చరిత్రను తిరగేస్తే.. చచ్చినోళ్లను మళ్లా చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి.తిరుగుబాట్లు, నమ్మక ద్రోహం, నేరాలకు పాల్పడటం వంటివాటితో పాటు.. చనిపోయినోళ్ల మీద తమ, ప్రతీకారం తీర్చుకోవడం వంటివి అందుకు కారణమయ్యాయి. శవానికి ఉరేశారు.. ఆలివర్ క్రోమ్‌వెల్.. ఇంగ్లండ్ కామన్వెల్త్ దేశాలకు మొట్టమొదటి ప్రజాస్వామ్య పాలకుడు.1658 సెప్టెంబర్ 3న యూరినరీ ఇన్ఫెక్షన్తో చనిపోయాడు. కానీ 1661 జనవరిలో ఆయన శవాన్ని మళ్లీ ఉరితీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అప్పట్లో ఇంగ్లండ్‌ను కింగ్ చార్లెస్ పాలించేవాడు. ఆయన విధానాలు, ఇష్టమొచ్చినట్టుగా పన్నులు వేయడంతో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఆలివర్ నేతృత్వంలో తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. కింగ్ చార్లెస్‌ను ఉరితీశారు. కొంతకాలానికి ఆలివర్ కూడా చనిపోయాడు. తదనంతర పరిణామాల్లో రాజు అనుకూల సైన్యం ఎదురుతిరిగి.. కింగ్ చార్లెస్–2ను రాజును చేసింది. ఈ నేపథ్యంలో మొదటి కింగ్ చార్లెస్‌ను గద్దె దింపి, ఉరేయడానికి కారణమైన వారికి మరణశిక్షలు విధించారు. కారకుల్లో ఒకరైన ఆలివర్ అప్పటికే చనిపోయాడు.. అయినా.. వాళ్ల పగ తీరితేగా.. సమాధి నుంచి ఆయన శవాన్ని తీసి మరీ.. ఉరి వేశారు. అప్పటికీ కోపం తగ్గకపోవడంతో ఆలివర్ తలను నరికి.. 20 అడుగుల ఎత్తైన కర్రకు వేలాడదీశారు. సుమారు 25 ఏళ్లపాటు ఆ తల అలాగే వేలాడింది. చివరికి 1960లో దానిని కేంబ్రిడ్జిలోని ఓ రహస్య స్థలంలో పూడ్చిపెట్టారు. శవపేటికతో సహా.. స్పెయిన్ ఆక్రమణలో ఉన్న నెదర్లాండ్స్ (డచ్) స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. డచ్ పోరాటకారులు, స్పెయిన్ మధ్య 12 ఏళ్ల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ కాల్పుల విరమణ కాలంలో నెదర్లాండ్స్‌లోని యూట్రెచ్ రాష్ట్రాలకు సెక్రటరీగా ఉన్న గిల్లెస్ వాన్ లాడెన్‌బర్గ్.. చేసిన కొన్ని పనులు గొడవలు రేపాయి. దాంతో 1618లో అతడిని అరెస్టు చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటే.. తన ఆస్తులు, ఇతర అంశాలపై విచారణ ఆపేస్తారని లాడెన్‌బర్గ్ భావించి, ఉరేసుకున్నాడు. కానీ పాలకులు అతడిని వదల్లేదు. కుట్రదారుడిగా ప్రకటించి మరణశిక్ష వేశారు. లాడెన్‌బర్గ్ శవాన్ని శవపేటికతో సహా వేలాడదీశారు. ఇవి జస్ట్ ఉదాహరణలే.. పెద్దపెద్ద మతాధికారులకు కూడా చనిపోయిన తర్వాత ఉరేసిన ఘటనలో చరిత్రలో చాలా ఉన్నాయి. -
ఫీజు చెల్లించలేక తనువు చాలించింది
బెలగావి: అసలే కరోనా కాలం. ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కుమార్తె కాలేజీ ఫీజు రూ.40 వేలు చెల్లించే స్థోమత కూడా లేకుండాపోయింది. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లా బిడీ గ్రామంలో చోటుచేసుకుంది. షకీల్ సంగోలి కుమార్తె మెహెక్ (20) ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ కారణంగా షకీల్ ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఫీజు రూ.40 వేలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఇటీవల మెహెక్‌ను ఆదేశించింది. షకీల్ డబ్బు సర్దుబాటు చేయలేకపోయాడు. తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆవేదనకు గురైన మెహెక్ ఇంట్లోనే ఉరి వేసుకుని మృత్యు ఒడికి చేరుకుంది. ఆమె తల్లి గృహిణి. 4, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి(19) ఇటీవల ఫీజు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హెమ్తాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రే సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని స్వగ్రామం బిందాల్‌లో తన ఇంటి సమీపంలోని ఓ దుకాణం పైకప్పునకు ఉరేసుకుని కనిపించారు. అయితే, ఇది ఆత్మహత్య కాదు హత్యేనని దేబేంద్రనాథ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయనను హత్య చేశారని మండిపడుతున్నారు. దేబేంద్రనాథ్ చొక్కా జేబులో సూసైట్ నోట్ దొరికిందని, తన ఆత్మహత్యకు ఇద్దరు వ్యక్తులు కారకులంటూ అందులో ఆయన రాశారని పోలీసులు చెప్పారు. దేబేంద్రనాథ్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా హెమ్తాబాద్ రిజర్వ్డ్ స్థానం నుంచి గెలిచారు. అనంతరం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. దేబేంద్రనాథ్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మృతితో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రగులుకుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గూండారాజ్యం నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కరోనా రోగి ఆత్మహత్య : కానీ అంతలోనే
సాక్షి, పట్నా : కరోనా వైరస్ సోకిన వ్యక్తి (38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగి బీహార్‌లోని ప్రభుత్వ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే ఆవేశం అనర్ధానికి మూలం అన్నట్టుగా.. చనిపోయిన కొద్ది క్షణాలకే అతనికి నిర్వహించిన తాజా పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతని బంధువుల తీరని విషాదంలో మునిగిపోయారు. కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ సంజీవ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం బాధిత వ్యక్తి జూన్ 15 న కరోనా అనుమానిత లక్షణాలతో పట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరాడు. అనంతరం కరోనా పాజిటివ్ రావడంతో అతనిని ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే తనకు వ్యాధి నయం కాదనుకున్నాడో, ఏమో కానీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని డాక్టర్ కుమార్ వెల్లడించారు. బీహార్‌లో కరోనా బారిన పడ్డ రోగి ఆత్మహత్యకు పాల్పడిన మొదటి ఘటన ఇది అని తెలిపారు. కాగా సోమవారం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చిందని చెప్పారు. -
ఊయల మెడకు చుట్టుకుపోవడంతో..
సాక్షి, సత్తుపల్లి : ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారికి ఊయలే ఉరి తాడైంది. పట్టణంలోని ఎన్వీఆర్ కాంప్లెక్స్ రోడ్లో నివాసం ఉంటున్న వలపర్ల రవికుమార్, కవితలకు స్వర్ణిక, సాత్విక ఇద్దరు కుమార్తెలున్నారు. దివ్యాంగుడైన రవికుమార్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బడ్డీకొట్టు, స్వర్ణిక జిరాక్స్‌సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరిది కల్లూరులోని అంబేడ్కర్‌నగర్. గురువారం మధ్యాహ్నం పిల్లలకు భోజనం తినిపించి తల్లిదండ్రులు ఇంట్లో భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో వరండాలో చీరతో కట్టిన ఊయలలో పెద్దకుమార్తె స్వర్ణిక(7) కూర్చొని గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఊయల ఆమె మెడకు చుట్టుకొని బిగుసుకుపోయి తల వేలాడుతుంది. అదే సమయంలో ఆ వీధిలో వెళ్తున్నవారు చిన్నారి వేలాడుతున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులను పిలిచారు. ఊయలలో నుంచి చిన్నారి స్వర్ణికను దింపి చూడగా.. కదలికలు లేకపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి స్వర్ణిక మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండడంతో చూపరులను కంటతడి పెట్టించింది. -
నిర్భయ : న్యాయమే గెలిచింది : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడాలన్న దేశ వ్యాప్త డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. శుక్రవారం ఉదయం 5గంటల 30 నిమిషాలను నలుగురు దోషులను తీహార్ జైలు అధికారులు ఉరి తీశారు. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘చివరికి న్యాయమే గెలిచింది. మన నారీమణులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారికి భద్రతతో పాటు మరింత గౌరవాన్ని పెంచాల్సిన అవసరముంది. అన్ని రంగాల్లో సమానత్వం, అవకాశాల కల్పన ఎంతో ముఖ్యం. మహిళా సాధికారత దిశగా దేశం అడుగులు వేయాలి. దీనికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు నిర్భయ దోషులకు ఉరి అమలుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఆలస్యం అయినప్పటికీ దోషులకు శిక్షం పడటం సంతోషకరమన్నారు. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్నారు. -
నిర్భయ దోషులకు ఉరి
-
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఉరిశిక్షను తప్పించుకునేందుకు చివరి వరకు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేయడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (నిర్భయ దోషులను ఎలా ఉరి తీస్తారో తెలుసా?) (నా కూతురి ఆత్మకు శాంతి లభిస్తుంది!) (‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’) (ఆఖరి ప్రయత్నం విఫలం; ఇక ఉరే) -
ఎట్టకేలకు మరణదండన
ఉరి తాడు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో శుక్రవారం ఉదయం నిర్భయ దోషులు నలుగురికీ మరణదండన అమలు కావడం ఖాయమైంది. మన దేశంలో న్యాయ ప్రక్రియ ఎంత సుదీర్ఘమైనదో, ఉరిశిక్ష పడినవారికి సైతం చట్టపరంగా ఎన్ని రకాల అవకాశాలుంటాయో ఈ కేసు మరోసారి నిరూపించింది. తమ కుమార్తెను అమానుషమైన చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారం జరిపి హతమార్చిన దుండగులకు శిక్ష విధించడంలో ఎంతో జాప్యం చోటుచేసుకుందనుకుంటే... అది అమలు చేయడంలోనూ ఇంత తాత్సారమేమిటని నిర్భయ తల్లి అనేకసార్లు కన్నీరుమున్నీరయ్యారు. వారందరూ ఉరికంబం ఎక్కినరోజునే తమ కుమార్తె ఆత్మ శాంతిస్తుందని ఆమె చెప్పారు. అయితే ఉరిశిక్ష పడిన నేరస్తులకు అన్ని రకాల అవకాశాలూ ముగిశాకనే శిక్ష విధించడం మనకున్న చట్టాల ప్రకారం తప్పనిసరి. వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడరాదన్నదే ఈ న్యాయ సిద్ధాంతంలోనిఅంతరార్థం. ఒకసారి ఉరిశిక్ష అమలయ్యాక దోషులుగా తేలినవారు ఏ కారణం చేతనో నిర్దోషులని తేలినా... వారి అభ్యర్థనల్ని పరిశీలించడంలో సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయని తేలినా తప్పు సరిదిద్దుకోవడం అసాధ్యం కనుకనే ఇన్ని జాగ్రత్తలు. ఇందిరాగాంధీ హత్య కేసు, పార్లమెంటు దాడి కేసు, ముంబైపై ఉగ్రవాద దాడిలో పట్టుబడిన కసబ్ విషయంలోనూ ఉరిశిక్ష విధించడానికీ, దాన్ని అమలు చేయడానికీ మధ్య ఎంతో వ్యవధి ఉంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు ఆవేదన ఉంటుందన్నది నిజమే. తమవారికి ఏం జరిగిందో, దోషులకు కూడా తక్షణం అదే జరగాలని వారు పట్టుదలగా వుంటారు. నిర్భయ దోషుల విషయానికే వస్తే వారు అనుసరించిన విధానాలు, శిక్ష తప్పించుకునేందుకు వారు చూపిన సాకులు నిర్భయ కుటుంబీకులకు మాత్రమే కాదు... దేశ ప్రజలందరికీ ఆగ్రహం కలిగించాయి. ఇలా ఇంకెన్నాళ్లు కాలక్షేపం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తాయి. నిర్భయ కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడంతోపాటు అత్యాచారం, ఇతర లైంగిక నేరాల్లో విధించాల్సిన శిక్షల గురించి, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా నియమించింది. జస్టిస్ వర్మ కమిటీ రికార్డు స్థాయిలో కేవలం 29 రోజుల్లోనే తన సిఫార్సులు అందించగా... ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలి రెండు నెలల్లోనే అత్యాచార నేరానికి మరణ దండన విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే నిర్భయ కేసు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చాలా త్వరగానే పూర్తయిందని చెప్పాలి. 2012 డిసెంబర్ 16న ఆ ఉదంతం జరగ్గా, నలుగురు దోషులకు 2013 సెప్టెంబర్‌లో మరణశిక్ష విధించింది. ఈ విచారణ కొనసాగుతుండగానే దుండగుల్లో ఒకడు ఆత్మహత్య చేసుకోగా, మరో దుండగుడి వయస్సు 16 ఏళ్లలోపు కావడం వల్ల అతడిపై జువెనైల్ కోర్టులో విచారణ జరిగి మూడేళ్ల శిక్ష పడింది. నలుగురు దోషులకూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఆ మరుసటి ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించింది. నిందితులు అప్పీల్ చేసుకోగా 2017 మే నెలలో ఈ నేరగాళ్లకు ఉరిశిక్ష సరైందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అప్పటినుంచి రివ్యూ పిటిషన్లు మొదలయ్యాయి. నేరగాళ్లలో ఒకరి తర్వాత ఒకరు... ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు పిటిషన్లు దాఖలు చేయడం, వాటిని తిరస్కరించడం, రాష్ట్రపతికి క్షమాభిక్ష వినతులు, వాటిని తోసిపుచ్చాక దాన్ని సవాలు చేస్తూ తిరిగి ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేయడం కొనసాగాయి. నేరం జరిగిన సమయానికి తాను జువెనైల్నని నేరగాడు పవన్ కుమార్ గుప్తా కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తమను ఏకాంతవాస ఖైదు చేశారని, చిత్రహింసలకు గురిచేశారని, తమను ఉరి తీయాలంటూ కేంద్రమంత్రులు తదితరులు ప్రకటనలివ్వడం వల్ల ఆ ప్రభావం న్యాయస్థానాలపై పడిందని నేరగాళ్లు ఆరోపించారు. ఒక దోషి భార్య తాను వితంతువుగా బతకలేను గనుక అతగాడినుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ సాకుతో శిక్ష అమలును జాప్యం చేయొచ్చునన్నది వారి ఎత్తుగడ. ఈలోగా ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ కావడం, అవి వాయిదా పడటం రివాజైంది. ఈ కేసులో నేరగాళ్ల దుర్మార్గం సమాజం మొత్తాన్ని కలచివేసింది. కనుకనే ఈ ఉదంతంపై అంతగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వారికి సత్వరం ఉరిశిక్ష పడాలని అందరూ కోరుకున్నారు. ఈమధ్య కాలంలో అలాంటి నేరగాళ్లను ఎన్కౌంటర్ చేయాలన్న ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఏదైనా చట్టప్రకారమే జరగాలన్న విధానం నేరగాళ్లు శిక్ష పడకుండా తప్పించుకోవడానికి తోడ్పడుతున్నదన్న అసంతృప్తే ఇందుకు కారణం. నేరానికీ, శిక్షకూ మధ్య ఉండే ఈ అపరిమిత జాప్యాన్ని ప్రభుత్వాలు అధిగమించగలిగితే నేరం చేయాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. అదే సమయంలో పౌరుల్లో ఉండే అసంతృప్తి సమసిపోతుంది. నేర నివారణకు చర్యలు తీసుకుంటూనే, అవి జరిగినప్పుడు తక్షణం స్పందించి పకడ్బందీ దర్యాప్తు, విచారణ పూర్తికావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. లైంగిక నేరాల కేసుల్లో దుండగులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించడానికి వీలుగా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు దిశ యాప్‌ను రూపొందించి విడుదల చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. నేరాలకు ఆస్కారంలేని పరిస్థితులు కల్పించడం, నేరం చేసినవారికి వెనువెంటనే శిక్ష తప్పదన్న అవగాహన కలిగించడం కీలకం. అప్పుడు మాత్రమే ఏ సమాజమైనా భద్రంగా మనుగడ సాగించగలుగుతుంది. -
నిర్భయ దోషులను ఎలా ఉరి తీస్తారో తెలుసా?
దేశాన్ని కుదిపేసి దిగ్ర్భాంతికి గురిచేసిన నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లవుతుంది. నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖాయమైంది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరి తీయాలంటూ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నిర్భయ దోషులను ఎవరు ఉరి తీస్తారు? ఆ తలారి ఎవరు అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో తలారి పవన్ అభిప్రాయాలు తెలుసుకుందాం. (నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’) రిపోర్టర్ : ఈయనే పవన్‌కుమార్. ధన్యవాదాలండీ. తలారి : ధన్యవాదాలండీ. మీరు ఈ అవకాశం కల్పించినందుకు సంతోషం. రి : ఉరిశిక్ష అమలు కోసం పిలిస్తే తీహార్‌జైలుకు వెళ్తారా? త : హా తప్పనిసరిగా వెళ్తాను. రి : తీహార్జైలు లేదా దేశంలోని ఇతర జైళ్లతో ఉరిశిక్ష అమలుకోసం ఒక సీజన్ ఉంటుందని తెలుస్తోంది. జైలు మ్యానువల్ ప్రకారం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణంగా ఉరిశిక్షలు అమలు చేస్తారని విన్నాం. ఉదయం 8 గంటలకు చేస్తారంట. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? నలుగురిని ఒకేసారి ఉరితీస్తారా? లేక ఇద్దరిద్దరి చొప్పున ఉరితీస్తారా? వేరువేరుగా చేస్తారా? వివరాలు చెప్పండి. త : వీలైతే నలుగురిని లేదా ఇద్దరిద్దరి చొప్పున చేస్తాం. తక్తార్ పెద్దదైతే, సరిపోతే ఒకేసారి చేస్తాం. రి : నలుగురిని ఒకేసారి ఉరితీస్తారా? త : తీహార్‌లో ఉరితీసే ప్రదేశంలో ఫ్లాటుని బట్టి ఉంటుంది. గ్యాప్ పెద్దదిగా ఉంటే ఒకేసారి నలుగురిని ఉరితీస్తాం. రి : తీహర్ జైలులోని ఉరికంబం పొడవు, వెడల్పు పది అడుగులు ఉంటుందని విన్నాం. నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి, నలుగురు నిలబడడానికి అది సరిపోతుందా? త : హా సరిపోతుంది. వీలుంటుందో లేదో చూసి చెప్పాలి. రి : ఉరికోసం తాడు కట్టడానికి సమయం పడుతుందా. లేక ముందే కడతారా? త : ఉదయం 3 గంటలకే అక్కడికి వెళ్తాం. తాళ్లు కట్టడానికి గంట సమయం పడుతుంది. ముందురోజే ఆ ట్రయల్ చేస్తాం. అన్ని సరిగా ఉన్నాయో లేదో తాడు బరువు తూగుతుందో లేదో దోషులు బలంగా ఉన్నారా? ఎన్ని ఇంచులు ఉంటుంది? ఒకేసారి చేయగలమా లేదా అని పరిశీలిస్తాం. దీన్ని బట్టి అధికారులకు చెప్తాం. రి : ఉరికోసం నాలుగు తాడ్లు, గ్రేటర్ ఎప్పుడు తీసుకెళ్తారు? ముందురోజు రాత్రా లేక అదే రోజు ప్రొద్దున్నా? త : పొద్దున్నే. ముందురోజు ట్రయల్ పూర్తయ్యాక అప్పుడు తీసుకెళ్తాం. రి : ఉరితీసే వారిని తీసుకొచ్చే సమయానికి తాళ్లు గ్రేటర్‌కు వేలాడుతూ ఉంటాయా? లేకుంటే వారొచ్చాక సమయానికి తాళ్లు కడతారా? త : లేదు. వాటిని ఒక పక్కకు ఉంచుతారు. గ్రేటర్‌కు కట్టి ఉంచుతారు. ఉరితీసే వాళ్ల కాళ్లు కట్టేస్తాం. ముసుగు వేస్తాం. లెవల్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎప్పుడైతే జైలర్ సైగ చేస్తారో అప్పుడు లీవర్ను లాగుతాను. రి : ఉరి అమలుచేసే గదిలో పది నుంచి పన్నెండు మంది ఉంటారు. దోషుల్ని అక్కడికి తీసుకొచ్చాక ఎవరూ మాట్లాడరు. అందరూ మౌనంగా ఉంటారు. ఎందుకని? త : ఎందుకంటే ఎవరూ డిస్ర్టబ్ కాకూడదు కదా. మర్చిపోకూడదు కదా. అందుకే మౌనంగా ఉంటాం. కేవలం సైగల ద్వారా ఆదేశాలిస్తారు. సైగల ద్వారా అన్నీ ఒకేసారి జరుగుతాయి. రి : జైలర్ మీకు ఉరి అమలుచేసేందుకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు? త : అంటే నేను వారిని కాళ్లను కట్టేసి ఫ్లేటు మీదకు తీసుకొచ్చాక వాళ్లకు ముసుగు వేసి తాళ్లు రెడీ చేసుకొని అంతా సిద్ధం అన్నట్లుగా సైగ చేస్తాను. అప్పడు జైలర్ నాకు ఆదేశాలిస్తారు. రి : జైలర్ చేతిలో రుమాలు పట్టుకొని ఉంటారా? త : అవును అవును. రి : జైలర్ రుమాలుతో సిగ్నల్ ఎలా ఇస్తారు? త : కరెక్టుగా టైం చూస్తూ జైలర్ తన చేతిలోని రుమాలు చూపిస్తూ ఇలా సైగ చేస్తారు. ( రుమాలును విదిలిస్తారు) అప్పుడు వెంటనే నేను లీవర్ లాగేస్తాను. రి : జైలర్ రుమాలుతో సిగ్నలిచ్చి మీరు లీవర్ లాగగనే ఏమవుతుంది? త : వాళ్లు తాళ్లకు వేలాడుతారు. అంటే నలుగురు కాళ్ల కింద ప్లేటు పడిపోతుంది. వారు కింద గోతిలోకి జారిపోతారు. రి : కాళ్లు కట్టేస్తారు. మరి చేతులు? త : చేతులకి సంకెళ్లు ఉంటాయి. వెనక్కి కట్టేస్తాం. రి :ఎంతసేపు వారు ఉరితాడుకు గిలగిలలాడుతారు? త : 10-15 నిమిషాలు. ఆ తర్వాత చల్లబడిపోతారు. అర్థగంట తర్వాత వైద్యులు వాళ్ల గుండెను పరీక్షిస్తారు. సిపాయిలు మృతదేహాలను తక్టా నుంచి కిందకి దించుతారు. రి : అంటే ఉరితీయడానికి ముందే తలారే తాళ్లు కడతాడు. ఆ తర్వాత చనిపోయిన వారి మెడ నుంచి తాళ్లు కూడా తలారే విప్పుతారు. ఈ రెండూ మీరే చేస్తారు. అంతేనా? త : అవును. రి : ఆ తర్వాత ఏం జరుగుతుంది? త : మా రానుపోను ఖర్చులు వగైరా ఇస్తారు. ఇంటికి వెళ్లిపోతాం. రి : ఆ సమయంలో మీ మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి? పదినిమిషాల ముందువరకు మీ ముందు జీవంతో ఉన్న మనిషి . .మీరు కట్టిన తాళ్లకు వేలాడి ప్రాణాలు వదులుతాడు. డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తారు. ఈ సమయంలో మీలో ఎలాంటి భావనలు కలుగుతాయి?త: ఏమీ ఉండదు. మీడియా వాళ్లు అడుగుతారు. వాళ్లకు సమాధానాలు చెప్తాను. రి :అవన్నీ అయిపోయాక మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఇదంతా చూశానన్న ఆలోచనలు ఎప్పుడైనా వస్తాయా? మీకు ఎలా అనిపిస్తుంది? త : ఎప్పుడూ లేదు. నేనేం నేరం చేశాను? నాకెలాంటి పశ్చాత్తాపం ఉండదు. నిర్భయ లాంటి వాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 8ఏళ్ల బాలికలను రేప్ చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు ఉరిశిక్ష పడాల్సిందే. రి : ఉరితీసేటప్పడు కాళ్లు,చేతులు కట్టేస్తారు. ముఖానికి ముసుగు వేస్తారు. కానీ నోటికి ఏదీ అడ్డు పెట్టరు. కాబట్టి అతను అరవడం, కేకలు వేయడం వంటివేమైనా చేస్తాడా? త : లేదు. మృత్యువు ఖాయం అని తెలిశాక అరిచేం లాభం? రి : మరణమంటే ఎవరికైనా భయమే కదా? ఉరి అములుచేసే సమయంలో ఆ భయంతో ఎవరైనా వణికిపోవడం, గాబరాపడటం చూశారా? త : అలహాబాద్‌లో ఒకసారి ఇలానే జరిగింది. ఉరికంబం మీదకు వెళ్లడానికి ఒకతను నిరాకరించాడు. మొరాయించాడు. అప్పుడు పోలీసులకు చెప్పాను. వాళ్లు బలవంతంగా పట్టుకొచ్చారు. అప్పుడు ముసుగు వేశాను. జైలర్ సైగ చేశారు. అంతే.. రి : మీరు ఉరి అమలవుతున్న సమయంలో శిక్షకు గురవుతున్న వారిలో భయాందోళన, ఉద్వోగం వంటివి గమనించారా? త : హ. చూశాను. రి : ఆఖరి క్షణాల్లో ఉన్నవారిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి? త : నాకేమీ అనిపించదు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను రి :మీ ఇంట్లో వాళ్లు ఏమంటారు? వాళ్లని ఇలా ఉరితీశాను. అలా చేశానంటూ అక్కడి విషయాలు మీ ఇంట్లో వాళ్లకి చెప్తారా? త : హా లేదు. ఆ వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్తే మీరు భయపడ్తారు అని వారికి చెప్తాను. తర్వాత వాళ్లకి చెప్పినా ఏమీ అనిపించదు. నిర్భయకాండ జరిపిన వాళ్లకు ఇలానే జరగాలి అని వాళ్లంటారు. రి : ఈ పనికి డబ్బులు తీసుకొని మీరు ఇంటికి వెళ్తారు. ఎవరో ప్రాణాలు తీసి డబ్బులు సంపాదించాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలుగుతుందా? త : లేదు. లేదు. న్యాయం అమలుకోసం ఇదంతా చేస్తాం. న్యాయం అమలు చేయడానికి ఇచ్చిన డబ్బులవి. ఈపని వల్ల 125 కోట్ల మంది భారతీయులకు న్యాయం చేస్తున్నానన్న తృప్తి ఉంటుంది. అందుకు నాకు ఎలాంటి దుఃఖం ఉండదు. ఇలాంటి నేరస్తులకు ఉరిశిక్ష పడాల్సిందే. రి : సినిమాల్లో చూపించినట్లు చివరి ఘడియల్లో వాళ్లకు చెవిలో చెప్పడం లాంటివి ఉంటుందా? త : అలాంటిదేమీ ఉండదు. రి : మీరు ఉరితీసే వాళ్లను ఎప్పుడు చూస్తారు? త : తక్టా పైన మాత్రమే వాళ్లను చూస్తాను. రి : ఉరిశిక్ష అమలుచేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన తాడును బక్సర్ జైలు నుంచి తెస్తారు. దాన్ని మలీనా రోప్ అంటారు. దానికి వెన్నపూసి ఎక్కడా చిక్కు ముడులు లేకుండా చూస్తారని, క్యారమ్బోర్డు మీద వేసే పౌడర్‌ను దానికి రాస్తారని విన్నాం. ఇదంతా నిజమేనా? త : హా. అలానే ఉంటుంది. రి : ఒకసారి తీహార్ జైలులో ఉరి సందర్భంగా మెడ కట్ అయి రక్తం వచ్చిందంటా? త : లేదు లేదు. అలా కాదు. చేతకాని వాళ్లు చేస్తేనే అలా అవుతుంది. ఇదే కదా మా వృత్తి. రి :నిర్భయ దోషుల కోసం ఎన్నిరోజులు జైళ్లో ఉంటారు? అప్పుడు మీరేం చేస్తారు? త : రెండు రోజులు. ఒకరోజు ట్రయల్ అంతే. ఎలా చేయాలి? ఏంటి? తాడు ఎలా కట్టాలి అన్నది ఆలోచిస్తాం. అధికారులతో సమావేశం అవుతాం. జైలు అధికారులు ఎలా చెప్తే అలా. రి :సినిమాల్లో తలారులు నల్లటి దుస్తులు వేసుకొని పొడవాటి గడ్డం, జుట్టుతో గంభీరంగా, ఒకింత భయానకంగా కనిపిస్తారు. మీరూ అలాంటి దుస్తులే వేసుకుంటారా? లేక మాములు దుస్తుల్లో వెళ్తారా? త : అదంతా సినిమాల్లోనే చూపిస్తారు. మేము మామాలుగానే వెళ్తాం. రి : నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం మీకు లభించింది. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? త : ఏమీ లేదు. నిర్భయ తల్లిదండ్రులకు శాంతి కలగాలి. 125 కోట్ల ప్రజలకు శాంతి కలగాలి. అదే కోరుకుంటున్నా. అంతే. -
ఉరి మళ్లీ వాయిదా
-
పాక్‌లో రేపిస్టులకు బహిరంగ ఉరి !
ఇస్లామాబాద్: పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం ఆమోదించింది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ ఖాన్ చెప్పారు. హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు. ఈ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది. అయితే దీనిపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మాత్రం పెదవి విరిచింది. ఈ చర్య ఐక్యరాజ్యసమితి నియమనిబంధనలను ఉల్లంఘించడమేనని చెప్పింది. ఈ చర్య నేరాలను తగ్గించదని చెప్పింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వంలోని సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ చౌధరి, మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారిలు ఖండించారు. -
నిర్భయ దోషుల ఉరిశిక్ష పై నేడు హైకోర్టు ఆదేశం
-
వంశంలో చివరి తలారి
తీహార్ జైల్లో ఈ సోమవారం ఉదయం నిశ్శబ్దంగా నాలుగు ఉరితీతలు జరిగిపోయాయి! డమ్మీ ఉరితీతలవి. వాటిని తీసిన తలారి పవన్ కుమార్. ఫిబ్రవరి 1న నలుగురు ‘నిర్భయ దోషుల్ని ఉరి తీయబోతున్నది అతడే. జనవరి 7న దోషులకు తొలిసారి డెత్ వారంట్ జారీ అయిన వెంటనే ఆయన తన స్వస్థలం అయిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి ఉరి సరంజామాతో పాటు ఢిల్లీ వచ్చేసి, అప్పట్నుంచీ తీహార్ జైల్లో ఉంటున్నాడు. పవన్‌కి ఉరితీసిన అనుభవం లేదు! ఆ వంశంలో మిగిలిన చిట్టచివరి తలారి కూడా అతడే. పవన్ కుమార్ కనీసం ఒక ఉరినైనా తీయడం కోసం ఏడేళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నాడు. పవన్ తండ్రి మమ్మూసింగ్ చనిపోయే వరకు ఉత్తరప్రదేశ్ అధికారిక తలారిగా ఉండేవారు. ఆయన చనిపోయిన రెండేళ్లకు యు.పి. డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ ఆ హోదాను పవన్‌కి ఇచ్చింది. ఉరితీసే అవకాశాన్ని వృత్తిపరమైన మహద్భాగ్యంగా భావిస్తాడు పవన్. ఆ భాగ్యం అతడి జీవితంలో తొలిసారిగా 2014 కలగబోయి, ఆఖరి నిమిషంలో చేజారిపోయింది! ‘నిఠారి హత్యల’ నేరస్తుడు సురీందర్ కోలి ఉరి వాయిదా పడటంతో పవన్ చేతుల్లోంచి తప్పించుకున్నాడు. పవన్ తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు. ‘‘ఏడు రోజులుగా ఏర్పాట్లన్నీ చేసుకుని కూర్చున్నాను. ప్ఛ్.. తప్పించుకున్నాడు’’ అని బాధపడ్డాడు. అంతకన్నా అతడిని కలతకు గురిచేసిన విషయం.. తన కుటుంబంలోని పూర్వీకులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అది కుదర్లేదు. పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ బ్రిటిష్ పాలనలో వృత్తిరీత్యా అనేక మంది స్వాతంత్య్ర సమరయోధుల్ని ఉరితియ్యవలసి వచ్చింది. ఆ బాధ ఈ తలారుల వంశంలో అలా ఉండిపోయింది. పవన్ తాత కల్లూ, పవన్ తండ్రి మమ్మూ కూడా ఎవర్నైనా ఉరితీసిన ప్రతిసారీ బ్రిటిష్ కాలంలో తమ కుటుంబానికి అంటిన రక్తపు మరకల్ని కొంత కడిగేసుకున్నట్లుగా ఉపశమనం పొందేవారు. పవన్‌కే ఆ ఉపశమనం ఇప్పటికీ లభించలేదు.పవన్ తండ్రి మమ్మూ 26/11 దాడుల దోషి అజ్మల్ కసబ్‌ను, పార్లమెంటుపై దాడి జరిగిన కేసులో అఫ్జల్ గురును ఉరితీసి పాపాన్ని పూర్తిగా కడిగేసుకోవాలని ఆశపడ్డాడు కానీ, వారిని ఉరితీయడానికి ముందే 2011 మేలో ఆయన చనిపోయాడు. కసబ్‌ను 2012లో, అఫ్జల్ గురును 2013లో ఉరితీశారు. అప్పటికి తండ్రి ‘పోస్టు’ తనయుడికి రాలేదు కాబట్టి పవన్‌కి వారిని ఉరితీసే అవకాశం రాలేదు. 2014లో సురీందర్ కోలి మిస్ అయ్యాడు. 2015లో యాకూబ్ మెమన్ (’93 ముంబై పేలుళ్ల కేసు) ఉరితీత కూడా పవన్ వరకూ రాలేదు. రహస్యంగా ఒక జైలు కానిస్టేబుల్ చేత అతడిని ఉరితీయించారు. ఇప్పుడైనా నిర్భయ దోషుల్ని ఉరితియ్యడానికి పవన్నే ఢిల్లీ ప్రభుత్వం పిలిపించడానికి కారణం ఉంది. ప్రస్తుతం దేశంలో తలారులెవరూ లేరు. ఉత్తరప్రదేశ్‌లో పవన్ కాకుండా, అహ్మదుల్లా అనే తలారి ఒకరు లక్నోలో ఉన్నారు. అయితే వయసు మీద పడి, తీవ్రమైన అనారోగ్యంతో నేడో, రేపో అన్నట్లు ఉన్నారాయన. మైనర్ కాకుండా ఉండి, ఐదు అడుగుల, నాలుగు అంగుళాల ఎత్తు ఉన్నవారెవరైనా తలారిగా ఉండేందుకు అర్హులు. పవన్‌కి 54 ఏళ్లు. ‘‘ఇలాంటి వాళ్లను ఉరి తీయాల్సిందే. వదిలిపెడితే బయటికి వచ్చి మళ్లీ ఇలాంటివే చేస్తారు. వీళ్లను వదిలేశారు కదా అని మిగతావాళ్లూ బరితెగిస్తారు’’ అంటాడు పవన్.. నిర్భయ దోషుల గురించి. మీరట్‌లోని లోహియానగర్‌లో కాన్షీరామ్ అవాజ్ యోజన పథకం కింద కట్టిన గూళ్లలో ఒక గూటిలో ఉంటుంది పవన్ కుటుంబం. ఏడుగురు పిల్లలు. ఒక తోపుడు బండిలో బట్టలు పెట్టుకుని వీధుల్లో అమ్ముతుంటాడు పవన్. ‘‘నా పిల్లల్ని మాత్రం ఈ వృత్తిలోకి రానివ్వను. నాతోనే ఇది ఆఖరు అవ్వాలి’’ అంటాడు. అతడి తండ్రి మమ్మూ 47 ఏళ్ల పాటు ప్రభుత్వ తలారిగా పని చేశాడు. ఆ ఇంటికి వచ్చిందేమీ లేదు. ప్రభుత్వం ఇప్పటికీ ఇస్తున్న రూ.3,000 ఉపకారవేతనం తప్ప. పూర్వపు తలారులు జనార్ధన్ పిళ్లై 1940లలో ట్రావన్కూర్ (ఇప్పటి కేరళ ప్రాంతం) రాజుగారి ఆస్థానంలో తలారి. పిళ్లై జీవితం మీద శశి వారియర్ ‘ది లాస్ట్ హ్యాంగ్మేన్’ అనే పుస్తకం రాశారు. పిళ్లై భావోద్వేగాలు లేని మనిషి. ఇలా ఉరి తీసి, అలా మిగతా పనుల్లో పడిపోయేవాడు. అతడి వృత్తి ధర్మమే అయినప్పటికీ.. నాటి సమాజం ఆయన్ని వెలివేసింది. మొత్తం 117 మందిని ఉరి తీశాడు పిళ్లై. నాటా మల్లిక్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తలారి. పద్నాలుగేళ్ల స్కూలు విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ధనుంజయ్ ఛటర్జీని కోల్‌కతాలోని అలీపూర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో ఉరితీసింది ఇతడే. 2009లో చనిపోయాడు. ఉరితీసే ముందు బాగా తాగేవాడు. మనసు ‘అయ్యో పాపం’ అనుకుని లివర్‌ను సరిగా లాగలేదేమోనన్న భయంతో తాగేవాడట. ఉరితీసినందుకు అతడికి 150 రూపాయల నగదు, ఓల్డ్ మంక్ రమ్ము సీసా ఇచ్చేవారు. ఉరితీసిన వెంటనే సీసాలోంచి కొద్దిగా రమ్మును చేతుల్లోకి తీసుకుని ఉరి కొయ్యపై చల్లేవాడు. అలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని అతడు నమ్మేవాడు. ఈ విషయాలన్నీ సునీల్ గుప్త అనే రచయిత ‘బ్లాక్ వారెంట్’ పుస్తకంలో రాశారు. మల్లిక్ తన జీవితకాలంలో మొత్తం 25 మందిని ఉరితీశాడు. కల్లూ, ఫకీరా కల్లూ.. పవన్ తాత. ఫకీరా వేరే ఇంకొక తలారి. ఒకరు అందుబాటులో లేకుంటే ఇంకొకర్ని పిలిపించేవారు. కల్లూ మీరట్ జైల్లో, ఫకీరా ఫరీద్కోట్ (పంజాబ్) జైల్లో పనిచేసేవారు. ఇందిరాగాంధీ హత్యకేసులో దోషులైన సత్వంత్ సింగ్, కేహార్సింగ్లను ఉరితీసింది వీళ్లే. వీళ్లిద్దరూ ఎంతమందిని ఉరి తీశారన్న దానిపై కచ్చితమైన వివరాల్లేవు. మమ్మూసింగ్ మమ్మూసింగ్.. పవన్ తండ్రి. మమ్మూకి తన తండ్రి కల్లూ నుంచి ఈ విద్య అబ్బింది. ‘‘మా వాడు మంచి తలారి. అతడి సేవల్ని వినియోగించుకోండి’’ అని తీహార్, ఇంకా వేరే వేరే జైళ్ల అధికారులకు ఉత్తరాలు రాస్తుండేవాడు కల్లూ. అయితే మమ్మూ ప్రభుత్వ తలారి కాకపోవడంతో ఒక్కసారి కూడా తీహార్ జైల్లో ఉరితీసే అవకాశం రాలేదు. మీరట్ జైల్లో వచ్చింది. తన కెరీర్ మొత్తంలో 15 మందిని ఉరి తీశాడు మమ్మూ. -
ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని పటియాల కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలలోపు నలుగురు దోషులు వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లకు మరణశిక్ష విధించనున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను చివరిసారిగా చూసుకునే అవకాశం దోషులకు కల్పించాలనేది అనవాయితీ. అయితే మీ చివరి కోరిక ఏంటని జైలు అధికారులు దోషులను ప్రశ్నించినప్పడు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గర పడుతుండటంతో దోషుల తల్లిదండ్రులుకు జైలు అధికారులు ఓ వర్తమానం పంపారు. ‘నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరితీస్తున్నాం. ఈలోపు మీ పిల్లల్ని చివరి సారిగా చూసుకోవడానికి ఉరితీసే సమయంలో లోపు జైలుకు రావచ్చు’ అని సమాచారం ఇచ్చారు. (చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు) కాగా ఉరిశిక్ష అమలుకు అధికారులు జైలు నెం3లో ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇసుక బస్తాలతో ట్రైల్స్ కూడా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ జల్లద్ నలుగురు దోషులను ఉరితీయనున్నారు. కాగా అనేక ఉత్కంఠ పరిణామాలు, రివ్యూ పిటిషన్ల కొట్టివేత అనంతరం వారి ఉరికి రంగం సిద్ధమైంది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు దోషులు చేయని ప్రయత్నలు లేవు. చివరికి సుప్రీంకోర్టు కూడా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
దేవుడే అడిగినా
‘‘పాపం ఆ పిల్లలకు మీరైనా క్షమాభిక్ష ప్రసాదించవచ్చు కదా’’ అని నిర్భయ తల్లి ఆశాదేవిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అడిగినప్పుడు.. ‘‘దేవుడే వచ్చి అడిగినా నేను క్షమించను’’ అని ఆశాదేవి అన్నారంటే.. దేవుడిక్కూడా వాళ్లను క్షమించమని సిఫారసు చేసే హక్కు లేదని ఆమె గట్టిగా చెప్పడమే. మాధవ్ శింగరాజు ఉరిశిక్ష పడిన ‘నిర్భయ’ దోషులు చరిత్రలో కలిసిపోడానికి మెడ దగ్గరి ఎముక ‘టప్’మన్నంత క్షణకాల సమయం చాలు. ఆ క్షణం తర్వాత ఎవరైనా మాట్లాడేందుకేమీ ఉండదు. ఎవరికీ గుర్తొచ్చేందుకూ ఏమీ ఉండదు. ‘ముఖేశ్ సింగ్ అండ్ కో’ ఏమీ భగత్‌సింగ్ అండ్ టీమ్ కాదు.. మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరితీసిందని ఏటా చెప్పుకుని ఘనమైన నివాళి ఘటించడానికి. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ‘నిర్భయ’ దోషులకు ఉరి అంటున్నారు కాబట్టి.. ఆ రోజు మనం నిద్రలేచి ఏ ఏడుగంటలకో పేపర్లోనో, టీవీలోనో వార్తను చూసి.. ‘ఉరి తీసేశారా..’ అనుకుంటాం తప్ప, షాక్ కొట్టినట్లుగా ‘అయ్యో ఉరి తీసేశారా!’ అని పెద్దగా అరుస్తూ చేతిలోని టీ కప్పును మీద ఒలకబోసుకోం. వాళ్లేమీ స్వాతంత్య్ర సంగ్రామ యువ కిశోరాలు కాదు. వాళ్లను ఉరితీశారన్న వార్తను చూసి మనం కోమాలోకి వెళ్లిపోడానికి. మన సంగతి అలా ఉంచండి. నిర్భయ తల్లి ఆశాదేవి మాత్రం ఈసారి కోమాలోకి వెళ్లిపోయేట్లే ఉన్నారు. వాళ్ల ఉరి తేదీ ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ కనుక వాయిదా పడితే! శుక్రవారం ఆమెది దాదాపుగా అదే పరిస్థితి. ఢిల్లీ కోర్టు ఉరిని వాయిదా వేసిందని తెలియగానే నిస్పృహ ఆమె కళ్లలోంచి ఉబికి ఉబికి వచ్చింది. ‘హమే బస్ తారీఖ్ పే తారీఖ్ మిల్ రహీ హై’ (తేదీ తర్వాత తేదీ మాత్రమే మాకు లభిస్తోంది) అని ఆక్రోశించారు. ‘‘నా కూతుర్ని పాడు చేసినట్లే, ఆ నలుగురూ న్యాయదేవతనూ పాడు చేస్తున్నారు’’ అని వేదన పడ్డారు. ప్రతిసారీ ఆమెకు ఇలాగే అవుతోంది. కోర్టు శిక్షను విధించినప్పుడు తన కూతురికి న్యాయం జరిగిందని కళ్లు తుడుచుకోవడం, శిక్ష అమలు వాయిదా పడగానే తన కూతురికి అసలు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా అని కన్నీళ్లు పెట్టుకోవడం! నవ్విస్తే అంతలోనే నవ్వి, ఏడిపిస్తే అంతలోనే ఏడ్చే పిల్లలా తయారైంది ఆమె మానసిక స్థితి. జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిని ఖరారు చేస్తూ ఈ నెల 7న కోర్టు డెత్ వారంట్ జారీ చెయ్యగానే తన ఏడేళ్ల పోరాటం ఫలించిందనే నిర్భయ తల్లి అనుకున్నారు. ఆ లోపలే ఉరి ఫిబ్రవరి అనే మాట! ఉరికి తీహార్‌లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తలారి కూడా తాళ్లు పేనుకుని కూర్చున్నాడు. దోషుల బరువుకన్నా యాభై కిలోలు ఎక్కువ బరువున్న ఇసుక బస్తాలను ‘ఉరి తీసి’ పరీక్షించుకున్నారు. కుటుంబ సభ్యులొచ్చి చివరి చూపు చూసి వెళ్తున్నారు. ఇక అంతా అయిపోయినట్లే.. మిగిలింది అంతిమశ్వాసే అనుకుంటుండగా.. మరోసారి ఉరి వాయిదా. ఇంత సాగతీత ఏమిటని నిర్భయ తల్లి హృదయం క్షోభించడం న్యాయమే. అయితే చట్టం తీసుకుంటున్న సమయం కూడా ఆ తల్లికి న్యాయం చేయడానికే. మూడేళ్ల క్రితమే 2017 మే 5 న సుప్రీంకోర్టు.. ‘ఉరే సరి’ అని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అదే సమయంలో ఉరిని తప్పించుకునేందుకు దోషులకు చట్టంలో ఉన్న మూడు దారులను కూడా చూపించింది. మొదటిది రివ్యూ పిటిషన్. అది ఫలించకపోతే క్యురేటివ్ పిటిషన్. అదీ నిష్ఫలం అయితే క్షమాభిక్ష పిటిషన్. మొదటి రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసేవి. క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతికి సమర్పించుకునేది. దోషులు నలుగురూ ఒకేసారి ఒక దాని తర్వాత ఒకటిగా ఈ మూడు దారుల్లోనూ వెళ్లిపోయి, అక్కడ కూడా వాళ్లకేమీ దక్కకపోయుంటే ఈ సరికి బహుశా ఉరి అమలు జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. మొదట ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా ఏమాత్రం జాప్యం లేకుండా రివ్యూ పిటిషన్లు వేశారు. వేసిన ఏడాది తర్వాత 2018 జూలై 9న సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. అక్షయ్ ఠాకూర్ ఒక్కడూ 2019 డిసెంబర్ 10న రివ్యూ పిటిషన్ వేశాడు! నిజానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నెలలోపే రివ్యూ పిటిషన్ వెయ్యాలి. అయితే బలమైన కారణాలేవో చూపించి అక్షయ్ తరఫు న్యాయవాదులు ఆలస్యంగా రివ్యూ పిటిషన్ వేశారు. వేసిన ఎనిమిది రోజుల్లోనే అది తిరస్కరణకు గురైంది. ఇక ఈ నలుగురికీ మిగిలిన రెండో దారి క్యురేటివ్ పిటిషన్. గత ఏడాది జనవరి 9న ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ క్యురేటివ్ పిటిషన్‌ను పెట్టుకున్నారు. కోర్టు వాటిని ఐదు రోజులకే (జనవరి 14న) తిరస్కరించింది. అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా అసలు క్యురేటివ్ పిటిషనే పెట్టుకోలేదు. రివ్యూ పిటిషన్లా నెలలోపు కాకుండా, ఉరి తేదీ లోపు ఎప్పుడైనా క్యురేటివ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 1న ఉరి అన్నారు కాబట్టి ఆ లోపు అక్షయ్, పవన్ క్యురేటివ్ పిటిషన్ పెట్టుకునే వీలు ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ నలుగురికీ మిగిలి ఉండే ఏకైక మార్గం రాష్ట్రపతి క్షమాభిక్ష. ముఖేశ్ సింగ్ ఒక్కడే ఈ జనవరి 14న క్షమాభిక్ష కోరాడు. రాష్ట్రపతి దానిని జనవరి 17నే తిరస్కరించారు. క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత ఉరి తీయడానికి కనీసం వ్యవధి 14 రోజులు ఉండాలి కనుక రెండో డెత్ వారెంట్ ఫిబ్రవరి 1 అయింది. తక్కిన ముగ్గురూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదు.వీళ్లలో ఒకరో ఇద్దరో లేక ముగ్గురూనో క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుని, ఆ పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రభుత్వానికి వెళ్లి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరి, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే. ఆ తీసుకున్న తేదీ నుంచి ఉరి మళ్లీ పద్నాలుగు రోజులు వాయిదా పడుతుంది.ఒకే నేరంలో దోషులుగా నిర్థారణ అయినవారిని విడివిడిగా ఉరి తీసిన సందర్భాలు గతంలో లేవు కాబట్టి.. చివరి మూడు దారులనూ ఉపయోగించుకున్న ముఖేశ్ సింగ్ కూడా.. క్యురేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వెయ్యని అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా; క్యురేటివ్ పిటిషన్ వేసినా, క్షమాభిక్ష పిటిషన్ వెయ్యని వినయ్ శర్మల మార్గాలన్నీ మూసుకుపోయే వరకు క్షణాలను లెక్కపెడుతూ ఉండవలసిందే. ఈ నలుగురితో పాటు క్షణాలను లెక్కిస్తూ ఉన్న ఐదో వ్యక్తి నిర్భయ తల్లి ఆశాదేవి. అక్షయ్, ముఖేశ్, వినయ్, పవన్.. ఈ ఏడాది జనవరి ఏడున డెత్ వారంట్ వచ్చినప్పటి నుంచి మాత్రమే క్షణాలను లెక్కిస్తూ ఉంటే.. ఆశాదేవి, ఏడేళ్లుగా దోషుల చివరి క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ►ఇందిరా జైసింగ్ విజ్ఞప్తిని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే కనుక.. ఈ దేశంలో రోజుకు 90 మంది తల్లులు తమ కూతుళ్లపై అత్యాచారం చేసిన దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. దేశంలో రోజూ సగటున తొంభై రేప్‌లు జరుగుతున్నాయి మరి! -
నిర్భయ దోషులకు ఉరి
-
నిర్భయ దోషులకు 22న ఉరి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్‌ను చదివి వినిపించారు. దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు, ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు లాయర్ దోషులు పెట్టుకున్న పిటిషన్లేవీ న్యాయస్థానాల్లో లేదా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. అలాగే వారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించినప్పుడు క్షమాభిక్ష పిటిషన్లు ఏమైనా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయా తెలియజెప్పాలంటూ తీహార్ జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. అలాంటి పిటిషన్లు పెండింగ్‌లో ఏవీ లేవని తేలడంతో కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. కోర్టు హాలులో భావోద్వేగ దృశ్యాలు... డెత్ వారెంట్ ప్రకటించడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తల్లి కోర్టు హాల్లోకి ఏడుస్తూ రావడంతో కాసేపు కలకలం రేగింది. తన బిడ్డపై కరుణ చూపాలని న్యాయమూర్తిని ఆమె కోరింది. అయితే ఆమెను బయటకు పంపాలని ఆదేశించిన న్యాయమూర్తి... ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న నలుగురు దోషులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధుల్ని కూడా అనుమతించలేదు. ఆ తర్వాత న్యాయమూర్తి డెత్ వారెంట్లను చదివి వినిపించారు. కోర్టు ఆదేశాలు తెలియగానే ముఖేష్ తల్లి కన్నీరు పెట్టుకుంది. నిర్భయ తల్లి దగ్గరకు వెళ్లి తన బిడ్డను క్షమించాలంటూ వేడుకుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము నిరుపేదలం కావడం వల్లే ఈ నేరంలో తన బిడ్డను ఇరికించారని ఆరోపించింది. జైలు నంబర్–3లో ఉరి అమలు... నిర్భయ దోషులకు కోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైలు గది నంబర్–3లో ఉరితీస్తామని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. డెత్ వారెంట్లు జారీ కాగానే అధికారులు ఈ ప్రకటన చేశారు. నలుగురు దోషుల్లో ముగ్గురు జైలు నెంబర్ 2లో, ఒకరు జైలు నెంబర్ 4లో ఉన్నట్లు తెలిపారు. ఉరి శిక్ష అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జైలుకు చెందిన తలారిని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. దోషులందరినీ ఒకేసారి ఉరి తీస్తామన్నారు. ‘ఉరితీత రోజు వరకు దోషులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారో లేదో మా వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈలోగా వారి భద్రత గురించి కూడా మేం తగిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఉరి అమలులోగా దోషులను వారి కుటుంబ సభ్యులు కలిసి వెళ్లొచ్చు’ అని జైలు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ కోర్టు తీర్పుపై పట్నాలో స్వీట్లు పంచి, హర్షం వ్యక్తం చేస్తున్న యువతులు న్యాయం జరిగింది: నిర్భయ తల్లిదండ్రులు న్యాయం కోసం నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల పోరాటానికి తెరపడింది. డెత్ వారెంట్లు జారీ కాగానే ఉద్వేగం పట్టలేక నిర్భయ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. తాజా తీర్పు చట్టంపై మహిళల నమ్మకాన్ని తిరిగి నిలబెడుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి కదులుతున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి మరీ ఆరుగురు అత్యాచారం జరిపారు. నిర్భయ, ఆమె స్నేహితుడిని ఇనుప రాడ్లతో చితకబాదారు. సింగపూర్ మౌంట్ ఎలిజెబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ డిసెంబర్ 29న కన్నుమూసింది. ఆరుగురిలో ఒకడైన ప్రధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ను దోషిగా జువైనల్ బోర్డు తేల్చింది. అతడిని జువనైల్ హోమ్‌కు తరలించారు. ఈ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. మరోవైపు, ఆలస్యంగానైనా నిర్భయకు న్యాయం జరిగిందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. -
'నా రక్తంతో రాస్తున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి'
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో శిక్షను అనుభవిస్తున్న దోషులను తన చేతులతో ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ అంతర్జాతీయ షూటర్ వర్తిక సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. 2012 డిసెంబర్ 16న అతి కిరాతకరంగా అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన దోషులు ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. త్వరలోనే వీరిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు వారిని ఉరి తీసే అవకాశం కల్పించాలని కోరుతూ వర్తిక సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రక్తంతో లేఖను రాశారు. 'ఇది నా రక్తంతో రాస్తున్నా! నిర్భయ హత్య కేసు దోషులను నా చేతులతో ఉరి తీసే అవకాశం కల్పించండి. దీనిద్వారా దేశంలో ఒక మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదనే సందేశాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నా" అని వర్తిక సింగ్ లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు అనంతరం నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిర్భయ దోషులను ఉరి తీయడానికి 10 తాళ్లను సిద్ధం చేయాలని బీహార్‌లోని బుక్సర్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడికి పాల్పడిన అఫ్జల్ గురు, సీరియల్ కిల్లర్ ధనుంజయ్ చటర్జీ, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి యాకుబ్ మీనన్, 2008 ఉగ్రదాడిలో పాల్గొన్న అజ్మల్ కసబ్‌లను బుక్సర్ జైలు నుంచి తెప్పించిన తాళ్లతోనే ఉరి తీయడం గమనార్హం. (చదవండి : ఉరితాళ్లు సిద్ధం చేయండి) International shooter Vartika Singh: Hanging of the Nirbhaya case convicts should be done by me. This will send a message throughout the country that a woman can also conduct execution. I want the women actors, MPs to support me. I hope this will bring change in society. pic.twitter.com/VQrbpmDgdO — ANI UP (@ANINewsUP) December 15, 2019 -
దిద్దుబాటు చర్యలే కీలకం
హైదరాబాద్ శివార్లలో జరిగిన ‘దిశ’ ఘటనపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఆగ్రహా వేశాలు, ఆందోళన వ్యక్తమయ్యాయి. చర్చ సందర్భంగా అన్ని పక్షాల సభ్యులూ నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేయడంతో పాటు, అత్యాచారానికి ఉరే ఏకైక శిక్షగా ఉండేలా చట్టాన్ని సవరించాలని కోరారు. ఆ ఘటన వెలుగుచూసిన నాటి నుంచీ సమాజంలో భిన్న రంగాలకు చెందిన వారు చేస్తున్న డిమాండ్ వారి గళంలో ప్రతిఫలించింది. ‘దిశ’ ఉదంతం దేశవ్యాప్తంగా నిరసనలు రగిల్చింది. వేలాదిమంది వీధుల్లోకొచ్చి నేరగాళ్లను వెను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని, సత్వరం కఠిన శిక్షలు పడితేనే ఇటువంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని డిమాండ్ చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ఎన్నోచోట్ల ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి.నేరగాళ్ల క్రూరత్వం తీవ్రత సమాజం మొత్తాన్ని తల్లడిల్లజేస్తుంది. ఏడేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో నిర్భయను, ఆమె స్నేహితుణ్ణి మభ్యపెట్టి బస్సులో ఎక్కించుకున్న ఆరుగురు మృగాళ్లు పాశవికంగా ప్రవర్తించినప్పుడూ ఇదే తరహాలో దేశం మొత్తం భగ్గున మండింది. దాని పర్యవసానంగానే కఠినమైన నిబంధనలతో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అలుపెరగకుండా చేసిన కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఆ కమిటీ నెలరోజుల్లోనే నివేదిక అందజేయగలిగింది. దోషులకు కఠిన శిక్షపడేలా చట్టాన్ని సవరించడానికి సిద్ధంగా ఉన్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారు. రాజ్య సభలో చర్చను ప్రారంభించిన సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అందరూ దృష్టిపెట్టాలని అంటూనే చట్టం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని సరిగానే అభిప్రాయపడ్డారు. చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ సభ్యురాలు జయా బచ్చన్ అయితే అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలినవారిని కొట్టి చంపాలని డిమాండ్ చేసి సంచ లనం సృష్టించారు. జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. దేశంలో అభద్ర వాతావరణానికి కారణం చట్టాలు లేకపోవడం వల్ల కాదనీ, వాటిని సక్రమంగా అమలు పరిచే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన సమస్య అని తెలిపింది. జస్టిస్ వర్మ కమిటీ ఒక్కటే కాదు... అంత క్రితం పలు సంఘాలు కూడా ఇదే మాట చెప్పాయి. వ్యవస్థలోని వివిధ విభాగాల్లో పేరుకుపోయిన అలసత్వాన్నీ, ఉదాసీనతనూ పారదోలనంతకాలం ఎన్ని చట్టాలున్నా ఫలితం ఉండదని లా కమిషన్ నివేదిక సైతం 2000 సంవత్సరంలో హెచ్చరించింది. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం చేసే నేరగాళ్లకు ఉరిశిక్ష విధించేలా 2018లో భారతీయ శిక్షాస్మృతిని సవరించారు. ఇది చరిత్రాత్మకమైనదని అందరూ ప్రశంసించారు. ఆ సవరణ ఫలితం నిరుడంతా కనబడింది. అత్యాచారం కేసుల్లో నేరగాళ్లకు 2000 సంవత్సరం తర్వాత అత్యధికంగా మరణశిక్షలు పడటం ఇదే తొలిసారని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. 2018లో అత్యాచారం కేసుల్ని విచారించిన దిగువ కోర్టులు మొత్తం 162మంది నిందితులకు మరణశిక్షలు విధించాయి. అంతక్రితం ఈ సంఖ్య 108. కింది కోర్టులు విధించే ఉరిశిక్షలను హైకోర్టులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. 2018లో 23మంది ఉరిని మాత్రమే హైకోర్టులు ఖరారు చేశాయి. 58 కేసుల్లో యావజ్జీవ శిక్షగా మార్చాయి. దాదాపు 25 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పునిచ్చాయి. సుప్రీంకోర్టు నిరుడు మొత్తం 12 కేసుల్లో అప్పీళ్లను విచారించింది. వీటిల్లో 2017నాటివి, అంతక్రితం కేసులూ కూడా ఉన్నాయి. 11 కేసుల్లో దోషులకు యావజ్జీవశిక్ష విధించింది. ఒక్క కేసులో మాత్రమే ముగ్గురు నేరగాళ్లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అది నిర్భయ కేసు! వీరికి తక్షణం మరణశిక్ష అమలు చేయాలని దాఖలైన పిటిషన్‌ను నిరుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ హంతకులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. వాస్తవానికి అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో పోలిస్తే ఈమధ్యనే రిటైరైన జస్టిస్ రంజన్ గొగోయ్ తన పదవీకాలంలో మరణశిక్షల కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. ముగ్గురేసి న్యాయమూర్తు లుండే నాలుగు ధర్మాసనాలను ఇందుకోసం ఏర్పాటుచేశారు. ఈ ధర్మాసనాలు ఆరువారాలపాటు ప్రత్యేకించి ఈ కేసులను మాత్రమే విచారించాయి. ఒక నేరాన్ని మరణశిక్ష పరిధిలోకి తెస్తే ఇంత సుదీర్ఘ ప్రక్రియ సాగుతుంది. ఇప్పుడు పార్లమెంటులోనూ, వెలుపలా వెల్లువెత్తిన డిమాండ్ల పర్యవ సానంగా చట్టాన్ని మరింత కఠినం చేయడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గనుక ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎలాంటి సూచనలొస్తాయో చూడాలి. అయితే అంతకన్నా ముందు సమాజంలో అన్ని స్థాయిల్లోనూ పేరుకుపోయిన పురుషాధిక్య భావనను కూకటివేళ్లతో పెకిలించాలి. కుటుంబాలతో మొదలుపెట్టి వివిధ ప్రభుత్వ విభాగాల వరకూ అన్నిచోట్లా అంతర్లీనంగా ఉంటున్న ఈ చీడను వదలగొట్టకపోతే సమస్య పరిష్కారం కాదు. ఇంట్లోనూ, బయటా మహిళల్ని గౌరవించడం విషయంలో సమాజం ఆలోచనను మార్చకుండా కఠిన చట్టాల వల్ల ఒరిగేదేమీ ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. అత్యాచార కేసులు నమోదు చేయడంలో ఉదాసీనత ప్రదర్శించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చెప్పింది. అసలు అత్యా చార కేసుల్ని విచారించే తీరు మారాలని సూచించింది. ఇలాంటి అంశాలన్నిటినీ సమగ్రంగా పరిశీ లించి దిద్దుబాటు చర్యలు తీసుకోనంతకాలం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వృధా అవుతాయని గుర్తించాలి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, దోమకొండ: దోమకొండ మండలం గొట్టిముక్కుల గ్రామానికి చెందిన రైతు ధర్పల్లి రాజిరెడ్డి(46) మంగళవారం సాయంత్రం అప్పుల బాధతో వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రాజిరెడ్డికి గ్రామ శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో మొక్కజొన్న సాగు చేశాడు. అకాల వర్షాలతో పంట దెబ్బతింది. వచ్చిన పంటను తక్కువ ధరకు అమ్ముకున్నాడు. దీనికి తోడు ఇటీవల నెల క్రితం రాజిరెడ్డి కుమారుడు సాగర్‌కు యాక్సిడెంట్ కాగా ఆస్పత్రిలో దాదాపు రూ.మూడు లక్షల వరకు ఖర్చయింది. దీంతో మానసికంగా కృంగిపోయిన రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కుమారులు సాగర్, సంపత్ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. -
అంబరాన ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తొలి హ్యాంగింగ్ రెస్టారెంట్ మాదాపూర్‌లో షురూ అయింది. ఆకాశమార్గన ఆతిథ్యం ఆస్వాదించేలా రూపొందించిన క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు దత్ కొల్లి, తరుణ్ కొల్లి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారి హ్యాంగింగ్ రెస్టారెంట్‌ను తాము ఏర్పాటు చేశామని, మరిన్ని మెట్రోపాలిటన్ నగరాలకు దీనిని విస్తరింపజేయనున్నామన్నారు. దాదాపు 160 అడుగుల ఎత్తులో కూర్చొని నచ్చి న వంటకాలను ఆస్వాదించడానికి తమ రెస్టారెంట్ అవకాశమిస్తుందన్నారు. అయితే ఒక సెషన్‌కి 26 మంది అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుందని, డిన్నర్ సమయంలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని, ఒక్కో సెషన్లో వీరు గంట పాటు గడపవచ్చని తెలిపారు. -
అవివాహిత ఆత్మహత్య
మీర్‌పేట: ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డీఎంఆర్ఎల్లో శాస్త్రవేత్తగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన నిరంజన్‌దాస్ భార్యాబిడ్డలతో కలిసి మీర్‌పేట లెనిన్‌నగర్ అనూరాగ్‌నగర్ కాలనీలో ఉంటున్నారు. అతని సోదరి ప్రభావతిదాస్ (41) అవివాహిత. గతంలో ఆమె ఢిల్లీలోని బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో ఉండేది. ఉద్యోగం కోసం గత కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చిన ప్రభావతిదాస్ అనూరాగ్‌కాలనీలోని సోదరుడు నిరంజన్‌దాస్ వద్దకు వచ్చి ఉంటోంది. నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు కూడా హాజరైంది. సదరు కంపెనీ వారు 15 రోజుల తరువాత చెబుతామని చెప్పడంతో ఆమె సోదరుని వద్దే ఉంటోంది. ఈ నెల 8వ తేదీన నిరంజన్‌దాస్ తన కుమారుణ్ని ఒరిస్సాలోని బంధువుల వద్దకు తీసుకవెళ్లేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య లక్ష్మీ ప్రియ దాస్, సోదరి ప్రభావతి దాస్ ఇద్దరే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం లక్ష్మీ ప్రియ దాస్ బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి బయటి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ప్రభావతి దాస్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, లక్ష్మీప్రియదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
లంచం పుచ్చుకుంటే ఉరి!
సాక్షి, చెన్నై: లంచం పుచ్చుకుంటూ పట్టుబడే వారిని ఉరి తీయాల్సిందే లేదా దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిందే అని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి వారి ఆస్తుల్ని జప్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి కఠిన చట్టాల్ని అమల్లోకి తెచ్చినప్పుడే లంచం, అవినీతిని పూర్తిగా రూపు మాపేందుకు వీలుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాల్లోనూ లంచం తాండవం చేస్తూనే ఉంది. ప్రతి పనికి పైసా అన్నట్టుగా పరిస్థితి మారింది. కొందరు సాహసం చేసి లంచగాళ్లను ఏసీబీకి పట్టిస్తున్నారు. మరికొందరు తమ పని త్వరితగతిన ముగియాలన్న కాంక్షతో లంచం ఇచ్చుకోక తప్పడం లేదు. ఈ లంచం, అవినీతిని రూపు మాపుతామంటూ పాలకుల వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో లంచం పుచ్చుకునే వాళ్లతో కఠినంగా వ్యవహరించినప్పుడే రూపుమాపగలమంటూ పాలకులకు మధురై ధర్మాసనం హితబోధ చేసింది. పిటిషన్: మదురై సూర్యనగర్‌కు చెందిన భరణిభారతి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి జరిగిన రాత పరీక్ష గురించి వివరించారు. పరీక్ష ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పేపర్ లీక్ అయ్యిందని, ఇంతవరకు ఆ లీక్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో వివరించారు. అయితే, ఆ పోస్టుల భర్తీకి తగ్గ నియమకాల మీద అధికార వర్గాలు దృష్టి పెట్టి ఉన్నారని వివరించారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు కృపాకరణ్, ఎస్ఎస్ సుందర్ నేతృత్వంలోని బెంచ్ ముందు సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు లంచగాళ్ల మీద తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంగా సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల రాకతో లంచగాళ్ల బండారాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి పనికి లంచం సహజంగా మారిందని ధ్వజమెత్తారు. దీనిని రూపు మాపుతామంటున్నారేగానీ, ఇంతవరకు ఆచరణలో పెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరి శిక్ష:ఈ కేసులో ధర్మాసనం పేర్కొంటూ.. లంచం అన్న పదం తెరమరుగు కావాలన్నా, లంచం పుచ్చుకునేందుకు భయపడాలన్నా. అవినీతి సమూలంగా నశించాలన్నా శిక్షలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లంచం పుచ్చుకుంటూ పట్టుబడే వాళ్లను ఉరి తీయాలని, లేదా దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి కటకటాలకే పరిమితం చేయాలని సూచించారు. అలాగే, లంచగాళ్ల ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షలు అమల్లోకి తెచ్చినప్పుడే ఈ దేశంలో లంచం, అవినీతి అన్నది రూపు మాపబడుతుందని వ్యాఖ్యానించారు. చివరకు ఈ కేసులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ, తదుపరి విచారణను ఒకటో తేదీకి వాయిదా వేశారు. -
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఒదిలి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, సంపూర్ణ దంపతులకు కుమారుడు దుర్గా ప్రసాద్, కుమార్తె నాగ ఝాన్సీ ఉన్నారు. వారు మూడేళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చారు. ఝాన్సీ ఓ తెలుగు టీవీ చానల్లో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్లో నటించేది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఝాన్సీకి విజయవాడకు చెందిన సూర్యతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం ఝాన్సీ ఇంట్లో ప్రేమ విషయం చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారు. అయితే రెండు నెలలుగా ఝాన్సీపై సూర్య అనుమానం వ్యక్తం చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తూ వచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతని వేధింపుల వల్లే ఝాన్సీ నటన ఆపేసి నెల క్రితం ఓ స్నేహితురాలితో కలసి అమీర్‌పేటలో ఓ బ్యూటీపార్లర్ నిర్వహిస్తోందని తెలిపారు. రోదిస్తున్న ఝాన్సీ తల్లి, కుటుంబ సభ్యులు వేధింపుల వల్లే ఆత్మహత్య... నాలుగు రోజులుగా ఝాన్సీ తీవ్ర డిప్రెషన్లో ఉందని ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాను ఇంటికి రాగా తలుపు లోపల నుంచి గడియ ఉందని, కిటికీలోంచి లోపలకు వెళ్లి బెడ్రూం తలుపు విరగ్గొట్టి చూడగా ఝాన్సీ ఉరేసుకొని వేలాడుతూ కనిపించిందన్నారు. పవిత్రబంధం అనే సీరియల్లో చేస్తున్నప్పుడు తన కుమార్తెకు ఓ అమ్మాయి ద్వారా సూర్య పరిచయమయ్యాడని ఆమె తల్లి సంపూర్ణ గాంధీ ఆసుపత్రిలో బుధవారం విలేకరులకు వివరించారు. గత 6 నెలలుగా తమకు సూర్య పరిచయమని, ఇరువురి పెళ్లికి కూడా తాము అంగీకరించా మన్నారు. గత కొన్ని రోజులుగా ఝాన్సీ ఫోన్లో ఎవరితోనో గొడవ పడుతుండేదని, మూడు రోజుల క్రితమే తన కుమార్తె నగరానికి వచ్చిందన్నారు. ఇంటి నిర్మాణం పనుల కోసం స్వగ్రామంలో ఉన్న తాను సోమవారం ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ బిజీ అని వచ్చిందన్నారు. సూర్యతో ఝాన్సీ (ఫైల్) ఆమె ప్రవర్తనలో మార్పు వల్లే దూరంగా ఉన్నా: సూర్య ఇటీవల ఝాన్సీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా మారకపోవడంతో తాను ఝాన్సీకి దూరంగా ఉన్నానని సూర్య ఓ చానల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. ఝాన్సీకి బాబీ, గిరి అనే సినీ బ్రోకర్లతో గతం నుంచే పరిచయం ఉందని, గిరి ఓసారి ఝాన్సీని వేధిస్తే అతన్ని హెచ్చరించానని పేర్కొన్నాడు. ఝాన్సీకి సీరియల్లో చాన్సులు లేవన్నాడు. ఝాన్సీ తనకు చివరిసారి వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి వాటిని డిలిట్ చేసిందన్నాడు. రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం: పంజగుట్ట ఏసీపీ నాగ ఝాన్సీ మృతిపై తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆమె మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఈ కేసులో ఆధారాలుగా ఝాన్సీకి చెందిన రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిని విశ్లేషణకు పంపామని, ఆ వివరాలతో ఝాన్సీ మరణానికి సంబంధించిన అంశాలు తెలియొచ్చన్నారు. -
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తాడితోట, వీరభద్రనగర్కు చెందిన బొడ్డుపల్లి వెంకటరమణ(21) డిగ్రీ వరకు చదివాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని కిందకి దించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. వన్‌టౌన్ సీఐ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లినగరంలో అలజడి
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: అల్లినగరం గ్రామంలో గురువారం అలజడి నెలకొంది. వృద్ధుడి మృతి కలకలం రేపింది. తెల్లవారుజామున 5.30 గంటలకు కొందరు గ్రామస్తులు వ్యక్తిగత పనులు మీద జాతీయ రహదారి వైపు వెళ్లారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓ చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని ఉన్న వృద్ధుడి మృతదేహం చూశారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఫిర్యాదు కోసం నిరీక్షించారు. మృతి చెందింది ఎవరు అన్న అంశం ఈ ప్రాంతంలో చర్చనీయంశంగా మారింది. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగారు. ఉపాధ్యాయులు కార్యాలయం గదికి చేరుకున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ భీమారావు, జేఆర్ పురం సీఐ రామకృష్ణ, ఎచ్చెర్ల ఎస్ఐ వై.కృష్ణ సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పాఠశాలలో పడివున్న విషయం పక్క గ్రామాలకు వ్యాపించింది. లావేరు మండలం పెద్దరావుపల్లి గ్రామానికి చెందిన మజ్జి రాములు(66) బుధవారం రాత్రి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఈ పాఠశాల వద్దకు చేరుకున్నారు. తన భర్త మృతదేహంగా భార్య లక్ష్మి గుర్తించి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హత్య చేశారని అనుమానాలు మృతి చెందిన మజ్జి రాములు అల్లినగరం పాఠశాల ఆవరణలో చెట్టుకు లుంగీతో ఉరివేసుకున్నట్టు ఉంది. లుంగీ ఉండాల్సిన స్థానంలో తువ్వాలు కట్టుకుని ఉండి చెట్టు కొమ్మకు ఉరివేసుకున్నట్టు ఉంది. నేలకు శరీరం తాకి ఉంది. చెట్టు కొమ్మ నేలకు తక్కువ ఎత్తులో ఉండటం, ఉరివేసుకునేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవటం, శరీరం మొత్తం రక్తంతో తడిసి ఉండటం, పక్కన ఉన్న చెట్టుకు రక్తం మరకులు అంటి ఉండటం వంటి అంశాలు హత్య జరిగి ఉంటుందన్న సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. మరో పక్క నిరుపేద కుటుంబం కావటం, మృతుడు రోజు కూలీ కావటం, భార్య, ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్న ఈయనకు ఇతర కుటుంబాలతో విభేదాలు లేకపోవటం వంటి అంశాలు పరిశీలిస్తే హత్యపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఉంది. మద్యం దుకాణం వద్ద గొడవులు జరిగి ఉంటాయని, ఈ సమయంలో హత్య జరిగే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. మరో పక్క ఈయన దగ్గర స్వల్ప మొత్తంలో డబ్బులు ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేసేటంతటి శత్రువులు తమకు లేని అంటున్నారు. కాగా, పెద్దలు సమక్షంలో పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతందేహం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక స్పష్టత మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు ఆధారంగా ఎచ్చెర్ల పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. జేఆర్ పురం సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ వై.కృష్ణ మాట్లాడుతూ వైద్యుల నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. మద్యం మత్తులో చెట్టుకు గుద్దుకోవటం, లుంగీతో ఉరివేసుకోవటంతో మృతి చెంది ఉండవచ్చునని, ఉరివేసుకొని మృతి చెందిన లక్షణాలు ఉన్నాయని చెప్పారు. క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించిందని, ప్రస్తుతం పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఒక ఉరికంబం కావాలి
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం పేరుతో మారణహోమం సృష్టించిన దోషులకు న్యాయస్థానాలు ఉరిశిక్ష తీర్పు వెల్లడించాయి. అయితే ఈ ఉరిశిక్ష అమలు చేయాల్సిన జైళ్ల శాఖ ఇప్పుడు ఆందోళనలో పడింది. రాష్ట్రంలోని ఏ జైలులో కూడా ఉరికంబాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలో ఉరికంబం ఉన్న ఒకే ఒక్క జైలు ముషీరాబాద్ జైలు. ఇప్పుడు ఆ జైలు కనుమరుగైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ కేంద్ర కారాగారంలో కూడా ఉరికంబం ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర కారాగారాల్లో ఉన్న ఏడుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. వీరికి ఉరివెయ్యాలంటే ఉరికంబం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం జైళ్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. 1978లో చివరి ఉరి... ప్రస్తుతం రాష్ట్రంలో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్ జైళ్లు కేంద్ర కారాగారాలుగా ఉన్నాయి. వీటిలో ఎక్కడా కూడా ఉరికంబం అందుబాటులో లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర కారాగారంగా ఉన్న ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలోనే ఉరికంబం ఉండేది. రాజమండ్రి జైల్లో 1976లో కిష్టప్ప అనే ఖైదీని ఉరితీశారు. అదేవిధంగా ముషీరాబాద్‌లో 1978లో మరో ఖైదీని ఉరితీశారు. ఇదే జైళ్ల శాఖలో చివరి ఉరిగా చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో ఉరిశిక్ష పడుతున్నా ఉరి మాత్రం అమలు కాలేదని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం గోకుల్‌చాట్, దిల్సుఖ్నగర్ పేలుళ్లలో ముద్దాయిలుగా మొత్తం ఏడుగురికి ఉరిశిక్ష వేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడు ఉరికంబం విషయం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ ఏర్పాటు చేయాలి.. పేలుళ్ల కేసుల్లో దోషులు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి ఉరి అమలు చేయాల్సింది రాష్ట్ర జైళ్ల శాఖే కావడంతో తప్పనిసరిగా ఉరికంబాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం జైళ్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలోని మూడు కేంద్ర కారాగారాల్లో ఏ జైల్లో ఉరికంబం ఏర్పాటు చేయాలన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. సున్నితమైన కేసుల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీలకు నగరంలోని కేంద్ర కారాగారాల్లో శిక్ష అమలుచేస్తే ఇబ్బందికర పరిస్థితులుంటాయని, అందువల్ల వరంగల్ సెంట్రల్ జైల్లో ఏర్పాటుచేస్తే బాగుంటుందని జైళ్ల శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉరికంబం ఏర్పాటు ప్రతిపాదనపై త్వరలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే స్పష్టత వస్తుందని జైళ్ల శాఖ అధికారులు స్పష్టంచేశారు. -
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో..
మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి యప్రల్ శైలి గార్డెన్స్‌లోని జూపల్లి హోమ్స్‌లో విషాదం చోటుచేసుకుంది. వివరాలు..స్థానికంగా నివాసముంటున్న రమేష్(36) అనే యువకుడు అదే ప్రాంతంలో పనిచేస్తోన్న సుజాత అనే వివాహితతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం సుజాత భర్తకు తెలియడంతో ఆయన తీవ్రంగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ బుధవారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య
-
మరో బురారీ: కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబంలోని సామూహిక ఆత్మహత్యల కేసు మరవకముందే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్‌లోని హజారిబాగ్ నగరంలో చోటుచేసుకుంది. వీరిలో ఐదు మంది ఉరివేసుకొగా, మరొకరు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సూసైడ్‌నోట్ ఆధారంగా అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. డ్రై ఫ్రూట్ బిజినెస్‌లో భారీగా నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనై వారంతా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మృతులు మహావీర్ మహేశ్వరీ(70), అతని భార్య కిరణ్ మహేశ్వరి(65), కొడుకు నరేశ్ అగర్వాల్(40), ఇతని భార్య ప్రీతీ అగర్వాల్(38), పిల్లలు అమన్(8), అంజలి(6)గా గుర్తించారు. -
పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య
సాక్షి, విశాఖ క్రైం : పెళ్లి ఇష్టం లేని యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గురుద్వార కూడలి శాంతిపురం అరుణ అపార్టుమెంట్లో సత్తరు అప్పన్న, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సత్తరు రేవతి (20), కుమారుడు చైతన్య ఉన్నారు. అప్పన్న నెల్లూరులో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె రేవతి డిగ్రీ పరీక్షలు రాసింది. రేవతికి బావతో పెళ్లి కుదిర్చారు. ఈనెల 22న వివాహం నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో భాగంగా సోమవారం పెళ్లి కార్డుల పంపిణీకి రేవతి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ నేపథ్యంలో రేవతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ హుక్కు చున్నితో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రేవతి తల్లి, కుటుంబ సభ్యులు తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో గట్టిగా తోసి లోపలకు ప్రవేశించారు. ఇంటిలో సిలింగ్ హుక్కుకు వేలాడుతున్న రేవతిని చూశారు. వెంటనే ఆమెను కిందకు దించి కేర్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రేవతి తల్లి నారాయణమ్మ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన హెడ్ కానిస్టేబుల్ తులసీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రేవతి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న రేవతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగాల్లో రాజకీయ హత్య?
కోల్‌కతా : బెంగాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కార్యకర్త రాజకీయ హత్య సంచలనం రేపుతోంది. పురులియా జిల్లాలోని దాభా గ్రామంలో శనివారం దులాల్ అనే వ్యక్తి విద్యుత్ స్తంభానికి ఉరి వేసి వేలాడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో త్రిలోంచల్ అనే బీజేపీ కార్యకర్త చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించిన సంగతి తెలిసిందే. కాగా, దులాల్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)నేతల హస్తం ఉందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఎంసీ నేతలే ఇరువురు కార్యకర్తలను హతమార్చి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై వెంటనే సీబీఐపై దర్యాప్తుకు ఆదేశించాలని స్థానిక బీజేపీ నేత రాహుల్ సిన్హా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యకర్తల మృతిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని షా మండిపడ్డారు. కాగా, బీజేపీ చేస్తున్న ఆరోపణలను టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఖండించారు. బీజేపీ కార్యకర్తల మరణాలతో తృణమూల్‌కు ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల విచారణలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. వరుస అనుమానాస్పద మృతి సంఘటనలపై వెంటనే దర్యాప్తు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ను ఆదేశించారు. వరుస ఘటనలపై దర్యాప్తును ప్రారంభించిన ఎస్పీ జాయ్ బిశ్వాస్.. మొదటి ఘటనపై హత్య అనుమానాలు(వ్యక్తిగత కక్ష కారణంతో హత్య) ఉన్నాయని, రెండో ఘటన ఆత్మహత్యలా ఉందని చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన అనంతరం విచారణను ముమ్మరం చేస్తామని వెల్లడించారు. Distressed to know about yet another killing of BJP karyakarta Dulal Kumar in Balrampur, West Bengal. This continued brutality and violence in the land of West Bengal is shameful and inhuman. Mamata Banerjee’s govt has completely failed to maintain law and order in the state. pic.twitter.com/jrA1prcs91 — Amit Shah (@AmitShah) June 2, 2018 -
మరణశిక్షలతో నేరాలు ఆగుతాయా?
కఠిన చట్టాలున్నా వాటి అమలు సరిగ్గా జరగకపోతే లేదా అమల్లో తీవ్ర జాప్యం జరిగితే వాటి వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి. పన్నెండేళ్ల లోపు పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించేందుకు అనుమతిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ నేపథ్యంలో క్రూరమైన నేరాలు జరగకుండా ఉరిశిక్షలు ఏ మేరకు హెచ్చరికలుగా నిలుస్తాయన్నది చర్చనీయాంశమవుతోంది. ఐరాసతో సహా ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు మరణశిక్షలు అమానవీయమని వీటిని రద్దు చేయాలని గట్టిగా డిమాండ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉరిశిక్షల అమలు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలోని న్యాయస్థానాల్లో కేసుల విచారణ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల నిందితులు తీవ్ర నేరాలకు పాల్పడకుండా మరణశిక్షలు నియంత్రణగా ఉపయోగపడడం లేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. 2017 ఆఖరు నాటికి భారత్‌లో 371 మంది మరణశిక్ష పడిన ఖైదీలున్నారు. వారిలో... 1991లో శిక్ష పడిన ఖైదీ కూడా ఉన్నాడు. అంటే అతడిది 27 ఏళ్ల నిరీక్షణ. 2017లో దేశవ్యాప్తంగా వివిధస్థాయిల్లోని న్యాయస్థానాలు 109 మందికి ఉరిశిక్ష విధించాయి. 2016లో ఈ సంఖ్య 149గా ఉంది. అయితే గత పధ్నాలుగేళ్లలో కేవలం నలుగురికి మాత్రమే ఈ శిక్షను అమలుచేశారు. వీరిలోనూ ముగ్గురికి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడినందుకు, ఒకరికి మాత్రమే మైనర్‌పై లైంగికదాడి, హత్యకు పాల్పడినందుకు మరణశిక్ష విధించారు. ఉరిశిక్ష పడిన 127 మంది ఖైదీల కేసుల విచారణకు అయిదేళ్లకు పైగా, 54 మందికి పదేళ్లకు పైగా, మిగతా వారికి అయిదేళ్ల వరకు సమయం పడుతోంది. ఉరిశిక్ష రద్దుకు ఖైదీలు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి తిరస్కరణకు గురవడానికి మధ్యకాలంలో 10 నుంచి 16 ఏళ్ల శిక్షను వారు అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ నిర్భయ అత్యాచారం కేసులో పడిన ఉరిశిక్షను సమీక్షించాలంటూ నలుగురిలో ఇద్దరు ఖైదీలు పెట్టుకున్న పిటీషన్‌పై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకటన వాయిదా వేసింది. ఉరిశిక్షలనేవి నేరస్థులను అంతమొందిస్తాయే తప్ప నేరాన్ని కాదంటూ ఈ ఖైదీల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఎవరు జీవించాలి, ఎవరు మరణించాలి అన్న విషయాన్ని న్యాయస్థానాలు ఎలా నిర్ణయిస్తాయంటూ ప్రశ్నించారు. గత 14 ఏళ్లలో ఉరి అమలు 4 కేసుల్లోనే... 1993 నాటి ముంబై వరుస బాంబుపేలుళ్ల కేసులో 2015 జులై 30న యాకుబ్ మెమన్‌కు నాగ్‌పూర్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు పార్లమెంట్‌పై దాడి చేసులో మహ్మద్ అఫ్జల్ గురుకు 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్ జైలులో శిక్ష పూర్తిచేశారు. 2008లో ముంబైపై పాక్ ముష్కరులు ఉగ్రదాడి జరిపిన కేసులో సజీవంగా పట్టుకున్న అజ్మల్ అమీర్ కసబ్‌ను 2012 నవంబర్ 21న పుణెలోని ఎరవాడ జైలులో ఉరితీశారు. టీనేజీ అమ్మాయి అత్యాచారం,హత్య కేసులో 2004 ఆగస్టు 14న పశ్చిమబెంగాల్ లోని అలీపూర్ జైలులో ధనుంజయ్ ఛటర్జీ (42)కి మరణశిక్ష అమలుచేశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పిల్లలపై అత్యాచారాలను అరికట్టలేమా?
పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్త వినని రోజు లేదు. ఈ పరిస్థితి ఏ ఒక్క రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితమైంది కాదు. భారతదేశం యావత్తు రోజుకు పదుల సంఖ్యలో ఈ ఘటనలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో గణాంకాల మేరకు 2014లో దేశవ్యాప్తంగా 89,423 ఘటనలు చోటు చేసుకుంటే పిల్లలపై ఈ అత్యాచారాలు 2015–94,172కి పెరిగాయి. ఇక 2016లో ఈ సంఖ్య 1,06,958కి చేరుకోగా 2017లో రెండు లక్షలు దాటిందని అంచనాలు వేస్తున్నారు. దేశం వెలుపలా, దేశం లోపలా కేంద్ర ప్రభు త్వం అత్యంత విమర్శకు గురైన కథువా ఘటనకు కంటితుడుపు చర్యగా ప్రజల ముందు కోర్టుల ముందు తామూ ఏదో చేశామని చెప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అదరా బాదరాగా సవరించి పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష వేసేలా చట్టాన్ని సవరించి చేతులు దులుపుకున్నారు. దీంట్లోనూ బాధిత బాలికల వయసు 12 ఏళ్లలోపు ఉంటేనే నిందితుడికి ఉరిశిక్ష అని పేర్కొన్నారు. 12 ఏళ్ల పైబడిన బాధితుల మాట ఏంటి? ఇక బీజేపీ అధికారం చేపట్టిన తర్వాతి కాలంలో నాలుగున్నర లక్షల అత్యాచార ఘటనలు జరిగాయి. ఇందులో ఎంతమందిని ఉరితీయగలరు. కేవలం శిక్షల ద్వారా నేరాలు తగ్గుతాయనుకుంటే నిర్భయ చట్టం ద్వారా నేరాలు తగ్గాయా? పిల్లలపై జరిగిన అత్యాచారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాజకీయ కోణంలో చూస్తున్నాయనడానికి ఏపీలో గుంటూరులోని దాచేపల్లిలో ఓ పసిపాపపై అత్యాచారం జరిగితే, నింది తుడు సుబ్బయ్య ఏపీ ప్రతిపక్ష నాయకుడితో ఉన్న ఫొటోను చూపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న పాలక పక్షానికి నిందితుణ్ణి పట్టుకుని శిక్షించడం, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపన లేకపోవడం చూసి అసహ్యం కలుగుతోంది.నేరాలు జరిగాక శిక్షలు వేస్తామనడం కంటే నేరాలు జరగకుండా చూడటానికి ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే పిల్లలను కొంతమేరకైనా రక్షించుకోగలం కానీ కేవలం రాజకీయ కోణంలో చూస్తే పిల్లలు అత్యంత అన్యాయానికి గురౌతారు. అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం ‘ 93910 24242 -
భయమే ఉరితాడై..!
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచీ తల్లిదండ్రులకు భయమే.. జాగ్రత్తగా ఉండు తల్లీ.. బయట ఎక్కువగా తిరగొద్దు అంటుంటారు. మెట్టినింటికి పంపిన తరువాత కూడా అనేక జాగ్రత్తలు చెబుతారు. అమ్మాయిల జీవితం దుర్భరమైనదనే భావన చిన్నప్పటి నుంచీ కల్పిస్తారు. ఈ అభద్రతే ఎంతో మంది మహిళలకు శాపంగా మారుతోంది. లేనిపోని భయాలు.. జీవితంపై అపనమ్మకాలు.. వెరసి మానసిక సంఘర్షణ.. ఇవే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన సునీతను బలితీసుకున్నాయి. రెండున్నరేళ్ల చిన్నారి సుమను కూడా పొట్టనపెట్టుకున్నాయి.. పెళ్లికాక ముందు సునీతకు ఎన్నెన్నో కలలు.. భవిష్యత్‌పై ఆశలు అయితే ఆమె తల్లి అయిన తరువాత ప్రతి రోజూ కలత నిద్రే! ఇద్దరు ఆడపిల్లలు.. ఒకరికి మతిస్తిమితం లేదు.. కన్నబిడ్డ దుస్థితిని చూసి ఏడ్వని రోజు లేదు.. ఉన్నట్టుండి ఇంటి పక్కన ఓ మహిళ ఉరేసుకుంది.. సున్నిత మనసుకు గాయమై.. మూఢనమ్మకం జడలు విప్పింది.. దయ్యమనే భయం.. ఉరితాడై ఇద్దరి ప్రాణాలు తీసింది!! కర్నూలు, సంగాల(చిప్పగిరి): కుమార్తెకు ఉరివేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిప్పగిరి మండలంలోని సంగాల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరప్ప, లక్ష్మి దంపతుల కుమారుడైన శివరుద్రకు అదే గ్రామానికి చెందిన సికిందర్, సుంకమ్మ దంపతుల కుమార్తె సునీతతో 2015 ఏప్రిల్ 22వ తేదీన వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమార్తె సుమ, యేడాది పాప పూజ ఉన్నారు. మొదటి కుమార్తె సుమకు మానసిక స్థితి సరిగా లేకపోవడం, మాటలు సరిగా రాకపోవడంతో పలుచోట్ల వైద్యులకు చూపించారు. అత్తగారింట్లో తనకు ప్రాణహాని ఉందని కొన్ని రోజులుగా సునీత భయాందోళనకు గురయ్యేది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, అత్తమామలకు చెప్పేది. ఇదే క్రమంలో కొన్ని నెలల క్రితం ఇంటి పక్కన ఉన్న ఒక మహిళ ఉరి వేసుకోవడం చనిపోయింది. ఈ క్రమంలో చనిపోయిన మహిళ తనకు కలలో వస్తున్నట్లు సునీత చెప్పి భయపడేది. బుధవారం సాయంత్రం పుట్టినింటికి వెళ్లిన సునీతను తిరిగి భర్త శివరుద్ర ఇంట్లో వదిలిపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు. గురువారం తెల్లవారు జామున భర్త శివరుద్ర గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. ఇంట్లో భర్త లేని సమయం చూసుకొని కుమార్తె సుమకు ఉరి వేసి తాను కూడా ఉరికి వేలాడింది. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులు, బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆలూరు సీఐ దస్తగిరిబాబు, చిప్పగిరి ఎస్ఐ అబ్దుల్‌జాహీర్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఒకపక్క కూతురి మానసిక స్థితి సరిగా లేకపోవడం, తనకు జరుగుతున్న భయాందోళనను ఎవరూ పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సునీత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత భర్త శివరుద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్‌కు తరలించారు. సునీత రెండో కుమార్తె పూజను అవ్వ.. పెళ్లి ఇంటి వద్దకు తీసుకెళ్లడంతో బతికిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. -
గుంటూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు
-
ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య
బాపట్లటౌన్: ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి కథనం ప్రకారం పట్టణంలోని 14వవార్డు, ఎస్ఎన్పీ అగ్రహారానికి చెందిన మోకా అంకితశ్రీ కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంకితశ్రీని అదే ప్రాంతానికి చెందిన మోకా వెంకటేష్వర్మతో రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వీరి ఇద్దరికి కుటుంబంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. -
కొడుకు పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీ
సాక్షి, నాగర్‌కర్నూల్: అది పెళ్లయిన ఇళ్లు.. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా వెళ్లలేదు.. పచ్చని తోరణాలు తొలగించలేదు... అంతలోనే పెళ్లికొడుకు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం కోడుపర్తి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్రీనివాస్‌రెడ్డి(45) పెద్దకుమారుడు రాందేవ్‌రెడ్డికి ఈనెల 19న గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్హాల్లో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి కోడుపర్తికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులతో సహా వచ్చారు. రాత్రి ఉక్కపోతగా ఉండటంతో భోజనాల తర్వాత బంధువుల వద్ద ఉన్న బంగారు నగలను సూట్‌కేసులో భద్రపర్చి అంతా కలసి మేడపై నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారేసరికి సూట్‌కేసులోని సుమారు 24 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాస్‌రెడ్డి తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో సహా పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. ఇది బయటి దొంగల పనికాదని, బంధువుల్లో ఎవరో దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి బంధువులందరినీ వేర్వేరుగా ప్రశ్నించడంతో పాటు నిజం తేలకుంటే అందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తామని హెచ్చరించారు. మనస్తాపంతో... ఇంట్లో శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరగాల్సి ఉండగా పోలీసుల విచారణతో శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులలో ఎవరిని తప్పు పట్టాలో, పోలీసులు ఎవరిని అవమానం పాలుచేస్తారో తెలియక మదనపడ్డారు. ఒకవేళ ఆభరణాలు దొరకకపోతే బంధువులకు తానే ఇవ్వాల్సి వస్తుందన్న ఆవేదనతో ఆయన శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లి పెళ్లికొడుకు రాందేవ్‌రెడ్డికి ఫోన్ చేసి అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని, గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ చెప్పి ఉరి వేసుకున్నాడు. కాగా, అంతకుముందు చోరీ అయిన బంగారు ఆభరణాలను దొంగలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రోడ్డుపై పడేసి వెళ్లారు. కొందరు చేసిన పనికి తాము కుటుంబ పెద్దదిక్కును కోల్పోయామని శ్రీనివాస్‌రెడ్డి భార్య పద్మ, కొడుకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాందేవ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బంగారం పోయిందన్న అవమానంతోనే శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందులో పోలీసుల ఒత్తిడి ఏమీ లేదని ఎస్ఐ పేర్కొన్నారు. -
13 మంది నిందితులను ఉరి
-
13 మందికి ఉరి
బాగ్దాద్: ఉరిశిక్ష విధించరాదని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నప్పటికీ ఇరాక్ తాను అనుకున్న పని చేసింది. ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో 13 మంది నిందితులను ఉరి తీసినట్లు ఇరాక్ అధికారులు తెలిపారు. కారు బాంబులు, సెక్యూరిటీని చంపడం, కిడ్నాపులు తదీతర నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు 11 మందిపై నిరూపితమయ్యాయని ఇరాక్ మంత్రిత్వశాఖ తెలిపింది. మరో ఇద్దరు దోషుల గురించి వివరాలు వెల్లడించలేదు. ఏ ఒత్తిడి ద్వారా ప్రభావితం కాకుండా చట్టం అమలు చేయడంలో అంకితభావం ప్రదర్శిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాకీ న్యాయస్థానాల్లో పారదర్శకత లేకపోవడంతో యూరోపియన్ యూనియన్‌తో పాటు పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 2003, జూన్ 3న ఇరాక్‌లో మరణశిక్షను తాత్కాలికంగా రద్దు చేశారు. కానీ పలు కారణాలతో 2004, ఆగస్టు 8న మళ్లీ మరణశిక్ష ఇరాక్‌లో అమలులోకి వచ్చింది. -
రైల్లో ఉరేసుకుని యువతి మృతి
నెల్లూరు జిల్లా : విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి వద్ద లభించిన డైరీ ఆధారంగా పోలీసులు వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. యువతి తన వద్ద ఉన్న డైరీలో పేరున్న పేజీని చింపివేయడంతో ఆమె ఎవరో కనుక్కోవడానికి పోలీసులకు కష్టతరంగా మారింది. మృతి చెందిన యువతి వయసు 20 నుంచి 24 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు వచ్చిన సమయంలో యువతి ఒంటరిగా ఉండటం గమనించి యువతిని తలుపు వేసుకోమని టీసీ సూచించినట్లుగా తెలిసింది. కావలి రైల్వేస్టేషన్‌కి వచ్చేసరికి రైల్లోనే ఉరి వేసుకుని మృతిచెందింది. ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారనే అనుమానం కలుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతోన్నారు. -
ప్రేమజంట బలవన్మరణం
దౌల్తాబాద్: ప్రేమ పెళ్లికి అబ్బాయి కుటుంబీకులు నిరాకరించడం, ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం ఖరారు కావడంతో జీర్ణించుకోలేని ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోల్కంపల్లి గ్రామానికి చెందిన కోటం అనంతప్ప, నర్సమ్మల పెద్ద కుమారుడు కోట్టం ప్రవీణ్‌కుమార్(21) రెండేళ్ల క్రితం ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన భీమప్ప, బుగ్గమ్మలకు ఏకైక కుమార్తె ఎర్రోళ్ల మంజుల(18) ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. ఏడాదిగా ప్రవీణ్‌కుమార్, మంజుల ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కొద్ది నెలల క్రితం ప్రవీణ్ ఇంట్లో విషయం తెలిసింది. తాము కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అతడిని మందలించారు. అయితే మంజులకు వారం రోజుల క్రితం కొడంగల్ మండలం రావల్‌పల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం కుదిరింది. మరో మూడు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఈ విషయం మంజుల హైదరాబాద్‌లో ఉన్న ప్రవీణ్‌కు చెప్పడంతో ప్రవీణ్ ఆదివారం రాత్రి 9గంటలకు పోల్కంపల్లి గ్రామానికి వచ్చాడు. ఇంట్లో రాత్రికి భోజనం చేసి బయటపడుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. మంజుల కూడా కుటుంబసభ్యులు పడుకున్న తర్వాత రాత్రి 11గంటల వరకు టీవీ చూసి బయటకు వెళ్లిపోయింది. అయితే కుమారుడు కనిపించకపోవడంతో ఉదయం 4గంటలకు ప్రవీణ్ తండ్రి పొలం వద్దకు వెళ్లగా.. వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చంద్రశేఖర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉరి వేసుకొని విద్యార్థిని అత్మహత్య
-
చెట్టుకు వేళ్లాడుతున్న మహిళ శవం
బొల్లాపల్లి: గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండలం వెంకటాపురం అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం చెట్టుకు వేళ్లాడుతున్నది. మృతురాలిని దేచవరానికి చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. రెండు నెలల క్రితం ఈమె అదృశ్యం కాగా దీనిపై బొల్లాపల్లి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. కాగా, శ్రీలక్ష్మి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
క్షణికావేశంలో లోకం విడిచింది..
ప్రకాశం, గుడ్లూరు: భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఉరివేసుకొని వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని తెట్టు గ్రామంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన దావులూరి వెంకటేశ్వర్లు అదే జిల్లా ఈపూరు మండలం బొగ్గారం గ్రామానికి చెందిన భూ లక్ష్మీని వివాహం చేసున్నాడు. వారికి 5 సంవత్సరాల కుమార్తె సుస్మిత 2 సంవత్సరాల షణ్ముఖ సాయిలున్నారు. వెంకటేశ్వర్లు నాలుగు సంవత్సరాల నుంచి తెట్టు వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోలు బంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి తెట్టులోనే బాబురావు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల నుంచి వెంకటేశ్వర్లు తరచు మద్యం సేవిస్తూ వస్తుండటంతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి కూడా ఇదే విషయంలో ఇద్దరూ వాగ్వాదం చేసుకున్నారు. తరువాత వెంకటేశ్వర్లు స్నానం చేయడానికి వెళ్లగా భూ లక్ష్మి(28) ఇంట్లో ఉరివేసుకొంది. స్నానపు గదిలో నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు తాడుకు వేళ్లాడుతున్న భూలక్ష్మీని కిందకు దించాడు. అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై వేమన సంఘటనా స్థలంకు చేరుకున్నారు. మృతదేహాన్ని సీఐ నరసింహారావు మంగళవారం పరిశీలించారు. తహసీల్దార్ ఇందిరాదేవి శవ పంచనామా నిర్వహించారు. మృతురాలు తండ్రి వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. -
షాక్.. అక్కాచెల్లెళ్లు ఉరి.. హత్యనా?
సాక్షి, నోయిడా : నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మంగళవారం ఉదయం వేకువ జామున ఈ సంఘటనను కుటుంబ సభ్యులు గుర్తించారు. చనిపోయిన అక్కాచెల్లెళ్లలో ఒకరికి 18 ఏళ్లు కాగా మరొకరికి 13 ఏళ్లు. అయితే, ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నోయిడాలోని సెక్టార్ 49లోగల బరోలా అనే గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. వారు మంగళవారం ఉదయం 4గంటల ప్రాంతంలో నిద్రలేచి చూసిన తల్లిదండ్రులకు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. అయితే, తమకు దూర బంధువు అయిన రవి అనే యువకుడు తమ కూతుర్లను హత్య చేసినట్లు ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. రవికి ఇది వరకే పెళ్లయిందని, అయినప్పటికీ తమ పెద్ద కూతురును ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని, తన తల్లిదండ్రులను తీసుకొచ్చి గొడవ కూడా చేశాడని చెప్పారు. అంతేకాకుండా తాను చెప్పింది వినకుంటే ఇద్దరి కూతుర్లకు డేంజర్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లినట్లు చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం ఇది హత్యా.. లేక ఆత్మహత్యా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం అన్నారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు. -
123 ఏళ్ల జైలుశిక్ష.. అంతలోనే ఆత్మహత్య!
వాషింగ్టన్: పలు కేసుల్లో దోషిగా తేలడంతో ఆ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధించారు. కానీ ఆ మరుసటిరోజే జైళ్లో ఆ నిందితుడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంది. జార్జ్ జాన్సన్(28) అదివరకే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత అక్టోబర్ లో పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకునేందుకు చూడగా మొదట ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి ఆపై ఓ ఆఫీసులో (బర్గర్ కింగ్)కి ప్రవేశించాడు. ముగ్గురు ఉద్యోగులు సహా ఓ ఏడేళ్ల బాలికను తుపాకీతో బెదిరించాడు. ఎంతగానో వేడుకోగా రెండు గంటల తర్వాత ఇద్దరు ఉద్యోగులను వదిలిపెట్టాడు జాన్సన్. దాదాపు ఐదునున్న గంటల పాడు ఓ ఉద్యోగి, బాలిక అతడి నిర్బంధంలోనే ఉండిపోయారు. చివరికి ఎలాగోలా పోలీసులు జాన్సన్ ను అదుపులోకి తీసుకున్నారు. 2016లో ఆటోమేటిక్ హ్యాండ్ గన్ తో కొన్ని గంటలపాటు కాల్పులకు పాల్పడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో దోషిగా తేల్చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే కొన్ని రోజుల ముందు ఓ యువతిపై అత్యాచారం జరిపిన కేసుకుగానూ జాన్సన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాన్సన్ పై నమోదైన పలు కేసుల్లో దోషిగా తేలడంతో మేజిస్ట్రేట్ నిందితుడికి 123 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. ఆపై కొన్ని గంటల తర్వాత జైలు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. -
ప్రియురాలు లేదని ప్రియుడి ఆత్మహత్య
షాద్‌నగర్: నెల రోజుల క్రితం ప్రియురాలు ఉరివేసుకొని మృతి చెందగా మనస్తాపం తో ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన భావన, ఈశ్వర్ కాలనీకి చెందిన గిరీశ్‌గౌడ్ ప్రేమించుకున్నారు. భావనకు వారి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థం జరిపించారు. దీనికి మనస్తాపం చెందిన ఆమె నెల క్రితం ఉరి వేసుకొని మృతి చెందింది. ఆమె మృతికి గిరీశ్‌గౌడ్ కారణమంటూ భావన బంధువులు అతనితో పాటు అతని బంధువులపై వేధింపుల కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గిరీశ్‌గౌడ్ మనస్తాపానికి గురై యూసుఫ్‌గూడలో సూసైడ్ నోట్ రాసి శుక్రవారం ఉరి వేసుకున్నాడు. బాలికకు బలవంతపు పెళ్లి భర్త చెర నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు అనంతగిరి (వికారాబాద్): బలవంతపు పెళ్లిపై ఓ బాలిక పోరాటం చేసింది. తనకు చదువుకోవాలని ఉందని చెప్పినా వినకుండా పెళ్లి చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. పెళ్లి తర్వాత మూడు రోజుల అనంతరం వారి చెర నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో రాత్రంతా ఓ అడవిలో గడిపింది. ఎట్టకేలకు తెల్లవారుజామున పోలీసులు, చైల్డ్‌లైన్ 1098ను సంప్రదించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక (17)కు తండ్రి లేడు. తల్లిపై బంధువులు ఒత్తిడి చేసి కర్ణాటకలోని చించోలికి చెందిన 40 ఏళ్ల వ్యక్తితో ఈ నెల 11న వివాహం చేశారు. అయితే అతడికి ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. వివాహమయ్యాక ఈ నెల 13న సంగెంలో బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బాలిక ఎవరికీ తెలియకుండా సెల్‌ఫోన్ తీసుకుని గ్రామం నుంచి బయటపడి, ఓ బస్సు పట్టుకుని కల్లూర్‌లో దిగింది. అప్పటికే చీకటవడంతో బంధువులు వస్తారనే భయంతో రాత్రంతా గ్రామ సమీపంలోని అడవిలో గడిపింది. తెల్లవారుజామున చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేయగా.. వారు ఆ అమ్మాయిని అక్కున చేర్చుకున్నారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు పరిగిలోని చైల్డ్ హోంకు తరలించారు. -
హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని మౌంట్‌ఫోర్ట్ హైస్కూలు విద్యార్థి చరణ్‌రెడ్డి అనుమానాస్పదమృతి మిస్టరీ వీడక ముందే తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జిల్లాలోని సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ లోనే వెంకటేశ్వరి బలన్మరణానికి పాల్పడిందని, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ విద్యార్థిని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున కడప పట్టణ శివార్లలోని మౌంట్‌ఫోర్ట్ స్కూలు హాస్టల్లోనే చరణ్‌రెడ్డి అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ధరించిన టైతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నప్పటికీ, విద్యార్థి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. -
కూర్చొని ఉరి వేసుకోవడం సాధ్యమేనా?
సరిగా ఆలోచించే వయసు కూడా లేని పసిమొగ్గలు బలవన్మరణాలకు పాల్పడేంత సాహసం చేస్తారా... లేక ఏదైనా కారణాలతో వారిని చిదిమేస్తున్నారా..కారణాలేమైనా ఒక విద్యాజ్యోతి ఆరిపోయింది. దీపం వెలిగించండని తల్లిదండ్రులు పడుతున్న వేదన అరణ్యరోదనగా మారింది. ఒక్క చరణ్రెడ్డే కాదు..గతంలో జిల్లాలోని నారాయణ కళాశాలలో ఇద్దరు, ఈ ఏడాది సెప్టెంబరులో మరొకరు ఇలా మైనర్ల శ్వాస గాలిలో కలిసిపోయింది. వీటికి అంతం లేదా? అందరిలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరగకపోవడం కుదిపేస్తోంది. బాధితుల కుటుంబాలను కుంగదీస్తోంది. సాక్షి, కడప/అర్బన్: కడప నగర శివార్లలోని మౌంట్‌ఫోర్ట్ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల చరణ్‌రెడ్డి మరణం అనుమానాలకు తావిచ్చింది. ఆత్మహత్య అంటూ యాజమాన్యం అంటున్నా పరిస్థితులు చూస్తే భిన్నంగా కనిపిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. చిన్నారి ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితులు ఏమున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల మూడోఅంతస్తు వద్ద ఉరి వేసుకున్న తీరు అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ప్రత్యేకంగా టై ఎక్కువ పొడవు కూడా ఉండదు. ఒకవేళ ఉరి వేసుకోవడానికి మెడకు చుట్టుకుంటే కడ్డీలకు ముడివేయాలన్నా సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. నిలబడి కాకుండా కూర్చొని ఆత్మహత్యలో భాగంగా ఉరి వేసుకున్నట్లు అక్కడి వారు చెబుతుండడం చూస్తే చిత్రంగా ఉంది. నిలబడి కాళ్లు కింద తగలకుండా ఉరి వేసుకున్న సంఘటనలు చూసి ఉంటారు. కానీ కూర్చొని ఉరి వేసుకున్నట్లు చెబుతున్న దానిపై పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేశారు. ఏదిఏమైనా వ్యవహారమంతా అనుమానాల పరంగానే సాగుతోంది. వరుస ఘటనలు వైఎస్సార్‌జిల్లాలో వరుసగా ఘటనలు జరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కృష్ణాపురం సమీపంలోని నారాయణ కళాశాలలో 2015లో మనీషా, నందినిలో ఒకే గదిలో ఫ్యాన్లకు చున్నీలతో ఉరి వేసుకున్న ఘటన మరువకమునుపే 2017 సెప్టెంబరులో పావని అనుమానాస్పదంగా అదే క్యాంపస్‌లో మృతి చెందారు. అంతలోనే మళ్లీ మంగళవారం మౌంట్‌ఫోర్ట్ పాఠశాల ఆవరణంలో విద్యార్థి చరణ్‌రెడ్డి చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇలా వరుస ఘటనలను పరిశీలిస్తే అసలు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. యాజమాన్యాల నిర్లక్ష్యమా...లేక వేధింపులా....లేక ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా? అన్నది బయటికి రావడం లేదు. విద్యార్థి దశలోనే.... చలాకీగా చదువుకుంటూ ఉత్తేజంగా, ఉల్లాసంగా వాలీబాల్ ఆడుకుంటూ విద్యను అభ్యసిస్తున్న చరణ్‌రెడ్డికి విద్యార్థి దశలోనే నిండు నూరేళ్లు నిండినట్లయింది. జిల్లాలోని బద్వేలు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన జోసెఫ్ కొండారెడ్డి, సుష్మల రెండవ కుమారుడైన కంభం చరణ్‌రెడ్డి (14) కడప నగర శివార్లలోని మౌంట్‌ఫోర్ట్ ఇంగ్లిషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే చింతకొమ్మదిన్నె మండలం విశ్వనాథపురంలో ఉన్న అమ్మమ్మ నిర్మలమ్మ ఇంటికి గత శనివారం వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చాడని, అయితే అనుమతి లేకుండా మరలా బయటికి వెళ్లి మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పాఠశాలకు వచ్చాడు. ఈ నేపథ్యంలో హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల సమక్షంలో చరణ్‌రెడ్డిని మందలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ పుటేజీలో కొంతమాత్రమే రికార్డు చరణ్ అందరు విద్యార్థుల్లాగే రాత్రి వేళ భోజనం ముగిసిన తర్వాత స్టడీ అవర్‌కు హాజరయ్యాడు. అనంతరం సహచర విద్యార్థులతోపాటు నిద్రించాడు. తరువాత మూడవ అంతస్తులోని మెట్ల క్యారిడార్లో తన టైతోనే ఉరేసుకుని అలాగే కూర్చొని ఉన్నట్లు చూసిన విద్యార్థులు యాజమాన్యానికి తెలిపారు. అయితే చరణ్ అర్దరాత్రి ఒంటి గంట 3 నిమిషాల ప్రాంతంలో టై తీసుకుని వెళుతున్న దృశ్యాలు మాత్రం రికార్డు అయ్యాయని పోలీసులు మీడియాకు తెలియజేశారు. తర్వాత ఏం జరిగిందన్నది కెమెరాలో లేకపోవడంతో వ్యవహారం బయట పడలేదు. సంఘటన ప్రాంతంలో సహచర విద్యార్థులు చరణ్నుచూసి వార్డెన్‌కు సమాచారం ఇచ్చే వరకు పైన ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మెడ ఎడమవైపు కుమిలిన గాయం చరణ్‌రెడ్డి టైతోనే తనంతకు తానుగా ఉరి వేసుకుని మరణించాడా? లేక వేరే ఎవరైనా వచ్చి ఈ చర్యలకు పాల్పడ్డారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మృతదేహం పరిశీలిస్తే మెడ ఎడమవైపు కమలిన గాయం ఉంది. కానీ నాలుక బయటికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. పోలీసులు కూడా జోసెఫ్ కొండారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో చరణ్‌రెడ్డి మృతి చెందాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ చర్యకు పాల్పడ్డాడా? లేదంటే ఎవరైనా అతన్ని హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. జన్మదిన వేడుకలు జరుపుకుని పది రోజులు కాకముందే తన కుమారుడు చరణ్‌రెడ్డి ఈనెల 3వ తేదీన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడని, ఆ సమయంలో రూ. 3 వేలు విలువైన డ్రస్‌ను కూడా కొనిచ్చానని, ఎంతో ఆనందంగా గడిపాడని తండ్రి జోసెఫ్ కొండారెడ్డి ఆవేదనతో మీడియాకు తెలిపారు. ఔటింగ్ పంపేటపుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనే కనీస బాధ్యతను కూడా పాటించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహారించారని కొండారెడ్డి ఆరోపించారు. తమ కుమారుడు ఎలా మృతి చెందాడనే విషయం స్పష్టంగా తెలియడం లేదని, పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులైన వారిని శిక్షించాలని కొండారెడ్డి తెలియజేశారు. నా తప్పులేదు : ప్రిన్సిపల్ మౌంట్‌ఫోర్ట్ పాఠశాలలో చరణ్‌రెడ్డి మృతికి సంబంధించి తన తప్పు ఎంతమాత్రం లేదని.... పిల్లలను రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్దేనని ప్రిన్సిపల్ జోసెఫ్ తెలిపారు. అందుకు సంబంధించి కడప డీఎస్పీ కార్యాలయం వద్ద మీడియాకు వివరణ ఇచ్చారు. చరణ్‌తో పాటు అందరు విద్యార్థులు వార్డెన్ పర్యవేక్షణలోనే ఉంటారన్నారు.. గతంలో జరిగిన సంఘటనల గురించి వివరణ కోరగా తనకు సంబంధించినత వరకు ఎలాంటి తప్పిదం లేదని వెల్లడించారు. బందోబస్తుతో పోలీసుల హడావుడి చరణ్‌రెడ్డి మృతి సంఘటన తెలియగానే వివిధ ప్రదేశాల్లో కడప డీఎస్పీ షేక్ మాసుంబాష ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వర్తించారు. మౌంట్‌ఫోర్ట్ స్కూలు, రిమ్స్ మార్చురీ, విద్యార్థి ఇంటి వద్ద పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా హడావుడి చేశారు. ఈ బందోబస్తు విధుల్లో సీఐలు టీవీ సత్యనారాయణ, భాస్కర్‌రెడ్డి, పురుషోత్తంరాజు, హేమసుందర్రావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పాఠశాల, కళాశాల స్థాయిల్లో వరుస సంఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మేల్కొని తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిల్ల వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. -
ఊరి మీద ఉరితాడు
ఏవో మాటలు ఇనబడుతున్నై.. సమజయిత లేవు..నల్లంగ కమ్ముకున్న మబ్బులు.. వాటిలోంచి మెరుపు లెక్క జారుతున్నది.. ఊరి మీదికి.. ఏందది..! సరిగ్గ కనిపిస్తలేదేంది.. తాడా.. మెలిక తిరిగి ఉందేంది.. బంగారు రంగులమెరుస్తున్నదేంది..? ఊరిమీదికి జారుతూ మెరుస్తున్నది..! కండ్ల్ల మీద జిగేల్ మంటుండేసరికి కండ్లు తెరిషిన.. ‘‘కళమ్మ ఉరి బెట్టుకున్నదంట!’’ ఊరంత పాకింది ఆ మాట! ‘‘గదేందే, గా పిల్లెందుకు ఉరి బెట్టుకుంటదే..!’’ ‘‘గదే, నమ్మబుద్దయితలేదవ్వా..!’’ ‘‘యాడ్నంట..?’’ ‘‘ఎవరు సూషిన్రంట?’’ ‘‘అయ్యో! ఇద్దరు శిన్న పిల్లలు గదనె!’’ నిండుగ దుప్పటి కప్పుకొని పండుకున్న నాకు మా ఇంటి సుట్టుపక్కలిండ్ల్లల్ల నుంచి ఇన్పిస్తున్నయా మాటలు. దబదబ లుంగి సుట్టుకొని బైటికొచ్చిన. ‘‘అమ్మీ! కోన్కతె? ఘర్‌కే బాజువాలీ కళమ్మా?’’ బయట మా అమ్మను అడుగుతుండు మా తమ్ముడు. అమ్మ గిన్నెలన్ని ముందలేసుకొని తోముకుంట కూసున్నది. ‘‘హౌ కతె! తెల్లారగట్ల నాలుగింటికె గోంగూర పీకి మూట కట్టుకొని సైకిల్ మీద యేస్కొని నల్గొండ పొయిందంట.. పెద్ద గుడియారం కాడ యేసి వచ్చి పిల్లల్ని తయారు చేసి స్కూల్‌కు పంపిందంట.. ఎన్నడు లేంది స్కూల్‌కు పొయ్యే ముందు పిల్లలిద్దర్కి ముద్దులు పెట్టిందంట.. వాళ్లు పోతుంటె నిలబడి సూస్కుంట కండ్లనిండ నీళ్లు తెచ్చుకున్నదంట.. తర్వాత బాయి కాడికి పోయి కొట్టంల ఉరేసుకుందంట! ...’’ మా అమ్మ చెప్పుకుపోతున్నది. ‘‘అయ్యొయ్యో!’’ నా మనసు గులిబిలైంది. ‘‘ఇప్పుడు యాడున్నదంట అమ్మీ?’’ అడిగిన ఆత్రంగ. ‘‘దవాఖానకు ఏస్కపొయిన్రంట.. సచ్చిపొయిందని జెప్పి పోస్టుమాటమ్ రూం కాడ ఏసిన్రంట!’’ మా పక్కిల్లే కళమ్మది. మస్తు షాకింగా ఉంది నాకు. కళమ్మ ఉరేసుకోడమేందో సమజైతలె..మా అమ్మను, మరదల్ను, మా ఆమెను గోడ మీంచే పల్కరిస్తుండె. దబదబ గేటు దిక్కు నడిషి గేటు తీస్కొని గల్లీల కొచ్చి సూషిన. కళమ్మ ఇంటి ముంగల షానామంది గుమిగూడి ఉన్నరు. పొయి, ‘‘కళమ్మ ఉరేసుకోవడం ఏంద్రా!? ఎందుకటా? ఏమన్న తెలిసిందా?’’ అనడిగిన గుంపులోకి, పోరగాల్ల దిక్కు సూస్కుంట.‘‘మొగడు బాగ తాగుతుండె గదా.. రాత్రి గడ్బడైందంట. కొట్టిండంట. మరింకేం జరిగిందొ ఏమో..’’ ‘‘ఇద్దరు చిన్న పిల్లలున్నరు గదరా.. అట్లెట్ల ఉరి బెట్టుకుంటది! ఆళ్లనెవరు సూస్తరు?!’’‘‘అదే సమజైతలేదన్నా.. షానా ధెర్యముండేదా పిల్లకు. గట్లెట్ల సావాలన్పించిందొ.. పానమెట్ల దరిచ్చిందొ.. గా శిన్న పిల్లల్ని తల్లి లేని పిల్లల్ని జేసి పాయె..’’ కళమ్మ ఇంటి గేటు దగ్గరికేసి ఉంది. ఆళ్లోళ్లంత దవాఖాన కాడనె ఉన్నరంట. గేటు తోసుకొని ఇంట్లకు బొయినం. బైటికి తలుపులున్న రెండే అర్రలు. సాయమాను. అర్రకు తాళమేసి ఉంది. గిన్నెలు గవాషి కాడ ఏషి ఉన్నై. అంటె చీకటి మొకాన గుడ సావాలని అనుకున్నట్లు లేదు.పనులన్ని జేసుకుంది. వంట జేసింది. పిల్లల్ని తయారు చేసింది. బడికి పంపింది. ఆ యెంబడె బాయి కాడికి పోయి గీ పని ఎట్ల చేసింది? సమజ్ కాలె మాలో ఎవరికి. ‘‘మొన్నటిదాంక అత్త మామలు ఒక అర్రల, మొగడు పెళ్లాలు పిల్లలు ఇంకొక అర్రల ఉండేది.. గీ మద్యల్నె ఫుల్లు గడ్బడైంది. అత్తమామలు పక్క గల్లీల యేరే ఇల్లు కిరాయ్కి తీస్కొని పొయిరి.’’‘‘ఎన్నేండ్లుంటై రా కళమ్మకు?’’‘‘25 గుడ ఉండవురా!’’ ‘‘అంత వుషారు పిల్ల అట్లెట్ల ఆత్మహత్య చేసుకున్నదిరా?’’ఎవ్వరికి మింగుడుబడ్త లేదా సంగతి. గల్లీల కొచ్చినం. వస్తోల్లు పోతోల్లందరి నోళ్ల్లల్ల ఇదే ముచ్చెట. కొందరు ఊర్లె తాగుడు గురించి ఎవర్నొ తిడుతున్నరు..తాగుడుకు మూలమెక్కడుందో తెల్వక ఎవర్ని తిట్టాల్నొ సమజ్గాక ఎవర్నొ ఒకర్ని తిడుతున్నట్లు అనిపించింది నాకు.‘‘ఏందల్లుడా గీ అన్యాలం’’ అనుకుంట వచ్చి నిలబడ్డది బద్రమ్మత్త.‘‘కళమ్మ ఎందుకు ఉరేసుకుందంట, జర చెప్పవత్తా?’’ అనడిగిన, ఆమెకైతె అమ్మలక్కల ముచ్చెట్లల్ల నుంచి అసలు విషయం తెలుస్తదని!‘‘గదే అర్తమైతలేదయ్యా.. గా పిల్ల ఎంత గట్టిదొ నీకు తెల్సుగా.. ఎవలన్న కొట్లాటకొస్తే ఎట్ల గయ్యిమనేది.. నల్గుర్నైన ఒక్కతె మాటల్తోనె అర్సుకునే మాసరు. మొగడు సరిగ పట్టించుకోకున్న ఎవుసాయం పనులు తనే చూసుకుంటుండె.. గసొంటిది, ఉరి బెట్టుకున్నదంటె నమ్మబుద్దే అయితలేదయ్యా..’’ అని గొంతు తగ్గించి అన్నది – ‘‘ఏ.. మొగడు బాగాదాగి అప్పులు జేస్తున్నడంట అల్లుడా! గా మజ్జెల్నె ఈ పిల్ల అన్ని తీర్షిందంట. మల్ల అప్పు జేసిండని నిన్న తెల్సిందట. దాంతోటి రాత్రి గడ్బడైంది. ఆడు తాగి ఉన్నాలె.. బాగ కొట్టిండంట.. దాంతోటి ఇగ మనసుకు ఏమనుకున్నదొ బిడ్డ.. గియ్యాల గీ పని జేసింది..’’‘‘ఔనా..! నీతోని ఎన్నడన్న ఏమన్న జెప్పుకున్నదా అత్తా..’’ అన్న. ‘‘రెండుమూడుసార్లు అన్నదయ్య.. ‘ఏ.. యాష్టకొస్తున్నది పెద్దమ్మా.. ఒక్కదాన్ని ఎంతకని అన్ని మలుపుకు రావాలె శెప్పు.. ఒక్కోపాలి నాతోని అయితలేదే’ అని ఒకపాలి గుడ్లనీల్లు పెట్టుకున్నదయ్యా! అయన్నీ ఇప్పుడు ఓలకన్న జెప్తె ఏం బాగుంటది.. పోనీ, ఎవల పాపాన ఆల్లు పోతరు.. బిడ్డెను మాత్రం మింగి కూసున్నరు..’’‘‘అయ్యయ్యో! అయితె అత్తమామలెందుకు వేరే ఇల్లు మారిన్రత్తమ్మా?’’ ‘‘మొగన్ని ఏమననిస్తలేరని ఆల్లతోని గొడవ పెట్టుకుంది. ఆల్లు గుడ మస్తు తాగుతరు అల్లుడా..’’అట్ల ఆమె చెప్తుంటె ఇనుకుంట నిలబడ్డ.. అంతల్నె యాదికొచ్చి ‘‘చేను కాడికి పోవాలయ్య’’ అనుకుంట ఎల్లిపొయింది బద్రమ్మత్త.అంతల కళమ్మ అత్తామామలు, మొగడు, పిల్లలు, ఆడిబిడ్డ, ఆమె మొగడు అందరు ఆటోల వచ్చి దిగిన్రు. అందరు ఆళ్ల సుట్టు మూగిన్రు. మొగడు అక్కడ ఆగకుంట గేటు తోసుకొని ఇంట్లకు పొయిండు. అత్తామామల్ని ఎట్ల ఉరి బెట్టుకున్నదని, పోస్టుమార్టమ్ ఎప్పుడు జేస్తరంట అని తలా ఒక మాట అడుగుతున్నరు. ఆళ్లల్ల బయం జొరబడ్డట్టున్నరు. మాట పెగుల్తలేదు. అత్త ఏడుపందుకుంది. నేను సోంచాయించుకుంట ఇంట్లకొచ్చిన. కొద్దిసేపు అట్లనె కుర్సీల కూలబడ్డ. కళమ్మ మొఖమే మెదులుతున్నది కండ్లల్ల. అసలు ఉరిబెట్టుకోవాలంటె ఎంత దైర్యం గావాలె! అంత పని చేసిందంటె మొగనితోటి ఎంతగనం ఇసిగిపోయి ఉంటదో!‘‘అద్దరాతిరి సన్నగ ఏడ్పు ఇనిపిస్తుండె రా.. ఆల్లు గొడవ పెట్టుకొనుడు ఆడు కొట్టుడు మామూలె గదా.. దెబ్బలేమన్న ఊటగ తాకినయేమొ అనుకున్న గని మనసుకి అంతగనం కష్టమనిపించి ఏడ్సిందనుకోలేదు రా..’’ అని మా అమ్మ అంటుంటె మరింత శితికిపొయిన.లేషి మొఖం కడుక్కుంటున్న. అంతల గల్లీల ఏందో కలకలం లేషింది. అందరు అటుదిక్కు ఉర్కుతుండడం మా గేట్ల నుంచి కనబడుతున్నది. నేను గుడ జగ్గు ఆడ పడేసి పొయిన.పోలీస్ జీప్ వచ్చి నిలబడి ఉంది. పోలీసోల్లు కళమ్మ ఇంట్లకు పొయిన్రు. కళమ్మ అత్తమామల్ని, ఆడిబిడ్డను, ఆమె మొగన్ని గుడ బెటికి తోలుకొచ్చి జీపుల కూసొబెట్టిన్రు. అంతల్నె ఆడికి ఊరి పెద్దమనిషి ఒకాయన మోటర్ సైకిల్ మీద వచ్చిండు. పోలీసోల్లతోటి ఏందో మాట్లాడబొయిండు. ఆల్లు ఇనకుంట ‘‘స్టేషన్‌కు రండి’’ అనుకుంట జీపెక్కిన్రు. జీప్ రయ్‌న ఎల్లిపొయింది. బండి మలుపుకొని ఎల్ల్లబోతున్న ఆ పెద్దమనిషి దగ్గరికి నడిషి ‘‘ఏం జరిగిందే..?’’ అనడిగిన.‘‘కళమ్మ అన్న ఈళ్లందరి మీద కేసు పెట్టిండంట. కేసు బెడితె అయితదా.. జరగాల్సింది సూడాలె గని’’ అనుకుంట ఎల్లిపొయిండాయన. ఎలమంచమ్మ ఒచ్చి మా అమ్మతోటి మాట్లాడుకుంట నిలబడ్డది– ‘‘ఊర్లె తాగుడు బందయితలేదాయే! తాగి తాగి సస్తుండె మగపోరగాల్లు.. ఎవలూ పట్టించుకుంటనె లేరాయే.. ఆ తాగుడుతోటె ఇయాల గీ పిల్ల గిట్ల జేసుకునె’’ అంటున్నది. మా అమ్మ, ఆమె మాట్లాడుకుంటున్నరు. తాగి సావడాలు, ఆత్మహత్యల ముచ్చెట్లు బెట్టుకుంట ఒచ్చి సాయమాన్ల అరుగు మీద కూసున్నరు ఇద్దరు. నేను ఎదురుంగ కుర్సీల కూసున్న.‘‘ఊర్లె తాగి సచ్చినోల్లు ఎంతమందుంటరు?’’ అన్న ఇద్దరి దిక్కు సూస్కుంట.. పొద్దున్లేస్తె నల్గొండల పడి మల్ల రాత్రికి ఇల్లు చేరుడైపొయ్యింది నా నౌకరీ వల్ల. అందుకనె ఈ మజ్జె ఊర్లె సంగతులు తెలుస్తలెవ్ నాకు.‘‘ఓ సగం ఊరయ్య..! బజారుకో నలుగురెల్తరు. ఒక్కోన్ది ఒక్కో కతేనాయె. ఆల్లు బాగనె సచ్చిన్రు. ఆళ్ల పెళ్లాలదే గోస. పిల్లల్ని సాదుకుంటానికి నానా శర పడ్తున్నరుగ. తాగుడు మీద మన్నుబొయ్య. ఆ తాగుడు షానామందిని మింగె..! అంతెందుకు.. మీ బజారె సూడ్రాదూ.. ఆణ్నించి ఈడిదాంక అంత తాగి సచ్చినోల్లేనాయె! బజారు మొదట్ల ఉండేటోడు గదా, గా పిల్లగాడు సురేందర్, ఎంత అందంగుండెటోడు కొడ్కా.. అప్పట్లనె పన్నెండు దాంక సదివె. సదువుకున్నోన్ని గదాని తాళ్లు ఎక్కననె. అదొ ఇదొ పనిచేసుకునేటోడు గదా. సేపు పండ్లసొంటి ఇద్దరు బిడ్డలు. సైకిల్ మీద ముందొకలను, ఎనకొకలను కూసొబెట్టుకొని బడికి తీస్కపొయి ఒదిలొచ్చేటోడా.. ఎట్ల అలవాటయ్యిందొ కొడ్కా, మందుకు మరిగె. కొన్నాల్లకు లీవర్ పాడయ్యిందన్రి. దవాఖానల సుట్టు తిరిగి సుతరాయించుకుండు. కొన్నాళ్లకు మల్ల షురూ జేసిండు.. మల్ల తిరగబెట్టె. ఈసారి లేవకుంట పడె. పానం నెరీ బాలేకుంటాయెనా.. పెళ్లాం దవాఖానకు తీస్కపొయిందంట. నోట్ల నుంచి రక్తం కక్కుకుని దవాఖానల్నె సచ్చిపొయిండట. ఆ పొల్ల చేతిల చిల్లిగువ్వ లేదంట. ఎంట ఎవ్వలూ లేరు. ఆళ్లనీళ్లను బతిలాడిందంటయ్య. ఎవ్వలు పట్టించుకోలె. ఆఖరికి ఏం జెయ్యాల్నొ తోయక, తీస్కపొయిన చద్దరు కప్పి, రెండు కాళ్లు రెండు చేతుల్తోని పట్టుకొని ఆ పెద్ద దవాఖాన లోపట్నుంచి బయటిదాంక ఆగుకుంట ఆగుకుంట గుంజుకొచ్చిందంటయ్యా, చెంపల మీదంగ కన్నీల్లు కారిపోతుండంగ...’’ ఆగింది ఎలమంచమ్మ. మనసులో ఏందో దేవినట్లనిపించింది నాకు.. గుర్తొచ్చి అన్న –‘‘అవునవ్వా! నాకు బాగ యాదికుంది, రెండోరోజు ఎవరొ పసిపిల్ల అడిగిందంట– ‘రోజు వాళ్ల నాయన సైకిల్ మీద బడికి తీస్కొచ్చి దింపి ముద్దులు పెట్టి పొయ్యేటోడు గదా.. మరి ఇప్పుడెవలు తీస్కొస్తరాల్లను?’ అని!’’ అట్లట్ల పొద్దుగూకింది. నేను గల్లీల నిలబడి ఉన్న. నర్సింహ్మారావు భార్య జ్యోతి వచ్చింది. మా చెల్లెకు ఆమెకు మంచి దోస్తానా. చెల్లె ఒచ్చిందని తెలిసి ఒచ్చిందామె.‘‘బాగున్నరా..?’’ అడిగిన. ‘ఆ!.. మీరు బాగున్నరా?’’ అన్నదామె. ‘‘మేం నిమ్మలమే.. మీ పిల్లలు ఎట్లున్నరు?’’ అన్న. ‘‘మంచిగునె ఉన్నరయ్య’’ అనుకుంట ఇంట్లకు పొయింది. మనసు నిండ నర్సింహ్మారావు కమ్ముకుండు నన్ను.నర్సింహ్మారావు ఊర్లె కమ్యూనిస్టు రాజకీయం మొదలుపెట్టినోడు. మా తెలివైన నాయకుడుండె. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటె ఉండె ఊర్లె. నర్సింహ్మారావు నలుగుర్ని పోగేసుకున్నడు. ఎన్నో గొడవలు, కొట్లాటలైన గుడ ఎదురు నిలబడ్డడు. రెండుసార్లు సర్పంచ్‌కు పోటీచేసిండు. ఒకపాలి 5 ఓట్లుతోని, ఇంకోపాలి 11 ఓట్ల్లతోనె ఓడిపొయిండు. కని షానా దైర్నంతోటి ఉండేటోడు. ఉన్న ఒక్క ఆదారం ఎవసాయం నడవకుంటైంది. ఎటు తోచక ఊర్లె హోటల్ కాడ వచ్చి ముచ్చట బెట్టుకుంట కూసునేటోడు.. ఆ హోటల్ల మందు అమ్మేది. ఈన ఒక పార్టీ పెద్దమనిషాయె. తాగుతానికి వొచ్చినోల్లు రారమ్మంటె ఒకటి, రెండు పెగ్గులేసుకునుడు çషురూ జేసిండు. పంచాయితీలు జేసేకాడ గుడ మందు పోయించుడు మామూలె. మొత్తానికి చూస్తుండంగనె మందుకలవాటైండు. రోజు పొద్దున్లేషిన సందే తాగెటోడు. లివర్ పాడైపొయింది. దవాఖానాల చేరిండు. మందు తాగొద్దన్నరు డాక్టర్లు.ఇంట్ల మంచంలో పండుకొని ఇంటిని తేరిపార జూసుకుంట బార్యతోని అన్నడంట– ‘‘ఇల్లంత ఎంతగనం బూజుపట్టిందొ.. ఇంటిని బాగు చేసుకోవాలె.. పిల్లలు, నువ్వు బక్కగైనరు. ఇప్పట్సంది అన్నీ పట్టించుకుంట నిర్మలా.. మల్ల మనం మునుపటి లెక్క కావాలె..!’’ అనుకుంట గుడ్ల్లల్ల నీల్లు కుక్కుకున్నడంట. ఆమె మొగున్ని పట్టుకొని గోడుగోడున ఏడ్షిందంట. ఈళ్లు ఏడుస్తుంటె ముగ్గురు ఆడపిల్లలు గుడ ఈళ్లను సుట్టుకొని లెస్స ఏడ్షిన్రంట.కనీ, తాగుడు అలవాటు మహమ్మారి లాంటిదాయె.. పట్టుకుంటె ఊకుంటదా.. మంచం మీంచి లేషి నడవడం షురూ జెయ్యంగనె చీప్‌లిక్కర్ రారమ్మని పిలిషె.. వదలని దయ్యమాయె.. నర్సింహ్మారావు అట్లా తాగుడు సాలెగూట్లె పడ్డ ఈగలెక్క కొట్టుకొని కొట్టుకొని సచ్చిపొయిండు.. ఆ తల్లీ పిల్లలు దిక్కు లేని పక్షులయ్యిన్రు.. నల్లగా కమ్ముకున్న మబ్బులు.. మబ్బుల మజ్జెల్నుంచి మెరుపు లెక్క ఊరి మీదకు జారుతున్నది తాడు.. జారి ఊరి మీద ఏలాడుతున్నది. ఉట్టి తాడు కాదు, బంగారు రంగు తాడు. ఉరితాడు! చిత్రంగా ఆ ఉరి, మందు సీసా లెక్క మారుతున్నది. బంగారు ఉరితాడు, మందుసీసా రంగు ఒకదాన్ని పోలి ఒకటి పోటీ పడుతున్నై. మందు సీసా ఊరి మీద ఉరితాడు లెక్క ఏలాడుతున్నది!ఊరి మొగోళ్లంతా ఆ సీసాను అందుకుంటానికి ఎగబడుతున్నరు. వాళ్ల బార్యలు ఆళ్లను ఎనక్కు లాగుతున్నరు. బర్తలు బార్యల్ని తోసేస్తున్నరు. తంతున్నరు. సీసా దిక్కు ఉరుకుతున్నరు. ఉరిసీసారాయుడు ఉండి ఉండి వికటాట్టహాసం చేస్తున్నడు. సీసా అందుకున్నవాళ్లు తాగుతూ తూలుతూ కింద పడుతున్నరు.. కింద పడి కొట్టుకుంటున్నరు.. కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నరు. వాళ్ల బార్యలు వాళ్ల మీద పడి ఏడుస్తున్నరు. ఉరిసీసా దిక్కు చేతులు యిసురుకుంట సాపెన్లు పెడుతున్నరు. బూతులు తిడుతున్నరు. ఉన్నట్టుండి వాళ్లల్లోంచి నలుగురు యిసురుగా ముందుకొచ్చి ఉరిసీసారాయుడిని గుంజి కొట్టడం మొదలుపెట్టిన్రు.. ఉరి సీసా మరింత పెద్దగా వికటాట్టహాసం చెయ్యబట్టింది.. ఆ వికృతమైన నవ్వు తెరలు తెరలుగా ఊరంతా కమ్ముకుంటున్నది..ఆ వికృతానికి కళ్లు చెదిరి మెల్లగా మెలకువొచ్చింది నాకు. ఊరంతా నిద్రపోతున్నది! రాత్రి విన్న సంగతి యాదికొచ్చింది– కళమ్మ శవం టౌన్ల పోస్టుమార్టం రూంలనే ఉంది. పోస్టుమార్టం ఇంకా కాలేదు! షానాసేపు నిద్దర పట్టలేదు నాకు. ఊర్లె తాగుడు గురించిన ఆలోచనల్తో మనసంత ఎట్లెట్లనొ అయితున్నది.. ఒశ్శి పోరగాల్లు సుత తాగుడుకు బానిసలైతున్రు. నేను చిన్నగున్నప్పుడు ఊర్లె రోడ్డు మీద కలిసినమంటె ముచ్చెట్లు పెట్టుకొనేది. ఆటలాడేది. డ్రామా లేసేది. ఇప్పుడు పోరగాల్లు కల్సిన్రంటె సిట్టింగేసుడే!పద్మాకర్ యాదికొచ్చిండు. ఒష్షోడు. నాకన్న చిన్నోడు. అన్నా అన్నా అనేటోడు. ఎంత బలంగ ఉండేటోడొ. వాళ్లమ్మ మణెమ్మ కిరాణం ఊర్లె మషూర్ ఉండె. మణెమ్మ యాక్సిడెంట్ల సచ్చిపాయె. వాళ్లాయన ఇంకో పెండ్లి జేసుకొని కిరాణం నడిపించిండు. కొడుకులిద్దరు పెద్దగై ఏరుబడి పక్కనె రెండు కిరాణం దుకాన్లె పెట్టుకునిరి. పద్మాకర్ ఊకుండక కిరాణం షాపుల చీప్‌లిక్కర్, బీర్లు అమ్మేటోడు. షాపు తర్వాతి రూం తాగేటోల్లకోసం పెట్టిండు. ఆ ఎనక రూంలల్ల ఇల్లు. ఆ షాపుకు వచ్చి తాగేటోల్లల్ల పద్మాకర్ దోస్తులే ఎక్కువ. వాల్లు తాగేటప్పుడల్లా దోస్తు గదా అని గుంజి మరీ కూసొబెట్టి పద్మాకర్‌కు గుడ ఒకటో, రెండో పెగ్గులు పోషేది. ఆ వచ్చి పొయ్యేటోల్లు ఆ రోజుకి తాగేది ఒక్కసారే గాని పద్మాకర్‌కు మాత్రం అట్ల రోజుకు నాలుగు పార్టీలు! అది గుడ ఒక్క రకం మందు కాదాయె. ఒకడు జర మంచి విస్కీ తాగితె ఒకడు చీప్‌లిక్కర్. ఒకడు బీర్ తాగితె ఇంకొకడు ఇంకోటి. ఎప్పుడు తాగుడులనే ఉండి.. సరిగ తినీ తినక కామెర్లు అయినయ్ పద్మాకర్‌కు. వాళ్లావిడ లబోదిబోమని కామెర్ల మందు పోయించి ఇగ ఈ మందు ముట్టనే ముటొద్దని ఒట్టేయించుకుంది. నాలుగు రోజులు ఓపిక పట్టిండు. ఉండబట్టలేక బార్య లేనప్పుడు సాటుంగ తాగుడం షురూ జేసిండు. చెట్టంత మనిషి. బక్క పీన్గె లెక్కయ్యిండు. సూస్తుండంగనె సచ్చిపొయిండు.. మనిషి పొయిండు. అప్పులు మిగిలినయ్. రాత అనుకొని ఆ దుక్నమే నడుపుకుంట, ఇద్దరు కొడుకుల్ని సదివించుకుంట బతుకు ఎల్లదీస్తున్నది పద్మాకర్ బార్య.ఆళ్ల బార్య కనబడ్డప్పుడల్లా పద్మాకర్ యాదికొచ్చి మనసు చివుక్కుమంటది. తెల్లారింది. లేషి చూస్తె బయట శంకరమ్మ బట్టలుతుకుతున్నది. ‘‘బట్టలుతకడానికి ఈ రోజుల్ల బాగనే దొరికింది గదా!’’ అంటున్నది మా చెల్లె నాకై సూస్కుంట. చెల్లె హైద్రాబాదుల ఉంటది. అంతకు ముందు రోజె ఒచ్చి ఉండె.‘‘ఆ.. ఆళ్లాయన తాగి తాగి సచ్చిండు.. ఇద్దరు పిల్లలు! ఎట్ల సాదుకోవాలె.. ఏం దినాలె..? నాలుగిండ్ల్లల్ల బట్టలుతుక్కుంట బతుకుతున్నది’’ అన్నది అమ్మ. ‘‘ఓరి నాయనో!’’ అనుకున్న.‘‘కళమ్మ సంగతేందంట?’’ అన్న మల్ల అమ్మతోటి.‘‘అటు ఆళ్లుండి, ఇటు ఈళ్లుండి గుడ దిక్కులేని శవం లెక్క పడి ఉన్నదంట! ఇసొంటి ఇచ్చిత్రం నా జిందగీల సూడలేదు, ఇనలేదు రా’’ అన్నది అమ్మ.ఇగ ఉండలేక జల్ది జల్ది మొఖం కడుక్కొని రోడ్డు దిక్కు పోయిన.హోటల్ కాడ కొందరు దోస్తులు, ఒకరిద్దరు పెద్ద మనుషులు, సర్పంచు గుమిగూడి మాట్లాడుకుంటున్నరు–‘‘ఇంట్ల ఉన్న అందరి మీద కేసు బెడితె మరి శవాన్ని ఎవడు తేవాలె? ఎవడు సావు జెయ్యాలె?’’ రోషంగా అంటున్నడు సైదులు.‘‘మరి అన్న తీస్కపోతడేమో వాళ్ల ఊరికి’’ వెంకటేశం.‘‘అట్లెట్ల?! ఈ ఊరికిచ్చినంక సావు ఈడ్నె జేస్తరు. వాళ్ల ఊర్లె చెయ్యరు’’ లింగయ్య.‘‘మరెట్ల ఐతది.. అసలు పోస్టుమార్టం ఐతానికి సంతకమే చెయ్యలేదంట ఆ పిల్ల అన్న!’’ గోపాల్.‘‘సూస్కుంట ఊకుంటె ఎట్ల.. ఏదొ ఒకటి జెయ్యాలె గదా..’’ –తలా ఒక మాట అంటున్నరు.అంతల యాదయ్య, ‘‘అది సరెగనీ, సర్పంచ్ సాబ్! ఊర్లె ఇంతగనం తాగి సస్తుంటిరి.. ఒక కట్టడి లేదు.. ఒక పట్టింపు లేదు.. వైన్స్ షాపులు, బెల్టు షాపులు ఇంకా పెంచుతుంటిరి. ఊర్లె షాపుల్ల గుడ మందు ఫుల్లుగ దొర్కుతుండె.. పనులు లెవ్వంటె సాలు, తాగుడే.. ఒశ్శి పోరగాల్లు సుత పదిమంది దాక తాగుడుతోని పెండ్లిల్లు గుడ కాకుంటయితిరి. ఆల్లల్ల ఒకడు మొన్న పురుగుల మందు తాగి సచ్చె. ఇగ గింతేనా మన ఊరి గతి?!’’‘‘ఎహె, ఎవరింటరల్లా.. సర్పంచ్ సాబే పొద్దుగూకితె వైన్స్ షాపు ఎనకాల జేరుతుండె..’’ అన్నరెవరో..గొల్లుమన్నరంతా.‘‘అరె ఊకోరా, అది కాదు గనీ.. జర మీ సర్కారుకు జెప్పాలె సర్పంచ్ సాబ్.. ఊర్లు గింట్ల తాగి సచ్చినోల్లతోని పడావు పడుతున్నయని..’’‘ఆ!.. పిల్లి మెడకు గంటెవడు కడ్తడె..!’’ పొద్దు గూకుతున్నది. కళమ్మ ఇంటి ముందల గోల అయితున్నది. అక్కడికి పోయి ఒక పక్కన నిలబడ్డ. మొత్తానికి పోస్టుమార్టం జరిగిందట. శవం అక్కడే పడి ఉంది. కేసు వెనక్కి తీసుకుంటానికి కళమ్మ వాళ్ల అన్న హర్గిస్ ఒప్పుకోలేదంట.ఊరి పెద్ద మనుషులు, కళమ్మ కులపోల్లు కూడిన్రు.‘‘కళమ్మ అన్నను పిలవాల్సుండె..’’ ఎవలో అన్నరు.‘‘ఆడేడున్నడె.. తలా ఒక మాట అనేసరికి ఏడ్సుకుంట, ‘పానం పోయినా ఆళ్ల మీద కేసు ఎనక్కు తీస్కోను. నా చెల్లెను అరిగోస పెట్టి సంపిన్రు. లేకుంటె నా చెల్లె ఉరి పెట్టుకునే మాసరుదా?! నా చెల్లెనే సచ్చిపాయె. ఇగ మీ సావు మీరు సావురి’ అనుకుంట ఎల్లిపొయిండు. ఆన్తోని ఆళ్లమ్మ గుడ సాపెన్లు పెట్టుకుంట ఎల్లిపొయ్యింది’’ అన్నడొక పెద్ద మనిషి.‘‘అరే.. గిదేం ముచ్చటల్లా.. ఆల్ల ఊరికి పొయ్యి పిల్సుకు రారి ఎవలన్నా..’’ అన్నదొక ముసలవ్వ.‘‘ఎవడు పోతడవ్వా.. ఆ ఊరికి ఎవడన్న కళమ్మ ముచ్చెట్ల పోతె తన్నేటట్లున్నరంట. అంత రోషం మీదున్నరంట అందరు..’’‘‘మరి పిల్లల్నెవలు సూడాలె!’’ ‘‘ఆళ్ల సంగతి ఐటెంక.. ముందుగాల సావు కానియ్యాలె గదనె!’’ షానాసేపు తలా ఒక మాట మాట్లాడిన్రు. తలా ఒక సలహా ఇచ్చిన్రు. ఎవరికీ ఎటూ సమజైతలేదు. అంతల్నె లచ్చయ్య బార్య వచ్చి నిలబడ్డది నా పక్కన. కళ తప్పిన మొఖం. లచ్చయ్య యాదికొచ్చిండు– ఊర్లె ప్రైవేటు హెల్పర్‌గా పనిచేసేది లచ్చయ్య. ఎవరింట్ల, ఎవల బాయికాడ ఏ కరెంటు పొయినా బాగు చేసేటోడు. ఆల్లు కోటర్ చీప్‌లిక్కర్ బాటిల్ చేతికన్న ఇచ్చేది, లేదంటె రోడ్డు మీదున్న దుక్నం ఎనక కూసొబెట్టన్న పోయించేది. కరెంటు పని చెయ్యడం మొదలు పెట్టినప్పట్సందె తాగుడు షురువైందిలచ్చయ్యకు. కొన్నేండ్ల్లల్లనే బానిసైపాయె. పొద్దున్లేషినప్పట్సంది తాగుడే.. మెల్ల మెల్లంగ కరెంటు పోల్లు ఎక్కడం చాతగాకుంటయ్యింది. ఆఖరికి మంచంల పడి నవిశి నవిశి సచ్చిపాయె... ‘‘ఏమంటవే నాగయ్య కక్కయ్యా!’’ అని సర్పంచ్ జర గట్టిగ అంటుండెసరికి నేను తేరుకున్న. నాగయ్య కళమ్మ కుల పెద్దమనిషి.‘‘ఆళ్ల పాలోళ్లందర్ని అర్సుకున్న.. ఎవరు ముందుకొస్తలేరు. సావుకు ఎటు లేదన్నా పది వేలు దాటుతయ్. ఎవల కాడ పైస లేదంటున్నరు. సూడు సూడుమని నా శేతిల గుడ పైస లేదు. ఏం జేద్దమో మీరే చెప్పురి..’’ ‘‘ఏం జేద్దామే పుల్లయ్య తాతా?’’ అన్నడు సర్పంచు, ఊర్లె వయసుల అనుభవంల పెద్దమనిషైన పుల్లయ్య తాత దిక్కు సూస్కుంట.తాగుతున్న సుట్టను నోట్లె నుంచి తీసి అన్నడు పుల్లయ్య తాత – ‘‘ఆడేమో గట్ల కేసు పెట్టి పాయె.. కులపోల్లేమో ఎవలు ముందుకొస్తలేరైతిరి.. ఏందిర ఈ కత.. రెండ్రోజుల సంది ఊరి పీన్గె ఆడ పడి ఉంటె ఒక్కలికి గుడ పట్టి లేకుంటె ఎట్లరా.. ఊరు ముండమోసినాదిర..?!’’అందరి తలలు నేలకు పడ్డయి..! అంతల–‘‘ఔ.. సగం ఊరు ముండమోసే ఉండె. తాగి తాగి సచ్చినోళ్ల పెండ్లాల ఉసురు తగులదా ఊరికి.. ఊరికే గాదు. సర్కారుకు గుడ తగుల్తది. సర్కారుకు గిదొక్కటే ఆదాయమైనాది, పీన్గల మీద పైసలేర్కోడం..! ఎహె.. సావు మీరే చెయ్రల్లా..! ఒక్కో తాగుబోతోని పెల్లాం ఉరి బెట్టుకుంటుంటది.. ఆళ్లందరి సావులు గుడ మీరే చెయ్యిరశె..! అయినగనీ, అందరు తాగేటోల్లు సచ్చి పెండ్లాలు ముండమోస్తుంటె.. ఈ పొల్లేమో ఆడు బతికుండంగనె ఇది ఉరిబెట్టుకున్నది. దాని సావు సూశన్నా శరం రావాలె మనూరోల్లకు అనుకున్నదేమొ.. గని యాడొస్తది, అందరు సిగ్గు దప్పినోల్లేనైతిరి.. థూ..!’ అనుకుంట కాండ్రించి తుపుక్కున ఊంచి లేషెల్లిపొయ్యింది ఎలమంచమ్మ.షానాసేపు ఎవ్వల నోట మాట రాలె! - స్కైబాబ -
‘ఉరి’శిక్షపై స్పందించండి: సుప్రీం
న్యూఢిల్లీ: మెడకు ఉరి బిగించడం ద్వారా మరణ దండన విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందనను తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ రిషీ మల్హోత్రా వాదిస్తూ.. ‘రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందనీ, ఇది ఖైదీలకు సైతం వర్తిస్తుంద’ని కోర్టుకు విన్నవించారు. ఖైదీలు గౌరవప్రదంగా, తక్కువ బాధతో చనిపోయేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉరి బిగించడం ద్వారా కాకుండా విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడం, తుపాకీతో కాల్చటం, కరెంట్ చైర్, గ్యాస్ ఛాంబర్లో బంధించడం వంటి ఇతర మార్గాలను పరిశీలించవచ్చని వెల్లడించారు. పిటిషనర్ వాదనలు విన్న సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. మూడు వారాల్లోగా స్పందనను తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది. -
కట్న దాహానికి మరో మహిళ బలి
బంటుమిల్లి (పెడన) : స్థానిక పెదతుమ్మిడిలో ఒక మహిళ బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని మృతిచెందింది. పోలీసుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన తలారి వాసుకోటేశ్వరరావు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా మండవల్లి మండలం కానుకొల్లు గ్రామం వెళ్లాడు. అక్కడ ఆ గ్రామానికి చెందిన పరసా సీతతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి ఆరేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. కొద్దిరోజులుగా దంపతులిద్దరి మధ్య కట్నకానుకలపై గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు డ్యూటీ పనిమీద వెళ్లగా, సీత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అత్త, భర్త కుటుంబ సభ్యులు కలిసి కట్నం కోసం కొట్టి చంపారంటూ మృతురాలి పెదనాన్న పరసా నాగేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తల్లి మృతి వార్త తెలియని అభంశుభం తెలియని చిన్నారులిద్దరూ ఆడుకుంటూ ఇంటికి వచ్చిన బంధువులను అమాయకంగా చూడటం చూపరులను కలిచివేసింది. అనుమానాస్పద మృతిగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేయగా, డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తహసీల్దార్ డీవీ శేఖర్, బందరు ఇన్చార్జి డీఎస్పీ ఎస్కే హుస్సేన్, వీఆర్వో రామకృష్ణ పంచనామాలో పాల్గొన్నారు. -
దారుణం
♦ రోడ్డు పక్కన పడిన మృతశిశువు ♦ శరీర భాగాలు పీక్కుతిన్న కుక్కలు ♦ ఉరి వేసినట్లుగా మెడలో తాడు అనంతపురం సెంట్రల్: దారుణం జరిగిపోయింది. మాటల కందని విషాదం వెలుగుచూసింది. మూడు రోజుల వయసుగల మృతశిశువు .. ఎవరో కత్తిరించినట్లుగా రెండు చేతులూ భుజాల వరకూ లేవు! ఉరివేసినట్లుగా మెడలో తాడు!! ఏ తల్లి కన్న బిడ్డో తెలీదు కానీ చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి. అనంతపురంలోని జేఎన్టీయూ సమీపంలో మంగళవారం ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటరమణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో రెండు రోజుల క్రితం జేఎన్టీయూ సమీపంలో పడి ఉన్న ఆడ మృతశిశువును స్థానికులు గుర్తించి సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. లోపం ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. పాతిపెట్టిన మృతశిశువును కుక్కలు వెలికి తీశాయి. రెండు చేతులూ పీక్కు తిన్నాయి. అంతటితో ఆగకుండా రోడ్డుపైకి లాక్కొచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు కుక్కలను తరిమేసి, మృతశిశువును తిరిగి ఖననం చేసేందుకు యత్నించారు. అయితే మృత శిశువును చేతుల్లోకి తీసుకోకుండా మెడకు తాడుకట్టి లాక్కెళ్లేందుకు యత్నించారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాçస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా శిశువు రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు తేలిందని, పాతిపెట్టిన మృతశిశువును కుక్కలు వెలికి తీశాయని ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. -
బిడ్డలకు బరువై...బతుకు భారమై...
♦ మనస్థాపంతో ఉరివేసుకుని వృద్ధ దంపతుల బలవన్మరణం ♦ కన్నబిడ్డల ఆదరణ కరువు ♦ క్షీణించిన ఆరోగ్యం ♦ ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ హింసించిన కుమారుడు మీకు తిండిపెట్టడమే దండగ.. రోగాలు సరేసరి.. మీరు ఇంట్లో ఉంటే మాకు అంటుకుంటాయి.. ఎక్కడికైనా వెళ్లిపోండి అంటూ కుమారుడి ఈసడింపులు.. రోగాలతో ఇంట్లోనే పడుంటారా... ఇలా ఎంతకాలం.. ఎక్కడికైనా పోండి.. అంటూ బంధువుల సతాయింపులు.. దాచుకున్న డబ్బులో కొంతైనా ఇచ్చేందుకు కనికరించని పుత్రరత్నం.. ఏమీ చేయలేని నిస్సహాయత.. ఎక్కడికి వెళ్లాలో.. ఎలా బతకాలో తెలియని అయోమయం.. చావే శరణ్యమంటూ నిర్ణయం.. పెళ్లినాడు చేసుకున్న బాసలు గుర్తొచ్చాయో ఏమో.. ఆ దంపతులు ఒకరికొకరు తోడుగా బలవంతంగా ప్రాణాలు తీసుకుని ఈ లోకాన్ని వీడారు.. ఈ విషాదకర ఘటన విజయవాడ కృష్ణలంకలో సోమవారం రాత్రి జరిగింది. కృష్ణలంక (విజయవాడ తూర్పు): నవ మాసాలు మోసి పిల్లల ఆలనాపాలనా చూశారు. ప్రయోజకుల్ని చేశారు. వృద్ధాప్యం మీదపడింది. ఆరోగ్యం క్షీణించింది. పిల్లల ఆదరణా కరువైంది. అప్పటివరకూ చూస్తున్న చిన్నకొడుకు కనికరంలేకుండా పోయాడు. అమ్మానాన్నలను ఇంట్లోంచి పొమ్మన్నాడు. ఎంతోకొంత ఇస్తే వెళ్లిపోతామని వేడుకున్నారు. అయినా కొడుకు మనసు కరగలేదు. ఛీదరింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ వృద్ధ దంపతులు మనస్సు చంపుకుని తనువు చాలించారు. అందరినీ కదిలించే ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పాత పోలీస్‌స్టేషన్ రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంక పాత పోలీస్‌స్టేషన్ రోడ్డులో నివసించే బొచ్చు సత్యనారాయణ (65), కనకదుర్గ (61) దంపతులు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు చెన్నకేశవులు ఒంగోలులో మెడికల్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తుండగా.. రెండో కుమారుడు దుర్గాప్రసాద్ విజయవాడలోనే పోలీసుశాఖలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. దంపతులిద్దరూ ఏడాదిగా రెండో కొడుకు వద్దే ఉంటున్నారు. ఇటీవల దంపతులకు ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి ‘మీకు తిండిపెట్టడమే దండగ. దానికి తోడు రోగాలు... మాతో ఉంటే మీ రోగాలు మాకూ అంటుకుంటాయి’ అంటూ రెండో కుమారుడు వేధి స్తూ ఎక్కడికైనా వెళ్లిపోవాలని చిరాకుపడుతున్నాడు. తాను ఇచ్చిన రూ.3 లక్షల్లో కొంత ఇస్తే ఎక్కడైనా బతుకుతామని సత్యనారాయణ అడగ్గా కొడుకు మనస్సు చలించలేదు. తన వద్ద డబ్బుల్లేవని, ఇంట్లో ఉండొద్దంటూ వేధింపులకు దిగుతున్నాడు. నాలుగురోజుల క్రితం దుర్గాప్రసాద్ తన మామ, తోడల్లుడిని భీమవరం నుంచి పిలిపించి, వారితోనూ తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ హింసించాడు. చిన్న కొడుక్కి మూడు లక్షలు ఇచ్చినందున అతని వద్దే ఉండాలని పెద్దకొడుకూ అంటున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వృద్ధ దంపతులు సోమవారం చిన్న కొడుకు ఇంట్లోనే ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కొడుకు చిత్రహింసలు భరించలేకే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. చిన్నకొడుకు, అతని బంధువులందరూ పరారీలో ఉన్నారు. తల్లిదండ్రుల ఆత్మహత్య వార్త తెలుసుకుని కుమార్తె ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరపలో ముగ్గురు మహిళల ఆత్మహత్య
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాకినాడ రూరల్ మండలం కరపకు చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. దేవుడు తమని పిలుస్తున్నాడంటూ వారు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరు పూజలు చేస్తూ, దేవుడు తమతో మాట్లాడుతున్నాడని, తన వద్దకు రమ్మన్నాడంటూ చెప్పేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
ఓడీ చెరువు : మండలంలోని నవాబుకోటకు చెందిన ఉప్పలపాటి ఆశోక్ (22) అనే యువకుడు శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాకపోవడంతో మస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ వెంకటరమణమ్మ వద్ద పెరిగాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరికి తరలించామని ఎస్ఐ తెలిపారు. -
భార్యపై కోపంతో మానవ మృగంగా..
ఇస్లామాబాద్ : భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో మానవ మృగంగా మారాడు. అభం శుభం తెలియని ముగ్గురు కూతుళ్లకు ఉరివేసి చంపాడు. ఆపై భార్యపై హత్యాయత్నం చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. అహ్మద్ యార్(40) అనే వ్యక్తికి భార్య షకీలాతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆ దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో భార్య కూతుళ్లను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న యార్ శనివారం తన ముగ్గురు కుమార్తెలు జైనాబ్(1), జమీరా(7), మరియం(5)లను ఇంట్లోనే ఉరి వేసి చంపాడు. అపైన కత్తి తీసుకుని అత్తవారింటికి వెళ్లి భార్యను చంపేందుకు యత్నించాడు. ఆమె కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి యార్ను పట్టుకున్నారు. స్థానికుల సమాచారం అందించటంతో పోలీసులు వచ్చి యార్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. -
జాధవ్ ఎప్పటికీ విడుదల కాలేడు
ఇస్లామాబాద్ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను నిర్దోషిగా విడుదల చేసే ప్రసక్తే లేదని పాకిస్తాన్ న్యాయవాది ఖావర్ ఖురేషీ స్పష్టం చేశారు. కుల్‌భూషణ్ జాధవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ తరఫున ఖావర్ ఖురేషీ వాదనలు వినిపించారు. అయితే అక్కడ పాక్‌కు చుక్కెదురు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖావర్ ఖురేషీ మాట్లాడుతూ... జాధవ్ కేసు చాలా స్పష్టమైందని, అతడిని ఎన్నటికీ నిర్దోషిగా విడుదల చేయడం జరగదని నేషన్ వార్త పత్రికిను ఉటంకిస్తూ అన్నారు. అలాగే అంతర్జాతీయ న్యాయస్థానం అటు జాదవ్‌ను నిర్దోషిగా తేల్చలేదనీ, ఇటు విడుదల చేయలేదనీ వివరించారు. ఆయన సోమవారమిక్కడ పాకిస్తాన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా ప్రవర్తించిన పాకిస్తానీ అధికారులకు పాక్ మీడియా గౌరవించాలని అన్నారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తానీ మిలటరీ కోర్టు జాదవ్‌కు ఉరిశిక్ష విధించగా..అంతర్జాతీయ న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే ఇచ్చిన విషయం తెల్సిందే. కాగా జాధవ్ కేసులో ఐసీజేలో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు న్యాయ నిపుణులు సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపడుతున్నారు. దీంతో ఐసీజేలో జాధవ్ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ సర్కారు నిర్ణయించింది. మరోవైపు జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, సెనేట్ మాజీ చైర్మన్ ఫరూక్ నయీక్ తరఫున న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
‘జాధవ్‌ను తక్షణమే ఉరి తీయండి’
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను త్వరగా ఉరితీయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టు విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్‌ను తక్షణమే ఉరితీయాంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత, సెనేట్ మాజీ చైర్మన్ ఫరూక్ నయీక్ తరఫున న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ’డాన్’పత్రిక పేర్కొంది. -
కులభూషణ్ జాదవ్ కు మరణశిక్షపై స్టే
-
కులభూషణ్ జాదవ్ కు మరణశిక్షపై స్టే
న్యూఢిల్లీ: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం...ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ () మంగళవారం స్టే విధించింది. పదవీ విరమణ తర్వాత ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్ చేశారని భారత్ నివేదించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు పాక్‌లోని ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ మరణశిక్ష విధించడం, ఆయనను ఉరి తీస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. -
నాకలాంటి ఉద్దేశం లేదు: మంచు లక్ష్మి
సినీనటి మంచు లక్ష్మీ తన రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాను రాజకీయాల్లోకి రానని, సమాజ సేవే ముఖ్యమని ఆమె తేల్చి చెప్పింది. గత కొద్దిరోజులుగా మంచు లక్ష్మి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు పాలిటిక్స్‌లోకి వచ్చే ఉద్దేశమే లేదని మంచు లక్ష్మి తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష విధించడంపై మంచులక్ష్మి విభేదించారు. ఉరిశిక్ష కరెక్ట్ కాదని, వాళ్లకు అమ్మాయిల విలువేంటో అర్థయం అయ్యాలా చెప్పాలని అన్నారు. వాళ్లు కూడా మనుషులే అని, వారికి తప్పు తెలుసుకునే అవకాశం ఇవ్వాలని అన్నారు. స్త్రీ విలువను బాల్యం నుంచే నేర్పించాలని మంచు లక్ష్మి పేర్కొన్నారు. -
ఆవును చంపితే ఉరిశిక్ష
రాజ్యసభలో స్వామి ప్రైవేటు బిల్లు న్యూఢిల్లీ: ఆవును చంపితే ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ప్రైవేటు బిల్లును బీజేపీ సభ్యుడు, సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశించిన గోవధపై నిషేధం కోసం ఉద్దేశించిన గోరక్షణ బిల్లు–2017ను స్వామి ప్రవేశపెట్టారు. గోసంతతి పరిరక్షణకు కమిటీని నియమించాలన్నారు. ఇందులో పశుసంవర్థక, వ్యవసాయం, ఆర్థిక, పశుసంక్షేమ, పురాతన భారతీయ చరిత్ర, సంస్కృతి రంగాలకు చెందిన నిపుణులను నియమించాలని విన్నవించారు. రూ.5వేలు, రూ.10వేల నోట్లు తీసుకురాం రూ.5వేలు, రూ.10వేల నోట్లు తీసుకొచ్చే ప్రణాళికలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ విషయమై రిజర్వు బ్యాంకును సంప్రదించామని.. రూ.5వేల, రూ.10వేల నోట్లను తీసుకురాలేమని ఆర్బీఐ తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బినామీ చట్టం కింద 140 మందికి నోటీసులు నిషేధిత బినామీ ఆస్తిలావాదేవీల చట్టం కింద 140 మందికి నోటీసులు పంపినట్టు కేంద్రం శుక్రవారం లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చింది. రూ. 200 కోట్ల విలువైన బినామీ లావాదేవీలు జరిగాయని, ఇందులో 124 మందికి చెందిన ఆస్తులను జప్తు చేసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోశ్‌కుమార్ గంగ్వార్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. జప్తు చేసుకున్న వాటిల్లో స్థిర, చరాస్తులు ఉన్నాయని ఆయన వివరించారు. రూ. 45, 622 కోట్ల నల్లధనం వెలికితీత ఈ జనవరితోపాటు గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల వ్యవధిలో నిర్వహించిన సోదాల ద్వారా రూ. 45. 622 కోట్లు విలువైన లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఆదాయపన్ను శాఖ వెలికితీసింది. 2,534 వ్యక్తులపై జరిపిన దాడిలో ఈ మొత్తం బయటపడిందని గంగ్వార్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. -
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఉరితీయాలా!
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఉరి తీయాలని మంత్రి హరీశ్‌రావు మాట్లాడ టం దారుణమని, తెలంగాణ ఇచ్చినందు కు కాంగ్రెస్ పార్టీని ఉరితీయాలా.. అని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ తెలంగాణ ప్రజలను మాటలతో మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న కేసీఆర్, హరీశ్‌రావులలో ఎవరిని ఉరితీయాలో చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్పె నోటికొచ్చిన ట్టుగా మాట్లాడితే ప్రజలు సహించరన్నా రు. తెలంగాణ బిల్లు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నా రు.పార్లమెంటు తలుపులు మూసి, తెలం గాణ బిల్లు ఆమోదించారని చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. -
యువకుడు ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్న పఠాన్ మౌలాలి (26) అనే యువకుడు శుక్రవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి కడపకు చెందిన యువతితో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ చర్యకు పాల్పడి ఉంటాడని మౌలాలి తల్లి ఖాదర్‌బీ పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరిశిక్ష ఖరారుపై నిర్ణయం తీసుకోండి
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టును కోరిన ప్రత్యేక కోర్టు సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుల్లో ఐదుగురికి ఉరి శిక్ష విధిస్తూ ఈ నెల 19న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసే విషయం లో సంబంధిత కోర్టు జడ్జి కేసును ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్. కె.జైశ్వాల్‌ల ధర్మా సనం సోమవారం విచారించింది. ఎన్ఐఏ తరఫు న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుపై సత్వర విచారణ చేపట్టా లని కోరారు. ఇదే సమయంలో కింది కోర్టు తమకు విధించిన ఉరిశిక్షను సవాలు చేస్తూ అసదుల్లా అక్తర్, జియావుర్ రెహ్మాన్, మహ్మద్ తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్‌లు అప్పీల్ దాఖలు చేశారని వారి తరఫు న్యాయవాది మహదేవన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి హైకోర్టు రిజిస్ట్రీ ఇంకా నం బర్ కేటాయించలేదన్నారు. దీంతో ధర్మాసనం ఉరిశిక్ష ఖరారు కేసుతో పాటు ఈ అప్పీల్‌ను కూడా జత చేయాలని, నంబర్ కేటాయించిన తరువాత రెండింటినీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
ఏలూరు అర్బన్ : ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు టూటౌన్ పరిధిలోని 37వ డివిజన్ చేపలతూము సెంటర్లో ఎం.వెంకటసుబ్బారావు కోడిమాంసం వ్యాపారం చేసుకుంటూ భార్య రాణి, కూతురు జ్యోతిక (17), కుమారుడు రవితో జీవనం సాగిస్తున్నాడు. పిల్లలిద్దరినీ కార్పొరేట్ కళాశాలల్లో చదివి స్తున్నారు. నగరంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న జ్యోతిక అనారోగ్యంగా ఉందంటూ మూడు రోజులుగా కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుట్టు పని నేర్చుకోవడానికి బయటకు వెళ్లిన తల్లి రాణి కొద్దిసేపటికి ఇంటికి రాగా జ్యోతిక ఆత్మహత్య చేసుకోవడం చూసి ఘెల్లుమంటూ కేకలు వేసింది. విషయం తెలిసిన తండ్రి వెంకట్రావు హుటాహుటిన ఇంటికి వచ్చి జ్యోతికను కిందకు దించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు జ్యోతిక అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. వేధింపులే బలితీసుకున్నాయి తన కుమార్తె ప్రాణాలను కాలేజీ యాజమాన్యం వేధింపులే బలిగొన్నాయని తండ్రి వెంకటరావు ఆరోపిస్తున్నారు. జ్యోతిక చదువులో చురుకుగా ఉండేదని, అయితే కొద్దిరోజులుగా అధ్యాపకులు తరచూ తోటి విద్యార్థుల ముందు తనను అవమానిస్తున్నారని జ్యోతిక తనవద్ద వాపోయిందన్నారు. ఇదే విషయం తాను కళాశాల యాజమాన్యంతో మాట్లాడగా అలాంటిదేమీ లేదని ప్రిన్సిపాల్ చెప్పడంతో జ్యోతికను తాను మందలించానని వాపోయారు. దీంతో మనస్తాపానికి గురైన జ్యోతిక ఆత్మహత్య చేసుకుందని విలపించారు. కన్నీరుమున్నీరై.. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుని కుటుంబానికి ఆసరాగా ఉం టుందనుకుంటే ఇలా అఘాయిత్యం చేసుకుందని జ్యోతిక తల్లి, తమ్ముడు ఆసుపత్రి వద్ద బోరుమన్నారు. అచేతనంగా పడిఉన్న జ్యోతికను చూసి తల్లి, తమ్ముడు రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
ఆడుకుంటున్న తాడే ఉరిగా బిగిసి..
• ఏడేళ్ల బాలిక దుర్మరణం.. • బాలాపూర్ పీఎస్ పరిధిలో ఘటన హైదరాబాద్: తాడుతో ఆటలాడిన చిన్నారికి ఆ తాడే ఉరిగా బిగిసింది. తెలిసీ తెలియక మెడకు చుట్టుకున్న తాడు యమపాశమరుుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ సీమ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వాహెద్ఖాన్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య బ్యూటీపార్లర్‌లో పనిచేస్తుంది. శనివారం ఉదయం రోజూలాగే భార్యాభర్తలిద్దరూ తమ పనులపై బయటకు వెళ్లారు. నలుగురు పిల్లలూ ఎప్పటిలానే ఇంటివద్దే ఉన్నారు. ఏడాది వయసున్న చిన్న కుమార్తె సోఫియా సుల్తానా అల్లరిని కట్టడి చేయడానికి తల్లిదండ్రులు ఆమె నడుమును తాడుతో కట్టేశారు. తల్లిదండ్రులు బయటకు వెళ్లగానే... వారి పెద్ద కుమార్తె ఫరీన్ సుల్తానా (7) సినిమాల్లో మాదిరిగా... చెల్లి నడుముకు కట్టే తాడు ముడిని తన మెడలో వేసుకుని... కాళ్ల కింద బకెట్ పెట్టుకుని ఆడసాగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా బకెట్ జారి.... తాడు బిగుసుకోవడంతో ఫరీన్ మృతిచెందింది. చలనం లేకుండా పడివున్న ఫరీన్ను చూసిన మిగిలిన పిల్లలు... తను నిద్రపోతోందని భావించి ఇంట్లో పడుకోబెట్టారు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన భార్యాభర్తలు... ఫరీన్ను చూసి గాభరాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
ఉరివేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: మద్యానికి బానిసగా మారిన ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ ఠాణా పరిధిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రమేశ్(30) మీర్పేట్ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్ఎల్ఎన్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న ఆయనకు భార్య నిఖిత, కూతురు, కొడుకు ఉన్నారు. మద్యం అలవాటున్న రమేశ్ తరచూ భార్యాపిల్లలతో గొడవపడేవాడు. శారీరకంగా హింసిస్తుండడంతో నిఖిత ఉన్నతాధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నారు. విధి నిర్వహణలోనూ రమేశ్‌కు మంచి పేరు లేకపోవడంతో అధికారులు రాచకొండ కమిషనరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌కు అటాచ్ చేశారు. శనివారం కూడా మద్యం మత్తులో భార్యతో ఘర్షణకు దిగారు. మూడు నెలల బాబును ఎత్తి నేల మీదకు విసిరేయగా... సమయానికి నిఖిత పట్టుకున్నారు. ఈ బాధలు భరించలేక పిల్లలను తీసుకుని బోరబండలోని తన పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో మానసికంగా కుంగిపోరుున రమేశ్ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఉరేసుకుని ఆత్మహత్య
కొవ్వూరు రూరల్ : దూలానికి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో జరిగింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని రామభద్రపాడుకు చెందిన చక్కా లోవరాజు(36) మూడు నెలల క్రితం ఉపాధి కోసం కుటుంబంతో కలిసి పశివేదల వచ్చాడు. స్థానిక అంబేడ్కర్ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఓ రైతు వద్ద పనికి కుదిరి కొంత సొమ్మును అడ్వాన్సుగా తీసుకుని కొన్ని రోజులు పనిచేసి మాపివేశాడు. అలాగే మరో రైతు వద్ద కొంత సొమ్ము తీసుకుని అతని వద్ద పనిమానివేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. పని మానివేసినందున రైతుల వద్ద తీసుకున్న అడ్వా¯Œ్సను వారికి ఇచ్చివేయాలని పనిలో పెట్టిన వ్యక్తి ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో లోవరాజు పది రోజులుగా మద్యం తాగుతూ తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఆదివారం రాత్రి భార్యతో గొడవపడడంతో ఆమె మరో ఇంటికి వెళ్లి నిద్రపోయింది. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా దూలానికి వేలాడుతూ భర్త శవం కనిపించింది. దీంతో ఆమె స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ ఎం.శ్యాంసుందరరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వీఆర్వో పీకేడీ ప్రసాద్ ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య రాము, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిరికివాడు కాదు లోవరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బంధువులు చెబుతున్నారు. అతని మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పారు. -
పుట్టిన రోజే బాలిక అనుమానాస్పద మృతి
పెనమలూరు పెనమలూరు గ్రామంలో ఓ బాలిక శనివారం పుట్టినరోజునాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెనమలూరు జెండా చెట్టు సెంటర్‌కు చెందిన జానీ కుమార్తె మెహరున్నీసాబేగం (16) మొదటి ఏడాది ఇంటర్ విజయవాడలో కార్పొరేట్ కాలేజీలో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం ఆమె గత కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆమె శనివారం కాలేజీకి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఆమె పుట్టిన రోజు కూడా కావటంతో తల్లి, సోదరుడు బ్యాంకులో సొమ్ము డ్రా చేయటానికి బయటికి వెళ్లారు. తండ్రి కూడా తాపీపనికి వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేశారు. -
కువైట్‌లో పెండ్లిమర్రి మండల వాసి ఆత్మహత్య
పెండ్లిమర్రి: పెండ్లిమర్రి మండలం మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన ఆర్.రామకృష్ణారెడ్డి(45) అనే వ్యక్తి కువైట్‌లో ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. దాదాపు ఐదు నెలల క్రితం అతను ఆత్మహత్య చేసుకోగా మృతదేహం గురువారం స్వగ్రామానికి చెరింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... రామకృష్ణారెడ్డి 7 నెలల క్రితం జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. డ్రైవర్‌గా పని ఇప్పిస్తానని నమ్మబలికి ఏజెంట్ పంపగా అక్కడ గొర్రెల కాపరిగా నియమించుకున్నారు. ఆ పని చేయలేక నరకయాతన అనుభవించాడు. ఇంటికి పంపేందుకు అక్కడివారు అంగీకరించలేదు. దీంతో త్రీవ మనస్తాపానికి గురై ఈ ఏడాది జూన్ నెలలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయడంతో గురువారం మృత దేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఏజెంట్ చేసిన మోసానికి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు విలపించారు. మృతదేహాన్ని కడప డీసీసీబీ ఛైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి సందర్శించి మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
-
నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో ఓ తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం వసతి గృహంలో సాయికృష్ణ అనే విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు. బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న అతడు శనివారం ఈ ఘటనకు పాల్పడ్డాడు. సాయికృష్ణ నాలుగు నెలల క్రితం ఈ కోర్సులో జాయి అయ్యాడు. ఘటనా స్థలంలో తెలుగులో రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కళాశాలలో సాయికృష్ణకు ఎలాంటి సమస్య లేదని యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కళాశాల యాజమాన్యం సాయికృష్ణ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా గతంలోనూ సుశాంత్ రోహిల్లా అనే న్యాయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
చౌటుప్పల్: మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన యువకుడు గట్టు యుగేంధర్(21) మంగళవారం రాత్రి వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని తండ్రి గతంలోనే చనిపోయాడు. మంగళవారం తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్వాపార్క్ ఏర్పాటుతో మా పొట్ట కొట్టొద్దు
– చింతరేవులో మహిళలు వినూత్న నిరసన మొగల్తూరు : తుందుర్రులో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేసి తమ పొట్ట కొట్టవద్దంటూ మంగళవారం చింతరేవుకు చెందిన మహిళలు ఉరికి వేలాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి గొంతేరు డ్రెయిన్‌పై ఆధారపడి వేటే జీవనాధారంగా జీవిస్తున్నామన్నారు. తల్లిలాంటి గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం బారిన పడవేసేందుకు తుందుర్రు ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారన్నారు. పరిశ్రమ నుంచి ఏర్పడే రసాయనాల కారణంగా మత్స్య సంపదను కోల్పోయి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. ఆక్వా పరిశ్రమ పనులు తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి అనంతలక్ష్మి, మంగ, సన్యాసమ్మ, మొగదారమ్మ, చంద్రకళ,పెద్దింట్లమ్మ, వాటాల అనసూయ, కొల్లాటి కష్ణమూర్తి, బర్రి ధనలక్ష్మి, కొప్పాడ నాగలక్ష్మి, బర్రి వెంకటేశ్వర్లు, పోతాబత్తుల కష్ణమూర్తి, వాటాల నర్సింహరావు, వాటాల బాలకష్ణ, గంగరాజు పాల్గొన్నారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
– ఉసురు తీసిన అప్పులు, కుటుంబ సమస్యలు మదనపల్లెటౌన్: చేనేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా రొద్దం మండలం సానిపల్లెకు చెందిన ఆరేళ్లప్పగారి గోవిందప్ప కొడుకు వెంకటాద్రి(30) చేనేత కార్మికుడు. ఐదేళ్ల క్రితం లక్ష్మిదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేకపోవడంతో వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేశారు. దీంతో ఏడాది క్రితం స్వగ్రామంలో భార్య, పిల్లలు గోవర్ధన, అంకితను వదిలి మదనపల్లెకు వచ్చాడు. మారుతీనగర్‌లో నివాసం ఉంటూ కూలి మగ్గం నేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన కేఆర్ రూప అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏం జరిగిందో కాని వారం రోజుల క్రితం రెండో భార్య రూప భర్త వెంకటాద్రికి చెప్పకుండా పుట్టినింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను తాను ఉంటున్న అద్దె ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం గమనించిన ఇంటి యజమాని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఖాదర్‌బాషా అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై స్థానికులను ఆరా తీశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
వెలుగోడు: పట్టణ శివారులోని వన్ ఆర్ తూమ్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌గౌడ్(30) పట్టణ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. శుక్రవారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘట స్థలాన్ని ఆత్మకూరు సీఐ దివాకర్‌రెడ్డి పరిశీలించారు. ఘటన స్థలంలో మృతుడి డ్రై వింగ్ లైసెన్స్ ఉండటంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. -
ఉరివేసుకుని ఇద్దరి బలవన్మరణం
పాలకోడేరు : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం రాత్రి ఉరి వేసుకుని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శృంగవృక్షం పరిధిలోని బంటుమిల్లి గ్రామానికి చెందిన కట్టా శ్రీను (36) మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరవాసరం గ్రామానికి చెందిన భాజింకిæ భోగేశ్వరరావు, కె.అప్పారావు శృంగవృక్షంలో చేపల చెరువులను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కట్టా శ్రీను చెరువులపై మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం చెరువును లీజుకు తీసుకున్న యజమానుల బంగారు గొలుసు చోరీకి గురికావడంతో వారు శ్రీనుని అనుమానించారు. దీంతో రెండుసార్లు బంటుమిల్లి కుల సంఘంలో పంచాయితీ పెట్టారు. అయినా విషయం తేలలేదు. ఈ అవమానం భరించలేక గురువారం రాత్రి శ్రీను ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సి.హెచ్.వి.రమేష్ తెలిపారు. వివాహిత ఆత్మహత్య పోలవరం రూరల్ : మండలంలోని సింగన్నపల్లి పునరావాస కేంద్రంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్న పూనెం పోశమ్మ (29)కి తొమ్మిదేళ్ల క్రితం సురేష్‌తో పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పోశమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గతంలోనూ ఆత్మహత్యకు యత్నించింది. ఒకసారి గోదావరి నదిలో దిగితే గ్రామస్తులు రక్షించారు. గురువారం రాత్రి భర్త గదిలో ఉన్న సమయంలో తాళం పెట్టి వరండాలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. ఆమెను పోలవరం వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు మృతురాలి తల్లి రామాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఉరి వేసుకుని వివాహిత మృతి
కొత్తూరు (కురవి) : తాడుతో ఉరివేసుకుని వివాహిత మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు(జీ) శివారు తాట్యతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం.. తాట్య తండాకు చెందిన బోడ భూల్య భార్య ఈరి(50) తన పెద్ద కుమారుడు వీరన్న కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని కిందకు దించగా మెడలో తాడుతో ఉరివేసుకుని ఉన్న గుర్తు ఉంది. విషయం కురవి పోలీసులకు సమాచారం అందచేశారు. వెంటనే ఎస్సై అశోక్ తన సిబ్బందితో తండాకు చేరుకున్నారు. చని పోయిన ఈరి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి మరో కుమారుడు భద్రు ఉన్నాడు. భద్రు మాత్రం తన అన్నయ్య, తండ్రి కలిసి అమ్మను చంపారని ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మొత్తానికి అనుమానాస్పదస్థితిగా తండావాసులు చెబుతున్నారు. -
ఉరేసుకొని బాలిక ఆత్మహత్య
చేబ్రోలు : స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్‌లో బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చేబ్రోలు ఎస్వీ ఎస్పీ స్పిన్నింగ్ మిల్లులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోర్ల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతని కుమార్తె మోర్ల సునీత(13) నారాకోడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. గురువారం సాయంత్రం సమయంలో సునీత క్వార్టర్స్‌లోని గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మరణానికి దారి తీసిన పరిస్థితులు తెలియలేదు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ఆరాధ్యుల కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
వివాహిత బలవన్మరణం
భర్తతో మనస్పర్థలు.. తరచూ గొడవలతో విసిగి వేసారిన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కామారుపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. శింగనమలకు చెందిన మహాలక్ష్మి (28)కి అనంతపురం మండలం కామారుపల్లికి చెందిన పాల వ్యాపారి సుబ్బరాయుడుతో ఏడేళ్లక్రితం వివాహమైంది. వీరికి కుమార్తె భవిత, కుమారుడు కుమార్ ఉన్నారు. ప్రారంభంలో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనంతరం దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రతి చిన్న విషయానికీ గొడవపడేవారు. కొద్ది రోజుల క్రితం మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషులు రాజీ చేసి మళ్లీ భర్త వద్దకు పంపారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాక.. మహాలక్ష్మి ఫ్యానుకు ఉరి వేసుకుంది. కొద్దిసేపటి అనంతరం తిరిగి వచ్చిన సుబ్బరాయుడు ఉరికి వేలాడుతున్న భార్యను చూసి హుటాహుటిన సర్వజనాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ జగదీష్ తెలిపారు. -
ఛాగల్లులో ఉరివేసుకొని ఇద్దరి ఆత్మహత్య
స్టేషన్ ఘన్పూర్ టౌన్ : మండలంలోని ఛాగల్లు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొన్నా రమేష్(38) ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులతోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు మందలించడంతో.. ఛాగల్లు గ్రామానికి చెందిన మునిగాల యమున(21)కు ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా పెళ్లయిన నాటి నుంచి యమున తన పుట్టిం టి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం భర్త వద్దకు కాపురానికి వెళ్లాలంటూ ఆమెను తల్లిదండ్రులు మందలించారు. ఈనేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పెంటపాడు: పెంటపాడులో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పెంటపాడు పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన బొబ్బిలి బాలగంగాధర్‌తిలక్ (33) స్వగ్రామం కొవ్వూరు. ఎనిమిదేళ్లుగా పెంటపాడులో నివాసముంటూ వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా బాలగంగాధరతిలక్ అప్పుల బాధతో సతమతమవుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం భార్యాపిల్లలను కృష్ణా పుష్కరాలకు పంపాడు. రాత్రి ఇంట్లోని గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. సమీపంలో ఉండే అతని మేనత్త తలుపు కొట్టగా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సాయంలో తలుపులు పగులకొట్టారు. మృతదేహానికి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, దుర్గ, మానస అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్సై కె.గుర్రయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కడప అర్బన్ : జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్త వేధింపులు ఓ యువతి ప్రాణాలను బలిగొన్నాయి. వివాహమైన ఆరు నెలలకే అనుమానాస్పద స్థితిలో ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు, సుబ్బమ్మల కుమార్తె రమణమ్మ (25)కు కడప నగరం మారుతినగర్‌కు చెందిన గురు రాజాతో ఆరు నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో రూ. 4 లక్షలు కట్నంగా ఇచ్చారు. ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని మాయమాటలు చెప్పారని, తర్వాత ఎలాంటి ఉద్యోగం లేదని తెలిసిందని బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొంతకాలం నుంచి తన భార్య రమణమ్మను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించేవాడని తెలిపారు. ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం మృతురాలి అక్క, బావ వచ్చి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాకుండా సర్దిచెప్పి వెళ్లారు. అయితే గురువారం మధ్యాహ్నం తాము నివసిస్తున్న ఇంటి పైభాగాన ఉన్న గదిలో సిమెంటు రేకుకు ఉన్న పైపునకు చీరెతో ఉరి వేసుకుందని చెబుతున్నారు. కానీ భర్త, బంధువులే ఆమెను చీరెతో మెడచుట్టూ బిగించి హత్య చేశారని బంధువులు ఆరోపించారు. సంఘటనా స్థలాన్ని వన్‌టౌన్ సీఐ రమేష్ తమ సిబ్బందితో పరిశీలించారు. సంఘటనపై అనుమానాలెన్నో? రమణమ్మకు గురురాజాతో వివాహం కాకమునుపే మరో మహిళను మొదట వివాహం చేసుకుని మనస్పర్థలు ఏర్పడడంతో ఆమెతో విడిపోయినట్లు బంధువులు తెలిపారు. తర్వాత రమణమ్మను ఆరు నెలల క్రితం వివాహం చేసుకుని వేధిస్తున్నాడని, స్నేహితులతో విందు వినోదాలు చేసుకునేందుకు డబ్బులు ఇప్పించాలని భార్యను వేధించేవాడని వారు ఆరోపించారు. కాగా, మృతురాలి భర్త, బంధువులు మాత్రం తాము నివసిస్తున్న ఇంటి పైభాగాన సిమెంటు రేకులకు ఉన్న పైపునకు చీరెతో ఉరి వేసుకుందని, తలుపులు బద్దలు కొట్టి వైద్యుని వద్దకు తీసుకెళ్లామని చెబుతున్నారు. అయితే ఆ పైపునకు ఎలాంటి మరకలుగానీ, ఉరి వేసుకున్నట్లు ఆనవాళ్లుగానీ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భర్త, బంధువులే ఆమె మెడకు ఉరి బిగించి చంపారని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన గురురాజా, బంధువులు కట్నం కోసం రమణమ్మను దారుణంగా హత్య చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గురువారం సాయంత్రం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
గాలిలో వేలాడుతు పెళ్లి చేసుకున్న జంట
-
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చౌటుప్పల్ : మండలంలోని పెద్దకొండూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటంబావికి చెందిన పడమటి అశోక్‌రెడ్డి(37) ఆదివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కొంత కాలంగా అప్పుల బాధతో, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఉదయం 7గంటల సమయంలో తన వ్యవసాయ బావి వద్ద గల కోళ్లఫామ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి భార్య గేదెలను తోలుకొని, బావి వద్దకు రాగా చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్‌కుమార్ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉంది. కాగా మృతుడు అశోక్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం తన తండ్రిని అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన విషయం విదితమే. -
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
నిజామాబాద్ క్రైం : ఇంజినీరింగ్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి దారి తీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పేట్‌బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం... నిజామాబాద్ టౌన్‌కు చెందిన సత్యనారాయణగౌడ్, కవిత దంపతులు సుచిత్ర సమీపంలోని ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. చిన్న కుమార్తె భార్గవి (21) ఇంజినీరింగ్ చదువుతోంది. అమెరికా వెళ్లేందుకు వీసా కూడా తీసుకుంది. రెండవ కుమార్తె అమెరికాలో ఉండటంతో సత్యనారాయణ దంపతులు ఇటీవలే అక్కడికి వెళ్లారు. దీంతో భార్గవికి, ఆమె చిన్నాన్న కుమారుడు జ్ఞానేశ్వర్ తోడుగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం జ్ఞానేశ్వర్ బయటకు వెళ్లి కొద్దిసేపటికి తిరిగి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకూ తెరవకపోవడంతో చుట్టు పక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. త లుపులు పగులగొట్టి చూడగా భార్గవి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా... వారు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైనట్లు పోలీసులు తెలిపారు. -
విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్'
రష్యాః సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, తీర ప్రాంతాలకు వెడుతుంటారు. అవకాశం లేనివారు కొందరు.. బాల్కనీల్లోనూ, అపార్ట్ మెంట్లు, భవనాల టెర్రస్ లను సన్ బాత్ కు వినియోగించుకుంటారు. అయితే అసలు బయటకు వెళ్ళే పనే లేదంటోంది ఓ రష్యన్ మహిళ. బికిని ధరించి, ప్రతిరోజూ కిటికీ నుంచీ వచ్చే ఎండనే సన్ బాత్ కు వినియోగించుకుంటూ చుట్టుపక్కల వారిని విస్మయపరుస్తోంది. రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాపట్టణం నోవోసిబిర్స్క్ క్రోపోట్కిన్ వీధిలోని ఓ ఇంటి కిటికీనుంచీ ప్రతిరోజూ కనిపించే సన్ బాత్ దృశ్యం ఇరుగు పొరుగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో నివసించే మహిళ.. బికినీ ధరించి, తలభాగం మాత్రం లోపల, మిగిలిన శరీరభాగం కిటికీనుంచి బయటకు కనిపించేలా సన్ బాత్ చేస్తూ చూపరులను అకట్టుకోవడమేకాదు.. ఒకింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, పార్క్ లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో అందరికీ తెలిసేట్లు చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకూ విండో సన్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆమె.. ఇప్పుడు అక్కడి వార్తల్లో వ్యక్తిగా మారింది. అయితే కొందరు కాలనీవాసులు మాత్రం ఆమె సన్ బాత్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అక్కడే చిన్న పిలలు అడుకుంటుంటారని, సదరు మహిళ ఎక్స్ పోజింగ్ ను తట్టుకోలేకపోతున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆమె విండో సన్ బాత్ ను ఆపించాలంటూ ఇరుగుపొరుగువారంతా సంతకాలు చేసిన ఓ పిటిషన్ ను స్థానిక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటర్ కు, పోలీసులకు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లు సదరు సన్ బాతర్ మాత్రం తనకు ఇష్టం వచ్చినంత సమయం విండో సన్ బాత్ చేస్తూనే ఉంది. దీంతో కొందరు అటుగా వెళ్ళేవారు ఆమె ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో ఇప్పుడు రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేలమంది షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆమె సన్ బాత్ విషయం స్థానికులను ఇబ్బంది పెట్టడమేకాక.. ఎప్పుడోప్పుడు విండోనుంచి పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఆమె ఇలా కాళ్ళు, నడుమువరకూ బయటకు పెట్టి ఎక్స్ పోజ్ చేయడం మొదటిసారి కాదని, బాడీ మొత్తం సమాంతరంగా ట్యాన్ అయ్యేందుకు, శరీర పై భాగాన్ని కూడ ఎండలో బయటకు పెట్టేదని చెప్తున్నారు. కానీ అటువంటప్పుడు పూర్తి శాతం బికినీతో ఉండేదని మరి కొందరు ఇంటర్నెట్ వినియోగదారులు అంటున్నారు. ఎవరేమనుకున్నా ఆ సన్ బాత్ సుందరి మాత్రం.. తన రోజువారీ కార్యక్రమాన్ని ఆపేట్టు కనిపించడం లేదు. -
‘నాకు బతకాలని లేదు.. ’
♦ సూసైడ్ నోట్ రాసి ఇన్ఫోసిస్ ఉద్యోగి బలవన్మరణం ♦ ఘట్కేసర్ మండలం సంస్కృతి టౌన్షిప్లో ఘటన ఘట్కేసర్: ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ కోల్‌కతాకు చెందిన రోషన్‌కుమార్ చౌదరి(23) మండలంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లోని సీ2 బ్లాక్‌లోని 401 నంబర్ ఫ్లాట్‌లో ఈఏడాది ఫిబ్రవరి నుంచి అద్దెకుంటున్నాడు. సమీపంలోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం ఉదయం సదరు బ్లాక్ వద్ద కాపలాదారుగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతున్న రోషన్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. రోషన్‌కుమార్ మంగళవారం రాత్రి ఉరివేసుకొని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.‘నాకు బతకాలని లేదు..ఈ జీవితం నాకు వద్దు. నాన్న నన్ను క్షమించు..’ అని రోషన్‌కుమార్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోషన్‌కుమార్ ఆత్మహత్య ఘటనపై అతడి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత హత్య
♦ చేతి రుమాలుతో మెడకు ఉరి ♦ నర్సాపూర్ మండలంలో ఘటన నర్సాపూర్ రూరల్: చేతి రుమాలుతో మెడకు ఉరి బిగించి దుండగులు ఓ వివాహితను హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి మండలం పోతురెడ్డిపల్లికి చెందిన నీరుడు నవీన అలియాస్ సంతోష (25) శనివారం ఉదయం తుల్జారాంపేట గిరిజన తండా సమీపంలో హత్యకు గురైన స్థితిలో పడి ఉంది. సంఘటన స్థలంలో నీటి ప్యాకెట్లు, మద్యం సీసా ఉన్నాయి. సంతోష శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. శనివారం ఉదయం తుల్జారాంపేట తండా సమీపంలో మహిళ మృతదేహం పడి ఉందని నర్సాపూర్ పోలీసులు సంగారెడ్డి ఎస్పీ కార్యలయానికి సమాచారమిచ్చారు. దీంతో సంగారెడ్డి రూరల్ పోలీసులు వివిధ ఆధారాలు తెలిపి ఆరా తీసిన మీదట సంతోష తండ్రికి తెలిపారు. ఆయనతో పాటు ఇతర కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి వచ్చి సంతోషను గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ వెంటరాజుగౌడ్ తెలిపారు. కాగా, తన కుమార్తె సంతోషను అల్లుడు బాలకృష్ణే హతమార్చాడని హతురాలి తండ్రి జవాన్ నర్సింహ ఆరోపించారు. వీరికి కుమార్తె అక్షయ (3) పుట్టినప్పటి నుంచి కట్నం వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ప్రస్తుతం సంతోష ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉరేసుకున్న ఫొటో
సూసైడ్ విన్నాం! సెల్ఫీ విన్నాం! మరి... సెల్ఫీసైడ్? సెల్ఫీల మోజుతో జాగ్రత్తపడకపోతే, అది సెల్ఫీసైడే! అంటే ఫోటోతో ఉరేసుకోవడమే అమ్మాయిలు అమాయకంగా ప్రేమలో పడి... లేకపోతే స్నేహం అనుకొని... అదీ కాకపోతే పరిచయం అనుకొని... ఫోటోలు, సెల్ఫీలు దిగి... పంచుకొంటే, వాటిని బ్లాక్‌మెయిలింగ్ కోసం వాడుతున్న‘బ్లాక్‌షీప్స్’ ఎన్నో! అమ్మాయిలూ! జాగ్రత్త! సెల్ఫీలు క్యారెక్టర్ని చంపేస్తున్నాయి! డోన్ట్ కమిట్ ‘సెల్ఫీసైడ్’! ఒకప్పుడు ఆటోగ్రాఫ్... ఆ తరువాత ఫోటోగ్రాఫ్... మరి ఇప్పుడు? స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ! గౌరవప్రదంగా చెప్పాలంటే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఇవాళ ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్. లోతుగా ఆలోచించి చూస్తే - ప్రతి ఒక్కరూ ఇరుక్కుపోతున్న, తప్పించుకోలేకపోతున్న తీవ్రమైన వ్యసనం. తీసుకున్న సెల్ఫీని మరుక్షణమే సోషల్ మీడియాలో పెట్టుకోవాలని జనం తాపత్రయపడుతున్నారు. ఈ సెల్ఫీల వ్యవహారంతో మిగిలిన ఇబ్బందుల మాట ఎలా ఉన్నా, అమ్మాయిలు మాత్రం అమాయకంగా బలి అవుతున్నారు. కొందరు సైబర్ నేరగాళ్ళ చేతిలో ఆయుధంగా మారిన సెల్ఫీలకు బలవుతున్నారు. స్నేహం, ప్రేమ, పెళ్ళి పేరుతో కొందరు ప్రబుద్ధులు - అమ్మాయిల్ని నమ్మించి, వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. తీరా ఎక్కడో బెడిసికొట్టాక, ఆ ఫోటోలను నెట్లో పెడతామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ళ సంఖ్య ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలే అందుకు ఉదాహరణ. సెల్ఫ్ గోల్! హైదరాబాద్‌లోని సఫిల్‌గూడాకు చెందిన 32 ఏళ్ళ నిజాముద్దీన్ హైదర్ ఇలాంటి సైబర్ నేరానికే పాల్పడ్డాడు. అయిదేళ్ళ క్రితం ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు. ఎం.బి.ఏ. చదివిన ఆ అమ్మాయితో స్నేహం చేశాడు. అనాథనంటూ సినిమా కష్టాలన్నీ చెప్పుకొని సానుభూతి చూరగొన్నాడు. రోజులు గడిచేకొద్దీ వాళ్ళ పరిచయం కాస్తా స్నేహం పరిధి దాటి, చాలా ముందుకు వెళ్ళింది. త్వరలోనే పెళ్ళి చేసుకుంటానని ఆ అమ్మాయికి మనోడు మాయ మాటలు చెప్పాడు. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. ఆ సమయంలో ఆ అమాయకురాలు ఈ మేకవన్నె పులితో సన్నిహితంగా మెలుగుతూ, అతని ఫోన్లో చాలా సెల్ఫీలు దిగింది. తీరా నిజాముద్దీన్‌కు అప్పటికే పెళ్ళి అయిపోయిందని ఆమెకు ఆలస్యంగా అర్థమైంది. దాంతో, అతగాడిని దూరం పెట్టింది. కానీ, కలసి తీసుకున్న సెల్ఫీలను అడ్డం పెట్టుకొని, ఆమెను నిజాముద్దీన్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరించసాగాడు. చివరకు బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. సైబర్ నేరగాడు నిజాముద్దీన్‌ను ఈ ఏప్రిల్ ఆఖరులో పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల్లో మరో వికృత కోణం - సోషల్ మీడియాలో తప్పుడు ఐడెంటిటీతో చేస్తున్న మోసపూరిత స్నేహాలు. హైదరాబాద్‌లోని భోలానగర్‌కు చెందిన అబ్దుల్ మజీద్ చేసింది అదే. 21 ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ విద్యార్థి ఫేస్బుక్ ద్వారా ఏకంగా కొన్ని వందల మంది అమ్మాయిలతో స్నేహం చేశాడు. తాను కూడా అమ్మాయినే అని ఫేక్ ఐడెంటిటీతో నమ్మించాడు. తోటి కాలేజ్ స్టూడెంట్ అనుకున్న అమ్మాయిలందరూ అతని వలలో పడ్డారు. ఎంతగా మోసపోయారంటే, చివరకు తమ తల్లితండ్రులతో చెప్పని విషయాలు కూడా ‘ఆమెనని మోసం చేసిన అతని’తో పంచుకున్నారు. మద్యపానం, పొగతాగడం దగ్గర నుంచి చివరకు తమ బాయ్‌ఫ్రెండ్స్, లైంగిక ప్రాధాన్యాల దాకా అన్నీ చెప్పుకొన్నారు. అలా వాళ్ళ దగ్గర చనువు సంపాదించిన మజీద్ వాళ్ళ నుంచి అర్ధనగ్న సెల్ఫీలు కూడా తెప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ సెల్ఫీల బూచి చూపెట్టి, భయపెట్టసాగాడు. ఆన్లైన్లో పెట్టేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ వ్యవహారం చివరకు సైబర్ పోలీసులకు చేరింది. కొన్ని వందల మంది టీనేజ్ అమ్మాయిల అర్ధనగ్న సెల్ఫీలు, ఫోటోలను ఈ ప్రబుద్ధుడు సేకరించినట్లు తేలింది. గతంలో ఏడు నెలల కాలంలో రెండుసార్లు అరెస్టయిన మజీద్‌పై తాజాగా పీడీ చట్టం కింద చర్య చేపట్టారు. ప్రేమికుడే బ్లాక్‌మెయిలర్! ఇవాళ సమాజంలో అమ్మాయిలపై పెరుగుతున్న సైబర్ వేధింపులకు ఈ తాజా సంఘటనలు మచ్చుకు ఒకటి రెండు మాత్రమే! అసభ్యంగా కానీ, బెదిరింపు ధోరణిలో కానీ ఆడవారికి మెయిల్స్, మెసేజ్‌లు పెట్టడం సైబర్ నేరాల విభాగంలోనే, మహిళలపై సాగుతున్న దౌర్జన్యాల కిందకు వస్తాయి. అలాగే, ప్రైవేట్, అశ్లీల సమాచారాన్ని, ఫోటోలను ఆన్లైన్లో కానీ, అశ్లీల సైబర్ ప్రపంచంలో కానీ పోస్ట్ చేయడం, సర్క్యులేట్ చేయడం కూడా! స్త్రీల విషయంలో ఈ రెండు రకాల నేరాలు ఇటీవల పెరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే - సన్నిహితంగా ఉంటూ తీసుకున్న సెల్ఫీలు, వీడియోలు, వీడియో ఛాట్లు ఇప్పుడు స్త్రీల బ్లాక్‌మెయిలింగ్‌కు ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. నూటికి దాదాపు 30 కేసుల్లో - ఇలా మాజీ లవర్స్, మోసగాళ్ళు ఒకప్పటి ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే, ఫిర్యాదులైతే చేస్తున్నారు కానీ, బాధితుల్లో నూటికి 90 మంది ఈ విషయాన్ని ఎఫ్.ఐ.ఆర్. దాకా తీసుకువెళ్ళడం లేదు. విషయం వీధికెక్కకుండా, ఆ మోసగాళ్ళ చేతి నుంచి ఆ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం మీదే దృష్టి పెడుతున్నారు. అవి ఏవీ ఆన్‌లైన్‌లోకి రాకుండా ఉండేలా చూడాలని మాత్రమే తాపత్రయపడుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆ మధ్య జరిపిన సర్వేలలో కూడా సెల్ఫీలకూ, మనుషుల మధ్య అనుబంధాల్లో ఉన్న సమస్యలకూ అవినాభావ సంబంధం ఉందని తేల్చాయి. అదే పనిగా సెల్ఫీలు తీసుకోవడం, వాటిని పోస్ట్ చేయడం వల్ల అనుబంధాలు దెబ్బతింటాయని ‘సైబర్ సైకాలజీ, బిహేవియర్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ జర్నల్’ సైతం పేర్కొంది. మొత్తం మీద సెల్ఫీలతో ఉపయోగాల మాటెలా ఉన్నా, సమస్యలు చాలానే బయటపడుతున్నాయి. అమ్మాయిలూ! తస్మాత్ జాగ్రత్త! డోన్ట్ కమిట్ సెల్ఫీసైడ్! - రెంటాల జయదేవ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ! నూటికి 90 నమోదు కావట్లేదు! ‘సైబర్ నేరాలు’ జరిగినప్పుడు 2000 నాటి ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం’ కింద, భారతీయ శిక్షాస్మృతి (ఐ.పి.సి) కింద ఎక్కువ భాగం అరెస్టులు జరుగుతున్నాయి. పెరిగిపోతున్న పట్టణీకరణ, ఇంటర్నెట్ వ్యాప్తి వల్ల ప్రధానంగా నగరాల్లో, పట్టణాల్లో సైబర్ క్రైమ్ రేటు ఎక్కువగా ఉంటోంది. అయితే, నేరాల సంఖ్య వేలు, లక్షల్లో ఉన్నా, కేసుల నమోదవడం మాత్రం తక్కువే. మోసాలు, లైంగిక వేధింపులు, అప్రతిష్ఠ పాలు చేయడం లాంటి వ్యవహారాల్లో నూటికి 90 నేరాల్లో జనం వీధికెక్కడానికి ఇష్టపడడం లేదని సమాచారం. దాంతో, కేసులు నమోదు కావడం లేదు. ‘జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) సమాచారం మేరకు - కేవలం నమోదైన కేసుల లెక్కే చూసినా- 2010 నుంచి 2013 మధ్య కేవలం మూడేళ్ళ కాలంలో సైబర్ నేరాలు 350 శాతం పెరిగాయి. 2010లో కేవలం 966 సైబర్ నేరాల కేసులు నమోదైతే, 2013 కల్లా ఆ కేసుల సంఖ్య ఏకంగా 4,356కు చేరింది. భారతదేశం మొత్తం మీద గమనిస్తే - ఐ.టి, ఐ.టి సంబంధ పరిశ్రమలకు సంబంధించి 70 శాతానికి పైగా ఆదాయం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తుంది. అందుకు తగ్గట్లే, ఈ రాష్ట్రాల్లోనే ఐ.టి. చట్టం కింద అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయి. నెట్ సౌకర్యంతో పాటే... నేరాలూ... ప్రస్తుతం సగటు సైబర్ క్రైమ్ రేటు ప్రపంచవ్యాప్తంగా 32 శాతం కాగా, భారతదేశంలో 16 శాతమే. అయితే, ప్రపంచ ఇంటర్నెట్ విపణిలో మన భారతీయ మార్కెట్ ఏటా 37 శాతం మేర పెరుగుతోంది. వచ్చే 2017 నాటికల్లా మన దేశంలో 50 కోట్ల మంది దాకా ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారని అంచనా. ఆ దెబ్బతో మనం అమెరికాను మించిపోయి, ప్రపంచంలో చైనా తరువాత నెట్ వినియోగదారుల సంఖ్యలో రెండో అతి పెద్ద దేశంగా అవతరిస్తామన్న మాట! ఆ లెక్కన సైబర్ నేరాల రేటు కూడా బాగా పెరగనుంది. ఈ నేరాల్లో భాగమైన లైంగిక వేధింపుల లాంటివి పక్కనపెట్టి, కేవలం ఆర్థిక నేరాల విషయం చూసినా, మనదేశంలోని ప్రతి నాలుగు సంస్థల్లో ఒకటి ఈ సైబర్ ఆర్థిక నేరాల బారిన పడుతోంది. సైబర్ భూతం బారినపడకుండా ఉండాలంటే... ♦ మీ వ్యక్తిగత సమాచారాన్ని ‘సోషల్ మీడియా ఛాట్’లలో వెల్లడించకండి. ♦ ప్రెమ మోజులో అవతలి వ్యక్తుల్ని అతిగా నమ్మి, వాళ్ళతో చనువుగా ఉంటూ, సెల్ఫీలు దిగడం ఎప్పటికైనా ఇబ్బందే! ♦ పిల్లలు కానీ, యువతీ యువకులు కానీ తల్లితండ్రులకు తెలియకుండా తమ ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయకపోవడమే బెటర్. ♦ ఈ డిజిటల్ యుగంలో ఏ ఫోటో, ఏ వీడియో ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి, మహిళలు తమ సన్నిహితులైనవారితో సహా ఎవరినీ తమ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను రికార్డు చేయనివ్వకూడదు. ♦ అపరిచితులు ఎవరితోనూ ‘సన్నిహితంగా’ ఛాటింగ్ చేయకండి. ప్రైవేట్ ఫోటోలను ఎవరితోనూ షేర్ చేయకండి. ♦ అపరిచితులతో మామూలు ఫోటోలు కూడా పంచుకోవద్దు. వారు దాన్ని ‘మార్ఫింగ్’ చేసి, బ్లాక్‌మెయిలింగ్ చేసే ముప్పు ఎక్కువ. -
క్షమాభిక్షకు అంగీకారం
ఆర్మూర్: దుబాయ్‌లో ఉరిశిక్ష పడ్డ ఖైదీని కాపాడేందుకు ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన యాదగౌడ్ చేసిన కృషి ఫలించింది. బాల్కొండ మండలం మెండోరా గ్రామానికి చెందిన మాకూరి శంకర్‌కు క్షమాభిక్ష లేఖ ఇవ్వడానికి రాజస్థాన్‌కు చెందిన మృతుడు రామావతార్ కుమావత్ కుటుంబసభ్యులు అంగీకారం తెలిపినట్లు దేగాం యాదగౌడ్ బుధవారం తెలిపారు. క్షమాభిక్ష లేఖను సాధించడం కోసం దేగాం యాదగౌడ్ రాజస్థాన్‌లోని జున్‌జున్‌హు జిల్లా తిట్టన్‌వాడ్ గ్రామానికి ఐదు రోజుల క్రితం వెళ్లాడు. మృతుడి కుటుం బానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని అక్కడి పెద్దమనుషులు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన వ్యాపారి ఓం ప్రకాష్ రూ. ఐదు లక్షలు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించాడని, మిగిలిన ఐదు లక్షల రూపాయలను స్థానికంగా విరాళాల రూపంలో సేకరిస్తానని యాదగౌడ్ వివరించారు. రూ. పది లక్షలు మృతుని కుటుంబీకులకు అందజేస్తే వారు క్షమాభిక్ష లేఖ ఇస్తారని, తద్వారా దుబాయ్ చట్టం ప్రకారం శంకర్‌కు ఉరిశిక్షను రద్దు చేయించడానికి అవకాశం ఉందన్నారు. అసలేం జరిగింది.. బాల్కొండ మండలం మెండోరాకు చెందిన మాకూరి శంకర్ వ్యవసాయ కూలీ. 2004లో దుబాయ్‌కి వెళ్లి అక్కడ ఒక కంపెనీలో ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను దుబాయ్ వెళ్లే సమయంలో భార్య గర్భవతి. కొడుకు పుట్టినా శంకర్ స్వస్థలానికి రాలేదు. 2009లో అతనితో పాటు పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామావతార్ కుమావత్ ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడు. దీంతో ఫోర్‌మెన్‌గా ఉన్న శంకర్‌పై హత్యానేరం మోపి దుబాయ్‌లోని ఫుజీరా జైలులో బంధించారు. దుబాయ్ చట్టం ప్రకారం హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి ఉరిశిక్ష విధిస్తారు. శంకర్ తన దీనస్థితిని జైలులోనే అందుబాటులో ఉండే ఫోన్ ద్వారా తన కుటుంబసభ్యులకు తెలి యజేశాడు. తనకు పుట్టిన కొడుకుకు పన్నెండేళ్లు వచ్చినా కూడా చూసుకోలేని దీన స్థితి నుంచి తనను కాపాడాలని వేడుకున్నాడు. అతని భార్య భూదేవి రాజకీయ నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతూ తన భర్తను కాపాడాలని కోరుతోంది. విషయం తెలుసుకున్న దేగాం యాదగౌడ్ బాధితులకు అండగా నిలిచాడు. శంకర్ ప్రాణాలు కాపాడటానికి రాజస్థాన్‌కు వెళ్లాడు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులను కలసి క్షమాభిక్ష లేఖ ఇచ్చే విధంగా ఒప్పించాడు. కానీ, రూ.10 లక్షల సాయమందించాలని మృతుని కుటుంబీకులు కోరారు. ఈ మేరకు రూ.5 లక్షలు ఇచ్చేందుకు అక్కడి ఓ వ్యాపారి ముందుకు వచ్చాడు. మరో రూ.5 లక్షలను తెలంగాణ ప్రభుత్వం సమకూరిస్తే శంకర్‌ను సులభంగా ఉరిశిక్ష నుంచి తప్పించి స్వస్థలానికి చేర్చవచ్చని యాదగౌడ్ అంటున్నారు. -
పార్లమెంటు సమీపంలో వ్యక్తి ఆత్మహత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున పార్లమెంటుకు కూత వేటు దూరంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పార్లమెంట్ పార్కింగ్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ చెట్టుకు వేళాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మధ్యప్రదేశ్ లోని శివపూర్ కు చెందిన రామ్ దయాళ్ వర్మ(39)గా పోలీసులు గుర్తించారు. మృతుడి జేబులోని సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పులు భారంతోనే రామ్ దయాళ్ వర్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యంత భద్రత కల్గిన విజయ్ చౌక్ లో రాష్ట్రపతి నివాసానికి దగ్గర్లో ఈ ఘటన జరిగింది. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. -
మరో మహిళపై మోజు..
♦ భార్యను బెల్టుతో ఉరివేసి చంపిన భర్త ♦ జవహర్‌నగర్‌లో ఘటన ♦ మృతురాలు వరంగల్ జిల్లావాసి జవహర్‌నగర్: మరో మహిళపై మోజుతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను బెల్టుతో మెడకు ఉరివేసి చంపేశాడు. ఏడడుగులు నడిచి అగ్నిసాక్షిగా మనువాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ నర్సింహారావు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజేష్ 2009 మే 9న ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గౌతమి(25)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో గౌతమి తల్లిదండ్రులు రూ. 2.5 లక్షలతో పాటు ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చారు. దంపతులకు 5 ఏళ్ల కూతురు వర్షిక ఉంది. బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టకు వలస వచ్చారు. రాజేష్ ఓ ప్రింటింగ్‌ప్రెస్‌లో పనిచేస్తుండగా గౌతమి సికింద్రాబాద్‌లోని టెలీనార్ స్టోర్‌లో పనిచేస్తూ కుటుంబానికి సాయంగా ఉంది. 6 నెలల క్రితం దంపతులు జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసి ఇక్కడికి తమ మకాం మార్చారు. కుటుంబ కలహాలతో దంపతులు రెండేళ్లుగా గొడవపడుతున్నారు. పలుమార్లు ఇరువర్గాలకు చెందిన పెద్దలు పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు సర్దిచెప్పారు. మరో అమ్మాయిపై మోజు.. రాజేష్ కొంతకాలంగా వేరే అమ్మాయితో సెలఫోన్లో మాట్లాడుతూ ఆమెతో చనువుగా ఉండసాగాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడని గౌతమి తన తల్లిదండ్రులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో ఇటీవల గొడవలు మరింత ముదిరాయి. అయినా రాజేష్ ప్రవర్తనలో మార్పురాలేదు. మంగళవారం రాత్రి ఈవిషయంలో భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. అర్ధరాత్రి సమయంలో రాజేష్ గౌతమి మెడకు బెల్ట్‌తో ఉరిబిగించి చంపేశాడు. మంగళవారం తెల్లవారుజామున గౌతమి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులకు తెలిపిన రాజేష్ జవహర్‌నగర్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. శామీర్‌పేట తహసీల్దార్ రవీందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. జవహర్‌నగర్ సీఐ నర్సింహరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనుమానంతో రాజేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా క్షణికావేశానికి గురై గౌతమిని బెల్ట్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశానని అంగీకరించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించడంతో స్వగ్రామానికి తీసుకెళ్లారు. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ.. పట్నంబోయి బాగా బతుకుతానంటివి బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా.. బిడ్డా అంటూ గౌతమి తండ్రి బెల్లం బీరయ్య బోరున విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పట్నంలో ఇల్లు కొనుక్కొని మంచిగా బతుకుతున్నారేమోననకున్నాను.. పాపను మాకిచ్చి నువ్వు వెళ్లిపోతివా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
దెయ్యాలు వెంబడిస్తున్నాయంటూ..
జూబ్లీహిల్స్: మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్ హనుమాన్ దేవాలయం సమీపంలో నివసించే బాల రాజు(45) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిగా విపరీతమైన భయానికి గురవుతున్నాడు. కుటుంబ సభ్యులు ఏమైందని ప్రశ్నిస్తే తనను దెయ్యాలు, భూతాలు వెంబడిస్తున్నాయంటూ చెప్పేవాడు. సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లికావడం లేదని..
జూబ్లీహిల్స్: ప్రేమించిన వ్యక్తితో పెళ్లికావడం లేదని మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ జవహర్కాలనీలో నివసించే గాలి లక్ష్మీప్రియ(25) ఓ ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తున్న ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని కోరగా.. తనకు ఓ వ్యాధి ఉందని, పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తాయని అతడు చెప్పాడు. దీంతో ఆమె వెనుకడుగు వేసింది. అయితే అతడిని పెళ్లి చేసుకునేందుకు మరో యువతి ముందుకు రావడంతో లక్ష్మీప్రియ మనస్తాపానికి గురైంది. తన చావుకు ఎవరూ కారణంకాదంటూ సూసైడ్ నోట్‌రాసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బతకాలని లేదని యువతి..
యాకుత్‌పురా: ఫ్యాన్‌కు ఉరేసుకొని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రకాశ్‌రెడ్డి వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతానికి చెందిన నాగిరెడ్డి కూతురు కల్పన రెడ్డి(23) అబిడ్స్‌లోని మెథడిస్ట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల సమీపంలోని ఓ హాస్టల్ ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న ఆమె ఆదివారం చాంద్రాయణగుట్ట డీఆర్డీఎల్ క్వార్టర్స్‌లో నివాసముండే మామయ్య నరేందర్ రెడ్డి ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గదిని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. తమ్ముడిని బాగా చూసుకోవాలని... తనకు బతకాలని లేదని ఉంది. కామారెడ్డిలోని కల్పన ఇంటి పక్కన ఉండే శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడు ప్రేమించమని వేధించేవాడని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మామ నరేందర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జనగామ : ఉరివేసుకుని ఓ బీటెక్ ఫైనలి యర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని 20వ వార్డు పరిధిలోని పోలీస్టేషన్ ఎదురుగా మంగళవారం రాత్రి జరిగింది. తల్లి కృపానందిని కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బైరు అర్జున్, కృపానందినికి కూతురు బాలనందిని(22), కుమారుడు మహేష్ ఉన్నారు. తండ్రి అర్జు న్ ఆరేళ్ల క్రితం మృతిచెందడంతో కుటుంబ భారం తల్లిపై పడింది. బాలనందిని హైదరాబాద్‌లోని విజయవాడ హైవేలోగల పోచంపల్లి శివారు దేశ్‌ముఖ్ గ్రామంలోని సెయింట్ మెరీస్ ఇం జనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనలియర్ చదువుతుండగా, కుమారుడు మహేష్ పాలీటెక్నిక్ చదువుతున్నాడు. శ్రీరామనవ మి పండుగ కోసం బాలనందిని 15 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. 20వ తేదీ కళాశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తల్లి పని ముగించుకుని ఇంటికి రాగా కూతురు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. స్థానికులు వచ్చి కిటికీ లోంచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సంతోషం రవీందర్ అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకునే కష్టాలు నందినికి లేవని స్థానికులు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాలలో ఎవరైనా బెదిరించా రా.. లేక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలను స్థానికు లు వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి కృపానందిని నుంచి ఎస్సై వాంగ్మూలం తీసుకున్నారు. -
అలా ఐదుగురి మొండాలను వేలాడదీశారు....
రియాద్: సౌదీ అరేబియాలో ఇస్లాం చట్టాలను ఉల్లంఘించినా, చిన్నపాటి నేరాలకు పాల్పడినా అమానుష శిక్షలను అమలు చేస్తారు. టెర్రరిస్టులకన్నా భయానకంగా రాళ్లతో కొట్టి చంపుతారు. కరవాలంతో ఒక్క వేటున కుత్తుకను తెగ నరికి చంపేస్తారు. సౌదీ రాజధాని రియాద్‌లో ఇటీవల జరిగిన ఇలాంటి అమానుష హత్యలను ఓ మీడియా బృందం ప్రాణాలకు తెగించి డాక్యుమెంటరీగా చిత్రీకరించింది. విదేశీయులనే కాకుండా దేశీయులెవరూ కూడా ఇలాంటి శిక్షలను కళ్లతో ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప, ఫొటోలు తీయనీయరు, వీడియోల్లో చిత్రీకరించనీయరు. ఎవరైనా అలా చేసేందుకు ప్రయత్నిస్తే వారి ప్రాణాలను కూడా ఇలాగే తీస్తారు. దొంగతనానికి పాల్పడిన ఓ ఐదుగురు వ్యక్తులను సౌదీ పోలీసులు ఇటీవల ‘చాప్ చాప్’ (తలలు నరికే చోటు) సెంటర్‌కు ఈడ్చుకొచ్చారు. కత్తితో మెడ వరకు వారి తలలను నరికేశారు. అనంతరం ఆ ఐదుగురి మొండాలను రెండు క్రేన్ల మధ్య ఓ వెదురు బొంగుకు గాలిలో వేలాడదీశారు. వారం రోజులపాటు జనం వీక్షణం కోసం వాటిని అలాగే ఉంచారు. ఆ తర్వాత మరో రోజు సవతి కూతురును హత్య చేశారనే ఆరోపణలపై నల్లటి వస్త్రాలు ధరించిన ఓ మహిళను దారుణంగా తల నరికి చంపేశారు. ‘నేనే పాపం చేయలేదు’ అంటూ ఆ మహిళ హృదయవిదారకంగా అరవడం మీడియా తీసిన డాక్యుమెంట్లో స్పష్టంగా వినిపిస్తోంది. హత్యలు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, సాయుధ దోపిడీలు, తాంత్రిక పూజలు లాంటి నేరాలకు సౌదీలో ఇంత దారుణంగా మరణ శిక్షలు విధిస్తారు. మత్తపదార్థాలు సేవిస్తూ పలుసార్లు పట్టుబడినా రాళ్లతో కొట్టి చంపుతారు. సౌదీ ప్రభుత్వాన్ని లేదా ఇస్లాం మతాన్ని దూషిస్తే వెయ్యి కొరడా దెబ్బలతోపాటు పదేళ్ల నుంచి యావజ్జీవ కారాగారం వరకు శిక్షలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో నిందితులు కొరడా దెబ్బలకే ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి. సున్నీలు మినహా అన్య మతస్థులందరిని సౌదీ ప్రభుత్వం ద్వేషిస్తుంది. క్రైస్తవులను, యూదులను, షియాలను కూడా చంపేయాలంటూ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తారు. ఈ విషయాలు కూడా మీడియా డాక్యుమెంటరీలో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఇస్లాం పేరిట సౌదీ అరేబియా ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా బ్రిటన్ మాత్రం సౌదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఇరు దేశాల రాజ కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిన్స్ చార్లెస్ ఎన్నోసార్లు సౌదీలో పర్యటించారు. సౌదీ నుంచి బ్రిటన్ పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తూ, అందుకు ప్రతిగా ఆయుధాలను విక్రయిస్తోంది. అల్ ఖాయిదానే కాకుండా ప్రపంచంలో ఏ టైర్రరిస్టు సంస్థతో తమకు సంబంధాలు లేవని చెప్పుకునే సౌదీకి అల్ ఖాయిదాతో సంబంధాలున్న విషయాన్ని మీడియా డాక్యుమెంటరీ వెల్లడిస్తోంది. టెర్రరిస్టులకు సౌదీ ప్రధానంగా బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్న ఆయధాలను విక్రయిస్తోంది. ఈ మీడియా డాక్యుమెంటరీని అమెరికా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ సహకారంతో ఐటీవీ మంగళవారం రాత్రి ప్రసారం చేస్తోంది. -
'మా టీచర్ వినలేదు.. అందుకే చనిపోతున్నా'
న్యూఢిల్లీ: ఓ టీచర్ ఆగ్రహంతో వ్యవహరించడంతో అవమానంగా, ఒత్తిడిగా భావించిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని నిండు ప్రాణాలు బలితీసుకున్నాడు. అక్కడే ఓ సూసైడ్ నోట్ రాసి తన చావుకు మా టీచరే కారణమంటూ అందులో పేర్కొన్నాడు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం.. ఢిల్లీలోని ఘాజిపూర్లో తరుణ్ అనే విద్యార్థి చదువుతున్నాడు. అతడు స్కూల్ కి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడంతో అక్కడి టీచర్‌కు ఆగ్రహం కలిగింది. అతడి చేతిలోని ఫోన్ లాగేసుకుని ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకెప్పుడూ తాను మొబైల్ ఫోన్ తీసుకురానని ఆ విద్యార్థి బ్రతిమిలాడుకున్నా ఆ టీచర్ మాత్రం అలా ఇవ్వడం కుదరదని వెళ్లి తల్లిదండ్రులను తీసుకొని రా అనే గట్టిగా అతడికి చెప్పడంతో అవమానంగా భావించిన అతడు ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. శనివారం టీచర్, విద్యార్థికి మధ్య ఈ ఘటన చోటుచేసుకోగా అతడు ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
నవవధువు ఆత్మహత్య
వరకట్న వేధింపులకు ఓ నవ వధువు బలైంది. ఈ సంఘటన విశాఖ జిల్లా చినగడిలి మండలం సంతపాలెం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుక్కచంటి(30)కి లక్ష్మి(25)తో ఆర్నెళ్ల కిందట వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అత్తింటి వారే తమ బిడ్డను చంపి ఆత్మహత్యగా చిత్రీక రిస్తున్నారని వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
సినిమాల్లో ఛాన్స్ రాలేదని..
లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య పెద్దాపురం(సామర్లకోట) : గాయకుడై గాత్రం వినిపించాల్సిన ఆ గొంతుకు ఉరితాడు బిగిసి.. శాశ్వతంగా మూగబోయిన సంఘటన ఇది. సినిమాల్లో సింగర్ కావాలని కలలు కన్న అతడు.. చదువును కూడా నిర్లక్ష్యం చేసి.. పాటలు పాడే ఛాన్స కోసం ఎంతో ప్రయత్నించాడు. అటు సినిమాల్లో పాడే అవకాశం లభించక.. ఇటు చదువూ దక్కకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఇంట్లో ముఖం చూపించలేనంటూ ఆ యువకుడు ఓ లాడ్జిలో ఉరి వేసుకున్నాడు. ఎస్సై వై.సతీష్ కథనం ప్రకారం.. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నానికి చెందిన మందారపు వెంకట్రాజు (24) ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. అతడి తల్లిదండ్రులు శ్రీనివాస్, ఆదిలక్ష్మి కౌలు వ్యవసాయం చేస్తున్నారు. వీరు రెండెకరాలు కౌలు సాగు చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడైన వెంకట్రాజు ఇంకా పై చదువులు చదువుతున్నానంటూ ఇంట్లో తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకునేవాడు. అతడికి సినిమాల్లో సింగర్ కావాలని కోరిక ఉండేది. ఆ ప్రయత్నం కోసం హైదరాబాద్, చెన్నై చుట్టూ అనేకసార్లు తిరిగాడు. అతడికి ఎటువంటి అవకాశం లభించకపోవడంతో తీవ్ర నిరాశ చెందాడు. ఇంటికి వెళ్లి ముఖం చూపించలేక, ఈ నెల 18న పెద్దాపురంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. రెండు రోజుల అద్దె ముందుగా చెల్లించాడు. ఎక్కువ రోజులు ఉండడంతో, అద్దె తర్వాత ఇస్తానని లాడ్జి నిర్వాహకులతో చెప్పారు. ఇలాఉండగా గురువారం ఉదయం నుంచి వెంకట్రాజు గది తలుపులు తెరువలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది సాయంత్రం గది కిటికీ నుంచి లోనికి చూశారు. ఫ్యాన్‌కు వెంకట్రాజు ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించి, ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సతీష్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గదిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ఇంటికి వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, ఎస్సై సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు చనిపోయాడని తెలిసి వెంకట్రాజు తల్లిదండ్రులు బోరున విలపించారు. -
అవంచలో రైతు ఆత్మహత్య
అప్పుల బాదతాళలేక ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో బుధవారం జరిగింది. అవంచ గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్ (38) పంట సాగుకోసం రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పుల బాధ తాళలేక బుధవారం ఉదయం తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కూతళ్లు ఉన్నారు. పెద్దకూతరు పూజితకు పెళ్ళి చేశాడు. రెండో కుమార్తె అశ్విని పదో తరగతి చదువుతోంది. పండగ పూట ఇంటి పెద్ద చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
తల్లి మరణం తట్టుకోలేక
తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఎల్కపల్లి భూమయ్య - బాలమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారం రోజుల క్రితం బాలమ్మ మరణించింది. ఏడాది క్రితం భూమయ్య పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వీరి కుమారుడు రాజు(35) బుధవారం రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మెదక్ పోలీసులు కేసు నమోదు చేసి.. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. -
అప్పుల బాధ తో రైతు బలవన్మరణం
అప్పుల భారం మరో కౌలు రైతు ఉసురు తీసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శేరిపల్లి యాదయ్య(52) గత కొన్నేళ్లుగా 15 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. పత్తి, మొక్కజొన్న పంటలు సరిగా పండకపోవటంతో రూ.లక్ష అప్పు మిగిలింది. కూతురు పెళ్లి కోసం రూ.2 లక్షల అప్పు అయింది. పంటలు సరిగా లేక అప్పులు తీరేదారి కానరాక మనస్తాపం చెందిన యాదయ్య మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య అంజమ్మ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
ఉరివేసుకుని వివాహిత మృతి
కోడూరు : వివాహమై నాలుగు నెలలు కూడా గడవకముందే ఒక వివాహిత అత్తవారింట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన సూరం హరినాథం, కృష్ణకుమారిల కుమార్తె రాజ్యలక్ష్మి(24)కి కోడూరు శివారు యర్రారెడ్డివారిపాలెం గ్రామానికి చెందిన పోతుల రామాంజనేయులు కుమారుడు సురేష్‌తో ఈ ఏడాది మే 27న వివాహమైంది. సురేష్ మచిలీపట్నం గొడుగుపేటలోని ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజ్యలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతోంది. అత్తమామలు పొలంపనుల నుంచి వచ్చిచూసే సరికి రాజ్యలక్ష్మి మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్సై వై.సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతురాలి బంధువులు ఇంకారావాల్సి ఉందని మృతికి గల కారణాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
భూసేకరణ గీసిన చావుగీత
భార్య సంవత్సరీకం చేయలేనన్న బెంగతో పేదరైతు బలవన్మరణం ఏడు పదుల వృద్ధ్యాప్యం. చేతిలో చిల్లిగవ్వలేదు. కష్టసుఖాల్లో యాభై ఏళ్లు పాలుపంచుకున్న భార్య ఏడాది క్రితమే కాలధర్మం చేసింది. ఆమె సంవత్సరీకం నిర్వహించాలన్నది ఆ పేద రైతు చిన్న ఆశ. ఉన్న పదిసెంట్ల పొలాన్నిను అమ్మకానికి పెట్టారు. అయితే ఊహించని ఎదురుదెబ్బ. పోర్టు నోటిఫికేషన్లో అధికారులు ఆ పది సెంట్లనూ చేర్చారు. రూ.లక్షకు పొలాన్ని కొనేందుకు రూ.10 వేలు అడ్వాన్సుగా ఇచ్చిన రైతులు ఆ మొత్తాన్ని తిరిగి తీసుకున్నారు. భార్య సంవత్సరీకం చేయలేని ఈ బతుకు ఎందుకు అనుకున్నాడో లేక ఆమె వద్దకే వెళ్లి తన నిస్సహాయతను చెబుతామనుకున్నాడోగానీ ఆ పేద రైతు ఇంటి ముందున్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. కాకర్లమూడి (పెడన రూరల్) : బందరు పోర్టు భూసేకరణలో తనకున్న కొద్ది పాటి భూమి పొతుందనే బెంగతో పేద రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెడన మండలం కాకర్లమూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన లింగం వెంకటేశ్వరరావు(70)కు పది సెంట్ల పొలం ఉంది. కొద్దిపాటు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. ఆయన భార్య సీతామహాలక్ష్మి గతేడాది మృతి చెందారు. వారికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు గతంలో చనిపోయారు. పిల్లలందరికీ వివాహాలుకావడంతో వేరువేరుగా జీవిస్తున్నారు. వారిదీ అంతంత మాత్రపు జీవితాలే. భార్య సీతామహాలక్ష్మి చనిపోవడంతో మూడో కుమారుడు శివ ఇంటి వద్ద వెంకటేశ్వరరావు జీవనం సాగిస్తున్నారు. చేటుచేసిన పోర్టు నోటిఫికేషన్ మచిలీపట్నం పోర్టు కోసం బందరు మండలంలోని పలు గ్రామాలతో పాటు పెడన మండలంలో కాకర్లమూడి గ్రామంలోనూ భూములు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. కాకర్లమూడిలో 1879 మంది రైతులకు చెందిన 864 ఎకరాల పొలాలను సేకరిస్తామని భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. లింగం వెంకటేశ్వరరావుకు చెందిన పది సెంట్లు పొలం కూడా ఆ నోటిఫికేషన్లో ఉంది. పది సెంట్లలో అతను ఇన్నాళ్లూ గొంగూర, తోటకూర, పొట్ల, చిక్కుడు సాగుచేసుకుని జీవనం సాగిస్తుం చారు. గత ఏడాది మరణించిన భార్యకు ఈ నెల 30వ తేదీన సంవత్సరీకం చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వరరావు ఆ పది సెంట్లు పొలాన్ని అమ్మకానికి పెట్టారు. స్థానిక రైతులు ఆ పొలాన్ని రూ.లక్ష కు కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకుని రూ.1ఏవేలు అడ్వాన్సుగా ఇచ్చారు. పోర్టు భూసేకరణలో ఆ పొలం ఉండటంతో అడ్వాన్సుగా ఇచ్చిన నగదును తిరిగి తీసుకున్నారు. దీంతో తన భార్యకు సంవత్సరీకం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని పలువురి వద్ద వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ఇంటి ముందున్న వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు స్వాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ ఎ.గణేష్‌కుమార్, ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టెబుల్ సుబ్రహ్మణ్యం, నాగమల్లేశ్వరరావు, వీరాబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారి రాజు నుంచిస్టేట్మెంట్ నమోదుచేశారు. కుటుంబాన్ని ఆదుకోవాలి పోర్టు భూసేకరణలో సన్నకారు రైతుల భూములను ప్రభుత్వం సేకరించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాదు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు మృతి విషయం తెలవగానే సంఘటనా స్థలానికి త రలి వెళ్లి మృతుడికి నివాళులర్పించారు. ఆయనతో పాటు పెడన మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు బండారు ఆనందప్రసాదు, పెడన మండల ప్రతిపక్ష నాయకుడు రాజులపాటి అచ్యుతరావు, మండల పార్టీ అధ్యక్షుడు దావు భైరవలింగం, పెడన కౌన్సిలర్ మెట్ల గోపి, కాకర్లమూడి సర్పంచి వాకలరావు, మాజీ సర్పంచి జన్యావుల మారేశ్వరావు, సీపీఎం నాయకులు పంచల రామ నరసింహారావు, సజ్జా మూర్తిరాజు, కొడాలి శర్మ, తదితరులు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
'వీల్ చైర్లో ఉన్న నేరస్తుడిని ఎలా ఉరి తీయాలి'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలిసారి ఓ ఉరిశిక్షను అమలు చేయకుండా వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన సమయంలో ఉరి తీసే కార్యక్రమాన్ని నిలిపివేయడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హం. ఓ హత్య కేసు విషయంలో అబ్దుల్ బాసిత్ (43) అనే వ్యక్తిని పాకిస్థాన్ పోలీసులు గతంలో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు చివరకు ఉరిశిక్ష విధించింది. కోర్టు విధించిన శిక్ష ప్రకారం అతడిని పంజాబ్‌లోని ఫైసలాబాద్ జైలులో మంగళవారం ఉదయమే ఉరితీయాలి. కానీ, అతడి విషయంలో గత కొంతకాలంగా హక్కుల సంఘంవారు పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ నేరస్థుడు ఒక వికలాంగుడు. ప్రస్తుతం అతడు చక్రాల కుర్చీ మీద ఉండే జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. స్థానిక చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని ఉరితీసేముందు అతడు ఉరికంభం వద్ద నిల్చుని ఉన్నప్పుడే తలారీ అతడి మెడకు ఉరితాడు బిగించాలి. కానీ బాసిత్ వికలాంగుడు కావడం వల్ల నిల్చునే అవకాశం లేదు. దీనిపై ఇప్పటికే జైలు అధికారులు పంజాబ్ హోంశాఖను అభిప్రాయం కోరినా ఉరిశిక్ష అమలు తేదీ వరకు కూడా వారు ఓ నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉరి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి తలలు పట్టుకున్నారు. 2009లో బాసిత్ ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం టీబీ కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతంతోనే అతడు వీల్ చైర్లో ఉండి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. -
అన్నదాత మెడకు అప్పు ఉరి
పది మంది ఆత్మహత్య * అందులో ఒకరు మహిళా రైతు * ఇద్దరికి గుండెపోటు సాక్షి నెట్వర్క్: వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మెడకు అప్పుల ఉరి చుట్టుకుంటోంది. కాలం కలసి రాక.. సరైన గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్న అన్నదాతపై అప్పుల భారం పెరుగుతుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. తెలంగాణ జిల్లాల్లో సోమవా రం పది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో ఒకరు మహిళా రైతు. మరో ఇద్దరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన సప్పిడి మాసయ్య(38) పదకొండు ఎకరాల్లో పంటలు వేయడానికి సుమారు రూ. 10 లక్షల అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంటల దిగుబడి తగ్గింది. దీంతో అప్పులు తీరే మార్గం కనిపించక పురుగుల మందు తాగాడు. ఇదే జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన సాకలి జంగయ్య(46) తనకున్న ఎకరం 20 గుంటలతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట ఎండి పోవడం, రూ. 3 లక్షల అప్పుల పాలవడంతో ఉరేసుకున్నాడు. బల్మూర్ మండలం చెన్నారంలో సంకెళ్ల చిన్నయ్య (60) ఐదు బోర్లులు వేసి అప్పులపాలై ఉరేసుకున్నాడు. మానవపాడు మండలం ఉండవెల్లికి చెందిన రైతు సుధాకర్ గౌడ్ మూడేళ్లుగా కందులు, పొగాకు పంటలు వేసి నష్టపోయాడు. అప్పులపాలయ్యాడు. దీంతో ఈ నెల 17న తన పొలంలో గుళికల మందు మింగాడు. మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన చింతల సత్యనారాయణ(44) తన రెండు ఎకరాల్లో గతేడాది నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. సాగు, కూతురు వివాహానికి కలిపి మొత్తం రూ. 7 లక్షల వరకు అప్పు చేశాడు. పంట ఎండిపోయింది. అప్పులు తీర్చలేక తన పొలం వద్ద ఉరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరుకు చెందిన తలారి మల్లేశ్(40) వ్యవసాయం కోసం ప్రైవేటుగా రూ. లక్ష, బ్యాంకులో రూ. 50 వేలు రుణం తీసుకున్నాడు. అప్పు తీరే మార్గం కనిపించక ఆది వారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కు చెందిన రాథోడ్ దేవు(60) పత్తిపంట వర్షపు నీటిలో మునిగి పోయింది. దీంతో మన స్తాపం చెంది పురుగుల మందు తాగాడు. ఇదే జిల్లా సిర్పూర్(యూ) మండలం రాగాపూర్కు చెందిన చిక్రం నాగోరావు(55) పత్తి పంట వర్షాలకు నాశనం కావడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లికి చెం దిన రైతు లింగురాం(60) ఇంట్లో ఉరివేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు హన్మాల శివరాజయ్య(55) అప్పులు తీర్చలేక గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. విద్యుత్ తీగలు పట్టుకొని.. మెదక్ జిల్లా మనూరు మండలం తుమ్నూర్‌కు చెందిన రైతు పంచగామ విఠల్(35) అప్పులు పెరుగుతుండడంతో దిక్కుతోచని స్థితిలో విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విఠల్‌కు తనకున్న మూడు ఎకరాల్లో ఆరు బోర్లు వేయించాడు. అందులో ఐదు బోర్లు ఫెయిలయ్యాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొటాల్పల్లి రైతు మల్యాల సురేశ్(31) రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక ట్రాన్ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. షాక్‌కు గురైన సురేష్‌ను హైదరాబాద్‌కు తరలించారు. అమ్మా.. పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇవ్వు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెం దిన మహిళా కౌలు రైతు మాడ సాగరిక(24) మూడేళ్లుగా ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తోంది. ఆమె భర్త నారాయణరెడ్డి ఇటుకబట్టీలో కూలికి వెళ్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల్లో ఏనాడూ పంట సరిగా చేతికి రాలేదు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ. 5.50 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది పత్తి ఎర్రబొమ్మిడి రోగంతో పూర్తిగా దెబ్బతింది. దీంతో మనస్తాపం చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగింది. ‘అమ్మా ఏమీ అనుకోవద్దు.. పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు అప్పులోళ్లకు ఇవ్వు. విన్ను, విక్కు(కొడుకుల ముద్దుపేర్లు)లను ఎవరికైనా దత్తత ఇవ్వు.. లేదా అనాథ ఆశ్రమంలో చేర్పించు.. ఇంకా ఉన్న అప్పుల వివరాలు బీరువాలో ఉన్నాయి..’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టింది. -
యాకూబ్ కేసులో చానళ్లు ‘లక్ష్మణ రేఖ’ దాటాయి: కేంద్రం
న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ ఉరితీత కేసు కవరేజ్‌లో కొన్ని వార్తా చానళ్లు హద్దులు మీరాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ అన్నారు. ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించకుండా వారే స్వీయ నియంత్రణ పాటించాలని బుధవారమిక్కడ ఓ సదస్సులో పేర్కొన్నారు. ఇటీవల పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని తమ శాఖ చేసిన సూచనలను కొన్ని చానళ్లు పెడచెవిన పెట్టాయన్నారు. యాకూబ్ ఉరితీత కేసు కవరేజిలో కొన్ని చానళ్లు లక్ష్మణ రేఖను దాటాయని, టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు చోటా షకీల్ (మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు)తో మాట్లాడించాయని అన్నారు. -
విద్యార్థినుల ఆత్మహత్యలపై విచారణకు ఆదేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ జిల్లాలో నారాయణ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి తర్వితగతిన నివేదిక ఇవ్వాలని గంటా ఆదేశించారు. కాగా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నెలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విద్యార్థినుల మృతదేహాలకు కడప రిమ్స్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. -
మద్యం మత్తులో ఉరేసుకున్నాడు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన తన్నీరు మహేందర్ (30) అనే యువకుడు మద్యం మత్తులో శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిస అయిన మహేందర్ ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా మహేందర్ ఉరి వేసుకున్నాడు. దాంతో అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మద్యానికి బానిస అయిన మహేందర్ కుటుంబ పోషణను పట్టించుకోకుండా ఉండేవాడని గ్రామస్థులు వెల్లడించారు. మద్యం మత్తులోనే అతడు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారని చెప్పారు. మహేందర్ భార్య భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముడి ఉరితీతపై రగిలిపోతున్న అన్న
-
ప్రతీకారం తీర్చుకుంటా : టైగర్ మమన్
-
'చుండూరు హంతకులకు ఉరిశిక్ష వేయాలి'
కవాడిగూడ: చుండూరులో దళితులను ఊచకోత కోసిన హంతకులకు ఉరి శిక్ష వేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. వేర్వేరు సందర్భాల్లో ఉరి శిక్షలు వేస్తున్నారు కానీ, దళితులపై అమానుషంగా హత్య చేసిన హంతకులకు ఈ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఎందుకు ఉరిశిక్ష వేయడం లేదని ప్రశ్నించారు. చుండూరు ఘటనకు 25 ఏళ్లు నిండిన సందర్భంగా ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చుండూరు హంతకులను శిక్షించాలని నినాదాలు చేశారు. వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో చుండూరులోనే ప్రత్యేక న్యాయస్థానం వేసినా భాధితులకు న్యాయం జరగకపోవడం దుర్మార్గం అన్నారు. జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి 'కుల' దురహంకార పూరితంగా వ్యవహరించి ప్రత్యేక కోర్టులో వేసిన శిక్షణను హైకోర్టులో కొట్టివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చుండూరు బాధితులకు న్యాయం జరగాలంటే హంతకులకు ఉరి శిక్ష వేయడమే సరైందని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ భాషా, నాయకులు చేపూరి రాజు, సంకు శ్రీనివాస్, అర్షల రాజు, మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షులు నక్కా దేవేందర్ రావు, ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరం నాయకులు పి. మురళి పాల్గొన్నారు. -
ఉరికి కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ఉరి శిక్ష విషయంలో కూడా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. బుధవారం సమావేశాల నేపథ్యంలో పార్లమెంటుకు వచ్చిన ఆయన ఇటీవల ఉరి తీసిన యాకుబ్ మెమన్ ఉరి విషయంలో కొందరు వ్యక్తులు భిన్నరకాల అభిప్రాయాలు వెలువరిస్తుండటంపై మీడియా వెంకయ్యనాయుడిని ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. 1993నాటి ముంబయి పేలుళ్ల కేసులో మెమన్ను గత వారం ఉరితీసిన విషయం తెలిసిందే. నాటి దాడిలో మొత్తం 257మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో వెంకయ్య మాట్లాడుతూ.. 'మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియల రోజు చాలామంది వేరే అంశంపై దృష్టిని నిలిపారు. ఇక కొన్ని మీడియాలైతే ఎంతమందిని ఇప్పటివరకు ఉరి తీశారు. ఏ వర్గం వారిని ఉరి తీశారనే సంఖ్యలను ఇచ్చారు. వాస్తవానికి ప్రజలు మాత్రం ఈ విషయాలు అంతగా పట్టించుకోవడం లేదు. గతంలో 36మందిని ఉరితీశారు. వీరిలో మక్బూల్ భట్, అఫ్జల్ గురు, కసబ్‌తోపాటు ఇతరులు కూడా ఉన్నారు. ఈ సమయంలో నేను ఏ వర్గానికి చెందిన వారనే విషయంపై మాట్లాడను. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందిని ఉరితీశారనే విషయంలో స్పష్టమైన వివరాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సబబు. ఉరితీసే విషయంలో మీరేమైనా రిజర్వేషన్లు కోరుకుంటున్నారా?ఈ విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను' అని వెంకయ్య మీడియాకు బదులిచ్చారు. -
ఉరి సరి కాదు
దూకుడుమీద ఉన్న మీడియా ప్రభావం కావచ్చు. సమీపిస్తున్న బిహార్ ఎన్ని కలలో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడల ఫలితం కావచ్చు. ప్రబలిన ప్రజా స్వామ్య స్ఫూర్తి కావచ్చు. ఉగ్రవాది యాకూబ్ మెమన్ ఉరిపైన చర్చ దేశ వ్యాపి తంగా, ఆవేశపూరితంగా, అర్థవంతంగా జరిగింది. వారంరోజుల పాటు ఇదే ప్రధాన చర్చనీయాంశమై దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్నది. చర్చ జరగడం సం తోషం. మెమన్ ఉరితో చర్చ ఆగిపోకూడదు. మరణశిక్ష రద్దు అవసరమా, కాదా అనే విషయంపై వాదోపవాదాలు కొనసాగాలి. అనవసరమంటూ సమాజం అంగీకరించేవరకూ తర్జనభర్జన జరగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థపైనా, చట్టపాలనపైనా, వివక్షలేని పరిపాలనపైనా అపారమైన విశ్వాసం ఉన్నప్పుడే మరణ దండన అవసరం తగ్గిపోతుంది. అప్పుడే భారత్ ఒక నాగరిక సమాజంగా తల ఎత్తుకొని నిలబడగలుగుతుంది. మెమన్ ఉరిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. నిజంగా మరణదండనలో రాజకీయం లేదా? ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నదా? బీజేపీ చేయడం లేదా? అసలు రాజకీయ ప్రమేయం లేని విషయం అంటూ ఏదైనా ఉన్నదా? కీలకమైన పదవులలో ఉన్న వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అతీతమైనదంటూ ఏమైనా ఉన్నదా? నిజంగానే న్యాయవ్యవస్థ తన పని తాను చేసుకుంటూ సజావుగా సాగిపోతున్నదా? సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పును విమర్శిం చడం నేరమా? ఇద్దరు జడ్టిల బెంచ్‌లోని న్యాయమూర్తులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు ఎవరి వాదన రాజ్యాంగబద్ధమైనది? ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? మెమన్ వివాదం లేవనెత్తిన ఇటువంటి అనేక ప్రశ్నలకు సమంజసమైన, సంతృప్తికరమైన సమాధానాలు లభించవు. మెమన్ సమాధి అయినప్పటికీ ఈ ప్రశ్నలు సమాజాన్ని వేధిస్తూనే ఉంటాయి. నిందితుడు ఎంతటి నేరం చేసినా మరణశిక్ష విధించరాదనే వాదనను ఆమోదించిన దేశాలు ప్రపంచంలో 130కి పైగా ఉన్నాయి. ఐరోపా దేశాలలో మరణశాసనం లేదు. మనిషి ప్రాణాలు తీయరాదనీ, మరణశిక్ష అమలు జరిగిన తర్వాత న్యాయస్థానం పొరపాటుగా తీర్పు ఇచ్చిందని వెల్లడైతే? పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలమా? మరణదండన వల్ల నేరాలు తగ్గిన సూచ నలు లేవనీ, మరణశిక్ష అమలు జరపడం కక్ష తీర్చుకోవడమేననీ వాదించేవారికి ఆ దేశాలలో సంఖ్యాధిక్యం ఉంది. న్యాయమూర్తులూ మానవ మాత్రులే. వారికీ సొంత అభిప్రాయాలుంటాయి. వాటి ప్రభావం తీర్పులపై ఉండి తీరుతుంది. నేరాలు తగ్గలేదు మరణశిక్ష వల్ల నేరాలు తగ్గలేదని నిరూపించేందుకు కేంద్రమాజీ మంత్రి శశి థరూర్ ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 1980 నుంచి 1990 వరకూ పది మంది హంతకులకు భారత శిక్షాస్మృతి 302 సెక్షన్ కింద మరణశిక్ష అమలు చేశారు. ఆ దశకంలో హత్యలు 22,149 నుంచి 35,045కు పెరిగాయి. అదే విధంగా 1990-2000 దశకంలో ఎనిమిది మందిని ఉరి తీసినప్పటికీ హత్యల సంఖ్య 35,045 నుంచి 37,399కి పెరిగింది. 2000 నుంచి 2010 వరకూ ఒకే ఒక కామాంధుడైన హంతకుడిని మాత్రమే ఉరి తీశారు. ఆ దశకంలో దేశంలో హత్యల సంఖ్య 37,399 నుంచి 33,335కి తగ్గింది. సారాంశం ఏమిటి? మరణ శిక్ష నిష్ర్పయోజనమనేగా? సుప్రీంకోర్టు మరణశిక్ష విధించిన తర్వాత క్షమాభిక్ష కోరుతూ దోషులు పెట్టుకున్న అర్జీలపైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతులకు రాజ్యాంగం 72వ అధికరణ దఖలు పరచింది. మరణదండనను రద్దు చేయవచ్చు. దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు. ఇక్కడ యావజ్జీవం అంటే 14 సంవ త్సరాలు కాదు. దోషి శేష జీవితం అంతా జైలులోనే ఉండాలి. రాష్ట్రపతులం దరిలోనూ ఆర్. వెంకటరామన్ అత్యధిక క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. రాష్ట్రపతిగా పనిచేసిన 1987-92 కాలంలో ఆయన 44 అర్జీలను బుట్టదాఖలు చేశారు. కె.ఆర్.నారాయణన్ ఒక్క క్షమాభిక్ష వినతిని కూడా తిరస్కరించలేదు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఒకే ఒక మహిళ ప్రతిభాపాటిల్ కూడా అంతే. ఆమె 30 మంది హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించారు. అబ్దుల్ కలాం దాదాపు పాతిక పిటిషన్లను పరిష్కరించకుండానే పదవీ విరమణ చేశారు. రెండు పిటి షన్లపైనే కలాం నిర్ణయం తీసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ వెంకటరామన్ అడుగు జాడలలో నడుస్తున్నారు. ఇంతవరకూ 24 పిటిషన్లకు ‘నో’ అన్నారు. ఎవరి ప్రాపంచిక దృక్పథం వారిది. ఎవరి అవగాహన వారిది. మరణదండనను సమర్థించేవారి వాదనను సైతం తేలికగా కొట్టిపారవేయ డం సాధ్యంకాదు. అమాయకులనూ, అపరిచితులనూ విచక్షణారహితంగా, రాక్షసంగా చంపివేసే కరడుకట్టిన ఉగ్రవాది పట్ల కనికరం చూపించడం సమా జానికి హానికరమని నిరూపించిన ఉదంతాలూ ఉన్నాయి. బోకో హరమ్, అల్ ఖాయిదా, లష్కరే తయ్యబా, ఇండియన్ ముజాహిదీన్, అల్షహీద్, ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులను జైళ్ల నుంచి విడిపించ డానికి ఎంతటి నేరానికైనా, ఘోరానికైనా వెనకాడవు. భద్రతాదళాలకు దొరికిన మౌలానా మసూద్ అజహర్, షేక్ ఒమర్‌లను హతమార్చకుండా జైలులో ఉంచి నందుకు భారత ప్రభుత్వం పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది. ఉగ్రవా దులు భారత విమానాన్ని హైజాక్ చేసి అఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌కు తీసుకొని వెళ్లారు. నాటి విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్ అజహర్నూ, ఇతర ఉగ్రవాద ఖైదీలను వెంటపెట్టుకొని వెళ్లి హైజాకర్లకు అప్పగించి ప్రయాణికులను రక్షిం చారు. ఇటువంటి ఘటనలు నరహంతకులకు మరణదండన విధించడం సమం జసమేన న్న వాదనకు ఊతం ఇస్తాయి. కృష్ణయ్యర్ వంటి మానవతావాది సైతం మరణదండనను పూర్తిగా నిషేధించకుండా అత్యంత అరుదుగా మాత్రమే విధించాలంటూ తీర్పు ఇచ్చారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించిన రాజకీయవాదిగా హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు సయ్యద్ అసదుద్దీన్ ఒవైసీ పేరు తెచ్చుకున్నారు. మతం ప్రాతిపదికన మరణదండన అమలు చేయరాదంటూ వివాదం రగిలించారు. ఈ వాదనను సహజంగానే బీజేపీ ఖండించింది. మెమన్‌కు ఉరిశిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకులు పార్టీ విధానంతో విభేదించారు. శత్రుఘ్న సిన్హా, రాంజెత్మలానీ వంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు సైతం మెమన్ ఉరి అనాగరికమంటూ ఆక్షేపించారు. అఫ్జల్ ఉరి అన్యాయం? యూపీఏ ప్రభుత్వం కశ్మీర్‌కి చెందిన ప్రొఫెసర్ అఫ్జల్‌గురుని ఉరితీసినప్పుడు వ్యవహరించిన తీరు కంటే భిన్నంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించింది. అఫ్జల్ గురు ఉరికి ప్రచారం ఇవ్వడం యూపీఏ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎన్డీఏకి మెమన్ ఉరి గురించి ప్రచారం బహుశా బిహార్ ఎన్నికల దృష్ట్యా అవసరం. కుటుంబానికి సమాచారం అందించకుండా (ఒక రోజు ముందు టెలిగ్రాం పంపించామంటూ జైలు అధికారులు బుకాయించారు)అఫ్జల్‌గురుని ఉరితీయడం, శవాన్ని బంధువులకు అప్పగించకుండా తీహార్ జైలు ప్రాంగణం లోనే ఖననం చేయడం అత్యంత జుగుప్సాకరం. మెమన్ నేరం చేసినట్టు నిర్ధారించేవారు కూడా అఫ్జల్‌గురు నిరపరాధి అంటున్నారు. మెమన్‌కు మరణదండన 2007లో ఖరారైనప్పటికీ సుప్రీంకోర్టుకు విన్న వించుకోవడానికీ, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికీ, వాదప్రతివాదాలకూ ఎని మిదేళ్ళ వ్యవధి లభించింది. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న రెండో పిటిషన్‌ను రాష్ట్ర పతి తిరస్కరించిన తర్వాత కూడా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చొర వతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ వాదనలు విన్నారు. జూలై 30వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలోవారు పిటి షన్ కొట్టివేయడంతో ఉరిశిక్ష అరున్నర గంటల ప్రాంతంలో నాగపూర్ జైలులో అమలు జరిగింది. సర్వోన్నత న్యాయం స్థానం రాజ్యాంగంలో సమకూర్చిన అన్ని అవకాశాలనూ మెమెన్‌కు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు ను కానీ రాష్ట్రపతి నిర్ణయాన్ని కానీ ప్రశ్నించకుండా ఆమోదించాలంటే నిర్ణ యాలు నిష్పాక్షికంగా జరగడమే కాదు. అట్లా జరిగినట్టు కనిపించాలి. రాజీవ్ హంతకులకు మరణదండన విధించవద్దంటూ తమిళనాడు శాసనసభ, బియాం త్సింగ్ హంతకుడి శిక్ష యావజ్జీవ ఖైదుకే పరిమితం చేయాలంటూ పంజాబ్ అసెంబ్లీ చేసిన తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు మెమన్‌కు రాజకీయ పార్టీ అండ లేని కారణంగానే ఉరిశిక్ష విధించారంటూ వాదించడం నిర్హేతుకం కానీ కోర్టు ధిక్కారం కానీ దేశద్రోహం కానీ ఎట్లా అవుతుంది? ముం బయ్ బాంబు పేలుళ్లకు ప్రేరణ ఏమిటి? ముంబయ్ అల్లర్లు. వాటికి ప్రేరణ బాబరీ మసీదు విధ్వంసం. 1992 డిసెంబర్ 7 నుంచి 27 వరకూ, 1993 జన వరి 7 నుంచి 25 వరకూ రెండు దఫాలుగా జరిగిన అల్లర్లలో మొత్తం 900 మం ది దాకా చనిపోయారు. ఈ అల్లర్లపైన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ 15,000 పేజీల నివేదిక సమర్పించింది. అనుమానపు ముల్లు ఎటు చూపిస్తున్నదో (నీడిల్ ఆఫ్ సస్పిషన్) కమిషన్ సూచించింది. శివసేన నాయకుడు బాల్‌ఠాక్రే ప్రమేయం బహిరంగ రహస్యం. కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు శివసేన పార్లమెంటు సభ్యుడు మధుకర్ సర్పోట్దార్కు ముంబయ్ కోర్టు 2008లో ఏడాది కఠిన శిక్ష విధించింది. వెనువెంటనే ఆయనకు బెయిల్ లభించింది. శిక్ష అనుభవించకుం డానే మధుకర్ 2010లో చనిపోయాడు. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ నిఖిల్ కాప్సేను కూడా శ్రీకృష్ణ కమిషన్ దోషిగా గుర్తించింది. కానీ ప్రభుత్వం చర్య తీసుకోలేదు. బాంబు పేలుళ్ల కేసులో 185 మందిని అరెస్టు చేసి నిందితులుగా పేర్కొంటూ అంతకు ముందు జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ నివేదికను తుంగలో తొక్కడం ఎటువంటి సంకేతాలు పంపుతుంది? అల్లర్ల వెనుక తాత్కా లిక ఆవేశం ఉంటుందనీ, బాంబు పేలుళ్ల వెనుక కుట్ర ఉంటుందనీ రాంజె త్మలానీ చెప్పిన భాష్యంలో కొంత వాస్తవికత లేకపోలేదు. కానీ న్యాయస్థానం, ప్రాసిక్యూషన్ నిందితులందరినీ సమానంగా చూడాలి. ఒక కేసులో సాక్ష్యా ధారాలు సేకరించకుండా అభియోగాలను నీరు కార్చుతూ మరో కేసులో లోతుగా పరిశోధన చేసి, అరెస్టులు చేసి, శిక్షలు పడేవరకూ విచారణ కొన సాగించినప్పుడూ ప్రజాస్వామ్య వ్యవస్థపైన విశ్వాసం సన్నగిల్లుతుంది. మరణదండన రద్దు చేయాలి మరణదండన రద్దు చేయాలంటూ ఉద్యమం సాగిస్తూనే మరణదండన విధించే పద్ధతిలో, న్యాయస్థానాలూ, ప్రభుత్వాలూ వ్యవహరించే విధానంలో పారదర్శ కత, హేతుబద్ధత, సమన్యాయం స్పష్టంగా కనిపించాలి. మరణదండన రద్దు కోరడం ఉగ్రవాదాన్ని సమర్థించడంగా, దేశద్రోహంగా చిత్రించడం సంకుచిత మనస్తత్వం. మన సమాజం ఎంతగా చీలిపోయిందో, ఎటువంటి అతుకుల బొంతగా తయారయిందో అర్థం చేసుకుంటే భయం కలుగుతుంది. ఢిల్లీలో సిక్కుల ఊచకోతను విమర్శించేవారు గుజరాత్లో ముస్లింల హత్యాకాండను ప్రస్తావించరు. ముంబయ్ పేలుళ్ల కారకులపై మరణశిక్షను సమర్థించేవారు ముంబయ్ అల్లర్లనూ, శ్రీకృష్ణ కమిషన్ నివేదికనూ విస్మరిస్తారు. పార్లమెంటు సమావేశాలకు అడ్డుతగులుతున్నందుకు కాంగ్రెస్ పార్టీనీ, ఇతర ప్రతిపక్షాలనూ దుయ్యబడుతున్నవారు గత పార్లమెంటులో తాము అదే పని చేసిన సంగతి మరచిపోతారు. మరణదండన వద్దంటే ఉగ్రవాదాన్ని సమర్థించడం అంటారు. ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తే మావోయిస్టులకు కొమ్ముకాస్తున్నారంటారు. మైనా రిటీల ప్రాథమిక హక్కుల అమలు గురించి ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకి అం టారు. ఇది అన్యాయమైన ధోరణి. నీతీ, నిజాయితీ రవ్వంతైనా లేకుండా, సమాజంలో సామరస్యం సాధించే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా, సంకు చిత భావాలకూ, స్వార్థప్రయోజనాలకూ, కపట వ్యూహాలకూ, దబాయింపు రాజకీయాలకూ ప్రాధాన్యం ఇచ్చినంత కాలం ఈ దేశ సార్వభౌమత్వానికీ, సమై క్యానికీ, సమగ్రతకూ భద్రత ఉండదు. ప్రజాస్వామ్యం మేడిపండు అవుతుంది. -
ఉరి.. ఊపిరి మధ్య..
14రోజులు గడువు కోరుతూ అర్ధరాత్రి సుప్రీం తలుపు తట్టిన మెమన్ లాయర్లు చట్టంలోని వెసులుబాట్లను దుర్వినియోగం చేస్తున్నారన్న ఏజే ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం వేకువజామున 4.50 గంటలకు పిటిషన్ కొట్టివేయడంతో వీడిన ఉత్కంఠ హైడ్రామా... యాకుబ్ మెమన్‌కు రాష్ట్రపతి క్షమాభిక్షను నిరాకరించారనే వార్త విని భారతావని నిద్రలోకి జారుకుంది. ఉరిని తప్పించేందుకు జరిగిన విశ్వప్రయత్నాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి మరో హైడ్రామా మొదలైంది. ఆఖరి ప్రయత్నంగా మెమన్ లాయర్లు రాత్రి 11.30కు భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటి తలుపులు తట్టారు. దాంతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ఎపిసోడ్ మొదలైంది. ఆ క్రమమే ఇది.. జూలై 29.. రాత్రి 10.45: మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. 11.10: క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చాక..ఉరితీతకు 14 రోజుల కనీస గడువు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని పేర్కొంటూ మెమన్ న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. 11.30: ప్రముఖ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఆనంద్ గ్రోవర్ తదితరులు భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నివాసానికి చేరుకున్నారు. 11.30: సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ దత్తు నివాసానికి విచ్చేశారు. సీజేఐ నివాసం 5, క్రిష్ణమీనన్ మార్గ్ వద్ద మీడియా, లాయర్లతో సందడి నెలకొంది. జూలై 30 .. తెల్లవారుజామున 1.00: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ మిశ్రా నివాసానికి మారిన సీన్. 1.30: న్యాయవాదులు జస్టిస్ మిశ్రా నివాసానికి చేరుకున్నారు. 1.35: తెల్లవారుజామున 02.10కి కోర్టుకు వచ్చేందుకు న్యాయమూర్తులు మిశ్రా, ప్రఫుల్ల చంద్ర పంత్, అమితావ రాయ్‌ల అంగీకారం. 2.00: స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా.. నడిరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకున్నాయి. కోర్టు హాలు-4 సిద్ధమైంది. 2.10: నాగ్‌పూర్ సెంట్రల్ జైలు కానిస్టేబుల్ నగరంలోని ఓ హోటల్లో మెమన్ సోదరుడికి ఉరి సమాచారంతో లేఖను అందజేశారు. 2.30: న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రాక ఆలస్యం కావడంతో విచారణ జాప్యం. 3.20: రివ్యూ పిటిషన్‌పై విచారణ ప్రారంభం. మెమన్ తరఫు లాయర్లు తమ వాదన వినిపించారు. 3.50: అటార్నీ జనరల్ వాదన ప్రారంభం 4.00: నాగ్‌పూర్ జైలులో మెమన్ గదికి జైలు అధికారులు వెళ్లారు. ఏ నిర్ణయం రాలేదు కాబట్టి వాళ్లు తమ ముందున్న డెత్ వారెంట్‌కు అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. 4.30: ముగిసిన వాదనలు. 4.50: ఉరిపై స్టే ఇవ్వడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందంటూ మెమన్ పిటిషన్‌ను తిరస్కరించిన త్రిసభ్య ధర్మాసనం. 6.30: స్నానం, ఇతర కార్యక్రమాలయ్యాక ఉరికంబం వైపు మెమన్ను నడిపించారు. న్యూఢిల్లీ: అర్ధరాత్రి దాటిపోయింది.. అప్పటికే యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చారు.. కొద్దిసేపటికే రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నో చెప్పేశారు.. అయినా యాకూబ్ లాయర్ల విశ్వప్రయత్నం.. అర్ధరాత్రి వెళ్లి సుప్రీంకోర్టు తలుపుతట్టారు..అప్పటికప్పుడు ముగ్గురు సభ్యులతో బెంచ్.. సుప్రీం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాత్రి 3.20 గంటలకు అసాధారణ విచారణ..! గంటన్నర పాటు వాదోపవాదాలు..! ఉరి, ఊపిరి మధ్య నిశిరాత్రి జరిగిన న్యాయ సమరమిది!! చివరికి ఉరే సరి అని ధర్మాసనం తేల్చేసింది. దీంతో యాకూబ్ ఉరిపై గురువారం తెల్లవారుజాము వరకు సాగిన నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఎవరేం వాదించారు?: క్షమాభిక్ష పిటిషన్లను గవర్నర్, రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే యాకూబ్ లాయర్లు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నివాసానికి వెళ్లారు. అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బెంచ్‌ను సీజేఐ ఏర్పాటు చేశారు. తర్వాత లాయర్లు జస్టిస్ దత్తు నివాసం నుంచి తుగ్లక్ రోడ్‌లోని జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లారు. తర్వాత అంతా సుప్రీంకోర్టు హాలు నంబర్ 4లో సరిగ్గా రాత్రి 3.20 గంటలకు ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ చేపట్టింది. క్షమాభిక్షపిటిషన్ను తిరస్కరించిన తర్వాత దాన్ని సవాలు చేసుకునేందుకు యాకూబ్‌కు 14 రోజులు గడువివ్వాలని లాయర్లు వాదించారు. అలాగే క్షమాభిక్ష తిరస్కరణ, శిక్ష అమలుకు మధ్య ఏడు రోజుల అంతరం ఉండాలని మహారాష్ట్ర జైళ్ల నియమావళి చెబుతోందని యాకూబ్ లాయర్లు ఆనంద్ గ్రోవర్, యుగ్ చౌధురి పేర్కొన్నారు. యాకుబ్ పిటిషన్ న్యాయ వ్యవస్థ ఇచ్చిన కొన్ని వెసులుబాటులను దుర్వినియోగపరిచేలా ఉందని ప్రభుత్వం తరఫున అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. యాకూబ్ డెత్ వారంట్‌ను త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే సమర్థించిందని, కేవలం 10 గంటల వ్యవధిలోనే దాన్ని రద్దు చేయడం కుదరదని స్పష్టంచేశారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. క్షమాభిక్ష తిరస్కరణ తర్వాత దాన్ని సవా లు చేసుకునేందుకు యాకూబ్‌కు తగినన్ని అవకాశాలు లభించాయంది. శిక్ష అమలు కావాల్సిందేనని వేకువజామున 4.50 గంటలకు తీర్పు ఇచ్చింది. -
ఆ న్యాయమూర్తులకు పటిష్ఠ భద్రత
న్యూఢిల్లీ: మెమన్ ఉరిశిక్ష తీర్పుపై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఏర్పాటుచేసిన త్రిసభ్య ధర్మాసనం లోని సభ్యులకు కేంద్రం పటిష్ఠ భద్రతను ఏర్పాటచేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఉరిశిక్ష విధించాలన్న తీర్పు వెలువరించడంతో మెమన్ ఉరి అమలుకు అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే. క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడం సరికాదని, ఒకవేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని, తమ విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్నఅనంతరం త్రిసభ్య ధర్మాసనం ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. -
స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
-
మెమన్ 'ఉరి శిక్ష అమలు'లో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం సరికాదని ...ఒక వేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని కావున తమ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. ఉరి శిక్ష వాయిదాపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడనందున షెడ్యుల్ ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు మెమన్ను ఉరి తీసేందుకు నాగ్‌పూర్ జైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెమన్ ఉరి శిక్ష నేపథ్యంలో నాగ్ పూర్ ముంబైలలోమహారాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మిగాతా రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. మరోవైపు నాగ్‌పూర్ హోటల్లో ఉన్న మెమన్ కుటుంబ సభ్యులకు పోలీసులనుంచి ఉరిశిక్ష అమలుకు సంబంధించి లేఖ అందింది. గురువారం తెల్లవారుజామున 2.10 సమయంలో ఒక పోలీసు అధికారి హోటల్లో బస చేస్తున్న మెమన్ కుటుంబ సభ్యులకు ఆ లేఖని అందించాడు. -
శిక్ష తగ్గింపు సబబు!
‘రా’ మాజీ అధికారి రామన్ అభిప్రాయం న్యూఢిల్లీ: యాకూబ్ మెమన్ను భారత్‌కు తీసుకొచ్చే యత్నాలు సాగుతున్నప్పుడు భారత్ విదేశీ నిఘా విభాగం(రా-రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి నేతృత్వం వహించిన బి. రామన్.. మెమన్‌కు ఉరిశిక్ష విధించడంపై 2007లో ఒక ఆంగ్ల వార్తాబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఆయన 2013లో మృతిచెందారు. రామన్ వ్యాసంలోని ముఖ్యాంశాలు. * ఈ వ్యాసం రాయాలా? వద్దా? అని చాలా రోజులు మథనపడ్డాను. కానీ అన్యాయంగా ఉరిశిక్షకు గురవుతున్న వ్యక్తిని కాపాడటం ముఖ్యమని భావించి రాయాలనే నిర్ణయించుకున్నాను. ఈ కేసులో ముంబై పోలీసులు, సీబీఐ, ఐబీ గొప్ప పనితీరు చూపాయి. కానీ, మెమన్ శిక్ష తగ్గింపునకు అవకాశమున్న కీలకాంశాలను ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదు. మెమన్‌కు ఉరిశిక్ష విధింపజేయాలని ఆత్రుతగా ఉన్న ప్రాసిక్యూషన్.. శిక్ష విధింపు సమయంలో కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరలేదు. * పాక్ ఐఎస్ఐ తన కుటుంబసభ్యులపై పెట్టిన అనవసర నిఘాపై విసుగుచెందిన యాకూబ్.. భారత్ అధికారులకు లొంగిపోవాలనుకుని లాయరైన బంధువు సలహా కోసం కఠ్మాండూ వెళ్లాడు. లొంగుబాటు ప్రమాదకరమని, కోరుకున్న న్యాయం జరగకపోవచ్చని లాయర్ చెప్పడంతో మళ్లీ కరాచీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, నేపాల్ పోలీసులకు చిక్కాడు. వారిసాయంతో భారత అధికారులు మెమన్ను ఢిల్లీ తరలించి, అక్కడ అధికారికంగా అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాన్ని నేనే సమన్వయం చేశాను. * దర్యాప్తు అధికారులకు మెమన్ పూర్తిగా సహకరించారు. భారత్ తిరిగివచ్చేందుకు మెమన్ కుటుంబంలోని పలువురిని ఆయనే ఒప్పించారు. మెమన్ శిక్ష తగ్గింపునకు ఈ రెండు అంశాలు కీలకం. పేలుళ్లలో మెమన్, ఆయన కుటుంబసభ్యుల పాత్రపై అనుమానం లేదు. ఐఎస్ఐ సాయంతో మెమన్ చేసిన పని ఉరిశిక్షకు అర్హమైనదే. కానీ కఠ్మాండూలో అదుపులోకి తీసుకున్నప్పట్నుంచి ఆయన తీరు, దర్యాప్తు అధికారులకు సాయపడ్డ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే మరణశిక్షపై రెండో ఆలోచన చేయొచ్చు.