
ముంబై: తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కొడుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తహసిల్ పరిధిలోని వకిల్‌వాడి ప్రాంతంలో నేడు ఉదయం జరిగింది. వకిల్‌వాడి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కుర్రాడు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ కరోనా సమయంలో ఇంట్లో నుంచే ఆన్‌లైన్ తరగతులు విన్న తర్వాత పడుకొని టెలివిజన్ చూస్తున్నాడు. అతనిని గమనించిన తల్లి టీవీని సరిగ్గా కూర్చొని చూడాలని టీవీని స్విచ్ ఆఫ్ చేసింది. దింతో మనోవేదనకు గురైన అతను అక్కడ నుంచి బాత్రూంకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత ఈ విషయాన్న తల్లి, సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కేజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment