Beed District
-
6 నెలలుగా మైనర్‌పై 400 మంది అత్యాచారం
-
దారుణం: 6 నెలలుగా మైనర్‌పై 400 మంది అత్యాచారం
పుణె: దేశంలో మహిళలపై నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నారుల నుంచి వయసు మళ్లిన వారి వరకు ఎవరిని వదలడం లేదు మృగాళ్లు. కామంతో కళ్లు మూసుకుపోయి.. వావి వరసలు మరిచి ప్రవర్తించే రాక్షసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరు నెలలుగా మైనర్ బాలికపై దాదాపు 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు రెండు నెలల గర్భవతి. దారుణం ఎంటంటే అకృత్యానికి ఒడిగట్టిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ దారుణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. (చదవండి: దారుణం: పిల్లల కోసం మహిళను నిర్బంధించి 16 నెలలుగా లైంగిక దాడి) న్యూస్ 18 లోక్మాత్ (మరాఠి)లో ప్రచురించిన కథనం ప్రకారం మహారాష్ట్ర బీద్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక తల్లి రెండు సంవత్సరాల క్రితం మరణించింది. ఈ క్రమంలో బాలిక తండ్రి ఆమెకు వివాహం చేశాడు. అత్తవారింట్లో బాధితురాలు ప్రత్యక్ష నరకం అనుభవించింది. బాధితురాలి మామ ఆమెను నిత్యం వేధించేవాడు. పెళ్లైన ఏడాది తర్వాత బాధితురాలు ఉద్యోగం కోసం అంబేజోగై పట్టణానికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. బాధితురాలిని శారీరంగా లొంగదీసుకున్నారు. అక్కడితో ఆగని మృగాళ్లు దీని గురించి ఆమె భర్తకు చెప్తామని బెదిరిస్తూ.. వారి స్నేహితుల వద్దకు పంపేవారు. (చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు) ఇలా వందలమంది మృగాళ్లు బాధితురాలిపై పైశాచిక చర్యకు పాల్పడ్డారు. దాదాపు 400 మంది బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా.. వీరిలో ఒక పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. నిందితుల బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె రెండు నెలల గర్భిణి. పిండాన్ని తొలగించేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రక్రియ కొనసాగుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి గురించి తెలియక పిచ్చి వేషాలు వేసి అడ్డంగా బుక్కయ్యాడు! -
తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య
ముంబై: తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కొడుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తహసిల్ పరిధిలోని వకిల్‌వాడి ప్రాంతంలో నేడు ఉదయం జరిగింది. వకిల్‌వాడి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కుర్రాడు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ కరోనా సమయంలో ఇంట్లో నుంచే ఆన్లైన్ తరగతులు విన్న తర్వాత పడుకొని టెలివిజన్ చూస్తున్నాడు. అతనిని గమనించిన తల్లి టీవీని సరిగ్గా కూర్చొని చూడాలని టీవీని స్విచ్ ఆఫ్ చేసింది. దింతో మనోవేదనకు గురైన అతను అక్కడ నుంచి బాత్రూంకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత ఈ విషయాన్న తల్లి, సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కేజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి -
భయపెడుతున్న కరోనా.. 10 రోజుల సంపూర్ణ లాక్డౌన్
సాక్షి, ముంబై: బీడ్ జిల్లాలో కూడా రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా నైట్ కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కరోనా రోగుల సంఖ్య నియంత్రణలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీడ్ కలెక్టర్ మీడియాకు తెలిపారు. దీంతో జిల్లాలో అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ ఉంటాయన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నాందేడ్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. నాందేడ్ పట్టణంతోపాటు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మార్చి 25 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ విపిన్ ఇటన్కర్ మీడియాకు తెలిపారు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత నాందేడ్ జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయించారు. చదవండి: (ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్) తెలంగాణకు రాకపోకలపై ప్రభావం..! లాక్డౌన్లో భాగంగా నాందేడ్ జిల్లాల్లో రవాణ వ్యవస్థపై కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై ప్రభావం పడింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలతోపాటు మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలపై నిషేధం విధించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులపై కూడా ఆంక్షలు విధించారు. అయితే నాందేడ్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం జిల్లా నుంచి వెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా అత్యవసర సేవలందించే వాహనాలకు కూడా అనుమతులతో మినహాయింపు ఉన్నట్టు తెలిసింది. మరోవైపు నాందేడ్ జిల్లా మీదుగా ఇతర జిల్లాలు, తెలంగాణకు వెళ్లేవి, తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులను ఫోన్లో సంప్రదించగా జిల్లా సరిహద్దులను ఇంకా సీల్ చేయలేదని కానీ, పరిస్థితిని బట్టి పూర్తిగా సీల్ చేయనున్నట్టు తెలిపారు. చదవండి: (సీఎం సతీమణికి కరోనా పాజిటివ్) -
అతనుగా మారబోతున్న మహిళా కానిస్టేబుల్!
ఇతని పేరు లలితా సాల్వే. వయస్సు 28 ఏళ్లు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజేగావ్‌కు చెందిన వాడు. 2010 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇందులో విశేషం ఏముంది అంటే.. అసలు విషయమంతా అక్కడే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఘనత ఇతనిదే. ఇంతకీ అతను ఏం చేశాడు? ఎందుకు అతని విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకుంది? ఫొటో చూస్తే తెలుస్తోంది కదా లలితా సాల్వే పురుషుడని.. కానీ అక్కడే మిస్టరీ ఉంది. నిజానికి అతను పురుషుడు కాదు...అక్షరాలా మహిళే! కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరింది కూడా మహిళగానే. అయితే చిన్నప్పటినుంచీ లలితా సాల్వే.. ఆమెనా.. అతడా అన్నది పెద్ద కన్ఫ్యూజన్. శరీరమేకాదు.. హావభావాలు, ప్రవర్తన, అంతా డిఫరెంట్. డాక్టర్లకు కూడా పెద్ద పజిల్. చివరికి ఎన్నో టెస్ట్‌ల తర్వాత వైద్యులు అసలు విషయం తేల్చేశారు. లలితా సాల్వేలో స్త్రీ లక్షణాల కంటే పురుష లక్షణాలే ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు. పురుషులకు ఉండాల్సిన అంగాలు వున్నప్పటికీ.. అవి సంపూర్ణం కావాలంటే 'సెక్స్ రీ-అసైన్మెంట్ సర్జరీ (ఎస్ఆర్ఎస్)’ చేయాలని తేల్చారు. నిజానికి స్త్రీగా కంటే పురుషుడిగా వుండాలనే కోరిక లలితా సాల్వేలో మొదటినుంచీ బలంగా వుండేది. డాక్టర్లు కూడా సర్జరీ చేయించుకుంటే పురుషుడిగా మారిపోవచ్చని గ్యారంటీ ఇచ్చారు. దీంతో సర్జరీ చేయించుకోవడానికి ఒక నెల రోజులు సెలవు కావాలంటూ మహారాష్ట్ర పోలీసు అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకుంది. అప్పటిదాకా తమ కానిస్టేబుల్ మహిళ అనుకున్న పోలీసులకు ఒక్కసారి షాక్ తగిలింది. అధికారులు కూడా ఏం చేయాలిరా బాబూ అని తలపట్టుకున్నారు. కుదరదంటూ ఆమెకు తేల్చిచెప్పారు. ఇక లాభం లేదనుకున్న లలిత ఏకంగా ముంబై హైకోర్టు మెట్లు ఎక్కింది. తాము తేల్చలేమని నేరుగా రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. విషయం కాస్తా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దాకా వెళ్లింది. ఒకవైపు లలితకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో ఆయన చివరికి ఓకే చెప్పేశారు. లలిత విషయంలో పాజిటివ్‌గా స్పందించాలంటూ హోంశాఖను ఆదేశించారు. అలా..అలా చివరికి పురుషుడుగా మారేందుకు లలితకు లైన్ క్లియర్ అయింది. సెలవు మంజూరైంది. ఇప్పుడు లలిత ఎంతో హ్యాపీ. ఒకటి రెండు రోజుల్లో జేజే ఆస్పత్రిలో ఆమె సర్జరీ చేయించుకోబోతున్నారు. ఆమె నుంచి అతడిలా ఈ కథ ఇలా సుఖాంతమవుతోంది. -
ఆమె అతడు
-
యువతుల సంచలన నిర్ణయం
బీడ్: మహారాష్ట్రలో మరాఠ్ వాడ ప్రాంతంలో యువతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకోరాదని బీడ్ జిల్లాలోని మాజల్ గావ్ ప్రాంతానికి 25 మంది యువతులు నిర్ణయించుకున్నారు. కరువుతో తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు పెళ్లిళ్లు చేయలేక తమ తల్లిదండ్రులు విపరీత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారనే భయంతో వివాహం చేసుకోరాదని నిశ్చయించారు. తమ గ్రామంలో 20 నుంచి 25 మంది అమ్మాయిలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సరిత అనే యువతి వెల్లడించింది. ప్రభుత్వ సాయం కోరుకుంటున్నామని తెలిపింది. రెండుమూడేళ్ల నుంచి కరువుగా తీవ్రంగా ఉందని సవిత అనే మరో యువతి చెప్పింది. తమ తల్లిదండ్రులు ఏడాదంతా కష్టపడితే రూ. 30 వేలు వస్తాయని, ఈ డబ్బు తమ అవసరాలకే సరిపోవడం లేదని... ఇక పెళ్లిళ్లు ఎలా చేస్తారని వాపోయింది. మరాఠ్ వాడ ప్రాంతంలోని లాటూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో కరువు పరిస్థితులు దారుణంగా మారడంతో రైతులు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లిపోతున్నారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 124 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇక్కడికి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని మరాఠ్ వాడ రైతులు కోరుతున్నారు. -
రెండు వారాల్లో 42 మంది రైతుల బలవన్మరణం
సాక్షి, ముంబై: వరుసగా మూడేళ్ల నుంచి కరువు బారిన పడి విలవిలలాడుతున్న మరాఠ్వాడా రైతులకు కొత్త ప్రభుత్వం ఎటువంటి ఆసరా ఇవ్వలేకపోతోంది. దీంతో పంటల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక గత రెండు వారాల్లో ఏకంగా 42 మంది రైతులు ఈ ప్రాంతంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో అత్యధికంగా బీడ్ జిల్లాలో 14 మంది రైతులు, ఆ తరువాత నాందేడ్ జిల్లాలో 12 మంది రైతులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకున్నారు. మరాఠ్వాడ ప్రాంతంలో గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా కరువు తాండవిస్తోంది. ప్రకృతి తమపై కరుణ చూపకపోవడంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు కురుస్తున్న అకాల వర్షాలు చేతికి వచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు బేజారెత్తుతున్నారు. వేసిన పంటలు చేతికి రాకపోగా చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. గత సంవత్సరం 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వ సహాయం పొందేందుకు కేవలం 274 మంది రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించారు. 155 మంది రైతుల కుటుంబాలను అనర్హులుగా పరిగణించడంతో వారు ఎలాంటి సాయానికి నోచుకోలేకుండా పోయారు. మిగిలిన కుటుంబాలపై విచారణ జరుగుతోంది. ఈ సంవత్సరం మొదటి రెండు వారాల్లోనే 42 మంది ఆత్మహత్యలు చేసుకోవడం రైతుల కుటుంబాలు మరింత కలవరానికి గురైతున్నాయి. ఉదయం పొలానికి వెళ్లిన కుటుంబం పెద్ద దిక్కు తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడా..? అనే నమ్మకం లేకుండాపోయింది. ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో తెలియని పరిస్థితి రైతు కుటుంబాల్లో నెలకొంది. జిల్లాల వారిగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు బీడ్-14, నాందేడ్-12, ఉస్మానాబాద్-4, ఔరంగాబాద్-3, లాతూర్-3, జాల్నా-3, హింగోలి-3. -
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా ఆగని రైతుల ఆత్మహత్యలు
సాక్షి, ముంబై: ప్రభుత్వం కరువుపీడిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 512 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీడ్ జిల్లాలో అత్యధికంగా 141, నాందేడ్ జిల్లాలో 109 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలోని మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. వరుసగా ఇది మూడో సంవత్సరం కావడంతో అక్కడ వేలాది గ్రామాల రైతుల పరిస్థితి తీవ్రఆందోళనకరంగా మారింది. అకాల వర్షాల కారణంగా వరి, చెరుకు, పసుపు పంటలతోసహా పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులనుంచి తీసుకున్న అప్పులు కుప్పలుగా పేరుకుపోయాయి. ఇంతచేసినా పంటలు చేతికి రాలేదు. ఒకవేళ కొందరికి చేతికొచ్చినప్పటికీ గిట్టుబాటు ధర దక్కలేదు. దీంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. మరోవైపు వడ్డీసహా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ షావుకార్లు, బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో చేసిన అప్పులు చెల్లించే మార్గం లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది బీడ్ జిల్లా పరిధిలో 141, నాందేడ్ జిల్లా పరిధిలో 109, ఔరంగాబాద్ జిల్లా పరిధిలో 46, జాల్నా జిల్లా పరిధిలో 27, పర్భణి జిల్లా పరిధిలో 64, హింగోలి జిల్లా పరిధిలో 30, లాతూర్ జిల్లా పరిధిలో 36, ఉస్మానాబాద్ జిల్లా పరిధిలో 59 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 303 మంది రైతుల కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం త్వరలో అందనుంది. మిగతా కుటుంబాలకు ఆ అర్హత లేదని అధికారులు ప్రకటించారు. -
తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె
-
తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె
బీడ్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ముగిశాయి. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం మధ్నాహ్నం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లీలో అంత్యక్రియలు నిర్వహించారు. ముండేకు కుమారులు లేకపోవడంతో ఆయన పెద్ద కుమార్తె పంకజ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అశ్రునయనాలతో తండ్రి చితికి నిప్పంటించారు. ఇక తమ అభిమాన నేతను కడసారి దర్శించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు ముండే అంత్యక్రియలకు హాజరయ్యారు. ముండేకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.