పుణె: దేశంలో మహిళలపై నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నారుల నుంచి వయసు మళ్లిన వారి వరకు ఎవరిని వదలడం లేదు మృగాళ్లు. కామంతో కళ్లు మూసుకుపోయి.. వావి వరసలు మరిచి ప్రవర్తించే రాక్షసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆరు నెలలుగా మైనర్ బాలికపై దాదాపు 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు రెండు నెలల గర్భవతి. దారుణం ఎంటంటే అకృత్యానికి ఒడిగట్టిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ దారుణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
(చదవండి: దారుణం: పిల్లల కోసం మహిళను నిర్బంధించి 16 నెలలుగా లైంగిక దాడి)
న్యూస్ 18 లోక్‌మాత్ (మరాఠి)లో ప్రచురించిన కథనం ప్రకారం మహారాష్ట్ర బీద్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక తల్లి రెండు సంవత్సరాల క్రితం మరణించింది. ఈ క్రమంలో బాలిక తండ్రి ఆమెకు వివాహం చేశాడు. అత్తవారింట్లో బాధితురాలు ప్రత్యక్ష నరకం అనుభవించింది. బాధితురాలి మామ ఆమెను నిత్యం వేధించేవాడు.
పెళ్లైన ఏడాది తర్వాత బాధితురాలు ఉద్యోగం కోసం అంబేజోగై పట్టణానికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. బాధితురాలిని శారీరంగా లొంగదీసుకున్నారు. అక్కడితో ఆగని మృగాళ్లు దీని గురించి ఆమె భర్తకు చెప్తామని బెదిరిస్తూ.. వారి స్నేహితుల వద్దకు పంపేవారు.
(చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు)
ఇలా వందలమంది మృగాళ్లు బాధితురాలిపై పైశాచిక చర్యకు పాల్పడ్డారు. దాదాపు 400 మంది బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా.. వీరిలో ఒక పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. నిందితుల బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె రెండు నెలల గర్భిణి. పిండాన్ని తొలగించేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రక్రియ కొనసాగుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: యువతి గురించి తెలియక పిచ్చి వేషాలు వేసి అడ్డంగా బుక్కయ్యాడు!
Comments
Please login to add a commentAdd a comment