కడప నగరంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్న పఠాన్ మౌలాలి (26) అనే యువకుడు శుక్రవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కడప అర్బన్ : కడప నగరంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్న పఠాన్ మౌలాలి (26) అనే యువకుడు శుక్రవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి కడపకు చెందిన యువతితో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ చర్యకు పాల్పడి ఉంటాడని మౌలాలి తల్లి ఖాదర్‌బీ పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.