వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ జిల్లాలో నారాయణ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి తర్వితగతిన నివేదిక ఇవ్వాలని గంటా ఆదేశించారు.
కాగా కడప నగర శివార్లలోని చింతకొమ్మదిన్నెలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదవుతున్న ఇద్దరు విద్యార్థినిలు సోమవారం సాయంత్రం ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు తమ చున్నీలతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విద్యార్థినుల మృతదేహాలకు కడప రిమ్స్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.