కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ర్టంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న చట్ట సభలకు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కోరారు. కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి నాయకులు, కేఓఆర్‌ఎం అధ్యాపకులు, విద్యార్థులు, జర్నలిస్టులు చేపట్టిన రిలే దీక్షలకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేస్తే విభజన ప్రగ్రియ ఆగిపోతుందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఎడారిగా మారే అవకాశం ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు ఆందోళన వ్యక్తం చేఫశారు. రిలే దీక్షలు చేస్తున్న కేఓఆర్‌ఎం అద్యాపకులు, విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి, రాజోలి వీరారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, కేఎస్‌ఎన్‌రెడ్డి, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గుర్రప్ప, నాయకులు రమణ, సుధాకర్, బాషా మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నియమిస్తున్న కమిటీలన్నీ ఒట్టి బూటకమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బీ అంజద్‌బాషా ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్‌ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు.
విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ బి.అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడారు. దీక్షల్లో విద్యార్థి నాయకులు నాగరాజు, శ్రీను, బ్రహ్మం, గంగాధర్‌రెడ్డి, నాగేంద్ర, రామనాథరెడ్డి, కళాసాగర్, రామాంజనేయులు, నరేష్, ప్రసన్న కూర్చున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు టీకే అఫ్జల్‌ఖా న్, హఫీజుల్లా, బీహెచ్ ఇలియాస్, ఎస్‌ఏ కరీముల్లా, పులి సునీల్‌కుమార్, సంపత్, ఎస్‌ఎండి షఫీ, చంద్ర పాల్గొన్నారు.
రాజకీయ సంక్షోభం సృష్టించాలి
Published Wed, Sep 11 2013 3:59 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
Advertisement