సాక్షి, కడప : సమైక్యం కోసం నిరంతరం అలుపెరుగని పోరును వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ చేస్తోంది. పార్టీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు రిలే దీక్షలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షా శిబిరాలు సమైక్య నినాదాలతో హోరెత్తాయి.
కడపలో కలెక్టరేట్ వద్ద జిల్లా మహిళాధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి, నగర అధ్యక్షురాలు టిపి వెంకటసుబ్బమ్మ నేతృత్వంలో 23మంది మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు ప్రారంభించారు. కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజద్‌బాష దీక్షలను విరమింపజేశారు.
పులివెందులలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట లింగాల మండల వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పురుషోత్తంరెడ్డి దీక్షలను విరమింపజేశారు.
ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో 40వ వార్డు మాజీ కౌన్సిలర్ ఇవి సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో 13మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
కమలాపురంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి నేతృత్వంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రాజుపాలెం సుబ్బారెడ్డి, డీసీఎంఎస్ వైస్‌ఛెర్మైన్ లక్ష్మినారాయణరెడ్డి, రైతు సంఘం నాయకుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
జమ్మలమడుగులో పెద్దముడియం మండల యూత్ కన్వీనర్ భరత్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డిలు తమ మద్దతును తెలిపారు.
రైల్వేకోడూరులో టోల్‌గేట్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పంజం సుకుమార్‌రెడ్డి, సీహెచ్ రమేష్, ఆదాంసాహెబ్‌తోపాటు మరో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి కడప నియోజకవర్గ సమన్వయకర్త అంజద్‌బాష సంఘీభావం తెలిపారు.
బద్వేలులో నాలుగురోడ్ల కూడలిలో మున్సిపాలిటీ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్ష శిబిరంలో మాజీ మున్సిపల్ ఛెర్మైన్ మునెయ్య, మాజీ ఎంపీపీ అంబవరం వెంకటేశ్వరరెడ్డితోపాటు మరో 30 మంది దీక్షల్లో పాల్గొన్నారు.
‘సమైక్య తీర్మానంపై కాంగ్రెస్, టీడీ పీ డ్రామాలు’
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశ పెట్టకుండా కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు ధ్వజమెత్తారు. తెలంగాణా ముసాయిదా బిల్లును అసెంబ్లీలో చర్చకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం సభ్యులు స్థానిక కలెక్టరేట్ ఎదుట మంగళవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సురేష్‌బాబు ప్రారంభించి మాట్లాడుతూ సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు కోరుతుంటే కాంగ్రెస్, టీడీపీలు తాము విభజనకు అనుకూలంగా ఉన్నామని వాదించడం హాస్యాస్పదమన్నారు. ఆర్టికల్-3ని సవరించాలని దేశ వ్యాప్తంగా పర్యటించి విభజన వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని చాటి చెప్పిన వ్యక్తి వైఎస్ జగనేనన్నారు.
సమైక్య దీక్షలు
Published Wed, Jan 8 2014 3:11 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement