ఉరేసుకుని ఆత్మహత్య | person suicide | Sakshi

ఉరేసుకుని ఆత్మహత్య

Nov 22 2016 2:23 AM | Updated on Nov 6 2018 7:56 PM

దూలానికి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో జరిగింది.

కొవ్వూరు రూరల్‌ : దూలానికి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన  కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో  జరిగింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని రామభద్రపాడుకు చెందిన చక్కా లోవరాజు(36) మూడు నెలల క్రితం ఉపాధి కోసం కుటుంబంతో కలిసి పశివేదల వచ్చాడు. స్థానిక అంబేడ్కర్‌ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఓ రైతు వద్ద పనికి కుదిరి కొంత సొమ్మును అడ్వాన్సుగా తీసుకుని కొన్ని రోజులు పనిచేసి మాపివేశాడు. అలాగే మరో రైతు వద్ద కొంత సొమ్ము తీసుకుని అతని వద్ద పనిమానివేసి ఇంటివద్దనే ఉంటున్నాడు. పని మానివేసినందున రైతుల వద్ద తీసుకున్న అడ్వా¯Œ్సను వారికి ఇచ్చివేయాలని పనిలో పెట్టిన వ్యక్తి ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో లోవరాజు పది రోజులుగా  మద్యం తాగుతూ తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఆదివారం రాత్రి భార్యతో గొడవపడడంతో ఆమె మరో ఇంటికి వెళ్లి నిద్రపోయింది. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా దూలానికి వేలాడుతూ భర్త శవం కనిపించింది. దీంతో ఆమె స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ ఎస్‌ఐ ఎం.శ్యాంసుందరరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వీఆర్‌వో పీకేడీ ప్రసాద్‌  ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య రాము, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. 
పిరికివాడు కాదు 
లోవరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బంధువులు చెబుతున్నారు. అతని మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement