![Bonda Umamaheswara Rao follower arrested in Geetanjali suicide case - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/14/BONDAUMA%20CALLMONEY.jpg.webp?itok=WuddGnlw)
కాల్ మనీ, సెక్స్ రాకెట్ కింగ్
భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్
రౌడీషిటర్లతో సత్సంబంధాలు
బెజవాడలో చీకటి సామ్రాజ్యం
ఇదీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు అరాచకాల చిట్టా
ఇటీవల గీతాంజలి ఆత్మహత్య కేసులోనూ బొండా అనుచరుడి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్‌మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు.
► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు.
► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు.
► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు.
► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు.
► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు.
► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు.
► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు.
► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు.
► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు.
గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్
ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కొడుకులదీ అదే తీరు
బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్‌లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు.
తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు.
దుర్గాపురంలోని ఓ అపార్ట్‌మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు.
బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం.
అకృత్యాలెన్నున్నా కేసులు మూడే..
బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment