Gitanjali
-
బెజవాడ సెంట్రల్లో కాల్కేయుడు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు. ► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు. ► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు. ► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు. ► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు. ► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్ ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకులదీ అదే తీరు బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. అకృత్యాలెన్నున్నా కేసులు మూడే.. బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
‘అయ్యో గీతాంజలి’.. అమెరికాలో రెండ్రోజుల వ్యవధిలో తల్లీకూతుళ్ల మృతి
కొణకంచి(పెనుగంచిప్రోలు): అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
కొనసాగిన నిరసనలు
సాక్షి, నెట్వర్క్: తెనాలికి చెందిన గొల్తి గీతాంజలిని అసభ్యకర మెసేజ్‌లతో వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన టీడీపీ, జనసేన పార్టీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలిపై ఈ రెండు పార్టీల సోషల్ మీడియా మూకలు అసభ్య సందేశాలతో దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రజలు చేస్తున్న నిరసనలు గురువారమూ కొనసాగాయి. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. ట్రోలింగ్ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడలో న్యాయవాదులు గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ న్యాయస్థానాల సముదాయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్వో వి.శ్రీనివాసరావుకు న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ టీడీపీ చర్యలతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుజాత, ఉషాజ్యోతి, సౌమ్య, జ్యోతి, సి.హెచ్.సాయిరామ్, పిళ్లా రవి, కె.జయరాజు, మన్మధరావు, కె.ప్రభాకర్, నిర్మల్ రాజేష్ , సూర్యనారాయణరెడ్డి, పూర్ణ, భార్గవ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద గీతాంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులరి్పంచి, గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గొర్రుపోటు రమాదేవి తదితరుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు. -
గీతాంజలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేత
తెనాలి: టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల అసభ్యకర పోస్టింగులకు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన గొల్తి గీతాంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబానికి అందింది. గీతాంజలి కుమార్తెలు రిషిత, రిషికల పేరిట చెరొక రూ.10 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ పత్రాలను గురువారం సాయంత్రం గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు. ముందుగా గీతాంజలి చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావుతో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డిపాజిట్ పత్రాలను చిన్నారులకు అందజేశారు. ప్రభుత్వం ద్వారా తన కుటుంబానికి జరిగిన మేలును గీతాంజలి బహిరంగంగా మీడియాలో చెప్పటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వికృత పోస్టింగులతో ఆమె బలవన్మరణానికి కారకులయ్యారని ఎమ్మెల్యే శివకుమార్ ధ్వజమెత్తారు. తన చేత్తో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్న గీతాంజలి భౌతికకాయానికి తానే పూలమాల వేయాల్సి రావటం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతగానో కలచివేసిందన్నారు. అమాయక మహిళలపై ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల సాయం టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబానికి ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆయన పంపిన డబ్బును గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి, స్థానిక నేతలు గీతాంజలి భర్త బాలచంద్ర, చిన్నారులు రిషిత, రిషికలకు అందజేశారు. ఈ నగదు సాయం చేసిన ఎన్నారై పంచ్ ప్రభాకర్ వీడియో కాల్ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ఖర్చులను తన మిత్ర బృందంతో కలిసి తామే భరిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్థిక సాయం అందించిన పంచ్ ప్రభాకర్‌కు బాలచంద్ర ధన్యవాదాలు తెలిపారు. -
నేరుగా వచ్చి ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, గుంటూరు:‘గుంటూరు నుంచి 12.05 గంటల ప్రాంతంలో తెనాలి స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకూ ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పక్కన నిలబడిన యువతి ఒక్కసారిగా ట్రాక్ పైకి వచ్చేసింది. ఆమెను తప్పుకోమని అరుస్తూ ఎమర్జెన్సీ బ్రేక్ వేశా. అయితే అప్పటికే రైలు ఇంజన్ ఆమెకు తగిలింది. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను ప్రయాణికుల సహకారంతో ట్రైన్ ఎక్కించుకుని తెనాలి స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌కు అప్పగించా’నని జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ విజయ్‌రామ్ జీఆర్పీ పోలీసులకు అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ మాస్టర్ దగ్గర ఉన్న పుస్తకంలో కూడా ప్రమాదానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు గీతాంజలి ఈ నెల ఏడున రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేయడం ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలుగుదేశం సోషల్ మీడియాలోనూ, అఫిషియల్ మీడియాలో కూడా ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేలా కామెంట్స్ పెడుతున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు తోసేసి పరారు అయ్యారంటూ ఒక వీడియోలో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా చూపిస్తూ మార్ఫింగ్ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిని ఎడిట్ చేసి బయటకు వదిలినట్లుగా పోలీసుల విచారణలో స్పష్టం అయ్యింది. ఈ వీడియోను సర్క్యులేట్ చేసింది ఎవరు? అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేవిధంగానే తెలుగుదేశం సోషల్‌మీడియాలో బురదజల్లుతోంది. లోకోపైలెట్ ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం లేదని, ఆమె ఒక్కతే వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్పష్టం అవుతోది. అయినా తెలుగుదేశం చేస్తున్న తప్పుడు ఆరోç³ణల నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తెనాలి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసుబృందం బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ చుట్టుపక్కల వారిని విచారించింది. దగ్గరలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అన్న విషయాన్ని ఆరా తీసింది. సోషల్‌మీడియా ట్రోలింగ్‌ల నేపథ్యంలో మృతి చెందినట్లు ఆమెకుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ట్రోలింగ్‌కు పాల్పడిన హ్యాండిల్స్‌ను గుర్తించి బాధ్యులను అదుపులోకి తీసుకునే దిశగా పోలీసు బృందాలు తమ విచారణ వేగవంతం చేశాయి. ఒక బీసీ మహిళను వేధించి ఆత్మహత్యకు పురికొల్పడమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ట్రోల్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీలోనే కొందరు తప్పు పడుతున్నారు. నాడు రిషితేశ్వరిని ఇలాగే పొట్టన పెట్టుకున్నారు నాడు రిషితేశ్వరి నుంచి నేటి గీతాంజలి వరకూ పచ్చమూకల వికృత చర్యలకు బలైపోయిన వారే. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఎవరిని తీసుకున్నా వారికి ముందు నుంచి మహిళలంటే చిన్నచూపే. 2015లో గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ర్యాగింగ్‌కు గురై యూనివర్సిటీ వసతి గృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన యూనివర్సిటీ అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం వహించింది. విద్యార్థిని మృతికి కారణమైన అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావుతోపాటు అప్పుడు యూనివర్సిటీ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలని, రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బలహీన వర్గాల విద్యార్థినికి న్యాయం చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వప్రయత్నించకపోగా న్యాయం కోసం ఉద్యమిస్తున్న వారిని అడ్డుకుంది. రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్యమం చేస్తున్నాయనే కారణంతో ప్రభుత్వం, యూనివర్సిటీ ఉన్నతాధికారులు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను నిషేధించారు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాల బోర్డులను సైతం తొలగించారు. ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. విద్యార్థిని ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను రక్షించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్పట్లో ప్రజాసంఘాలు బహిరంగంగానే ఆరోపణలు చేశాయి. విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్యపై కథనాలు రాస్తున్నారనే అక్కసుతో కొందరు మీడియా ప్రతినిథులపై కేసులు నమోదు చేస్తామని కూడా బెదిరించారు. రాష్ట్రంలో బలహీన వర్గాల మహిళల ప్రాణాలకు రక్షణ లేదని రిషితేశ్వరి మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వీడాలని అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కే రోజాతోపాటు పలువురు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఆప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. బాబురావుపై చర్యలు తీసుకుందే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బుద్ధి మార్చుకోలేదు. -
జరిగిన మేలు చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా?: కత్తి పద్మ
సాక్షి, విశాఖపట్నం: కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేదల మేలు కోసమేనని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని కమ్యూనిస్ట్ నేత కత్తి పద్మ అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇల్లు లేని వారికి సీఎం జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందన్నారు. గీతాంజలి మృతిపై ఆమె స్పందిస్తూ.. ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరని, ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయన్నారు. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ట్రోల్ చేయాలంటూ కొన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయని, అందుకే ఇంతటి ఘోరం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని కత్తి పద్మ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మీరో ‘గీతాంజలి’ కావద్దు -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
సాక్షి, గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చివరగా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తారా?. ట్రోలింగ్స్ తట్టుకోలేక మా అమ్మాయి దూరమైంది. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
సబ్‌కలెక్టర్ గీతాంజలి శర్మకు అవార్డు
తెనాలి: వ్యాయామ ఉపాధ్యాయిని, వితరణశీలి దివంగత మొవ్వా విజయలక్ష్మి స్మారక ద్వితీయ అవార్డును తెనాలి సబ్‌కలెక్టర్ గీతాంజలి శర్మకు ప్రదానం చేయనున్నారు. విజయలక్ష్మి వర్ధంతి రోజైన ఈనెల 20న ఉదయం 9 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతులమీదుగా గీతాంజలి శర్మకు అవార్డును అందజేసి సత్కరిస్తారు. అనంతరం ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై గీతాంజలి శర్మ ప్రసంగిస్తారు. గతేడాది తొలిసారిగా ఈ అవార్డును అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ, ప్రస్తుత ఇంటెలిజెన్స్ ఎస్పీ కేజీవీ సరితకు బహూకరించారు. తన లక్ష్యం వేరైనప్పటికీ తల్లిదండ్రుల సూచనపై సివిల్స్‌లో నెగ్గి ఐఏఎస్‌కు ఎంపికై న గీతాంజలి శర్మ కాకినాడలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసి, తెనాలి సబ్‌కలెక్టర్‌గా గతేడాది బాధ్యతలు స్వీకరించారు. ప్రజాసేవపై ఆకాంక్ష, విధులపై చిత్తశుద్ధితో అనతికాలంలోనే ప్రజలు, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. గత రిపబ్లిక్ దినోత్సవాన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్నీ అందుకున్నారు. పశువైద్యురాలు కావాలనుకుని.. గీతాంజలి శర్మ స్వస్థలం రాజస్థాన్. తండ్రి యశ్వంత్‌శర్మ నౌకాదళంలో అధికారిగా చేశారు. తల్లి వేదవతిశర్మ శాస్త్రవేత్త. సోదరుడు యశ్దేవ్ శర్మ నౌకాదళంలో అధికారిగా ఉన్నారు. గీతాంజలి శర్మ భర్త కుమార్ సౌరభ్ ఐఆర్ఎస్ అధికారి. జైపూర్, ముంబయి, ఢిల్లీలో విద్యాభ్యాసం చేసిన గీతాంజలి శర్మ ప్రతి తరగతిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతూ వచ్చారు. పక్షులు, జంతువులంటే ప్రేమ కలిగిన ఆమె పశువైద్యురాలు కావాలనుకున్నారు. సివిల్స్‌లో విజయం సాధిస్తే, ఎందరో ప్రజలకు సేవ చేయొచ్చన్న తల్లిదండ్రుల సూచనను పాటించారు. 2020 అక్టోబర్‌లో ఐఏఎస్ సాధించారు. తన వ్యక్తిత్వం, దక్షతతో ప్రజాసేవలో రాణిస్తున్నారు. -
గోడలు కూలిపోయే రోజు కోసం...
ఇవాళ రవీంద్రుడి పుట్టిన రోజు. ఆయన ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో సులభంగా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కానీ రవీంద్రుడి సాహిత్యాన్నీ, ఆ సాహిత్యం ఇచ్చే సంస్కారాన్నీ తెలుసుకోవడం ఇప్పటి తరానికి ఎంతైనా అవసరం. రవీంద్రుడి బాల్యం చిత్రంగా గడిచింది. అతను నాలుగు గోడల్ని బద్దలు కొట్టడం నేర్చుకున్నారు. ప్రకృతిని గొప్ప పాఠశాలగా భావించారు. పరిశీలన, ప్రకృతితో మమేకం కావడం ద్వారా ఆయన జ్ఞానవంతుడయ్యారు. ‘ప్రపంచ రహస్యాన్ని’ తెలుసుకునే క్రమంలో విజయం సాధించారు. ప్రకృతిని ఆస్వాదించే హృదయాన్ని పొందిన టాగూర్, అక్కడినుండే సాహిత్యాన్ని సృష్టించడం మొదలు పెట్టారు. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సంస్కృత కావ్యాలు చదివారు. ఆంగ్ల సాహిత్యాన్ని పరిశీలించారు. బాల్యంలోనే ‘సంధ్యాగీత’ ప్రకటించారు. అది అందరి మన్ననలు పొందింది. రవీంద్రుని ప్రసిద్ధ గేయం ఊరకే అతని హృదయం నుండి రాలేదు. (Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు) ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో/ఎక్కడ మాన వుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో/ ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో’’ అంటూ ఒక స్వేచ్ఛా స్వర్గంలోకి, తన దేశాన్ని మేలుకునేట్లు చేయమని ప్రార్థించారు. ఈ వాక్యాలు ఇప్పటికీ నెర వేరలేదు. రవీంద్రుడు విశ్వమానవ వాదాన్ని కోరుకున్నారు. పరిశుభ్ర ప్రపంచాన్ని ఆశించారు. ఆధునిక వచన కవితలో తన భావాల్ని పొందు పరిచారు. ‘గీతాంజలి’లో ఎంత గొప్ప కవిత్వం అందించారో వేరే చెప్పాల్సిన పని లేదు. గీతాంజలి దేశ హద్దుల్ని దాటి, ప్రపంచం అంతా వినిపించింది. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) తన సాహిత్యం ద్వారా టాగూర్ ఈ దేశంలో కుల, మత, వర్గాలకు అతీతంగా మానవుడు తయారుకావాలని అభిలషించారు. మతం మనిషిని విభజించరాదని తెలియజేశారు. తన ఎనభై ఏళ్ళ జీవిత ప్రస్థానంలో అనేక నవలలు, నాటికలు, కవితా సంపుటాలు, గేయాలు రచించి సంపూర్ణ సాహిత్యకారుడిగా ఆవిష్కరించుకున్నారు. ‘విశ్వకవి’ అందించిన భావాలను పాడటమో, చదవ టమో కాదు. వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే రవీంద్రుని ఆశయం నెరవేరినట్టు! – డాక్టర్ సుంకర గోపాల్ తెలుగు శాఖాధిపతి, డీఆర్జీ ప్రభుత్వ కళాశాల, తాడేపల్లిగూడెం (మే 7న టాగూర్ జయంతి) -
మా ఇంటికి సంతోషం వచ్చింది
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఆయన మూడోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు సెల్వరాఘవన్, గీతాంజలి. వీరికి ఒక పాప, బాబు (లీలావతి, ఓంకార్) ఉన్నారు. తాజాగా ఓ బాబుకి జన్మనిచ్చారు గీతాంజలి. ఈ బాబుకి రిషికేశ్ సెల్వరాఘవన్ అని పేరు పెట్టారు. ‘‘మేం ఐదుగురం అయ్యాం. రిషికేశ్ గురువారం ఉదయమే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. సంతోషం తెచ్చాడు. మా కుటుంబానికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు’’ అని పేర్కొన్నారు ఈ దంపతులు. 2010లో సెల్వరాఘవన్, గీతాంజలి వివాహం చేసుకున్నారు. ‘‘7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు’ వంటి సినిమాలను రూపొందించారు సెల్వరాఘవన్. -
ముఖచిత్ర మకుటం
మూడేళ్ల వయసులో తల్లి అడిగింది. ‘బేబీ.. సిక్ అయిన వాళ్లకు నువ్వెలా నయం చేస్తావ్?’ అని. ‘మ్యూజిక్ వినిపిస్తాను’ అంది గీతాంజలి! పియానో చక్కగా ప్లే చేస్తుంది ఇప్పటికీ తను. గీతాంజలికి ఇప్పుడు పదిహేనేళ్లు. మ్యూజిక్లోంచి సైన్స్ చేసే మ్యాజిక్‌లోకి వచ్చేసింది. సైంటిస్ట్, ఇన్వెంటర్ తనిప్పుడు! స్కూల్‌కి వెళ్లొస్తూనే ప్రపంచాన్ని మలుస్తోంది. భూగోళంపై ఎన్నో సమస్యలు. వాటి పరిష్కారానికి ఒక టీమ్‌ని నిర్మిస్తానంటోంది.. ఈ ‘టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్’. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టైమ్’ పత్రిక తరచు కొన్ని ప్రత్యేకమైన ముఖచిత్రాలతో వెలువడుతుంటుంది. ఈ సోమవారం మరింత ప్రత్యేకమైన ముఖచిత్రంతో కొత్త సంచిక మార్కెట్లోకి రాబోతోంది. అయితే ఆ ప్రత్యేకత ‘టైమ్’ పత్రిక వల్ల ఆ ముఖచిత్రానికి వచ్చింది కాక, ముఖచిత్రం వల్ల టైమ్ పత్రికకు వచ్చినది! ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా పదిహేనేళ్ల భారతీయ బాలిక గీతాంజలీరావును ‘టైమ్’పత్రిక ఎంపిక చేయడమే అందుకు కారణం. ‘టైమ్’ కే ఒక కిరీటం అయినట్లుగా ముఖచిత్రంపై ఆత్మవిశ్వాసపు దృక్కులతో మందస్మిత గంభీరంగా కూర్చొని ఉంది చిన్నారి గీతాంజలి. ఆన్లైన్లో గీతాంజలితో ఏంజెలీనా. ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్‌తో ‘టైమ్’ ఇలా ఒక ముఖచిత్రాన్ని వెయ్యడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది చిన్నారుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించి, విశ్లేషించి, వడపోసి గీతాంజలిని ఎంపిక చేసింది టైమ్. గీతాంజలి కొన్ని సామాజిక, నిత్యజీవితావసరాల్లో మిళితమై ఉన్న సమస్యలకు పరిష్కారం కనిపెట్టింది. అవే ఆమెను తక్కిన చిన్నారుల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ‘‘ప్రపంచాన్ని ఎవరైతే మలుచుతారో వారిదే ఈ ప్రపంచం. ప్రపంచం ఏ విధమైన అస్థిరతలో ఉన్నా, అందుకొక పరిష్కారాన్ని చూపే చిన్నారులు ప్రతి తరంలోనైనా ఉంటారు’’ అని టైమ్ వ్యాఖ్యానించింది. ∙∙ గీతాంజలిని ‘టైమ్’ పత్రిక.. సైంటిస్ట్, ఇన్వెంటర్ అని పేర్కొంది. అయితే సైంటిస్టుగా, ఇన్వెంటర్‌గా నేరుగా ల్యాబ్‌లోకి వెళ్లి కూర్చోలేదు గీతాంజలి. మొదట ఆమెక్కొన్ని ఆలోచనలు వచ్చాయి. మంచినీటి కాలుష్యాన్ని తగ్గించడం, కలుషిత కారకాలు అసలే లేకుండా చేయడం మొదటి ఆలోచన. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన ఆలోచన అది. స్కూలు పిల్లల్లో ‘సైబర్ బుల్లీయింగ్’ను కనిపెట్టి ‘ఎడిట్’ చెయ్యడం పన్నెండేళ్ల వయసు లో ఆమెకు వచ్చిన రెండో ఆలోచన. ఈ రెండు ఆలోచనల మధ్యలో అనేక ఆలోచనలు చేసింది గీతాంజలి. ‘టెడ్ఎక్స్ టాక్’ షో లో గీతాంజలితో బాలీవుడ్ షారుక్‌ఖాన్ (గత ఏడాది) వీటన్నిటినీ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నియంత్రించే పద్ధతుల్ని కనిపెట్టింది! తాగు నీటిలో ఉండే సీసం ఆరోగ్యానికి హాని చేసే రసాయన మూలకం. సీసం ప్రకృతి సిద్ధంగానే నీటిలో కలిసి ఉంటుంది. అయితే మోతాదుకు మించి ఉంటే ప్రమాదం. ఎలా తెలుస్తుంది మనకు, మన తాగే నీటిలో సీసం ఎంత ఉందన్నది?! దాన్ని తెలుసుకునేందుకు గీతాంజలి ‘టెథిస్’ అనే పరికరాన్ని కనిపెట్టింది! అసలైతే తాగునీటిలో సీసం సున్నా శాతం ఉండాలి కానీ, అది సాధ్యం కాదు కనుక పాయింట్ 24 మైక్రో మోలార్స్ కంటే మించకుండానైతే చూసుకోవాలి. టెథిస్‌తో అలా చూసుకోవడం, జాగ్రత్త పడటం సాధ్యమౌతుంది. బావికో, చెరువుకో వెళ్లి మంచినీళ్లను తోడుకునో, నింపుకునో తెచ్చుకునే కాలం నుంచి, ప్లాంట్ల నుంచి కొనుక్కునే కాలం లోకి ఏనాడో వచ్చిపడ్డాం. నీటిని అమ్మే పెద్ద పెద్ద ప్లాంట్ల వాళ్లు నీటి నుంచి సీసాన్ని తొలగించామనే చెబుతారు. అయితే నిజంగానే తొలగించారా, ఏ మేరకు తొలగించారు అని గీతాంజలి కనిపెట్టిన టెథిస్‌తో తెలుసుకోవచ్చు. టెథిస్ను క్యాన్లలోని నీటికి తాకిస్తే చాలు. మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్న సెన్సర్ ద్వారా ఆ నీటిలో సీసం ఎంత మోతాదులో ఉన్నదీ డిస్ప్లే అవుతుంది. యు.ఎస్.లోని కొలరడోలో ఉంటున్న గీతాంజలికి ఈ ‘టెథిస్’ థాట్ 2014లో వచ్చింది. ఆ యేడాది మిషిగాన్‌లోని ఫ్లింట్ సిటీలో పురాతన కాలం నాటి పైపుల నుంచి సీసం నిల్వలు వచ్చి తాగునీటిలో కలవడంతో అనేకమంది జబ్బునపడటం ఆ చిన్నారిలో ఆలోచనలు రేపింది. అలాగే ‘సైబర్ బుల్లీయింగ్’పై నిఘాకు గీతాంజలి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను కనిపెట్టడానికి కూడా స్కూల్లో తను చూసిన సంఘటనలే ప్రేరణ. లావుగా ఉన్నారని, పీలగా ఉన్నారని, బ్లాక్ పీపుల్ అని ఇలా సాటి విద్యార్థులను ఏడిపించేవారి నుంచి మనసు గాయపడకుండా తప్పించుకోవడం కోసం ‘కైండ్లీ’ అనే ఒక యాప్‌ను, క్రోమ్ ఎక్స్టెన్షన్ అనుసంధానం చేస్తూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని వృద్ధి చేసింది! ప్రధానంగా ఈ రెండు ఆవిష్కరణలు గీతాంజలిని ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిపాయి. ∙∙ గీతాంజలి తల్లిదండ్రులు ఉండేది కొలరడోలోని ‘లోన్ ట్రీ’ ప్రాంతంలో. గీతాంజలి అక్కడే పుట్టింది. ప్రస్తుతం అక్కడి ‘స్టెమ్ స్కూల్ హైలాండ్ రాంచ్’లో చదువుతోంది. బాల్యం నుంచే తనకు కొత్తకొత్త విషయాలను కనుక్కోవడం పై ఆసక్తి. కనుక్కునే అవసరాన్ని మాత్రం ఆమె చూసిన నిజ జీవిత ఘటనలు కలిగించాయి. జెనిటిక్స్ ఇంజినీరింగ్ చదువుతానని అంటోంది. వ్యసనాల మీద, ఉద్యోగాలలో స్త్రీ, పురుష వేతనాల్లోని వ్యత్యాసాల మీద ఈ వయసుకే ప్రసంగాలు కూడా ఇచ్చింది! ‘‘సమాజాన్ని అన్ని విధాలా ఆరోగ్యవంతంగా పునర్నిర్మించగల జ్ఞానం, వివేకం ఉన్న చిన్నారులే ఈ భూగోళం భవిష్యత్తు’’ అని టైమ్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచిన సందర్భంగా గీతాంజలిని ఇంటర్వ్యూ చేసిన నటి ఏంజెలీనా జోలీ ఆమెను ప్రశంసిస్తూ అన్నారు. మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది గత ఏడాది కూడా ఇదే సమయానికి గీతాంజలి వార్తల్లో ఉంది. నవంబర్ 2 న షారుక్ ఖాన్ బర్త్‌డే. అదే రోజు స్టార్ ప్లస్‌లో ‘టెడ్ టాక్స్ ఇండియా సీజన్ 2 – నయీ బాత్ ప్రీమియర్ మొదలైంది. ‘డోంట్ కిల్ ఐడియాస్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ టెక్నాలజీ–ఎంటర్టైన్మెంట్–డిజైన్ (టి.ఇ.డి) టాక్ షో ప్రసారం అవుతుంటుంది. ఆ షోకి వ్యాఖ్యాత షారుక్‌ఖాన్. ఆ రోజు గెస్ట్ స్పీకర్ గీతాంజలీరావు. అవును స్పీకర్! అలా అమెరికాలో ఉన్న గీతాంజలికి ముంబైలో ఉన్న షారుక్ ఖాన్‌ను కలిసే అవకాశం వస్తే, ముంబైలో ఉన్న షారుక్‌కు అమెరికాలో ఉండే గీతాంజలిని కలిసే అవకాశం వచ్చింది. నిజంగా అవకాశంలానే ఫీల్ అయ్యారు షారుక్. ఆమె కనిపెట్టిన టెథిస్ పరికరం గురించి విని చాలా సంతోషపడిపోయారు. ‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’ అని ప్రశంసించారు. టెథిస్ అంటే స్వచ్ఛమైన జలం అని అర్థం. గ్రీకుపురాణాల్లోని ఒక సముద్రం పేరు కూడా. ‘నా పిల్లలకీ చెబుతాను’ గీతాంజలి టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక అవగానే హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ టైమ్ తరఫున గీతాంజలిని ఇంటర్వ్యూ చేశారు. ప్రధానంగా ఆమె ‘సైబర్ బుల్లీయింగ్’ని అడ్డుకునేందుకు గీతాంజలి కనిపెట్టిన ‘కైండ్లీ’ యాప్ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ ఫోన్ టెక్స్టింగ్లో బుల్లీయింగ్ని సూచించే పదాలను గీతాంజలి రూపొందించిన యాప్ డిలీట్ చేసి, ఆ తర్వాతే సెండ్ చేస్తుంది. అలా అప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ వయసు పిల్ల అంత టెక్నాలజీని కనిపెట్టడం ఏజెలీనాకు మురిపెంగా అనిపించింది. ‘అయితే ఈ యాప్ గురించి నా పిల్లలకీ చెబుతాను’ అని ఆమె అన్నారు. ‘నీ లక్ష్యం ఏమిటì గీతాంజలీ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘భూగోళంపై సమస్యలన్నిటికీ పరిష్కారం కనిపెట్టే ఒక యంగ్ టీమ్‌ని నిర్మించడం’’ అని చెప్పింది గీతాంజలి. -
షారుక్ అండ్ ది సైంటిస్ట్
పిల్లల భవిష్యత్తు పెద్దల చేతుల్లో ఉంటుంది. అయితే హీరో షారుక్ ఖాన్.. మానవాళి భవిష్యత్తునే ఓ చిన్నారి చేతుల్లో పెట్టేశాడు! ఏంటా స్టోరీ? స్టోరీ కాదు.. సినిమా కథ కాదు. గీతాంజలీరావు అనే బాల సైంటిస్టుకు ఆయనిచ్చిన ప్రశంస. దేశంలో మనుషులు ఉన్నట్లుగా లేదు! కాలుష్యం మాత్రమే ఉన్నట్లుంది. ఢిల్లీ చూడండి. చూడాలా! చూడ్డానికి ఏం కనిపిస్తుంది? అంతా కాలుష్యమేగా. ఢిల్లీ ఒకటే కాదు.. దేశమంతటా గాలి కలుషితమైపోతోంది. నీరు కలుషితమైపోతోంది. గాలీ నీరు మాత్రమేనా.. టోటల్‌గా పంచభూతాల్లోని స్వచ్ఛతే ఫినిష్ అయిపోతోంది. మనిషా మజాకా! ఇంతటి కాలుష్య దేశాన్ని తీసుకెళ్లి.. పదమూడేళ్ల లేత చేతుల్లో పెట్టేశాడు షారుక్ ఖాన్. ‘‘తల్లీ.. మా భవిష్యత్తు నీ చేతుల్లో సురక్షితంగా ఉంది’’ అని ఆ చిన్నారికి ప్రణామాలు కూడా అర్పించాడు. ఆయుక్షీణం కాదా.. చిన్నపిల్లను ‘నమో నమామీ’ అనడం?! చిన్నపిల్ల అయితే మాత్రం? ఛేదించింది, సాధించిందీ తక్కువ విషయమా! తాగునీరు ఎంత శాతం సీసంతో కలుషితం అయిందో తెలుసుకునే పరికరాన్ని ఆ అమ్మాయి కనిపెట్టింది. ఈపీఎ (ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ–యు.ఎస్) లెక్కల ప్రకారం తాగే నీటిలో జీరో శాతం మాత్రమే సీసం ఉండాలి. అంటే అస్సలు ఉండకూడదు. మనిషికి హాని చేసే రసాయన మూలకం సీసం. అయితే నీటిలో సీసం ఉండకుండా పోదు. ప్రకృతి సిద్ధంగానే నీటితో కలిసి వస్తుంది. మరీ ఎక్కువ మోతాదుల్లో ఉంటే దేహంలోని ప్రతి అవయవాన్నీ కబళిస్తుంది. తాగే నీటిలో సీసం .24 మైక్రో మోలార్స్ వరకు ఉండొచ్చు. అంతకు మించితే ప్రమాదం. నేరుగా దొరువుల నుంచి, చెరువుల నుంచి, బావుల నుంచి కాకుండా క్యాన్లే ఇంటిముందుకు దిగే కాలంలోకి వచ్చిపడ్డాం కనుక.. ప్లాంట్ నుంచి వచ్చే ఆ నీటిలోంచి ముందే సీసాన్ని తొలగిస్తారు. తొలగించాం అంటారు కానీ నిజంగా తొలగించారా లేదా ఇంట్లోనే తెలుసుకోవాలంటే ఇదిగో.. ఈ గీతాంజలి కనిపెట్టిన పరికరం ఉపయోగపడుతుంది. పోర్టబుల్ డివైజ్ అది. ‘టెథిస్’ అని పేరు పెట్టింది గీతాంజలి ఆ పరికరానికి. టెథిస్ అనేది గ్రీకు పురాణాల్లోని ఒక సముద్రం పేరు. ‘స్వచ్ఛమైన జలం’ అని ఇంకో అర్థం. టెథిస్ను నీటికి తాకిస్తే చాలు మొబైల్‌కి కనెక్ట్ చేసుకున్న సెన్సర్ ద్వారా ఆ నీటిలో ఎంత మోతాదులో సీసం ఉన్నదీ ఫోన్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. టెథిస్ ఫార్ములాను ఏదైనా కంపెనీ తీసుకుని ఉత్పత్తి మొదలుపెట్టి, మార్కెట్లోకి తీసుకురావడమే ఆలస్యం. ధర కూడా ఎంతో ఉండదని గీతాంజలి చెబుతోంది. ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ కాబట్టట. ఎక్కడో ముంబైలో ఉండే షారుక్కీ, ఇంకెక్కడో కొలరాడోలో ఉండే గీతాంజలికీ ఎలా కలిసినట్లు? నవంబర్ 2 షారుక్ బర్త్ డే. ఆయన పుట్టిన రోజుకు గీతాంజలి యు.ఎస్. నుంచి ఇండియా వచ్చి ఆయన్ని కలిసిందా? లేదు. నవంబర్ రెండునే స్టార్ ప్లస్‌లో ‘టెడ్ టాక్స్ ఇండియా–సీజన్ 2.. నయీ బాత్’ ప్రీమియర్ మొదలైంది. ‘డోంట్ కిల్ ఐడియాస్’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రసారం అవుతుండే ఈ ‘టెక్నాలజీ – ఎంటర్ టైన్మెంట్ – డిజైన్’ టాక్ షోకి వ్యాఖ్యాత షారుక్ ఖాన్. ఆ షోలో గెస్ట్ స్పీకర్ గీతాంజలీ రావు. అలా గీతాంజలికి షారుక్‌ని కలిసే అవకాశం వస్తే.. గీతాంజలిని కలిసే భాగ్యం తనకు దక్కిందని షారుక్ సంతోషపడిపోయారు. ఆ చిన్నారి కనిపెట్టిన పరికరం గురించి తెలుసుకుని ‘‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’’ అని మురిసిపోయాడు. గీతాంజలి, ఆమె తల్లిదండ్రులు యు.ఎస్‌లో ఉంటారు. కొలరాడో లోని లోన్ ట్రీలో 2005లో పుట్టింది. ‘స్టెమ్ స్కూల్ హైలాండ్ రాంచ్’లో చదువుతోంది. కొత్తకొత్త విషయాలను కనుక్కోవడంపై ఆసక్తి. జెనిటిక్స్ ఇంజనీరింగ్ చదవాలని ఆశట! ఉద్యోగాల్లో స్త్రీ–పురుషుల వేతనాల్లోని వ్యత్యాసాల మీద కూడా ఇప్పటికే చిన్న ప్రసంగం కూడా ఇచ్చేసింది. షారుక్ అన్నట్లు మానవాళి భవిష్యత్తు ఇలాంటి పిల్లల చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. సమాజంలోని అన్ని కాలుష్యాలనూ హరించగల జ్ఞానం, వివేకం ఉన్న బాలల్ని ప్రోత్సహించడం మాత్రమే కాదు, వాళ్ల ఆలోచనల్నుంచి గ్రహించవలసిందీ ఎంతో ఉంటుంది. జబ్ షారుక్ మెట్ గీతాంజలి పదమూడేళ్ల గీతాంజలికి షారుక్‌ని కలిసే అవకాశం వస్తే.. గీతాంజలిని కలిసే భాగ్యం తనకు దక్కిందని 54 ఏళ్ల షారుక్ సంతోషపడిపోయారు. ఆ చిన్నారి కనిపెట్టిన పరికరం గురించి తెలుసుకుని ‘‘మా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది’’ అని మురిసిపోయాడు. -
అదే నీకు సరిపడే కవిత
టాగూర్ గీతాంజలిని అనువదించి, దానికి రాసిన ముందుమాటలో కవిత్వాన్ని ఎట్లా దర్శించాలో చలం పంచుకున్న అభిప్రాయం ఇక్కడ: గొప్ప ఆర్టు, ముఖ్యం కవిత్వం వినోదం కాదు. అనుభవం. మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి, ఉన్నత పరివర్తనం కలగచెయ్యాలని ప్రయత్నిస్తుంది. గీతాంజలి కొంతవరకైనా అర్థం కావాలంటే కవిత్వరసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం వుండాలి. గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా, ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి. మానవుడికి ఈశ్వరుడితో ప్రత్యక్ష సంబంధం Personal Relation ఉండడానికి వీలు వుంటుందని అంగీకరించుకోవాలి. కాకపోతే ఈ గీతాలు మొహమ్మొత్తే కూని రాగాలు. వుత్త చర్విత చరణాలు. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తాహతుని బట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించగలగడం. కొంత స్పష్టంగా తెలుస్తుంది. జయదేవుడి అష్టపదులు, కృష్ణశాస్త్రి గీతాలు, మాటల అర్థంతో ఎంత చెపుతాయో, ధ్వనితో, సంగీతంతో, భాషామాధుర్యంతో అంతకన్నా ఎక్కువ చెపుతాయి. గీతాంజలి బెంగాలీ పాటల సంగతి అదే చెపుతారు. అవి పాడగా విన్నవారికి అవి పూర్తిగా తెలీక పోవొచ్చు. కాని వాటి గానం, శబ్దలాలిత్యం, పదాల ధ్వని విన్యాసం, ఇవన్నీ శ్రవణాన్ని, మనసుని ఆకర్షించి, మనసును దాటి ఎక్కడో అంతఃకరణంలో ఆత్మలో మాధుర్యాన్నీ తేజస్సునీ నింపుతాయి. ఆ శ్రోత అంతరాంతరంలో ఏం మార్పు జరుగుతుందో అతని మనసుకే తెలీదు. ఈ రహస్యం గుర్తించక పోవడం వల్లనే, ఈనాడు తిండికీ, వొంటికీ, మనసు పై పొరల ఆహ్లాదాలకీ ఉపయోగపడని కళ, కళ కాకుండా పోతోంది. లోకం ఇంత విడిపోయింది. గొప్ప కవిత్వ సృష్టిగాని, అనుభవం గాని మనసు వెనక ఎంతో లోతునవుండే Sublime or Supernal Planeలో జరుగుతుంది. మనసుకు తెలిసేది స్వల్పం. గీతాంజలి అంతరార్థం చలానికేం తెలుసు? టాగూరు కెంతమాత్రం తెలుసు? ‘‘నీ పాటల అర్థాలన్నీ చెప్పమని అడుగుతారు. ఏం చెప్పాలో నాకు తెలీదు. ఏమో, వాటి అర్థమేమిటో ఎవరికి తెలుసు? అంటాను!’’ అంటారు టాగూర్. తన Emotional అనుభవానికి రూపకల్పన చేస్తాడు కవి. తమ విరహాన్ని, నిరాశని, విశ్వాసాన్ని, భయాన్ని ఎన్నోవిధాల పాడారు, ్కట్చ ఝటరాసిన భక్తులూ, మీరా, కబీర్, రామదాసు, త్యాగరాజు. అంత భక్త పరాధీనుడైన ప్రభువు తనెంత తపించినా దర్శనమివ్వడేమని త్యాగరాజు వ్యథ, ఆశ్చర్యం, భయం; దాని కంతకీ రూపమిచ్చి: ఖగరాజ నీ యానతి విని వేగ చనలేదో గగనానికి ఇలకు బహు దూరం బనినాడో కాకపోతే నువ్వెందుకు రావు? అని పాడతాడు కవి. ఆ విరహం నీ హృదయంలో ఏ కొద్దిగా మండినా, అతని తపనని నీకు అర్థం చెయ్యడానికి అతనిచ్చిన రూపకల్పన విష్ణూ, వాహనం గరుడుడూ నీకు అనుభవాన్నియ్యడానికి అభ్యంతరాలు కానక్కర్లేదు. కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం. కవిత్వం చదివిన తరవాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృథా! నీకు తోచనిదీ కనపడనిదీ కవి చెప్పిన తరవాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వొచ్చేదీ, అదే నీకు సరిపడే కవిత. -
పీఎన్బీ స్కాంలో మరో ఛార్జ్‌షీటు
ముంబై : డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన భారీ కుంభకోణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో మరో సూత్రధారి అయిన నీరవ్ మేనమామ మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా సీబీఐ బుధవారం మరో ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టులో ఈ ఛార్జ్‌షీటును నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఈ కేసులో తొలి ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీఎన్బీలో దాదాపు రూ.13వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీబీఐ తన ఛార్జ్షీటుల్లో పేర్కొంది. తొలుత దాఖలు చేసిన ఛార్జ్షీటులో సీబీఐ పలు బ్యాంకు టాప్ అధికారుల పేర్లను ప్రస్తావించింది. దీనిలో పీఎన్బీ మాజీ చీఫ్ ఉషా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజయ్ శరణ్, జనరల్ మేనేజర్(ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) నేహాల్ అహద్‌లను కూడా సీబీఐ తన తొలి ఛార్జ్షీటులో పేర్కొంది. ప్రస్తుతం నమోదు చేసిన ఛార్జ్షీటులో మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి సంస్థలను చేర్చింది. తొలి ఛార్జ్‌షీటు దాఖలైన మరుసటి రోజే పీఎన్బీ తన నాలుగో క్వార్టర్లో భారీగా రూ.13,416.91 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఇప్పటి వరకు పోస్టు చేసిన ఫలితాల్లో ఇదే అత్యధిక నష్టంగా విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, పీఎన్బీ భారీ కుంభకోణాన్ని విచారిస్తున్న సీబీఐ తన తొలి ఎఫ్ఐఆర్ను జనవరి 31న నమోదు చేసింది. నీరవ్‌మోదీ, ఆయన భార్య, సోదరుడు నిషాల్, అంకుల్ మెహుల్ చౌక్సి, పలువురు పీఎన్‌బీఐ అధికారులకు వ్యతిరేకంగా అప్పట్లో ఈ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది. వెంటనే మరో రెండు ఎఫ్ఐఆర్లను కూడా సీబీఐ ఫైల్ చేసింది. తొలి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని సోమవారం సీబీఐ తన తొలి ఛార్జ్‌షీటును దాఖలు చేయగా.. రెండో ఎఫ్ఐఆర్ ఆధారితంగా నేడు రెండో ఛార్జ్‌షీటు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ
న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న గీతాంజలి జెమ్స్ గ్రూపునకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో మార్చి త్రైమాసికంలో బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,000 కోట్ల మేర పెరిగిపోనున్నాయి. గీతాంజలి జెమ్స్ గ్రూపునకు ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రూ.8,000 కోట్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎటువంటి చెల్లింపులు జరగలేదు. దీంతో ఈ మొండి బకాయిలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. గత త్రైమాసికంలో ఎన్పీఏలుగా మారిన ఖాతాల్లో గీతాంజలి అతిపెద్దది కావడం గమనార్హం. డిసెంబర్ త్రైమాసికం నాటికి దేశీయ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,40,958 కోట్లుగా ఉన్నాయి. పీఎన్బీని రూ.13,000 కోట్ల మేర మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి గీతాంజలి జెమ్స్ గ్రూపు ప్రమోటర్ మెహుల్‌చోక్సీ దగ్గరి బంధువు కావడం గమనార్హం. ముంబైలోని సీబీఐ కోర్టు మోదీ, చోక్సీలకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్ వారంట్లు కూడా జారీ చేసింది. అలహాబాద్ బ్యాంకు సార«థ్యంలోని 21 బ్యాంకుల కన్సార్షియం గీతాంజలి జెమ్స్ గ్రూపునకు వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని తొలుత 2010–11లో మంజూరు చేసింది. రూ.900 కోట్లతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ రుణంలో అధిక వాటా కలిగి ఉంది. 2015లో గీతాంజలికి ఇచ్చిన రుణాలను పునరుద్ధరించగా, 2017 డిసెంబర్ క్వార్టర్ వరకు ఈ రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు జరిగాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు గీతాంజలి జెమ్స్ గ్రూపు రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. -
గీతాంజలి వెబ్సైట్ షట్‌డౌన్
ముంబై : పీఎన్బీ-నీరవ్ మోదీ మోసపూరిత కేసులో భాగమైన గీతాంజలి గ్రూప్ వెబ్సైట్ షట్‌డౌన్ అయ్యింది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే 'మెయింటన్స్ మోడ్'లో ఉన్నట్టు ఓ మెసేజ్ దర్శనిస్తోంది. '' ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రస్తుతం తమ వెబ్సైట్ షెడ్యూల్ చేయబడిన నిర్వహణలో ఉంది. అర్థం చేసుకునందుకు ధన్యవాదాలు'' అనే మెసేజ్ ఈ వెబ్‌సైట్‌పై కనబడుతోంది. గతవారం చివరి వరకు ఈ వెబ్సైట్ మామూలుగానే పనిచేసింది. అయితే ఎప్పుడు ఈ వెబ్సైట్ పనిచేయడం ఆగిపోయిందో స్పష్టంగా తెలియరావడం లేదు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ సీబీఐ, ఈడీ అధికారుల కనుసన్నల్లో ఉంది. గీతాంజలి గ్రూప్‌కు యజమాని మెహుల్ చౌక్సి. డైమాండ్ కింగ్ నీరవ్ మోదీకి ఈయన మేనమామ. రూ.11,400 కోట్ల పీఎన్బీ స్కాంకు పాల్పడిన వారిలో నీరవ్ మోదీతో పాటు మెహుల్ చౌక్సి కూడా ఉన్నారు. 2011లోనే ఈ స్కాం ప్రారంభమైనట్టు తెలిసింది. కానీ ఈ ఏడాది జనవరి మూడో వారంలో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. తమ బ్యాంకు ముంబై బ్రాంచులో భారీ ఎత్తున్న స్కాం జరుగుతున్నట్టు పీఎన్‌బీఐ ఉన్నతాధికారులు గుర్తించారు. అంతర్గత విచారణ జరిపిన అనంతరం సీబీఐకి, స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపారు. అయితే ఈ స్కాం బయటికి రాకముందే, కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీ, మెహుల్ చౌక్సి విదేశాలకు చెక్కేశారు. -
ఆయనే లేకపోతే నా కల నెరవేరేది కాదు
చెన్నై: భర్త ప్రోత్సాహం లేకపోతే తన కల నెరవేరేది కాదని కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ భార్య, 'మలై నేరత్తు మాయక్కం' చిత్ర దర్శకురాలు గీతాంజలి తెలిపింది. భర్త ప్రేరణ, మద్దతుతోనే తను మెగాఫోన్ పట్టానని ఆమె మురిసిపోతోంది. సెల్వ రాఘవన్ లేకపోతే తన చిరకాల కోరిక నెరవేరేది కాదని గీతాంజలి సంతోషాన్ని వ్యక్తం చేసింది. దర్శకురాలు కావాలని చిన్నప్పటి నుంచీ తాను కలలు కన్నానని, అయితే పెళ్లి, పాపకు జన్మనివ్వడంతో కొంతకాలం దానికి వాయిదా వేసినట్లు గీతాంజలి పేర్కొంది. అయితే పెళ్లయినంత మాత్రాన, అభిరుచులను పక్కనపెట్టాల్సిన అవసరం లేదని భర్త ఎపుడూ చెబుతూ ఉండేవారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టానన్నారు. మరోవైపు భర్త తనకు ఘోస్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడన్న వార్తలను గీతాంజలి కొట్టి పారేసింది. ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎంత కష్టపడ్డానో తనకు మాత్రమే తెలుసని, ఘోస్ట్ డైరెక్టర్ పేరుతో తానుపడ్డ శ్రమ అంతా వృధా కావడం, క్రెడిట్ అంతా భర్తకు పోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించింది. అయితే ఈ సినిమాకు తన భర్త స్ర్కిప్ట్ అందించడం గొప్ప విషయమని, సెల్వ రాఘవన్‌తో పెళ్లికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని వెల్లడించింది. కాగా 7/జి బృందావన కాలనీ సినిమా స్టోరీ నేపథ్యాన్నే తీసుకొని సరికొత్త కథను సిద్ధం చేశాడు రాఘవన్. 'మలై నేరత్తు మైకం' టైటిల్‌తో ఈ సినిమాకు గీతాంజలి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. హీరోగా కోలా బాలకృష్ణ, హీరోయిన్గా వామిఖ కూడా వెండితెరపై మెరవబోతున్నారు. అమ్రిత్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పలువురిని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ వామిఖ నటన అనుకున్నత స్థాయిలో లేకపోవడంతో... ఆమెపై షూటింగ్ స్పాట్లో సెల్వ రాఘవన్ చేయి చేసుకున్నాడనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
తిరుపుర సుందరి
‘కలర్స్’ స్వాతిని తమిళనాట ఇకపై ‘తిరుపుర సుందరి’ అని పిలుస్తారేమో! ఎందుకంటే ఆ పేరుతో తమిళంలో ఓ సినిమా తయారైంది. ఇదే తెలుగులో ‘త్రిపుర’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘గీతాంజలి’ ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘స్వాతి నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఇది యూనివర్శల్ సబ్జెక్ట్. అందుకే మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని నిర్మించే యోచనలో ఉన్నాం’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘గీతాంజలి’కన్నా ఈ చిత్రం బాగుంటుంది. ఆ చిత్రానికి మించిన సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఆద్యంతం ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని రాజ కిరణ్ చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోన వె ంకట్, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: కమ్రాన్. -
బికినీకి నో
మలయాళీ బ్యూటీస్‌కు కోలీవుడ్‌లో లక్కేలక్కు అని చెప్పక తప్పదు. సీనియర్స్ ఆసిన్, నయనతార మొదలుకుని అమలాపాల్,లక్ష్మీమీనన్ వరకూ విజయాలను అవలీలగా అందుకున్నవాళ్లే. తాజాగా మరో మలయాళీ కుట్టి కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది.ఆమే నటి కీర్తిసురేష్. నెట్ట్రికన్ను చిత్రంలో రజినీకాంత్ సరసన నటించి,1980 ప్రాంతంలో ప్రముఖ కథానాయికిగా వెలుగొందిన నటి మేనక వారసురాలే ఈ కీర్తిసురేష్. మాతృభాషలో బాలతారగా కొన్ని చిత్రాలు చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత గీతాంజలి అనే చిత్రంతో కథానాయకిగా పరిచయమైంది.అలా అక్కడ రెండు మూడు చిత్రాలు చేసిందో లేదో కోలీవుడ్ అవకాశాలు అమ్మడి తలుపులు తట్టేశాయి. నటుడు శివ కార్తీకేయన్‌తో రజినీమురుగన్ చిత్రంలో రొమాన్స్ చేసే చాన్స్‌ను అందుకుంది. సాధారణంగా చిత్రం హిట్ అయితే మరిన్ని అవకాశాలు వస్తుంటాయి. కీర్తీ లక్ ఏంటంటే తొలి చిత్రం విడదల కాకుండానే వరుసగా మరో రెండు అవకాశాలు వచ్చేశాయి. దీంతో ఇంకేముంది పాప పారితోషికం పెంచేసిదనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి స్పందించిన కీర్తి షరామామూలు గానే బదులిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగమ్మ ఏమంటుందో చూద్దాం. తమిళంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. మా అమ్మ నటించిన ఇండస్ట్రీలో నేనూ చేయడమన్నది మరింత సంతోషకరమైన విషయం.అమ్మ కేర ళలో నివశిస్తున్నా ఇంటిలో తమిళంలోనే మాట్లాడుతుంటారు. అలా నేనూ తమిళ భాష నేర్చుకున్నాను. ఇప్పుడు తమిళంలో నా చిత్రాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను.శివకార్తికేయన్‌తో నటించిన రజినీమురుగన్, విక్రమ్‌ప్రభుకు జంటగా చేసిన ఇదు ఎన్న మాయం చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. బాబిసింహకు జంటగా నటిస్తున్న పాంబుసండై నిర్మాణంలో ఉంది. ఒక్క చిత్రం కూడ విడుదల కాకుండానే మూడు చిత్రాల అవకాశాలు రావడం గురించి అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే అంతా భగవంతుని కృపే. మలయాళం,తమిళ భాషలతో పాటు తెలుగులోనూ హరికథ, ఐనా ఇష్టం నువ్వు అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాను తెలుగు భాష తెలియక పోయినా డైలాగ్స్ తమిళంలో రాసుకుని బట్టీపట్టి చెప్పుకుంటున్నాను. ఇకపోతే స్విమ్మింగ్ డ్రస్‌లో నటిస్తారా? అని అడుగుతున్నారు. నేను ఈత దుస్తులకు దూరం. అలాగే నేను ఏ నటికీ పోటీ కాదు. పారితోషికం పెంచాననే ప్రచారం చేస్తున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. నా స్థాయికి తగ్గపారితోషికాన్నే తీసుకుంటున్నాను. -
పెళ్లి సందడి!
-
పెళ్లి సందడి!
‘కలర్స్’ స్వాతి పెళ్లి అయిపోయింది. అదేంటి అంత హఠాత్తుగా అనుకుంటున్నారా...! జస్ట్ సినిమా కోసమేనండి! స్వాతి కథానాయికగా జె. రామాంజనేయలు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘త్రిపుర’. ‘గీతాంజలి’ ఫేం రాజ్‌కిరణ్ దర్శకుడు. కథ కూడా ఆయన రాసుకున్నదే. కథానాయిక స్వాతిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో 40 శాతం టాకీ పార్టు పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, కెమెరా: రవికుమార్ సానా, సమర్పణ: జె.రామాంజనేయిలు. -
‘గీతాంజలి’కి సీక్వెల్ తీస్తా
భీమవరం: హర్రర్ కామెడీ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని.. వీటికి చక్కటి ఆదరణ ఉందని గీతాంజలి చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్ అన్నారు. స్థానిక కిషోర్ థియేటర్లో గీతాంజలి చిత్రాన్ని శుక్రవారం రాత్రి ఆయన తిలకించారు. విరామ సమయంలో పలువురిని సినిమాపై అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చక్కటి కథతో గీతాంజలి సినిమాను తెరకెక్కించారని ఆయన్ను ప్రశంసించారు. అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు. థియేటర్ యాజమాన్యం ఆయన్ను సత్కరించింది. అనంతరం విలేకరులతో రాజ్‌కిరణ్ మాట్లాడుతూ కైకలూరులో పుట్టిన తాను భీమవరం కేజీఆర్ఎల్ కాలేజీలో చదువుకున్నానన్నారు. ఇక్కడ ఎంఎస్ నారాయణ పరిచయంతో సినిమాలపై మక్కువ పెంచుకున్నానని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని తెలిపారు. రెండు సినిమాల తర్వాత గీతాంజలికి సీక్వెల్ తీస్తానని చెప్పారు. గీతాంజలి చిత్రానికి రూ.4 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికి రూ.13 కోట్లు వసూలు చేసిందన్నారు. కథ బాగుంటే చిన్న సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి గీతాంజలి విజయమే నిదర్శనమన్నారు. ఐ.రాంబాబు, వాసు ఆయన వెంట ఉన్నారు. -
తగిన ప్రతిఫలం లభించింది
‘‘కథలో సత్తా ఉండి, తెరకెక్కించే విధానం బాగుంటే.. విజయం తథ్యం అని మా ‘గీతాంజలి’ రుజువు చేసింది. ఓ విధంగా ఈ సినిమా నాలో ఆత్మవిశ్వాసం నింపింది’’ అని కోన వెంకట్ అన్నారు. ఆయన సమర్పణలో అంజలి ప్రధాన పాత్రధారిణిగా రూపొంది, ఇటీవలే విడుదలైన చిత్రం ‘గీతాంజలి’. రాజకిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో కోన వెంకట్ మాట్లాడుతూ, ‘‘బ్రహ్మానందం పాత్ర ఈ చిత్రానికి వెన్నెముక. ఓ కుటుంబ పెద్దలా నిలబడి సినిమా బాగా రావడానికి ఆయన కృషి చేశారు. అంజలి, శ్రీనివాసరెడ్డి, రావు రమేశ్, ‘సత్యం’రాజేశ్, షకలక శంకర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘సమష్టి కృషే విజయానికి కారణమైనా, అందులో కోన వెంకట్ పడిన తపన ప్రత్యేకం. నిర్మాత డబ్బు గురించి అసలు ఆలోచించలేదు. మంచి ప్రొడక్ట్ కోసమే తపించారు’’ అని బ్రహ్మానందం అన్నారు. తొలిసారి ద్విపాత్రాభినయం చేశాననీ, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనీ అంజలి ఆనందం వెలిబుచ్చారు. సినిమా విజయం పట్ల శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నందినీరెడ్డి, దశరథ్, వీరు పోట్ల, నీరజ కోన, ప్రవీణ్ లక్కరాజు, పృథ్వి, సప్తగిరి, దర్శకుడు మెహర్ రమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అంజలి... ‘గీతాంజలి’
అంజలి నటిస్తోన్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘గీతాంజలి’ సినిమా లోగోను పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కోన వెంకట్‌కు, ఇతర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారాయన. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రాజకిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అనుష్కకు అరుంధతిలా, అంజలికి గీతాంజలి ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని చెప్పారు. నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ -‘‘ఇప్పటికి యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అంజలి, బ్రహ్మానందం, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, కెమేరా: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వీఎస్ఎన్ కుమార్. -
నోబెల్ ఇండియా పురస్కారం: రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి
ఆంగ్లేతర సాహిత్య రచనలతో అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. ఈయన రచించిన ‘గీతాంజలి’ తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజరపరిచాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్ రచనలు సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోశాయి. వీటిని రవీంద్రుడే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం. ఈ అనువాదాల ద్వారా నోబెల్ కమిటీ ఈ రచనల సారాంశాన్ని గ్రహించింది. అతడిని 1913లో నోబెల్ బహుమానానికి అర్హుడిగా ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఇతడే కడపటివాడు. ‘ఠాగూర్’ అంటే ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగాడు. రవీంద్రుడి జ్యేష్ట సోదరుడైన ద్విజేంద్రనాథ ఠాగూరు సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతీంద్రనాథ నాటక ప్రయోక్త, సంగీతకారుడు. అందువల్ల జోరాశాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య, బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. రవీంద్రుడు ఏ పాఠశాలకు పోకుండానే ఇంటివద్దే విద్యాభ్యాసం చేశాడు. 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి ‘భాను సింహ’, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు. శాంతినికేతన్‌కు పయనం! రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. రవీంద్రుడు సోదరులతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్ (రచయిత) జీవిత చరిత్ర, ఎడ్వర్ట్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకళింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు. న్యాయశాస్త్రం చదివించాలని! రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని, షేక్స్పియర్ రచనలు ‘రెలిజియో మెడిసి’, ‘కొరియొలోనస్’, ‘ఆంటోనీ క్లియోపాత్రా’ మొదలైనవన్నీ ఆకళింపు చేసుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడటం, రాయటం నేర్చుకున్నారు. ఐరిష్, స్కాటిష్ జానపద గేయాలను నేర్చుకుని, 1880లో స్వదేశం చేరుకున్నారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతులతో మేళవించి, రెండింటిలోని మంచిని తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు. వివాహం! రవీంద్రుని వివాహం 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది. ‘షి లై ద హా’ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ (ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉంది) నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు. ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు ‘నైట్’ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విశ్వకవి పై జాతిపిత ప్రభావం! మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు. కుల వివక్షను తొలగించటానికి బెంగాల్లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్లో ‘శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థ’ను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు. భారతీయ ఔన్నత్యాన్ని చాటుతూ... రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి ‘విశ్వంలోని మానవులంతా ఒక్కటే’ అనే సందేశాన్ని అందించారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మమొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి’, ‘గురుదేవ్’ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విశ్వకవి రవీంద్రుడి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం, వివరణ లభించక మానదు. జనగణమన... అధినాయక..! గీతాంజలి, గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వాడుకభాషలో, సరళమైన శబ్దాలతో ఉంటాయి. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం (జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయగీతాలుగా ఎంపిక చేసుకున్నాయి. ఠాగూర్ గీత రచయిత మాత్రమే కాదు... నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యాత కూడ. రవీంద్రుని రచనలు: గీతాలు: మానసి (1890); సోనార్ తరి (1890); గీతాంజలి (1910); గీతిమాల్య (1914); తోటమాలి (1913) (వీటిని స్వయంగా ఆంగ్లంలోకి స్వేచ్ఛానువాదం చేశారు). నాటకాలు, కథలు: రాజా (1910); డాక్ ఘర్ (1912); అచలాయతన్ (1912) ; ముక్తధార (1922); రక్తక రవి (1926) ‘గోరా’(1910); ఘరే బైరే (1916); యోగా యోగాలు (1929) ; బికారిణి (1929) , నృత్యరూపకాలు: పాత్రపుత్( 1936), శేషసప్తక్ (1935), శ్యామ (1939), చండాలిక (1939) రవీంద్రుడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ‘చార్ అధ్యాయ్ (1934), విశ్వ పరిచయ్ (1937), తీన్‌సంగి, గల్పశిల్ప (1941)’ మొదలైన రచనలు చేశారు. 1941లో రవీంద్రుడు చనిపోయే ముందురోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అనే మిత్రుణ్ని పిలిచి, తన తుది సందేశాన్ని చెప్పారు. ‘నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమితల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈ రోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వతానందంతో వెళ్తాను’ అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శరీర త్యాగం చేశారు. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు