కొణకంచి(పెనుగంచిప్రోలు): అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది.
తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment