
వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున 3:30 గంటకు(భారత కాలమానం ప్రకారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి మృతిచెందారు. మృతులను ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. వీరంతా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని టేకులపల్లి వాసులుగా తెలుస్తోంది. మృతులు మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి కుమార్తె కుటుంబీకులని సమాచారం. వీరి మరణ వార్త తెలియడంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments
Please login to add a commentAdd a comment