అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీవాసులు మృతి | Road Accident At USA Randolph Three Dead From AP | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీవాసులు మృతి

Published Wed, Oct 16 2024 7:29 AM | Last Updated on Wed, Oct 16 2024 1:05 PM

Road Accident At USA Randolph Three Dead From AP

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాండాల్ఫ్‌ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు ఏపీలోకి చెందినవారు ఉన్నారు.

వివరాల ప్రకారం.. దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రాండాల్ఫ్‌ సమీపంలో హైవేపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత, తిరుమూరు గోపిగా అధికారులు ధృవీకరించారు. ఇక, హరిత భర్త సాయి చెన్ను ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

 ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి

ఇది కూడా చదవండి: ట్రంప్‌పై కుట్ర.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement