![Communist Leader Katti Padma Reacted To Gitanjali Death - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/13/kattipadama.jpg.webp?itok=6iZ2VsiP)
సాక్షి, విశాఖపట్నం: కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేదల మేలు కోసమేనని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని కమ్యూనిస్ట్ నేత కత్తి పద్మ అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇల్లు లేని వారికి సీఎం జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందన్నారు.
గీతాంజలి మృతిపై ఆమె స్పందిస్తూ.. ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరని, ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయన్నారు. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ట్రోల్ చేయాలంటూ కొన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయని, అందుకే ఇంతటి ఘోరం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని కత్తి పద్మ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మీరో ‘గీతాంజలి’ కావద్దు
Comments
Please login to add a commentAdd a comment