Katti
-
జరిగిన మేలు చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా?: కత్తి పద్మ
సాక్షి, విశాఖపట్నం: కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేదల మేలు కోసమేనని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని కమ్యూనిస్ట్ నేత కత్తి పద్మ అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇల్లు లేని వారికి సీఎం జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందన్నారు. గీతాంజలి మృతిపై ఆమె స్పందిస్తూ.. ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరని, ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయన్నారు. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ట్రోల్ చేయాలంటూ కొన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయని, అందుకే ఇంతటి ఘోరం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని కత్తి పద్మ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మీరో ‘గీతాంజలి’ కావద్దు -
'కత్తి'తో దూసుకొస్తున్న చిరంజీవి
హైదరాబాద్ : మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చేస్తున్న తరుణం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చిరంజీవి 150 సినిమాపై స్పష్టత వచ్చేసింది. 'కత్తి' పట్టేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా రీమేక్‌లో చిరంజీవి నటించబోతున్నాడు. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడాని అందరూ అనుకున్నారు. దానిపై పూరీ కూడా బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో... చిరు 150 సినిమాకు డైరెక్ట్ చేసే హక్కు తనకే ఉందంటూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరీ ...చిరంజీవి కథ చెప్పేశాడు కూడా. అయితే మొదటి పార్ట్ ఓకే అన్న చిరు...రెండో పార్ట్ విషయంలో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తీరా సీన్ మారింది. పూరీ ప్లేస్‌ను వివి వినాయక్ కొట్టేశాడు. చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వినాయక్‌కు దక్కింది. గతంలో చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రానికి కూడా వినాయక్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా చిరంజీవి తన 150 సినిమాకు రీమేక్‌నే నమ్ముకున్నాడు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ వద్దన్న కథను చిరు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఏదైనా సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా? కత్తి సినిమాలో చిరంజీవికి నచ్చిందేమిటి? అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాఫిక్‌గా మారింది. -
కత్తి రీమేక్‌లో యంగ్‌టైగర్
-
23న పాటలు, 31న ‘కత్తి’ విడుదల
తుపాకి’ చిత్రం తర్వాత హీరో విజయ్-దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘కత్తి’. సమంత కథానాయిక. ‘కొలవెరి’ ఫేమ్ అనిరుధ్ స్వరాలందించారు. కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 23న పాటలు, 31న సినిమా విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ -‘‘ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. హైఓల్టేజ్ యాక్షన్‌తో పాటు సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్లకు మంచి ప్రాధాన్యముంది. మురుగదాస్ ఏ తరహా సినిమా చేసినా వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తారు. చాలా విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా చేశారు. చాలా హార్ట్ టచింగ్ మూవీ ఇది. పాటలకూ మంచి స్కోప్ ఉంది. దీపావళి కానుకగా తెలుగు వెర్షన్ పాటలను విడుదల చేస్తున్నాం. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ కీలకపాత్ర చేసిన ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్‌ప్రసాద్. -
విజయ్ ‘కత్తి’కి కష్టాలు
విజయ్ ‘కత్తి’కి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రం విడుదలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 10వ తేదీన నటుడు విజయ్ ఇంటిని ముట్టడించనున్నట్టు ఎల్టీటీఈ మద్దతు సంఘాల సమాఖ్య వెల్లడించింది. ఈ సమాఖ్య నిర్వాహకులు ఎన్.ప్రదీప్‌కుమార్, సెంబియన్లు విలేకరులతో మాట్లాడుతూ విజయ్, సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కత్తి చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోందన్నారు. ఈ సంస్థ యజమాన్యానికి, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. కాబట్టి లైకా సంస్థ నిర్మిస్తున్న కత్తి చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయరాదన్నారు. అదే విధంగా పులిపార్వై చిత్రాన్ని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చిత్రంలో ఎల్‌టీటీఈల పోరాటాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు. మరో విషయం ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ యుద్ధంలో పాలు పంచుకున్నట్లు చిత్రీకరించారని తెలిపారు. చిన్న పిల్లాడు, యుద్ధంలో పాల్గొన్నట్లు చిత్రీకరించిన ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. చిత్ర విడుదలకు ప్రయత్నిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీ నటుడు విజయ ఇంటిని ముట్టడించి ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమానికి తమిళ అభిమానులు, సంఘాలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. -
భారీ బడ్జెట్‌తో కత్తి
ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కత్తి. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. తుపాకీ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఐన్గరన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని నిర్మాతలు తెలిపారు. ఫిబ్రవరి 3న కోల్‌కతాలో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించి హైదరాబాద్, రాజమండ్రి, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించినట్లు వివరించారు. ఈ నెల ఏడో తేదీ నుంచి చెన్నైలో వేసిన భారీ సెట్లో షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ 40 రోజులపాటు జరుగుతుందని తెలిపారు. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన కరుణామూర్తి చెప్పారు. చిత్రానికి అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్నారు. శ్రీలంకతో సంబంధాల్లేవు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ఎలాంటి సంబంధాల్లేవని కత్తి చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ సంస్థల అధినేతలకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో స్నేహ, వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరగడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది. దీంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఐయిన్గరన్ సంస్థ అధినేత కరుణామూర్తి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, లైకా ప్రొడక్షన్ అధినేత సుభాష్కరన్, తాను 30 ఏళ్ల క్రితమే శ్రీలంకను వదిలి వచ్చేశామన్నారు. తాను 27 ఏళ్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్నానని చెప్పారు. లైకా సుభాష్కరన్ శ్రీలంకలోని ముల్లై దీవికి చెందిన తమిళుడని చెప్పారు. లైకా ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఏడాదికి టర్నోవర్ 15 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ పదేళ్లుగా చెన్నైలో తన వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. 1800 మందికి ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు. లైకా సుభాష్కరన్-2013 మేలో తన జన్మభూమిని సందర్శించడానికి శ్రీలంక వచ్చారని ఆయనతోపాటు తాను ఉన్నానని తెలిపారు. రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని ముల్లై దీవి పరిసర ప్రాంతాలను చుట్టొచ్చామని చెప్పారు. దీంతో కొందరు రాజపక్సేతో స్నేహ సంబంధాలంటూ అసత్య ప్రచారం చేశారని వివరించారు.