విజయ్ ‘కత్తి’కి కష్టాలు | vijay got troubles on his film | Sakshi
Sakshi News home page

విజయ్ ‘కత్తి’కి కష్టాలు

Published Fri, Aug 8 2014 11:45 PM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

విజయ్ ‘కత్తి’కి కష్టాలు - Sakshi

విజయ్ ‘కత్తి’కి కష్టాలు

విజయ్ ‘కత్తి’కి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ చిత్రం విడుదలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 10వ తేదీన నటుడు విజయ్ ఇంటిని ముట్టడించనున్నట్టు ఎల్‌టీటీఈ మద్దతు సంఘాల సమాఖ్య వెల్లడించింది. ఈ సమాఖ్య నిర్వాహకులు ఎన్.ప్రదీప్‌కుమార్, సెంబియన్‌లు విలేకరులతో మాట్లాడుతూ విజయ్, సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కత్తి చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోందన్నారు. ఈ సంస్థ యజమాన్యానికి, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. కాబట్టి లైకా సంస్థ నిర్మిస్తున్న కత్తి చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయరాదన్నారు.
 
అదే విధంగా పులిపార్వై చిత్రాన్ని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చిత్రంలో ఎల్‌టీటీఈల పోరాటాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు. మరో విషయం ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ యుద్ధంలో పాలు పంచుకున్నట్లు చిత్రీకరించారని తెలిపారు. చిన్న పిల్లాడు, యుద్ధంలో పాల్గొన్నట్లు చిత్రీకరించిన ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. చిత్ర విడుదలకు ప్రయత్నిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 10వ తేదీ నటుడు విజయ ఇంటిని ముట్టడించి ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమానికి తమిళ అభిమానులు, సంఘాలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement