విజయ్
కత్తి చిత్రాన్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో చిత్ర విడుదల ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం కత్తి. సమంత హీరోయిన్. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. విజయ్, ఏఆర్ మురుగదాస్‌ల కలయిలో తుపాకి తర్వాత తెరకెక్కిన రెండవ చిత్రం కత్తి. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సమస్య అంత ఇక్కడే ఉంది.
సంస్థ అధినేతలకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు మధ్య సత్సంబంధాలున్నాయన్న విషయమే కత్తి చిత్రానికి చిక్కులు తెచ్చి పెడుతోంది. ఈ వ్యవహారంలో నిర్మాతలు ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చారు. అయినా కొన్ని తమిళ సంఘాలు కత్తి చిత్రం విడుదలను అడ్డుకుంటామంటున్నాయి. తాజాగా తమిళర్ వాయ్ ఉరిమై సమాఖ్య నిర్వాహకుడు వేల్‌మురుగన్ కత్తి చిత్రం విడుదలను అడ్డుకుని తీరుతామని పేర్కొన్నారు. ఈ సమాఖ్య కార్యవర్గ సమావేశం సోమవారం చెన్నైలో జరి గింది. ఈ సమావేంలో పురట్చి భారతం పార్టీ అధ్యక్షుడు పూవై జగన్‌మూర్తి, కొంగు ఇళంజర్ పేరవై అధ్యక్షుడు, ఎమ్మెల్యే తనియరసు, ఎల్‌టీటీఈ నేత కొల్గై ప్రభు, కార్యదర్శి బాలాజీ, ద్రావిడ మునేట్ర మక్కల్ కళగం పార్టీ అధ్యక్షుడు జ్ఞానశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వేల్‌మురుగన్ పత్రికల వారితో మాట్లాడుతూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే బంధువులైన లైకా సంస్థ అధినేతలు నిర్మించిన కత్తి చిత్రం విడుదలను రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామన్నారు. ఈ విషయమై థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులను కలిసి తమ వాదన వినింపించి సహకరించాల్సిం దిగా కోరతామన్నారు. అదీ మీరి కత్తి చిత్రాన్ని దీపావళి విడుదలకు ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చ రించారు.