షూటింగ్ స్పాట్ లో కుప్పకూలిన మురగదాస్!
చెన్నై: సినీ దర్శకుడు ఏఆర్ మురగదాస్ అనారోగ్య కారణాలతో సోమవారం ఆస్పత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజనింగ్, లో బీపీ కారణాలతో అస్వస్థతకు గురైన మురగదాస్ ను ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లోనే సృహతప్పి పడిపోయిన ఆయనను చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి తరలించారు.
విజయ్, సమంతాలతో నిర్మిస్తున్న కత్తి షూటింగ్ తిరువన్మియూర్ లో జరుగుతోంది. అక్కడే మురగదాస్ సృహతప్పడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మురగదాస్ ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.