'కత్తి' సినిమా విడుదలపై అనుమానాలు | 'Kaththi' release in Tamil Nadu uncertain | Sakshi
Sakshi News home page

'కత్తి' సినిమా విడుదలపై అనుమానాలు

Published Mon, Oct 20 2014 2:12 PM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

'కత్తి' సినిమా విడుదలపై అనుమానాలు

'కత్తి' సినిమా విడుదలపై అనుమానాలు

విజయ్ - సమంత జంటగా నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కత్తి' విడుదల ఇప్పుడు సందిగ్ధంలో పడింది. వాస్తవానికి బుధవారం నాడు ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అలరించాల్సి ఉంది. కానీ, ఆ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కు, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు మధ్య ఏవో సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన కథనాలు సినిమాకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెరమీదకు రావాలంటే.. బ్యానర్ నుంచి లైకా ప్రొడక్షన్స్ పేరు తీసేయాలన్న డిమాండు గట్టిగా వినిపిస్తోంది. వాళ్ల పేరు లేకపోతే మాత్రం సినిమా విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, వాళ్లు ఆ పేరు తీయకపోతే మాత్రం.. మొత్తం వందకు పైగా తమిళ సంఘాలు ఆ సినిమా తమిళనాడులోని ఏ థియేటర్లోనూ విడుదల కాకుండా అడ్డుకుంటాయని ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న టి.వేల్మురుగన్ చెప్పారు.

తమిళ అనుకూల వర్గాలు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా నిర్మాతల మధ్య సోమవారమే ఓ సమావేశం నిర్వహించి ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే సాధారణ థియేటర్ల నుంచి మల్టీ ప్లెక్సుల వరకు ఎక్కడా ఇంకా సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభం కాలేదు. విశ్వరూపం సినిమా విడుదల విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొనడంతో చాలా వరకు థియేటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అలాంటి పరిస్థితిని కల్పించాలని తాము అనుకోవట్లేదని తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం సభ్యుడొకరు తెలిపారు. ఇక విజయ్ ఇంతకుముందు నటించిన 'తలైవా' సినిమా కూడా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement