Kaththi
-
ఈమె తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం?
సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ల కెరీర్ సాగుతూ ఉంటుంది. అలాంటిది నటిగా మంచి స్థితిలో ఉన్నప్పుడే ఈమె పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఆ వెంటనే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం కొడుకుతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు సనా ఖాన్. అవును మీరు ఊహించింది కరెక్టే. కల్యాణ్ రామ 'కత్తి', నాగ్ 'గగనం', 'మిస్టర్ నూకయ్య' తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించింది ఈమెనే. తండ్రి మలయాళీ, తల్లిది ముంబయి. అలా ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2005లో బాలీవుడ్లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. (ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) హిందీ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. దాదాపు 14 ఏళ్లపాటు నటించింది. ఇక 2019లో కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో రిలేషన్ మొదలుపెట్టింది. ఏడాది తిరగకుండానే విడిపోయింది. ఇది జరిగిన కొద్దిరోజులకు యాక్టింగ్ వదిలేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. కట్ చేస్తే 2020 నవంబరులో ఇస్లామిక్ స్కాలర్ మఫ్టీ అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్ల బంధానికి గుర్తుగా ఈ ఏడాది జులైలో అబ్బాయి పుట్టాడు. రీసెంట్గా భర్త, కొడుకుతో కలిసి మక్కా వెళ్లిన సనాఖాన్ అందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈమెని తొలుత గుర్తుపట్టలేకపోయిన నెటిజన్స్.. గుర్తొచ్చిన తర్వాత ఈమెనా అని కామెంట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) -
హ్యాట్రిక్ కాంబినేషన్
తుపాకీ, కత్తి లాంటి ఘనవిజయాలు సాధించిన విజయ్, మురగదాస్‌ల కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మొదలైంది. మరోసారి ఓ సామాజిక సమస్య నేపథ్యంలో విజయ్ హీరోగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు సినిమా సెట్స్ మీదకు రావటంతో ఇళయదళపతి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం సినిమా ఓపెనింగ్ విషయంలో హింట్ ఇస్తూ దర్శకుడు మురుగదాస్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ దీపావళి గైస్’ అంటూ మురుగదాస్ ట్వీట్ చేసిన వెంటనే ఇది విజయ్ సినిమా ఓపెనింగ్ గురించి చేసిన ట్వీట్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ విజయ్, కీర్తి సురేష్‌లు హీరోహీరోయిన్లుగా కొత్త సినిమాను ప్రారంభించాడు మురుగదాస్. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. -
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హిట్ కాంబినేషన్
కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా రెండు సార్లు వందకోట్ల కలెక్షన్లు సాధించిన కాంబినేషన్ దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్‌లది. తుపాకి, కత్తి సినిమాలతో రెండు భారీ విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్లో ఇప్పుడు మూడో చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించాలని భావిస్తున్నారు. అందుకే పక్కా కథా కథనాలతో పాటు సెంటిమెంట్‌ను కూడా రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు దీపావళి కానుకగా రిలీజ్ అయ్యాయి. తుపాకీ సినిమా 2012 దీపావళికి రిలీజ్ కాగా., కత్తి సినిమా 2014 దీపావళి సమయంలో రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ఈ కాంబినేషన్లో రూపొందబోయే హ్యాట్రిక్ సినిమాను కూడా అదే సమయంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్న మురుగదాస్, ఆ సినిమా పూర్తయిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాల పనులు ప్రారంభించనున్నాడు. విజయ్ కూడా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి మురుగదాస్ సినిమాకు డేట్స్ కేటాయించేలా ప్లాన్ చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 దీపావళి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
అది బాబాయ్ మీద ఆధారపడి ఉంది!
‘‘ఎవరైనా ఎక్కడైనా మంచి పని చేస్తే.. దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. మంచి పనులు చేసినవాళ్లను ఎంపిక చేసి నాన్నగారి 150వ సినిమా సెట్లో కలిసే అవకాశం కల్పిస్తాం. సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు ఏం చేస్తే బాగుంటుందో? మాకు సలహా ఇవ్వండి’’ అని రామ్‌చరణ్ అన్నారు. గురువారం ఫేస్బుక్లో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు చరణ్ సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని విశేషాలు... నాన్నగారి 150వ చిత్రం టైటిల్ ‘కత్తిలాంటోడు’ కాదు. మంచి టైటిల్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఆగస్టులో ఆ టైటిల్ ప్రకటిస్తాం. ఒకవేళ నాన్నగారు, దర్శకుడు వీవీ వినాయక్ నటించమంటే.. 150వ చిత్రంలో ఏదైనా పాటలో కనిపిస్తాను. మంచి కథ దొరికితే కల్యాణ్ బాబాయ్‌తో కలసి నటించడానికి నేనెప్పుడూ రెడీ. బాబాయ్ నిర్మాణ సంస్థలో నేను హీరోగా నటించే చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశముంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘ధ్రువ’ ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న, చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. కాశ్మీర్లో నాన్నగారి నలభై సినిమాల షూటింగులు జరిగాయి. ‘ధ్రువ’ కోసం కాశ్మీర్లో షూటింగ్ చేయడం హ్యాపీగా అనిపించింది. వీలయితే కుటుంబంతో కాశ్మీర్ వెళ్లండి. బాగా ఎంజాయ్ చేస్తారు. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభించాలని అనుకుంటున్నాం. గౌతమ్ మీనన్ చిత్రాలంటే బాగా ఇష్టం. ఆయనతో ఓ చిత్రం చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఏఆర్ మురుగదాస్‌తోనూ సినిమా చేయాలనుంది. కచ్చితంగా ఇద్దరితోనూ పని చేస్తా. నాకు అభిమాన నటుడంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి నటన నచ్చుతుంది మహేశ్ బాబు అద్భుతమైన నటుడు, వెరీ గుడ్ లుకింగ్ పర్సన్. ప్రభాస్.. మంచి స్నేహితుడు, లవింగ్ పర్సన్. -
ఆ విషయం ఏమో చెప్పలేను: రాంచరణ్
చెన్నై: మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'కత్తి' రీమేక్ ద్వారా 150వ చిత్రంతో ఆయన మళ్లీ ప్రేక్షకులను పలుకరించనున్నాడు. గురువారం సాయంత్రం ఫేస్బుక్ లైవ్ చాటింగ్‌లో అభిమానులతో ముచ్చటించిన మెగా హీరో రాంచరణ్ తన తండ్రి 150వ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందని చెప్పారు. చిరు 150వ సినిమాకు 'కత్తిలాంటోడు' టైటిల్ పెట్టారని వార్తలు వస్తుండగా.. చరణ్ ఆ వార్తలను తోసిపుచ్చాడు. ఇంకా సినిమాకు పేరు పెట్టలేదని తెలిపాడు. ప్రస్తుతం 'ధ్రువ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ 15నిమిషాల పాటు లైవ్ చాటింగ్‌లో ముచ్చటించాడు. బాబాయి పవన్ కల్యాణ్‌తో సినిమా చేయడం తనకు ఇష్టమేనని, అయితే, ఇందుకు మంచి కథ దొరకాల్సిన అవసరముందని చెప్పాడు. ఇక చిరు 150వ సినిమాలో నటించే విషయమై రాంచరణ్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో తాను నటిస్తానో లేదోనని అన్నాడు. 'ఈ సినిమాలో నేను నటిస్తానా అన్నది కచ్చితంగా చెప్పలేను. ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉన్నాను. దర్శకుడు వినాయక్, మా నాన్నగారు సినిమాలో నేను నటించాలని కోరుకుంటే.. నేను ఒక పాటలో కనిపించే అవకాశముంది' అని చరణ్ చెప్పాడు. -
'కత్తి' కథ గొడవ ముగిసింది
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న కత్తిలాంటోడు, కథ విషయంలో చాలా రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా కత్తి. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే తెలుగు రచయిత ఎన్ నరసింహారావు, ఈ కథ నాదంటూ పోరాటం చేశాడు. అయితే అప్పట్లో ఆయన పోరాటం ఫలించలేదు. తరువాత చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో నరసింహారావు మరోసారి తన పోరాటాన్ని ప్రారంభించాడు. కత్తి సినిమా విడుదలకు ముందే తన కథను తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించినట్టుగా ఆధారాలు చూపించాడు. ఈ ఆధారాలను పరిశీలించిన సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు అతడికి న్యాయం జరిగే వరకు చిరు సినిమా షూటింగ్‌కు కార్మికులు హాజరు కావద్దని తెలిపారు. దీంతో కొంత కాలంగా నరసింహారావుతో మెగా టీం సంప్రదింపులు జరుగుతోంది. ఫైనల్‌గా చర్చలు ఓ కొలిక్కి వచ్చాయన్న వార్త వినిపిస్తోంది. ఎన్ నరసింహారావు పేరును సినిమా టైటిల్స్‌లో కథాసహకారం అంటూ వేస్తాం అన్న హామితో పాటు 40 లక్షల రూపాయిల పారితోషికం కూడా ఇచ్చేందుకు కత్తిలాంటోడు సినిమా యూనిట్ అంగకీరించింది. యూనిట్ సభ్యులు చెప్పిన హామిలతో సంతృప్తి చెందిన నరసింహారావు. ఇక వివాదం ముగినట్టే అని ప్రకటించారు. -
మెగాస్టార్ మేకప్ వేసుకునేది.. ఆ రోజే
చాలా రోజులుగా అభిమానులను ఊరిస్తున్న రోజు దగ్గర్లోనే ఉందన్న సంకేతాలిస్తోంది మెగా ఫ్యామిలీ. అఫీషియల్‌గా కన్ఫమ్ చేయకపోయినా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుందట. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించకపోయినా మీడియా సర్కిల్స్‌లో మాత్రం జూన్ 6న షూటింగ్ స్టార్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. చిరు సరసన అనుష్క హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కత్తిలాంటోడు అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అక్షయ్ కుమార్ చేతిలో 'కత్తి'
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కత్తి సినిమాను రీమేక్ చేయాలా..? వద్దా..? అన్న ఆలోచనలో ఉండగానే, బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాను మొదలెట్టేసేలా ఉన్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కత్తి సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. గతంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తుపాకి సినిమాను హాలీడే పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని నమోదు చేశాడు. మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అక్షయ్. తమిళ్లో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ వర్షన్‌కు ఆయన శిష్యుడు జగన్ దర్శకత్వం వహించనున్నాడు. లైకా మూవీస్ బ్యానర్‌పై మురుగుదాస్ స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో అఖీరా సినిమాను తెరకెక్కిస్తున్న మురుగుదాస్, ఈ సినిమా తరువాత అక్షయ్ హీరోగా కత్తి రీమేక్ పనులు మొదలెట్టనున్నాడు. -
సల్మాన్‌కు చరణ్ సలహాలు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమా సెలక్షన్ విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ సలహాలు తీసుకుంటున్నాడట. సౌత్ సినిమాలను రీమేక్ చేయడం మీద ఇంట్రస్ట్ చూపించే సల్మాన్ తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ సినిమాలు సెలెక్ట్ చేసుకోవటం కోసం చరణ్ హెల్ప్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే తమిళ్లో సూపర్ హిట్ అయిన 'తనీ ఒరువన్' రీమేక్‌లో నటించడానికి అంగీకరించాడు సల్మాన్. అయితే ఈ సినిమా సెలక్షన్ వెనుక కూడా చెర్రీ సలహా ఉందన్న టాక్ వినిపిస్తుంది. 'తనీ ఒరువన్' తెలుగు రీమేక్‌లో నటిస్తున్న చరణ్, ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాల్సిందిగా సల్మాన్ ను కోరాడు. అంతేకాదు చిరంజీవి 150 చిత్రంగా ప్రచారంలో ఉన్న కత్తి సినిమాను కూడా బాలీవుడ్లో సల్మాన్ రీమేక్ చేస్తే బాగుటుందంటున్నాడు చెర్రీ. సల్మాన్ ఖాన్‌కు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు ఉన్నాయి. గతంలో చరణ్ జంజీర్ షూటింగ్ సమయంలో చరణ్‌ను కలిసిన సల్మాన్ ఇటీవల చిరు పుట్టిన రోజు వేడుకల్లో కూడా పాల్గొన్నాడు. ఈ చనువుతోనే చరణ్ కూడా సల్మాన్‌కు సలహా ఇస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. -
విజయ్ నెక్ట్స్ మూవీ ఎవరితో?
ప్రస్తుతం దక్షిణాదిలో 'పులి' ఫీవర్ నడుస్తోంది. ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్లకు పైగా బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా రూపొందింది. బాహుబలి తరువాత అదే స్ధాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఇంత భారీ చిత్రం తరువాత విజయ్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి..? ప్రస్తుతం సౌత్ సినీ అభిమానులను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. 'పులి' లాంటి భారీ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. అయితే ఈ సినిమాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన జరగకపోయినా ఇటీవల తమిళ నాట జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఈ వార్త తెర మీదకు వచ్చింది. ఈ ఫంక్షన్ లో పాల్గొన్న విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక, నిర్మాత సి ఎ చంద్రశేఖర్ విజయ్ తదుపరి సినిమా పై కామెంట్ చేశాడు. అదే వేదిక మీద ఉన్న మురుగదాస్‌ను విజయ్ కోసం మరో సినిమా చేయాలంటూ కోరాడు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మురుగదాస్ తన సినిమా విజయ్‌తోనే ఉంటుందని ప్రకటించాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తుపాకీ', 'కత్తి' సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అలాగే తెరకెక్కబోయే ఈ సినిమాతో కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. -
విజయ్ ‘కత్తి’ కేసు వాయిదా
టీనగర్: నటుడు విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రకథ చోరీకి గురైనట్లు దాఖలైన కేసులో విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తూ తంజావూరు జిల్లా సెషన్సు కోర్టు ఉత్తర్వులిచ్చింది. చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన కత్తి చిత్రం గత ఏడాది విడుదలైంది. ఈ చిత్రం కథ తాను దర్శకత్వం వహించిన భూమి అనే డాక్యుమెంటరీ కథాంశం అని, తన కథను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చోరీ చేసినట్లు, ఇందుకు నష్ట పరిహారం చెల్లించాలని, వేరే భాషల్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసేందుకు స్టే విధిం చాలని తిరుకాట్టుపల్లి సమీపంలోగల ఇలంగాడు గ్రామం దిగువ వీధికి చెందిన అన్బువ రాజశేఖర్ (32) తంజావూరు జిల్లా సెషన్సు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటు డు విజయ్, నిర్మాతలు కరుణాకరన్, సుభాష్కరన్, చాయాగ్రాహకుడు జార్జి విలియమ్ అనే ఐదుగురిపై నేరం ఆరోపించారు. ఈ కేసు విచారణ తంజావూరు జిల్లా సెషన్సు న్యాయమూర్తి మహ్మద్ ఆలీ ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 15 వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి మహ్మద్ ఆలీ ఉత్తర్వులిచ్చారు. -
వంద కోట్ల క్లబ్లో.. విజయ్ 'కత్తి'..!
-
'కత్తి' హీరోయిన్ అరెస్ట్, విడుదల
ముంబై: తెలుగు చిత్రం 'కత్తి' లో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ అరెస్ట్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సనా ఖాన్, ఇస్మాయిల్ ఖాన్ లను బుధవారం ఉదయం అరెస్ట్ చేసి అంధేరి కోర్టుకు తీసుకెళ్లామని, అదే రోజు వారు బెయిల్ పై విడుదలయ్యారని అంబోలి పోలీసుల తెలిపారు. ఈ కేసులో తగిన ఆధారాల కోసం సేకరిస్తున్నామని పోలీసు ఇన్స్ పెక్టర్ వెల్లడించారు. తనను బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా పాల్పడుతున్నారని సనా, ఇస్మాయిల్ లపై ఓ మహిళ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఓ జిమ్ వద్ద దాడి చేశారని సనా, ఇస్మాయిల్ లపై సోహిల్ ఖాన్ అనే నటుడు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ సరసన కత్తి, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య చిత్రంలో సనా ఖాన్ నటించింది. Follow @sakshinews -
కత్తి చిత్రం నా సినీ జీవితంలో చాలా ముఖ్యమైనది
కోట్లు కూడబెట్టినా నోట్ల కట్టలు తినలేము. ఆకలి తీర్చేది అన్న మే. అలాంటి అన్నదాతే అన్నమో రామచంద్రా అంటూ...నిలువ నీడ లేక కడుపు నింపుకోవడానికి కూలి పనులు చేసుకునే దుస్థితి పడుతోంది. కొందరు కార్పొరేటర్ల దురాగత చర్యలే ఇందుకు కారణం. ఇలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం కత్తి. నటుడు విజయ్ నటిం చిన ఈ చిత్రానికి ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపై కొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిత్ర విజయోత్సవంతో పాటు పేదలకు పలు సహాయాలు అందించే కార్యక్రమం మంగళవారం కోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విజయ్ మాట్లాడుతూ కత్తి తన సినీ జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రం అని వ్యాఖ్యానించారు. సగటు మనిషి అత్యవసరమైన కూడు, గుడ్డ, గూడులలో అతి ముఖ్యమైనది కూడు (ఆహారం) అన్నారు. దాన్ని అందించే అన్నదాత ఆర్తనాదం ఇతివృత్తమే కత్తి చిత్రమన్నారు. అలాంటి చిత్రంలో నటించడం మనశ్శాంతిని కలి గించిందన్నారు. ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మరెందరో వలసపోయి కూలి చేసుకుని పొట్ట పోసుకుంటున్నారన్న విషయాలు ఈ చిత్రంలో నటించడం ద్వారా తాను తెలుసుకున్నానని చెప్పారు. ఇంత తెలిసిన తాను ఊరికే ఉండలేకపోయానన్నా రు. అందుకే ఈ చిన్న సాయం చేసే కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఆకలంటూ వచ్చిన వారికి రెండు చేపలను దానం చేసే కంటే వాటిని పట్టుకునే వలను ఇస్తే బాగుంటుందని చాలామంది అనడం విన్నానన్నారు. తానయితే రెండు చేపలతోపాటు వలను కూడా దానం చేయాలంటానన్నారు. ఒకరోజు సంపాదించిన దానిలో కొంత పేదలకు దానం చేస్తే పోయేదేమీ లేదన్నారు. ఒక ఊరిలో ఎక్కువ ఆస్పత్రిలో ఉంటే అక్కడ మనుష్యులకు అనారోగ్యం అధికంగా ఉన్నట్లు లెక్క. అదే విధంగా దానం చేసేవారు అధికంగా ఉంటే అక్కడ నిరుపేదలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సాయం కోసం చేతులు చాచే వారు లేకుండా పోతారో అప్పుడే మనదేశం పురోగతి సాధించిందని భావించవచ్చన్నారు. -
విజయ్‌తో పోటీనా?
నటుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు విశాల్ . తాజాగా హరి దర్శకత్వంలో సొంతంగా నిర్మించి, కథా నాయకుడిగా నటించిన చిత్రం పూజై. శ్రుతి హాసన్ కథానాయికిగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. చిత్ర విజయ యాత్రలో భాగం గా విశాల్ తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడు తూ తాను నటించి, నిర్మించిన పూజై చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృతజ్ఞతలు చెప్ప డం ఇష్టం లేక ప్రత్యక్షంగా కలవడానికి వచ్చానన్నారు. పూజై సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అన్నారు. అలాగే అన్ని వర్గా ల వారు చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి హరి దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. చరిత్రాత్మక చిత్రాలపై ఆసక్తి లేదు చరిత్రాత్మక చిత్రాలపై ఆసక్తి లేదని విశా ల్ పేర్కొన్నారు. తనకు సాధారణ చిత్రాల్లోని సంభాషణలు పలకడానికే కష్టం. అలాం టిది చారిత్రక చిత్రాల్లోని సంభాషణలు పల కడం మరింత కష్టం అన్నారు. అదే విధంగా పంచ్ డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడ్డానన్నారు. అందువలనే చారిత్రక కథా చిత్రాలు చేయాలనే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పూజై, కత్తి చిత్రాలు ఒకేసారి తెరపైకి రావడంతో నటుడు విజయ్‌తో ఢీ కొంటున్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు. నిజం చెప్పాలంటే తాను విజ య్‌తో పోటీ పడటం లేదని అన్నారు. పూజై చిత్రం ప్రారంభం ముందే దీపావళికి విడుదల చే యాలని నిర్ణయించామన్నారు. విజయ్ కత్తి చిత్రం కూడా అదే సమయంలో విడుదలవుతుందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందేనని విశాల్ వివరించారు. -
'కత్తి' హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్లపై పరువునష్టం దావా!
మదురై: వివాదాల నడుమ ఇటీవల విడుదలై తమిళనాడులో ఘన విజయం సాధించిన 'కత్తి' చిత్రం ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకుంది. ఈ సినిమా హీరో విజయ్‌తోపాటు దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై స్థానిక కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. ఈ సినిమాలో కోర్టులో విచారణ జరుగుతున్న 2జీ స్పెక్ట్రమ్ కేసును ప్రస్తావించినందుకు ఈ కేసు దాఖలైంది. ఈ కేసుపై ఓవైపు ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతుండగా, ఈ వ్యవహారంలో అవినీతి జరిగినట్లుగా నిర్ధారిస్తూ ఈ సినిమాలో ఓ డైలాగ్‌ను పెట్టారు. ఐపీసీ సెక్షన్ 500 (పరువుకు నష్టం కలిగించడం) కింద ఈ వ్యాఖ్య చేయడం నేరమని ఆర్. రామసుబ్రమణియన్ అనే న్యాయవాది మదురైలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. ఇటువంటి డైలాగ్‌లు దేశానికి రావాల్సిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)పై ప్రభావం చూపుతాయన్నది ఆయన వాదన. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది. ** -
'కత్తి' కోసం పవన్... నో అంటున్న విజయ్
వివాదాల నడుమ విడుదలై తమిళనాడులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'కత్తి' చిత్రంపై టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మనసు పారేసుకున్నట్లు సమాచారం. దాంతో పలువురు నిర్మాతలు ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కోలీవుడ్‌లో విజయ్- సమంత జంటగా నటించిన కత్తి చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దాంతో పలువురు తెలుగు నిర్మాతలు 'కత్తి' రీమేక్ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమా ఒరిజినల్ హక్కులను ఇంత వరకు ఎవరికీ అమ్మలేదని ఆ చిత్ర నిర్మాతల సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా రీమేక్‌పై హీరో విజయ్ కూడా సుముఖంగా లేడని, ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి త్వరలో విడుదల చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలిస్తాయా, కత్తిని చేతబడతారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
హీరో విజయ్ విగ్రహం ఆవిష్కరణ
చెన్నై: తమిళ సినిమా అభిమానులు తమ హీరోలపై చూపించే అభిమానం అంతాఇంతా కాదు. తాము అమితంగా అభిమానించే నటీనటులకు ఆలయాలు కట్టడం, వారి విగ్రహాలు పెట్టడం వంటివి చేస్తుంటారు. తాజాగా 'ఇళయదళపతి' విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెట్రీ ధియేటర్ లో హీరో విజయ్ మైనపు విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రూ.1.5 లక్షలతో ఫేస్బుక్ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ ఈ విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ నెల 22న విడుదలైన విజయ్ 'కత్తి' సినిమా రూ. 30 కోట్లు పైగా ఆరంభ వసూళ్లు రాబట్టింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటించింది. గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. -
రజనీని విజయ్ అధిగమించారా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ వసూళ్లను ఇళయదళపతి అధిగమించారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో వాడివేడిగా జరుగుతున్న చర్చ ఇదే. నటుడు విజయ్ నటించిన తాజా చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్. ఈ చిత్రం తెరపైకి వస్తుందా? రాదా? అంటూ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఈ చిత్రం పలు అవరోధాలను ఎదుర్కొని నిర్ణయించిన తేదీకే దీపావళి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు బద్దలు కొడుతోందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. కత్తి చిత్రం విడుదలైన తొలి రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.26 కోట్ల 80 లక్షలు వసూలు చేసిందని దర్శకుడు పేర్కొన్నారు. మన దేశంలో రూ.16 కోట్ల 45 లక్షలు, విదేశాలలో ఏడు కోట్ల 35 లక్షలు వసూలు చేసిందని మురగదాస్ ప్రకటించారు. అదే విధంగా దక్షిణాదిలోనే ఏ చిత్రమూ ఇంత వసూలు చేయలేదని చెప్పారు. తమిళ చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రజనీకాంత్ ఎందిరన్ చిత్రం నమోదైందన్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని అజిత్ నటించిన ఆరంభం చిత్రం దక్కించుకుందన్నారు. తాజాగా ఆ రెండు చిత్రాలను కత్తి చిత్రం అధిగమించిందనే అభిప్రాయాన్ని ఎఆర్ మురుగదాస్ వ్యక్తం చేశారు. అలాగే నటుడు విజయ్ నటించిన చిత్రాలన్నింటికంటే మంచి కథాంశం ఉన్న చిత్రంగా కత్తి మరో ఘనతను చాటుకుంటోంది. -
‘కత్తి’పై దాడులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ సంఘాల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్న ‘కత్తి’ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సినిమాను ప్రదర్శించనున్న థియేటర్లపై దాడులు చేసి ధ్వంసానికి పాల్పడ్డారు. చిత్రం విడుదల చేస్తే మరింత ఆందోళన తప్పదని ఆయా సంఘాలు హెచ్చరించినప్పటికీ బుధవారం కత్తి సినిమా విడుదలకు సిద్ధమైంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్, సమంత హీరో, హీరోయిన్లుగా నిర్మించిన చిత్రం కత్తి. ప్రసిద్ధ ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. లైకా మొబైల్స్ సంస్థ అధినేత సుభాష్కరన్ అల్లిరాజాకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే వ్యాపార భాగస్వామి అని తమిళ సంఘాల నేతలు చెబుతున్నారు. శ్రీలంక యుద్ధ సమయంలో వేలాది తమిళులను ఊచకోత కోసిన రాజపక్సే సన్నిహితుడు నిర్మించిన కత్తి సినిమాను రాష్ట్రంలో ప్రదర్శించేందుకు అనుమతించబోమని సుమారు 60 తమిళ సంఘాలు కొంతకాలంగా హెచ్చరిస్తున్నాయి. కత్తి సినిమా షూటింగ్ దశలోనే అనేక బహిరంగ ప్రకటనలు కూడా చేశాయి. ఈ నెల 22న రాష్ట్రంలోని 450 థియేటర్లలో కత్తి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు ప్రారంభించారు. నిరసన కారులను ఒప్పించేందుకు ఈ నెల 20న నిర్మాతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ అనే పేరును చిత్రం నుంచి తొలగించాలని సంఘాలు పట్టుబట్టగా, ఈ డిమాండ్‌కు నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణంలో చిత్రం విడుదలకు సిద్ధమైందని అందరూ భావించారు. అర్ధరాత్రి ఆకస్మిక దాడులు కత్తి విడుదలను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు సోమవారం అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా రాష్ట్రంలో స్వైర విహారం చేశారు. చెన్నై, కడలూరు, నామక్కల్, తిరుచ్చి తదితర జిల్లాల్లో కత్తి సినిమా ప్రదర్శనకు సిద్ధమైన థియేటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించారు. హీరో విజయ్ బ్యానర్లను చించివేశారు. నాలుగు ఆటోలు, రెండు కార్లలో సుమారు 50 మంది దుండగులు చెన్నై అన్నాశాలై సమీపంలోని సత్యం థియేటర్ల సముదాయం వద్దకు చేరుకుని పెట్రో బాంబులు విసిరారు. ఆ బాంబులు పెద్ద శబ్దంతో పేలడంతో థియేటర్ ముందు భాగంలోని అద్దాలు పగలిపోయాయి. బుకింగ్ కౌంటర్ల వద్దనున్న అద్దాలపై దుడ్డకర్రలు, రాళ్లతో దాడులు చేశారు. థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు పేలుళ్ల శబ్దాలకు భయపడి వెలుపలకు పరుగులు తీశారు. థియేటర్ సిబ్బంది ప్రేక్షకుల వాహనాలను వెనుకవైపు నుంచి పంపించేశారు. రాయపేటలోని ఉడ్‌ల్యాండ్స్ థియేటర్‌పై కూడా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. విధ్వంసాలకు పాల్పడిన వారు తందెపైరియార్ ద్రావిడ కళగం కార్యకర్తలుగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అప్పు (32), జయ్వికాష్ (32), వాసుదేవన్ (28), జయకుమార్ (25), కృష్ణన్ (20) అనే యువకులను అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. అడ్డంకులు తొలిగాయి : హీరో విజయ్ కత్తి చిత్రం విడుదలపై తమిళ సంఘాలతో నెలకొన్న విబేధాలు, అడ్డకుంలు తొలగిపోయాయని హీరో విజయ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ అనే పేరును తొలగించమని సంఘాలు కోరగా, నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సమసిపోయిందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, పోలీస్‌శాఖ, తమిళనాడు థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కత్తిరూ.ని అడ్డుకుంటాం చర్చల పేరుతో తమిళ సంఘాల వారిని పిలిచి మోసగించారని తమిళర్ వాళ్వురిమై కూట్టమైప్పు అధ్యక్షులు వేల్మురుగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తాము వేచివుండేలా చేసిన నిర్మాతలు, ఆ తరువాత చర్చలు ఫలప్రదమైనట్లు ప్రచారం చేశారని ఆయన అన్నారు. సంఘాల డిమాండ్లు నెరవేరితేగానీ కత్తి చిత్రాన్ని ప్రదర్శించబోమని, థియేటర్ల యజమానులు కూడా తమకు సంఘీభావం తెలిపినట్లు ఆయన చెప్పారు. బుధవారం విడుదల కానున్న కత్తి సినిమాను అడ్డుకుని తీరుతామని ఆయన హెచ్చరించారు. -
లైకా పేరు తీసి.. రేపే 'కత్తి' విడుదల
కత్తి సినిమా విడుదలకు రంగం సిద్ధమైపోయింది. ఈ సినిమా విషయంలో నెలకొన్న వివాదంపై హీరో విజయ్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'లైకా' పేరును సినిమా నుంచి తొలగిస్తున్నట్లు అందులో విజయ్ చెప్పారు. షెడ్యూలు ప్రకారమే.. అంటే బుధవారమే తమిళనాడులో సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా విషయంలో నెలకొన్న అభ్యంతరాలన్నీ తొలగినట్లు అయ్యింది. అంతకుముందు కత్తి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పడంతో సోమవారం రాత్రి చెన్నైలో పలు థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వారు. ఆ దాడిలో రెండు థియేటర్లు ధ్వంసమయ్యాయి. థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మెహరించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మహింద రాజపక్సపై తమిళనాడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిమాండును అంగీకరించడంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. -
కత్తి చిత్రం పై తీవ్ర దుమారం
-
'కత్తి' వివాదం... థియేటర్ల విధ్వంసం
చెన్నై: విజయ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించి తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'కత్తి' చిత్రంపై నెలకొన్న వివాదం రోజురోజూకు రాజుకోంటుంది. కత్తి చిత్రాన్ని బుధవారం ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేసి తీరుతామని నిర్మాతలు స్పష్టం చేశారు. దాంతో తమిళ సంఘాలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత అర్థరాత్రి చెన్నై మహానగరంలోని పలు సినిమా థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వారు. ఆ దాడిలో రెండు థియేటర్లు ధ్వంసమైనాయి. దీంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియెటర్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సినిమా థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మెహరించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మహింద రాజపక్సపై తమిళనాడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు కత్తి నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. అందుకు వారు ససేమిరా అంటున్నారు. దీంతో ఆగ్రహించిన తమిళ సంఘాలు గత రాత్రి విధ్వంసానికి దిగాయి. -
'కత్తి' సినిమా విడుదలపై అనుమానాలు
విజయ్ - సమంత జంటగా నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కత్తి' విడుదల ఇప్పుడు సందిగ్ధంలో పడింది. వాస్తవానికి బుధవారం నాడు ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అలరించాల్సి ఉంది. కానీ, ఆ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు, శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు మధ్య ఏవో సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన కథనాలు సినిమాకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెరమీదకు రావాలంటే.. బ్యానర్ నుంచి లైకా ప్రొడక్షన్స్ పేరు తీసేయాలన్న డిమాండు గట్టిగా వినిపిస్తోంది. వాళ్ల పేరు లేకపోతే మాత్రం సినిమా విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, వాళ్లు ఆ పేరు తీయకపోతే మాత్రం.. మొత్తం వందకు పైగా తమిళ సంఘాలు ఆ సినిమా తమిళనాడులోని ఏ థియేటర్లోనూ విడుదల కాకుండా అడ్డుకుంటాయని ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న టి.వేల్మురుగన్ చెప్పారు. తమిళ అనుకూల వర్గాలు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా నిర్మాతల మధ్య సోమవారమే ఓ సమావేశం నిర్వహించి ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే సాధారణ థియేటర్ల నుంచి మల్టీ ప్లెక్సుల వరకు ఎక్కడా ఇంకా సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభం కాలేదు. విశ్వరూపం సినిమా విడుదల విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొనడంతో చాలా వరకు థియేటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అలాంటి పరిస్థితిని కల్పించాలని తాము అనుకోవట్లేదని తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం సభ్యుడొకరు తెలిపారు. ఇక విజయ్ ఇంతకుముందు నటించిన 'తలైవా' సినిమా కూడా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొంది. -
హృదయానికి హత్తుకునే విధంగా...
‘‘టైటిల్ ‘కత్తి’ కదా అని, ఇది పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అనుకుంటే పొరపాటే. ఇందులో యాక్షన్ మాత్రమే కాదు... సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి’’ అని ‘ఠాగూర్’ మధు చెప్పారు. ఆయన సమర్పణలో కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించిన ‘కత్తి’ చిత్రం లైకా ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై తెలుగులో విడుదల కానుంది. విజయ్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కొలవెరి’ ఫేమ్ అనిరుధ్ స్వరాలందించారు. పాటలను ఈ నెల 24న, చిత్రాన్ని 31న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ - ‘‘‘తుపాకి’ తర్వాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం చక్కని యాక్షన్ థ్రిల్లర్. మురుగదాస్ ఏ తరహా సినిమా చేసినా వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తారు. చాలా విభిన్నమైన కథాంశంతో హార్ట్ టచింగ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాటలకూ మంచి స్కోప్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ కీలకపాత్ర చేసిన ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: ఎ. శ్రీకర్‌ప్రసాద్. -
‘కత్తి’ న్యూ మూవీ స్టిల్స్
-
కాక పుట్టిస్తున్న కత్తి
కత్తి చిత్రం కోలీవుడ్‌లో కాక పుట్టిస్తోందనే చెప్పాలి. ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్, విజయ్ హీరోగా దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన తుపాకీ బాగా పేలింది. దీంతో కత్తి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ మంచివాడిగా, చెడ్డవాడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విషయం తెలిసిందే. క్రేజీ బ్యూటీ సమంత నాయకి. నిల్నితిన్ ముఖేష్ సతీష్, తోటారాయ్ చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాష్‌కరణ్, కరుణామూర్తిలు నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న తెరపైకి వస్తూ దీపావళికి సందడి చేయనుంది. అనిరుధ్ సంగీత బాణీలు అందించిన ఈ చిత్రం ఆడియో టీజర్ ఇంతకుముందే మార్కెట్లోకి విడుదలై మంచి స్పందన పొందాయి. ముఖ్యంగా హీరో విజయ్ పాడిన సెప్ఫా పుళ్ల పాట బాగా ప్రాచుర్యం పొందింది. కాగా చిత్రం మెయిన్ ట్రైలర్ శుక్రవారం సెన్సార్ జరుపుకుని శనివారం థియేటర్లో విడుదలైంది. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్న కత్తిని అత్యధిక థియేటర్లలో విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క యూకే (యునెటెడ్ కింగ్డమ్)లోనే కత్తి చిత్రాన్ని 70 స్క్రీన్స్‌లో ప్రదర్శించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. విజయ్ గత చిత్రాల కంటే అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా కత్తి రికార్డు సృష్టించనుంది. -
కత్తి లాంటి కాంబినేషన్..!
తమిళంలో క్రేజీ హీరోగా పేరున్న విజయ్ తాజా చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాట సినిమా రిలీజులకు కూడా పెద్ద పండగైన దీపావళికి విజయ్ నటించిన ‘కత్తి’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత ఇక్కడ తెలుగులోనూ అదే పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధిం చిన ఫొటోల్లో విజయ్, సమంతల కెమిస్ట్రీ చూసి కాంబినేషన్ కత్తిలా ఉందని అంటున్నారు. గతంలో ‘గజిని’, ‘స్టాలిన్’ లాంటి చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ ఈ ‘కత్తి’కి నిర్దేశకుడు. గతంలో విజయ్‌తోనే ‘తుపాకి’ లాంటి ఘనవిజయం అందించిన రికార్డు మురుగదాస్‌ది. దాంతో, ఈ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై కె. కరుణామూర్తి, ఎ. శుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ ఈ ‘కత్తి’లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ‘కొలవెరి..’ పాట ఫేమ్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తమిళ సినిమాల వసూళ్ల రేసులో ‘కత్తి’ ఏ మేరకు పదును చూపిస్తుందో వేచి చూడాలి. -
‘కత్తి’ మూవీ స్టిల్స్
-
కత్తి చిచ్చు
సాక్షి, చెన్నై: ఇళయదళపతి విజయ్ నటించిన కత్తి చిత్రం విడుదలలో చిచ్చు రాజుకుంది. తమిళ సంఘాలు ఆడియో విడుదలను అడ్డుకునేం దుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనతో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్, సమంత జంటగా కత్తి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర నిర్మాత ల్లో ఒకరు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే బినామీ అన్న ప్రచారం రాష్ట్రంలో ఊపందుకుంది. ఈ వ్యవహారం కత్తి సినిమా విడుదలను ప్రశ్నార్థకం చేసే పరిస్థితులకు దారి తీస్తోంది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తమిళ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఆ సంఘాలకు చేదు అనుభవం తప్పలేదు. మార్గం సుగమం కావడంతో దీపావళిని పురస్కరించుకుని చిత్రం విడుదలకు సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం కత్తి ఆడియో విడుదలకు నిర్ణయించారు. రాజా అన్నామలైపురంలోని ఓ హోటల్లో ఆడియో ఆవిష్కరణకు సర్వం సిద్ధం చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు తమిళ సంఘాలు సిద్ధమయ్యాయి. రాజుకుంది : సద్ధుమణిగిందన్న వివాదం మళ్లీ రాజుకుంది. ఆడియో ఆవిష్కరణను అడ్డుకునేందుకు తమిళ సంఘాలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆడియో ఆవిష్కరణ నిమిత్తం రాజా అన్నామలైపురం పరిసరాల్లో చిత్ర యూనిట్, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లతో హోరెత్తించారు. సాయంత్రం మరి కాసేపట్లో ఆడియో విడుదల జరగనున్న సమయంలో తమిళ సంఘాలు రెచ్చిపోయాయి. ముందస్తుగా ఆ హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళ సంఘాలు అటు వైపుగా రానీయకుండా కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయినా కొందరు ఆందోళనకారులు పోలీసుల వలయాన్ని చేధిస్తూ తమ ప్రతాపాన్ని చూపించారను. ఆడియో విడుదలను అడ్డుకునే విధంగా ఆ హోటల్ వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్లను చించి, ధ్వంసం చేసి, తగులబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. చివరకు తమిళ సంఘాల నాయకులను అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. మళ్లీ అటువైపుగా ఆందోళనకారులు రాకుండా ఆ మార్గాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చివరకు గట్టి భద్రత నడుమ కత్తి ఆడియో ఆవిష్కరణ సజావుగా సాగింది. తమిళ సంఘాల తీరును విజయ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కత్తి చిచ్చు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నదో వేచి చూడాల్సిందే. -
షూటింగ్ స్పాట్ లో కుప్పకూలిన మురగదాస్!
చెన్నై: సినీ దర్శకుడు ఏఆర్ మురగదాస్ అనారోగ్య కారణాలతో సోమవారం ఆస్పత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజనింగ్, లో బీపీ కారణాలతో అస్వస్థతకు గురైన మురగదాస్ ను ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లోనే సృహతప్పి పడిపోయిన ఆయనను చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి తరలించారు. విజయ్, సమంతాలతో నిర్మిస్తున్న కత్తి షూటింగ్ తిరువన్మియూర్ లో జరుగుతోంది. అక్కడే మురగదాస్ సృహతప్పడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మురగదాస్ ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. -
నిషేధ పిటిషన్ కొట్టివేత
కత్తి, పులిపార్వై చిత్రాలను నిషేధించాలంటూ వేసిన పిటిషన్‌ను మదురై కోర్టు కొట్టివేసింది. విజయ్ నటిస్తున్న భారీ చిత్రం కత్తి. సమంత హీరోయిన్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై, ఎల్.టి.టి.ఈ నాయకుడు దివంగత ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ ఇతివృత్తంతో తెరకెక్కిన పులి పార్వై చిత్రంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమిళ సంఘాలు చిత్రాన్ని విడుదల చేయరాదంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ చిత్రాల విడుదలను నిషేధించాలని కోరుతూ హైకోర్టుకు అనుబంధ శాఖ అయిన మదురై కోర్టులో మదురై కేకేనగర్‌కు చెందిన న్యాయవాది రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు చిత్రాల్లో తమిళ సంప్రదాయాన్ని శ్రీలంకలో జరిగిన యుద్ధాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. కత్తి చిత్రాన్ని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు బినామిగా వ్యవహరిస్తున్న సుభాష్ కరన్ నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసే సంభాషణలు చోటు చేసుకున్నాయన్నారు. ఇక పులిపార్వై చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అందించడం ద్రోహ చర్యగా పేర్కొన్నారు. ఈ చిత్రాల విడుదలను నిషేధించాలంటూ డీజీపీకి ఆగస్టు 1న పిటిషన్ అందించామని తెలిపారు. కత్తి, పులిపార్వై చిత్రాల విడుదలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది రమేష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి కృపాకరన్ పిటిషన్లో సరైన ఆధారాలు చూపించనందున కొట్టివేస్తున్నట్లు వెల్లడించారు. -
ఐరోపాలో ‘కత్తి’ గీతాలు
కత్తి చిత్ర గీతాలను ఐరోపాలో చిత్రీకరించనున్నారు. ఇళయదళపతి విజయ్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంత నాయకి. చిత్ర షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 10వ తేదీకంతా టాకీ పార్టు పూర్తి అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు పాటల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తి అవుతోంది. ఈ రెండు పాటలను ఐరోపా దేశాల్లో చిత్రీకరించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. దీంతో ఆగస్టు నెల చివరిలో విజయ్, సమంత, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్తోపాటు చిత్ర యూనిట్ ఐరోపాకు పయనం కానుంది. ఈ రెండు పాటలను అక్కడి మూడు దేశాల్లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. అనిరుధ్ సంగీతాన్ని చిత్రం అందిస్తున్నా ఈచిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. కత్తి చిత్రాన్ని దీపావళికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
కడప దర్గాను దర్శించుకున్న విజయ్
-
విజయ్ నోట ‘కత్తి’లాంటి
ఇళయదళపతి విజయ్‌లో మంచి గాయకుడున్నాడన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాడటం ఆయనకు ఫ్యాషన్. తన చిత్రాల్లో ఒక్కో పాట పాడుతుంటారు. ఆ మధ్య విడుదలైన తుపాకీ చిత్రంలో పాడిన గూగుల్ గూగుల్ పాట విశేష ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం నటిస్తున్న కత్తి చిత్రంలో కూడా ఒక పాట పాడనున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కత్తిలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర అని సమాచారం. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రంలో ఒక మంచి దుమ్మురేపే మసాలా సాంగ్ చోటు చేసుకుందట. ఈ పాటకు ప్రస్తుతం ట్యూన్ కడుతున్న అనిరుధ్ త్వరలోనే విజయ్‌తో పాడించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. -
వివాదంలో విజయ్ ‘కత్తి?’
నటుడు విజయ్ తాజా చిత్రం కత్తి వివాదాల సుడిగుండంలో చిక్కుకోనుందా? ప్రస్తుతం ఈ చిత్రం వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక తమిళుల ఇతివృత్తంతో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఇప్పటికే వివాదానికి గురైన విషయం తెలిసిందే. ఇటీవల ప్రముఖ చాయాగ్రాహకుడు సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఇనం చిత్రం తమిళుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. చివరికి ఆ చిత్ర విడుదలను నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సెగ చల్లారక ముందే మరోసారి మంట రాజుకునే అవకాశం కనిపిస్తోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఈ సారి ఏకంగా ఇళయ దళపతి విజయ్ చిత్రమే తమిళుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. విజయ్ తాజాగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి కత్తి టైటిల్ ప్రచారంలో ఉంది. సమంత హీరోయిన్. ఇంతకు ముందు విజయ్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన తుపాకీ ఘన విజయం సాధించడంతో తాజా చిత్రం కత్తిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైక్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్నారు. అసలు సమస్య ఇక్కేడ తలెత్తనున్నట్లు సమాచారం. విషయం ఏమిటంటే ఈ అల్లిరాజాకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు ఇంతకు ముందు సన్నిహిత సంబంధాలున్నాయట. మరో విషయం ఏమిటంటే కత్తి చిత్ర పంపిణీ బాధ్యతల్ని పంచుకోవడానికి లైక్ ప్రొడక్షన్, యూకే బెస్ట్ అయింగరన్ సంస్థతో భాగస్వామ్యం పంచుకుందట. కత్తి చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుండడంతో అయిన్గరన్ సంస్థ సపోర్ట్‌ను తీసుకున్నట్లు చెబుతోంది. ఈ సంస్థకు కూడా రాజపక్సేకు చెందిన వివిధ దేశాలలో వ్యాపార లావాదేవీలున్నట్లు కొన్ని తమిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలకు తమిళ సంఘాలు వేచి చూస్తున్నాయి. విజయ్ నటించిన గత చిత్రం తలైవా కొన్ని తమిళ సంఘాల వ్యతిరేకతకు గురై సమస్యలను కొనితెచ్చుకుంది. ఎట్టకేలకు విడుదలైనా అపజయం పాలైంది. తాజా చిత్రం కత్తి విషయంలో అలాంటి వివదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.