ప్రస్తుతం దక్షిణాదిలో 'పులి' ఫీవర్ నడుస్తోంది. ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్లకు పైగా బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా రూపొందింది. బాహుబలి తరువాత అదే స్ధాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఇంత భారీ చిత్రం తరువాత విజయ్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి..? ప్రస్తుతం సౌత్ సినీ అభిమానులను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది.
'పులి' లాంటి భారీ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. అయితే ఈ సినిమాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన జరగకపోయినా ఇటీవల తమిళ నాట జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఈ వార్త తెర మీదకు వచ్చింది. ఈ ఫంక్షన్ లో పాల్గొన్న విజయ్ తండ్రి, ప్రముఖ దర్శక, నిర్మాత సి ఎ చంద్రశేఖర్ విజయ్ తదుపరి సినిమా పై కామెంట్ చేశాడు. అదే వేదిక మీద ఉన్న మురుగదాస్ను విజయ్ కోసం మరో సినిమా చేయాలంటూ కోరాడు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మురుగదాస్ తన సినిమా విజయ్తోనే ఉంటుందని ప్రకటించాడు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తుపాకీ', 'కత్తి' సినిమాలు బ్లాక్బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అలాగే తెరకెక్కబోయే ఈ సినిమాతో కూడా హ్యాట్రిక్ విజయం సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్.
విజయ్ నెక్ట్స్ మూవీ ఎవరితో?
Published Thu, Sep 3 2015 10:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement
Advertisement