సల్మాన్కు చరణ్ సలహాలు | Ramcharan advise for salman khan movie selection | Sakshi
Sakshi News home page

సల్మాన్కు చరణ్ సలహాలు

Published Wed, Oct 7 2015 9:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

సల్మాన్కు చరణ్ సలహాలు

సల్మాన్కు చరణ్ సలహాలు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమా సెలక్షన్ విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ సలహాలు తీసుకుంటున్నాడట. సౌత్ సినిమాలను రీమేక్ చేయడం మీద ఇంట్రస్ట్ చూపించే సల్మాన్ తన బాడీ లాంగ్వేజ్కు తగ్గ సినిమాలు సెలెక్ట్ చేసుకోవటం కోసం చరణ్ హెల్ప్ తీసుకుంటున్నాడు.

ఇప్పటికే తమిళ్లో సూపర్ హిట్ అయిన 'తనీ ఒరువన్' రీమేక్లో నటించడానికి అంగీకరించాడు సల్మాన్. అయితే ఈ సినిమా సెలక్షన్ వెనుక కూడా చెర్రీ సలహా ఉందన్న టాక్ వినిపిస్తుంది. 'తనీ ఒరువన్' తెలుగు రీమేక్లో నటిస్తున్న చరణ్, ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాల్సిందిగా సల్మాన్ ను కోరాడు. అంతేకాదు చిరంజీవి 150 చిత్రంగా ప్రచారంలో ఉన్న కత్తి సినిమాను కూడా బాలీవుడ్లో సల్మాన్ రీమేక్ చేస్తే బాగుటుందంటున్నాడు చెర్రీ.

సల్మాన్ ఖాన్కు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు ఉన్నాయి. గతంలో చరణ్ జంజీర్ షూటింగ్ సమయంలో చరణ్ను కలిసిన సల్మాన్ ఇటీవల చిరు పుట్టిన రోజు వేడుకల్లో కూడా పాల్గొన్నాడు. ఈ చనువుతోనే చరణ్  కూడా సల్మాన్కు సలహా ఇస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement