Thani Oruvan
-
సినీ అవార్డులు.. ఉత్తమ నటిగా జ్యోతికకు పురస్కారం
చెన్నై: ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక వర్గాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో 2015 ఏడాదికి గాను ఉత్తమ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలో ఘనంగా నిర్వహించారు. 2015వ సంవత్సరానికిగానూ.. ఈ వేడుకల్లో తమిళ భాషాభివృద్ధి శాఖ, సమాచార మంత్రి స్వామినాథన్, మంత్రి సుబ్రమణ్యం, మైలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేలు, చైన్నె మహానగరం, ఉప మేయర్ మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలతో పాటు బంగారు పతకాలను, నగదు బహుమతులను అందించారు. 2015కు గాను ఉత్తమ చిత్రంగా తనీ ఒరువన్, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పసంగ –2, తృతీయ ఉత్తమ చిత్రంగా ప్రభాకు అవార్డులు అందించారు. ఉత్తమ నటుడిగా హీరో మాధవన్ అలాగే మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించేలా రూపొందిన 36 వయదినిలే చిత్రానికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. ఇరుది చుట్రు చిత్రానికి గాను హీరో మాధవన్‌కు ఉత్తమ నటుడి అవార్డు, 36 వయదినిలే చిత్రానికి గాను జ్యోతికకు ఉత్తమ నటి అవార్డు, వై రాజా వై చిత్రానికి గాను నటుడు గౌతమ్ కార్తీక్‌కు ప్రత్యేక జూరీ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని అవార్డులతో సత్కరించారు. కమిటీ ఏర్పాటు చేశాం.. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి స్వామి నాథన్ మాట్లాడుతూ.. 2015వ సంవత్సరానికిగానూ 39 మంది కళాకారులకు ఈ వేదికపై అవార్డులను అందించామన్నారు. ఇకపోతే 2016 నుంచి 2023 వరకు చలన చిత్ర అవార్డుల ఎంపిక కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎంపికైన కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. చదవండి: 'ప్రేమలు' మూవీ రివ్యూ -
ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్' ఎంపిక అయింది. దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వయదిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వయదిలిలే అనే సినిమా కూడా తెలుగులో '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్ 'గురు' పేరుతో రీమేక్ చేశారు. 36 వయదిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్‌కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్‌కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది. ఉత్తమ విలన్‌గా 'తని ఒరువన్'లో నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్‌జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది. అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. -
ధృవ సినిమాకు సీక్వెల్ రెడీ.. టీజర్ విడుదల కానీ..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్ చిత్రం 'ధృవ'. ఇందులో హీరోయిన్గా రకుల్ నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌ను అందుకుంది. కోలీవుడ్‌లో డైరెక్టర్ మోహన్‌రాజా తెరకెక్కించిన 'తనీ ఒరువన్'కు రీమేక్‌గా ఇది విడుదలై తెలుగు వారిని అలరించింది. తాజాగ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ నుంచి భారీగానే డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ తమిళ సినిమాకు మాత్రమేనని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో టీజర్‌ను కూడా మేకర్స్ విడుదుల చేశారు. కానీ తెలుగులో కూడా చెర్రీతోనూ చర్చలు జరిపే ఉంటారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఇదే దర్శకుడు మోహన్ రాజా పనిచేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గాడ్ ఫాదర్' సినిమాతో మెగా ఫ్యామిలీకి మోహన్ రాజా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే ధృవ సినిమాకు సీక్వెల్ కథను వినిపించారని సమాచారం. మరి తెలుగు సీక్వెల్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. -
ఇన్నుమ్ ఇరుక్కు!
ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్‌లో గత ఏడాది రజనీకాంత్ ‘2.0’, కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’, ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్ పడమ్ 2’ చిత్రాలు సీక్వెల్స్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాయి. ‘ఇన్నుమ్ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్.. అదేనండీ.. రండి చూద్దాం. లోకనాయకుడు కమల్‌హాసన్ సీక్వెల్స్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్నారు. అలాగే 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌హాసనే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్‌పై ఫుల్ కాన్సట్రేట్ చేశారు కమల్. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్ చేసిన హిట్ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని ఒరువన్’ (2015)కు రీమేక్ అని తెలిసిందే. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘తని ఒరువన్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. సేమ్ మోహన్‌రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ ముఖ్య తారలుగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్. విజయ్ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్లో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్ సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్ కాదు. దురై దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్ మూవీగా జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మీ, క్యాథరీన్లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఈ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ‘ఇమ్సై అరసన్ 23 ఆమ్ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇమ్సై అరసన్ 24 ఆమ్ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్‌లో విజయ్ నటించగా, సీక్వెల్లో మాత్రం అజిత్ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో. విశాల్,ధనుష్ అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు విశాల్. 2017లో వచ్చిన హారర్ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్‌కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్‌గా నటించిన ‘అరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్‌కు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయని కోలీవుడ్‌లో కొత్తగా కథనాలు వస్తున్నాయి. ‘గోల్మాల్, రేస్, ధూమ్, క్రిష్’ చిత్రాల సీక్వెల్స్ ఫ్రాంచైజ్‌లుగా మారాయి బాలీవుడ్లో. ఈ ట్రెండ్ మెల్లిగా సౌత్‌కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్ సిరీస్‌లో ఫోర్త్ పార్ట్‌గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్‌తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్ కెరీర్‌కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ల ట్రెండ్ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
నయన్ చిత్ర సీక్వెల్లో కాజల్
నయనతార చిత్ర సీక్వెల్లో నటించే అవకాశం కాజల్‌అగర్వాల్‌ను వరించిందనే వార్త వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న హీరోయిన్ నయనతార. ఈ అమ్మడికి వద్దంటే అవకాశాలు అన్న పరిస్థితి. పారితోషికం భారీగానే ఉన్న నయన చుట్టూనే అవకాశాలు తిరుగుతున్నాయి. ఇక కాజల్ అగర్వాల్ అగ్ర కథానాయికల పట్టికలో ఉన్నా, ప్రస్తుతం అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. ఎందుకో గానీ టాలీవుడ్లో ఉన్నంత క్రేజ్ ఈ అమ్మడికి కోలీవుడ్‌లో రాలేదు. విజయ్, అజిత్, కార్తీ, విశాల్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసినా అంతగా స్టార్‌డమ్‌ను పొందలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో ప్యారీస్ ప్యారీస్ అనే ఒక్క చిత్రమే చేతిలో ఉంది. తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. మూడు పదులు దాటిన పెళ్లి కాని కథానాయకిల లిస్ట్‌లో ఈ అమ్మడు ఒకరు. అయినా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించని కాజల్‌కు కోలీవుడ్‌లో తాజాగా మరో క్రేజీ ఆఫర్ తలుపుతట్టినట్లు సమాచారం. ఇంతకు ముందు జయంరవి హీరోగా తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం తనీఒరువన్. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఇందులో నయనతార కథానాయకి. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఇటీవల అధికారిక పూర్వకంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో జయంరవికి జంటగా ఇద్దరు భామలు నటించనున్నారని, అందులో మొదటి భాగంలో నటించిన నయనతారనే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. మరో నాయకిగా నటి సాయోషాసైగల్ నటించే అవకాశం ఉన్నట్లు, ఇక అరవిందస్వామి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో నయనతారకు బదులు నటి కాజల్ అగర్వాల్‌ను నటింపజేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలిసింది. ఇక సాయేషాసైగల్ విషయంలో ఎలాంటి మార్పు లేకపోయినా, తనీఒరువన్ పార్టు 1లో విలన్‌గా విజృంభించిన అరవిందస్వామినే పార్టు 2లోనూ నటింపజేయాలని చిత్ర దర్శక నిర్మాతలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. -
ధృవకు సీక్వెల్.. ఇద్దరితో జోడీ కడుతున్న హీరో!
సాక్షి, తమిళ సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 2.ఓ (రోబో-2), సామీ స్క్వేర్, సండైకోళీ 2 (పందెం కోడి-2) వంటి చిత్రాలు నిర్మాణంలో ఉండగా త్వరలో కమలహాసన్ హీరోగా ఇండియన్ 2, ధనుష్ హీరోగా మారి 2 తదితర చిత్రాలు తెరకెక్కడానికి రెడీ అవుతున్నాయి. ఈ వరుసలో తాజాగా తనీఒరువన్ 2 (తెలుగులో ధృవ) చేరుతోంది. జయంరవి కథానాయకుడిగా ఆయన సోదరుడు మోహన్‌రాజా దర్వకత్వంలో తెరకెక్కిన ‘తనీఒరువన్’ 2015లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో జయం రవికి నయనతార జోడీ కట్టగా.. మోడ్రన్ విలన్‌గా అరవిందస్వామి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అప్పటివరకూ రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్ర మోస్తున్న మోహన్‌రాజా తనీఒరువన్తో దానిని బ్రేక్ చేశారు. ఈ సంచలన చిత్రానికిప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తనీఒరువన్ చిత్రానికి ప్రధాన మూలస్తంభాలు నలుగురు అని చెప్పవచ్చు. వారు హీరో జయంరవి, విలన్ అరవిందస్వామి, హీరోయిన్ నయనతార, దర్శకుడు మోహన్‌రాజా. ఈ నలుగురిలో ముగ్గురు తనీఒరవన్ సీక్వెల్లోనూ కనిపింపచనున్నారు. సీక్వెల్లోనూ నయనతార మరోసారి జయంరవితో రొమాన్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. బిజీ షెడ్యూల్లోనూ మళ్లీ జయంరవికి నయన్ ఓకే చెప్పడం విశేషమే. తొలి పార్టులో జయంరవి పోలీస్ అధికారిగా, నయనతార ఫోరెన్సిక్ నిపుణురాలుగానూ నటించగా.. రెండో పార్టులోనూ వీరు అదే పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అదనంగా సీక్వెల్లో మరో బ్యూటీ సాయోషా సైగల్ కూడా చేరనుందట. జయంరవికి జోడీగా ‘వనమగన్’ చిత్రంతో ఈ అమ్మడు కోలీవుడ్‌కు దిగుమతి అయిన తెలిసిందే. ఇప్పుడు తనీఒరువన్ సీక్వెల్లో మరోసారి ఆయనతో జోడీ కట్టబోతోంది. ఇప్పటికే సూర్యకు జంటగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న సాయేషాసైగల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తనీఒరువన్లో విలన్‌గా అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆయన పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హీరోకు దీటైన విలన్‌గా అరవింద్ స్వామి అద్భుతమైన అభినయం కనబర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనీఒరువన్- 2లో హీరో, విలన్ పాత్రలను ద్విపాత్రాభినయంతో జయంరవి పోషించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. -
సూపర్ హిట్‌కి సీక్వెల్
ఆగస్ట్ 28.. ‘జయం’ రవి, అతని సోదరుడు మోహన్ రాజా జీవితంలో మరచిపోలేని రోజు. బ్లాక్ బస్టర్ మూవీ ‘తని ఒరువన్’ తెరకు వచ్చిన రోజు. ‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై మంగళవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీక్వెల్ అనౌన్స్ చేశారు మోహన్ రాజా. ‘‘నా లైఫ్‌లో ‘తని ఒరువన్’ ఓ ఆశీర్వాదం. మూడేళ్లయినా ఇప్పటికీ ఆ సినిమా గురించి ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకులు అంతగా ఇష్టపడి చూసిన సినిమాకు సీక్వెల్ తీయాలని ఉంది. ఫస్ట్ పార్ట్‌లో హీరోగా నటించిన నా తమ్ముడు ‘జయం’ రవి సెకండ్ పార్ట్‌లోనూ నటిస్తాడు. ‘తని ఒరువన్’ కంటే ‘తని ఒరువన్ 2’ ఇంకా బాగుండేలా తీయడానికి ట్రై చేస్తాను’’ అని మోహన్‌రాజా పేర్కొన్నారు. కాగా ‘తని ఒరువన్’ తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. -
‘ధృవ’ మాతృకకు సీక్వెల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ధృవ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ధృవ తమిళనాట ఘనవిజయం సాధించిన తనీఒరువన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్రయూనిట్. అరవింద్ స్వామి, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నారు. సీక్వెల్‌ను కూడా మోహన్ రాజా దర్శకత్వలోనే తెరకెక్కనుందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. -
జూన్ 22న ‘టిక్ టిక్ టిక్’
‘తనీఒరువన్’ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన కోలీవుడ్ యంగ్ హీరో జయం రవి హీరోగా తెరకెక్కిన సినిమా టిక్ టిక్ టిక్. ఈ సినిమా జూన్ 22న రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. ఈ సినిమాలో జయం రవి సరసన నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుండగా అరోన్ అజీజ్, జయ ప్రకాష్, రమేష్ తిలక్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో తొలి స్పేస్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమాకు డి.ఇమాన్ సంగీతమందిస్తున్నాడు. టిక్ టిక్ టిక్‌ను ముందుగా 2018 జనవరిలోనే రిలీజ్ చేయాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు. తాజాగా ఈ సినిమాను జూన్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను హీరో జయం రవి తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. అయితే తెలుగు వర్షన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
ధృవ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ ఓకే అట..
తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమా రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన ధృవ సినిమాపై ట్విట్టర్లో మిక్స్డ్ రియాక్షన్ వస్తోంది. ఫస్టాఫ్ బాగానే ఉందని, సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటే సినిమాకు ఢోకా లేదని కొందరు అంటున్నారు. అయితే, విదేశాల్లో ఇప్పటికే పూర్తి షో చూసినవాళ్లు మాత్రం ఓ మాదిరిగా స్పందిస్తున్నారు. మొత్తమ్మీద ధృవ యావరేజి సినిమా అని, సెకండాఫ్‌లో సూరి మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడని ఒకరు ట్వీట్ చేశారు. ఓవర్సీస్లో ఒక మిలియన్ కష్టమేనని అంటున్నారు. కడపలో ఫస్టాఫ్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. స్క్రీన్‌ప్లే రేసీగా ఉందని, పాటల పిక్చరైజేషన్ కూడా బాగుందని మరో వ్యక్తి ట్వీట్ చేశారు. ఇక తెలుగు వ్యక్తిగా తాను ధృవ చూశానని, తమిళ సినిమా చూసి అంత ఎక్కువ ఆస్వాదించలేకపోయానని, ధృవ బాగుందని, దాన్ని మిస్ కావద్దని మరో ఎన్నారై చెప్పారు. మగధీర తర్వాత చరణ్‌కు ఇదే మంచి మూవీ అవుతుందని, రీమేక్ కూడా చాలా బాగుందని ఇంకొకరు చెప్పారు. రికార్డులు, ఇతర విషయాల సంగతి మర్చిపోతే.. చరణ్ మాత్రం బాగా చేశాడని అన్నారు. ప్రతి ఫ్రేములోనూ కష్టం కనిపిస్తోందని మరొకరు చెప్పారు. #dhruva on the whole an average fair...suri could not create magic in second half..OS lo 1 million kashtame.. — frinbe (@kselsm) 9 December 2016 Kadapa Morning show +ve talk from 1st half.. hope 2nd half kuda ede unte bomma blockbuster #Dhruva — Rustum !! (@DathuRulz) 9 December 2016 First half ayyindi.. bagane undi... Racy screenplay .. Songs Picturization #Dhruva — Laxman Anishetty (@laxman_219) 9 December 2016 As a Telugu guy, saw #Dhruva and didn't entertain myself with Tamil one. #Dhruva is too good. Don't miss this folks! — Dr. Appam (@appamkiran) 8 December 2016 #Dhruva - a successful and well adopted remake and best movie for Charan after #Magadheera. Forget about Records nd all..he performed well — Sriram Varma (@sriramForU) 8 December 2016 -
తనీఒరువన్కు ఏడాది
తనీఒరువన్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాది అయ్యింది. జయం రవి, నయనతార జంటగా నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో అరవిందస్వామి ప్రతినాయకుడిగా నటించారు. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా నిర్వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ నిర్మాణ విలువలతో నిర్మించింది. తనీఒరువన్ గత ఏడాది విడుదలైన చిత్రాలలో ఒక సంచలనం. కథలో వైవిధ్యం,కథనంలో నవ్యత, దర్శకత్వంలో కొత్తదనం, వెరసి అద్భుత విజయం సాధించి 2015లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జయంరవిని కమర్షియల్ హీరోగా మరింత ఉన్నత స్థాయికి చేర్చిన చిత్రం ఇది. దీంతోపాటు ఆయనకు పలు అవార్డులను,అభినందనలను అందించింది. మోహన్‌రాజాకు రీమేక్ దర్శకుడన్న ముద్రను తుడిచేస్తూ విడుదలై సంచలన విజయాన్ని సాధించిన తనీవరువన్ ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర హీరో జయంరవి తన ఆనందాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అందులో ఆయన పేర్కొంటూ తనీఒరువన్ తెరపైకి వచ్చి ఏడాది గడిచినా చిత్రంలో నటించిన తనకు ఇంకా ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయన్నారు. చిత్రం పేరు తనీఒరువన్ (ఒకే ఒక్కడు) అయినా చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా శ్రమించారన్నారు. ముఖ్యంగా ఎంతో పరిశోధించి అద్భుతమైన కథను తయారు చేసి నిరంతర శ్రమతో చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మోహన్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. అలాగే చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం, నటీనటులు, చిత్ర నిర్మాతల శ్రమ, కృషే తనీఒరువన్ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఈ చిత్రం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఇకపై చేసే చిత్రాలను తనీఒరువన్కు దీటుగా చేయాలన్న లక్ష్యాన్ని సూచించిందని పేర్కొన్నారు. ఇక పోతే తనీఒరువన్ చిత్రానికి సీక్వెల్ గురించి పరిశ్రమలో చాలానే చర్చ జరుగుతోందన్నారు. అయితే తాను, తన సోదరుడు మోహన్‌రాజా వేర్వేరు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల తనీఒరువన్ సీక్వెల్ గురించి సరిగా చర్చించలేదని తెలిపారు. -
మెగా అభిమానులకు చెర్రీ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఒకటి టైటిల్లో వస్తుంది. మరోటి బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. మూడో పాట సెకండ్ హాప్లో రొమాంటిక్ సిచ్యూవేషన్లో వస్తుంది. దీంతో ఈ సినిమాలో హీరోకి ఇరగదీసి స్టెప్పులేసే అవసరం రాలేదు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం భారీ మార్పులు చేసారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా చెర్రీ డ్యాన్స్‌లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. ప్రత్యేకంగా చెర్రీ డ్యాన్స్‌ల కోసమైనా పాటలను యాడ్ చేసి ఉంటారని భావించారు. చెర్రీ.., తన మాస్ డ్యాన్స్ ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చాడు. హైఇంటెన్సిటీతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అనవసరంగా పాటల ఇరికించటం వల్ల, సినిమా ఫ్లో దెబ్బతింటుందన్న ఉద్దేశంతో తెలుగు వర్షన్‌ను కూడా మూడు పాటలతోనే ముగించేస్తున్నారట. అంటే చెర్రీ డ్యాన్స్‌లు చూడాలంటే అభిమానులు మరో సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ సంగీత దర్శుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ధృవలో చెర్రీ డ్యాన్స్‌లు కనిపించవేమో..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఒకటి టైటిల్లో వస్తుంది. మరోటి బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. మూడో పాట సెకండ్ హాప్లో రొమాంటిక్ సిచ్యూవేషన్లో వస్తుంది. దీంతో ఈ సినిమాలో హీరోకి ఇరగదీసి స్టెప్పులేసే అవసరం రాలేదు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ కోసం భారీ మార్పులు చేసారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా చెర్రీ డ్యాన్స్‌లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. ప్రత్యేకంగా చెర్రీ డ్యాన్స్‌ల కోసమైనా పాటలను యాడ్ చేసి ఉంటారని భావించారు. కానీ హైఇంటెన్సిటీతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అనవసరంగా పాటల ఇరికించటం వల్ల, సినిమా ఫ్లో దెబ్బతింటుందన్న ఉద్దేశంతో తెలుగు వర్షన్‌ను కూడా మూడు పాటలతోనే ముగించేస్తున్నారట. అంటే చెర్రీ డ్యాన్స్‌లు చూడాలంటే అభిమానులు మరో సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. తమిళ సంగీత దర్శుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
లుక్.. లుక్.. లుక్..దిసీజ్ ధ్రువ లుక్!
అతనో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్. ఉద్యోగంలో చేరక ముందే సమాజంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలనేది అతని ఆశయం. అందుకే ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్స్‌తో కలిసి కొన్ని నేరాలకు చెక్ పెడతాడు. ఐపీఎస్‌గా చార్జ్ తీసుకున్నాక సమాజంలో పెద్ద మనిషిగా ,చలామణి అవుతున్న ఓ తిమింగలం పనిపట్టడానికి సిద్ధమవుతాడు. తర్వాత ఏమైందనే ది తమిళ చిత్రం ‘తని ఒరువన్’ కథ. ‘జయం’ రవి హీరోగా నటించిన ఈ సూపర్‌హిట్ మూవీకి తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం ‘ధ్రువ’. తెలుగుకి అనుగుణంగా పలు మార్పులూ చేర్పులూ చేశారు. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాతృకలో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి తెలుగులో కూడా అదే పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రామ్‌చరణ్ లుక్ శనివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గత నెలాఖరున మొదలైన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఫైట్ సీక్వెన్సెస్, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 20న కశ్మీర్లో మలి షెడ్యూల్‌ను ప్రారంభించ నున్నారు. ఈ చిత్రానికి కెమేరా: అసీమ్ మిశ్రా, సంగీతం: హిప్ హాప్ ఆది, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. వై ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: ఎన్వీ ప్రసాద్. -
చరణ్ సినిమాకు హ్యాండిచ్చిన సినిమాటోగ్రాఫర్
మెగా అభిమానులకు షాక్‌ల మీద షాకులిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బ్రూస్ లీ సినిమాతో ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన చెర్రీ, ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్‌కు వెళ్లలేదు. అఫీషియల్‌గా సినిమా స్టార్ట్ చేసినా.. ఇతర పాత్రలపై సీన్స్ తీస్తున్నారే గానీ చరణ్ మాత్రం షూటింగ్లో పాల్గొనటం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఈనెల 6 నుంచి షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ను రీమేక్ చేస్తున్నాడు చరణ్. ధృవ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషయన్స్తో కలిసి పనిచేస్తున్నాడు. అందుకే బంజరంగీ భాయ్‌జాన్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌కు పనిచేసిన సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా ధృవ టీంతో కలిశాడు. ఇప్పటికే పూర్తయిన తొలి రెండు షెడ్యూళ్లకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన మిశ్రా. చరణ్ పాల్గొనబోయే మూడో షెడ్యూల్ నుంచి మాత్రం పనిచేయటం లేదు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నుంచి పిలుపు రావటంతో మిశ్రా, ధృవ సినిమాను మధ్యలోనే వదిలేసి ముంబై వెళ్లిపోయాడట. దీంతో పిఎస్ విందాతో మిగతా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు ధృవ యూనిట్. చరణ్ షూటింగ్‌కు రాకుండా మరింత ఆలస్యం చేస్తే యూనిట్లో మరింత మంది హ్యాండిచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
కత్తి లాంటి తని ఒరువన్
రాయిలో అవసరం లేనిది చెక్కేస్తే... విగ్రహం కనపడుతుంది. అలా అని ప్రతి రాయిలో విగ్రహం ఉందనుకోవడం మూర్ఖత్వమే! విగ్రహం... చెక్కినవాడి ఉలిలో ఉంటుంది. వాడి కళ్ళల్లో ఉంటుంది. సినిమా మేకింగూ అంతే! వేరే దేశాల్లో, వేరే భాషల్లో అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమా విగ్రహాల్ని చెక్కుతూ ఉంటారు. మేకింగ్ కంటే రీమేకింగే చాలా కష్టమైన పని. ఉన్న విగ్రహంలా చెక్కకూడదు. ఉన్న విగ్రహంలోని ఆత్మను పోగొట్టుకోకూడదు. కానీ, విగ్రహం కొత్తగా అనిపించాలి. అమ్మో! చాలా పెద్ద పరీక్ష. తమిళంలో విజయ్‌తో ‘కత్తి’, ‘జయం’ రవితో ‘తని ఒరువన్’ తీశారు. రెండూ పెద్ద హిట్. ఇప్పుడు ‘కత్తి’ని చిరంజీవితో, ‘తని ఒరువన్’ని రామ్‌చరణ్‌తో రీమేక్ చేస్తున్నారు. ఆ తమిళ కథలు అందరికీ తెలుసు. మరి, మీకు తెలుసా? హైదరాబాద్ జూబ్లీహిల్స్... కొండ మీద వెలసిన ఆ కాలనీలో కొసకొమ్మున ఉన్న ఆ చివరి ఇంద్రభవనం నుంచి సిటీ వ్యూ ప్రతిరోజూ ఒక కొత్త అనుభవమే. ఆ ఇంట్లో ఇప్పుడు రోజూ జరుగుతున్న సినీచర్చలు పూర్తిగా ‘మెగా’ హడావిడి, హంగామాను తలపిస్తున్నాయి. ఇంటి పెద్ద, ఆ పెద్దకు వారసుడు - ఇద్దరూ ఇప్పుడు తమ కొత్త సినిమాల బిజీలో ఉన్నారు. చిత్రం ఏమిటంటే - ఇద్దరు చేస్తున్నవీ రీమేక్‌లే! తమిళంలో నుంచి తెలుగు లోకి దిగుమతి చేసుకుంటున్న కథలే! తండ్రి - మెగాహీరో చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ (2007 జూలై 27న రిలీజ్) తరువాత 9 ఏళ్ళ గ్యాప్‌తో మళ్ళీ పూర్తిస్థాయి హీరోగా తెర ముందుకు వస్తున్నారు. ఈ మధ్యలో ఆయన తెరపై కనిపించిన ‘మగధీర’, గడచిన దసరాకు వచ్చిన ‘బ్రూస్లీ’- రెండిటిలోనూ అతిథి పాత్రలే చేశారు. తాజాగా, ఏణ్ణర్ధం క్రితం నాటి తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘కత్తి’ రీమేక్‌తో తన 150వ సినిమా మైలురాయిని దాటేందుకు సిద్ధమవు తున్నారు. కాగా, ‘బ్రూస్లీ’ ఆశించిన విజయం సాధించకపోవడంతో కాస్తంత విరామం తీసుకొని, మళ్ళీ విజృంభించడానికి సిద్ధమవుతున్న మెగా వారసుడు రామ్‌చరణ్ కూడా రీమేక్ అనే సేఫ్ గేమ్‌ను ఆశ్రయించారు. గత ఏడాది తమిళ సూపర్‌హిట్స్‌లో ఒకటైన ‘తని ఒరువన్’ రీమేక్‌లో తెలివైన పోలీసాఫీసర్‌గా రామ్‌చరణ్ నటిస్తున్నారు. తండ్రీ కొడుకులిద్దరూ ఇలా తమిళ రీమేక్‌ల బాట పట్టడం ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’ అయింది. ఇంతకీ ఇద్దరు పెద్ద హీరోలను ఆకర్షించిన ఆ రీమేక్ కథలు ఏమిటి? వాటి తెర వెనుక కథేమిటి అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. చిరంజీవికి ‘కత్తి’ లాంటి కథ! సినిమాలకు సంబంధించినంత వరకు మనకు సంక్రాంతి తరువాత దసరా పెద్ద పండుగైతే తమిళనాట మాత్రం దీపావళి పెద్ద పండుగ. అన్ని వర్గాలూ ఆనందోత్సాహాలతో ఉండే ఆ సమయంలో పత్రికలు, మ్యాగజైన్లు భారీ స్థాయిలో ప్రత్యేక సంచికలు రిలీజ్ చేస్తాయి. ఒకటికి నాలుగు పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు వచ్చే సీజన్ అది. సరిగ్గా అలాంటి దీపావళి సీజన్‌కి 2014 అక్టోబర్ 22న హీరో విజయ్ ‘కత్తి’ విడుదలైంది. ఆయన ద్విపాత్రాభి నయం చేసిన ఈ సినిమాకు సమంత హీరోయిన్. మురుగదాస్ దర్శకుడు. ‘కత్తి’ కథను సమకాలీన సమాజంపై మురుగదాస్ వ్యాఖ్యానం అనుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చూడడానికి ఒకేలా కనిపించే కదిరేశన్, జీవానందం - అనే రెండు పాత్రలు కీలకం. రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది జీవానందంగా, అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్ అలియాస్ కత్తిగా రెండు పాత్రలూ హీరో విజయ్ పోషించారు. గూండాల బారినపడి, బుల్లెట్ గాయమైన జీవానందాన్ని ‘కత్తి’ చూస్తాడు. తనలానే ఉన్న అతని కథ, చేస్తున్న ఉద్యమం తెలుసుకొని, అతని స్థానంలోకి తాను వెళ్ళి, రైతుల పక్షాన పోరాటం చేస్తాడు. కేవలం కొన్ని పదుల కోట్లతో తయారైన ఈ తమిళ సినిమా రూ. 100 కోట్ల పైగా వసూలు చేసి, 2014లో తమిళనాట హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం! దీన్నే చిరంజీవి తన రీ-ఎంట్రీ సినిమాగా ఇప్పుడు ఎంచుకున్నారు. రామ్‌చరణ్ ‘తని ఒరువన్’ ఏంటి? రామ్‌చరణ్ హీరోగా నిర్మాత అల్లు అరవింద్, తిరుపతికి చెందిన డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ ఎన్.వి. ప్రసాద్‌తో కలసి నిర్మిస్తున్న రీమేక్‌కు ఒరిజినల్ ‘తన్ని ఒరువన్’ కూడా తమిళనాట బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసిన కథే! కేవలం 20 కోట్ల ఖర్చుతో తయారైన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ టేకింగ్‌తో అందరినీ పడేసింది. ఈ సినిమా కథేమిటంటే... నగరంలో జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రొబేషన్‌లో ఉన్న ఐ.పి.ఎస్. ఆఫీసర్ అయిన హీరో, అతని మిత్ర బృందం రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నిస్తారు. తీరా తాము ప్రాణాల్ని పణంగా పెట్టి పట్టుకొన్న నేరస్థులు కాస్తా వ్యవస్థలోని లోపాల కారణంగా శిక్ష లేకుండా బయటపడడం వారికి బాధ కలిగిస్తుంది. హీరో రహస్యంగా దర్యాప్తు చేసి, నగరంలోని చిన్న నేరాలన్నీ ఒక భారీ కుట్రకు మూలమని గ్రహిస్తాడు. ఆ భారీ కుట్ర వెనుక ఉన్న అసలు నేరస్థుణ్ణి కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. సమాజంలోని పేరున్న వాడూ, ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత అయిన ఓ సైంటిస్ట్ ఔషధాల రంగంలోని అతి పెద్ద కుట్రకు సూత్రధారి అని హీరో కనిపెడతాడు. రియల్ ఎస్టేట్, ఖనిజాల మాఫియాలో కూడా హస్తం ఉన్న ఆ తెలివైన సైంటిస్ట్ విలన్‌కూ, ఈ పోలీసా ఫీసర్ హీరోకూ మధ్య జరిగే ఎత్తులు పెయైత్తుల చదరంగమే మిగతా కథ. స్టైలిష్... మెగా మేకింగ్ మణిరత్నం ‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాలతో చిరపరిచితుడైన అరవింద్ స్వామి విలన్‌గా తమిళంలో చేసిన ఈ తొలి భారీ ప్రయత్నం కొత్తగా అనిపిం చింది. అందుకే ఇప్పుడీ తెలుగు రీమేక్‌లోనూ ఆయననే విలన్‌గా ఎంచుకున్నారు. ఇక ‘జయం’ రవి చేసిన సిన్సియర్ యువ ఐ.పి.ఎస్. ఆఫీసర్ పాత్రపోషణ కోసం తెలుగులో రామ్ చరణ్ కూడా యమా సిన్సియర్‌గా కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఊహలకు అనుగుణంగా పాత్రకు తగ్గట్లు పూర్తిగా కొత్త లుక్‌తో, మేకోవర్‌కు చరణ్ సిద్ధమ య్యారని కృష్ణానగర్ వార్త. ఇప్పటికే బ్యాంకాక్‌లో అరవింద్ స్వామితో కొన్ని సీన్లు చిత్రీకరించారు. హైదరాబాద్‌లో, ఆ తరువాత కాశ్మీర్లో కీలక సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధం అవుతున్నారు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు స్టైలిష్ మేకింగ్ కీలకం కాబట్టి దర్శక - నిర్మాతలు దాని పైన దృష్టి పెడుతున్నారు. తమి ళంలో దర్శకుడు ఎం. రాజా కథకు, డిటెక్టివ్ నవలా రచయితల ద్వయం ‘శుభ’ (జంట రచయితలు డి.సురేశ్, ఎ.ఎన్. బాలకృష్ణన్‌లకు ఇది కలం పేరు)లతో కలసి చేసిన రచన అక్కడి ప్రేక్షకులకు వినూత్న అనుభవమైంది. ఆ అనుభవా న్ని తెలుగులోనూ పునః సృష్టిం చేందుకు దర్శక, రచయితలు ప్రయత్నిస్తున్నారు. తండ్రి హీరో... కొడుకు నిర్మాత! మరోపక్క వారసుడికి దీటుగా, మళ్ళీ మునుపటిలా ఆటపాటలతో, ఫైట్లతో అలరించడానికి చిరంజీవి కూడా శారీరకంగా కసరత్తులు మొదలెట్టారు. తెరపై ద్విపాత్రాభినయానికి రెడీ అవుతున్నారు. మళ్ళీ ఒకప్పటి చార్మ్‌తో ‘కత్తిలాంటోడు’ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ‘బ్రూస్లీ’ చిత్రంలో అతిథి పాత్రతో లెక్కప్రకారం 150 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు హీరోగా పూర్తిస్థాయి సినిమాతో ఆ మైలురాయిని దాటనున్నారు. విశేషం ఏమిటంటే, సాక్షాత్తూ చిరంజీవి సతీమణి కె.సురేఖ, కుమారుడైన యువ హీరో రామ్‌చరణ్ నిర్మాతలుగా ‘కొణిదెల ప్రొడ క్షన్ కంపెనీ’ పతాకం స్థాపించి తొలి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించడం. గతంలో చిరంజీవితో ‘ఠాగూర్’ సినిమాతో ముడిపడిన మధు, తమిళ ‘కత్తి’ ఒరిజనల్ నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ ఈ రీమేక్‌లో పాలు పంచుకుంటున్నారు! అయితే, ‘కత్తి’ తమిళ సినిమా కథ నిజానికి తనదేనంటూ తెలుగు దర్శ కుడు ఎన్. నరసింహారావు ఇప్పటికే సాక్ష్యాధారాలతో సహా గగ్గోలు పెట్టారు. తమిళ దర్శక, నిర్మాతలతో ఆయనకున్న ఆ వివాదానికి ప్రస్తుతానికి కామా పెట్టి, రీమేక్ షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ‘ఠాగూర్’ తీసిన మాస్ దర్శకుడు వి.వి. వినాయక్కే ఈ ‘కత్తి లాంటోడు’ దర్శకత్వాన్నీ అప్పగించారు. సీనియర్ సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్‌తో కలసి హీరో, దర్శక- నిర్మాతలు తమిళ మాతృకలో తెలుగుకు తగ్గట్లు చాలానే మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. వేసవి అయిపోయాక, అభిమానుల హంగామా మధ్య జూలైలో రెగ్యులర్ షూటింగ్‌కు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. గతంలో ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క ఈసారి ఆయన పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. జూలై కల్లా ‘బాహుబలి2’ షూటింగ్ పని పూర్తి చేసుకొని ఆమె కూడా వచ్చి షూటింగ్లో చేరతారని సమాచారం. మొత్తం మీద మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకుల నుంచి వస్తున్న ఈ రెండు ‘మెగా’ రీమేక్‌లే. సెట్స్పైకొస్తూనే రెండూ సంచలనమయ్యాయి. మరి బాక్సా ఫీస్ వద్ద చెరో వంద కోట్ల పైన వసూలు చేసిన తమిళ ‘కత్తి’, ‘తని ఒరువన్’ కథలు ఇప్పుడు తెలుగు రీమేక్స్గానూ ఆ రేంజ్ వసూళ్ళు సాధిస్తాయా? మెగా హీరోలకే కాదు, పరిశ్రమకు కూడా ఆ స్థాయి హిట్లే ఆకాంక్ష, అవసరం కూడా! - రెంటాల జయదేవ కలిసొచ్చిన కాంబినేషన్ ‘గజని’, తెలుగు ‘స్టాలిన్’ చిత్రాల ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ తమిళ ‘కత్తి’ చిత్ర దర్శకుడు. నిజానికి మురుగదాస్ ప్రమేయమున్న కథలతో చిరంజీవి తెరపైకి రావడం ఇది ముచ్చటగా మూడోసారి. గతంలో చిరంజీవి రాజకీయ తెరంగేట్రానికి మెట్లుగా పనికొచ్చిన ‘ఠాగూర్’ (2003 - విజయకాంత్ నటించిన తమిళ సూపర్‌హిట్ ‘రమణ’కు రీమేక్), ‘స్టాలిన్’ (2006) చిత్రాలు కూడా మురుగదాస్ అందించిన కథలే! ఇప్పుడీ ‘కత్తి’ ముచ్చటగా మూడోది. ఈ మూడు సినిమాల కథలూ సమకాలీన సమాజంలోని అంశాలను ఎత్తిచూపేవే కావడం కేవలం యాదృచ్ఛికం అనుకోలేం. హీరోగా మళ్ళీ తెర ముందుకు వచ్చేందుకు రకరకాల స్క్రిప్ట్‌లు విన్న చిరంజీవి ఏదీ సంతృప్తినివ్వకపోయేసరికి అటు సామాజిక స్పృహ, ఇటు హీరోయిజమ్ - రెండూ కలిసొచ్చే ఈ ‘కత్తి’ రీమేక్‌కు ఓటేశారు. డబ్బింగ్... అయిపోయింది! రీమేక్... అవుతోంది! నిజానికి, విజయ్ ‘కత్తి’ సినిమాను అదే పేరుతో మొదట తెలుగులో డబ్బింగ్ చేయాలనుకున్నారు. ‘ఠాగూర్’ చిత్ర నిర్మాణంతో ‘ఠాగూర్’ మధుగా పేరు తెచ్చుకున్న నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ బి. మధు తమిళ ‘కత్తి’ రైట్స్ కొన్నారు. డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ అనుకుంటున్న టైమ్‌లో, తమిళంలో సూపర్‌హిట్టయిన ఈ సినిమాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్, చిన్న ఎన్టీయార్ - ఇలా పలువురు హీరోల పేర్లూ ఆ రీమేక్‌కు వినిపించాయి. వారు తమిళ ఒరిజినల్ చూడడమూ జరిగింది. చిన్న ఎన్టీయార్‌తో రీమేక్ దాదాపు ఖాయమనే దాకా కథ వచ్చింది. కానీ ఈ స్క్రిప్ట్ వైపు చిరంజీవి మొగ్గారు. సామాజిక స్పృహ ఉన్న ఈ కథ - జోరు తగ్గిన తన పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మళ్ళీ ఊపు తెస్తుందనీ, సినిమాల్లో రీ-ఎంట్రీకి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అనీ చిరు భావన. ‘కత్తి’ సినిమాలో తమిళంలో విజయ్ కెరీర్‌కు వచ్చిన హుషారు చూస్తే, చిరంజీవిది సరైన నిర్ణయమేనేమో! రీమేక్‌ల మీద మోజెందుకు? పదుల కోట్ల రూపాయలను పణంగా పెట్టే సినీ పరిశ్రమలో - ఒక భాషలో హిట్టయిన కథను తీసుకొని, పునర్నిర్మిం చడం వ్యాపారపరంగా చూస్తే ఉన్నంతలో సేఫ్ బెట్! అందుకే సహజంగానే ప్రతి శుక్రవారం తమిళ, మలయాళ సీమల్లో విడుదలయ్యే చిత్రాల వివరాల కోసం మన హీరోలు, నిర్మాతలు ఆసక్తిగా చూస్తుంటారు. చెన్నై కోడం బాకమ్ టాక్ కోసం మన కృష్ణానగర్ నుంచి చకచకా ఫోన్లు చేస్తుంటారు. ఇక, శుక్రవారం ఉదయం చెన్నైలో ఫ్లైట్ దిగి, సినిమా చూసి, సాయంత్రానికి హైదరాబాద్ వచ్చే దర్శక, నిర్మాతలూ చాలామందే! తాజాగా మల యాళ, మరాఠీ హిట్ల రీమేక్‌కూ మంచి క్రేజ్ వచ్చింది. -
త్వరలో డెరైక్షన్!
‘తని ఒరువన్’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా కనిపించిన మాజీ హీరో అరవింద్ స్వామి ఈ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ అదే పాత్ర చేస్తున్నారు. మరో పక్క ‘డియర్ డాడ్’ అనే చిత్రంతో హిందీలో రీ-ఎంట్రీ ఇస్తున్నారాయన. ఇన్నాళ్లు వ్యాపారంలో బిజీబిజీగా ఉన్న అరవింద్‌స్వామి ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే దృష్టి సారించనున్నారు. నటుడిగా మాత్రమే కాదు.. డెరైక్షన్ కూడా చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటికే నా చేతిలో రెండు స్క్రిప్టులున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తా. అయితే అది హిందీలోనా...లేక తమిళంలోనా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను’’ అని వెల్లడించారాయన. కాలానుగుణంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచి గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ- ‘‘ప్రేక్షకులు రొటీన్ ఐడియాలను తిప్పికొడుతున్నారు. వాళ్లు సినిమాలు చూసే విధానంలో మార్పు వచ్చింది. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే రకరకాల ప్రయోగాలతో సినిమాలు తీయడానికి ఆస్కారం దొరుకుతోంది’’ అని వ్యాఖ్యానించారు. -
15 ఏళ్ల తరువాత బాలీవుడ్లో..!
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు సౌత్ స్టార్ అరవింద్ స్వామి. హీరోగా రిటైరయిన ఈ చాక్లెట్ బాయ్, రీ ఎంట్రీలో స్పెషల్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు తనీఒరువన్ సినిమాలో నెగెటివ్ రోల్లో నటించిన అరవింద్ స్వామి నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను ఏ భాషల్లో రీమేక్ చేసినా అరవింద్ స్వామి పాత్రకు మరో నటుడ్ని ఎంపిక చేయటం కష్టం అనిపించే స్థాయిలో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. అదే జోరులో బాలీవుడ్లో కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. డియర్ డాడ్ పేరుతో తెరకెక్కుతన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 45 ఏళ్ల తండ్రికి, 14 ఏళ్ల కొడుకు మధ్య జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాకు తనూజ్ బ్రమర్స్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను మే 6 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్..?
బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్‌తో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్ రీమేక్‌కు రెడీ అవుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు మెగా పవర్ స్టార్. అందుకు తగ్గట్టుగా ఒరిజినల్ కథకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం చెల్లెలు శ్రీజ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న చెర్రీ.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించనున్నాడు. అయితే ఇప్పటివరకు మాస్ మసాలా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న చరణ్‌ను పొలిటికల్ థ్రిల్లర్‌లో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడు యువ దర్శకుడు అనీ కన్నెగంటి. ఈ శుక్రవారం రన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనీ, తన మనసులోని మాటను బయటపెట్టాడు. నాలుగేళ్ల క్రితమే చరణ్‌తో ఈ సినిమాతో ఈ తరహా సినిమా చేయాలని భావించినా, అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా కుదరలేదు. మరోసారి అదే ప్రయత్నాలను ప్రారంభించాడు అనీ కన్నెగంటి. చరణ్ హీరోగా సోషియో పొలిటికల్ డ్రామాగా సినిమా చేయాలని, ఎప్పటికైనా తప్పకుండా ఆ సినిమా చేస్తానంటూ చెపుతున్నాడు అనీ. ప్రయోగం చేసిన ప్రతిసారీ ఫెయిల్ అయిన చెర్రీ అనీ కన్నెగంటి దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ కు ఓకే చెబుతాడా? లేదా తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. -
మార్చి నుంచి బిజీబిజీగా మెగా హీరో
హైదరాబాద్: ఎట్టకేలకు మెగా వారసుడు రామ్ చరణ్ తేజ తన కొత్త చిత్ర షూటింగ్‌కు హాజరుకానున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బ్లాక్ బ్లస్టర్ మూవీ 'తనీ ఒరువన్' రీమెక్ కోసం ఆయన మార్చి నెలలో కొబ్బరి కాయ కొట్టనున్నారు. మార్చి మొదటివారంలో ఈ సినిమా ఆయనతో షూటింగ్ షురూ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. 'ఈ చిత్ర ప్రాజెక్టు కార్యక్రమాలు నేటి నుంచి హైదరాబాద్ లో కొనసాగుతాయి. అరవింద స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ వారి షెడ్యూల్ ప్రకారం హాజరవుతారు. మార్చి తొలివారం నుంచి రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
చరణ్ టైటిల్ రక్షక్ కాదు ధ్రువ..?
బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్‌తో డీలాపడ్డ చరణ్... నెమ్మదిగా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన చెర్రీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలను సిద్ధం చేసిన దర్శకుడు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమా టైటిల్‌పై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పూర్తి సీరియస్ మూడ్‌లో సాగే ఈ సినిమాకు టైటిల్ కూడా అలాగే ఉండాలన్న ఆలోచనతో ముందుగా రక్షక్ అనే టైటిల్‌ను పరీశీలించారు. అయితే అభిమానుల నుంచి భిన్న స్పందనలు రావటంతో, తాజాగా ఈ సినిమా కోసం ధ్రువ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. యూనిట్ సభ్యుల నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా అభిమానులు మాత్రం ఈ టైటిల్‌పై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. -
షూటింగ్ మొదలవ్వకుండానే పోటీకి రెడీ
టాలీవుడ్ స్టార్స్ కూడా బాలీవుడ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. గతంలో సినిమా రెడీ అయ్యాక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే టాలీవుడ్ దర్శక నిర్మాతలు, ఇప్పుడు రూట్ మార్చారు. సినిమా మొదలు కాకముందే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకొని అందుకు తగ్గట్టుగా షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఇలా పక్కా ప్లానింగ్‌తో తమ సినిమాలను తెరమీదకు తీసుకువస్తున్నారు. అయితే ఇంత ముందుగా ప్లాన్ చేసుకున్నా పోటీ మాత్రం తప్పటం లేదు. ఇంకా తమ నెక్ట్స్ సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టని ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు బిగ్ ఫైట్‌కు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. అదే సమయంలో రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీఒరువన్ను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలు కాకపోయినా రిలీజ్ డేట్స్ మాత్రం ఫిక్స్ చేసేశారు. ఈ రెండు సినిమాలను ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి రెండు చిత్రయూనిట్లు ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే ఇంత ముందుగా ప్లాన్ చేసుకొని కూడా ఒకే రోజు పోటీ పడటం ఎందుకన్న వాదన బలంగా వినిపిస్తోంది. సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ కావటంతో కలెక్షన్ల విషయంలో అన్ని సినిమాలు కాస్త వెనకబడ్డాయి. మరి అనుకున్నట్టుగా చెర్రీ, తారక్‌లు బరిలో దిగుతారా..? లేక ఎవరో ఒకరు వెనక్కు తగ్గుతారా..? చూడాలి. -
ఆ సినిమా రీమేక్ ఆగిపోయింది
అవును.. తనీఒరువన్ సినిమా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఆగిపోయాయి. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తెలుగులో ఈ సినిమా రీమేక్ యథాతథంగా కొనసాగుతుండగా, బాలీవుడ్ రీమేక్ మాత్రం ఆగిపోయింది. సల్మాన్ హీరోగా తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్‌పై కండలవీరుడు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవటంతో ఆగిపోయింది. తమిళ్లో తనీఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తన దర్శకత్వంలోనే హిందీలో తెరకెక్కించాలని ప్రయత్నించాడు. సల్మాన్ కూడా తనీఒరువన్ రీమేక్‌లో నటించడానికి ముందు ఆసక్తిగా ఉన్నా.. తర్వాత మాత్రం కాదన్నాడు. ముఖ్యంగా కథలో ఎంటర్టైన్మెంట్ లేకపోవటం, ఇప్పట్లో సల్మాన్ డేట్స్ కూడా ఖాళీ లేకపోవటంతో ఈ రీమేక్ ఆగిపోయింది. సినిమా ఆగిపోయిన విషయాన్ని స్వయంగా ప్రకటించకపోయినా, త్వరలోనే వేరే సినిమా మొదలవుతుందంటూ దర్శకుడు మోహన్ రాజా ప్రకటించటంతో తనీఒరువన్ బాలీవుడ్ రీమేక్ ఆగిపోయిన విషయం కన్ఫమ్ అయ్యింది. -
మరో రీమేక్ పై మనసుపడ్డాడు
బ్రూస్ లీ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయిన రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాల మీద దృష్టిపెట్టాడు. కొత్త కథలతో ప్రయోగం చేసే కన్నా ఇప్పటికే హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయటం బెటర్ అని భావిస్తున్నాడు. అందుకే తమిళంలో ఘనవిజయం సాధించిన తనీఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఈ సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. తనీఒరువన్ రీమేక్ తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమానే చేయాలనే ఆలోచనలో ఉన్నాడు చెర్రీ. ప్రస్తుతం బాలీవుడ్లో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రాఖీ హ్యాండ్సమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. రాఖీ హ్యాండ్సమ్ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ చెర్రీతో ఈ సినిమా కథ గురించి చెప్పడంతో, చరణ్ ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడన్న టాక్ వినిపిస్తోంది. -
చెర్రీతో శైలజ
చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా నేను శైలజా, రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మళయాలి ముద్దుగుమ్మ కీర్తి సురేష్. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటి రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్నా, చరణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీఒరువన్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టుగా ప్రకటించినా.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. దీనికి తోడు నటీనటుల ఎంపిక కూడా పూర్తవ్వకపోవటంతో సినిమా మొదలవ్వటానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే విలన్‌గా ఒరిజినల్ వర్షన్లో చేసిన అరవింద్ స్వామినే కన్ఫామ్ చేయగా హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
రామ్ చరణ్ vs మంచు మనోజ్
బ్రూస్ లీ రిజల్ట్‌తో నిరాశపరిచిన మెగాహీరో రామ్ చరణ్. తరువాత సినిమా విషయంలో ఇంకా ఊరిస్తూనే ఉన్నాడు. బ్రూస్ లీ సెట్స్ మీద ఉండగానే తమిళ సినిమా తనీ ఒరువన్‌ను రీమేక్ చేస్తాడన్న వార్తలు వినిపించినా, ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందన్న వార్తతో పాటు ఎన్నో ఈ సినిమాలో విలన్‌గా నటించే నటుడి విషయంలో కూడా చాలా వార్తలు వినిపించాయి. తమిళ సినిమాలో అరవింద్ స్వామి చేసిన పాత్రను తెలుగు కూడా తనతోనే చేయించాలని భావించినా అరవింద్ స్వామి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఇతర నటుల మీద దృష్టిపెట్టారు. సినిమాకు చాలా కీలక పాత్ర కావటంతో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడితో ఈ పాత్ర చేయించాలని భావిస్తున్నారు చరణ్ టీం. అందుకు తగ్గట్టుగానే రానా, నాగార్జున, నారా రోహిత్‌ల పేర్లు వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు. తాజాగా మరో యంగ్ హీరో పేరు వినిపిస్తోంది. చిరంజీవి సినిమాల్లో విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.., చిరు తనయుడి సినిమాలో విలన్‌గా నటించే అవకాశం ఉదంట. ఈమధ్యే, నాన్నగారిలా ప్రతినాయక పాత్రలో మెప్పించాలని ఉందని ప్రకటించిన మనోజ్, ఈ పాత్రకు న్యాయం చేయగలడని భావిస్తున్నారట చిత్రయూనిట్. మరి మనోజ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
రామ్ చరణ్ సినిమాలో తమిళ హీరో?
తమిళ సూపర్ హిట్ యాక్షన్ చిత్రం 'తనీ ఒరువన్' తెలుగు రీమేక్‌లో రామ్ చరణ్ నటించనున్నాడు. జనవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, డివివి దానయ్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. తమిళ చిత్రం తనీ ఒరువన్లో అరవింద్ స్వామి ఓ పాత్రలో నటించాడు. తెలుగు రీమేక్‌లో కూడా అతను అదే పాత్రలో నటించే అవకాశముంది. రామ్ చరణ్ సరసన హీరోయిన్ను ఇంకా ఖరారు చేయాల్సివుంది. జయం రవి, అరవింద్ స్వామి, నయనతార నటించిన తానీ ఒరువన్ తమిళంలో ఘన విజయం సాధించింది. -
స్పీడు పెంచుతున్న రామ్ చరణ్
బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ తరువాత ఫారిన్ ట్రిప్‌లో ఉన్న రామ్ చరణ్, అక్కడి నుంచే భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నాడు. ఇన్నాళ్లు చిరు 150వ సినిమా కోసం నెమ్మదిగా సినిమాలు అంగీకరిస్తూ వస్తున్న చెర్రీ, ఆ విషయం ఇప్పట్లో తేలే అవకాశం కనిపించకపోవటంతో ఇక వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో తను కమిట్ అయిన సినిమాలనే వరుసగా సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు చెర్రీ. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చరణ్ తిరిగి రాగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్‌లో నటించనున్నాడు. ఈ సినిమాతో పాటు చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న, గౌతమ్ మీనన్ సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలను 2016లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమాకు కథ, దర్శకులు ఫైనల్ కాకపోయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయ్యే లోపు యువి క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకు జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. -
మిర్చి బ్యానర్లో చెర్రీ
బ్రూస్ లీ పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఫారిన్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న చెర్రీ, తిరిగి రాగానే తను తరువాత చేయబోయే సినిమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీ ఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. అల్లు అరవింద్, డివివి దానయ్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వీలైనంత త్వరగా మరో సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు మగధీరుడు. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు వరుస సూపర్ హిట్స్ అందించిన ఈ బ్యానర్లో సినిమా చేయటం, తన కెరీర్‌కు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట చరణ్. ఈ సినిమాకు అదే బ్యానర్లో జిల్ సినిమాను డైరెక్ట్ చేసిన రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. -
ఫేస్బుక్ ఆఫీస్‌లో రామ్‌చరణ్
'బ్రూస్ లీ' రిజల్ట్‌తో కాస్త నిరుత్సాహపడిన రామ్ చరణ్, ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్, అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో తన అభిమానులను కలుస్తున్నాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాడు చరణ్. అక్కడ ఉన్న తెలుగు వారితో పాటు ఆయన అభిమానులతో సరదా గడిపిన చరణ్ వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోలను తన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్‌పై పోస్ట్ చేస్తూ తనకు విలువైన బహుమతులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. విదేశాల నుంచి తిరిగి రాగానే చరణ్ తమిళ సినిమా తనీఒరువన్ రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. బ్రూస్ లీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన డివివి దానయ్య మరోసారి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నాడు. -
నేను ఆ సినిమా చేయట్లేదు..
ప్రస్తుతం సౌత్ సినీ రంగంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఉన్న సినిమా 'తనీ ఒరువన్'. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నిర్మాతలు, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. తనీ ఒరువన్ సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంది. తమిళ్లో అరవింద్ స్వామి చేసిన ఈ పాత్రను తెలుగులో ఎవరితో చేయించాలన్న చర్చ చాలారోజులుగా నడుస్తుంది. యంగ్ హీరో రానా నుంచి సీనియర్ హీరో నాగార్జున వరకు చాలా పేర్లు చర్చకు వచ్చాయి. అయితే ఫైనల్‌గా లవర్ బాయ్ మాధవన్ ఈ పాత్రకు సెలెక్ట్ అయ్యాడంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను మాధవన్ ఖండించాడు. ప్రస్తుతం 'సాల ఖదూస్' సినిమాలో నటిస్తున్నఅతడు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించాడు. తను ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తమని తెలిపాడు. తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన విశేషాలను వెల్లడించాడు. Hey Folks.This being a verified site I shall personally tell you about the projects I have signed and doing.The rest are all rumours. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 23, 2015 I have not signed nor approved any other project in any language. Right now my life is only Saala Khadoos and Irrudhi Suttru. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 23, 2015 -
రొటీన్ సినిమా వద్దంటున్న చెర్రీ!
బ్రూస్ లీ సినిమా రిజల్ట్ తో నిరాశలో ఉన్న రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే తనీ ఒరువన్ రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగా హీరో, తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్లు మాత్రమే చేస్తున్న ఈ యంగ్ హీరో, తదుపరి సినిమాల విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నాడు. చరణ్ నెక్ట్స్ చేయబోయే తనీ ఒరువన్ రీమేక్ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా, కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. జయం రవి హీరోగా, రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్‌ను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తనీ ఒరువన్ కథకు తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమా తరువాత కూడా మరో ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు చరణ్. గమ్యం, వేదం లాంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో, చరణ్ ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న క్రిష్, ఆ సినిమా తరువాత చరణ్ సినిమా కోసం కథ రెడీ ఛాన్స్ కనిపిస్తుంది. -
సోలో హీరోగా అరవింద్‌స్వామి
తనీ ఒరువన్ సినిమాతో విలన్‌గా మెప్పించిన అరవింద్ స్వామి ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి, ప్రస్తుతం విలన్‌గా కెరీర్ ఎంజాయ్ చేస్తున్న అరవింద్ స్వామి మరోసారి సోలో లీడ్‌గా కనిపించనున్నాడు. కోలీవుడ్ లో రియలిస్టిక్ దర్శకుడిగా పేరున్న బాల దర్శకత్వంలో అరవింద్ స్వామి ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం శశికుమార్, వరలక్ష్మీల కాంబినేషన్లో 'తారై తప్పట్టై' సినిమా చేస్తున్న బాల, ఈ సినిమా పూర్తయిన తరువాత అరవింద్ స్వామి లీడ్ రోల్లో సినిమా కోసం వర్క్ చేయనున్నాడు. సాఫ్ట్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించే అరవింద్ స్వామి, బాల లాంటి దర్శకుడితో కలిసి పనిచేయగలడా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా అరవింద్ స్వామి, బాలల కాంబినేషన్లో సినిమా దాదాపుగా కన్ఫామ్ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
విలన్ పాత్రలో మాధవన్
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంతా 'తనీ ఒరువన్' రీమేక్ వైపే చూస్తోంది. రామ్‌చరణ్ 'బ్రూస్ లీ' షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ పనుల్లో బిబీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుండటంతో, చెర్రీ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీదే అందరి దృష్టి ఉంది. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ తమిళ సినిమా 'తనీ ఒరువన్' రీమేక్ అన్న విషయం కన్ఫామ్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో నటించే విలన్ పాత్ర కోసం చాలా రోజులుగా వేట కొనసాగుతున్నా ఇంత వరకు ఫైనల్ కాలేదు. ముందుగా రానా నటిస్తాడని భావించినా 'బాహుబలి 2' షూటింగ్ ఉండటంతో డ్రాప్ అయ్యాడు. తరువాత నాగార్జున తో చేయించాలని అనుకున్నా.. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం 'సఖీ' ఫేం మాధవన్‌తో ఈ పాత్ర చేయించాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అరవింద్ స్వామి చేసిన పాత్రలో అదే ఇమేజ్ ఉన్న మాధవన్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. 'బ్రూస్ లీ' సినిమా రిలీజ్ రోజున చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డిటెయిల్స్‌లో పాటు కాస్టింగ్ కూడా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. -
సల్మాన్‌కు చరణ్ సలహాలు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమా సెలక్షన్ విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ సలహాలు తీసుకుంటున్నాడట. సౌత్ సినిమాలను రీమేక్ చేయడం మీద ఇంట్రస్ట్ చూపించే సల్మాన్ తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ సినిమాలు సెలెక్ట్ చేసుకోవటం కోసం చరణ్ హెల్ప్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే తమిళ్లో సూపర్ హిట్ అయిన 'తనీ ఒరువన్' రీమేక్‌లో నటించడానికి అంగీకరించాడు సల్మాన్. అయితే ఈ సినిమా సెలక్షన్ వెనుక కూడా చెర్రీ సలహా ఉందన్న టాక్ వినిపిస్తుంది. 'తనీ ఒరువన్' తెలుగు రీమేక్‌లో నటిస్తున్న చరణ్, ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాల్సిందిగా సల్మాన్ ను కోరాడు. అంతేకాదు చిరంజీవి 150 చిత్రంగా ప్రచారంలో ఉన్న కత్తి సినిమాను కూడా బాలీవుడ్లో సల్మాన్ రీమేక్ చేస్తే బాగుటుందంటున్నాడు చెర్రీ. సల్మాన్ ఖాన్‌కు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు ఉన్నాయి. గతంలో చరణ్ జంజీర్ షూటింగ్ సమయంలో చరణ్‌ను కలిసిన సల్మాన్ ఇటీవల చిరు పుట్టిన రోజు వేడుకల్లో కూడా పాల్గొన్నాడు. ఈ చనువుతోనే చరణ్ కూడా సల్మాన్‌కు సలహా ఇస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. -
విలన్‌గా మన్మథుడు..?
స్టార్ హీరోగా ఇమేజ్ కాపాడుకుంటూనే.. ప్రయోగాలకు కూడా రెడీ అంటున్నాడు సీనియర్ హీరో నాగార్జున. మన్మథుడిగా మంచి ఫాంలో ఉన్న సమయంలో అన్నమయ్యగా, శ్రీరామదాసుగా ఆకట్టుకున్నాడు నాగ్. ఇప్పుడు కూడా అదే జోరు చూపిస్తూ వరుసగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన తనీఒరువన్ తెలుగు రీమేక్‌కు సంబంధించిన చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో హీరో పాత్రకు సమానంగా ప్రాధాన్యం ఉన్న విలన్ పాత్ర కోసం కూడా భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పటికే రానా, నారా రోహిత్, సోనూసూద్ లాంటి పేర్లు వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు. తాజాగా ఈ పాత్ర కోసం నాగార్జునను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. నాగ్ కూడా ఈ పాత్ర చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టుగా సమాచారం. నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాల్లో నటిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఆత్మగా కనిపిస్తున్న కింగ్, ఊపిరి సినిమాలో వీల్‌చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు. యంగ్ జనరేషన్ హవా చూపిస్తున్న తరుణంలో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన స్టార్డంను కాపాడుకుంటూ వస్తున్నాడు నాగార్జున. -
చరణ్ బెస్ట్ ఫ్రెండే విలన్..?
ప్రస్తుతం బ్రూస్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్ తన తదుపరి సినిమాను కూడా ఫైనల్ చేశాడు. ఇప్పటికే చరణ్ కోసం డివివి దానయ్య రూ. 5.5 కోట్లు ఖర్చుపెట్టి తనీఒరువన్ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది. అయితే తమిళంలో విలన్ పాత్ర పోషించిన అరవింద్ స్వామి రీమేక్ లో ఆ పాత్ర ఆసక్తి చూపించకపోవటంతో ఇప్పుడు ఆ పాత్ర లో నటించే నటుడి కోసం టాలీవుడ్లో వేట మొదలైంది. ఈ సినిమాలో హీరో పాత్రకు ఉన్నంత ప్రాముఖ్యం విలన్ పాత్రకు కూడా ఉండటంతో ఆ పాత్రలోనూ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే మంచిదని భావిస్తున్నారు. అందుకే యంగ్ హీరో రానాను ఈ పాత్రలో నటింపజేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే బాహుబలి సినిమాలో విలన్‌గా నటిస్తున్న రానా, తనీఒరువన్ రీమేక్‌లో కూడా ఆ తరహా పాత్ర చేస్తాడేమో చూడాలి. క్యారెక్టర్ కోసం కాకపోయినా తన బెస్ట్ ఫ్రెండ్ చరణ్ కోసం అయినా రానా అంగీకరిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా అందరికీ తెలిసిన ఈ ఇద్దరు స్టార్లు వెండితెర మీద పోటా పోటీగా నటిస్తే అది మార్కెట్‌కు కూడా ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రానా ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తాడో లేదో చూడాలి. -
'కిక్ 2' ఎఫెక్ట్
రేసుగుర్రం లాంటి భారీ హిట్ తరువాత మంచి ఫాంలో కనిపించిన సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమాతోనే నిరాశపరిచాడు. భారీ అంచనాలతో కిక్ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కించిన కిక్ 2 సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. రేసుగుర్రం తరువాత చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు ఓకె చేసుకున్నా, ఇప్పుడా ప్రాజెక్ట్స్ అన్ని డైలామాలో పడ్డాయి. ముఖ్యంగా కిక్ 2 షూటింగ్ సమయంలోనే రామ్‌చరణ్‌కు కథ వినిపించిన సూరి నెక్ట్స్ ఆ సినిమానే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావించాడు. సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చిన చరణ్ కూడా శ్రీనువైట్లతో చేస్తున్న బ్రూస్లీ సినిమా తరువాత అదే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే కిక్ 2 రిజల్ట్ సీన్ రివర్స్ చేసేసింది. సురేందర్ రెడ్డితో చేసే ప్రాజెక్ట్ విషయంలో చెర్రీ పునరాలోచనలో ఉన్నాడట. బ్రూస్లీ సినిమా పూర్తి కావస్తుండటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తున్న చరణ్ ముందు రెండు ఆఫ్షన్స్ ఉన్నాయి. సురేందర్ రెడ్డి సినిమాతో పాటు తమిళ్లో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ రీమేక్. అయితే సూరి సినిమాతో రిస్క్ చేయటం కన్నా తనీఒరువన్ రీమేక్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు చరణ్. -
సెంటిమెంట్‌ను మహేష్ బ్రేక్ చేస్తాడా?
'శ్రీమంతుడు' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేష్ త్వరలో 'బ్రహ్మోత్సవం' షూటింగ్లో పాల్గొననున్నాడు. అయితే ఇదే సమయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రిన్స్ అభిమానులను కలవరపెడుతుంది. 16 ఏళ్ల కెరీర్లో మహేష్ ఇంత వరకు చేయని ఓ సాహసం త్వరలో చేయబోతున్నాడట. ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని ఈ సూపర్ స్టార్ త్వరలోనే ఓ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శంకర్ డైరెక్షన్లో '3 ఇడియట్స్' సినిమాకు రీమేక్‌గా రూపొందిన 'స్నేహితుడు' సినిమా సమయంలో కూడా ఇదే చర్చ తెరమీదకు వచ్చింది. మహేష్‌తో ఈ సినిమాలో నటింపచేయాలని ఎంత ప్రయత్నించిన రీమేక్ సినిమా అన్న ఉద్దేశ్యంతో అంగీకరించలేదు. అదే సమయంలో తనకు రీమేక్ సినిమాలు చేయటం ఇష్టం లేదని తేల్చిచెప్పాడు రాకుమారుడు. ఇటీవల తమిళంలో సంచలనం సృష్టిస్తున్న 'తనీఒరువన్' సినిమా నేపధ్యంలో మరోసారి అదే టాపిక్ తెరమీదకు వచ్చింది. ఈ సినిమాను మహేష్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ కూడా చూసిన మహేష్ ఇంతవరకు తన అభిప్రాయం మాత్రం చెప్పలేదు. ప్రిన్స్ రెస్పాన్స్ చూసిన వారు మాత్రం మహేష్ తన కండిషన్స్ ను తనే బ్రేక్ చేసి 'తనీ ఒరువన్' రీమేక్ చేయటం ఖాయం అంటున్నారు. -
ఆ సినిమా రీమేక్‌లో సల్మాన్, చరణ్
జయం రవి, నయనతార జంటగా తెరకెక్కిన తనీ ఒరువన్ గతవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. జయం రవి సోదరుడు ఎమ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కోలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. ఆసక్తికరమైన లైన్ తో పాటు, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ సినిమాను రీమేక్ చేయడానికి స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్, తనీ ఒరువన్‌ను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. సౌత్ రీమేక్ లతో సూపర్ హిట్లు సాదిస్తున్న కండలవీరుడు సినిమాతో మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. ఈ రీమేక్‌ను ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన ఎమ్ రాజా దర్శకత్వంలోనే చేయాలని భావిస్తున్నాడు సల్మాన్. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ దాదాపుగా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తుంది. ఇదే సినిమాను రామ్‌చరణ్ హీరోగా తెలుగులో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చరణ్ ప్రస్థుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నా, తన తరువాతి ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఇంత వరకు చరణ్ క్లారిటీ ఇవ్వలేదు. అందుకే చరణ్ హీరోగా తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయడానికి కొంత మంది దర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు. -
ఆగస్టులో తనీఒరువన్
న్యాయానికి,అన్యాయానికి మధ్య పోరాటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. న్యాయం కోసం హీరో పోరాడుతుంటే దాన్ని మటుమాయం చేయడానికి విలన్లు శత విధాల ప్రయత్నింస్తుంటారు. ఈ ఇతి వృత్తాన్ని విభిన్నంగా, ఊహించని మలుపులతో ఆసక్తికరంగా తనీఒరువన్ పేరుతో చిత్రంగా రూపొందిస్తునట్లు దర్శకుడు మోహన్‌రాజా వెల్లడించారు. మోహన్‌రాజా అనగానే కొత్త దర్శకుడనుకునేరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జయంరాజా ఇప్పుడు తన పేరు ముందు తొలి చిత్రం జయంను తొలగించి తన పేరు ముందు తండ్రి పేరు మోహన్‌ను చేర్చుకున్నారు. జయం, సంతోష్సుబ్రమణియ న్, వేలాయుధం వంటి హిట్ చిత్రాలను రూపొందించిన మోహన్‌రాజా తాజాగా సెల్యులాయిడ్ కెక్కిస్తున్న చిత్రం తనీఒరువన్. జయంరవి హీరో. వీరి హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆరవ చిత్రం ఇది. నయనతార హీరోయిన్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి అగోరం, ఎస్.గణేశ్ అగోరం, ఎస్.సురేష్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం తనీఒరువన్. అరవింద్‌సామి ముఖ్య భూమికను పోషించిన ఈ చిత్రంలో తంబిరామయ్య, నాజర్ ముఖ్య పాత్రలు ధరించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడిస్తూ న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగే పోరాటాన్ని వైవిధ్యంగా, అనూహ్య మలుపులతో తెరకెక్కిస్తునట్లు తెలిపారు. షూటిం గ్ను డెహ్రాడూన్. గోవా,బ్యాంకాక్ ప్రదేశాల్లో నిర్వహించినట్లు వెల్లడించారు. హిప్హుప్ తమిళ్ సంగీతాన్ని అందించిన చిత్ర ఆడియోను ఈ నెల 15న, చిత్రాన్ని ఆగస్టులోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
సాహసానికి సై!
ఇప్పటివరకూ అభినయం, అందం... ఈ రెండిటికే ప్రాధాన్యమిస్తూ దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ల దృష్టి ఇప్పుడు సాహసాల మీదకు మళ్లింది. ఇప్పటికే అనుష్క ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల కోసం గుర్రపుస్వారీ, యుద్ధవిద్యలు నేర్చుకొని తెరపై వీరత్వాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నారు. తమన్నా కూడా... ‘బాహుబలి’ కోసం యుద్ధ విద్యలు అభ్యసించారు. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. ఆమె కూడా యాక్షన్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారామె. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోనున్నారట. తమిళంలో ‘జయం’రవితో ఆమె నటిస్తున్న ‘తని ఒరువన్’ సినిమాలో నయన డైనమిక్ పోలీస్ అధికారిగా నటిస్తు న్నారు. ఈ కసరత్తులన్నీ ఆ పాత్ర కోసమే. అంతేకాక... మాజీ పోలీస్ అధికారి కిరణ్‌బేడీతో సహా పలువురు మహిళా పోలీసుల్ని స్టడీ చేస్తున్నారట నయన. -
విలన్‌గా ఆర్య?
నటుడు జయం రవికి ఆర్య విలన్‌గా మారనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాక్ ఇదే. కోలీవుడ్‌లో యువ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న నటుడు ఆర్య. అయితే టాలీవుడ్లో విలన్‌గా నటించారు. తాజాగా కోలీవుడ్‌లోనూ తన విలనిజం ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జయం రవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తనీ ఒరువన్. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జయం రాజా దర్శకుడు. తిల్లాలంగడి చిత్రం తరువాత జయం బ్రదర్స్ కాంబినేషన్లో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో నటుడు ఆర్య విలన్‌గా నటిం చనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని దర్శకుడు జయం రవి ధృవపరచలేదు. కోలీవుడ్ హీరో ఒక రు తనీ ఒరువన్ చిత్రంలో విలన్‌గా నటించనున్నారని మాత్రం తెలిపారు. అది ఆర్యనా, లేక మరొకరా? అన్నది ఇంకా నిర్ణయం కాలేదన్నారు. తనీ ఒరువన్ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలిపా రు. ఇప్పటి వరకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించా రు. తనీ ఒరువన్ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం అని వివరించారు. ఒక సామాజిక అంశం గురించిన చిన్న సందేశం కూడా ఈ చిత్రంలో ఉంటుందని చెప్పారు.