రామ్ చరణ్ vs మంచు మనోజ్ | manchu manoj turns anti hero for ram charan | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్ vs మంచు మనోజ్

Published Thu, Dec 3 2015 9:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

రామ్ చరణ్ vs మంచు మనోజ్

రామ్ చరణ్ vs మంచు మనోజ్

బ్రూస్ లీ రిజల్ట్తో నిరాశపరిచిన మెగాహీరో రామ్ చరణ్. తరువాత సినిమా విషయంలో ఇంకా ఊరిస్తూనే ఉన్నాడు. బ్రూస్ లీ సెట్స్ మీద ఉండగానే తమిళ సినిమా తనీ ఒరువన్ను రీమేక్ చేస్తాడన్న వార్తలు వినిపించినా, ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందన్న వార్తతో పాటు ఎన్నో ఈ సినిమాలో విలన్గా నటించే నటుడి విషయంలో కూడా చాలా వార్తలు వినిపించాయి.

తమిళ సినిమాలో అరవింద్ స్వామి చేసిన పాత్రను తెలుగు కూడా తనతోనే చేయించాలని భావించినా అరవింద్ స్వామి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఇతర నటుల మీద దృష్టిపెట్టారు. సినిమాకు చాలా కీలక పాత్ర కావటంతో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడితో ఈ పాత్ర చేయించాలని భావిస్తున్నారు చరణ్ టీం. అందుకు తగ్గట్టుగానే రానా, నాగార్జున, నారా రోహిత్ల పేర్లు వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు.

తాజాగా మరో యంగ్ హీరో పేరు వినిపిస్తోంది. చిరంజీవి సినిమాల్లో విలన్గా ఎన్నో సినిమాల్లో నటించిన మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.., చిరు తనయుడి సినిమాలో విలన్గా నటించే అవకాశం ఉదంట. ఈమధ్యే, నాన్నగారిలా ప్రతినాయక పాత్రలో మెప్పించాలని ఉందని ప్రకటించిన మనోజ్, ఈ పాత్రకు న్యాయం చేయగలడని భావిస్తున్నారట చిత్రయూనిట్. మరి మనోజ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement