జయం రవి, నయనతార జంటగా తెరకెక్కిన తనీ ఒరువన్ గతవారం రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. జయం రవి సోదరుడు ఎమ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కోలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. ఆసక్తికరమైన లైన్ తో పాటు, థ్రిల్లింగ్ స్క్రీన్ప్లేతో రూపొందిన ఈ సినిమాను రీమేక్ చేయడానికి స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్, తనీ ఒరువన్ను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. సౌత్ రీమేక్ లతో సూపర్ హిట్లు సాదిస్తున్న కండలవీరుడు సినిమాతో మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. ఈ రీమేక్ను ఒరిజినల్ వర్షన్ను డైరెక్ట్ చేసిన ఎమ్ రాజా దర్శకత్వంలోనే చేయాలని భావిస్తున్నాడు సల్మాన్. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ దాదాపుగా కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తుంది.
ఇదే సినిమాను రామ్చరణ్ హీరోగా తెలుగులో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చరణ్ ప్రస్థుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతున్నా, తన తరువాతి ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఇంత వరకు చరణ్ క్లారిటీ ఇవ్వలేదు. అందుకే చరణ్ హీరోగా తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయడానికి కొంత మంది దర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు.
ఆ సినిమా రీమేక్లో సల్మాన్, చరణ్
Published Sun, Sep 6 2015 12:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM
Advertisement
Advertisement