ధృవ సినిమాకు సీక్వెల్‌ రెడీ.. టీజర్‌ విడుదల కానీ.. | Ram Charan Dhruva 2 Sequel Ready - Sakshi
Sakshi News home page

ధృవ సినిమాకు సీక్వెల్‌ రెడీ.. టీజర్‌ విడుదల కానీ..

Published Tue, Aug 29 2023 3:34 PM | Last Updated on Tue, Aug 29 2023 3:53 PM

Ram Charan Dhruva Sequel Ready - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'ధృవ'. ఇందులో హీరోయిన్‌గా రకుల్‌  నటించగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ను అందుకుంది.  కోలీవుడ్‌లో డైరెక్టర్‌ మోహన్‌రాజా తెరకెక్కించిన 'తనీ ఒరువన్‌'కు రీమేక్‌గా ఇది విడుదలై తెలుగు వారిని అలరించింది. తాజాగ ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసులో సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు)

చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ కావాలంటూ మెగా ఫ్యాన్స్​ నుంచి భారీగానే డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ తమిళ సినిమాకు మాత్రమేనని తెలుస్తోంది. అందుకు సంబంధించిన  వీడియో టీజర్​ను కూడా మేకర్స్‌ విడుదుల చేశారు. కానీ తెలుగులో కూడా చెర్రీతోనూ చర్చలు జరిపే ఉంటారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవితో ఇదే  దర్శకుడు మోహన్ రాజా పనిచేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'గాడ్ ఫాదర్' సినిమాతో మెగా ఫ్యామిలీకి మోహన్ రాజా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే  ధృవ సినిమాకు సీక్వెల్​ కథను వినిపించారని సమాచారం. మరి తెలుగు సీక్వెల్​పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో వస్తున్న  'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్‌ చరణ్‌ బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement