Mohan Raja
-
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్‌తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
హిట్ సినిమాల్లో నటించిన మోహన్‌రాజ్ కన్నుమూత
సౌత్ ఇండియా ప్రముఖ నటుడు మోహన్‌రాజ్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ‘కిరిక్కాడాన్ జోస్’గా మలయాళంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 1989లో ‘కిరీదామ్’ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలుగులో ఎక్కువగా బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్‌లతో సినిమాలు చేశాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, అసెంబ్లీరౌడీ,నరసింహ నాయుడు,సోగ్గాడి పెళ్ళాం,బొబ్బిలి సింహం,అసెంబ్లీ రౌడీ,శివమణి వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించారు. సుమారు 300కు పైగా సినిమాల్లో మోహన్‌రాజ్ మెప్పించారు.గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్‌రాజ్ తిరువనంతపురంలో చికిత్స తీసుకుంటుండగా వెంటిలేటర్‌పైనే ఆయన మరణించారు. ఈ విషయాన్ని మలయాళ నటుడు, దర్శకుడు, పి.దినేశ్ పనికర్ తెలిపారు. మోహన్‌రాజ్‌కు భార్య ఉషతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 21 మూవీస్.. అవి ఏంటంటే?పార్కిన్సన్స్తో (పక్షవాతం) బాధపడుతున్న మోహన్‌రాజ్‌కు కొద్దిరోజుల క్రితం గుండె పోటు కూడా రావడంతో వెంటనే ఆయన్ను చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తిరువనంతపురంలోని మరో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా ఆయన మరణించారు. తెలుగులో మోహన్‌బాబు ‘శివశంకర్’ (2004) అనే చిత్రంలో ఆయన చివరిగా కనిపించారు. ఇందులో హీరోగా నటించారు. మోహన్‌రాజ్ మృతిపట్ల మలయాళ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది. -
చిరంజీవితో ఛాన్స్ వచ్చిందని మాకు హ్యాండిచ్చాడు: డైరెక్టర్
కోలీవుడ్ టాప్‌స్టార్ ప్రశాంత్ చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం అందగన్. తాజాగా తమిళ్లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ హిట్ సినిమా అంధాధున్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసింది. ఇందులో నటి సిమ్రాన్, ప్రియా ఆనంద్, కార్తీక్, యోగిబాబు, సముద్రఖని, ఊర్వశీ,కేఎస్.రవికుమార్, వనితా విజయ్‌కుమార్ నటించారు.ఈ చిత్రాన్ని స్టార్ మూవీస్ పతాకంపై శాంతి త్యాగరాజన్ నిర్మించగా, త్యాగరాజన్ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ చిత్ర థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని చైన్నెలో మేకర్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు త్యాగరాజన్ మాట్లాడుతూ అందగన్ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలన్నారు. పాజిటివ్ రివ్యూలే చిత్ర విజయానికి కారణం అన్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ కథానాయకుడు అయినా , అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. ఈ చిత్రానికి ముందుగా మోహన్‌రాజాను దర్శకుడిగా ఎంపిక చేశామని, మూడు నెలలు చర్చలు జరిగిన తరువాత ఆయన తెలుగులో చిరంజీవితో చిత్రం చేసే అవకాశం రావడంతో వెళ్లిపోయారన్నారు. దీంతో తానే దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోలేరని, దీంతో ఆ విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు. మోహన్‌రాజా-చిరంజీవి కాంబినేషన్లో గాడ్‌ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై హీరో ప్రశాంత్ పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. అందుకు బదులిచ్చిన త్యాగరాజన్ అందగన్ చిత్రం మంచి హిట్ అయ్యిందని, ఇక సినిమా విషయాలను పక్కన పెట్టి ప్రశాంత్ పెళ్లి పైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు, త్వరలోనే మంచి అమ్మయితో ప్రశాంత్ పెళ్లి ఉంటుందని చెప్పారు. కాగా నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ అందగన్ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు త్యాగరాజన్, నటీనటులని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు కమ్ బ్యాక్ అనీ, ఇకపై చాలా చిత్రాలు చేస్తానని ఆయన అన్నారు. తొలి ముద్దు, జోడి, జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. -
రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ.. 20 ఏళ్ల తర్వాత సీక్వెల్!
నటుడు జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రం ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్గా నటించారు. జయం రవికి తల్లిగా నదియా కనిపించారు. అయితే ఎడిటర్ మోహన్ నిర్మించిన ఈ చిత్రం 2004లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో రవితేజ నటించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు. తెలుగులో 2003లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు మోహన్‌రాజా సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ తాజా సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో నటి నదియా పాత్ర కూడా ఉంటుందని సమాచారం. అయితే ఆమెనే ఎంపిక చేస్తారా? అదే విధంగా హీరోయిన్గా ఎవరు నటిస్తారు? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆసిన్ సినిమాలకు దూరంగా ఉంది. కాగా ప్రస్తుతం మోహన్ రాజా, జయం రవి హీరోగా తనీ ఒరువన్ చిత్రానికి సీక్వెల్ 'తని ఒరువన్- 2' తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఎం.కుమరన్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. కాగా మోహన్‌రాజా తమిళంలో చిత్రం చేసి చాలా గ్యాప్ వచ్చింది. 'ఎమ్ కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి' తెలుగు సినిమా 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి రీమేక్ అయినప్పటికీ.. తమిళ అభిమానులను ఆకట్టుకునేలా మోహన్ రాజా అనేక మార్పులు చేశారు. ఈ చిత్రం తమిళనాడులో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, ఐశ్వర్య, వివేక్, జనకరాజ్, వెన్నిర ఆడై మూర్తి ముఖ్య పాత్రలు పోషించారు. -
ధృవ సినిమాకు సీక్వెల్ రెడీ.. టీజర్ విడుదల కానీ..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌హిట్ చిత్రం 'ధృవ'. ఇందులో హీరోయిన్గా రకుల్ నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌ను అందుకుంది. కోలీవుడ్‌లో డైరెక్టర్ మోహన్‌రాజా తెరకెక్కించిన 'తనీ ఒరువన్'కు రీమేక్‌గా ఇది విడుదలై తెలుగు వారిని అలరించింది. తాజాగ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు నోటీసులు) చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సీక్వెల్ కావాలంటూ మెగా ఫ్యాన్స్ నుంచి భారీగానే డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ తమిళ సినిమాకు మాత్రమేనని తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో టీజర్‌ను కూడా మేకర్స్ విడుదుల చేశారు. కానీ తెలుగులో కూడా చెర్రీతోనూ చర్చలు జరిపే ఉంటారని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో ఇదే దర్శకుడు మోహన్ రాజా పనిచేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గాడ్ ఫాదర్' సినిమాతో మెగా ఫ్యామిలీకి మోహన్ రాజా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే ధృవ సినిమాకు సీక్వెల్ కథను వినిపించారని సమాచారం. మరి తెలుగు సీక్వెల్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. -
బన్నీ ఫోన్ చేసి నాతో 21 నిమిషాలు మాట్లాడారు..
-
గాడ్ ఫాదర్ సినిమా చూసి అల్లు అర్జున్ ఏమన్నాడంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్‌ఫాదర్ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్రధాన బలంగా మారింది. ఊహించినదానికంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు సైతం సంతోషంగా ఉన్నారు. తాజాగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా సినిమా సక్సెస్‌ను మీడియాతో పంచుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాకు మొదట రామ్‌చరణ్ ఫోన్ చేశాడు. అంతేకాక ఉదయం ఆరు గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు. ఇది చాలు నాకనిపించింది. అల్లు అర్జున్ నాతో 21 నిమిషాలు మాట్లాడారు. పిచ్చెక్కించేశారు, సినిమా లడ్డూలా ఉందన్నారు. సాయిధరమ్ తేజ్ అయితే ఏకంగా ఆఫీస్‌కే వచ్చేసి అభినందించారు' అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. చదవండి: గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి..: నటి -
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా?
ఒక సినిమా జనాల్లోకి వెళ్లడానికి టైటిల్ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని టైటిల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తాయి. అలాంటి వాటిల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం..మలయాళ సూపర్ హిట్ లూసీపర్కి తెలుగు రీమేక్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదదలైన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా టైటిల్ చిరంజీవి స్టార్‌డమ్‌కి చక్కగా సరిపోయింది. అయితే మొదట ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ టైటిల్‌ని సూచించారట. తాజాగా ఈ విషయాన్ని తమన్ ఓ ఇంటర్వూలో తెలిపారు. (చదవండి: సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచాడు.. దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి) ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ అంతా సర్వాంతర్యామి వర్కింగ్ టైటిల్‌తో పూర్తయింది. ఈ సినిమా కథని హీరో డార్క్‌లో నుంచి జరుపుతున్నాడు. అది మనకు తెలియదు. అన్ని సీన్స్‌లో బ్రహ్మా(చిరంజీవి) ఉండరు. కానీ ఆయన గురించే మాట్లాడుకుంటారు. అందుకే నాకు దేవుడిలా అనిపించాడు. ఇంగ్లీష్ టైటిల్ పెడితే బాగుంటుదనిపించి ‘గాడ్ ఫాదర్’ సూచించాను. సెంటిమెంట్ పరంగా కూడా కలిసిసొస్తుందని చిరంజీవికి ఊరికే చెప్పాను. గతంలో మీరు నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైటిల్స్ లెటర్ జీ(G )తో మొదలయ్యాయి. బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి అని చిరంజీవితో అనడంతో.. ఆయన కూడా ఓకే చెప్పేశాడు’అని తమన్ చెప్పుకొచ్చాడు. అయితే గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో హాలీవుడ్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయిందట. దీంతో నిర్మాతలకు వారి నుంచి అనుమతి తీసుకున్నారట. సినిమా విడుదలక వారం ముందు ఓన్ఓసీ లభించినట్లు నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. -
‘గాడ్‌ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్‌ఫాదర్ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. గాడ్‌ఫాదర్ చూసి రజనీకాంత్ తన రివ్యూ ఇచ్చారని, ఇది తనకు బెస్ట్ మూమెంట్ అంటూ డైరెక్టర్ మోహన్ రాజా ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఈ మేరకు మోహన్ రాజా ట్వీట్ చేస్తూ.. ‘సూపర్ స్టార్ ‘గాడ్‌ఫాదర్’ సినిమా చూశారు. ఈ మూవీ చాలా చాలా బాగుంది అన్నారు. ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ కోసం చేసిన అనుసరణలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ధన్యవాదాలు తైలవా(రజనీకాంత్) సార్, నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది ఒకటి’ అంటూ మురిసిపోయాడు. కాగా డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. Superstar watched #Godfather 😇 Excellent!! very nice!! very interesting!!! are few of the remarks in his detailed appreciation on the adaptions made for the Telugu version. Thank u so much Thalaiva @rajinikanth sir, one of the best moments of life.. means a lotttt 🙏 pic.twitter.com/AFdT7oOoBe — Mohan Raja (@jayam_mohanraja) October 10, 2022 -
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
‘మెగా’ డైరెక్టర్‌తో ‘అక్కినేని’మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ!
తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట మోహన్ రాజా. ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. కాగా ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలతో బిజీగా గడిపారు నాగార్జున. ఓ చిన్న బ్రేక్ తర్వాత ఈ సినిమాను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నారట నాగార్జున. (చదవండి: గాడ్ ఫాదర్ ఆ రేంజ్ బ్లాక్‌బస్టర్) ఈలోపు అఖిల్ కూడా తన తాజా చిత్రం ‘ఏజెంట్’ను దాదాపు పూర్తి చేసేస్తారట. ఆ తర్వాత తండ్రితో కలిసి చేయనున్న సినిమా సెట్స్‌లో అడుగుపెడతారని టాక్. ఇదిలా ఉంటే.. ఇది నాగార్జున కెరీర్లో వందో చిత్రం అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘గాడ్‌ఫాదర్’ క్లైమాక్స్‌ని మళ్లీ రీ షూట్ చేశాం: చిరంజీవి
‘‘ఎన్ని సినిమాలు చేసినా ఎంత అనుభవం ఉన్నా ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతే. ఓ సినిమాకు ఎంత డబ్బులు వచ్చాయిన్నది కాదు.. ఎంతమంది చూసి వావ్ అన్నారన్నది కూడా అంతే ముఖ్యం. చాలాకాలం తర్వాత ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్’ రేంజ్ బ్లాక్‌బస్టర్ ‘గాడ్ ఫాదర్’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ‘గాడ్ ఫాదర్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గాడ్ ఫాదర్’ సినిమాకు కొంత మంది దర్శకుల పేర్లు అనుకున్నాం. ఫైనల్‌గా దర్శకుడు మోహన్ రాజా రావడం నాకు ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఆ తర్వాత సత్యానంద్గారిని ఇన్వాల్వ్ చేశాను. నా ఇన్‌ఫుట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఓ క్లైమాక్స్ షూట్ చేశాం. ఆ తర్వాత మళ్లీ క్లైమాక్స్‌ను రీ షూట్ చేశాం. సినిమాను నేను ఓ క్రిటిక్‌గా చూసినప్పుడు తప్పులు తెలుస్తాయని నా గట్ ఫీలింగ్. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరంజీవి కళ్లతో యాక్ట్ చేశారు అని అంటుంటే ఆ క్రెడిట్ టీమ్ అందరిదీ’’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ – ‘‘రెండు రోజుల క్రితమే నిశ్శబ్ద విస్ఫోటనంకి మీనింగ్ తెలిసింది నాకు. ఎవడు పడితే వాడు మాటి మాటికి, సరిసాటి రానోళ్లందరూ మాట్లాడుతుంటే ఒక చిరునవ్వుతో ఆయన (చిరంజీవి) ఆ క్షణం ఆ పని అలా జరిగేలా ముందుకు వెళ్తున్నారు చూడండి.. అది నిశ్శబ్ద విస్ఫోటనం అంటే. 153 సినిమాలకు ఆయన చిరునవ్వే నిదర్శనం’’ అన్నారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ – ‘‘ఇండియన్ స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్ స్టార్స్ చిరంజీవిగారే. రీసెంట్గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు. ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా ఆయన (చిరంజీవి) ఇంటికి ఆహ్వానిస్తుంటే అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాము’’ అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ– ‘‘ప్రాజెక్ట్‌లో చిరంజీవిగారు ఇన్ వాల్వ్ అవుతున్నారు అని ఎవరైనా అంటే కొడతాను. ఆయన అనుభవాన్ని ఊపయోగించుకోలేకపోతే మేం ఫూల్స్. ప్రతి సీన్ లోనూ ఆయన ఇన్ పుట్ ఉంది. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది’’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మీకు ఎవ్వరికీ తెలియని విషయం ఆయన్ను (చిరంజీవి) అడగకుండా కూడా నేను చెబుతున్నాను. ‘అమ్ముడుపోయారు.. అమ్ముడు పోయారు అంటున్నారు. మద్రాస్‌లో ప్రసాద్ ల్యాబ్ పక్కన ఉండే కృష్ణా గార్డెన్ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజింగ్ రోజున ఆయన అప్పులు అన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీని అమ్మిన వ్యక్తి ఆయన. ఈ రోజుకీ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పని చేసే వ్యక్తి గురించి ఎవరు పడితే వారు మాట్లాడుతుంటారు. ఏదంటే అది రాస్తుంటారు. ఆయన స్పెషల్ పర్సన్ కాబట్టి ఏదంటే అది రాయొచ్చు. అదో హక్కు అయిపోయింది. ప్రజారాజ్యంలో నుంచి పుట్టిన బాధ, ఆవేశమే ఈ రోజు జనసేన. ఆ రోజు చిరంజీవిగారి గురించి ఏం మాట్లాడారో దానికి సమాధానమే జనసేన. సార్.. మీరు సహనంగా, వినయంగా.. దండాలు పెడుతూనే ఉండండి. మేం కాదనం. దయచేసి కొన్ని విషయాల్లో మనం కొంతమందిని వదులుకోవాల్సి ఉంది. సోషల్ మీడియాలో కానీ, మీడియా వ్యక్తులు కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేప్పుడు ఒకసారి ఆలోచించండి’’ అన్నారు. రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – ‘‘ఈ సందర్భంగా రామాయణంలోని ఓ సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. చూడామణి, నగలు.. వీటి వల్ల ఆనవాలు చూపించవచ్చు కానీ.. నిజంగా నేను సీతనే చూశాను అని రాముడికి చెప్పి నమ్మించాలంటే మీ ఇద్దరికే తెలిసిన మీ మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని నాకు చెబితే ఆ సన్నివేశాన్ని నేను రాముడికి చెబుతా’’ అని సీతతో హనుమంతుడు అంటాడు. అప్పుడు సీత.. ‘‘ఓ రోజు నేను రాముడి ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఓ కాకి వచ్చి నా గుండెలమీద పొడుస్తుంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను. కానీ నా రక్తపు చుక్క తగిలి రాముడు నిద్రలేచి చూస్తుండే సరికి కాకి మళ్లీ పొడవటానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో ఓ గరికను లాగి ఆ కాకిమీదకు బ్రహ్మాస్త్రంగా వేశాడు’’ అంటూ ఓ సన్నివేశం హనుమంతుడికి చెబుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే... నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే..ఓ వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని గరిక వినయంగా ఒప్పుకుంటే... ఆ గరిక విలువ, రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ పెరగదు... తగ్గదు.. ఆ రాముడి విలువ ఎప్పుడూ అలానే ఉంటుంది’’ అన్నారు. ఎడిటర్ మోహన్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు, నటీనటులు కస్తూరి, మురళీ మోహన్, సునీల్, మురళీ శర్మ, డెలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
Godfather: చిరు మెచ్చాడు.. బ్లాక్ బస్టర్ కొట్టాడు
మెగాస్టార్ ఒక రీమేక్ మూవీలో నటిస్తున్నాడు అంటే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. మెగా హిస్టరీ తీసి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఠాగూర్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీనంబర్ 150, ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్స్. కొంత బ్రేక్ తర్వాత చిరు మరో రీమేక్‌తో తిరిగొచ్చాడు. ‘గాడ్ ఫాదర్’గా మారి దసరాకి థియేటర్స్‌కు పూనకాలు తీసుకొచ్చాడు. ఖైదీ నంబర్ 150తో చిరు రీఎంట్రీ ఇచ్చింది మొదలు.. చిరు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పటి మెగాస్టార్ వేరు. ఇప్పుడు మన చూస్తున్న మెగాస్టార్ వేరు. అందుకే సైరా వచ్చింది. ఆ తర్వాత ఆచార్య విడుదలైంది. ఇప్పుడు గాడ్ ఫాదర్ వచ్చింది. ‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయలు నా నుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్ గాడ్ ఫాదర్‌కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. 2019 మలయాళం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేకే ఈ గాడ్ ఫాదర్. లూసిఫర్ కథనం, పాత్రలపై మెగాస్టార్ మనసు పారేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా లూసిఫర్ స్టోరీ బాగా నచ్చింది. తన తండ్రి స్టీఫెన్ గట్టుపల్లి పాత్రలో నటిస్తే చూడాలనుకున్నాడు. అలా లూసిఫర్ తెలుగు రీమేక్ ప్రారంభమైంది. మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయినా ఈ మూవీని చిరు ఎందుకు రీమేక్ చేస్తున్నాడని చాలా మంది అనుకున్నారు. కానీ మెగాస్టార్ రీజన్స్ మెగాస్టార్‌కు ఉన్నాయి. ఏ సబ్జెక్ట్‌లో తాను నటిస్తే ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారో, ఆయనకు తెల్సినంతగా మరెవరికి తెలియదు. ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ఆ విషయం రుజువైంది. సైరాతో చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ ఆడియెన్స్‌కు హాయ్ చెప్పారు చిరు. ఇప్పుడు గాడ్‌ఫాదర్‌తో మరోసారి బీటౌన్ ప్రేక్షకులను పలకరించాడు. అందుకు మెయిన్ రీజన్ సల్మాన్ ఖాన్, గా డ్ ఫాదర్ లో కీలకమైన పాత్రలో నటిం చడమే. గాడ్ ఫాదర్ మూవీతో తొలిసారి సల్మా న్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. పైగా చిరు చేసిన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి, ఈరోల్ చేశాడు. అందుకే అతనికి దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసాడట చిరు. కాని సల్మాన్ ఖాన్ సింపుల్‌గా 20 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసాడట. పైగా తన చిత్రంలో చిరు నటించాల్సి వస్తే, మీరు కూడా నన్ను రెమ్యునరేషన్ అడుగుతారా అంటు ఎదురు ప్రశ్నించాడట. సల్మాన్ తనపై చూపించిన ప్రేమను చూసి మెగాస్టార్ చలించిపోయారట. గాడ్ ఫాదర్‌కు ముందు ఈ మూవీకి బైరెడ్డి, రారాజు అనే టైటిల్స్ వినిపించాయి. అలాగే నయనతార పాత్రకు ఎంపిక చేసే ముందు సుహాసిని, విద్యాబాలన్ పేర్లు వినిపించాయి. గాడ్ ఫాదర్లో నయన్ సత్య ప్రియ పాత్రలో కనిపించింది. కేవలం 10 సినిమాల అనుభవం ఉన్న సత్యదేవ్ కు చిరు స్వయంగా ఫోన్ చేసి స్టోరీ అంతా చెప్పి సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించాల్సిందిగా కోరారట. గాడ్ ఫాదర్‌కు సంబధించి మరో విశేషం ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైమ్ చిరు ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. -
మెగా హిట్ ‘గాడ్ ఫాదర్’.. ఓటీటీ స్ట్రీమింగ్ అందులోనేనా?
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘గాడ్ ఫాదర్’ గురించే చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు తెలుగు రీమేక్ ఇది. తెలుగు ప్రేక్షకుల అభిరిచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించాడు దర్శకుడు మోహన్ రాజా. (చదవండి: బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్) దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం..ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మెగాస్టార్ సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించింది. ఈ వారాంతంలో ఈజీగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్‌ని దక్కించుకుందట. రూ. 57 కోట్లకు తెలుగు, హిందీ భాషల హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ఈ చిత్రం రానుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల వరకు ఆగాల్సిందే. -
కోహినూర్ మెరుపు తగ్గొచ్చు కానీ వ్యాల్యూ తగ్గదు.. నాగబాబు ట్వీట్ వైరల్
ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి హిట్ కొట్టాడు. తమ అభిమాన హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించాలని చాలా కాలంగా మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. చిరు టైటిల్ పాత్రలో నటించిన సైరా, ఆచార్య చిత్రాలు ఆశించిన స్థాయిల్లో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు. ముఖ్యంగా ఆచార్య ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి తరుణంలో ‘గాడ్ ఫాదర్’తో భారీ హిట్ ఇచ్చాడు ‘అన్నయ్య’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజే రూ. 38 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. చాలా కాలం తర్వాత చిరంజీవి భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విటర్ వేదికగా ‘గాడ్ ఫాదర్’ విజయంపై స్పందిస్తూ చింజీవిని కొహినూర్ డైమాండ్‌తో పోల్చాడు. (చదవండి: బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర..రెండో రోజూ భారీ కలెక్షన్స్) ‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలీష్ తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వాల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన పాలీష్ (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం’అంటూ నాగబాబు ట్వీట్ చేశాడు. మలయాళ మూవీ ’లూసీఫర్’కు తెలుగు రీమేకే ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు polish తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వేల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన polish (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్‌కి తగ్గ సినిమా రావడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ‘గాడ్ ఫాదర్’పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించిన ‘గాడ్ ఫాదర్’.. రెండో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.31 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాకు తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం సహజమే. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే 20 నుంచి 30 శాతం వసూళ్లు పడిపోతాయి. కానీ గాడ్ ఫాదర్ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా భారీ వసూళ్లును సాధించి రికార్డు సాధించింది. రెండు రోజుల్లో మొత్తం రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సినిమాకు హిట్ టాక్ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండడంతో వీకెండ్‌లోగా ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
గాడ్ ఫాదర్ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
‘లూసిఫర్’లో లేనిది గాడ్ ఫాదర్లో ఉంది!
‘‘మలయాళ ‘లూసిఫర్’ కి నేను పెద్ద అభిమానిని. ఆ సినిమాని గొప్పగా ప్రేమించి ఇంకా గొప్పగా తీసిన సినిమా ‘గాడ్ ఫాదర్’ అని డైరెక్టర్ మోహన్ రాజా అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. సల్మాన్ ఖాన్ , నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేశారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (బుధవారం) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మోహన్ రాజా పంచుకున్న విశేషాలు. ⇔ నేను పుట్టింది తమిళనాడులో అయినా దర్శకుడిగా జన్మనిచ్చింది తెలుగు చిత్రపరిశ్రమ. మా నాన్నగారు (ఎడిటర్ మోహన్) వేసిన బాటలో నేను, తమ్ముడు (‘జయం’ రవి) ప్రయాణిస్తున్నాం. తెలుగులో 10 ఏళ్లలో 9 వరుస హిట్లు అందుకున్నారు నాన్నగారు. రవిని హీరోగా చేసేందుకు తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాం. ⇔ నా తొలి తెలుగు చిత్రం ‘హనుమాన్ జంక్షన్’ విడుదలై 21 ఏళ్లు అయింది. ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ‘గాడ్ ఫాదర్’ చేయడం గర్వంగా ఉంది. ఇన్నేళ్లు తెలుగుకి దూరంగా ఉన్నాననే భావన కలగ లేదు.. ఎందుకంటే ఆరు తెలుగు సినిమాలను వరుసగా తమిళ్లో రీమేక్ చేశా. ⇔ ఎన్వీ ప్రసాద్‌గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నన్ను మళ్లీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్‌బాబు దగ్గరికి కూడా తీసుకెళ్లారు. ‘తని వరువన్’ (ధృవ) నుండి రామ్ చరణ్‌తో పరిచయం. ‘ధృవ –2’ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో ‘లూసిఫర్’ రీమేక్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా నా పేరుని ఎన్వీ ప్రసాద్‌గారు సూచించడంతో చిరంజీవిగారు, చరణ్‌లు ఓకే అన్నారు. ‘లూసిఫర్’ లో నాకు దొరికిన ఒక కొత్త కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది. ⇔ ‘లూసిఫర్’లో లేని ఒక కోణం ‘గాడ్‌ఫాదర్’లో ఉంటుంది. కథని అలాగే ఉంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. ఇందులోని పది పాత్రలు చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. ‘గాడ్‌ఫాదర్’ చిరంజీవిగారి ఇమేజ్‌కి తగ్గ కథ. ఈ కథకి సరిపడే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండియాలో ఓ ముగ్గురు మాత్రమే ఉంటారు. ⇔ ‘లూసిఫర్’లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో సల్మాన్ఖాన్గారు బాగుంటుందనే ఆలోచన నాదే. రామ్‌చరణ్ అడగ్గానే చిరంజీవిగారిపై ఉన్న ప్రేమతో ఈ మూవీ ఒప్పుకున్న సల్మాన్‌కి థ్యాంక్స్. చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లాంటి మెగాస్టార్లని డైరెక్ట్ చేయడం చాలా ఒత్తిడిగా ఉంటుంది.. అయితే చిరంజీవిగారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. ⇔ చిరంజీవిగారితో మా నాన్నగారు ‘హిట్లర్’ అనే హిట్ మూవీ నిర్మించారు. నేను ‘గాడ్‌ఫాదర్’ అనే హిట్ ఇవ్వబోతుండటం హ్యాపీ. మలయాళంలో ‘లూసిఫర్ 2’ మొదలైంది. ప్రస్తుతం నా దృష్టి ‘గాడ్ ఫాదర్’ పైనే ఉంది. అయితే ఈ సినిమా సీక్వెల్‌కి మంచి కంటెంట్ ఉంది. -
Godfather Pre Release Photos: అనంతపురంలో ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పవర్‌పుల్ డైలాగ్స్
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్' ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో చిరంజీవి యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. కీలక పాత్రలో నటించిన సల్మాన్ యాక్షన్ కూడా అదిరింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ మీరూ చూసేయండి. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్ ఈ చిత్రం. అనంతపురంలో భారీస్థాయిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) -
నా కల నెరవేరింది
‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నయ్యకి(చిరంజీవి) నేను పెద్ద అభిమానిని. ఆయన స్ఫూర్తితో నటుడు కావాలని కలలుకని, అయ్యాను. నా నటనని అన్నయ్య ప్రశంసించడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి. ఆయనతో నటించాలనే నా ఇన్నేళ్ల కల ‘గాడ్‌ఫాదర్’ చిత్రంతో నేరవేరింది’’ అని హీరో సత్యదేవ్ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న తెలుగు, హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన సత్యదేవ్ పంచుకున్న విశేషాలు... ► అన్నయ్య(చిరంజీవి) ఒక షూటింగ్లో లంచ్‌కి రమ్మని పిలిస్తే వెళ్లాను. ఒక సినిమా(గాడ్‌ఫాదర్) ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. నేను ఆయనకి వీరాభిమానిని.. గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, నా పాత్ర గురించి చెప్పడం ఆశ్చర్యమనిపించింది.. వెంటనే చేస్తాను అని చెప్పా. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే ఆ పాత్ర చేస్తున్నపుడు అందులోని లోతు అర్థమైంది.. అప్పుడు చిన్న టెన్షన్ మొదలైంది. కానీ, అన్నయ్యగారు నటుడిగా నాపై పెట్టిన బాధ్యత ముందు భయాలు తొలగిపోయాయి. గతంలో ఎప్పుడూ చేయని పాత్ర ఈ సినిమాలో చేశా. ► అన్నయ్య గ్రేస్, ఆరాకి వంద శాతం సరిపడే కథ ‘గాడ్‌ఫాదర్’. చిరంజీవిగారిని మెగాస్టార్ అని ఎందుకు అంటారో ఆయనతో పనిచేస్తున్నప్పుడు అర్థమైంది. ఆయన చాలా క్రమశిక్షణగా, మా కంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రతి డైలాగ్ నేర్చుకుంటూ తర్వాతి సన్నివేశం గురించి ఆలోచించడం గ్రేట్. ► సల్మాన్ఖాన్గారు సెట్స్‌లో చాలా సింపుల్‌గా, సరదాగా ఉంటారు. దర్శకుడు మోహన్ రాజాగారు నా పాత్రని చాలా స్టయిలిష్, పవర్ హంగ్రీ, గ్రీడీ.. ఇలా చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశారు. అందరిలానే సోలో హీరోగా చేయాలనే ఉంటుంది. అయితే మంచి పాత్ర వస్తే క్యారెక్టర్స్ కూడా చేస్తాను. ► అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంది. తన సినిమాలతో సౌత్, నార్త్ అనే బౌండరీలు లేకుండా ఇండియన్ సినిమా అనేలా చేసిన రాజమౌళిగారికి హ్యాట్సాఫ్. నేను నటించిన ‘గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్ సేతు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఫుల్ బాటిల్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో డాలీ ధనుంజయతో కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాను. -
గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం
మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'నజబజ జజర.. గజగజ వణికించే గజరాజు అడిగోరా' అంటూ సాగే సాంగ్‌తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. -
చిరంజీవి 'గాడ్‌ఫాదర్' సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలె మేకర్స్ తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ మోహన్ రాజా మరో అప్డేట్ను వదిలారు. ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది అని తెలిపారు. అంతేకాకుండా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందన్నది చూడాల్సి ఉంది. It’s a Clean U/A with an amazing appreciation from the Censor authorities Waiting for the audience blessing on #GodFatherOnOct5th — Mohan Raja (@jayam_mohanraja) September 23, 2022 -
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో ప్రభుదేవా..
Prabhu Deva Choreography In Chiranjeevi Godfather Movie: కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి చేతిలో ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మంగళవారం (మే 3) రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారని మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఇదివరకే తెలిపాడు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ప్రకటించాడు తమన్. చిరు-సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయనున్న సాంగ్‌ను ఇండియన్ మైఖేల్ డ్యాన్సర్‌గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు. ఇదివరకు అనేక చిరంజీవి చిత్రాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చిందేయడం, దీనికి తమన్ సంగీతం అందించడంతోపాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ యాడ్ కావడంతో ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పాట సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. చదవండి: సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి.. టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి Yayyyy !! ❤️ THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6 — thaman S (@MusicThaman) May 3, 2022 -
గాడ్ ఫాదర్: రంగంలోకి దిగిన చిరంజీవి
Chiranjeevi Resumes Godfather Shoot In Ooty: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఊటీలో ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. గాడ్ ఫాదర్: ఊటీలో షూటింగ్ చదవండి : 'మా' ఎన్నికలు : ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు 'లైగర్' టీంకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య -
చిరంజీవి 153వ మూవీ: ఫైట్‌తో ఎంట్రీ ఇచ్చిన చిరు
కొత్త సినిమాలోకి అడుగుపెట్టడం పెట్టడమే ఫైట్ చిత్రీకరణలో పాల్గొన్నారు చిరంజీవి. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. తొలుత యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ రూపొందించిన సెట్లో జరుగుతున్న ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్‌ను శిల్వ స్టంట్ సమకూర్చుతున్నారు. ఈ సినిమాకు ‘గాడ్‌ఫాదర్’, ‘కింగ్‌మేకర్’ అనే టైటిల్స్‌ను చిత్రయూనిట్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరవ్ షా ఛాయాగ్రాహకులు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాకాడ అప్పారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
‘లూసిఫర్’ షూటింగ్ స్టార్ట్ చేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న 153వ చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. With #BOSS 🎵 #MegastarChiranjeevi gaaru ❤️@KChiruTweets #Chiru153 🔈🎬🎵 Wishing the our dear director @jayam_mohanraja all the very best for the shoot starting tomorrow 🎥🎵❤️ #niravshah 🎥 God bless team 📢 @KonidelaPro 🎬 pic.twitter.com/NwuUkVNfa8 — thaman S (@MusicThaman) August 12, 2021 కాగా ఈ చిత్రంలోని మొదటి పాట రికార్డింగ్ కూడా ఇటీవల పూర్తయింది. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు చిరంజీవి, మోహన్ రాజాలతో దిగిన ఫొటోను తమన్ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘జీవితంలో గుర్తుంచుకోదగిని రోజు ఇది. చిరు 153 సినిమా కోసం పాట పూర్తి చేశాం. ఓ వీరాభిమానిగా చిరంజీవిగారి అభినందనలు అందుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. కాగా చిరంజీవి ఇటీవల ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. A day to Remember for life ❤️ We Completed Our Song for #Chiru153 that warm wishes from our dear #MEGASTAR @KChiruTweets gaaru himself 🎵♥️ Was Something Very Very Special to me As a biggest FAN boy 😍 thanks to @jayam_mohanraja Shoot starts TOM 🎬 📢 @KonidelaPro Godbless 😊 pic.twitter.com/DRVdp93f7V — thaman S (@MusicThaman) August 12, 2021 -
లూసీఫర్ రీమేక్: చిరు కోసం తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ థీమ్
మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను మోహన్ రాజా తెలుగులో చిరుతో రీమేక్ చేస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా తాజాగా ఈ లూసిఫర్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. కాగా ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లు తమన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇందులో ఎలివేషన్స్ మలయాళం కంటే ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమన్ చిరు కోసం మంచి బ్యాక్‌గ్రౌండ్ థీమ్ సిద్దమైనందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో సోమవారం డైరెక్టర్ మోహన్ రాజా, తమన్‌లు చర్చించుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘చిరు 153వ మూవీ మ్యూజికల్ సిట్టింగ్‌పై వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది’ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రస్తుతం చిరు కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నాడు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరపుకుంటోంది. దీంతో చిరు ఆచార్య షూటింగ్లో ఫుల్ బీజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తైయిన వెంటనే మెగాస్టార్ లూసిఫర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడని సమాచారం. And Here We Start #Chiru153 ❤️ with @jayam_mohanraja It’s time to show love to Our beloved #Megastar #chiranjeevi @KChiruTweets gaaru ⭐️⭐️⭐️⭐️⭐️ And guys this is goona be super high stuff for sure !! ❤️#godbless pic.twitter.com/RHim4ggd7o — thaman S (@MusicThaman) June 28, 2021 -
సీఎం స్టాలిన్‌ను కలిసిన తారలు: విరాళాల వెల్లువ
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అనేకమంది ప్రాణాలను బలిగొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికి రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటోంది. అయితే ప్రజలకు ఆర్థికసాయం చేయడానికి, కరోనా బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడానికి ఆర్థిక పరమైన అవసరాలు ఏర్పడడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దాతలు కరోనా నివారణ నిధికి ఆర్థికసాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి చెక్కు అందిస్తున్న ఎడిటర్ మోహన్ కుటుంబం దీంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే శివకుమార్ కుటుంబం, అజిత్, సౌందర్య రజనీకాంత్ కుటుంబం తదితరులు విరాళాలు అందించారు. తాజాగా మరికొందరు సినీ దర్శక నటులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నటుడు శివకార్తికేయన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. అదేవిధంగా నిర్మాత, ఎడిటర్ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం రవి ముఖ్యమంత్రిని కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు. దర్శకుడు వెట్రిమారన్ దర్శకుడు శంకర్ కరోనా నివారణకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆయన ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు పంపించారు. అదేవిధంగా దర్శకుడు వెట్రిమారన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.10 లక్షల విరాళాన్ని చెక్కు ద్వారా అందించారు. రజనీకాంత్, విజయ్, ధనుష్, శింబు తదితర ప్రముఖులు ఇంకా తమ విరాళాలను ప్రకటించలేదు. అజిత్ విరాళాన్ని ప్రకటించడంతో ఆయనకు పోటీదారులుగా భావించే విజయ్ ఇంకా విరాళాన్ని ప్రకటించలేదు. కాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు నటుడు అజిత్ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి వెల్లడించారు. నటుడు శివకార్తికేయన్ చదవండి: పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు -
మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ దర్శకుడు
మలయాళంలో సూపర్ హిట్ విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. జయం మోహన్ రాజా దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. సురేరేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో రీమేక్‌కి బైరెడ్డి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం జనవరి 21న లాంఛనంగా ప్రారంభమయ్యింది. (చదవండి: కరోనా దెబ్బకు వెనకడుగు వేస్తున్న మెగాస్టార్) ఏప్రిల్ నెలలో సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కావాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుండటంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం లూసిఫర్ సినిమాకు విలన్ వేటలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. చిరంజీవిని ఢీకొనే ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ మెగాస్టార్‌తో నటించే అవాకాశాన్ని అనురాగ్ నిరాకరించినట్లు వినికిడి. దీనికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. (చదవండి: సినీ నటి రాధ కేసులో యూటర్న్..) ఇక అనురాగ్ నో చెప్పడంతో మరో కొత్త విలన్ కోసం మూవీ నిర్మాతలు జల్లెడ పడుతున్నారు. లుసిఫార్ రీమేక్‌ను ఈ ఏడాది పూర్తి చేసి వచ్చే సంక్రాంతి అనంతరం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉండగా .. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం లూసిఫర్‌లో ఎంటర్ కానున్నారు. చదవండి: ఆచార్యలో రామ్‌చరణ్ పాత్ర అదే -
చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా...
చిరంజీవి తాజా చిత్రం ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై సురేఖ కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఫిబ్రవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌ను తయారు చేశారు దర్శకుడు మోహన్‌రాజా’’ అన్నారు. మోహన్‌రాజా మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇది పూర్తి స్థాయి రీమేక్ సినిమా కాదు. ఒరిజినల్ పాయింట్ తీసుకుని చిరంజీవిగారి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథను మార్చి, తెరకెక్కిస్తాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అశ్వినీదత్, డీవీవీ దానయ్యలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్. -
చిరంజీవితో సినిమా నా అదృష్టం: దర్శకుడు
మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగులో రీమేక్‌కు రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చేస్తున్న ఈ 153వ సినిమా చిత్రీకరణ బుధవారం ఉదయం ఫిలిం నగర్‌లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ‘ఆచార్య’ వీడియోని షేర్ చేసిన చిరంజీవి) ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. "ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. ఇది మెగాస్టార్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది'' అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ- 'చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు. (చదవండి: గనిగా వరుణ్ తేజ్.. పంచ్ మాములుగా లేదుగా) ఈ చిత్రానికి సమర్పణ : సురేఖ కొణిదెల, సంగీతం : ఎస్ ఎస్ తమన్, కెమెరా : నీరవ్ షా, రచయిత : లక్ష్మి భూపాల్, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, లైన్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు, నిర్మాతలు : ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : మోహన్ రాజా, బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ Megastar @KChiruTweets new film kickstarted with a Pooja today Presented by @KonidelaPro, @MegaaSuperGood1 & NVR Films 🎬 : @jayam_mohanraja 🎥: Nirav Shah 🎼 : @MusicThaman 🎨 : @sureshsrajan ✍️ : #LakshmiBhoopal Regular shoot commences from February 2021. #Chiru153 pic.twitter.com/qEgmv1FZfz — BARaju (@baraju_SuperHit) January 20, 2021 -
ప్రాజెక్ట్ ఫిక్స్?
రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్ ఏ సినిమా కమిట్ అవ్వలేదు. ‘ఆచార్య’లో నటిస్తున్నారు కానీ ఆ సినిమాకి చిరంజీవి హీరో అని తెలిసిందే. మరి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారు? అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో ఉంది. వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, తమిళ దర్శకుడు మోహన్ రాజా.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. అయితే మోహన్ రాజాతోనే చరణ్ తదుపరి సినిమా ఉంటుందని తెలిసింది. మోహన్ రాజా తెరకెక్కించిన ‘తని ఒరువన్’ని తెలుగులో ‘ధృవ’గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేశారు చరణ్. ఇప్పుడు ‘తని ఒరువన్’కి సీక్వెల్ తెరకెక్కించనున్నారు మోహన్ రాజా. చరణ్–మోహన్ రాజా చేయబోయేది ‘తని ఒరువన్’ సీక్వెలే అని టాక్. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మోహన్ రాజా మలయాళ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వేసవికి పూర్తి కానుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో చరణ్–మోహన్ రాజా సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. -
హిట్లర్ టు లూసిఫర్
‘హిట్లర్’ (1997) టు తాజా ‘లూసిఫర్’ వరకూ చిరంజీవి చాలా సినిమాలు చేశారు. వీటిలో ‘ఠాగూర్’, ‘స్టాలిన్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి తమిళ, హిందీ రీమేక్ చిత్రాలున్నాయి. కానీ మలయాళ రీమేక్ లేదు. ‘హిట్లర్’ చిత్రం మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’కి రీమేక్. ఇప్పుడు చిరంజీవి నటించనున్నæమోహన్ లాల్ మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌ని బుధవారం ప్రకటించారు. విశేషం ఏంటంటే.. చిరంజీవి ‘హిట్లర్’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ ‘హిట్లర్’ రీమేక్‌కి నిర్మాత. చిరంజీవి రాబోయే సినిమాగా ‘లూసిఫర్’ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్.వి. ప్రసాద్ నిర్మించనున్నారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మన నేటివిటీకి తగ్గట్టు ఈ స్క్రిప్టును మోహన్ రాజా బాగా న్యారేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్‌కి వెళతాం. ఏప్రిల్‌తో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు మోహన్ రాజా. ‘‘బాస్‌తో (చిరంజీవి) సినిమా అంటేనే అందరిలో కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాం’’ అన్నారు ఎన్.వి. ప్రసాద్. -
లూసీఫర్ రీమేక్‌కు తనే దర్శకుడు: చిరు
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం ఆయన స్క్రిప్టు, దర్శకుడిని ఫైనల్ చేశారు. ఓ వైపు ఆచార్య షూటింగ్ కొనసాగుతుండగానే, లూసిఫర్ రీమేక్ పనులతో బిజీ అయ్యారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. లూసీఫర్ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందని తెలిపారు. `తనిఒరువన్` (ధృవ) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘‘రీమేక్ కథ ఓకే అయ్యింది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్టాత్మక స్క్రిప్టును మోహన్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్‌కు వెళతాం. ఫిబ్రవరి-మార్చి - ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో నా 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాతో సినిమా చేయాలని వేచి చూస్తున్న చిరకాల సన్నిహితులు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది`` అని తెలిపారు. ఇక దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ-``మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ (ముత్యాల సుబ్బయ్య దర్శకుడు) చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. ‘‘ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఎన్వీ ప్రసాద్ గారు నిర్మాతగా రాజీ లేకుండా తెరకెక్కించనున్నారు`` అని తెలిపారు.(చదవండి: కాజల్- గౌతమ్‌లకు చిరంజీవి ఆశీర్వాదాలు) కాగా ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్వీ ప్రసాద్ (ఎన్వీఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ విషయం గురించి నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారి సినిమాని మోహన్ రాజా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవితో పాటుగా మా అందరికీ నచ్చేలా మార్పులు చేర్పులతో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మలిచి మోహన్ రాజా మెప్పించారు. బాస్‌తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం అందరిలో నెలకొంది. రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. ఇక ప్రఖ్యాత ఎడిటర్ మోహన్ వారసుడిగా మోహన్ రాజా సినీ అభిమానులకు సుపరిచితం. ఆయన తమిళంలో పాపులర్ డైరెక్టర్. అయిదు తెలుగు సినిమాల్ని తమిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లుగా మలిచారు. ఇక ఎడిటర్ మోహన్ నిర్మించిన `హిట్లర్` సినిమాకి ముత్యాల సుబ్బయ్య వద్ద మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే అభిమానులు భావిస్తున్నారు. తమిళంలో సంచలన విజయం సాధించిన `తని ఒరువన్` (జయం రవి హీరో) దర్శకుడిగా అతడి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ధృవ` టైటిల్‌తో తనిఒరువన్ రీమేకై తెలుగులోనూ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. -
జోడీ లేదు
సినిమా అంటే హీరో, హీరోయిన్ పక్కా. అదో లెక్క. కానీ కథను బట్టి ఈ లెక్కల్ని మార్చొచ్చు. కథ అడిగినప్పుడు హీరో లేకుండా లేదా హీరోయిన్ లేకుండా సినిమాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా చిరంజీవి కూడా హీరోయిన్ లేకుండా సినిమా చేయబోతున్నారని తెలిసింది. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం ‘లూసీఫర్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్‌లో హీరోగా చేయనున్నారు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మించనున్నారు. ఈ రీమేక్‌కు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ‘లూసీఫర్’ సినిమాలో మోహన్లాల్కి జోడీగా హీరోయిన్ పాత్ర ఉండదు. అయితే తెలుగు రీమేక్‌లో పలు మార్పులు చేశారని, హీరోయిన్ పాత్ర ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్ లేకుండానే ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆ అభ్యర్థి ఆస్తి రూ.1,76,00,00,000
తమిళనాడులోని పెరంబూరు శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జె.మోహన్‌రాజ్ అనే అభ్యర్థి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తి ఇది. అంతేకాదు. ఆయన ప్రపంచ బ్యాంకు నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్నారట. ఆ విషయం కూడా అఫిడవిట్లో స్పష్టంగా చెప్పారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి అయిన మోహన్‌రాజ్ పేర్కొన్న ఈ ఆస్తి, అప్పుల వివరాలు నమ్మశక్యంగా లేవు కదూ.. అయినా ఆయన అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం ఆమోదించడం ఆశ్చర్యకరం. తనకు గతంలో చాలా ఆస్తి ఉందని, 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన దగ్గర రూ.1,977 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 లక్షల కోట్లు అప్పు తీసుకున్నట్టు చెప్పిన మోహన్‌రాజ్ చెల్లించాల్సిన రుణాల కాలమ్‌లో ఏమీ లేవని పేర్కొనడం విశేషం. తన దగ్గర రూ.1,76,00,00,000 (176 కోట్లు) నగదు ఉందని ఆయన తెలిపారు. అయితే, ఎన్నికల అఫిడవిట్లో ఇన్ని నమ్మశక్యం కాని లెక్కలెందుకు చూపించారని అడిగితే, ఆస్తులు, అప్పులకు సంబంధించి నాయకులు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో, ఎన్నికల నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తున్నారో చెప్పడానికే తానీ పని చేశానని అంటున్నారు. ‘బడా రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలన్నీ నిజమే అయితే. నేను చెప్పినవి కూడా నిజమే’ అని ఆయన స్పష్టం చేస్తున్నారు. తన సొమ్మంతా స్విస్ బ్యాంకులో ఉందని ఆ నల్ల ధనాన్నంతా వెనక్కి తెస్తే ఆ జాబితాలో తన పేరు కూడా ఉంటుందని మోహన్‌రాజ్ ముక్తాయించారు. -
ధృవకు సీక్వెల్.. ఇద్దరితో జోడీ కడుతున్న హీరో!
సాక్షి, తమిళ సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 2.ఓ (రోబో-2), సామీ స్క్వేర్, సండైకోళీ 2 (పందెం కోడి-2) వంటి చిత్రాలు నిర్మాణంలో ఉండగా త్వరలో కమలహాసన్ హీరోగా ఇండియన్ 2, ధనుష్ హీరోగా మారి 2 తదితర చిత్రాలు తెరకెక్కడానికి రెడీ అవుతున్నాయి. ఈ వరుసలో తాజాగా తనీఒరువన్ 2 (తెలుగులో ధృవ) చేరుతోంది. జయంరవి కథానాయకుడిగా ఆయన సోదరుడు మోహన్‌రాజా దర్వకత్వంలో తెరకెక్కిన ‘తనీఒరువన్’ 2015లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో జయం రవికి నయనతార జోడీ కట్టగా.. మోడ్రన్ విలన్‌గా అరవిందస్వామి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అప్పటివరకూ రీమేక్ చిత్రాల దర్శకుడన్న ముద్ర మోస్తున్న మోహన్‌రాజా తనీఒరువన్తో దానిని బ్రేక్ చేశారు. ఈ సంచలన చిత్రానికిప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తనీఒరువన్ చిత్రానికి ప్రధాన మూలస్తంభాలు నలుగురు అని చెప్పవచ్చు. వారు హీరో జయంరవి, విలన్ అరవిందస్వామి, హీరోయిన్ నయనతార, దర్శకుడు మోహన్‌రాజా. ఈ నలుగురిలో ముగ్గురు తనీఒరవన్ సీక్వెల్లోనూ కనిపింపచనున్నారు. సీక్వెల్లోనూ నయనతార మరోసారి జయంరవితో రొమాన్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. బిజీ షెడ్యూల్లోనూ మళ్లీ జయంరవికి నయన్ ఓకే చెప్పడం విశేషమే. తొలి పార్టులో జయంరవి పోలీస్ అధికారిగా, నయనతార ఫోరెన్సిక్ నిపుణురాలుగానూ నటించగా.. రెండో పార్టులోనూ వీరు అదే పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అదనంగా సీక్వెల్లో మరో బ్యూటీ సాయోషా సైగల్ కూడా చేరనుందట. జయంరవికి జోడీగా ‘వనమగన్’ చిత్రంతో ఈ అమ్మడు కోలీవుడ్‌కు దిగుమతి అయిన తెలిసిందే. ఇప్పుడు తనీఒరువన్ సీక్వెల్లో మరోసారి ఆయనతో జోడీ కట్టబోతోంది. ఇప్పటికే సూర్యకు జంటగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న సాయేషాసైగల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తనీఒరువన్లో విలన్‌గా అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీక్వెల్లో ఆయన పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హీరోకు దీటైన విలన్‌గా అరవింద్ స్వామి అద్భుతమైన అభినయం కనబర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనీఒరువన్- 2లో హీరో, విలన్ పాత్రలను ద్విపాత్రాభినయంతో జయంరవి పోషించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. -
సూపర్ హిట్‌కి సీక్వెల్
ఆగస్ట్ 28.. ‘జయం’ రవి, అతని సోదరుడు మోహన్ రాజా జీవితంలో మరచిపోలేని రోజు. బ్లాక్ బస్టర్ మూవీ ‘తని ఒరువన్’ తెరకు వచ్చిన రోజు. ‘జయం’ రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై మంగళవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీక్వెల్ అనౌన్స్ చేశారు మోహన్ రాజా. ‘‘నా లైఫ్‌లో ‘తని ఒరువన్’ ఓ ఆశీర్వాదం. మూడేళ్లయినా ఇప్పటికీ ఆ సినిమా గురించి ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకులు అంతగా ఇష్టపడి చూసిన సినిమాకు సీక్వెల్ తీయాలని ఉంది. ఫస్ట్ పార్ట్‌లో హీరోగా నటించిన నా తమ్ముడు ‘జయం’ రవి సెకండ్ పార్ట్‌లోనూ నటిస్తాడు. ‘తని ఒరువన్’ కంటే ‘తని ఒరువన్ 2’ ఇంకా బాగుండేలా తీయడానికి ట్రై చేస్తాను’’ అని మోహన్‌రాజా పేర్కొన్నారు. కాగా ‘తని ఒరువన్’ తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. -
హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా?
తమిళ సినిమా : హీరో, దర్శకుల హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ చిత్రానికి ఉండే క్రేజే వేరు. అలాంటి కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధం అవుతోందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ చిత్రం అవుతుంది. ఇందులో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ తదుపరి చిత్రానికి దర్శకుడెవరన్న ప్రశ్న చాలా కాలంగానే ఆసక్తిగా మారింది. ఈ లిస్ట్‌లో పలు దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. చతురంగవేట్టై చిత్రం ఫేమ్ హెచ్.వినోద్ విజయ్ తదుపరి చిత్రానికి పని చేయనున్నారనే ప్రచారం జరిగింది. దర్శకుడు అట్లీ కూడా విజయ్ కోసం కథను రెడీ చేశారనే ప్రచారం తెరపైకి వచ్చినా, ఆయన తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. తాజాగా దర్శకుడు మోహన్‌రాజా పేరు వైరల్ అవుతోంది. తనీఒరువన్, వూలైక్కారన్ వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు మోహన్‌రాజా విజయ్ కోసం ఒక బలమైన ఇతివృత్తంతో కూడిన కథను రెడీ చేశారని టాక్. విజయ్ 63వ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తాజా సమాచారం. విజయ్, మోహన్‌రాజా కాంబినేషన్లో ఇంతకుముందు తెరకెక్కిన వేలా యుధం సూపర్‌హిట్ అయ్యింది. -
స్నేహ సారీ!
తమిళసినిమా: నటి స్నేహకు దర్శకుడు మోహన్‌రాజ్ సారీ చెప్పారు. ఏమిటి నమ్మశక్యంగా లేదా నటి స్నేహ ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌రాజా క్షమాపణ కోరారు. అర్థం కాలేదు కదూ! వివరంగా చెప్పాలంటే మోహన్‌రాజా తెరకెక్కించిన తాజా చిత్రం వేలైక్కారన్. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రంలో నటి స్నేహ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన వేలక్కారన్ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. మార్కెట్లో విక్రయిస్తున్న నకిలీ పోషక పదార్థాల కారణంగా బిడ్డను పోగొట్టుకున్న పాత్రలో స్నేహ నటించారు. అవి నకిలీ పదార్థాలని నిరూపించి కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకునేలా పోరాటంలో భాగంగా స్నేహ మూడు నెలల పాటు తన బిడ్డకు ఇచ్చిన ఆహార పదార్థాలనే తింటూ మరణానికి దగ్గరగా తల్లి పాత్రలో చాలా సహజంగా నటించారు. అయితే చిత్రంలో తనకు సంబంధించిన సన్నివేశాలను చాలా వరకు తొలగించారని స్నేహ చిత్ర యూనిట్‌పై ఆరోపణలు చేశారు. స్పందించిన దర్శకుడు మోహన్‌రాజా చిత్రంలో స్నేహది చాలా కీలక పాత్ర అన్నారు. చిత్రంలో స్నేహ పాత్ర 90 రోజులు సాగేలా ఉంటుందన్నారు. వేలైక్కారన్ చిత్రంలో స్నేహ పాత్రకే ముందుగా మంచి పేరు వచ్చిందని తెలిపారు. అయినా ఆమె పాత్ర విషయంలో తాము తప్పు చేశామని భావిస్తే క్షమాపణలు చెపుతున్నామని దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు. -
వేలైక్కారన్‌తో హ్యాపీ
తమిళ సినిమా: వేలైక్కారన్ చిత్రం సాధిస్తున్న వసూళ్లతో తనకు చాలా సంతోషం, సంతృప్తి కలుగుతోందని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా పేర్కొన్నారు. శివకార్తికేయన్, నయనతార జంటగా నటించిన చిత్రం వేలైక్కారన్. మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని 24ఏఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మించారు. అనిరుద్ సంగీతాన్ని అందించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ నెల 22వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్‌రాజ్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ వేలైక్కారన్ చిత్రం సాధిస్తున్న వసూళ్లు చాలా సంతృప్తిగా ఉన్నాయన్నారు. ఈ చిత్రం ఇంతకు ముందు శివకార్తికేయన్ నటించిన చిత్రాలన్నిటి కంటే అధిక వసూళ్లను సాధిస్తోందని తెలిపారు. తమిళనాడులోనే కాకుండా కర్ణాటక, కేరళ ప్రేక్షకులు వేలైక్కారన్ చిత్రానికి విశేష ఆదరణ చూపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా కేరళలో మరో 30 స్క్రీన్స్‌ను అదనంగా పెంచారని తెలిపారు. ఇక ఓవర్సీస్లో వేలైక్కారన్కు అనూహ్య ఆదరణ లభిస్తోందని చెప్పారు. వేలైక్కారన్ చిత్ర వసూళ్ల గణాంకాలను బట్టి చిత్ర విజయాన్ని ట్రేడ్ వర్గాలు ధ్రువీకరించడం ఆనందంగా ఉందని తెలి పారు. ఒక మంచి సందేశంతో కూడిన చిత్రాన్ని తాము ఎప్పుడూ ఆదరిస్తామని ప్రేక్షకులు వేలైక్కారన్ చిత్రం ద్వారా మరోసారి నిరూపించారని అన్నారు. సమాజానికి కావలసిన ఒక సందేశంతో కూడిన మంచి కమర్శియల్ చిత్రాన్ని ప్రజల్లోకి చేరినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు మోహన్‌రాజా అన్నారు. -
ఆ ఇద్దరి చిత్రం ఎప్పుడు?
శివకార్తికేయన్, నయనతార తొలిసారిగా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి వేలైకారన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు రజనీకాంత్, అమలా జంటగా నటించిన సూపర్‌హిట్ చిత్రం వచ్చిందన్నది గమనార్హం. కాగా ఈ తాజా వేలైకారన్ చిత్రాన్ని మోహన్‌రాజా దర్శకత్వంలో 24 స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కారణం శివకార్తికేయన్, నయనతారల కాంబినేషన్ ఒకటి కాగా శివకార్తికేయన్ రెమో వంటి సంచలన విజయం సాధించిన తరువాత నటిస్తున్న చిత్రం కావడం మరో కారణం. ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత తాజాగా వెల్లడించిన విషయం ఏమిటంటే వేలైకారన్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని చెప్పారు. మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. బయ్యర్ల కోరిక మేరకు వేలైకారన్ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇక చిత్ర ఫస్ట్‌లుక్‌ను జూన్ నెల 5వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
ఆ సినిమా రీమేక్ ఆగిపోయింది
అవును.. తనీఒరువన్ సినిమా రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఆగిపోయాయి. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తెలుగులో ఈ సినిమా రీమేక్ యథాతథంగా కొనసాగుతుండగా, బాలీవుడ్ రీమేక్ మాత్రం ఆగిపోయింది. సల్మాన్ హీరోగా తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్‌పై కండలవీరుడు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవటంతో ఆగిపోయింది. తమిళ్లో తనీఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తన దర్శకత్వంలోనే హిందీలో తెరకెక్కించాలని ప్రయత్నించాడు. సల్మాన్ కూడా తనీఒరువన్ రీమేక్‌లో నటించడానికి ముందు ఆసక్తిగా ఉన్నా.. తర్వాత మాత్రం కాదన్నాడు. ముఖ్యంగా కథలో ఎంటర్టైన్మెంట్ లేకపోవటం, ఇప్పట్లో సల్మాన్ డేట్స్ కూడా ఖాళీ లేకపోవటంతో ఈ రీమేక్ ఆగిపోయింది. సినిమా ఆగిపోయిన విషయాన్ని స్వయంగా ప్రకటించకపోయినా, త్వరలోనే వేరే సినిమా మొదలవుతుందంటూ దర్శకుడు మోహన్ రాజా ప్రకటించటంతో తనీఒరువన్ బాలీవుడ్ రీమేక్ ఆగిపోయిన విషయం కన్ఫమ్ అయ్యింది.