
‘హిట్లర్’ (1997) టు తాజా ‘లూసిఫర్’ వరకూ చిరంజీవి చాలా సినిమాలు చేశారు. వీటిలో ‘ఠాగూర్’, ‘స్టాలిన్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి తమిళ, హిందీ రీమేక్ చిత్రాలున్నాయి. కానీ మలయాళ రీమేక్ లేదు. ‘హిట్లర్’ చిత్రం మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’కి రీమేక్. ఇప్పుడు చిరంజీవి నటించనున్నæమోహన్ లాల్ మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌ని బుధవారం ప్రకటించారు. విశేషం ఏంటంటే.. చిరంజీవి ‘హిట్లర్’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ ‘హిట్లర్’ రీమేక్‌కి నిర్మాత.
చిరంజీవి రాబోయే సినిమాగా ‘లూసిఫర్’ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్.వి. ప్రసాద్ నిర్మించనున్నారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మన నేటివిటీకి తగ్గట్టు ఈ స్క్రిప్టును మోహన్ రాజా బాగా న్యారేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్‌కి వెళతాం. ఏప్రిల్‌తో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు మోహన్ రాజా. ‘‘బాస్‌తో (చిరంజీవి) సినిమా అంటేనే అందరిలో కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాం’’ అన్నారు ఎన్.వి. ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment