Malayalam remake
-
డీజే టిల్లు ఎఫెక్ట్: డైరెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన సిద్ధు జొన్నలగడ్డ !
Siddhu Jonnalagadda Is Put Aside Malayalam Kappela Remake Movie: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. దీంతో సిద్ధు తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇదివరకు ఒప్పుకున్న ఓ సినిమాను ఇప్పుడు చేయనని అంటున్నాడట ఈ హీరో. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'కప్పెలా' రీమెక్‌లో సిద్ధు ఓ కీలక పాత్రలో చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'డీజే టిల్లు' మూవీ నిర్మించిన అదే బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. శౌరి చంద్రశేఖర్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ను కాపాడే మరో హీరో పాత్రలో సిద్ధును సెలెక్ట్ చేశారట. ఈ రోల్ కొద్దిసేపే ఉన్న చాలా సినిమాలో చాలా ప్రభావం చూపిస్తుందట. అయితే ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో మళ్లీ ఇలాంటి పాత్రలు చేస్తే తన పాపులారిటీ తగ్గుతుందేమోనని సిద్ధు భయపడుతున్నాడని టాక్. అందుకే ఈ రీమేక్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టామని, అగ్రిమెంట్‌పై కూడా సంతకం చేసి ఎలా తప్పుకుంటాడని డైరెక్టర్ నిలదీయడంతో అతడిపై సిద్ధు కొంచెం దురుసుగా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో ఇంకా తెలియరాలేదు. చదవండి: 12 ఏళ్ల తర్వాత ఫేం వచ్చింది: డీజే టిల్లు హీరో సిద్దు చదవండి: డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మలయాళ హిట్ రీమేక్‌లో రవితేజ!
రవితేజకు ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఇచ్చే పనిలో ఉన్నారట రామ్‌చరణ్. జూనియర్ లాల్ దర్శకత్వంలో 2019లో వచ్చిన మలయాళ హిట్ మూవీ ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్‌ను హీరో రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ఈ రీమేక్‌లో వెంకటేష్, రామ్‌చరణ్‌లు నటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తారట. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది. చదవండి: 'ఆ నటుడితో డేటింగ్లో ఉన్నా.. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో' -
హిట్లర్ టు లూసిఫర్
‘హిట్లర్’ (1997) టు తాజా ‘లూసిఫర్’ వరకూ చిరంజీవి చాలా సినిమాలు చేశారు. వీటిలో ‘ఠాగూర్’, ‘స్టాలిన్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి తమిళ, హిందీ రీమేక్ చిత్రాలున్నాయి. కానీ మలయాళ రీమేక్ లేదు. ‘హిట్లర్’ చిత్రం మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’కి రీమేక్. ఇప్పుడు చిరంజీవి నటించనున్నæమోహన్ లాల్ మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌ని బుధవారం ప్రకటించారు. విశేషం ఏంటంటే.. చిరంజీవి ‘హిట్లర్’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ ‘హిట్లర్’ రీమేక్‌కి నిర్మాత. చిరంజీవి రాబోయే సినిమాగా ‘లూసిఫర్’ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్.వి. ప్రసాద్ నిర్మించనున్నారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మన నేటివిటీకి తగ్గట్టు ఈ స్క్రిప్టును మోహన్ రాజా బాగా న్యారేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్‌కి వెళతాం. ఏప్రిల్‌తో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం’’ అన్నారు మోహన్ రాజా. ‘‘బాస్‌తో (చిరంజీవి) సినిమా అంటేనే అందరిలో కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాం’’ అన్నారు ఎన్.వి. ప్రసాద్. -
కురుడన్ ట్యూన్!
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘అంధా ధున్’. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోంది. తమిళ రీమేక్‌లో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మలయాళంలోనూ రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ మలయాళ రీమేక్‌లో ఆయుష్మాన్ పాత్రను పృథ్వీరాజ్ చేయనున్నారట. ఆయుష్మాన్ సినిమాలో అంధుడిగా నటించారు. అంధుడు అంటే మలయాళంలో కురుడన్. ‘అంధా ధున్’ అంటే ‘బ్లైండ్ ట్యూన్’ అని అర్థం. సో.. మలయాళంలో ‘కురుడన్ ట్యూన్’ అన్నమాట. ఇక హిందీలో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్‌దాస్ కనిపిస్తారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. -
పవన్ కల్యాణ్.. ‘డ్రైవింగ్ లైసెన్స్’?
టాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఇప్పటికే ‘పింక్’ రిమేక్ చిత్రం ‘వకీల్ సాబ్’లో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో మలయాళ చిత్రం రిమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2019లో మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే మొన్నటివరకు ఈ చిత్రం విక్టరీ వెంకటేశ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్ర రీమేక్ హక్కులు కొన్న నిర్మాత పవన్‌తో ఈ సినిమా తీయాలని భావిస్తున్నారట. ఈ సినిమా స్టోరీ విన్న పవన్ సైతం ‘డ్రైవింగ్ లైసెన్స్’పై ఆసక్తి కనబరుస్తున్నారని టాక్. పృథ్వీరాజ్ పోషించిన పాత్రను పవన్ చేస్తారని, ఈ సినిమాలో ఉండే మరో ప్రధాన పాత్ర కోసం పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లేక వైష్ణవ్ తేజ్‌ను తీసుకోవాలని నిర్మాత ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? రీమేక్‌లో పవన్ నటిస్తాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు తీపి కబురు.. బర్త్‌డే గిఫ్ట్ సిద్ధం? ‘థాంక్యూ శేఖర్ కమ్ముల’ -
వాళ్లు చెబితే ఒప్పుకుని తీరాలి
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాను. ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, మోహన్‌లాల్ వంటి గొప్ప నటులతో నటించాను. మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్టర్‌గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. డి. సురేష్‌బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మలయాళంలో దుల్కర్సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ (2012) సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన సంగతులు. ► మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రాన్ని రెండేళ్ల క్రితం చూశాను. బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా చూడమని రామ్‌చరణ్ చెప్పారు. దర్శకుడు మారుతి, వరుణ్ తేజ్ ఇలా ఇండస్ట్రీలోని నా సన్నిహితులు కూడా ఈ సినిమా గురించి చెప్పారు. సాధారణంగా అందరూ రీమేక్ ఈజీ అంటారు కానీ అంత ఈజీ కాదు. తెలుగు కోసం కొన్ని మార్పులు చేశాం. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఒరిజినల్ సినిమాలో ఉన్నవి ఉంటాయి. సోల్‌ని మాత్రమే తీసుకున్నాం. సంజీవ్ బాగా తీశారు. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు అవి. అమ్మ ప్రేమ చాటున గారాభంగా పెరుగుతున్న అవికి అంతగా డబ్బు విలువ తెలియదు. ఆ విలువ తెలియడానికి అవి తండ్రి తనను ఇండియాకి పంపి, మధ్యతరగతి జీవితం గడిపేలా ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్‌లో అవి లైఫ్‌లో ఎలాంటి విషయాలను నేర్చుకున్నాడు అన్నదే కథ. ► నాకు, భరత్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీని చూశాం. సినిమా పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ► నేను ముంబైలో నాలుగేళ్లు ఉన్నాను. అక్కడ నేను ఆల్మోస్ట్ నార్మల్ జీవితాన్ని గడిపాను. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేసేవాణ్ణి. సినిమాలు చూడాలనుకున్నపుడు అక్కడ మార్నింగ్ షో అయితే టికెట్ రేటు తక్కువగా ఉంటుందని ఆ షోలకు వెళ్లాను. ముంబైలో నేను గడిపిన ఆ నాలుగేళ్లు నాలో చాలా మార్పు తెచ్చాయి. ఆ తర్వాత స్టడీస్ కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త తీసుకున్నాను. ► నేను ‘కొత్తజంట’ సినిమా చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్‌గారిని కలిశాను. డీసెంట్ యాక్టర్‌కి, గుడ్ యాక్టర్ తేడా ఏంటి? అన్న సంభాషణ వచ్చింది. ‘‘దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చెసేవాడు యాక్టర్. దర్శకుడు చెప్పింది చేస్తూనే ఏదో తన సొంతగా, కొత్తగా ప్రయత్నించాలని తపన పడేవాడు గుడ్ యాక్టర్’ అని చెప్పకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి సినిమాకి నేను కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► ‘ఒక్క క్షణం’ సినిమాకు బాగా కష్టపడ్డాం. ఫస్ట్ కాపీ చూసి చాలా సంతోషపడ్డాను. కానీ ప్రేక్షకుల నుంచి మేం ఆశించిన ఫలితం రాలేదు. సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల తీర్పు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకుని తీరాలి. ఆన్లైన్ ఆడియన్స్‌కు బాగానే నచ్చింది. ప్రస్తుతం రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి లవ్‌స్టోరీ. -
ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ...సాహెబా సుబ్రహ్మణ్యం
అండదండలు లేకపోతే చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టం అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. అయితే అప్పుడప్పుడు కొందరు ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా పట్టుదలతో అవకాశాల్ని అందుకొంటుంటారు. ప్రతిభ ఉంటే చాలు.. ఎవరి అండ లేకపోయినా నెగ్గుకురావచ్చు అని నిరూపిస్తుంటారు. ఆ జాబితాలో మరో కథానాయకుడు చేరాడు. అతని పేరు.. దిలీప్‌కుమార్. చిన్నప్పట్నుంచీ సినిమా కలలు కన్నాడు. ఎప్పటికయినా వెండితెరపై తనను తాను చూసుకోవాలనుకొన్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసి... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం అందుకొన్నాడు. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. నాగేశ్వరరావు కొల్లా నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కథానాయకుడు దిలీప్‌కుమార్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివీ... మలయాళం సినిమా రీమేక్ హక్కుల్ని నేనే వెళ్లి కొనుక్కొచ్చా... ‘‘విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బిఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్) చేశాను. సినిమా అంటే ఇష్టం కాబట్టే ఆ కోర్సు ఎంచుకొన్నాను. డిగ్రీలో సినిమాపై అన్నపూర్ణ స్టూడియోలో ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలు నటుడు కావాలన్న కోరికను నాలో మరింతగా పెంచాయి. డిగ్రీ పూర్తయ్యాక అనుకోకుండా నిర్మాత కొల్లా నాగేశ్వరరావు ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఆయనకి కూడా సినిమా అంటే చాలా ప్రేమ. మేమిద్దరం సినిమా గురించి మాట్లాడుకొనేవాళ్లం. ‘డిగ్రీ అయ్యాక ఏం చేయాలనుకొంటున్నావు’ అని ఆయన అడిగితే.. నేను పీజీ చేయాలనుకొంటున్నాను కానీ, డబ్బులు లేవు’ అని చెప్పాను. ఆయన సాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. ‘నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి నటన వైపు దృష్టి పెడతా’ అన్నా. అదేదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా అన్నారు. ఆయనకి కూడా సినిమా తీయాలనే ఆసక్తి ఉండటంతో మేమిద్దరం మాట్లాడుకొని మలయాళంలో విజయవంతమైన ‘తట్టాత్తిన్ మరయతు’ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. ఆ సినిమా రీమేక్ హక్కుల్ని కూడా నేనే వెళ్లి కొనుక్కొచ్చా. ఒక కథానాయకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అన్నీ నేనే దగ్గరుండి చూసుకొన్నాను.’’ అందరికీ చేరువవుతాననే నమ్మకం ఉంది ‘‘ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. సంగీతానికి ప్రాధాన్యముంది. సుబ్రహ్మణ్య శాస్త్రి అనే కుర్రాడికీ, ఆయేషా అనే అమ్మాయికీ మధ్య పరిచయం అవడం, ప్రేమ పుట్టడం, ప్రేమించుకొన్న తర్వాత వాళ్లిద్దరి మనసుల్లో కనిపించే భావోద్వేగాలు... ఇవన్నీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణం విషయంలోనూ బాధ్యతలు తీసుకోవాల్సి రావడంతో సినిమా ఆరంభమైన తర్వాత కొన్ని రోజులు నటించేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఆ తర్వాత మాత్రం పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాను. సినిమా గురించి తెలిసినా... నటనలో మాత్రం నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. సుబ్రహ్మణ్యం పాత్రతో అందరికీ చేరువవుతాననే నమ్మకం నాకుంది.’’ ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో! ‘‘నా అభిరుచికి తగ్గట్టుగా, నాకు నప్పుతుందనుకున్న కథని, నేనే ఎంచుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో. నాకు నచ్చిన కథ కావడంతో పాత్రలో తొందరగా ఇమిడిపోయాను. రావు రమేష్గారితో పాటు పలువురు సీనియర్ నటీనటులతో కలిసి నటించడం చక్కటి అనుభవం. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో నటించడం మంచి అనుభూతినిచ్చింది. దర్శకత్వం చేయడం ఆమెకీ కొత్తే అయినా... అనుభవం ఉన్న దర్శకురాలిగా చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న వయసులో కథానాయకుడు ఆయ్యాను కాబట్టి మరిన్ని ప్రేమకథలు చేయాలనుకొంటున్నాను. తదుపరి కూడా ఇదే సంస్థలో ఓ ప్రేమకథలో నటిస్తా.’’