పవన్‌ కల్యాణ్‌.. ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’? | Pawan Kalyan Interesting On Malayalam Movie Driving Licence | Sakshi
Sakshi News home page

మలయాళ రీమేక్‌లో పవర్‌స్టార్‌?

Published Thu, May 14 2020 12:19 PM | Last Updated on Thu, May 14 2020 1:07 PM

Pawan Kalyan Interesting On Malayalam Movie Driving Licence - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రీమేక్‌ చిత్రాలు షూటింగ్‌ దశలో ఉండగా మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఇప్పటికే ‘పింక్‌’ రిమేక్‌ చిత్రం ‘వకీల్‌ సాబ్‌’లో నటిస్తున్న పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మరో మలయాళ చిత్రం రిమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2019లో మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

అయితే మొన్నటివరకు ఈ చిత్రం విక్టరీ వెంకటేశ్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్ర రీమేక్‌ హక్కులు కొన్న నిర్మాత పవన్‌తో ఈ సినిమా తీయాలని భావిస్తున్నారట. ఈ సినిమా స్టోరీ విన్న పవన్‌ సైతం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’పై ఆసక్తి కనబరుస్తున్నారని టాక్‌.  పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను పవన్‌ చేస్తారని, ఈ సినిమాలో ఉండే మరో ప్రధాన పాత్ర కోసం పవన్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ లేక వైష్ణవ్‌ తేజ్‌ను తీసుకోవాలని నిర్మాత ఆలోచిస్తున్నారట. అయితే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? రీమేక్‌లో పవన్‌ నటిస్తాడా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. 

చదవండి:
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు తీపి కబురు.. బర్త్‌డే గిఫ్ట్‌ సిద్ధం?
‘థాంక్యూ శేఖర్‌ కమ్ముల’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement