
మమతా మోహన్‌దాస్, పృథ్వీరాజ్
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘అంధా ధున్’. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోంది. తమిళ రీమేక్‌లో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మలయాళంలోనూ రీమేక్ కాబోతోందని తెలిసింది.
ఈ మలయాళ రీమేక్‌లో ఆయుష్మాన్ పాత్రను పృథ్వీరాజ్ చేయనున్నారట. ఆయుష్మాన్ సినిమాలో అంధుడిగా నటించారు. అంధుడు అంటే మలయాళంలో కురుడన్. ‘అంధా ధున్’ అంటే ‘బ్లైండ్ ట్యూన్’ అని అర్థం. సో.. మలయాళంలో ‘కురుడన్ ట్యూన్’ అన్నమాట. ఇక హిందీలో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్‌దాస్ కనిపిస్తారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment