MAMATHA MOHAN DAS
-
రుద్రంగి విజయంతో హ్యాపీ
‘‘రుద్రంగి’ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ‘‘థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు మాకు ఇంకా స΄ోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అని ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆశిష్ గాంధీ అన్నారు. -
Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్, మల్లేష్‌గా ఆశిష్ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
రాజమౌళి అలా అనడంతో నా గుండె పగిలింది: హీరోయిన్
తెలుగులో తొలి చిత్రం 'యమదొంగ'తో బాగా పాపులర్ అయిన హీరోయిన్ మమతా మోహన్‌దాస్ 2010, 13లో రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని కోలుకుంది. ఇటీవలే చర్మం రంగు మారడం అనే విటిలిగో వ్యాధి బారిన పడగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఓపక్క అనారోగ్యంతో పోరాడుతూనే మరోపక్క సినిమాలు చేస్తూ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. కాగా గతంలో మమత సూపర్ హిట్ మూవీ 'అరుంధతి'ని చేజార్చుకున్న విషయం తెలిసిందే! తాజాగా తాను చేసిన పొరపాటు గురించి ఓ ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడిందీ నటి. 'రాజమౌళి సర్ నాకు ఫోన్ చేసి యమదొంగ చేయమని అడిగారు. దానికంటే ముందే శ్యామ్ ప్రసాద్ అరుంధతి ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకు సంతకం చేశాను. కానీ ఆ ప్రొడక్షన్ మంచిది కాదని మేనేజర్ చెప్పారు. నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు కాబట్టి వెనకడుగు వేశాను. శ్యామ్ ప్రసాద్ గారు రెండు, మూడు నెలలపాటు అడిగారు.. కానీ నేను మాత్రం కుదరదన్నాను. దీని గురించి రాజమౌళి సర్ మాట్లాడుతూ.. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది. వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావన్నారు. ఆయన అలా అనడంతో నా గుండె పగిలిపోయినట్లయింది. అప్పటికి ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు' అని చెప్పుకొచ్చింది మమతా మోహన్‌దాస్. చదవండి: మరణానికి ముందు శ్రీదేవి ఎలా ఉందంటే? చివరి ఫోటో వైరల్ -
అరుదైన వ్యాధి.. ఈ పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు
సమంతకు ‘మయోసైటిస్’.. పూనమ్ కౌర్‌కి ‘ఫైబ్రోమయాల్జియా’.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంగళవారం నాడు మమతా మోహన్‌దాస్ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘ఈ కష్టాన్నీ దాటేస్తాను’ అనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. ఇక సమంత తన అనారోగ్యం గురించి చెప్పినప్పుడు ‘నాలానే ఎంతోమంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’ అన్నారు. ఇదే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచిన పూనమ్, మమతా.. ఈ మధ్యకాలంలో తమ అనారోగ్యం గురించి పేర్కొన్న కొందరు తారల గురించి తెలుసుకుందాం. గత ఏడాది అక్టోబర్‌లో సమంత తాను మయోసైటిస్ వ్యాధి (ఎక్కువ పని చేయలేకపోవడం, కండరాల నొప్పి, త్వరగా అలసిపోవడం వంటివి)తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రి బెడ్‌పై ఉండి ఆమె ‘యశోద’ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కూడా. ‘‘జీవితంలో మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో (మయోసైటిస్‌ని ఉద్దేశించి) ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతదూరం వచ్చానా అనిపించింది. అందుకే పోరాడతా. నాలానే చాలామంది పోరాడుతున్నారు. మేం గెలుస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఇక సమంత తనకు మయోసైటిస్ అని ప్రకటించిన తర్వాత పియా బాజ్‌పాయ్ (‘రంగం’ సినిమా ఫేమ్) కూడా గతంలో తాను ఇదే వ్యాధితో బాధపడ్డాననే విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇంట్లోవాళ్లు భయపడతారని తనకు మయోసైటిస్ అనే విషయాన్ని చెప్పలేదన్నారు పియా. కుటుంబ సభ్యులతో ఢిల్లీలో ఉంటున్న పియా వ్యాధి చికిత్స నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నాక చెప్పానని పియా పేర్కొన్నారు. ఇటీవల ‘లాస్ట్’ అనే హిందీ చిత్రంలో నటించారామె. ఇక సమంత తన అనారోగ్యం విషయం బయటపెట్టిన రెండు నెలలకు డిసెంబర్లో పూనమ్ కౌర్ తనకు ‘ఫైబ్రోమయాల్జియా’ అనే విషయాన్ని బయటపెట్టారు. కండరాల నొప్పి, అలసట, నిద్రలేమితో ఈ వ్యాధి బాధపెడుతుంటుంది. రెండేళ్లుగా ఈ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు తెలిపారు పూనమ్. కేరళలో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టిన ఆమె త్వరలోనే కోలుకుంటానని ఈ వ్యాధి గురించి ప్రకటించినప్పుడు తెలిపారు. మరోవైపు గత ఏడాది నవంబర్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తాను ‘ఎపిలెప్సీ’ (మూర్ఛ రోగం)తో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే తన వ్యాధి విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా ఉంచడానికి కారణం ఇతరులు తనను బలహీనురాలు అనుకోకూడదని, ఒకవేళ అందరికీ తెలిస్తే తనకు పని ఇవ్వడానికి వెనకాడతారనే భయాలే అని పేర్కొన్నారు ఫాతిమా. కానీ ఇప్పుడు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తన విషయం బయటపెట్టానని స్పష్టం చేశారు. ‘‘నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మా యూనిట్లో ఒకరికి మూర్ఛ వచ్చింది. నేను ఆ వ్యక్తికి సహాయం చేశాను. నాకలా జరిగినప్పుడు ఇతరుల సహాయం కావాలి. అయితే ఇదేం తప్పు కాదు... దాచేయడానికి. అందుకే చెప్పాలనుకున్నాను. నా నిర్మాతలకు నా పరిస్థితి చెబుతుంటాను. లొకేషన్లో నాకు మూర్ఛ వచ్చిన సందర్భాలున్నాయి. ఆ టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే చెప్పడం హెల్ప్ అయింది’’ అన్నారు ఫాతిమా. ఆమిర్ ఖాన్ కూతురుగా ‘దంగల్’లో ఫాతిమా మల్ల యోధురాలుగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు ఫాతిమా. ఇక 2010లో మమతా మోహన్‌దాస్ కేన్సర్ బారిన పడ్డారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పి, ధైర్యంగా చికిత్స చేయించుకున్నారామె. కేన్సర్‌పై అవగాహన కలిగించడానికి పలు విషయాలను పంచుకున్నారు కూడా. అయితే 2013లో మళ్లీ కేన్సర్ అని తెలిసినప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకుని, కోలుకున్నారు. ఇప్పుడు మంగళవారం (17.01.) నాడు తాను చర్మ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని పంచుకున్నారు మమతా మోహన్‌దాస్. ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధి సోకిందని పేర్కొన్నారామె. చర్మంపై మచ్చలు, చర్మం రంగు మారడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. ఇంకా ‘‘ప్రియమైన సూర్యుడా.. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాను. నా చర్మం రంగుని కోల్పోతున్నాను. నువ్వు ఉదయించక ముందే నీకోసం నేను నిద్రలేచి పొగమంచులో నీ తొలి కిరణాన్ని చూడటానికి వేచి చూస్తున్నాను. నీ వెచ్చదనాన్నంతా నాకు ఇచ్చెయ్. ఎందుకంటే నాకు అది ఎంతో మేలు చేస్తుంది. అందుకే నీకెప్పటికీ రుణపడి ఉంటాను’’ అని మమతా మోహన్‌దాస్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ‘మీరు పెద్దవే దాటి వచ్చారు. ఇది చిన్న విషయం. ఇందులోంచీ బయటపడతారు’ అని ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అనారోగ్యం అనే విషయాన్ని బయటపెట్టడానికి ధైర్యం కావాలి. దాన్ని ఎదుర్కొని, కోలుకోవడానికి ఇంకా ధైర్యం కావాలి. ఈ చాలెంజ్‌లో ‘గెలుపు ఖాయం’ అని నమ్మడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్స్ నిజమైన ‘స్టార్స్’. -
కురుడన్ ట్యూన్!
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘అంధా ధున్’. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోంది. తమిళ రీమేక్‌లో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మలయాళంలోనూ రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ మలయాళ రీమేక్‌లో ఆయుష్మాన్ పాత్రను పృథ్వీరాజ్ చేయనున్నారట. ఆయుష్మాన్ సినిమాలో అంధుడిగా నటించారు. అంధుడు అంటే మలయాళంలో కురుడన్. ‘అంధా ధున్’ అంటే ‘బ్లైండ్ ట్యూన్’ అని అర్థం. సో.. మలయాళంలో ‘కురుడన్ ట్యూన్’ అన్నమాట. ఇక హిందీలో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్‌దాస్ కనిపిస్తారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. -
నన్ను నేను తెలుసుకుంటున్నాను!
‘రాఖీ రాఖీ రాఖీ.. నా కవ్వాసాకీ...’ అంటూ ‘రాఖీ’లో పాడిన పాట ద్వారా తెలుగు సినిమాకి పరిచయమయ్యారు మమతా మోహన్‌దాస్. ముందు తన గొంతును పరిచయం చేసి, తర్వాత తనలోని నటిని ‘యమదొంగ’ ద్వారా తెలుగుకి చూపించారు. మమతామో హన్ దాస్ సినిమాల్లోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయింది. 2005లో చేసిన మలయాళ చిత్రం ‘మయూకం’ ద్వారా హీరోయిన్ అయ్యారామె. ఈ పదిహేనేళ్ల ప్రయాణం గురించి మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ – ‘‘2004లో దీపావళి బ్రేక్‌లో సరదాగా చేసిన ఓ పని (నటన) నా జీవితం అయిపోతుంది అనుకోలేదు. పదిహేనేళ్ల పాటు ఈ ఇండస్ట్రీలోనే కొనసాగుతానని అప్పుడు అనుకోనేలేదు. నాలో ఇందిర (‘మయూకం’లో ఆమె పాత్ర పేరు)ను చూసిన హరిహరన్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాతో నిలబడ్డ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మ్యూజిక్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ (‘రాఖీ’కి దేవి సంగీతదర్శకుడు)గారికి, నన్ను నమ్మిన నిర్మాతలకు, అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో ఎన్నో చాలెంజ్‌లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ దాటుతూ నన్ను నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాను’’ అన్నారు. ఇటీవలే ఆమె నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. మలయాళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మిస్తున్నారు మమతా మోహన్‌దాస్. -
యాక్టర్ టు ప్రొడ్యూసర్
‘రాఖీ, యమదొంగ, కింగ్’ తదితర సినిమాల్లో హీరోయిన్గా తెలుగు ఆడియన్స్‌కి మమతా మోహన్‌దాస్ పరిచయమే. ‘రాఖీ’ సినిమాకి పాడిన ‘రాఖీ రాఖీ రాఖీ..’, ‘శంకర్‌దాదా జిందాబాద్’కి పాడిన ‘ఆకలేస్తే అన్నం పెడ్తా’, ‘యమదొంగ’కి పాడిన ‘ఓలమ్మీ తిక్కరేగిందా..’ తదితర పాటల ద్వారా గాయనిగానూ ఆమె మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారామె. తాజాగా నిర్మాతగా మారారు. మమతా మోహన్‌దాస్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. ఈ విషయం గురించి మమతా మోహన్‌దాస్ మాట్లాడుతూ – ‘‘నిర్మాణంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. కల నిజం అవుతున్నట్టుంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంత ఆదరించిన ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలనే ఆలోచన నుంచే ఈ నిర్మాణ సంస్థను స్థాపించాను’’ అన్నారు. తొలి ప్రయత్నంగా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కించనున్నారట. -
స్క్రీన్ టెస్ట్
► ఈ నలుగురు హీరోల్లో అక్టోబర్ 23న పుట్టిన హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ప్రభాస్ బి) యన్టీఆర్ సి) మహేశ్‌బాబు డి) రామ్‌చరణ్ ► ‘వర్షం’ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘నువ్వొస్తానంటే నే వద్దంటానా...’ పాడిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) గీతా మాధురి సి) సునీత డి) కేయస్ చిత్ర ► రామ్‌చరణ్–బోయపాటి సినిమాలో ఓ బాలీవుడ్ కథానాయకుడు విలన్‌గా నటిస్తున్నాడు. ఎవరా హీరో? ఎ) జాకీ ష్రాఫ్ బి) సైఫ్ అలీఖాన్ సి) వివేక్ ఒబెరాయ్ డి) షాహిద్ కపూర్ ► నాని గతంలో చాలామంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఓ పెద్ద హీరోతో కలిసి నటిస్తున్నాడు. ఎవరా పెద్ద హీరో? ఎ) బాలకృష్ణ బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) రవితేజ ► ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో యన్టీఆర్ మరదలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) హన్సిక సి) సమంత డి) కృతీ సనన్ ► ‘మక్కల్ నీది మయమ్’ అనే తమిళ పార్టీని ఓ ప్రముఖ నటుడు స్థాపించారు. ఆయనెవరు? ఎ) కమల్ హాసన్ బి) శరత్‌కుమార్ సి) విజయ్‌కాంత్ డి) విశాల్ ► యన్టీఆర్ నటించిన ‘బొబ్బిలి పులి’ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) జయసుధ బి) సుజాత సి) శ్రీదేవి డి) జయప్రద ► శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ మొదట హీరో కాదు. అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఏ దర్శకుని శిష్యుడో తెలుసా? ఎ) బాపు బి) బాలచందర్ సి) భారతీరాజా డి) మణిరత్నం ► ట్వీటర్ ఖాతాలో తన ఖాతాదారుల సంఖ్య 70 లక్షలకు చేరుకున్న సందర్భంగా తన లక్కీ నంబర్ ‘7’ అని ఈ మధ్యే ఓ ప్రముఖ హీరోయిన్ చెప్పింది. ఎవరయ్యుంటారబ్బా? ఎ) శ్రుతీహాసన్ బి) తమన్నా సి) కాజల్ అగర్వాల్ డి) మెహరీన్ ► తమిళ దర్శకుడు ఏయల్ విజయ్ (‘నాన్న’ ఫేమ్)ని ఈ బ్యూటీ ప్రేమించి, పెళ్లాడింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆమె ఎవరు? ఎ) మమతా మోహన్‌దాస్ బి) అమలాపాల్ సి) మంజు వారియర్ డి) సౌందర్య రజనీకాంత్ ► ‘నా పాట నీ నోట పలకాల సిలక...’ అంటూ ‘మూగమనసులు’ చిత్రంలో అక్కినేని ఓ హీరోయిన్‌కి పాట పాడటంలో శిక్షణ ఇస్తాడు. ఎవరామె? ఎ) జమున బి) అంజలీ దేవి సి) కృష్ణకుమారి డి) సావిత్రి ► ‘మోసగాళ్లకు మోసగాడు’ కౌబాయ్ సినిమా. ఈ సినిమా కృష్ణ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) కోడి రామకృష్ణ బి) కేయస్సార్ దాస్ సి) పీసీ రెడ్డి డి) బి. గోపాల్ ► ‘జననీ జన్మ భూమిశ్ఛ స్వర్గాదపీ గరీయసీ..’ అనే పాట ర^è యిత ఎవరో కనుక్కోండి? ఎ) వేటూరి సుందరామ్మూర్తి బి) సిరివెన్నెల సి) సముద్రాల డి) దాసరి నారాయణరావు ► ‘పెదరాయుడు’ సినిమాలో పాపారాయుడు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) రజనీకాంత్ బి) మోహన్‌బాబు సి) శ్రీహరి డి) బ్రహ్మానందం ► అనుష్కను మొదటిసారి తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) క్రిష్ జాగర్లమూడి బి) పూరి జగన్నాథ్ సి) గుణశేఖర్ డి) కోడి రామకృష్ణ ► ‘ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది’ అనే పాట ‘వేదం’ చిత్రంలోనిది. ఆ సినిమాకు పాటలు స్వరపరిచింది ఎవరో తెలుసా? ఎ) కల్యాణ రమణ బి) యం.యం. శ్రీలేఖ సి) మణిశర్మ డి) యం.యం. కీరవాణి ► సీతారామ్ చౌదరి పోతినేని అనేది ఈ హీరో అసలు పేరు. ఆ హీరో ఎవరు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) శ్రీరామ్ డి) శ్రీకాంత్ ► ‘నీ స్నేహితుడెవరో తెలిస్తే నీ కేరక్టర్ తెలుస్తుంది... నీ శత్రువెవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది’ అని హీరో రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ఏ సినిమా లోనిదో కనుక్కోండి? ఎ) మగధీర బి) ఆరెంజ్ సి) గోవిందుడు అందరి వాడేలే డి) ధృవ ► ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరు? ఎ) నాగార్జున బి) సుమంత్ సి) నాగచైతన్య డి) సుశాంత్ ► జయప్రద నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) సాగర సంగమం బి) సిరివెన్నెల సి) అంతులేని కథ డి) సీతా కల్యాణం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4) బి 5) సి 6) ఎ 7) సి 8) డి 9) ఎ 10) బి 11) డి 12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) డి 19) ఎ 20) సి -
ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు : ఎన్. శంకర్
జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఎన్. శంకర్ త్వరలో 2 కంట్రీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ సినిమా 2 కంట్రీస్ ను అదే పేరుతో తెలుగులో స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఇన్నాళ్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేశా.. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా చేశా. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది. 2 కంట్రీస్ మలయాళ చిత్ర టీం నాకు మంచి మిత్రులు. వారే నేను ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు. షారూఖ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమా గురించి స్పందించటంతో నాకు ఆసక్తి కలిగింది. అందుకే నేనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. దాదాపు 40 మంది 40 రోజుల పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. చాలా కొత్త లొకేషన్లలో సినిమాలు తెరకెక్కించాం. సినిమా చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది. ముఖ్యంగా రామ్ ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫి కారణంగా సినిమాకు రిచ్ లుక్ వచ్చింది. మలయాళంలో ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నా.. గోపిసుందర్ టైం ఇచ్చి ఈ సినిమాకు పని చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. రీ రికార్డింగ్ చేసిన తరువాత చూసిన ఒరిజినల్ వర్షన్ దర్శక నిర్మాతలు సినిమా ఘనవిజయం సాధిస్తుందన్నారు. మలయాళ వర్షన్ కంటే తెలుగు 2 కంట్రీస్ బాగుంటుంది. సునీల్ బాడీ లాంగ్వేజ్, ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ ఇది. మలయాళంలో మమతా మోహన్ దాస్ హీరోయిన్ చేశారు. తెలుగులో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని సంప్రదించాం. కానీ ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు.. కొంత మంది డేట్స్ లేవన్నారు. తరువాత అమెరికాలో పుట్టి పెరిగిన మనీషా రాజ్ ను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాం. తొలి సినిమానే అయినా హావభావాల్లో సునీల్ ని డామినేట్ చేసింది మనీషా. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని తెలిపారు. -
నందికొండ వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో...
జస్ట్... ఈ పాట ఒక్కటే తక్కువ. అక్కడ ఎవరైనా పాడితే మాత్రం... మమతా మోహన్‌దాస్ సిచ్యువేషన్‌కి సరిగ్గా సూటవుతుంది! ఇప్పుడు వాగులు–వంకలు... కొండలు–కోనలు... వెంట మమతా మోహన్‌దాస్ ప్రయాణం సాగుతోంది. ఎందుకంటే... మాతృభాష మలయాళంలో ‘కార్బన్’ అనే సినిమాలో నటిస్తున్నారీ బ్యూటీ. ఇందులో ఫాహద్ ఫాజిల్ హీరో. ఫారెస్ట్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ కోసం కేరళలోని అడవులన్నిటినీ చుట్టేస్తోంది చిత్రబృందం. ‘గీతాంజలి’లో ‘నందికోండ వాగుల్లో...’ పాటది హారర్ కాన్సెప్ట్. ‘కార్బన్’ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో గానీ... షూటింగులో హీరోయిన్ కంపల్సరీగా ఉండాలి కదా! అఫ్కోర్స్... యూనిట్ మెంబర్స్ నీడలా మమత వెంటే నడుస్తూ జాగ్రత్తగా చూసుకుంటారనుకోండి. ఎంతైనా... అడవుల్లో అడుగులేయడమంటే ఎంతోకొంత భయం ఉంటుంది కదా! తెలుగులో ఎన్టీఆర్ ‘యమదొంగ’, వెంకటేశ్ ‘చింతకాయల రవి’, నాగార్జున ‘కింగ్’ తదితర చిత్రాల్లో నటించిన మమతా మోహన్‌దాస్, క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఎక్కువగా మలయాళ సినిమాలే చేస్తున్నారు. -
క్యాన్సర్...అయినా డోంట్ కేర్
క్యాన్సర్ బారిన పడిన నటి మమతామోహన్‌దాస్ దాన్ని నుంచి బయటపడడానికి పోరాడుతూనే మరోపక్క నటిగా రాణిస్తున్నారు. కోలీవుడ్‌లో శివప్పధికారం, తడయారతాక్క, గురు ఎన్ ఆళు తదితర చిత్రాల్లో నటించిన మమతా టాలీవుడ్‌లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈమె మంచి గాయని కూడా. గత ఏడాది క్యాన్సర్ వ్యాధికి గురైన మమతామోహన్ దాస్ కీమో థెరపీ చేయించుకున్నారు. దీంతో జుట్టు అంతా రాలిపోయి నటనకు దూరమయ్యారు. చికి త్స అనంతరం కోలుకుని మళ్లీ నటనకు సిద్ధమైన మమతకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రజిత్ నుంచి విడాకులంటూ మరో షాక్ తగిలింది. అయినా మనోధైర్యంతో దాన్ని ఎదుర్కొన్నారు. మల యాళంలో సెల్యులాయిడ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ముసాబీర్, పైసా పైసా చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈమెకు క్యాన్సర్ తిరగబెట్టింది. చికిత్స కోసం మళ్లీ నట నకు దూరమయ్యారు. ప్రస్తుతం కాస్త కోలుకోవడంతో ఒక పక్క నటించడానికి సిద్ధమయ్యారు. ఆమె ఇప్పుడు డునూర్ విత్ లవ్ అనే మల యాళ చిత్రంలో నటిస్తున్నారు. క్యాన్సర్ అంటూ చింతిస్తూ కూర్చొంటే అది పోతుందా? అందుకే మమత క్యాన్సర్ అయినా డోంట్ కేర్ అంటూ దూసుకుపోతోంది.