స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Apr 6 2018 12:08 AM | Last Updated on Fri, Apr 6 2018 12:08 AM

tollywood movies special screen test - Sakshi

► ఈ నలుగురు హీరోల్లో అక్టోబర్‌ 23న పుట్టిన  హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) ప్రభాస్‌    బి) యన్టీఆర్‌   సి) మహేశ్‌బాబు  డి) రామ్‌చరణ్‌

► ‘వర్షం’ సినిమాలో ఫేమస్‌ సాంగ్‌ ‘నువ్వొస్తానంటే నే వద్దంటానా...’ పాడిన సింగర్‌ ఎవరో తెలుసా?
ఎ) కౌసల్య బి) గీతా మాధురి సి) సునీత డి) కేయస్‌ చిత్ర

► రామ్‌చరణ్‌–బోయపాటి సినిమాలో ఓ బాలీవుడ్‌ కథానాయకుడు విలన్‌గా నటిస్తున్నాడు. ఎవరా హీరో?
ఎ) జాకీ ష్రాఫ్‌  బి) సైఫ్‌ అలీఖాన్‌ సి) వివేక్‌ ఒబెరాయ్‌ డి) షాహిద్‌ కపూర్‌

► నాని గతంలో చాలామంది హీరోలతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఓ పెద్ద హీరోతో కలిసి నటిస్తున్నాడు. ఎవరా పెద్ద హీరో?
ఎ) బాలకృష్ణ    బి) నాగార్జున   సి) వెంకటేశ్‌     డి) రవితేజ

► ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో యన్టీఆర్‌ మరదలిగా నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) నిత్యామీనన్‌  బి) హన్సిక   సి) సమంత   డి) కృతీ సనన్‌

► ‘మక్కల్‌ నీది మయమ్‌’ అనే తమిళ పార్టీని ఓ ప్రముఖ నటుడు స్థాపించారు.  ఆయనెవరు?
ఎ) కమల్‌ హాసన్‌  బి) శరత్‌కుమార్‌   సి) విజయ్‌కాంత్‌  డి) విశాల్‌

► యన్టీఆర్‌ నటించిన ‘బొబ్బిలి పులి’   చిత్రంలో హీరోయిన్‌ ఎవరు?
ఎ) జయసుధ బి) సుజాత   సి) శ్రీదేవి డి) జయప్రద

► శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన  ‘బాయ్స్‌’ సినిమా ద్వారా హీరోగా  పరిచయమైన సిద్ధార్థ్‌ మొదట హీరో  కాదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌.  ఆయన ఏ దర్శకుని శిష్యుడో తెలుసా?
ఎ) బాపు    బి) బాలచందర్‌   సి) భారతీరాజా    డి) మణిరత్నం

► ట్వీటర్‌ ఖాతాలో తన ఖాతాదారుల సంఖ్య 70 లక్షలకు చేరుకున్న సందర్భంగా తన  లక్కీ నంబర్‌ ‘7’ అని ఈ మధ్యే ఓ ప్రముఖ హీరోయిన్‌ చెప్పింది. ఎవరయ్యుంటారబ్బా?
ఎ) శ్రుతీహాసన్‌ బి) తమన్నా సి) కాజల్‌ అగర్వాల్‌   డి) మెహరీన్‌

► తమిళ దర్శకుడు ఏయల్‌ విజయ్‌ (‘నాన్న’ ఫేమ్‌)ని ఈ బ్యూటీ ప్రేమించి, పెళ్లాడింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆమె ఎవరు?
ఎ) మమతా మోహన్‌దాస్‌  బి) అమలాపాల్‌   సి) మంజు వారియర్‌  డి) సౌందర్య రజనీకాంత్‌

► ‘నా పాట నీ నోట పలకాల సిలక...’ అంటూ ‘మూగమనసులు’ చిత్రంలో అక్కినేని ఓ హీరోయిన్‌కి పాట పాడటంలో శిక్షణ ఇస్తాడు. ఎవరామె?
ఎ) జమున    బి) అంజలీ దేవి సి) కృష్ణకుమారి    డి) సావిత్రి

► ‘మోసగాళ్లకు మోసగాడు’  కౌబాయ్‌ సినిమా. ఈ సినిమా కృష్ణ  కెరీర్‌లోనే ట్రెండ్‌ సెట్టర్‌. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా?
ఎ) కోడి రామకృష్ణ    బి) కేయస్సార్‌ దాస్‌   సి) పీసీ రెడ్డి    డి) బి. గోపాల్‌

► ‘జననీ జన్మ భూమిశ్ఛ స్వర్గాదపీ గరీయసీ..’  అనే పాట ర^è యిత ఎవరో కనుక్కోండి?
ఎ) వేటూరి సుందరామ్మూర్తి బి) సిరివెన్నెల  సి) సముద్రాల    డి) దాసరి నారాయణరావు

► ‘పెదరాయుడు’ సినిమాలో  పాపారాయుడు పాత్రను పోషించిన  నటుడెవరో తెలుసా?
ఎ) రజనీకాంత్‌   బి) మోహన్‌బాబు   సి) శ్రీహరి   డి) బ్రహ్మానందం
 

► అనుష్కను మొదటిసారి తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) క్రిష్‌ జాగర్లమూడి    బి) పూరి జగన్నాథ్‌    సి) గుణశేఖర్‌    డి) కోడి రామకృష్ణ

► ‘ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది’ అనే పాట ‘వేదం’ చిత్రంలోనిది. ఆ సినిమాకు పాటలు  స్వరపరిచింది ఎవరో తెలుసా?
ఎ) కల్యాణ రమణ బి) యం.యం. శ్రీలేఖ   సి) మణిశర్మ     డి) యం.యం. కీరవాణి

► సీతారామ్‌ చౌదరి పోతినేని అనేది ఈ హీరో అసలు పేరు. ఆ హీరో ఎవరు?
ఎ) రామ్‌   బి) శర్వానంద్‌    సి) శ్రీరామ్‌ డి) శ్రీకాంత్‌

►   ‘నీ స్నేహితుడెవరో తెలిస్తే నీ కేరక్టర్‌ తెలుస్తుంది... నీ శత్రువెవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది’ అని హీరో రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ఏ సినిమా లోనిదో కనుక్కోండి?
ఎ) మగధీర బి) ఆరెంజ్‌    సి) గోవిందుడు అందరి వాడేలే   డి) ధృవ

► ఈ ఫొటోలో  కనిపిస్తున్న హీరో ఎవరు?
ఎ) నాగార్జున  బి) సుమంత్‌  సి) నాగచైతన్య  డి) సుశాంత్‌

► జయప్రద నటించిన ఈ స్టిల్‌ ఏ  సినిమాలోనిదో తెలుసా?
ఎ) సాగర సంగమం  బి) సిరివెన్నెల  సి) అంతులేని కథ  డి) సీతా కల్యాణం

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) డి 3) సి 4) బి 5) సి 6) ఎ 7) సి 8) డి 9) ఎ 10) బి

11) డి 12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) డి 19)  ఎ 20) సి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement