Hansika.
-
స్క్రీన్ టెస్ట్
► ఈ నలుగురు హీరోల్లో అక్టోబర్ 23న పుట్టిన హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ప్రభాస్ బి) యన్టీఆర్ సి) మహేశ్‌బాబు డి) రామ్‌చరణ్ ► ‘వర్షం’ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘నువ్వొస్తానంటే నే వద్దంటానా...’ పాడిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) గీతా మాధురి సి) సునీత డి) కేయస్ చిత్ర ► రామ్‌చరణ్–బోయపాటి సినిమాలో ఓ బాలీవుడ్ కథానాయకుడు విలన్‌గా నటిస్తున్నాడు. ఎవరా హీరో? ఎ) జాకీ ష్రాఫ్ బి) సైఫ్ అలీఖాన్ సి) వివేక్ ఒబెరాయ్ డి) షాహిద్ కపూర్ ► నాని గతంలో చాలామంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఓ పెద్ద హీరోతో కలిసి నటిస్తున్నాడు. ఎవరా పెద్ద హీరో? ఎ) బాలకృష్ణ బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) రవితేజ ► ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో యన్టీఆర్ మరదలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) హన్సిక సి) సమంత డి) కృతీ సనన్ ► ‘మక్కల్ నీది మయమ్’ అనే తమిళ పార్టీని ఓ ప్రముఖ నటుడు స్థాపించారు. ఆయనెవరు? ఎ) కమల్ హాసన్ బి) శరత్‌కుమార్ సి) విజయ్‌కాంత్ డి) విశాల్ ► యన్టీఆర్ నటించిన ‘బొబ్బిలి పులి’ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) జయసుధ బి) సుజాత సి) శ్రీదేవి డి) జయప్రద ► శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ మొదట హీరో కాదు. అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఏ దర్శకుని శిష్యుడో తెలుసా? ఎ) బాపు బి) బాలచందర్ సి) భారతీరాజా డి) మణిరత్నం ► ట్వీటర్ ఖాతాలో తన ఖాతాదారుల సంఖ్య 70 లక్షలకు చేరుకున్న సందర్భంగా తన లక్కీ నంబర్ ‘7’ అని ఈ మధ్యే ఓ ప్రముఖ హీరోయిన్ చెప్పింది. ఎవరయ్యుంటారబ్బా? ఎ) శ్రుతీహాసన్ బి) తమన్నా సి) కాజల్ అగర్వాల్ డి) మెహరీన్ ► తమిళ దర్శకుడు ఏయల్ విజయ్ (‘నాన్న’ ఫేమ్)ని ఈ బ్యూటీ ప్రేమించి, పెళ్లాడింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆమె ఎవరు? ఎ) మమతా మోహన్‌దాస్ బి) అమలాపాల్ సి) మంజు వారియర్ డి) సౌందర్య రజనీకాంత్ ► ‘నా పాట నీ నోట పలకాల సిలక...’ అంటూ ‘మూగమనసులు’ చిత్రంలో అక్కినేని ఓ హీరోయిన్‌కి పాట పాడటంలో శిక్షణ ఇస్తాడు. ఎవరామె? ఎ) జమున బి) అంజలీ దేవి సి) కృష్ణకుమారి డి) సావిత్రి ► ‘మోసగాళ్లకు మోసగాడు’ కౌబాయ్ సినిమా. ఈ సినిమా కృష్ణ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) కోడి రామకృష్ణ బి) కేయస్సార్ దాస్ సి) పీసీ రెడ్డి డి) బి. గోపాల్ ► ‘జననీ జన్మ భూమిశ్ఛ స్వర్గాదపీ గరీయసీ..’ అనే పాట ర^è యిత ఎవరో కనుక్కోండి? ఎ) వేటూరి సుందరామ్మూర్తి బి) సిరివెన్నెల సి) సముద్రాల డి) దాసరి నారాయణరావు ► ‘పెదరాయుడు’ సినిమాలో పాపారాయుడు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) రజనీకాంత్ బి) మోహన్‌బాబు సి) శ్రీహరి డి) బ్రహ్మానందం ► అనుష్కను మొదటిసారి తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) క్రిష్ జాగర్లమూడి బి) పూరి జగన్నాథ్ సి) గుణశేఖర్ డి) కోడి రామకృష్ణ ► ‘ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది’ అనే పాట ‘వేదం’ చిత్రంలోనిది. ఆ సినిమాకు పాటలు స్వరపరిచింది ఎవరో తెలుసా? ఎ) కల్యాణ రమణ బి) యం.యం. శ్రీలేఖ సి) మణిశర్మ డి) యం.యం. కీరవాణి ► సీతారామ్ చౌదరి పోతినేని అనేది ఈ హీరో అసలు పేరు. ఆ హీరో ఎవరు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) శ్రీరామ్ డి) శ్రీకాంత్ ► ‘నీ స్నేహితుడెవరో తెలిస్తే నీ కేరక్టర్ తెలుస్తుంది... నీ శత్రువెవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది’ అని హీరో రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ఏ సినిమా లోనిదో కనుక్కోండి? ఎ) మగధీర బి) ఆరెంజ్ సి) గోవిందుడు అందరి వాడేలే డి) ధృవ ► ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరు? ఎ) నాగార్జున బి) సుమంత్ సి) నాగచైతన్య డి) సుశాంత్ ► జయప్రద నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) సాగర సంగమం బి) సిరివెన్నెల సి) అంతులేని కథ డి) సీతా కల్యాణం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4) బి 5) సి 6) ఎ 7) సి 8) డి 9) ఎ 10) బి 11) డి 12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) డి 19) ఎ 20) సి -
కొత్త సినిమాలో పాత సినిమాలు!
సంక్రాంతి పండగొస్తోంది. కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాలు బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి. అయితే అనౌన్స్మెంట్ కొంచెం లేటయినా.. పండక్కి మా సినిమా కూడా వస్తోంది. చూసి ఎలా ఉందో చెప్పండి అంటున్నారు హీరోయిన్ హన్సిక. ఎస్. కల్యాణ్ దర్శకత్వంలో ప్రభుదేవా, హన్సిక జంటగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘గులేబకావళి’. ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే తమిళంలో ‘గులేబకావళి’ అనే టైటిల్‌తో గతంలోనే రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి 1935లో, మరొకటి 1955లో. ఈ రెండు సినిమాలను లింక్ చేసేలా దర్శకుడు కల్యాణ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను ప్లాన్ చేశారు.