
సంక్రాంతి పండగొస్తోంది. కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాలు బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి. అయితే అనౌన్స్‌మెంట్ కొంచెం లేటయినా.. పండక్కి మా సినిమా కూడా వస్తోంది. చూసి ఎలా ఉందో చెప్పండి అంటున్నారు హీరోయిన్ హన్సిక. ఎస్. కల్యాణ్ దర్శకత్వంలో ప్రభుదేవా, హన్సిక జంటగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘గులేబకావళి’.
ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే తమిళంలో ‘గులేబకావళి’ అనే టైటిల్‌తో గతంలోనే రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి 1935లో, మరొకటి 1955లో. ఈ రెండు సినిమాలను లింక్ చేసేలా దర్శకుడు కల్యాణ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను ప్లాన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment