చిన్న విరామం.. బోలెడంత ఉత్సాహం ! | Hansika acts with prabhu Deva in Gulebakavali movie | Sakshi
Sakshi News home page

చిన్న విరామం.. బోలెడంత ఉత్సాహం !

Published Thu, Dec 7 2017 7:58 AM | Last Updated on Thu, Dec 7 2017 7:58 AM

Hansika acts with prabhu Deva in Gulebakavali movie - Sakshi

సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చిన్న బ్రేక్‌ రాగానే చాప్టర్‌ క్లోజ్‌. ఇక మూటా ముల్లె సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినాల్ని రావచ్చు. అయితే అలాంటివి సంబంధిత వ్యక్తుల్ని కుంగదీయవచ్చు.  ఈ ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా? నటి హన్సిక మంచి నటి అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ కథానాయకులతోనే నటించి శభాష్‌ అనిపించుకుంది. విజయ్, విశాల్‌ లాంటి స్టార్‌ హీరోలతో నటించి సకెస్స్‌లు అందుకుంది.  

తెలుగు, మలయాళం, హిందీ మొదలగు భాషల్లో నటించి బహుబాషా నటిగానూ గుర్తింపు పొందింది. అలాంటి హీరోయిన్‌కు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. ఇక అమ్మడి పని అయిపోయింది. ముంబైకి చెక్కేయడమే తరువాయి అనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇందుకు కారణం చిన్న బ్రేక్‌ రావడమే. అయితే హన్సిక సినిమాలు లేక ఖాళీగా కూర్చోలేదు. ఆ మధ్య ఒక తెలుగు చిత్రం, ఇటీవల మోహన్‌లాల్, విశాల్‌ కలిసి నటించిన మలయాళం చిత్రం విలన్‌లో నటించింది. 

ప్రస్తుతం ప్రభుదేవాకు జంటగా గులేబకావళి చిత్రంలో నటిస్తోంది. వరుస అవకాశాలతో మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా యువ నటుడు అధర్వతో జోడీ కట్టడానికి రెడీ అవుతోంది. వీరి కాంభినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని డార్లింగ్‌ చిత్రం ఫేమ్‌ జాన్‌ అంటాన్‌ తెరకెక్కించనున్నారు. యోగిబాబు హాస్య భూమికను పోషించనున్న ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌.సంగీతం  అందించనున్నారు. ఈ చిత్రంలో అధర్వ తొలిసారిగా పోలీస్‌ అధికారిగా నటించనున్నారు. షూటింగ్‌ ఈ నెల 10వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. అధర్వ ఇప్పటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నయనతారతో కలిసి నటించిన ఇమైకా నోడిగళ్‌ చిత్రం జనవరిలో విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement