నిధి కోసం అన్వేషణ | Prabhu Deva's Gulebakavali To Release On March 16 | Sakshi
Sakshi News home page

నిధి కోసం అన్వేషణ

Published Fri, Mar 2 2018 1:01 AM | Last Updated on Fri, Mar 2 2018 1:01 AM

Prabhu Deva's Gulebakavali To Release On March 16 - Sakshi

ప్రభుదేవా, హన్సిక

ప్రభుదేవా, హన్సిక జంటగా కల్యాణ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గులేబకావళి’. నటి రేవతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్‌‡్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై మల్కాపురం శివకుమార్‌ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది.

పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా నృత్యాలు, నటన సినిమాకి ప్రధాన హైలైట్‌. ఈ నెల 16న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మన్సూర్‌ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్‌ ఆనంద్‌కుమార్, పాటలు: సామ్రాట్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement