Gulebakavali
-
ముంబైలో సొంతంగా ఇల్లు..
తమిళసినిమా: అన్నీ బబ్లీ పాత్రలేనని నటి హన్సిక చెబుతోంది.దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో విజయ్, విశాల్, ధనుష్, జయంరవి అంటూ స్టార్ హీరోలందరితోనూ నటించేసి క్రేజీ హీరోయిన్గా వెలిగిన ఈ అమ్మడి జోరు ఇటీవల కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే హన్సిక నటించిన చిత్రాల్లో విజయాల శాతమే ఎక్కువని చెప్పాలి. ఈ బ్యూటీ చివరిగా నటించిన గులేభాకావళి చిత్రం కూడా హిట్ అనిపించుకుంది. అలాంటిది అనూహ్యంగా హన్సికకు అవకాశాలు తగ్గాయి. అయితే చిన్న గ్యాప్ తరువాత ఈ బ్యూటీకి మళ్లీ ఆవకాశాలు వరుస కడుతున్నాయనిపిస్తోంది. కోలీవుడ్‌లో విక్రమ్‌ప్రభుతో తుపాకీ మునై, అధర్వకు జంటగా 100 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేస్‌లో కాస్త వెనుక బడ్డారు అవకాశాలు తగ్గాయా? తగ్గించుకున్నారా? అన్న ప్రశ్నకు హన్సిక బదులిస్తూ, తగ్గించుకోవాలన్న ఆలోచనే లేదని, నిజానికి మంచి కథా చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నానని చెప్పింది. ఇక అవకాశాలు తగ్గాయా? అని అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే ఇటీవల తాను 30 కథలకు పైగా విన్నానని తెలిపింది. అయితే అవన్నీ బబ్లీ పాత్రలతో కూడిన కథలు కావడంతో అంగీకరించలేదని చెప్పింది. తాను బబ్లీ పాత్రలు ఇప్పటికే చాలా చేశానని, ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని అంది. ఇటీవలే తాను ముంబైలో సొంతంగా ఇల్లు కొనుక్కున్నానని, దానికి అలంకార పనులను తానే స్వయంగా చూసుకుంటూ, దత్తత పిల్లలతో సరదాగా ఎక్కువ సమయం వారితోనే గడుపుతున్నానని చెప్పింది. ఇతర హీరోయిన్ల కంటే కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇటీవల బాగా బరువు తగ్గి మరింత అందంగా తయారైందట. -
ఈయనది పేద్ద ఇలియానా నడుము మరి
‘‘ఇదే నాన్న చెప్పిన విగ్రహం. దీనికి ఫారిన్లో సూపర్ డిమాండ్ ఉంది... నేను తెస్తాను నా శిల్పాన్ని’..., ‘వద్దురా.. ఆ ఊరే పెద్ద రిస్కు’..., ‘మీరు ముగ్గురూ కలిసి ఆ పెట్టెను కొట్టేయాలి’..., ‘ఏం.. మమ్మల్ని చూస్తే హీరోల్లా అనిపించట్లేదా?’..., ‘మా అన్నకు షుగర్ అని తెలీదా.. ఎందుకురా లాలీపాప్ పెట్టారు’..., ‘మీరూ మీ పొట్టలు.. మీ బండ నడుములు.., ఈయనది పేద్ద ఇలియానా నడుము మరి’..., ‘చనిపోయిన మా అబ్బాయి శ్రీనివాస్ నీలాగే ఉండేవాడు’..., ‘అప్పుడు ఆ నిధి ఏమైనట్టు’... వంటి డైలాగులు ‘గులేబకావళి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతున్నాయి. ప్రభుదేవా, హన్సిక జంటగా నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’. కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గులేబకావళి గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తమిళంలోలా తెలుగులోనూ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్‌కుమార్. -
‘సింగం–3’ తర్వాత సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘గతంలో ‘గులేబకావళి’ టైటిల్‌తో విడుదలైన సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలుగుతోంది’’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రభుదేవా, హన్సిక జంటగా రేవతి ప్రధాన పాత్రలో కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గులేబకావళి’. తమిళంలో సంక్రాంతికి విడుదలై హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో మల్కాపురం శివకుమార్ తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు. వివేక్ మెర్విన్ స్వరపరచిన ఈ సినిమా బిగ్ సీడీని రసమయి బాలకిషన్ విడుదల చేశారు. ఆడియో సీడీలను దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేయగా, నటి జీవిత తొలి సీడీ అందుకున్నారు. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ– ‘‘సింగం 3’ తర్వాత సినిమాలు చేయడం ఆపేద్దామనుకున్నా. ఇండస్ట్రీలో సక్సెస్ అయితే తర్వాతి సినిమా ఏంటని అడుగుతారు. ఫ్లా్లప్ అయితే ఎవరూ కనిపించరు. కానీ, పది మందికి ఆదరణ చూపే ఇండస్ట్రీ ఇది. ఎంతోమంది చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. తమిళం రాకున్నా ‘గులేబకావళి’ సినిమా చూసి సాధారణ ప్రేక్షకునిగా ఎంజాయ్ చేశా. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనిపించి విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. తమిళ ప్రేక్షకులను అలరించినట్టు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కల్యాణ్. -
నిధి కోసం అన్వేషణ
ప్రభుదేవా, హన్సిక జంటగా సీనియర్ నటి రేవతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గులేబకావళి’. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అదేపేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఏప్రిల్ 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో కథ కొనసాగుతుంది. పూర్తి ఎంటర్టైన్మెంట్గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. తమిళ ప్రేక్షకులు ఆదరించినట్టే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్ కుమార్. -
నిధి కోసం అన్వేషణ
ప్రభుదేవా, హన్సిక జంటగా కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గులేబకావళి’. నటి రేవతి పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్‡్ష ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన సినిమాకి ప్రధాన హైలైట్. ఈ నెల 16న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్‌కుమార్, పాటలు: సామ్రాట్. -
రిస్క్ తీసుకున్నా...
తమిళసినిమా: చాలా రిస్క్ తీసుకుని నటించా అంటోంది నటి హన్సిక. చిన్న గ్యాప్ తరువాత శుక్రవారం గులేబాకావళి చిత్రంతో తమిళ తెరపైకి వచ్చింది ఈ బ్యూటీ. ప్రభుదేవా హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను వినోదంతో కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ సందర్భంగా హన్సికతో చిన్న చిట్‌చాట్ ప్ర: గులేబాకావళి చిత్రం గురించి? జ: ఈ చిత్ర కథ 1945లో ప్రారంభమవుతుంది. ఒక నిధి బయట పడుతుంది. దాన్ని సొంతం చేసుకోవడానికి ఒక ముఠా ప్రయత్నిస్తుంది. ఆ నిధి ఎవరికి దక్కుతుందనేదే చిత్ర కథ. ఆద్యంతం వినోదభరితంగా, ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్ర: చిత్రంలో మీ పాత్ర ఏమిటి? జ: ఇందులో నిధి కోసం ప్రయత్నించే ముఠాలో ఒకరిగా ప్రభుదేవా నటించారు. నేనూ తొలిసారిగా దొంగగా నటించాను. దర్శకుడు కల్యాణ్ కథ చెప్పినప్పుడు నేనీ చిత్రంలో నటించగలనా అని భయపడ్డాను. అయితే దర్శకుడు ధైర్యం చెప్పి నటింపజేశారు. ప్ర: దర్శకుడు ప్రభుదేవా ఎలా ఉండేవారు? నటుడు ప్రభుదేవా ఎలా అనిపించారు? జ: నేను ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించాను. దర్శకుడిగా ఆయన చాలా టెన్షన్‌గా, హడావుడిగానూ ఉండేవారు. నటుడిగా చాలా జాలీగా ఉంటారు. ఆయనకు జంటగా నటించడం చాలా మంచి అనుభవం ప్ర: తమిళంలో ఇన్నేళ్లుగా, పలు చిత్రాల్లో నటించినా ఇప్పటికీ తమిళ భాషను సరిగా మాట్లడలేకపోతున్నారే? జ: నిజం చెప్పాలంటే నా సహాయకులతో తమిళంలోనే మాట్లాడతాను. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం బెటర్. త్వరలోనే సరళంగా తమిళ భాషను మాట్లాడగలుగుతాననుకుంటున్నా. ప్ర: మీరు కథలను ఎలా ఎంచుకుంటారు? జ: మొదట నాకు కథ నచ్చాలి. అందులో నా పాత్రకు కాస్త అయినా ప్రాధాన్యత ఉండాలి. కాన్సెప్ట్ వైవి«ధ్యంగా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా అమరితే వెంటనే నటించడానికి రెడీ అంటాను. ప్ర: గులేబాకావళి చిత్రంలో ఫైట్స్ కూడా చేశారట? జ: అవును నటుడు ఆనందరాజ్‌తో ఫైటింగ్ సన్నివేశాల్లో నటించాను. అలా ఈ చిత్రం కోసం కాస్త రిస్క్ తీసుకున్నాను. -
రెండు రోజులు ముందే పండగ!
ఇక్కడ సంక్రాంతి.. అక్కడ (తమిళనాడు) పొంగల్... పేర్లు వేరైనా పండగ జోష్‌లో మాత్రం ఏ తేడా ఉండదు. తెలుగు బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి... తమిళ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు ఉన్నాయి అంటే.. అక్కడ కూడా నాలుగే. అయితే ఇంట్రస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ నాలుగు సినిమాలు ఒకే తేదీన.. అది కూడా పండగ రెండు రోజులు ముందే (12.01.18) విడుదల కానున్నాయి. సంక్రాంతికి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు అందరికంటే ముందు కర్చీఫ్ వేసింది హీరో సూర్యానే. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘తానా సేంద కూట్టమ్’. తెలుగులో ‘గ్యాంగ్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. హిందీ చిత్రం ‘స్పెషల్ 26’లో ఉన్న మెయిన్ పాయింట్ ఇందులో ఉందట. సూర్య తర్వాత పండక్కి మేం వస్తున్నాం అని ఎనౌన్స్ చేశారు ప్రభుదేవా. కల్యాణ్ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ‘గులేభకావళి’. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి రేవతి కీలక పాత్ర చేశారు. అయితే.. టైటిల్ చదవగానే పాత సినిమా గుర్తుకు రావచ్చు. అందుకే.. గతంలో ఇదే టైటిల్స్‌తో వచ్చిన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఏదో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఇక, పొంగల్ సందడిలో బాక్సాఫీస్ వద్ద స్కెచ్ వేస్తున్నామని విక్రమ్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు కానీ.. ఎప్పుడో కరెక్ట్‌గా చెప్పలేదు. ఫైనల్‌గా జనవరి 12న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారాయన. విజయ్ చందర్ దర్శకత్వంలో విక్రమ్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘స్కెచ్’. ఈ సినిమాను కేరళలో కూడా 12నే రిలీజ్ చేస్తున్నారు. ముగ్గురు బడా హీరోలు పండక్కి బాక్సాఫీస్ వద్ద కాచుకుని ఉంటే.. ఏం పర్లేదు. మా సినిమా కంటెంట్‌పై భరోసా ఉంది. సో.. పండగ బరిలో దిగేందుకు సిద్దమే అని ‘మధుర వీరన్’ టీమ్ సై అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు. పీజీ ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సీనియర్ నటుడు విజయకాంత్ తనయుడు షణ్ముగ పాండియన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు. ఇవికాక.. సుందర్. సి దర్శకత్వంలో రూపొందిన ‘కలకలప్పు–2’, అరవింద్‌స్వామి నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయన్న ఊహాగానాలున్నాయి. అయితే.. ఇప్పటివరకూ ఈ చిత్రాల విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. ఆల్రెడీ నాలుగు సినిమాలు రెడీ అయిపోవడంతో ఈ సినిమాలు రాకపోవచ్చన్నది కొందరి వాదన. పండక్కి ఎన్ని సినిమాలు విడుదలైనా చూసే తీరిక ప్రేక్షకులకు ఉంటుందన్నది మరికొందరి వాదన. మరి.. సంక్రాంతి కి ఎన్ని సినిమాలొస్తాయి? బరిలో గెలుపు ఎవరిది? ‘వెట్రి యారుక్కున్ను అంజు నాళ్ పొరుత్తిరిందు పార్పోమ్’. అర్థం కాలేదా? ‘గెలుపు ఎవరికన్నది ఐదు రోజులు వేచి చూద్దాం’ అని అర్థం. హన్సిక, ప్రభుదేవా షణ్ముగ విక్రమ్, తమన్నా -
చిన్న విరామం.. బోలెడంత ఉత్సాహం !
సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చిన్న బ్రేక్ రాగానే చాప్టర్ క్లోజ్. ఇక మూటా ముల్లె సర్దుకోవాల్సిందే లాంటి మాటలు వినాల్ని రావచ్చు. అయితే అలాంటివి సంబంధిత వ్యక్తుల్ని కుంగదీయవచ్చు. ఈ ఉపోద్ఘాతం ఎందుకనుకుంటున్నారా? నటి హన్సిక మంచి నటి అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ కథానాయకులతోనే నటించి శభాష్ అనిపించుకుంది. విజయ్, విశాల్ లాంటి స్టార్ హీరోలతో నటించి సకెస్స్లు అందుకుంది. తెలుగు, మలయాళం, హిందీ మొదలగు భాషల్లో నటించి బహుబాషా నటిగానూ గుర్తింపు పొందింది. అలాంటి హీరోయిన్‌కు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. ఇక అమ్మడి పని అయిపోయింది. ముంబైకి చెక్కేయడమే తరువాయి అనే వార్తలు హల్చల్ చేశాయి. ఇందుకు కారణం చిన్న బ్రేక్ రావడమే. అయితే హన్సిక సినిమాలు లేక ఖాళీగా కూర్చోలేదు. ఆ మధ్య ఒక తెలుగు చిత్రం, ఇటీవల మోహన్‌లాల్, విశాల్ కలిసి నటించిన మలయాళం చిత్రం విలన్లో నటించింది. ప్రస్తుతం ప్రభుదేవాకు జంటగా గులేబకావళి చిత్రంలో నటిస్తోంది. వరుస అవకాశాలతో మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా యువ నటుడు అధర్వతో జోడీ కట్టడానికి రెడీ అవుతోంది. వీరి కాంభినేషన్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని డార్లింగ్ చిత్రం ఫేమ్ జాన్ అంటాన్ తెరకెక్కించనున్నారు. యోగిబాబు హాస్య భూమికను పోషించనున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్.సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో అధర్వ తొలిసారిగా పోలీస్ అధికారిగా నటించనున్నారు. షూటింగ్ ఈ నెల 10వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. అధర్వ ఇప్పటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నయనతారతో కలిసి నటించిన ఇమైకా నోడిగళ్ చిత్రం జనవరిలో విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం. -
కొత్త సినిమాలో పాత సినిమాలు!
సంక్రాంతి పండగొస్తోంది. కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాలు బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి. అయితే అనౌన్స్మెంట్ కొంచెం లేటయినా.. పండక్కి మా సినిమా కూడా వస్తోంది. చూసి ఎలా ఉందో చెప్పండి అంటున్నారు హీరోయిన్ హన్సిక. ఎస్. కల్యాణ్ దర్శకత్వంలో ప్రభుదేవా, హన్సిక జంటగా తమిళంలో రూపొందుతోన్న చిత్రం ‘గులేబకావళి’. ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే తమిళంలో ‘గులేబకావళి’ అనే టైటిల్‌తో గతంలోనే రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి 1935లో, మరొకటి 1955లో. ఈ రెండు సినిమాలను లింక్ చేసేలా దర్శకుడు కల్యాణ్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌ను ప్లాన్ చేశారు. -
ఉప్పొంగిన అభిమానం
తమిళసినిమా: వెలకట్టలేని వాటిలో అభిమానం ఒకటి. ఇక తారలకు మూలధనమే అదే. వాళ్ల ప్రేమాభిమానాలు కనుక లభిస్తే ఆ తారలకు తిరుగుండదు. నటి హన్సిక మంగళవారం అలాంటి అభిమానంతోనే తడిచి ముద్దయింది. హన్సిక దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పక తప్పదు. ఆమె చేతిలో ప్రభుదేవాకు జంటగా నటిస్తున్న గులేబాకావళి చిత్రం ఒక్కటే ఉంది. అయినా అభిమానుల్లో ఈ బ్యూటీపై అభిమానం ఏమాత్రం కొరవలేదనడానికి మంగళవారం జరిగిన సంఘటనే చిన్న ఉదాహరణ. ఈ అమ్మడు మంగళవారం ఈరోడ్డులో సందడి చేసింది. అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన హన్సికను చూడడానికి ఆ చుట్టు ప్రక్కల జనం భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఆమె కోసం సుమారు రెండు గంటలకు పైగా వేచి ఉన్నారు. హన్సిక వేదికపైకి రాగానే అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పొంగింది. హేయ్ హన్సిక అంటూ కేకలు, ఈలలు, చప్పట్లతో అంటూ ఆ ప్రాంతం మారుమోగింది. అప్పటికీ ముందుగానే భద్రతా సిబ్బందిని నిర్వాహకులు ఏర్పాటు చేసినా, వారికి అభిమానాన్ని కట్టడి చేయడం కష్టతరంగా మారింది. అభిమానులను ఉద్దేశించి హన్సిక మాట్లాడుతూ ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరంటే చాలా ఇష్టమంటూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. దీంతో అభిమానులు ఫిదా అయిపోయారు. హన్సికను చూసిన ఆనందంతో గాలిలో తేలినట్లుందే అంటూ పాడుకుంటూ ఇంటి దారి పట్టారు.అయితే హన్సిక రావడం, అభిమానులు చుట్టడం వంటి సంఘటనలతో ఆ ప్రాంత వాహనచోదకులకు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని చక్కబరచారనుకోండి. అలా నటి హన్సిక అభిమానంతో తడిచి ముద్దయిందన్నమాట. -
నేను ఆడిస్తాగా అన్నారు!
తమిళసినిమా: హన్సికను నిన్ను నేను ఆడిస్తాగా అన్నారట. ఈ విషయాన్ని ఆ అమ్మడే స్వయంగా తెలిపారు. హన్సిక ప్రస్తుతం ప్రభుదేవాతో గుళేబకావళి చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ చాలా మంది హీరోయిన్లు 14–15 ఏళ్ల వయసులో చిత్ర రంగప్రవేశం చేస్తారన్నారు. అయితే తాను బాల నటిగానే రంగప్రవేశం చేశానని చెప్పారు. ఇప్పుడు తన వయసు 25 అని, నటించడానికి ఇంకా చాలా టైమ్ ఉందని అన్నారు. మరో ఐదేళ్ల వరకూ నటిగా బాగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించానని, ఆ తరువాత ఆయన నిర్మాతగా బోగన్ చిత్రంలో జయంరవికి జంటగా నటించానని గుర్తు చేశారు. తాజాగా ప్రభుదేవాతోనే గుళేబకావళి చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. ఆయన దర్శకుడిగా ఉన్నప్పుడు ప్రశ్నలేమీ వేసే దాన్ని కాదని, ఇప్పుడు చాలా ప్రశ్నలు వేస్తున్నానని అన్నారు. రోజూ ప్రభుదేవా సెట్లోకి వచ్చేటప్పుడు తాను ఎవరినో ఒకరిలా మిమిక్రీ చేస్తుంటానని, అది చూసి ఆయన నవ్వుకుంటారని చెప్పారు. అయితే ఆయనతో నటించేటప్పుడు మాత్రం కాస్త గాబరా పడుతుంటానన్నారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో డాన్స్ చేసేటప్పుడు దడ పుడుతుందన్నారు. అయితే ప్రభుదేవా మాత్రం కూల్‌గా ఉంటారని చెప్పారు. ఎలాంటి భయం అవసరం లేదు నేను నిన్ను ఆడిస్తాగా అని ప్రభుదేవా ఎంతో ఎంకరేజ్ చేస్తారని హన్సిక చెప్పుకొచ్చారు -
నిన్ను నేను ఆడిస్తాగా అన్నారు: నటి
తమిళసినిమా: నిన్ను నేను ఆడిస్తాగా అని హన్సికను ప్రభుదేవా అన్నారన్న విషయాన్ని ఆ అమ్మడే స్వయంగా చెప్పారు. హన్సిక ప్రస్తుతం ప్రభుదేవాతో గులేబకావళి చిత్రంలో రొమాన్స్ చేస్తున్నది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ మరో ఐదేళ్ల వరకూ నటిగా బాగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇంతకుముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించానని, ఆయన నిర్మాతగా బోగన్ చిత్రంలో జయం రవికి జంటగా నటించానని గుర్తు చేశారు. తాజాగా ప్రభుదేవాతోనే గులేబకావళి చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ప్రభుదేవా సెట్లోకి వచ్చేటప్పుడు తాను ఎవరో ఒకరిలా మిమిక్రీ చేస్తుంటాననీ చెప్పింది. అది చూసి ఆయన నవ్వుకుంటారని హన్సిక అన్నది. ఆయనతో నటించేటప్పుడు మాత్రం కాస్త గాభరా పడుతుంటానన్నారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో డాన్స్ చేసేటప్పుడు తడబడుతుంటానన్నారు. అయితే ప్రభుదేవా మాత్రం చాలా కూల్‌గా ఉంటారని, నీకు ఎలాంటి భయం అవసరం లేదు.. నేను నిన్ను ఆడిస్తాగా అని ఎంతో ఎంకరేజ్ చేస్తారని హన్సిక చెప్పారు. -
ఆ సెట్ ఖరీదు చాలా ఎక్కువట !
బాహుబలి చిత్రం తరువాత చిత్ర నిర్మాణ వ్యయాన్ని ఊహించలేకపోతున్నాం. ఆ చిత్రం ప్రేక్షకులకు బ్రహ్మాండాన్ని పరిచయం చేసిందనే చెప్పాలి. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు భారీ వ్యయాన్ని వెచ్చించి చిత్రాలను నిర్మించడానికి సాహసిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా ప్రభుదేవా చిత్రంలోనూ అలాంటి బ్రహ్మాండాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుదేవా, నటి హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం గులేబాకావళి. కేసేఆర్ స్డూడియోస్ పతాకంపై కేసేఆర్.రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు ఎస్.కల్యాణ్ మెగాఫోన్ పట్టారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వివేక్–మెర్విన్ల ద్వయం సంగీత బాణీలు సమకూరుస్తున్నారు. ఒక పాట కోసం రూ.2 కోట్లు వ్యచించి ఒక బ్రహ్మాండమైన సెట్‌ను కళాదర్శకుడు కదిర్ నేతృత్వంలో వేశారు. కొరియోగ్రాఫర్ జానీ నృత్యరీతులు సమకూర్చుతున్న ఈ పాటను ఛాయాగ్రాహకుడు ఆనందకుమార్ అతి నవీన సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ గ్రాఫిక్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారట. గులేబాకావళి చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని సన్‌టీవీ పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం మరో విశేషం.