నేను ఆడిస్తాగా అన్నారు! | Gulabakavali film shooting is going on very fast. | Sakshi
Sakshi News home page

నేను ఆడిస్తాగా అన్నారు!

Published Tue, Jul 18 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

నేను ఆడిస్తాగా అన్నారు!

నేను ఆడిస్తాగా అన్నారు!

తమిళసినిమా: హన్సికను నిన్ను నేను ఆడిస్తాగా అన్నారట. ఈ విషయాన్ని ఆ అమ్మడే స్వయంగా తెలిపారు. హన్సిక ప్రస్తుతం ప్రభుదేవాతో గుళేబకావళి చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ చాలా మంది హీరోయిన్లు 14–15 ఏళ్ల వయసులో చిత్ర రంగప్రవేశం చేస్తారన్నారు.

అయితే తాను బాల నటిగానే రంగప్రవేశం చేశానని చెప్పారు. ఇప్పుడు తన వయసు 25 అని, నటించడానికి ఇంకా చాలా టైమ్‌ ఉందని  అన్నారు. మరో ఐదేళ్ల వరకూ నటిగా బాగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్‌ కాదల్‌ చిత్రంలో నటించానని, ఆ తరువాత ఆయన నిర్మాతగా బోగన్‌ చిత్రంలో జయంరవికి జంటగా నటించానని గుర్తు చేశారు. తాజాగా ప్రభుదేవాతోనే గుళేబకావళి చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు.

ఆయన దర్శకుడిగా ఉన్నప్పుడు ప్రశ్నలేమీ వేసే దాన్ని కాదని, ఇప్పుడు చాలా ప్రశ్నలు వేస్తున్నానని అన్నారు. రోజూ ప్రభుదేవా సెట్‌లోకి వచ్చేటప్పుడు తాను ఎవరినో ఒకరిలా మిమిక్రీ చేస్తుంటానని, అది చూసి ఆయన నవ్వుకుంటారని చెప్పారు. అయితే ఆయనతో నటించేటప్పుడు మాత్రం కాస్త గాబరా పడుతుంటానన్నారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో డాన్స్‌ చేసేటప్పుడు దడ పుడుతుందన్నారు. అయితే ప్రభుదేవా మాత్రం కూల్‌గా ఉంటారని చెప్పారు. ఎలాంటి భయం అవసరం లేదు నేను నిన్ను ఆడిస్తాగా అని ప్రభుదేవా ఎంతో ఎంకరేజ్‌ చేస్తారని హన్సిక చెప్పుకొచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement