ముంబైలో సొంతంగా ఇల్లు.. | Hansika Buy A new House In Mumbai | Sakshi
Sakshi News home page

అన్నీ అలాంటి పాత్రలే!

Published Sat, Jul 7 2018 9:45 AM | Last Updated on Sat, Jul 7 2018 9:45 AM

Hansika Buy A new House In Mumbai - Sakshi

తమిళసినిమా: అన్నీ బబ్లీ పాత్రలేనని నటి హన్సిక చెబుతోంది.దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో విజయ్, విశాల్, ధనుష్, జయంరవి అంటూ స్టార్‌ హీరోలందరితోనూ నటించేసి క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన ఈ అమ్మడి జోరు ఇటీవల కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే హన్సిక నటించిన చిత్రాల్లో విజయాల శాతమే ఎక్కువని చెప్పాలి. ఈ బ్యూటీ చివరిగా నటించిన గులేభాకావళి చిత్రం కూడా హిట్‌ అనిపించుకుంది. అలాంటిది  అనూహ్యంగా హన్సికకు అవకాశాలు తగ్గాయి. అయితే చిన్న గ్యాప్‌ తరువాత ఈ బ్యూటీకి మళ్లీ ఆవకాశాలు వరుస కడుతున్నాయనిపిస్తోంది. కోలీవుడ్‌లో విక్రమ్‌ప్రభుతో తుపాకీ మునై, అధర్వకు జంటగా 100 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులోనూ ఒకటి రెండు చిత్రాలు చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో రేస్‌లో కాస్త వెనుక బడ్డారు అవకాశాలు తగ్గాయా? తగ్గించుకున్నారా? అన్న ప్రశ్నకు హన్సిక బదులిస్తూ, తగ్గించుకోవాలన్న ఆలోచనే లేదని, నిజానికి మంచి కథా చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నానని చెప్పింది. ఇక అవకాశాలు తగ్గాయా? అని అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే ఇటీవల తాను 30 కథలకు పైగా విన్నానని తెలిపింది. అయితే అవన్నీ బబ్లీ పాత్రలతో కూడిన కథలు కావడంతో అంగీకరించలేదని చెప్పింది. తాను బబ్లీ పాత్రలు ఇప్పటికే చాలా చేశానని, ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానని అంది. ఇటీవలే తాను ముంబైలో సొంతంగా ఇల్లు కొనుక్కున్నానని, దానికి అలంకార పనులను తానే స్వయంగా చూసుకుంటూ, దత్తత పిల్లలతో సరదాగా ఎక్కువ సమయం వారితోనే గడుపుతున్నానని చెప్పింది. ఇతర హీరోయిన్ల కంటే కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఇటీవల బాగా బరువు తగ్గి మరింత అందంగా తయారైందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement