తమిళసినిమా: చాలా రిస్క్ తీసుకుని నటించా అంటోంది నటి హన్సిక. చిన్న గ్యాప్ తరువాత శుక్రవారం గులేబాకావళి చిత్రంతో తమిళ తెరపైకి వచ్చింది ఈ బ్యూటీ. ప్రభుదేవా హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను వినోదంతో కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ సందర్భంగా హన్సికతో చిన్న చిట్‌చాట్
ప్ర: గులేబాకావళి చిత్రం గురించి?
జ: ఈ చిత్ర కథ 1945లో ప్రారంభమవుతుంది. ఒక నిధి బయట పడుతుంది. దాన్ని సొంతం చేసుకోవడానికి ఒక ముఠా ప్రయత్నిస్తుంది. ఆ నిధి ఎవరికి దక్కుతుందనేదే చిత్ర కథ. ఆద్యంతం వినోదభరితంగా, ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రీకరించారు.
ప్ర: చిత్రంలో మీ పాత్ర ఏమిటి?
జ: ఇందులో నిధి కోసం ప్రయత్నించే ముఠాలో ఒకరిగా ప్రభుదేవా నటించారు. నేనూ తొలిసారిగా దొంగగా నటించాను. దర్శకుడు కల్యాణ్ కథ చెప్పినప్పుడు నేనీ చిత్రంలో నటించగలనా అని భయపడ్డాను. అయితే దర్శకుడు ధైర్యం చెప్పి నటింపజేశారు.
ప్ర: దర్శకుడు ప్రభుదేవా ఎలా ఉండేవారు? నటుడు ప్రభుదేవా ఎలా అనిపించారు?
జ: నేను ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించాను. దర్శకుడిగా ఆయన చాలా టెన్షన్‌గా, హడావుడిగానూ ఉండేవారు. నటుడిగా చాలా జాలీగా ఉంటారు. ఆయనకు జంటగా నటించడం చాలా మంచి అనుభవం
ప్ర: తమిళంలో ఇన్నేళ్లుగా, పలు చిత్రాల్లో నటించినా ఇప్పటికీ తమిళ భాషను సరిగా మాట్లడలేకపోతున్నారే?
జ: నిజం చెప్పాలంటే నా సహాయకులతో తమిళంలోనే మాట్లాడతాను. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం బెటర్. త్వరలోనే సరళంగా తమిళ భాషను మాట్లాడగలుగుతాననుకుంటున్నా.
ప్ర: మీరు కథలను ఎలా ఎంచుకుంటారు?
జ: మొదట నాకు కథ నచ్చాలి. అందులో నా పాత్రకు కాస్త అయినా ప్రాధాన్యత ఉండాలి. కాన్సెప్ట్ వైవి«ధ్యంగా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా అమరితే వెంటనే నటించడానికి రెడీ అంటాను.
ప్ర: గులేబాకావళి చిత్రంలో ఫైట్స్ కూడా చేశారట?
జ: అవును నటుడు ఆనందరాజ్‌తో ఫైటింగ్ సన్నివేశాల్లో నటించాను. అలా ఈ చిత్రం కోసం కాస్త రిస్క్ తీసుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment