chitchat
-
ఎల్లుండి గ్రూప్-2 కీ విడుదల: టీజీపీఎస్సీ చైర్మన్
సాక్షి,హైదరాబాద్:ఇటీవల జరిగిన గ్రూప్-2(Group-2) పరీక్ష ‘కీ’ని శనివారం(జనవరి 10) విడుదల చేస్తామని, ఇక నుంచి పరీక్షలు జరిగిన వారం పది రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) తెలిపారు. బుధవారం వెంకటేశం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవు. ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.ఇకపై వేచి చూసే ధోరణి ఉండదు.ప్రతీ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏళ్ల తరబడి వేచి చూడకుండా ప్రతి ఏడాది పరీక్షలు జరగాలన్నది మా నిర్ణయం. టీజీపీఎస్సీని పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నాం.సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ లోపించింది అందుకే ప్రక్షాళన చేస్తున్నాం.సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయా శాఖకు సంబంధించిన అధికారులు చూస్తారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని పరీక్షల ఫలితాలు మార్చి 31కల్లా విడుదల చేస్తున్నాం.పెండింగ్ అనేది ఉండదు’అని వెంకటేశం తెలిపారు. -
సింగపూర్‌లో కిరణ్ ప్రభ-కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు ఆద్వర్యంలో "కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో" ఇష్టాగోష్టి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 18 డిసెంబర్, బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆ ముఖాముఖీలో కౌముది మాసపత్రిక సంపాదకులు, కిరణ్ ప్రభ ప్రసంగించారు. అలాగే కౌమిది వెబ్ మాగజైన్ మొదలు పెట్టి 17 సంవత్సరాలు పూర్తి అయిందని, ఏ నెలా ఆలస్యం కాకుండా 1వ తేదీనే విడుదల అవ్వడం వెనుక ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అది మనకు పని పట్ల ఉన్న నిభద్దతగా భావించి విడుదలలో జాప్యం రానివ్వమని అన్నారు. అలాగే దాదాపు 1300 టాక్ షోలను కూడా నిర్వహించామని, తెలిసినంతలో ఒక్క మన తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని రకరకాల సబ్జక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని అంతే కాకుండా ఇదంతా ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అబిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. అదే విధంగా వారి టాక్ షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే క్రమం ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు, అదే విధంగా కౌముది పత్రిక నిర్వహణలో భార్య కాంతి కిరణ్ సహాయసహకారాలు ఎలా ఉంటాయో వివరించారు. కాంతి కిరణ్ మాట్లాడుతూ కౌముది పత్రిక ప్రారంభించినప్పుడు ఇంతమంది అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా మాకు అందిస్తుందని అస్సలు అనుకోలేదని, ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తదుపరి వచ్చిన ఆహూతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు.సుబ్బు వి పాలకుర్తి సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమములో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ కిరణ్ ప్రభతో గత 3 సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికలు ద్వారా పరిచయం ఉన్నప్పటికీ వారిని సింగపూర్ లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమములో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెపుతూ వారిని పరిచయం చేసిన తానా సాహిత్య సంఘం అధ్యక్ష్యులు తోటకూర ప్రసాద్ కి ధన్యవాదములు తెలియచేసారు. అలాగే సింగపూర్ లో సాహిత్య కార్యక్రమాలకు నాంది పలికిన వంగూరి చిట్టెన్ రాజుకి మరొక్కసారి ధన్యవాదములు తెలియచేస్తూ, వర్కింగ్ డే అయినా కానీ 30 మందికి పైగా ఈ కార్యక్రమములో పాల్గొనటం అది కేవలం కిరణ్ ప్రభ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమములో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్ష్యులు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమములో పాల్గొన్న అతిధులందరికి విందు భోజన ఏర్పాట్లను సరిగమ బిస్ట్రో రెస్టారంట్ వారు కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల ఏర్పాటు చేసారు. -
అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు
Mahesh Babu Reaction On Stage Dance In Kurnool Meet: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను సర్కారు వారి పాట టీమ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి మహేశ్ బాబు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్‌తో కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగాలనే కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. 'సభలో స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ ఎక్కి చేశారు కదా. అసలు అలా ఎందుకు చేశారు ?' అని అడిగిన ప్రశ్నకు మహేశ్ బాబు.. 'అది ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్ మొత్తం షాక్, సర్ప్రైజ్లో ఉండిపోయింది. రెండేళ్లు కష్టపడి మూవీ చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ చూశాక.. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలనిపించింది. అలా చేసేశా.' అని సమాధానం ఇచ్చారు. కాగా 'సర్కారు వారి పాట' రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. చదవండి: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. ఎప్పుడంటే అప్పన్న భక్తులకు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు క్షమాపణ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బన్నీకి ఫేవరెట్ అదే.. సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ యాక్టివ్‌గా ఉండే స్నేహ ఫాలోవర్లు కూడా ఎక్కువే. తాజాగా స్నేహా ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్లతో చిట్‌చాట్ సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తనకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, లండన్ ఫేవరెట్ హాలీడే స్పాట్ అని పేర్కొంది. ఇక బన్నీకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడగ్గా.. బిర్యానీ అని సీక్రెట్ బయటపెట్టేసింది. ఇక రీసెంట్గా దిగిన ఫ్యామిలీ ఫోటోలను సైతం పంచుకుంది. -
అలాంటి ప్రదేశం అంటే చాలా ఇష్టం: హీరోయిన్ నివేదా
నివేదా థామస్‌కి నచ్చే విషయాలేంటి? ‘ది బెస్ట్’గా ఉండేందుకు ఆమె ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ‘మీరు అడిగితే నేను చెబుతా’ అంటూ సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్నవారికి ఓ ఆఫర్ ఇచ్చారు నివేదా. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నివేదా టక టకా సమాధానాలు చెప్పేశారు. ఆ విశేషాలు.. ► మీరు ది బెస్ట్‌గా ఉండేందుకు మీలో స్ఫూర్తిని నింపే అంశాలు ఏంటి? ప్యాషన్. మనం ఏ పని చేసినా పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే నా వర్క్‌కి అన్యాయం చేశాననే ఫీలింగ్ నాకు కలుగుతుంది. పని పట్ల నాకు ఉన్న ప్యాషన్‌తో పూర్తి స్థాయిలో కష్టపడతాను. ► ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన ఓ వెబ్ సిరీస్? మారే ఆఫ్ ఎస్టోన్ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్). ► మీ ఫేవరెట్ ప్లేస్? చల్లని వాతావరణంతో రాత్రి నిశ్శబ్దంగా ఉండాలి. ఆకాశం నిండా నక్షత్రాలు ఉండాలి... ఇలా ఉండే ఏ ప్లేస్ అయినా నాకు ఇష్టమే. ► మీకు బాగా ఇష్టమైన తమిళ సినిమా? నా ఫేవరెట్ మూవీస్‌లో ‘దళపతి’ ఉంది. ఈ సినిమాలో సంతోష్ శివన్గారి సినిమాటోగ్రఫీ మ్యాజిక్‌లా ఉంటుంది. ► రాత్రివేళ ఎక్కువ సేపు మేల్కొని ఉంటారా? అలా ఏం లేదు. కానీ నేను నిద్రపోయే సమయాలను మునుపటిలా ట్రాక్‌లో పెట్టాలనుకుంటున్నాను. ► మీకు ఇష్టమైన ఆహారం? ఇది చెప్పడానికి ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది. ► హిందీలో మాట్లాడగలరా? నహీ తో (మాట్లాడకపోతే అని హిందీలో చెప్పి చమత్కరించారు). ► ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూస్తారా? హండ్రెడ్ పర్సెంట్ చూస్తా. ► ఐపీఎల్లో మీ ఫేవరెట్ జట్టు? చెన్నై సూపర్ కింగ్స్. ► డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం... వీటిలో మీకు ఎక్కువగా ఏ విషయంలో నైపుణ్యం ఉంది? నిజం చెప్పాలంటే డ్యాన్సింగ్, సింగింగ్‌లో నేను జస్ట్ ఓకే. ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. మళ్లీ క్లాసులకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను. -
బిగ్‌బాస్ షో.. మీరు అనుకుంటున్నట్లు కాదు: ఉమాదేవి
Bigg Boss Telugu 5 Uma Devi Chit Chat With Fans: కార్తిక దీపం సీరియల్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సీరియల్లో అర్థపావు భాగ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి ఉమాదేవి బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడటం, చిన్న విషయానికే గొడవకు దిగడం ఆమెకు పెద్ద మైనస్‌గా మారాయి. దీంతో రెండో వారంలోనే ఆమె ఇంటి దారి పట్టింది.చదవండి: బిగ్‌బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే... ఇదిలా ఉండగా, తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ఉమాదేవి..బిగ్‌బాస్ జర్నీ గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంది. తాను ముక్కుసూటిగా మాట్లాడతానని, అయితే హౌస్మేట్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. రెండో వారంలోనే హౌస్ నుంచి బయటకు రావడం బాధగా ఉందని, అక్కడే ఉంటే ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేసేదాన్ని అని అభిప్రాయపడింది. ఇక బిగ్‌బాస్ షో అందరూ అనుకుంటున్నట్లు కాదని అసలు స్క్రిప్టు అనేది ఉండదని, చాలా జెన్యూన్ గేమ్ షో అని పేర్కొంది. అవకాశం ఉంటే మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తానని వెల్లడించింది. త్వరలోనే అర్థపావు భాగ్యంగా సీరియల్లో కనిపిస్తానని చెప్పింది. 'మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చాడో లేదో తెలియదు. కానీ మా డాక్టర్ బాబు బాగుండాలి. మా దీప బాగుండాలి' అంటూ ఫన్నీగా తెలిపింది. Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా' -
అడగాల్సినవి ఎన్నెన్నో..!
వీలు కుదిరినప్పుడల్లా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తూ వారిని అలరిస్తుంటారు శ్రుతీహాసన్. తాజాగా మరోసారి తన అభిమానులు, నెటిజన్లతో శ్రుతి చాట్ చేశారు. ఈ చాట్ సెషన్లో భాగంగా ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారు’ అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ బదులిస్తూ – ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల (కరోనాను ఉద్దేశిస్తూ) నుంచి బయటపడాలి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అడగాల్సిన ప్రశ్నలూ ఎన్నో ఉన్నాయి’’ అన్నారు. ఇక.. ఈ చాట్ సెషన్లోనే ‘సెక్స్ లేదా ఫుడ్?’ దేనికి ప్రిఫరెన్స్ అంటూ అడిగిన మరో నెటిజన్ ప్రశ్నకు.. ‘ఆహారం లేకపోతే మనం బతకలేం’ అని శ్రుతీహాసన్ బదులు చెప్పారు. ఇంకా తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమని, పాములంటే భయమని, మ్యూజిక్‌లో ఉన్న మ్యాజిక్ తనకు ఇష్టమని నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం శాంతను అనే చిత్రకారుడితో శ్రుతి ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
గాఢంగా ప్రేమించాను.. కానీ బ్రేకప్ అయ్యింది : అనుపమ
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇక మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా అంటూ ఓ నెటిజన్ అడగ్గా అనుపమ ఓపెన్ అయ్యింది. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని, అయితే అతనితో బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. గతంలో క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమాయణంలో ఉందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా వివాహానికి కొద్ది రోజుల ముందే ఇది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యాంగా బుమ్రా టీవీ యాంకర్ సంజనను పెళ్లాడటం, ఆ తర్వాత అనుపమ స్యాడ్ సాంగ్స్‌తో వీడియోలు చేయడం అప్పట్లో నెట్టింట హల్చల్ చేశాయి. ఇప్పుడు అనుపమ బ్రేకప్ విషయం బయటపెట్టడంతో మరోసారి బుమ్రా పేరు తెరపైకి వచ్చింది. ఇక సినీ హీరోల్లో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన అనుపమ..తన తల్లి చేసే అన్ని వంటలు చాలా ఇష్టమని పేర్కొంది. పెయింటిగ్స్ వేస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని, ఈ మధ్యే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
నా వయసు ఇంకా అయిపోలేదంటూ పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై తన అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ఏ కార్యక్రమంలో అయిన శ్రీముఖి ఉంటే ఆ జోషే వేరు. తనదైన కామెడీ పంచులతో స్టేజ్‌పై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బుల్లి బుల్లి నెక్కర్లపై చిందేలేస్తూ, తరచూ అభిమానులతో చిటిచాట్ చేస్తూ లాక్డౌన్లో నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి అభిమానులతో మరోసారి ముచ్చటించింది. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా డిప్రెషన్ గురించి కూడా పలు అసక్తికర విషయాలను పంచుకుంది. ఇక తన పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నించిన ఓ అభిమానిపై మాత్రం కాస్తా ఫైర్ అయ్యింది ఈ రాములమ్మ. అయితే ఇంతకుముందు కూడా తన పెళ్లిపై వచ్చిన ప్రశ్నలకు చమత్కారిస్తూ సమాధానం ఇచ్చిన శ్రీముఖి ఈసారి కొంత అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘అందరి దృష్టి నా పెళ్లిపైనే ఉంది. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అలాగే నా వయసేం అయిపోలేదు. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న. ఇలాంటివన్నీ వదిలేయండి’ అంటూ కాస్తా గట్టిగానే సమాధానమిచ్చింది శ్రీముఖి. చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటావా?: పాట రూపంలో శ్రీముఖి రిప్లై -
చై కోసం జిమ్‌కి వెళ్లా
తను చేసిన పాత్రల్లో సమంతకి ఏది ఇష్టం? సమంత ఫేవరెట్ పుస్తకం ఏది? సోషల్ మీడియా ట్రోల్స్‌ను సమంత ఎలా హ్యాండిల్ చేస్తారు? 2021లో స్యామ్ తీసుకున్న కొత్త నిర్ణయాలేంటి? ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదా చిట్‌చాట్ చేశారు సమంత. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో కొన్ని ఇక్కడ చూడొచ్చు. ∙ ► మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? ‘ఓ బేబి’ సినిమాలో చేసిన క్యారెక్టర్, ‘ఫ్యామిలీ మ్యాన్’ (వెబ్ సిరీస్)లో చేసిన పాత్ర.. ఈ రెండూ చాలా ఇష్టం. ► 20 ఏళ్ల సమంతకు మీరు ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు? ‘కొంచెం ఎదుగు అమ్మాయి’ అని చెబుతాను. తెలియకుండా తను చాలా సిల్లీ సిల్లీ తప్పులు చేసింది (నవ్వుతూ). ► మీకు చాలా నచ్చిన పుస్తకం? ఒక్క పుస్తకం అని చెప్పలేను. కానీ చిన్నప్పుడు ఎస్ట్రిక్స్, ఓబ్లిక్స్ కామిక్స్ వల్ల పుస్తక పఠనం అలవాటయింది. ► సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్ మీ మీద ప్రభావం చూపుతాయా? ఇంతకు ముందు చాలా ప్రభావం చూపేవి. కొన్ని కామెంట్స్ చూసి నిద్రపోని రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు విమర్శలను పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు ఆ నెగటివ్ కామెంట్స్‌ను చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఆ విషయంలో చాలా ఎదిగాననే అనుకుంటున్నాను. ► 2020లో బెస్ట్ మొమెంట్ ఏంటి? రానా, మిహీకల పెళ్లి జరగడం. ► చైతన్య (నాగచైతన్య) సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్‌గా ఉండరు? కదా..! చైతన్యనే అడుగుదాం. చైతన్యా.. మీరు సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్‌గా ఉండరు? ► ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు? నేనెప్పుడూ ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఈ క్షణం సంతోషంగా ఉన్నామా? లేదా? ఆనందంగా ఉన్నామా? లేదా? అనేదే ముఖ్యం. ఇంకేదీ ఆలోచించను. ► మీకు ఫిట్నెస్ మీద.. జిమ్ మీద అంత శ్రద్ధ ఎలా వచ్చింది? అందరికీ ఇవాళ ఓ సీక్రెట్ చెబుతాను. చై (నాగచైతన్య) జిమ్ ఎక్కువ చేస్తుంటాడు. తనను కలవొచ్చనే ఉద్దేశంతోనే జిమ్‌కి వెళ్లడం మొదలెట్టాను. అలా మెల్లిగా వర్కౌట్స్ మీద నాకూ ఇష్టం పెరిగింది. ► ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేయాలంటారు? నేను డాక్టర్ని కాదు ఇవన్నీ చెప్పడానికి. కానీ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. శ్వాసను అదుపు చేసుకుంటే జీవితాన్ని అదుపు చేసుకున్నట్టే. ► ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ చేస్తున్నారు? తమిళ చిత్రం ‘కాదువాక్కుల రెండు కాదల్’ షూటింగ్ చేస్తున్నాను. ఈ సినిమా చాలా అంటే చాలా బావుంటుంది. మీ అందరికీ ఈ సినిమా త్వరగా చూపించేయాలనుంది. ► 2021లో మీరు తీసుకున్న నిర్ణయాలేంటి? పూర్తి స్థాయి శాకాహారిగానే కొనసాగాలి. యోగా, ధ్యానం ప్రతిరోజూ చేయాలి. మరింత సంతోషంగా ఉండాలి. -
ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి
ఇటీవలే ట్విట్టర్లో జాయిన్ అయ్యారు అనుష్క. ఆదివారం సాయంత్రం అభిమానులతో ఆమె చిట్‌చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలు. ► యోగా టీచర్‌గా మీరు నేర్చుకున్న విషయం? మనలో ప్రతి ఒక్కరూ భిన్నమైన వాళ్లమే. మనల్ని మనం కోల్పోకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, గౌరవించాలి. నిరంతరం స్వీయ విమర్శ చేసుకుంటూ ఉండాలి. ► మీకు ఇష్టమైన జంతువు? డాల్ఫిన్ అంటే బాగా ఇష్టం. ► లాక్డౌన్లో మీరు నేర్చుకున్న విషయం? మన జీవితం, మన చుట్టూ ఉన్నవన్నీ ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుందాం. ► మీకు నచ్చిన పుస్తకం? ఆల్కెమిస్ట్ ► గతానికి సంబంధించి ఏదైనా మార్చేసే అవకాశం వస్తే ఏం మారుస్తారు? ఇప్పటివరకూ జరిగిన ప్రతి విషయం నన్ను మంచి స్థాయిలో నిలబెట్టింది. అందుకే ఏదీ మార్చను. ► ప్రభాస్‌తో ఇంకో సినిమా చేయండి... మేమిద్దరం జంటగా నటించాల్సిన కథ కుదిరితే తప్పకుండా నటిస్తాం. ► కొత్త సినిమా విశేషాలు చెప్పండి.. త్వరలోనే నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ప్రకటన వస్తుంది. ► మీకు స్ఫూర్తిగా నిలిచినవాళ్ల పేర్లు చెప్పండి? మా అమ్మానాన్న, యోగా గురువు, అలానే నేను ప్రతి రోజూ కలిసేవాళ్లు. అందరూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు. -
ఆ మాట అంటే నేను ఇడియట్‌ని
‘‘మహేశ్‌బాబు ఎవరో తెలీదని నేనెప్పుడూ అనలేదు.. ఆయన తెలియదని చెబితే నాకంటే పెద్ద ఇడియట్ మరొకరుండరు’’ అంటున్నారు పాయల్ ఘోష్. ‘ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్’ వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పాయల్. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. హీరో ఎన్టీఆర్ అభిమానులు – హీరోయిన్ మీరా చోప్రా వివాదం, హీరో సుశాంత్ సింగ్ మరణం, నెపోటిజం.. వంటి విçషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారామె. ఈ లాక్డౌన్ సమయంలో తన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న ఆమె పలువురి హీరోలపై తన అభిప్రాయాన్ని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ‘హీరో మహేశ్‌బాబు ఎవరో నాకు తెలియదంటూ మీరు (పాయల్ ఘోష్) చెప్పారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి’ అంటూ చిట్‌చాట్‌లో భాగంగా ఓ నెటిజన్ ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు పాయల్ స్పందిస్తూ– ‘‘టాలీవుడ్లో నాకు ఇష్టమైన హీరోల్లో మహేశ్‌బాబు ఒకరు. అలాంటిది ఆయన తెలియదని నేనెలా చెబుతాను? ఆయన ఎవరో తెలీదని నేనెప్పుడూ అనలేదు. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నా. అసత్యమైన వార్తలు కాకుండా ప్రేమను, పాజిటివిటీని పంచండి’’ అని కోరారు. -
26 ఏళ్ల వయసులో ఆమెను ఇష్టపడ్డాను
మహేశ్‌బాబు ఫేవరెట్ కలర్ ఏంటి? ఆయనకు వంటొచ్చా? ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు? మహేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మహేశ్‌కి తన కుమార్తె సితార ఎక్కువ ఇష్టమా? కుమారుడు గౌతమ్ ఎక్కువ ఇష్టమా? ఆదివారం మహేశ్‌బాబు తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలు. ► మీకు బాగా ఇష్టమైన రంగు, ఫుడ్? మహేశ్‌బాబు : నచ్చిన రంగు బ్లూ. హైదరాబాద్ బిర్యానీ. ► లాక్డౌన్లో ఫ్యామిలీతో గడపడం ఎలా అనిపిస్తోంది? నా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఇది. వాళ్లతో చాలా క్వాలిటీ సమయాన్ని గడిపాను. ఒకవేళ పని (షూటింగ్) చేస్తూ ఉంటే ఇలాంటి ఫన్ కచ్చితంగా ఉండేది కాదు. ► మీకు ఇష్టమైన ఆట ఏంటి? మా అబ్బాయి గౌతమ్‌తో టెన్నిస్, గోల్ఫ్, బేస్‌బాల్ వంటి గేమ్స్‌ను ఆన్లైన్లో ఆడటానికి ఎక్కువ ఇష్టపడతాను. ► మీ పిల్లల కోసం మీరు వండగలిగే బెస్ట్ వంటకం ఏంటి? మ్యాగీ న్యూడిల్స్. ► మీకు స్ఫూర్తి ఎవరు? మా నాన్నగారు (కృష్ణ). ► మీ నాన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? ఒక్క మాటలో ఆయన్ని వివరించడం చాలా కష్టం. ► రష్మిక ఇష్టమా? సమంత ఇష్టమా? వాళ్లిద్దరూ నాకు బాగా తెలుసు. నా బెస్ట్ కో–స్టార్స్. ► మీరు ఇంత అందంగా ఉండటం వెనక సీక్రెట్ ఏంటి? మీ పొడగ్తలకు థ్యాంక్స్. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి చాలా కష్టపడుతుంటాను. ► ఈ లాక్డౌన్ మీ లైఫ్ స్టయిల్లో ఏదైనా మార్పు తీసుకువచ్చిందా? పెద్దగా మార్పేమీ లేదు. నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా రొటీన్ ఒకేలా ఉంటుంది. త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే నిద్రలేవడం నాకు అలవాటు. ► పని పట్ల మీరు చాలా ఫోకస్డ్గా ఉండటానికి కారణం? పర్ఫెక్షన్ కోసం తపించడం నా అలవాటు. ► ‘జేమ్స్ బాండ్’ లాంటి సినిమాలో మిమ్మల్ని చూడాలనుంది. నాకూ చేయాలనుంది. నీ దగ్గర ఏదైనా స్క్రిప్ట్ ఉంటే పంపు. ► అందరి దృష్టిలో మీరు ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? ఒక గొప్ప నటుడిగా, మా పిల్లలకు గొప్ప తండ్రిగా, నా భార్యకు గొప్ప భర్తగా గుర్తుండాలనుకుంటా. ► ‘సర్కార్‌వారి పాట’లో హీరోయిన్ ఎవరు? ఎవరైతో బావుంటారో నువ్వే చెప్పు. ► పూరి జగన్నాథ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు? నా అభిమాన దర్శకుల్లో పూరీగారు ఒకరు. ఆయన కథ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తున్నా. ► బాగా వర్షం పడుతోంది. ఏం స్నాక్స్ తింటే బావుంటుంది అనుకుంటున్నారు. మిర్చి బజ్జీ, అల్లం టీ. ► రాజమౌళిగారితో సినిమా ఎప్పుడు ఉంటుంది? కచ్చితంగా ఉంటుంది. ► మీరు పుస్తకాలు చదువుతారా? అవును. ప్రస్తుతం ‘సేపియన్స్’ చదువుతున్నా. ► ఇష్టమైన్ మార్వెల్ సూపర్ హీరో? ఐరన్ మేన్, హల్క్. ► ఎవరి మీదైనా క్రష్ ఉందా? 26 ఏళ్ల వయసులో ఒకామె (నమ్రత) మీద ఉండేది. ఆ తర్వాత తననే పెళ్లి చేసుకున్నాను. ► గౌతమ్ , సితార.. ఎవరెక్కువ ఇష్టం? వాళ్లిద్దరూ నాలో భాగమే. అందులో ఒకర్ని తక్కువ ఎలా ఇష్టపడతాను? ► మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నమ్రత. ► ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు? పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తాను. ఈత కొడతాను. మా పిల్లలతో ఆడుకుంటాను. మా కుక్కలతో సమయం గడుపుతాను. ► మీ అభిమానుల గురించి? మీ ప్రేమాభిమానాల వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. మీకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. మీ అందర్నీ ప్రేమిస్తాను. అందరూ ఇంట్లోనే ఉండండి. క్షేమంగా ఉండండి. ► గౌతమ్ భవిష్యత్తులో హీరో అవుతాడా? తనకి ఆ ఆలోచన ఉన్నట్టు అనిపిస్తోంది. చూద్దాం.. కాలమే సమాధానం చెబుతుంది. ► లాక్డౌన్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతోంది? కచ్చితంగా భిన్నంగా ఉండబోతోంది. ఆ మార్పుని అందరం అంగీకరించి జీవించాలి. మాస్క్ వేసుకుని జాగ్రత్తగా ఉందాం. హ్యాట్రిక్ ప్రారంభం సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డేకి కొత్త సినిమా అప్డేట్స్ ఇవ్వడం మహేశ్‌బాబు అలవాటు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సినిమాకి ‘సర్కారు వారి పాట’ టైటిల్ అని కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. పొడుగు జుట్టు, చెవి పోగు, మెడ మీద రూపాయి బిళ్ల ట్యాటూతో మహేశ్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘మహర్షి, సరిలేరు నీకెవ్వరు’ తర్వాత హ్యాట్రిక్‌కి బ్లాక్‌బస్టర్ ఆరంభం ఇది’’ అని లుక్‌ని రిలీజ్ చేశారు మహేశ్. -
ప్రపంచయాత్ర చేయాలని ఉంది
అటు సౌత్ ఇటు నార్త్ ఇండస్ట్రీస్‌లో హీరోయిన్గా మంచి జోరు మీద ఉన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు బంద్ కావడంతో రకుల్ స్పీడ్‌కు బ్రేక్ పడ్డట్లయింది. దీంతో ఇంటికే పరిమితమైన రకుల్ వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్‌తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే అభిమానులతో మాట్లాడాలనుకున్నారు. ‘ఏమైనా అడగండి.. చెబుతా’ అని ఫ్యాన్స్‌ని కోరారు. ఆ చిట్ చాట్ విశేషాలు. ► మీ దృష్టిలో విజయానికి నిర్వచనం? మనం ఎంత సంతోషంగా ఉంటున్నామన్నదే మన విజయాలకు చిహ్నం. మన జీవితంలో సంతోషం లేనప్పుడు ఎంత డబ్బు, ఎంత కీర్తి ఉంటే మాత్రం ఏం లాభం? ► ఎలాంటి వ్యక్తులను మీరు ఇష్టపడరు? టైమ్ వేస్ట్ చేసేవారంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. అలాగే ఎవరైతే వారి పని పట్ల అంకితభావంతో ఉండరో వారు కూడా నాకు నచ్చరు. ► విజయాల ప్రభావం మీపై ఎంతవరకూ ఉంటుంది? నా ఆలోచనలు కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాయి. అతిగా ఆనందపడటం, అతిగా బాధపడటం అనేది ఉండదు. ప్రస్తుతం విజయాలకు, అపజయాలకు అంతగా ప్రభావితం కాని స్థితిలో ఉన్నాను. ► ఒక డేటింగ్ చిట్కా ఇవ్వమంటే ఏం చెబుతారు? మీరు మీలా ఉండండి. ► లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ను నమ్ముతారా? నమ్మను. తొలిచూపులోనే ప్రేమ పుట్టదనుకుంటున్నాను. అది ఆకర్షణ మాత్రమే. ► మీ తొలిప్రేమ గురించి? నేనింకా ప్రేమలో పడలేదు. ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నాను. ► ఒక పర్ఫెక్ట్ కిస్ గురించి మీ అభిప్రాయం? అది మాటల్లో వర్ణించలేనిది. ఫీలవ్వాల్సిందే. ► ఒకవేళ మీ ప్రియుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని తెలిస్తే మీరేం చేస్తారు? ముందు అతను నన్ను ఎందుకు మోసం చేస్తున్నాడో అడుగుతాను. నిజానికి ఒక బంధంలో మోసానికి చోటు ఉండకూడదు. ఎందుకంటే జస్టిఫై చేయలేం. అందుకే అతన్ని నేను వదిలేస్తాను. ► ఒక మహిళ ఎప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తారని మీ భావన? ఆమెలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు. ► మీలో మీరు మార్చుకోవాలనుకుంటున్న ఓ విషయం గురించి చెప్పండి? నా పట్ల నేను కఠినంగా ఉంటాను. ఉదాహరణకు నాకు ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే ఆ రోజు నాలుగు గంటలకే లేచి వర్కౌట్, యోగా చేసి టైమ్‌కి సెట్లో ఉంటాను. షూటింగ్ అనే కాదు.. టైమింగ్స్ విషయంలో కరెక్ట్‌గా ఉండాలని అవసరానికి మించి నన్ను నేను కష్టపెట్టుకుంటాను. దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ► ప్రపంచంలో మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు? వీలైతే ప్రపంచయాత్ర చేయాలని ఉంది. అలాగే వివిధ దేశాల్లోని భిన్న వంటకాల రుచిని ఆస్వాదించాలని ఉంది. ఎందుకంటే నేను భోజన ప్రియురాలిని. -
నిజమైన స్నేహితులు వాళ్లే!
అభిమానులను ప్రత్యేకంగా పలకరించడానికి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాట్ చేస్తుంటారు తారలు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. అలా శనివారం తమన్నా తన ఫ్యాన్స్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నెటిజన్ల ప్రశ్నలకు సమాధాలు, కొందరికి సలహాలు ఇచ్చారు. వాటి గురించి తెలుసుకుందాం. ► ఈ ప్రపంచంలో మీకు అత్యంత విలువైనది ఏది? ► నా కుటుంబం ఎంతో విలువైనది. ► మీ ఫేవరెట్ ప్లేస్? ► మా ఇల్లు. ► మీ నిక్ నేమ్? ► తమ్ము. ► స్నేహితుల ప్రాముఖ్యత గురించి? ► మనం డౌన్లో ఉన్నప్పుడు మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారే నిజమైన స్నేహితులు. ► అపజయాలను మీరు ఎలా ఎదుర్కొంటారు? ► మన జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకునే అవకాశాన్ని కల్పించేవి అపజయాలే. ఏదైనా కొత్త విషయాన్ని స్టార్ట్ చేయడానికి కూడా అపజయాలే కొన్నిసార్లు స్ఫూర్తినిస్తాయి. అందుకని అపజయాలకు కుంగిపోకండి. ► హార్ట్‌ను ఫాలో కావాలా? బ్రెయిన్నా? ► దిల్ సే సునో... దిమాక్ సే కరో! (మనసుతో విను.. బుర్రతో చెయ్). ► మీరెప్పుడు క్రియేటివ్‌గా ఉంటారు? ► నాకు నేనులా ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు క్రియేటివ్‌గా ఉంటాను. ► టెన్నిస్‌లో మీరు ఏదైనా బహుమతి అందుకున్నారా? ► ఏదో అలవాటుగా ఆడతాను కానీ పోటీల్లో పాల్గొనను. ► మీ ఫేవరెట్ డిష్? ► పావ్ బాజీ.. (గ్లూటెన్ ఫ్రీ పావ్ మాత్రమే). ► ఫిల్మ్ ఇండస్ట్రీ లైఫ్ గురించి ఒక్క మాటలో... ► సాహసోపేతమైనది. ► ఏ జానర్ అయితే నటిగా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోగలరని భావిస్తున్నారు? ► యాక్షన్ కామెడీతో కూడుకున్న హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. ► నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు మీ ఆలోచనలు ఏంటి? ► ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. కెమెరాను బాగా ఫేస్ చేయాలి. ► గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ గుడ్ క్యారెక్టర్? ► సినిమాలు టీమ్ వర్క్‌పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆర్టిస్టుగా నేనొక మంచి టీమ్‌లో భాగం కావాలని కోరుకుంటాను. నాకొక మంచి క్యారెక్టర్ ఉన్న ఆసక్తికరమైన కథలను ఇష్టపడతాను. నటిగా నిరూపించుకోవ డానికి స్కోప్ ఉందా? అని చూస్తాను. -
రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదు..
సాక్షి, హైదరాబాద్ : సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేదని, జాతీయ చానెల్ స్క్రోలింగ్ చూసి అందరూ నిజమనుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. రోజూ న్యూస్ ఛానెల్స్‌లో ఏ అంశంపై చర్చ జరగాలనేది బీజేపీ నిర్ణయిస్తుందని, 2019లో మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు ప్రధాని అనే అంశంపై చర్చ నడిపించాలని బీజేపీ యోచిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీకి పలు అంశాల్లో సీఎం కేసీఆర్ సాయం చేశారని అన్నారు. మధుయాష్కీ బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. రాహుల్ విదేశీ పర్యటనల ప్రబావం ఏంటో పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు చూస్తే అర్ధమవుతుందన్నారు. ఇక రాష్ట్రాల్లో పరిస్థితి దృష్ట్యా కాంగ్రెస్ పొత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు విశ్వసనీయతే లేదని, రాజ్యసభలో వారికి ఎంపీలే లేరని తాము బీజేపీ సభ్యులను ఒప్పించి బిల్లు పాస్ అయ్యేలా చూశామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా ఉద్యమ సమయంలో కూడా కిరణ్‌కుమార్ రెడ్డి సమర్ధవంతంగా పాలించాడని కితాబిచ్చారు. -
కొంటె పనులు ఏం చేయలేదు
ఫ్యాన్స్ అంటే రాశీఖన్నాకి బోలెడంత అభిమానం. అందుకే అప్పుడప్పుడూ తన సినిమాల గురించి ట్వీటర్ ద్వారా అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ టైమ్ దొరికితే ఫ్యాన్స్‌తో చాట్ చేస్తారు. శనివారం అభిమానులకు ఆ చాన్స్ దక్కింది. ఆ చిట్ చాట్‌లోని కొన్ని విశేషాలు. ► మీ బ్యూటీ సీక్రెట్? టైమ్‌కు తినడం, పడుకోవటం. ఈ రెండూ పర్ఫెక్ట్గా లేకపోతే ఆ ఇంపాక్ట్ మన స్కిన్‌పై పడుతుంది. జిమ్‌లో మాత్రం బాగా కష్టపడతాను. ► ఫిట్నెస్ కోసం చాలా కష్టపడతారు. మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. హెల్తీగా ఉండాలనే కోరికలో నుంచి ఈ మోటివేషన్ లభిస్తుంది. ► మీ ఫేవరెట్ ఫిల్మ్? క్రిస్టొఫర్ నోలన్ తీసిన ‘ఇన్సెప్షన్’. అది మైండ్ బ్లోయింగ్ సినిమా. ► మీకు నచ్చిన కొటేషన్? చేంజ్ ఈజ్ ది ఓన్లీ కాన్స్టన్ట్ (మార్పొక్కటే స్థిరమైనది) ► మీ దృష్టిలో ఫెయిల్యూర్‌కి డెఫినేషన్ ? మన మీద మనకు నమ్మకం లేకపోవడం. ► మీ బ్యాడ్ మూడ్‌ని దూరం చేసేది? సంగీతం. ► స్కూల్లో మీరు చేసిన కొంటె పని? అలాంటి పనులు ఏం చేయలేదు.. స్కూల్లో నేను చాలా సైలెంట్ అమ్మాయిని. ► సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? హార్డ్ వర్క్. ► ప్రస్తుతం టాలీవుడ్లో మీ అభిమాన హీరోయిన్లు? సమంత, అనుష్క. ► యాక్టింగ్‌లో మీ ఇన్స్పిరేషన్? హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్. ► ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. సీక్రెట్ ఏంటి? ప్రతిసారీ పాజిటివ్‌గా ఉండటం కుదరదు. నేనూ కొన్నిసార్లు డౌన్ అవుతాను. కానీ, మన మీద మనకు ఉన్న నమ్మకమే మనల్ని పాజిటివ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ► లక్‌ని నమ్ముతారా ? నేను కేవలం సిన్సియారిటీ, హార్డ్ వర్క్‌నే నమ్ముతాను. ► వరుసగా యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న సినిమాల్లో ఎందుకు కనిపించరు? మేం స్క్రిప్ట్స్‌ని చూజ్ చేసుకోలేం, స్క్రిప్ట్సే మమ్మల్ని చూజ్ చేసుకుంటాయి. ప్రభావతి (ఊహలు గుసగుసలాడే), వర్ష (తొలిప్రేమ) లాంటి పాత్రలు తరచూ రావు. మాకు ఆఫర్ చేసిన దాంట్లో బెస్ట్ ఎంచుకోవడానికి ట్రై చేస్తా. ► నటిగా మారినప్పటి నుంచి మీలో మీరు గమనించిన మార్పు? మనుషుల్ని అర్థం చేసుకోవడంలో బెటర్ అయ్యాననుకుంటున్నాను. ► సూపర్ హీరో? పురాణాల్లో ఏదైనా పాత్ర? ఏది సెలెక్ట్ చేసుకుంటారు? పురాణాల్లో సూపర్ పవర్స్ ఉన్న ఏ క్యారెక్టర్ అయినా ఓకే. -
సన్నీ లియోన్‌కు క్షమాపణలు
సాక్షి, ముంబై: మాజీ శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు నటి రాఖీ సావంత్ క్షమాపణలు చెప్పారు. గతంలో సన్నీని టార్గెట్ చేసి రాఖీ తీవ్రంగా దూషించిన విషయం తెలిసిందే. సన్నీ రాకతో భారతీయ చిత్ర పరిశ్రమ భ్రష్టుపట్టే అవకాశం ఉందని ఓ ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాఖీ మండిపడ్డారు. బూతు సినిమాలు చేసుకునే సన్నీ తక్షణమే బాలీవుడ్‌ను, ఇండియాను విడిచిపోవాలంటూ రాఖీ అల్టిమేటం జారీ చేశారు కూడా. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలో కూడా సన్నీపై విచిత్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్న రాఖీ.. ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ‘సన్నీ గురించి నాకు ఏం తెలుసని నేను అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది ముమ్మాటికీ నా పొరపాటే. ఆమె గతం, జీవన ప్రయాణం నాకు అవసరం లేని విషయాలు. ప్రస్తుతం ఆమె ఏంటన్నది ముఖ్యం. పిల్లలను దత్తత తీసుకోవటం, సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సన్నీ చాలా గొప్పది. ఆమెను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆమెపై అనవసరంగా తప్పుడు వ్యాఖ్యలు చేశా. ఆమె జీవితాన్ని నిర్ణయించడానికి అసలు నేనెవర్ని? ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఆమెకు అందరి ముందు క్షమాపణలు చెబుతున్నా’ అని రాఖీ సావంత్ తెలిపారు. అంతకుముందు ఓ ప్రముఖ ఛానెల్ చిట్‌ఛాట్ షోలో మోడల్ అర్షి ఖాన్‌తోపాటు పాల్గొన్న రాఖీ సన్నీపై చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చెప్పారు. మరోవైపు అర్షి ఖాన్ కూడా ఇదే షోలో అఫ్రిదీపై చేసిన వివాదాస్పద ట్వీట్‌పై తప్పు ఒప్పుకున్న విషయం విదితమే. (‘శృంగారం’ ట్వీట్.. నా పొరపాటే!) -
రిస్క్ తీసుకున్నా...
తమిళసినిమా: చాలా రిస్క్ తీసుకుని నటించా అంటోంది నటి హన్సిక. చిన్న గ్యాప్ తరువాత శుక్రవారం గులేబాకావళి చిత్రంతో తమిళ తెరపైకి వచ్చింది ఈ బ్యూటీ. ప్రభుదేవా హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను వినోదంతో కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ సందర్భంగా హన్సికతో చిన్న చిట్‌చాట్ ప్ర: గులేబాకావళి చిత్రం గురించి? జ: ఈ చిత్ర కథ 1945లో ప్రారంభమవుతుంది. ఒక నిధి బయట పడుతుంది. దాన్ని సొంతం చేసుకోవడానికి ఒక ముఠా ప్రయత్నిస్తుంది. ఆ నిధి ఎవరికి దక్కుతుందనేదే చిత్ర కథ. ఆద్యంతం వినోదభరితంగా, ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్ర: చిత్రంలో మీ పాత్ర ఏమిటి? జ: ఇందులో నిధి కోసం ప్రయత్నించే ముఠాలో ఒకరిగా ప్రభుదేవా నటించారు. నేనూ తొలిసారిగా దొంగగా నటించాను. దర్శకుడు కల్యాణ్ కథ చెప్పినప్పుడు నేనీ చిత్రంలో నటించగలనా అని భయపడ్డాను. అయితే దర్శకుడు ధైర్యం చెప్పి నటింపజేశారు. ప్ర: దర్శకుడు ప్రభుదేవా ఎలా ఉండేవారు? నటుడు ప్రభుదేవా ఎలా అనిపించారు? జ: నేను ఇంతకు ముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్ కాదల్ చిత్రంలో నటించాను. దర్శకుడిగా ఆయన చాలా టెన్షన్‌గా, హడావుడిగానూ ఉండేవారు. నటుడిగా చాలా జాలీగా ఉంటారు. ఆయనకు జంటగా నటించడం చాలా మంచి అనుభవం ప్ర: తమిళంలో ఇన్నేళ్లుగా, పలు చిత్రాల్లో నటించినా ఇప్పటికీ తమిళ భాషను సరిగా మాట్లడలేకపోతున్నారే? జ: నిజం చెప్పాలంటే నా సహాయకులతో తమిళంలోనే మాట్లాడతాను. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం బెటర్. త్వరలోనే సరళంగా తమిళ భాషను మాట్లాడగలుగుతాననుకుంటున్నా. ప్ర: మీరు కథలను ఎలా ఎంచుకుంటారు? జ: మొదట నాకు కథ నచ్చాలి. అందులో నా పాత్రకు కాస్త అయినా ప్రాధాన్యత ఉండాలి. కాన్సెప్ట్ వైవి«ధ్యంగా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా అమరితే వెంటనే నటించడానికి రెడీ అంటాను. ప్ర: గులేబాకావళి చిత్రంలో ఫైట్స్ కూడా చేశారట? జ: అవును నటుడు ఆనందరాజ్‌తో ఫైటింగ్ సన్నివేశాల్లో నటించాను. అలా ఈ చిత్రం కోసం కాస్త రిస్క్ తీసుకున్నాను. -
నాకు ఆ కోరిక లేదు.. అర్హత లేదు!
సాక్షి, అమరావతి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని అవ్వాలన్న కోరిక లేదని, ఆ అర్హత కూడా లేదని అన్నారు. ఫిరాయింపులపై ఫిర్యాదులు వస్తే మూడు నెలల్లో పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రత్యక్ష ప్రసారాలుండటం వల్ల కొందరు సభ్యులు సభలో హడావిడి చేస్తున్నారని అన్నారు. అయితే, సభ్యుల ప్రవర్తన తెలిసేందుకు ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలనే అభిప్రాయం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
టికెట్.. టికెట్..
సాక్షి, హైదరాబాద్: తమ ప్రాంతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి నిధులను సమకూర్చి, కళాశాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకలో బెనిఫిట్ సినిమా షో వేయిస్తున్నారు. బుధవారం ఆయన సిని మా టికెట్లు పట్టుకొని అసెంబ్లీ లాబీలో కనిపించారు. చేతిలో టికెట్లను చూసిన విలేకరులు ఆయన చుట్టూ చేరి ‘టికెట్లు ఎంతకు ఇస్తున్నారన్న,’ ‘ఎమ్మెల్యేలను అమ్ముతున్నారా’ అంటూ ఆయనతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. టికెట్ ధర రూ.5 వేలని, తమ ప్రాంతానికి చెందిన ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు మాత్రమే అమ్ముతామని ఎమ్మెల్యే వివరించారు. కొంత మంది జర్నలిస్టు మిత్రులకు ఇచ్చేందుకు ఆ టికెట్లు తెచ్చానని పేర్కొన్నారు. బెనిఫిట్ షో ద్వారా రూ.15 లక్షలు కూడబెట్టి జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తామని, ఆ నిధులను కళాశాల అభివృద్ధికి ఖర్చు చేస్తారని చెప్పారు. పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని చెప్పారు. -
పావ్ బాజీ ఉంటేనే పిలవండి!
అభిమానులకు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? అభిమాన తారతో కలసి ఫొటో దిగినప్పుడు, తాము అడిగిన ప్రశ్నలకు ఆ స్టార్ సమాధానం చెప్పినప్పుడు. ఫ్యాన్స్ తమ నుంచి ఇవి తప్ప వేరే కోరుకోరు కాబట్టి, స్టార్స్ కూడా అప్పుడప్పుడు ఆ అవకాశాలిస్తుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా తన ఫ్యాన్స్‌ని క్వొశ్చన్స్ అడగమన్నారు. ఈ గోల్డెన్స్ ఛాన్స్‌ని మిస్ చేసుకోకుండా ఎంతోమంది ఫ్యాన్స్ తమ్మూతో ‘చాట్’ చేశారు. ఆ విశేషాలు. ► మీరు గర్వంగా ఫీల్ అయ్యేదెప్పుడు? మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నప్పుడు. ► మీ రోల్ మోడల్? మా ఇంట్లోనే ఉన్నారు.. మా అమ్మగారు. ► తెలుగు లాంగ్వేజ్ గురించి? వెరీ స్వీట్ లాంగ్వేజ్. నేను తెలుగు మాట్లాడతాను. అయితే మరింత చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ► మీరు టాలీవుడ్లోనే ఉండాలి.. ఉంటాను. తెలుగులో మరిన్ని సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను. ► మీ స్ట్రెస్ బస్టర్? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం. ► మీకిష్టమైన కలర్? ఈ విషయంలో నా అభిప్రాయాలు మారుతుంటాయి. ప్రజెంట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్. ► మీ బ్యూటీ సీక్రెట్? హెల్తీ ఫుడ్ అండ్ గుడ్ వర్కౌట్. ► సినిమాలు లేకుండా మీ లైఫ్‌ను ఊహించుకోగలరా..? లేదు. ► లైఫ్‌లో మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఏంటి? ఫాలోయింగ్ మై డ్రీమ్స్ అండ్ యాక్టింగ్‌ను నా వృత్తిగా ఎంచుకోవడం. ► మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తే కచ్చితంగా ఉండాల్సిన ఐటమ్ ఏది? పావ్ బాజీ. ► మీ పేరుకు అర్థం? డిజైర్ (కోరిక) ► మీకు బాగా సూట్ అయ్యే క్యారెక్టర్ ఏదనుకుంటున్నారు? ఒక నటిగా ప్రతి పాత్రను బాగా చేయాలని కోరుకుంటాను. ► వ్యతిరేక ఆలోచనలను ఎలా అధిగమిస్తారు? పాజిటివ్ థింగ్స్‌పై ఫోకస్ చేస్తాను. నెగిటివ్ థింగ్స్‌ను వదిలేస్తాను. -
సంగీత దర్శకురాలు శ్రీలేఖతో చిట్‌చాట్
-
రజనీతో అవకాశం కోసం చూస్తున్నా
రజనీకాంత్‌తో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా నటించడానికి రెడీ అంటున్నారు నటి హన్సిక. చక్కని అందం, అభినయంతోపాటు మంచి మానవత్వం హన్సికలో అదనపు అర్హత. సామాజిక స్పృహ ఉన్న నటి. ప్రముఖ కథానాయికల్లో ఒకరిగా వెలుగొందుతున్న హన్సిక చేతిలో ప్రస్తుతం అరడజను చిత్రాల వరకూ ఉన్నాయి. వేలాయుధం తరువాత విజయ్‌తో నటించిన చిత్రం పులి. ఈ చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం సాధించే విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాలరాతి బొమ్మతో చిట్‌చాట్. ప్రశ్న: పులి చిత్రంలో నటించిన అనుభవం గురించి? జవాబు: పులి చిత్రంలో యువరాణిగా నటించాను. ఇందులో కొన్ని సంభాషణలను బట్టీ పట్టి చాలా కష్టపడి చెప్పాను. విజయ్, శ్రీదేవి, శ్రుతీహాసన్, సుదీప్ తదితర ప్రముఖ నటీనటులతో నటించడం మంచి అనుభవం. ప్రశ్న: విజయ్‌తో ఇంతకు ముందు వేలాయుధం చిత్రంలో నటించారు. ఇప్పుడు పులి చిత్రంలో చేశారు. ఆయనలో మీకు కనిపించిన మార్పు? జ: ఆయనలో యవ్వనం నానాటికీ పెరుగుతోందనే చెప్పాలి. ఎలాగో తెలియదు గానీ సహనటీనటులతో అనుసరించి నటిస్తారు. ఒక పెద్ద స్టారనే భావం ఎప్పుడూ విజయ్‌లో కనిపించదు.ఆయనతో నటించడం నాకెప్పుడూ ఇష్టమే. విజయ్ గుణం, మనసు, ఇతరులకు సాయం చేసే తత్వం నాకు బాగా నచ్చాయి. ప్రశ్న: పులి చిత్రంలో మీ రాణీ గెటప్ గురించి? జ: యువరాణి పాత్ర కోసం వజ్రాలతో పొదిగిన నగలను ధరించాను. వాటిని మరింత మెరుగు పరిచేలా కాస్ట్యూమ్స్, హెయిర్డ్రెస్, మేకప్ అంటూ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం. అందుకే రాజసం ఉట్టిపడేలా కనిపిస్తాను. ప్రశ్న: అరణ్మణైలో ఆండ్రియా, అరణ్మణై-2లో త్రిష, పులిలో శ్రుతీహాసన్ ఇలా ఇద్దరు కథానాయికల చిత్రాలలోనే నటిస్తున్నారే? జ: అలా నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ విషయం గురించి నేను అస్సలు పట్టించుకోను. నా పాత్ర ఏమిటన్న అంశం పైనే దృష్టి పెడతాను. నేను అందరితోనూ స్నేహంగా మసలుకుంటాను. ఇటీవల నటి త్రిషతో కూడా మిత్రత్వం పెంచుకున్నాను. ప్రశ్న: రజనీకాంత్ కొత్ర చిత్రం మొదలైన ప్రతి సారీ ఆయనతో నటించే హీరోయిన్లలో మీ పేరు వినిపిస్తోంది. ఆయనతో ఎప్పుడు నటిస్తారు? జ: ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు అవకాశం వచ్చినా రజనీకాంత్‌తో నటించడానికి నేను రెడీ. ప్రశ్న: పులి చిత్రంలో శ్రీదేవితో నటించిన అనుభవం గురించి? జ: చాలా మంచి అనుభవం. శ్రీదేవి గొప్ప నటి అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. మేడమ్ కెమెరా ముందుకు వచ్చారంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించడం చూశాను. అలాంటి ఆమెకు కూతురుగా పులి చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. మొత్తం మీద పులి చిత్రంలో నటించడమే తీయని అనుభవం. ప్రశ్న: ఎలాంటి పాత్రలో నటించాలని ఆశ పడుతున్నారు? జ: ప్రేక్షకులు ఇష్టపడే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధమే. -
పవన్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలి: వైఎస్ జగన్
-
పవన్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ప్రసంగం అంతా అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలతో నిండి ఉందని శాసనసభా ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నది అర్థసత్యమో లేక అబద్దమో చెప్పాలన్నారు. రాజధాని భూముల్లో 3 నుంచి 4 పంటలు పండుతున్నాయన్నారు. రాజధాని ప్రాంతంలోని పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదవుతున్నారని చెప్పారు. మంత్రి నారాయణ తన కాలేజీల్లో ఫీజులు కట్టడం ఒకరోజు ఆలస్యమైతే పిల్లల తల్లిదండ్రులకు పాతికసార్లు ఫోన్ చేసి అడుగుతున్నారని వెల్లడించారు. అధర్మం ఎప్పుడూ ఓడిపోతుందన్నారు. మానవత్వంతో తమ పార్టీ రాజధాని రైతులకు అండగా నిలిచిందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారో ప్రజల్ని అడగాలన్నారు. పవన్ మొన్న ఏం చెప్పారు, నిన్న ఏం చెప్పారు. రేపు ఏంచెప్తారో తెలియదని వ్యంగ్యంగా అన్నారు. రూ. 20 వేల కోట్లకుపైగా నిధులకు సంబంధించిన జీవో 22 గురించి ఎవరూ మాట్లాడడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ అబయెన్స్ లో పెట్టిన వివాదస్పద జీవోను అమలు చేయడం అవినీతి కాదా అని జగన్ ప్రశ్నించారు. పట్టిసీమకు 22 శాతం ఎక్సెస్ టెండర్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడం అవినీతి కాదా అని అడిగారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం నిరాశపరిస్తే... సీఎం చంద్రబాబు తన మంత్రులను కేంద్ర కేబినెట్ లో ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీకి చెందిన వారిని రాష్ట్ర మంత్రివర్గంలో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ సన్నాయి నొక్కులు, డ్రామాలు ఎవర్ని మోసం చేయడానికి సూటిగా ప్రశ్నించారు. -
తుమ్మెద టీమ్‌తో చిట్‌ఛాట్