![Bigg Boss 5 Telugu: Uma Devi Chit Chat With Her Fans on Instagram - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/21/kar.gif.webp?itok=MV-wKbmy)
Bigg Boss Telugu 5 Uma Devi Chit Chat With Fans: కార్తిక దీపం సీరియల్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సీరియల్‌లో అర్థపావు భాగ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి ఉమాదేవి బిగ్‌బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడటం, చిన్న విషయానికే గొడవకు దిగడం ఆమెకు పెద్ద మైనస్‌గా మారాయి. దీంతో రెండో వారంలోనే ఆమె ఇంటి దారి పట్టింది.చదవండి: బిగ్‌బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే...
ఇదిలా ఉండగా, తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ఉమాదేవి..బిగ్‌బాస్ జర్నీ గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంది. తాను ముక్కుసూటిగా మాట్లాడతానని, అయితే హౌస్‌మేట్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. రెండో వారంలోనే హౌస్ నుంచి బయటకు రావడం బాధగా ఉందని, అక్కడే ఉంటే ఇంకా ఎక్కువగా ఎంటర్‌టైన్ చేసేదాన్ని అని అభిప్రాయపడింది.
ఇక బిగ్‌బాస్ షో అందరూ అనుకుంటున్నట్లు కాదని అసలు స్క్రిప్టు అనేది ఉండదని, చాలా జెన్యూన్ గేమ్ షో అని పేర్కొంది. అవకాశం ఉంటే మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఇంకా బాగా ఎంటర్‌టైన్ చేస్తానని వెల్లడించింది. త్వరలోనే అర్థపావు భాగ్యంగా సీరియల్‌లో కనిపిస్తానని చెప్పింది. 'మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చాడో లేదో తెలియదు. కానీ మా డాక్టర్ బాబు బాగుండాలి. మా దీప బాగుండాలి' అంటూ ఫన్నీగా తెలిపింది.
Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా'
Comments
Please login to add a commentAdd a comment