శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా? | Siri Hanmanth Shares Emotional Post On Boyfriend Srihan in Instagram | Sakshi
Sakshi News home page

Siri Hanumanth: శ్రీహాన్‌పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు, చివరికి ఇలా క్లారిటీ ఇచ్చిందా?

Published Thu, Apr 7 2022 2:12 PM | Last Updated on Thu, Apr 7 2022 2:37 PM

Siri Hanmanth Shares Emotional Post On Boyfriend Srihan in Instagram - Sakshi

సిరి హన్మంత్‌.. బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌ 5 సీజన్‌ తర్వాత సిరి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. విమర్శలు, ట్రోల్స్‌తో ఆమె బాగా పాపులర్‌ అయ్యింది. దీనికి కారణం బిగ్‌బాస్‌ హౌస్‌లో యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ఆమె అతి సన్నిహితంగా ఉండటమే. ఇక బయటకు వచ్చిన ఆమె తనపై వస్తున్న నెగిటివిటీని చూసి షాకయ్యింది. ఈ స్థాయిలో తనకు వ్యతిరేకత రావడం చూసి డిప్రెషన్‌లోకి వెళ్లింది. అలాంటి సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్‌, నటుడు శ్రీహాన్‌ ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు.

చదవండి: ఎన్టీఆర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చాయి, ఎమోషనల్‌ అయ్యా: ఒలీవియా

అయితే ప్రారంభంలో అతను కూడా సిరిని దూరం పెట్టాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు వారిద్దరికి సంబంధించిన వ్యక్తిగత పోస్ట్‌లను కూడా శ్రీహాన్‌ డిలిట్‌ చేయడంతో షణ్మఖ్‌-దీప్తి సునైన బాటలోనే వీరు కూడా బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ అలాంటిదేం లేదని శ్రీహాన్‌ క్లారిటీ ఇచ్చాడు. అటు సిరి కూడా శ్రీహాన్‌ బర్త్‌డే విష్‌ తప్పితే అతడి గురించి స్పెషల్‌గా ఎలాంటి పోస్ట్‌ షేర్‌ చేయకపోవడంతో ఆ ఊహాగానాలకు బ్రేక్‌ పడలేదు. దీంతో వారి ఫాలోవర్స్‌లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా వాటిన్నింటికి చెక్‌ పెడుతూ సిరి, శ్రీహాన్‌తో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ సందర్భంగా అతడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘ప్రతి క్షణం(మంచి-చెడు సమయాల్లో) నా పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి,  నా గార్డియన్‌, నా సర్వస్వం. అతడే ఇతను. మై వన్‌ అండ్‌ ఓన్లీ శ్రీహాన్‌’ అంటూ సిరి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వీరిద్దరిని ఒక్కటిగా చూసిన ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ఈ పోస్ట్‌తో వారి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని సిరి చెప్పకనే చెప్పిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: ప్లీజ్‌ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా

మొత్తానికి సిరి-శ్రీహాన్‌ కలిశారని, ఇక షణ్ముఖ్‌, దీప్తిలో ఎప్పుడు కలుస్తారో అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌లో షణ్ముఖ్‌, సిరి తీరుపై విపరీతమైన నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్‌, దీప్తి విడిపోవడానికి సిరి కారణమంటూ ఆమెను నిందించారు.  త‌న‌కు బ‌య‌ట ఒక ప్రియుడున్న‌ప్ప‌టికీ ఆ విష‌యం మ‌ర్చిపోయి షణ్నూకి హ‌గ్గులు, ముద్దులిస్తూ అతిగా ప్ర‌వ‌ర్తించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement