
Siri Boy Friend Comments On Siri Shannu Relationship: బిగ్‌బాస్ షోలో సిరి- షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో బాగానే ఉన్నా, ఈ మధ్య చీటికిమాటికి హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో షణ్న-సిరిలపై సోషల్ మీడియాలోనూ కాస్త నెగిటివిటి పెరుగుతుంది. వీరిద్దరూ సింగిల్‌గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్‌బాస్‌కు రాకముందే సిరి శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్‌ను నెటిజన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా సిరి వల్లే షణ్నూ గేమ్ దెబ్బతింటుంది అని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక ప్యామిలీ ఎపిసోడ్‌లోనూ షణ్నూని హగ్ చేసుకోవడం నచ్చడం లేదని సిరి తల్లి ఆమెకు అందరిముందే వార్నింగ్ ఇచ్చింది. ఎవరి గేమ్ వాళ్లు ఆడితే మంచిదంటూ ఇద్దరికీ హితబోద చేసింది. అయితే హౌస్‌లో అందరిముందే సిరి వాళ్ల మథర్ అలా అనడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సదరు తల్లిగా కూతురికి తప్పొప్పులు గురించి చెప్పిందంటూ కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుంటే, షోలో అందరి ముందు అలా అనడం కరెక్ట్ కాదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సిరి బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త శ్రీహాన్ స్పందించాడు.
'సిరి మథర్‌కి ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉంటున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తీసుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడవద్దు. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇక సిరి, షణ్నూల రిలేషన్‌ను నేను గౌరవిస్తాను' అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీహాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.