
After Shanmkh And Deepthi Breakup, Shrihan Deleting Siri Pics In Instagram: బిగ్‌బాస్ సీజన్-5 రెండు జంటల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్.. త్వరలోనే ఆమెకు గుడ్‌బై చెప్పనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బిగ్‌బాస్ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు.
అయితే తాజాగా సిరితో తెగదెంపులు చేసుకునేందుకు శ్రీహాన్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చాడు. కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నుంచి తొలగించాడు.
బిగ్‌బాస్ షోలో అనేక సార్లు షణ్నూతో కనెక్షన్ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్ గుండె బద్దలయ్యిందని, ఎంగేజ్‌మెంట్ జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి షణ్నూతో చేసిన రొమాన్స్ భరించలేక శ్రీహాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపై వారిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఇటీవలె సిరి బర్త్‌డేకు సైతం శ్రీహాన్ విషెస్ చెప్పడం విశేషం.