Bigg Boss 5 Siri Comments About Her Marriage And Negative Trolls On Social Media - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Siri: 'అవి చూసి షాకయ్యా.. షణ్నూతో హగ్గులు జనాలు రిసీవ్‌ చేసుకోలేదు'

Published Mon, Dec 20 2021 11:17 AM | Last Updated on Mon, Dec 20 2021 4:01 PM

Bigg Boss 5 Siri Comments About Her Marriage And Negative Trolls On Social Media - Sakshi

Bigg Boss 5 Siri Comments About Her Marriage And Negative Trolls On Social Media: బిగ్‌బాస్‌ షోలో సిరి-షణ్నూల రిలేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్‌ అని స్టేట్‌మెంట్స్‌ ఇచ్చినా ఆడియెన్స్‌కు మాత్రం వీరి రిలేషన్‌ అంతగా రుచించలేదు. బయట వీరిద్దరికి బాగానే ఫాలోయింగ్‌ ఉన్నా హౌస్‌లోకి వచ్చాక మాత్రం నెగిటివిటి పెరిగింది. ఈ కారణంగానే టైటిల్‌ రేసులో ఉన్న షణ్ముక్‌ కప్పు చేజార్చుకున్నాడనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా హౌస్‌ నుంచి బయటకు వచ్చిన సిరి తనపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్‌, షణ్నూతో తనకున్న రిలేషన్‌ గురించి మాట్లాడింది. 

'బయటకు రాగానే యూట్యూబ్‌లో వచ్చిన థంబ్‌నేల్స్‌, వీడియోలు,సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్స్‌ చూసి షాక్‌ అయ్యా. షణ్నూ నాకు చాలా మంచి ఫ్రెండ్‌. నా లైఫ్‌లోనే తను చాలా స్పెషల్‌. హౌస్‌ లోపల ఎంత నిజాయితిగా ఉన్నామో, బయటకు వచ్చాక కూడా మేం అలాగే ఉంటాం. షణ్నూ నన్ను చాలా మోటివేట్‌ చేసేవాడు. అలా మేం క్లోజ్‌ అయ్యాం. కానీ హగ్‌ చేసుకోవడం బయట రిసీవ్‌ చేసుకోలేదు' అని అర్థమైంది.

అయినా మా పర్సనల్‌ లైఫ్‌ గురించి మా ఇద్దరికీ క్లారిటీ ఉంది. మా లైఫ్‌ పార్టనర్స్‌కి కూడా క్లారిటీ ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియుడు శ్రీహాన్‌తో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తను ఎప్పుడంటే అప్పుడే మా పెళ్లి. బయట ఒకవేళ సినిమా ఆఫర్స్‌ వస్తే అవి చేస్తూనే పర్సనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తా అని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement