marraiage
-
మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్
ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచిలర్స్ జీవితానికి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్లో చేరారు. తన లేడీలవ్‌తో ఏడడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.విలేన్గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్. తాజాగా ( మార్చి 16)తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే, విలేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు మా కష్టాలు, బాధలు, అనుభవించిన, బాధ , ప్రేమ అన్నీ.. చివరకు ఇలా.. జీవితాంతం కలిసి పయనించబోతున్నాం’’ తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు.విలేన్,దివ్య దహియా పెళ్లిదుస్తుల్లో అత్యద్భుతంగా కనిపించారు. తెల్లటి, సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్‌తో అదిరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్గితో అలంకరించిన తెల్లటి పగ్డితో, గడ్డంతో విలేన్ లుక్ మరింత ఎలివేట్ అయింది.ఇకవధువు దివ్య పాస్టెల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్‌తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీర్ దుపట్టా, క్లాసీగా కనపించింది. డైమండ్ నెక్లెస్, గ్యాజులు మ్యాచింగ్ చెవిపోగులు ,మాంగ్ టీకాతో లుక్‌ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు..దిష్టి తగిలేను జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు.గాయకుడిగా విలేన్ న్యూ ఢిల్లీకి విపుల్ దనాకర్ యూట్యూబ్‌లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ‘ఏక్ రాత్’,చిడియా (2019) పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు.అలాగే సావన్, జవానీ లాంటి పాటలతోపాటు, కనికా కపూర్ తో పాడిన తాజా పాట ‘చురాకే’ మరింత ప్రజాదారణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా,రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దర్శకత్వం , స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్ కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి,అప్పడేరాణిస్తాం అంటాడు విలేన్. View this post on Instagram A post shared by Vilen (@vilenofficial) -
రూ.20 లక్షలు ఇస్తా.. నన్ను మరిచిపో..
బంజారాహిల్స్(హైదరాబాద్) : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సదరు యువతితో చనువుగా మెదిలాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం.. మరిచిపో అంటూ తాపీగా చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లో నివసిస్తున్న సాయిప్రణీత్ (26) సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. ఆయన బెంగళూరులో ఉన్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్ గదిలో పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతి సాయిప్రణీత్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అనంతరం నగరంలోని గాయత్రీ హిల్స్‌కు మకాం మార్చిన సాయిప్రణీత్.. కొద్ది రోజులు యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లెలి పెళ్లి తర్వాత మన పెళ్లి జరుగుతుందంటూ ఆమెను నమ్మించి గత ఏడాది నవంబర్‌లో వెళ్లిపోయాడు.మీ చెల్లెలి పెళ్లి ఫొటోలు పంపించాలని యువతి చెప్పగా.. కొన్నింటిని పంపించాడు. ఆ ఫొటోలను చూసి అనుమానం వచ్చినది బాధితురాలు ఇటీవల మరింతగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల క్రితం సాయిప్రణీత్ గదికి వెళ్లిన ఆమెను కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు నాతో తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తాను.. మన బంధం మరిచిపో అంటూ చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన యువతి
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిట్టనిలువునా మోసగించిందో కిలేడీ. ఈ కేసులో తిరుపతికి చెందిన తమ్మ హేమమణి అలియాస్ ప్రీతి రెడ్డి..ఆమెకు సహకరించిన కొండారెడ్డిలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి చెందిన 45 ఏళ్ల బాధితుడికి గతేడాది మేలో విడాకుల మ్యాట్రిమోనీ యాప్ ద్వారా హేమమణితో పరిచయం ఏర్పడింది. తాను ఎంబీబీఎస్, ఎండీ అర్హతలు కలిగిన కార్డియాలజిస్ట్ అని పరిచయం చేసుకుంది. విడాకులు తీసుకొని భర్తతో దూరంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో తక్కువ కాలంలోనే పలు సామాజిక మాధ్యమాలలో ఇరువురూ సన్నిహితులుగా మారిపోయారు. కొంతకాలం తర్వాత నిందితురాలు వివాహ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో బాధితుడు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె రోగికి చికిత్స చేయడానికి నిధులు అవసరమని పేర్కొంటూ బాధితుడి నుంచి సొమ్ము వసూలు చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. తర్వాత ఆమె బాధితుడిని మళ్లీ సంప్రదించి తన తల్లి చనిపోయిందని అత్యవసరంగా ఇంకొంత సొమ్ము అవసరముందని చెప్పింది. పలు లావాదేవీల్లో మొత్తం రూ.4.97 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మధులత నేతృత్వంలోని బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ప్రభాస్ పెళ్లి ఎవరితో.. రివీల్ చేసిన రామ్ చరణ్
ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు..? ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరూ అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా డార్లింగ్‌కు కాబోయే సతీమణి వివరాలను రామ్ చరణ్ వెళ్లడించారు. బాలకృష్ణ (Balakrishna) నిర్వహించే అన్‌స్టాపబుల్ వేదికగా చరణ్(Ram Charan) ఈ విషయాలు చెప్పనట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్ రివీల్ చేశారని టాక్ ఉంది.గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యతో పాటు చరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే ఒక భాగం టెలికాస్ట్ అయింది. రెండో భాగం జనవరి 14న విడుదల అవుతుంది. అయితే, ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపవరానికి చెందిన అమ్మాయిని అతడు పెళ్లి చేసుకోనున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ మరో రెండురోజుల్లో ప్రసారం కానుంది. అందులో ప్రభాస్ పెళ్లి విశేషాలు ఏమైనా తెలుపుతారేమో చూడాలి. ఈ వార్త బయటకు రాగానే డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌కు రామ్ చరణ్ ఫోన్ చేసి మాట్లాడుతారు. అదే సమయంలో బాలయ్య కూడా సరదాగా పలు విశేషాల గురించి డార్లింగ్‌తో ముచ్చటించారు. చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రభాస్ అక్కడ పంచుకున్నారు. ఇదే షోలో చరణ్ స్నేహితులు శర్వానంద్, విక్కీ కూడా పాల్గొన్నారు.2025 దసరా లోపు పెళ్లికృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి రీసెంట్గా ప్రభాస్ పెళ్లి గురించి ప్రకటించారు. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. అమ్మాయి ఎవరు..? డేట్ వంటి వివరాలు చెప్పను గానీ అంటూనే త్వరలో శుభకార్యం తప్పకుండా ఉంటుందని ఆమె అన్నారు. ఈ దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చరణ్ మాటలు చూస్తుంటే డార్లింగ్ పెళ్లి త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు) సలార్,కల్కి సినిమాల హిట్‌తో ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ లైనులో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన డైరీలో ఉన్నాయి. -
వందెకరాల ఆసామినంటూ 4 పెళ్లిళ్లు
ఏలూరు టౌన్: మ్యాట్రిమోనీ ద్వారా వల వేసి అనేక మందిని మోసం చేస్తూ భారీగా డబ్బులు కాజేసిన నిత్య పెళ్లికొడుకుని భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందిన ఆశం అనిల్‌బాబు అలియాస్ కళ్యాణ్‌రెడ్డి 9వ తరగతి వరకే చదివినా.. ఇస్రోలో హెచ్ఆర్ అని చెప్పుకునేవాడు. భారత్ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో కల్యాణ్ పేరుతో రిజిస్టర్ చేసుకోగా, పెళ్ళి సంబంధాలు రాకపోవడంతో కళ్యాణ్ రెడ్డిగా మార్చాడు. పెళ్ళి సంబంధాల కోసం ఫోన్ చేసేవారిని తన తండ్రి మాట్లాడుతున్నట్టుగా నమ్మిస్తాడు. తన కొడుకు ఇస్రోలో పనిచేస్తున్నాడని, తాను, తన భార్య ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నామని, తమకు 100 ఎకరాల భూమి, రెండు విల్లాలు ఉన్నాయని నమ్మిస్తుంటాడు. కట్నకానుకలతో పనిలేదని చెబుతూ పెళ్ళి చూపులకు వెళతాడు. పెళ్ళి కూతురు నచ్చిందంటూనే వారి బంధువుల వివరాలు సేకరిస్తాడు. వారికి ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి భారీ మొత్తంలో నగదు కాజేస్తాడు. జనాలను నమ్మించేందుకు హైదరాబాద్‌లో ఒక ఫాం హౌస్, బెంగళూరులో ఒక విల్లాను అద్దెకు తీసుకుని వాటిని తనవే అని కలరింగ్ ఇస్తాడు. హైదరాబాద్‌లో ఒక పీఏ, వాచ్‌మేన్, ఒక మహిళా అసిస్టెంట్, ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని.. సలహాలు ఇచ్చేందుకు కాశీ అనే వ్యక్తిని, పెళ్ళి చేసేందుకు పంతులును సైతం ఏర్పాటు చేసుకున్నాడు.పెళ్లి, ఉద్యోగంటూ రూ.9.53 లక్షల మేర మోసంఏలూరు జిల్లా గుండుగొలను గ్రామానికి చెందిన మహిళను నమ్మించి ఆమె రెండో కుమార్తెను పెళ్లి చేసుకుంటానని, మూడో కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి ఆన్లైన్లో రూ.9.53 లక్షలు కాజేశాడు. శశాంక్ అనే వ్యక్తి ద్వారా ఇంటర్వ్యూ చేయించి, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. డబ్బులు తీసుకుని ఎంతకీ జాబ్‌లో చేర్పించకపోవటంతో మోసపోయామని తెలుసుకుని వారు భీమడోలు పోలీసులకు 2023లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిత్య పెళ్లికొడుకు అనిల్‌బాబును అరెస్ట్ చేశారు. అనిల్‌బాబు ఇంతవరకూ పలువురిని రూ.1.50 కోట్ల వరకూ మోసగించినట్లు తేలింది. ఈ కేసులో అనిల్‌బాబుతో పాటు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కాలమలకు చెందిన తుంగ శశాంక, నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం బత్తులూరుపాడుకి చెందిన పల్లె హేమంత్‌రెడ్డిని భీమడోలు సీఐ యూజే విల్సన్ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు, కారు, 5 సెల్ఫోన్లు, 13 సిమ్ కార్డులు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు తయారు చేసే కంప్యూటర్, రెండు ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ చెక్‌బుక్‌లు 4, ఇతర ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ విల్సన్, ఎస్ఐ వై.సుధాకర్ ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
సహజీవనంలో ఆమెకు ఆ హక్కుందా?
ప్రియ, భార్గవ్.. మూడేళ్లుగా లివ్ ఇన్ టుగెదర్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఆరు నెలల కిందట ప్రియకు ఉద్యోగం పోయింది. దాంతో ఇంటి బాధ్యత అంతా భార్గవ్దే. అయితే ప్రియ ఇటీవల భార్గవ్ ఏం చేసినా తప్పు పడుతోంది. ఎవరితో మాట్లాడనివ్వకుండా.. తనతో తప్ప ఎవరితో ఎక్కడికీ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తోంది. ఆఫీస్ అవసరాల రీత్యా భార్గవ్ కొలీగ్స్‌కి ఫోన్ చేసినా, ఫోన్ ని అతను అటెండ్ అయినా పెద్ద యుద్ధమే! గొడవలే! భరించలేక భార్గవ్ ఒకరోజు ‘ఈ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు.. నీతో కలసి ఉండలేను’ అన్నాడు. దాంతో ప్రియ ‘నాతో బ్రేకప్ చేసుకుంటే నీ మీద రేప్ కేసు పెడతా’ అని బెదిరించింది. హడలిపోయాడు భార్గవ్. నిజంగానే ప్రియకు ఆ హక్కు ఉందా?కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా.. మోసపూరితంగా, ఓ పథకం ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ స్త్రీతో శారీరక సంబంధం నెరపితే.. సదరు పురుషుడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రేప్ అయితే యావజ్జీవం కూడా పడవచ్చు. జూన్ 30 వరకు అమల్లో ఉన్న పాత శిక్షాస్మృతి ప్రకారం కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసపూరితంగా స్త్రీతో శారీరకసంబంధం నెరపిన పురుషుడిపై ఐపీసీ 376, ఐపీసీ 420 సెక్షన్ లను కలిపి కేసు నమోదు చేసేవారు. అయితే, ఆ పురుషుడు మొదటినుంచీ మోసం చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు అని రుజువుకాకపోతే మాత్రం దాన్ని రేప్‌గా పరిగణించలేమని హైకోర్ట్, సుప్రీంకోర్టు పేర్కొన్న సందర్భాలు, తీర్పులూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా చూడాల్సినదేంటంటే.. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక΄ోయినా చేసుకుంటానని నమ్మించి కేవలం శారీరక సంబంధం కోసమే అతను లివ్ ఇన్‌లో ఉన్నాడా అనే అంశం. మొదట బాగానే ఉన్నాడు.. పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.. కానీ తర్వాత మనస్పర్థలు, భేదాభి్రపాయాలు వచ్చి విడి΄ోవాలనుకుంటున్నాడు అని రుజువైతే శిక్ష పడదు. భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 69 ప్రకారం కూడా లివ్ ఇన్ రిలేషన్ లోని పురుషుడు ‘మోసపూరితమైన ఆలోచనతోనే రిలేషన్ మొదలు పెట్టాడు’ అని రుజువు చేయాలి. అయితే ఈ కేస్ స్టడీలో భార్గవ్ మీద ప్రియ కేసు పెట్టే అవకాశం కచ్చితంగా ఉంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇన్నాళ్లు లివ్ ఇన్ లో ఉండి ఇప్పుడు వద్దు అంటున్నాడని ప్రియ రుజువు చేయగలిగితే భార్గవ్‌కి పదేళ్లవరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సెక్షన్ 69 వలన సహజీవనం, ప్రేమ అనే అంశాలు ఆది నుంచీ అనుమానంతో మొదలయ్యే ప్రమాదం ఉంది. సహజీవనానికి ముందు లేదా కలసి ఉంటున్న క్రమంలో ఒకరిపై ఒకరు స్పష్టత తెచ్చుకోవడం అవసరం. ఇలాంటి రిలేషన్స్ వ్యక్తిగతమైనప్పటికీ, వీలైనంత మేర అందరికీ తెలిసేలా ఉండడం లేదా కనీసం సన్నిహితులకైనా తెలిసుండటం వల్ల కొంతవరకు రక్షణ కలగవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
అభిమాని పెళ్లిలో స్టార్ హీరో సందడి.. ఫోటోలు వైరల్
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆయన హీరో మాత్రమే కాదు అందరినీ మెప్పించే విలన్ కూడా.. టాలీవుడ్,కోలీవుడ్‌లో తన నటనతో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయనకు పాత్ర నచ్చితే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అందుకే విజయ్ సేతుపతికి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు మలేషియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.తాజాగా విజయ్ సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యాడు. ఆయన రాకతో పెళ్లికి వచ్చిన అతిథిలు అందరూ ఆశ్చర్యపోయారు. మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌కు చెందిన జయబాస్,జయపాల్ ఇద్దరూ విజయ్ సేతుపతికి అభిమానులు. అంతేకాకుండా విజయ్ సేతుపతి జిల్లా అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా ఒకరు ఉంటే మరోకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ అన్నదమ్ములు మే 2న తమకు నచ్చిన యువతులను పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే, విజయ్ సేతుపతికి 2వ తేదీలో సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉండటంతో నేడు వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలో ఆయన ఒక బాలుడిని ఎత్తుకుని ఫోటో దిగడం విశేషం. అనంతరం మెట్టుపాళయంలో షూటింగ్‌కు బయలుదేరారు.மணமக்கள் ஹாப்பி அண்ணாச்சி...! ரசிகர் மன்ற மாவட்ட தலைவர், துணைச் செயலாளரின் இல்லத் திருமண விழா...நேரில் கலந்து கொண்டு மணமக்களை வாழ்த்திய விஜய் சேதுபதி#Madurai | #VijaySethupathi | #Marriage | #PolimerNews pic.twitter.com/3XrVXk9Pdq— Polimer News (@polimernews) May 30, 2024 విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా మహారాజ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. -
పెళ్లి చేసుకుందామంటూ ఇంటికి పిలిచి నిండా ముంచేసిన మహిళా నిర్మాత
గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఓ మహిళ ప్రేమ పేరుతో యువకుడిని పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుంచి అందినకాడికి దండుకుంది. తీరా ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటపడడంతో తాను మోసపోయాయని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వెంకటగిరి ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తాను పనిచేసిన ఓ సినిమా షూటింగ్లో మహిళా నిర్మాత అతనికి పరిచయం అయ్యింది. సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం సదరు మహిళా నిర్మాత అతనికి ఫోన్ చేసి డిన్నర్ చేసేందుకు ఇంటికి రావాల్సిందిగా చెప్పింది.ఆ సమయంలో భర్తకు విడాకులు ఇచ్చి పెళ్ళి చేసుకుందామని సదరు మహిళ నాగార్జున బాబుకు చెప్పింది. దీనికి కూడా అతను ఒప్పుకోవడంతో ఇరువురూ చిలుకూరి బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె అతని నుంచి రూ. 18,50,000లను నేరుగా, మరో రూ. 10 లక్షలను ఆమె బ్యాంక్ అకౌంట్లోకి వేయించుకుంది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగార్జునబాబు విచారించగా అప్పటికే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయని, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. కానీ తనకు ఒక వివాహం అయ్యిందని, పిల్లలు లేరని చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకుని డబ్బులు కాజేసిందని గ్రహించాడు. అలాగే గతంలో ఆమె పలువురిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. వైజాగ్ గాజువాక పోలీస్ స్టేషన్లో భరత్ అనే వ్యక్తిపై, కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తిపై, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కార్తికేయ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. తనను కూడా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందంటూ నాగార్జున జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే
కోలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో శింబు ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయనకు సంచలన నటుడు అనే ముద్ర కూడా ఉంది. శింబు జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన మానాడు, వెందు తనిందదు కాడు చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఆ తరువాత నటించిన పత్తుతల నిరాశ పరచింది. తాజాగా తన 48వ చిత్రాన్ని కమలహాసన్ సొంత సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌లో నటించనున్నారు. (ఇదీ చదవండి: Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదలపై అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది) దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్రం ఫేమ్ డేసింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం శింబు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కాగా 40 ఏళ్ల నటుడు శింబు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే విషయం తెలిసిందే. తన పెళ్లి గురించి మీడియా ఎప్పుడు అడిగినా బదులు దాటేస్తూ వస్తున్నారు. ఆయన తండ్రి, దర్శకుడు, నటుడు టి.రాజేంద్రన్ సమయం వచ్చినప్పుడు తన కొడుకు పెళ్లి అవుతుందని చెబుతున్నారు. తాజాగా మరోసారి శింబు పెళ్లి గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శింబుకు కల్యాణ గడియలు ఆసన్నమయ్యాయని, ఒక సినీ ఫైనాన్సియర్ కూతురుతో శింబు ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. అయితే దీని గురించి శింబు తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదన్నది గమనార్హం. -
ఇదీ నీచమైన చర్య: సాయిపల్లవి
విరాటపర్వం, గార్గీ చిత్రాల తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్, తెలుగులో నాగచైతన్యతో సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె పెళ్లి వార్తలపై పలు వార్తలు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యాయి. పలాన దర్శకుడితో సాయిపల్లవి పెళ్లి అంటూ ఫోటోలతో రూమర్స్ క్రియేట్ చేశారు. ఇవి గత కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో భారీగానే కనిపించాయి. తాజాగా సాయిపల్లవి తన ఎక్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్ట్ చేసింది. రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని సాయిపల్లవి తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా ఇందులోకి లాగుతుండటంతో ఆమె స్పందించింది. (ఇదీ చదవండి: 'సినిమాలో నువ్వు విలన్.. రియాలిటీలో నేనే విలన్'.. చంపేస్తామని బాబీకి స్నేహితుల వార్నింగ్) నిజం చెప్పాలంటే, నేను రూమర్స్‌ను అసలు పట్టించుకోను, కానీ ఇందులో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో తప్పక స్పందిచాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫోటోను ఉద్దేశపూర్వకంగా కట్ చేసి కొందరు ఇలాంటి చెత్తపని చేశారు. ఇదీ చాలా అసహ్యకరమైన చర్య. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసం విడుదల చేసిన ఫోటోతో ఇలాంటివి క్రియేట్ చేయడం చాలా బాధ అనిపించింది. సంతోషంగా సినిమా ప్రారంభ సమయంలో ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల మమ్మల్ని ఎంతో నిరుత్సాహపరుస్తుంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం అనేది నీచమైన చర్య.' అని సాయి పల్లవి తెలిపింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు అది సాయిపల్లవి పెళ్లి ఫొటో కాదు, శివకార్తికేయన్ సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటో. కానీ కొందరు ముందు వెనక చూడకుండా ఈమెకు పెళ్లయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని 'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల కూడా పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే. Honestly, I don’t care for Rumours but when it involves friends who are family, I have to speak up. An image from my film’s pooja ceremony was intentionally cropped and circulated with paid bots & disgusting intentions. When I have pleasant announcements to share on my work… — Sai Pallavi (@Sai_Pallavi92) September 22, 2023 -
అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి
మలయాళ నటి మేనక కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్గా సౌత్ ఇండియాలో నిలదొక్కుకుంది. సావిత్రి బయోపిక్ మహానటిలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ అవార్డు అందుకుంది. కానీ ఆమెకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు. కానీ కీర్తి పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడం జరుగుతోంది. గతంలో కూడా అనేకసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కాలక్రమంలో అవన్నీ అబద్ధమని కూడా తేలింది. ఈసారి, ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కలిసి ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. స్పందించిన కీర్తి సురేష్ తండ్రి అనిరుధ్ రవిచందర్‌తో ఆమె పెళ్లి పుకార్లపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ ఇలా స్పందించారు. ' కీర్తి- అనిరుధ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆ ప్రచారాలు అన్నీ నిరాధారమైనవి, వాటిలో ఏ మాత్రం కూడా నిజం లేదు. కీర్తి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఇలాంటివి చాలానే ఉన్నాయి. తాజాగా కీర్తి, అనిరుధ్ గురించి ఎవరో కావాలనే ఒక వార్తను క్రియేట్ చేసి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు.' అని ఆయన అన్నారు. ఇదే సమయంలో కీర్తి సురేష్ కూడా అనిరుధ్‌తో పెళ్లి పుకార్లను ఖండించింది. టైమ్స్ నౌతో ఆమె మాట్లాడుతూ.. అది తప్పుడు వార్త అని అనిరుధ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. పెళ్లి రూమర్స్ ఎందుకు వచ్చాయ్ అయితే, కీర్తి సురేష్, అనిరుధ్ రవిచందర్ పెళ్లిపై పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదని గమనించాలి. రెమో (శివ కార్తికేయ), గ్యాంగ్ (సూర్య), అజ్ఞాతవాసి వంటి మరెన్నో చిత్రాల కోసం కీర్తి, అనిరుధ్ కలిసి పనిచేశారు. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా అంటారు. ఇటీవల ఆమె జవాన్‌లోని అనిరుద్ బ్లాక్ బస్టర్ సాంగ్ చలేయా.. పాటకు డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణ ప్రియతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. అది కూడా భారీగా వైరల్ అయింది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి పుకార్లు కొన్ని నెలల క్రితం దుబాయ్‌కి చెందిన ఫర్హాన్ అనే వ్యాపారవేత్తతో కీర్తి సురుష్ సంబంధంలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో పెళ్లి పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే, ఈ వార్త వైరల్ కావడంతో, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని ఆమె స్పష్టం చేసింది. ఆ సమయంలో ఆమె తండ్రి కూడా ఈ వార్తలను తిప్పికొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆమె మరోకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. త్వరలో తన మిస్టరీ మ్యాన్ గురించి చెప్తానని వెల్లడించింది. (ఇదీ దచవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లా..? హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
లావణ్య తీసుకున్న నిర్ణయానికి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగింటి కోడలిగా మారనుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టనుంది. వరుణ్ తేజ్‌తో మరికొన్ని రోజుల్లోనే ఏడడగులు వేయనుందీ బ్యూటీ. మెగా ఇంటికి కోడలుగా ఆమె వెళ్తుంది కాబట్టి ఒక రకంగా ఆమెకు బరువైన బాధ్యతనే చెప్పవచ్చు. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో తన అందచందాలు ప్రదర్శించడం అంటే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసినా మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: 'సలార్'ను నమ్ముకున్న శృతిహాసన్) అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం అయ్యాక అంతకు ముందే ఆమె ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు వస్తున్న అవకాశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారట. తమిళ్లో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కొన్ని నెలల క్రితమే లావణ్య ఓకే చెప్పారు. 'స్కైలాబ్' సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వక్ ఖండేరావ్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. కొద్దిరోజుల్లో షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి నో చెప్పేశారు. (ఇదీ చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) దీనికి ప్రధాన కారణం ఈ వెబ్ సిరీస్‌లో కథ రీత్యా కథానాయిక పాత్ర కాస్తంత బోల్డ్‌గా ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయట. కొద్దిరోజుల్లో మెగా ఇంటికి కోడలిగా అడుగుపెడుతున్న సమయంలో ఇలాంటి సినిమాలో నటించడం కరెక్ట్ కాదని నిర్ణయించుకున్నదట. ఆ వెబ్‌సిరీస్ దర్శక, నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్ని చూసుకోమని లావణ్య ఓపెన్‌గానే చెప్పేశారట. ఆమె తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగిచ్చేశారట. నిశ్చితార్థం అయిన తర్వాత తాను కొణిదలవారి కోడల్ని కాబట్టి ఇక నుంచి ఇలాంటి కథల్లో నటించడం సబబుకాదని వారికి చెప్పారట. దీంతో ఆమె నిర్ణయాన్ని వారు కూడా కాదనలేకపోయారట. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ లావణ్య నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. -
ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా పెళ్లి.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ కమెడీయిన్, బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా అందరికీ పరిచయమే..టాలీవుడ్లో అంచెలంచెలుగా ఒక స్థాయికి చేరిన నటుడు మహేశ్. తొలి రోజుల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడి సొంత నిర్మాణ సంస్థను స్థాపించే స్థాయికి చేరాడు. బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ వెండితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. (ఇదీ చదవండి: హీరోయిన్ స్నేహకు గోల్డెన్ ఛాన్స్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..!) తాజాగా మహేశ్ తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్లో వారిద్దరి కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. మహేష్ విట్టా-శ్రావణిల పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే తన లవ్ స్టోరీని మహేశ్ రివీల్ చేసిన విషయం తెలిసిందే.. కానీ అప్పట్లో ఆమె పేరును మాత్రం బయటకు చెప్పలేదు. శ్రావణి రెడ్డిని సుమారు ఐదేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె తన చెల్లెలు ఫ్రెండే అని కూడా మహేశ్ చెప్పాడు. మొదట్లో అతని ప్రేమను శ్రావణి రిజెక్ట్ చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆమె ప్రేమను సాధించానని మహేశ్ చెప్పిన విషయం తెలిసిందే. రెండేళ్లు తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని.. ఆ తర్వాత తన ప్రేమకు శ్రావణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నాడు. శ్రావణి రెడ్డి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. మహేశ్ పలు సినిమాల్లో రానిస్తున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Mahesh Vitta (@maheshvitta) -
సాఫ్ట్వేర్ అమ్మాయే కావాలన్నాడు.. ఆమె చేసిన పనికి పెళ్లే రద్దయింది!
కర్నూలు: స్థిరపడటం అంటే.. బాగా డబ్బు సంపాదించడం, కారు, బంగ్లాలు ఉండటం ఒక్కటే కాదు.. పెళ్లి చేసుకున్నప్పుడే ఆ జీవితం సంపూర్ణమవుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండటం, బంధుత్వాలకు విలువ ఇస్తుండటంతో పెళ్లి చేయాలనే ఆలోచన వస్తే చాలు.. ఎక్కడెక్కడ పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఉన్నారో, అబ్బాయిల వివరాలు ఇట్టే తెలిసిపోయేవి. క్షణాల్లో మాట కలపడం.. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టేసుకోవడం, రెండు మనసులను ముడివేయడం చకచకా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెళ్లంటే.. తల్లిదండ్రులు ఒకస్థాయి యుద్ధం చేయాల్సిందే. కులం, గోత్రం.. జాతకం.. ఆస్తులు.. అంతస్తులు.. గుణగణాలు.. ఇవన్నీ తలుచుకుంటే గుండె పగిలినంత పనవుతుంది. సంబంధం చూడటం మొదలు.. పెళ్లి పూర్తయ్యే వరకు సవాలక్ష సవాళ్లు. కర్నూలు నగరానికి చెందిన ఓ యువకునికి రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. వయస్సు 27 ఏళ్లు. తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని అమ్మాయి కోసం వెతకటం మొదలుపెట్టారు. అయితే వెళ్లిన ప్రతిచోటా సొంత ఇల్లు ఉందా? భూమి ఎంతుంది? ఇలాంటి ప్రశ్నలే కానీ అబ్బాయి గుణగణాలు, కుటుంబ నేపథ్యం ప్రస్తావనే రాకపోవడం గమనార్హం. ఆళ్లగడ్డకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులో పని చేస్తున్నాడు. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అయ్యుండాలనే నిబంధన పెట్టడంతో తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి ఓ అమ్మాయితో ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత తాను ఎప్పుడు ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వస్తుందనే కారణంతో ఈ బంధం అక్కడితో ముగిసిపోయింది. అరచేతిలో అన్వేషణ పెళ్లిళ్ల పేరయ్యలు ఇప్పుడు బాగా తక్కువైపోయారు. ఒకప్పుడు చేతిలో ఒక బ్యాగు వేసుకొని, దాన్నిండా పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిల ఫొటోలతో తెలిసిన వారి ఇళ్ల ముందు వాలిపోయేవాళ్లు. వీళ్లకు రూ.500, లేదా రూ.1000 ముందుగానే ఇచ్చుకుంటే సంబంధాలు వెతికిపెట్టేవాళ్లు. పెళ్లి సమయంలో కూడా వీళ్లకు అంతోఇంతో ముట్టజెబుతారు. ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లు పుట్టగొడుగుల్లా తెరపైకి రావడంతో అరచేతిలో అన్వేషణ మొదలైంది. ఎవరికి వారు తమ ఫొటో, ప్రొఫైల్ అందులో పెట్టేస్తుండటంతో ఎంతవరకు సరైన వివరాలు ఇచ్చారనే విషయం అంతుచిక్కని పరిస్థితి. పిల్లలు పెద్దవాళ్లు అవుతుంటే సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు సంపాదిస్తే ఇక భయం లేదనిపిస్తుంది. ఆ తర్వాత వయస్సు గుర్తుకు వస్తే మాత్రం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు దూరమవుతుంది. ఆధునిక ప్రపంచంలో అమ్మాయి, అబ్బాయిల్లో మొదట జీవితంలో స్థిరపడాలనే భావన అధికంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి అనడం పరిపాటిగా మారింది. ఈ కోవలో చదువు పూర్తయ్యే సరికి సుమారు 25 ఏళ్లు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఉద్యోగంలో కుదురుకోవాలంటే మరో ఐదేళ్లు ఆవిరి కావాల్సిందే. కొందరు త్వరగానే దారిలో పడుతున్నా.. చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిలు చదువు, ఉద్యోగం వెంట పరుగులు తీస్తూ తమ వయస్సు కరిగిపోతుందనే విషయాన్నే మర్చిపోతున్నారు. తీరా ఉద్యోగం వస్తే.. అప్పుడు పెళ్లి ఆలోచన మొదలైనా తల్లిదండ్రులు వేట మొదలు పెడితే అప్పటికి కానీ అర్థం కావట్లేదు ముదిరిపోయామని. వయస్సు ఎంత? ఈ ప్రశ్న అవతలి వైపు నుంచి వస్తే చాలు ఇక పెళ్లి కావడం కష్టమనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కూడా గొంతెమ్మ కోర్కెలతో కాలం గిర్రున తిరుగుతుంది. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ పెళ్లి అయితే చాలన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం. పిల్లలు చెప్పినట్లు వినాల్సిందే.. గతంలో తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి పెళ్లి చేసుకోమంటే మారు మాట్లాడకుండా పీటలు ఎక్కేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పెద్దల మాట కంటే.. పిల్లల అభిరుచికే ప్రాధాన్యం ఉంటోంది. ఒకరికొకరు నచ్చాలి. మాటామాట కలవాలి. డిన్నర్లు, డేటింగ్లు.. తలుచుకుంటే బుర్ర గిర్రున తిరుగుతుంది. ఇక కులగోత్రాలు, జాతకాలు సరేసరి. చదువు, ఉద్యోగ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం.. అన్నీ సరిపోయాయి అనుకున్నా చివరి నిముషంలో ఏదో ఒక వెలితి బయటకు రావడంతో ఆ సంబంధం అక్కడితో ముగిసిపోతుంది. ఇలా వాళ్ల కోర్కెలకు అనుగుణంగా సంబంధాలు వెతికేందుకు తల్లిదండ్రులు చుక్కలు చూడాల్సి వస్తోంది. అతి కష్టం మీద సబంధం తీసుకొచ్చినా సాకులు చెప్పడంతో వ్యవహారం మళ్లీ మొదటికొస్తుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతుండటంతో ఇంట్లో సంతోషం ఆవిరవుతుంది. ఏజెంట్ వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో కోరుకున్న సంబంధాలు కుదరక ఇతర ప్రాంతాలకూ వెళ్తున్నారు. చివరకు కులాల ప్రస్తావన మర్చిపోయి సంబంధం దొరికితే చాలు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. పెళ్లి కొడుకు తరపున అమ్మాయికి భరణం చెల్లించి మరీ సంబంధం కుదుర్చుకుంటున్నారు. శ్రీకాళుళం పరిసర ప్రాంతాల నుంచి సంబంధం కుదిర్చేందుకు ఏకంగా ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటైంది. రూ.2లక్షల నుంచి రూ.3లక్షల మేర వీళ్లకు ముట్టజెబితే కానీ సంబంధం దొరకని పరిస్థితి. అబ్బాయిల తల్లిదండ్రుల్లోనే ఆందోళన అసలే అమ్మాయిల కొరత. అబ్బాలు చదువు, ఉద్యోగం అని కాలం గడిచే కొద్దీ వయస్సు పెరిగి, అందుకు తగిన అమ్మాయి దొరక్క తల్లిదండ్రులు చుక్కలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకు అబ్బాయి పుట్టాలని కోరుకోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. ఇదే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లి సంబంధం రాగానే.. అబ్బాయికి ఉద్యోగంతో పాటు భూములు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండిటికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బుకు ప్రాధాన్యం ఒకప్పుడు పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవాళ్లు. అంతేకాదు.. గుణగణాలను తెలుసుకునేందుకు ఎవరెవరినో విచారించే పరిస్థితి. ఇప్పుడు ఆ ఊసే కరువవుతోంది. అమ్మాయి దొరకడమే కష్టమవుతుండటంతో అటువైపు నుంచి కూడా ధోరణి మారిపోయింది. అబ్బాయి మంచివాడా, కాదా అనే విషయాలను పక్కనపెట్టి ఆస్తులు, అంతస్తులపైనే దృష్టి సారిస్తున్నారు. పైగా ఒక్కడే కొడుకు ఉంటే మంచిదనే భావన అమ్మాయి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఉద్యోగంతో పాటు పొలం ఉన్న ఇంటికి తమ అమ్మాయిని పంపేందుకే ఇటీవల కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ రెండు కులాల్లో అమ్మాయిలు 10 శాతమే.. మ్యారేజ్ బ్యూరోలకు వచ్చే తల్లిదండ్రులు అబ్బాయికి లక్ష జీతం, 10 ఎకరాల పొలం ఉండాలని చెప్పడం పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. మరికొందరు ఉద్యోగం దొరికే వరకు వేచి చూస్తుండటం కూడా పెళ్లిళ్లు ఆలస్యం అవడానికి కారణమవుతోంది. ప్ర స్తుతం రెండు కులాల్లో అమ్మాయిల కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఎంతలా అంటే.. వంద మంది అబ్బాయిలకు 10 మంది అమ్మాయిలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ కారణంగా ఓ కులం అబ్బాయిలు ఇతర కులాల అమ్మాయిలు అయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశారు. 30 ఏళ్ల తర్వాతే.. పెళ్లి వయస్సు బాగా పెరిగిపోతుంది. అబ్బాయి, అమ్మాయి జీవితంలో స్థిరపడటానికే అధిక ప్రా ధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగా 30 ఏళ్ల తర్వాత కానీ పెళ్లిళ్లు జరగడం లేదు. పెద్దల మాటకంటే, తమకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని చెప్పడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది. – చిన్న వెంకటేశ్వర్లు, ఓపిక మ్యారేజ్ బ్యూరో, కర్నూలు పెళ్లికాని ప్రసాదులే.. సాధారణంగా అమ్మాయిలు వయస్సుకు రాగానే తల్లిదండ్రుల్లో పెళ్లి ఆలోచన మొదలవుతుంది. చదువు పూర్తి అవుతుందనగానే ఆ లోపు తగిన వరుడిని వెతికే పనిలో ఉంటారు. అయితే అబ్బాయిలు మాత్రం చదువుతో పాటు ఉద్యోగంలో స్థిరపడాలనే భావనతో వయస్సునే మర్చిపోతున్నారు. ఈలోపు ఆ వయస్సు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోతుండటంతో అబ్బాయిల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. వయస్సుకు తగిన అమ్మాయిలు దొరక్క, ఉన్నా వాళ్ల తల్లిదండ్రుల ముందుజాగ్రత్త ప్రశ్నలతో పెళ్లికాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు. కొన్ని కులాల్లో అమ్మాయిల కొరత అధికంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురు కట్నం ఇచ్చి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు అంతంతే.. పెళ్లి వయస్సు అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు. ఈ వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు ఇప్పుడు దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. పట్టణాల్లో ఈ వయస్సు పెళ్లిళ్లు చాలా అరుదు. చదువు, ఉద్యోగం అనుకోవడంతోనే వయస్సు చేజారిపోతుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలకు దారితీస్తుంది. ఇరువురి వయస్సులో వ్యత్యాసం కూడా సగం పెళ్లిళ్లను విడాకుల వరకు తీసుకెళ్తోంది. -
పెళ్లి కబురుతో ఫోటో షేర్ చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో విజయ్ దేవరకొండ (34) కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య శర్వానంద్, వరుణ్‌తేజ్ పెళ్లి తంతు తెరపైకి వచ్చిన వెంటనే విజయ్ పెళ్లి ఎప్పుడు అని ఆయన్నే డైరెక్ట్‌గా చాలామంది అడిగారు. అందుకు సమాధానంగా ఆయన కూడా త్వరలో ఆ శుభకార్యం జరగబోతుందని కూడా చెప్పాడు. ఖుషి సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: విజయనిర్మల వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నరేష్ కుమారుడు) తాజాగ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు చేతులు ఉన్నాయి. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ చేయి మరొకరి చేతిలో ఉంది. మరోకరు ఎవరనేది ఆయన రివీల్ చేయలేదు. కానీ ఆ ఫోటోకు విజయ్ ఇచ్చిన క్యాప్షన్ మాత్రం ఇలా ఉంది. 'జీవితంలో చాలా జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తా.' అని విజయ్ పేర్కొన్నారు. ఈ విదమైన విషయాలను తన సోషల్‌మీడియా ద్వారా ఆయన ఎప్పుడూ షేర్ చేయలేదు. దీంతో ఇది ఖచ్చితంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన కబురు చెప్పబోతున్నారని నెటిజన్లు ఊహిస్తున్నారు. ఆ చెయి రష్మికదేనా.. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. దీంతో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలో ఉన్న మరో చెయి రష్మికదే అని పలువరు పేర్కుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య విజయ్ తల్లిదండ్రులను రష్మిక కలిసిన విషయం తెలిసిందే. దీంతో వారి సందేహాలు కూడా మరింత బలంగా ఉన్నాయి. ముందే క్లూ ఇచ్చిన విజయ్ త్వరలో పెళ్లి చేసుకుంటానని ఖుషి సినిమా ప్రమోషన్ల సమయంలో విజయ్ దేవరకొండ చెప్పిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనందల నటించిన 'బేబీ' సినిమాలోని ఓ సాంగ్ విడుదల కార్యక్రమానికి రష్మిక వచ్చారు. అప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందరూ వదిన.. వదిన అంటూ గట్టిగా అరిచినా ఆమె తనలో తాను నవ్వుకుంటూ ఉండింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా గీత గోవిందం,డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయం నుంచి వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలా వారిద్దరు ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !
కోలీవుడ్‌లో ప్రభు సాలమన్ దర్శకత్వం వహించిన 'కుమ్కీ' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో నటి లక్ష్మీ మీనన్ గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత జిగుర్తాండ, కుట్టిబులి, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. విజయ్ సేతుపతి సరసన రెక్కై చిత్రంలో నటించి తమళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేదాళంలో అజిత్‌కి చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. (ఇదే సినిమాకు రీమేక్‌గా చిరంజీవి 'భోళా శంకర్' వస్తున్న విషయం తెలిసిందే). వేదాళం తర్వాత కొన్నాళ్లుగా లక్ష్మీ మీనన్‌కు సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: రజినీ కంటే ఆ హీరోయిన్‌కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?) త్వరలో పెళ్లి చాలా రోజుల తర్వాత లక్ష్మీ మీనన్ ప్రస్తుతం చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తోంది. 27 ఏళ్ల నటి లక్ష్మీ మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు విశాల్‌తో ఆమె పెళ్లి జరగబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడకపోవడంతో ఇంటర్నెట్లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడుతుందని పలువురు తెలుపుతున్నారు. విశాల్‌తో ప్రేమ నటి లక్ష్మీ మీనన్ విశాల్‌తో కలిసి పాండియనాడు (పల్నాడు), ఇంద్రుడు, వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో విశాల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానీ ఆ తర్వాత లక్ష్మీ మీనన్ విశాల్‌తో ఏ సినిమాలోనూ నటించకపోవడం గమనార్హం. ఈ సినిమాల పరిచయం నుంచి వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇంతవరకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తాజాగ ఇరుకుటుంబాల పెద్దలకు తెలపడంతోనే ఈ వార్తలు ఇప్పడు ప్రచారంలోకి వచ్చాయని తెలుస్తోంది. -
తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరూ నిజంగా రిలేషన్లో లేరని, 'లస్ట్ స్టోరీస్ 2' ప్రచారం కోసం అలా చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ కూడా తమ రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయ్యారు. తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ఈ మధ్య విజయ్ బహిరంగంగానే చెప్పాడు. తామిద్దరూ డేటింగ్లో ఉన్నామని ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందన్నాడు. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ.. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నానని తెలిపాడు. ఆమె రాకతో తన జీవితంలో విలన్ దశ ముగిసిపోవడమే కాకుండా రొమాంటిక్ దశ మొదలైందని చెప్పాడు. తమన్నా భాటియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలపై విజయ్ వర్మ పలు విషయాలు వెల్లడించాడు. మళ్లీ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి ఉందో విజయ్ ఇలా స్పందించాడు. ' నా జీవితంలో పెళ్లిపై ఒత్తిడి ఎప్పుడో ప్రారంభమైంది. నేను మార్వాడీని. మా కమ్యూనిటీలో, అబ్బాయిలు 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోగల వయస్సుగా పరిగణించబడతారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో నా జీవితంలో ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ల తర్వాత నా పెళ్లి గురించి ఆ ఒత్తిడి కొంచెం తగ్గింది.. ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే వయస్సు ఎప్పుడో దాటిపోయింది. పైగా అప్పటికి నేను నటుడిని అయ్యాను. ఇదీ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై..) మా అమ్మ మాత్రం పదేపదే పెళ్లి ప్రస్తావన తెచ్చేది. కానీ నేనే మాత్రం కెరీర్ వైపు మాత్రమే దృష్టి పెట్టాను. ఇప్పటికీ కూడా ఆమ్మ ఫోన్ కాల్ వస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు..? అనే ఉంటుంది. సినిమాల వల్ల బిజీగా ఉండటంతో కుదరలేదని ఇంతవరకు చెప్పే వాడిని ఇప్పుడా అవకాశం లేదు. అని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రొమాన్స్) ఈ వ్యాఖ్యలతో తమన్నా-విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఎప్పటి నుంచో పెళ్లి గురించి ఒత్తిడి తెస్తున్న తన తల్లి కోసం అయినా సాధ్యమైనంత త్వరలో తమన్నాతో ఏడడుగులు వేయడం ఖాయమని సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే పెళ్లికి విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. కానీ.. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ.. ఫోటోలు వైరల్
'కేజీయఫ్'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి.. రీనాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి మొదట్లో వరుస అవకాశాలు వచ్చినా తర్వాత వెనుకబడిపోయింది. (ఇదీ చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్‌లో ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా శ్రీనిధి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీనిధి శెట్టి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ ఇందులో వారి తప్పేంలేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అసలు విషయం వేరే ఉంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో నుదుటిన పాపిట్లో సిందూరంతో బొట్టు పెట్టుకొని కనిపించడమే ఈ ప్రచారానికి బలాన్ని చేకుర్చింది. సాదారణంగా పెళ్లి అయిన అమ్మాయిలు మాత్రమే నుదుటన పాపిట్లో బొట్టు పెట్టుకుంటారు కాబట్టి శ్రీనిధి కూడా పెళ్లి చేసుకుందని ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు కుటుంబంలో శ్రీనిధి జన్మించింది. వారి సంప్రదాయం ప్రకారం కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే పాపిట్లో బొట్టు పెట్టుకుంటారని తెలుస్తోంది. అందువల్లే శ్రీనిధి శెట్టి కూడా నుదుటన బొట్టు పెట్టుకుందని చెబుతున్నారు. కాబట్టి ఆమె పెళ్లిపై ప్రచారం చేయడం ఇంతటితోనైనా ఆపేయండని ఆమెను అభిమానించేవారు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం శాండల్‌వుడ్‌లో ఇలా టాక్ వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపంతో ఉంటుంది. ఒక రకంగా ఆమె ప్రయత్నంచేస్తే.. అనుష్కలా టాలీవుడ్‌ను ఏలేయోచ్చు.. అయితే ఆమె పెర్పామెన్స్ చూపించేలా సినిమా ఒక్కటి కూడా పడలేదు. కేజీయఫ్ బ్రాండ్ పెట్టుకుని రెమ్యునరేషన్ రేటుపెంచేసరికి నిర్మాతలు ఆమెను సినిమాలు అడగటమే మానేశారట. అసలు ఆమె హైట్, బ్యూటీకి.. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే, ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే అప్పట్లోనే టాక్ వినిపించేది. (ఇదీ చదవండి: అందరూ వైష్ణవినే తిడుతున్నారు: బేబీ నిర్మాత) -
కాజల్ మాకు ఆ అదృష్టం ఉందా?.. నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే రిప్లై
సినిమాలకు గుడ్ బై చెబుతుందంటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై భారీగానే పుకార్లు వచ్చాయి. వాటంన్నిటినీ పక్కకు నెట్టేసి ఇండియన్2, భగవంత్ కేసరి, సత్యభామ వంటి భారీ చిత్రాలతో తను బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడుగుతున్నటువంటి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. చాలా రోజుల తర్వాత తన అభిమానులతో సరదాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ముచ్చటించింది. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను వారితో ఆమె పంచుకుంది. (ఇదీ చదవండి: ఈ కారణంతో కీర్తి, కృతి షాకింగ్ డెషిషన్ తీసుకోనున్నారా?) అయితే నేటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కాజల్ ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఇలా ప్రశ్నించాడు 'మీరంటే నాకెంతో ఇష్టం.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?' అని అడిగేశాడు కాజల్ అగర్వాల్ అతని ప్రశ్నకు సమాధానం చెబుతూ సారీ.. ఇప్పుడా అదృష్టం మీకు లేదు.. రెండున్నరేళ్ల క్రితమే ఆ అవకాశం మరొకరిని వరించింది. అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. ఇంకేముంది ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు నీల్ కిచ్లు అనే కుమారుడు కూడా ఉన్నాడు. (ఇదీ చదవండి: Lust stories 2: తమన్నాకు ఊహించనంత రెమ్యునరేషన్?) -
భార్యతో విభేదాలు.. ఆస్ట్రేలియాకు భర్త జంప్!
ఒంగోలు టౌన్: అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనకు తెలియకుండా తన భర్త ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని ఓ వివాహిత ఆదివారం ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామానికి చెందిన తుమాటి మనీషాకు నెల్లూరు జిల్లా కావలికి చెందిన నాతాని వెంకటేశ్‌తో గత ఏడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.1.30 కోట్ల విలువ చేసే పొలంతో పాటుగా ఆడపడచు కట్నం, పెళ్లి ఖర్చులు, బంగారం నగలు కలిపి రూ.15 లక్షలు ముట్టచెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని పెళ్లి కుమారుడికి అడిగినంత ఇచ్చి పెళ్లి చేశారు. కావలిలో కాపురం పెట్టిన తరువాత అత్తామామలు నాతాని యానాది నాయుడు, అరుణలతో పాటుగా ఆడపడచు కంఠమణి వెంకట శేషమ్మ అలియాస్ శైలజలు సూటిపోటి మాటలతో వేధించడం మొదలు పెట్టారు. భోజనం కూడా పెట్టకుండా కొట్టేవారు. దీంతో మద్దిరాలపాడు గ్రామంలో కాపురం పెట్టారు. సజావుగా కాపురం కొనసాగుతున్న సమయంలో అత్తామామలు, ఆడపడచులు వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించారు. రూ.20 లక్షలు అదనపు కట్నం తెస్తేనే కావలికి కాపురానికి తీసుకొని వెళతామని చెప్పి వెంకటేశ్‌ను వెంట తీసుకెళ్లారు. వీరితో పాటుగా భర్త బంధువులైన మద్దినేని శ్రీహరి, శ్యామలా దేవిలు పదే పదే మనీషా ఇంటికి వచ్చి వెంకటేశ్‌కు విడాకులు ఇస్తే రూ.30 లక్షలకు సెటిల్ చేస్తామని నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. వెంకటేశ్‌కు భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. గత సంవత్సరం ఆగస్టులోనే వెంకటేశ్ తనకు చెప్పాకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్లు తెలిసిందని భార్య మనీషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ పెళ్లి?
టాలీవుడ్ మాస్ హీరో రామ్ పోతినేని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ కూడా ఒకరు. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామ్ తన చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి చదువుకోవడంతో స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమగా మారిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్) రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ పెళ్లి టాపిక్‌లోకి ఎంట్రీ ఇచ్చారని, రామ్ తరపున అమ్మాయి తండ్రితో కూడా ఆయన చర్చలు జరిపారని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే రామ్ పెళ్లి జరుగుతుందని ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై తాజాగా స్రవంతి రవికిషోర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వార్తలను ఆయన కొట్టిపారేసినట్లు సమాచారం. ఒకవేళ రామ్ పెళ్లికి రెడీ అయితే దాన్ని దాచాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్ధలు కొట్టాడట. ఈ ఏడాదే పెళ్లి జరగనుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) -
పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్
-
పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్
ఫిల్మ్ ఇండస్ట్రీ సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాను అభిషేక్ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుమలత ఓ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి రాజకీయ పార్టీ నేతలతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ నటీనటులంతా హాజరై సందడి చేశారు. మ్యారేజ్ పార్టీలో కొత్త జంటతో కలిసి స్టార్ హీరోలు యశ్, దర్శన్‌తో పాటు సుమలత డ్యాన్స్ ఇరగదీశారు. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) ఇప్పుడు ఇదే వీడియో షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. విజయ్ ప్రకాశ్ హిట్ సాంగ్ అయిన 'జలీల' సాంగ్‌కు వేసిన స్టెప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే పార్టీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప, చిరంజీవి దంపతులు, ఖుష్బూ, జాకీష్రాఫ్ పాల్గొని కొత్త జంటను ఆశ్వీరదించారు. #YashBOSS Dance with New Couple, Sumakka and #Darshan Sir ♥️#Yash #Yash19 @TheNameIsYash pic.twitter.com/gQQu6L3JoG — Only Yash™ (@TeamOnlyYash) June 11, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ మెటిరియల్ కాదన్న నెటిజన్.. అదే రేంజ్లో రిప్లై ఇచ్చిన అనుపమ) -
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితారెడ్డి జూన్ 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కాగా, శర్వానంద్ ఫ్యామిలీ రేపు (జూన్ 9న) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనుంది. (ఇదీ చదవండి: ‘చిరు లీక్స్’.. సంగీత్‌లో మెగాస్టార్ స్టెప్పులు) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ కలిశారు. రిసెప్షన్‌కు రావాలని ఆయనకు ఆహ్వానం అందించారు. శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని తెలిసిందే. ఇకపోతే ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో రాశీఖన్నా లీడ్ రోల్లో నటిస్తుంది. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?) -
వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలయింది అని ఉదయం నుంచి ప్రధాన మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అని. లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థానికి రేపు (జూన్ 9)న ముహూర్తం ఖరారు అయినట్లు ఇండస్ట్రీ పీఆర్ టీమ్‌లు కూడా ఇప్పటికే చెప్పుకొచ్చాయి. దీంతో ఉదయం నుంచి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. (ఇదీ చదవండి: వారి లిస్ట్ తీయండి.. ఫ్యాన్స్‌కు హీరో అదేశం) అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఇండస్ట్రీలోని అందరూ చెబుతున్నారు కానీ ఈ పెళ్లిపై వరుణ్ తేజ్ కుటుంబం కానీ, లావణ్య త్రిపాఠి కుటుంబం కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పెళ్లి చేసుకోబోతున్న జంట కూడా ఇప్పటి వరకు స్పందించ లేదు. అసలు మెగా కాంపౌండ్‌లో ఏం జరుగుతుంది అనేది ఫ్యాన్స్‌లో ఉత్కంఠ ఏర్పడింది. కానీ.. చిరంజీవి, నాగబాబులలో ఎవరో ఒకరు అయినా పెళ్లి గురించి అధికారికంగా స్పందిస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
వరుణ్, లావణ్య త్రిపాఠి కోసం వచ్చేస్తున్న స్టార్ హీరో
'మెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు నిన్నటి వరకు పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడదే అధికారికమైంది. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిపెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు (జూన్ 9)న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ట్రోలర్స్‌కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ) పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, వరుణ్ కోసం రేపు జరిగే ఎంగేజ్మెంట్ పార్టీకి తన కుటుంబంతో కలిసి హాజరవుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్, ఉపాసన ఈ నిశ్చితార్థంలో పాల్గొంటారు. ఇక వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అయితే, అంతకంటే ముందే వీళ్లిద్దరికీ పరిచయం. నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకునేవారు, కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయం. అలా వీళ్లిద్దరూ కలిసి సినిమాల్లో నటించక ముందే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. రేపు ఎంగేజ్ మెంట్ పూర్తయిన తర్వాత, పెళ్లి తేదీని ప్రకటిస్తారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పిన మాటల ప్రకారం చూస్తే, ఈ ఏడాదిలోనే వరుణ్-లావణ్య పెళ్లి ఉంటుంది. (ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న నటి.. భర్త ఎమోషనల్ పోస్ట్!) -
ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి ఫిక్స్?
నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఛల్ మోహన్ రంగ, పేట, రాజా రాజా చోర లాంటి తెలుగు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం భారీ విజయం తలుపుతట్టింది లేదు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. అయినా గాయాలతోనే సెట్‌కు: షాహిద్ కపూర్) తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి స్నేహితుడని తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని.. తర్వలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నారని తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గతేడాది ఒక సినిమాను ఒకే చేసి.. తాజాగా సెట్స్ మీదకు తీసుకెళ్లింది. అయితే ఇప్పటివరకు పెళ్లి వార్తలపై మేఘా ఆకాష్ స్పందించలేదు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) -
పెళ్లైన రెండు నెలలకే భర్తతో విడాకులు? నటి ఇన్‌స్టా పోస్ట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సినీ జంట కూడా విడాకులు తీసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న రెండు నెలలకే వాళ్లు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. తమిళంలోని ప్రముఖ సీరియల్ ‘సిప్పినీల్ ముత్తు’ లో సంయుక్త-విష్ణుకాంత్ కలిసి నటించారు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం పెద్దలను ఒప్పించి మార్చి 3న వైభవంగా పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా కనిపించే ఈ జంట మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత కలిసుండలేమంటూ ప్రకటించారు. సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చారు. చదవండి: హీరో అజిత్ రీల్ కూతురు చనిపోయినట్లు పోస్టర్ కలకలం అంతేకాకుండా ఇద్దరూ ఇన్‌స్టాలో స్పెషల్ నోట్‌తో విడిపోతున్నాం అంటూ ఇన్‌డైరెక్ట్ కోట్స్ చేస్తున్నారు. విష్ణుకాంత్ తన ఇన్‌స్టా స్టోరీలో.. 'ఎఫైర్స్ నిజమైన ప్రేమను ఫేక్ లవ్‌గా మార్చేస్తాయి. నో మోర్ సైలెన్స్' అంటూ ఓ పోస్ట్ చేశాడు. సంయుక్తా కూడా.. 'ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తారు.. ఫేక్‌లవ్' అంటూ ఇన్‌స్టా స్టోరీ లో పంచుకుంది. ఇది కొత్త జీవితానికి ఆరంభం అని, ఇప్పట్నుంచి మరింత ధృడంగా ముందుకు వెళ్తానంటూ పేర్కొంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో వీరి విడాకుల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్ -
పెళ్లిచేసుకోబోతున్న కలెక్టర్లు.. ఇద్దరికీ రెండో వివాహమే..
కటక్: వారిద్దరూ కలెక్టర్లు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పడంతో వారు కూడా పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో, త్వరలో ఇద్దరు కలెక్టర్లు పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నారు. వారిద్దరూ ఎవరంటే.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ, రాయగడ కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్. వివరాల ప్రకారం.. వీరిద్దరూ ఈ నెల 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్‌లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే, స్వాధాదేవ్ సింగ్ కొంతకాలం క్రితం బొలంగీర్ కలెక్టర్ చంచల రాణాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరోవైపు.. పూరీ కలెక్టర్ సమర్థవర్మ కూడా ఇటీవల రైల్వే అధికారిణి సుచిసింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య కూడా మనస్పర్థలు కారణంగా ఇటీవలే విడిపోయారు. ఇక, 2011 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సమర్థ్ వర్మ గతంలో కేంద్రపారా జిల్లా మేజిస్ట్రేట్, బిఎంసి కమిషనర్, రాయగడ పిడిడిఐ మరియు సంబల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. అదేవిధంగా, రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ గతంలో నువాపా జిల్లా కలెక్టర్‌గా మరియు రూర్కెలాలో అదనపు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. బీజేపీ మంత్రి సాహాసం -
పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి..
ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని ఇందులో పొదుపు చేస్తుంటారు. పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ముకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంత వడ్డీని చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 8.1 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఇలా పొదుపు చేసిన డబ్బు కష్ట సమయాల్లో ఉపయోపడుతుంది. అవసరమైనప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! కొత్తగా వచ్చిన పీఎఫ్ ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు వివాహ సంబంధిత ఖర్చుల కోసం వారి ఖాతాలో ఉన్న సొమ్ము నుంచి కొంత మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. స్వయంగా వధూవరులు కానీ లేదా ఖాతాదారు కుమారుడు, కుమార్తె, సోదరుడు, సోదరి వివాహాల నిమిత్తం డబ్బు ఉపసంహరించుకోవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాలో ఏడేళ్ల పాటు డబ్బు జమ చేసి ఉండాలి. విత్‌డ్రా ఎంత చేసుకోవచ్చు? ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. అయితే ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడేళ్ల సభ్యత్వం కచ్చితంగా ఉండాలి. ముందస్తు ఉపసంహరణపై ఈపీఎఫ్ పరిమితులు విధించింది. పిల్లల స్కూల్ ఖర్చులు, పెళ్లి ఖర్చుల కోసం ఒక్కో సందర్భానికి మూడు సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా సులువుగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 72 గంటల తర్వాత డబ్బు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. తగ్గిన టీడీఎస్ ఈపీఎఫ్ ఉపసంహరణలపై విధించే టీడీఎస్‌ను ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 20 శాతానికి తగ్గించింది. గతంలో ఇది 30 శాతం ఉండేది. ఐదేళ్ల లోపు ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకునే ప్రతిఒక్కరికీ టీడీఎస్ వర్తిస్తుంది. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. జనవరి 6న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వరభాస్కర్ మరోసారి పెళ్లికి సిద్ధమైంది. తాను ప్రేమించిన ఫహద్ అహ్మద్‌నే మరోసారి పెళ్లాడనుంది. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ తాజాగా మరోసారి సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకోనున్నారు. ఈనెల 11నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఢిల్లీలోని స్వరభాస్కర్ అమ్మమ్మ ఇల్లు వీరి పెళ్లివేదిక కానుంది. ఈనెల 15-16 తేదీల్లో ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో స్వరభాస్కర్వివాహం ఘనంగా జరనుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Prateeq Kumar (@prateeq) -
ప్రియుడిని పెళ్లాడిన బాలీవుడ్ నటి.. ఫోటోలు వైరల్
బాలీవుడ్లో ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా 'చక్‌దే ఇండియా'ఫేం తాన్యా అబ్రోల్ బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడింది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చంఢీగర్‌లో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కాగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఓ పార్టీలో కలిసిన తాన్యా-ఆశిష్‌లు గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. తమ రిలేషన్షిప్ గురించి తాన్యా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'ఆశిష్ నాకు చాలా మంచి ఫ్రెండ్. కానీ తను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. దీంతో తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఓసారి తెలిసిన అబ్బాయితో డేట్‌కు వెళ్తున్నా అని చెప్పగానే ఆశిష్ ముఖం మాడిపోయింది. నిజంగానే వెళ్తున్నావా? నువ్వు ఎక్కడికీ వెళ్లకు. మనం ఇద్దరం డేట్‌కు వెళదాం అంటూ క్యూట్‌గా ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి మా ప్రేమ ప్రయాణం పెళ్లిదాకా వచ్చింది' అంటూ తాన్యా చెప్పుకొచ్చింది. కాగా తాన్యా 'చక్ దే ఇండియా' సినిమాతో పాపులర్ అయ్యింది. రీసెంట్‌గానే ఈ సినిమాలోని చిత్రాశి రావత్ కూడా తన బాయ్ ఫ్రెండ్, నటుడు ధ్రువ్ ఆదిత్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. -
మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా? ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఏమందంటే..
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలె భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని, పుకార్లు సృష్టించొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
వ్యాపారవేత్తతో ఘనంగా హీరోయిన్ పూర్ణ వివాహం (ఫొటోలు)
-
హీరోయిన్ పూర్ణ పెళ్లి ఫోటోలు లీక్.. దుబాయ్‌లో గ్రాండ్‌గా వివాహం
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెరపై కూడా అదరగొడుతుంది కేరళ భామ పూర్ణ. సీమ టపాకాయ్,అవును, అఖండ, దృశ్యం-2 చిత్రాల్లో నటించిన పూర్ణ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్గా కంటే బుల్లితెరపై ఓ షోకు జడ్జిగా వ్యవహరించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ ఈమధ్యే తనకు పెళ్లయిపోయిందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో మే నెల 31 నిశ్చితార్థం జరగ్గా జూన్ 12వ తేదీన దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో తన వివాహం జరిగిందని స్వయంగా పూర్ణ రివీల్ చేసింది. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా కాసేపట్లో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో పూర్ణ దంపతులకు పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
మైనర్ల వివాహం వైరల్.. విస్తుపోయే విషయాలు
చెన్నై: సోషల్ మీడియా, సినిమాల ప్రభావం.. ముఖ్యంగా పిల్లలపై పెద్దల నిఘా కరువు యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. చెడు వ్యసనాలతో పాటు వయసుకు మించిన పరిణితితో చేయకూడని పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడు కడలూరు జిల్లాలో మైనర్ల వివాహం వైరల్ కావడం సంచలనం సృష్టించింది. చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద జరిగన మైనర్ల వివాహం తీవ్ర చర్చనీయాంశంగా జరిగింది. ఈ వైరల్ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. అమ్మాయి(16)కి పసుపు కొమ్ము కట్టిన మైనర్(17)ను ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. అబ్జర్వేషన్ హోంకు మైనర్‌ను తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, ఇలా చేస్తే అయినా అంగీకరిస్తారని స్నేహితులు వాళ్లను ప్రలోభపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అలా స్నేహితుల ప్రోద్భలంతోనే ఇంటర్ చదువుతున్న ఆమెను.. పాలిటెక్నిక్ చదువుతున్న ఆ అబ్బాయి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు బాలికతో మైనర్ బాలుడికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో.. బాలికకు వైద్యపరీక్షలు చేయించారు పోలీసులు. అంతేకాదు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి.. ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తమిళనాడు సేలం జిల్లాలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల కాలేజీ యువతి.. మైనర్ బాలుడు అయిన తన క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకుంది. ఏప్రిల్‌లో ఈ ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే అప్పుడే వీళ్లిద్దరూ వివాహం చేసుకుని.. అదే కాలేజీకి చెందిన ఓ సీనియర్ ఇంట్లో వీళ్లిద్దరూ కాపురం పెట్టినట్లు తెలుస్తోంది. మైనర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు ట్రేస్ చేసి ఇద్దరినీ కనిపెట్టారు. యువతి గర్భవతిగా తేలడంతో.. వైద్య పరీక్షలకు తరలించారు. మరోవైపు ఆమెపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నిలువునా మోసం -
ప్రేయసిని పెళ్లాడనున్న టీమిండియా పేసర్.. శుభలేఖ వైరల్..!
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరాకాల ప్రేయసి జయ భరద్వాజ్‌ను చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 1న వీరిద్దరి వివాహం జరగనుంది. ఇక గతేడాది ఐపీఎల్ సీజన్లో సీఎస్కే మ్యాచ్ సందర్భంగా దీపక్ చాహర్ తన ప్రేయసి జయ భరద్వాజ్ కి ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన జయ భరద్వాజ్ ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది. కాగా వీరిద్దరి వివాహనికి సంబంధించిన ఆహ్వన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్‌ను సీఎస్కే రూ.14 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి చాహర్ దూరమయ్యాడు. త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు చాహర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: IPL 2022: యార్కర్లతో అదరగొట్టాడు.. చివరి మ్యాచ్‌లోనైనా అవకాశమివ్వండి! View this post on Instagram A post shared by Deepak Chahar (@deepak_chahar9) -
ఆ నటుడికి 61 ఏళ్లు.. రెండేళ్ల వివాహ బంధానికి విడాకులు..
Sean Penn And Leila George Finalized Divorce After 2 Years Of Marriage: సినీ తారల ప్రేమాయణాలు, బ్రేకప్‌లు, పెళ్లిల్లు, విడాకులు ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ప్రేమలో మునిగితేలుతూ పోస్ట్‌లు పెట్టే సెలబ్రిటీలు హఠాత్తుగా విడిపోయామంటూ షాక్ ఇస్తారు. అలాగే ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్న దంపతులు అంతే తేలిగ్గా విడాకులు తీసుకున్న సంఘటనలు కూడా మనం చూశాం. తాజాగా హాలీవుడ్ తారలు సీన్ పెన్, లీలా జార్జ్‌లు తమ వివాహం బంధానికి స్వస్తి పలికారు. వివాహం బంధంతో ఒక్కటిగా జీవించిన ఈ జంటకు తాజాగా విడాకులు మంజూరు అయ్యాయి. 61 ఏళ్ల సీన్ పెన్ 2016 నుంచి 30 ఏళ్ల లీలా జార్జ్‌తో డేటింగ్ చేశాడు. ప్రేమలో మునిగితేలిన ఈ జంట జూలై 2020లో కొవిడ్ సమయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కేవలం ఒక ఏడాది తర్వాత అక్టోబర్ 2021లో విడాకుల కోసం దాఖలు చేసుకుంది ఈ జంట. తాజాగా వారికి విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే వారు అధికారికంగా సెప్టెంబర్ 2021 నుంచే విడిగా ఉంటున్నారని పలువురు పేర్కొన్నారు. వారి విడాకులకు సరైనా కారణాలు తెలియరాలేదు. ఇప్పటికీ లీలా జార్జ్‌తో ప్రేమలో ఉన్నాని, కానీ వివాహ బంధంతో విసిగిపోయానని చెబుతున్నాడు సీన్ పెన్. కాగా పెన్ గతంలో రాబిన్ వ్రైట్ను పెళ్లి చేసుకున్నాడు. వారికి 31 ఏళ్ల కుమార్తె డైలాన్, 28 ఏళ్ల కుమారుడు హాప్పర్ ఉన్నారు. రష్యా-ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రేయిన్‌లో డ్యాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం వెళ్లి వార్తల్లో నిలిచాడు సీన్ పెన్. ఆ సమయంలో పెన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీని కూడా కలుసుకున్నట్లు సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐదేళ్లు ప్రేమాయణం, పెళ్లి చేసుకుంటానని.. వేరే యువతితో
విశాఖపట్నం: ఐదేళ్లుగా ప్రేమాయణం సాగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరై, ఇప్పుడు వేరే యువతిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదతీనార్లలకు చెందిన కారే ఆశ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఇదే గ్రామానికి చెందిన మైలపల్లి రాము అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం భార్యాభర్తలమే నువ్వేమి అనుమానం పడక్కర్లేదంటూ కర్నాటక, హంపి,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాడు. శారీరకంగా అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే కట్నం ఇవ్వలేరన్న కారణంతో తిరస్కరించి ఈనెల 2వ తేదీన వేరే యువతిని వివాహం చేసుకునేందుకు మూహూర్తం పెట్టుకున్నాడు. విషయం తెలిసి నిలదీస్తే, నువ్వంటే ఇష్టమేనని కానీ మా తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకోలేనని ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ పెద్దలు రాము తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఇద్దరికీ వివాహం చేయాలని కోరారు.అయితే రాము కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యుల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించి, న్యాయం చేయాలని కోరింది. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తీసుకున్న ఫొటోలు, వాట్సాప్ చాటింగ్‌ను ఆమె పోలీసులకు చూపించింది. దీనిపై ఎస్ఐ వెంకన్నను వివరణకోరగా మెలపల్లి రాముపై బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు. -
శరత్‌బాబుతో హీరోయిన్ నమిత పెళ్లి పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన భర్త
Namitha Husband Reaction On Namitha Marriage With Sarath Babu Rumours: హీరోయిన్ నమితకు తెలుగు, తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'సొంతం' సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ తర్వాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజకు జోడీగా ఒక రాజు..ఒక రాణి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ హీరోయిన్గా పాపులర్ అయిన నమిత 2017లో వ్యాపారవేత్త, నిర్మాత వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే నమితపై గతంలో అనేక రూమార్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరేంద్రతో పెళ్లి ఫిక్సయిన తర్వాత కూడా సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నమిత భర్త వీరేంద్ర స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సరిగ్గా మా పెళ్లి సమయంలోనే సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత పెళ్లంటూ వార్తలు వచ్చాయి. నా లైఫ్‌లోనే నేను విన్న వరస్ట్ కామెంట్స్ ఇవి. అసలు అలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఆయన చాలా పెద్దాయన. అలాంటి వ్యక్తితో ఎఫైర్ క్రియేట్ చేయడం చాలా తప్పు. అలాంటి రూమర్స్‌ని పట్టించుకోవాల్సిన పనిలేదు' అంటూ పుకార్లకి చెక్ పెట్టారు. -
షణ్నూ చాలా స్పెషల్, బయట కూడా అలాగే ఉంటాం: సిరి
Bigg Boss 5 Siri Comments About Her Marriage And Negative Trolls On Social Media: బిగ్‌బాస్ షోలో సిరి-షణ్నూల రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్ అని స్టేట్మెంట్స్ ఇచ్చినా ఆడియెన్స్‌కు మాత్రం వీరి రిలేషన్ అంతగా రుచించలేదు. బయట వీరిద్దరికి బాగానే ఫాలోయింగ్ ఉన్నా హౌస్‌లోకి వచ్చాక మాత్రం నెగిటివిటి పెరిగింది. ఈ కారణంగానే టైటిల్ రేసులో ఉన్న షణ్ముక్ కప్పు చేజార్చుకున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన సిరి తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, షణ్నూతో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడింది. 'బయటకు రాగానే యూట్యూబ్‌లో వచ్చిన థంబ్‌నేల్స్, వీడియోలు,సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూసి షాక్ అయ్యా. షణ్నూ నాకు చాలా మంచి ఫ్రెండ్. నా లైఫ్‌లోనే తను చాలా స్పెషల్. హౌస్ లోపల ఎంత నిజాయితిగా ఉన్నామో, బయటకు వచ్చాక కూడా మేం అలాగే ఉంటాం. షణ్నూ నన్ను చాలా మోటివేట్ చేసేవాడు. అలా మేం క్లోజ్ అయ్యాం. కానీ హగ్ చేసుకోవడం బయట రిసీవ్ చేసుకోలేదు' అని అర్థమైంది. అయినా మా పర్సనల్ లైఫ్ గురించి మా ఇద్దరికీ క్లారిటీ ఉంది. మా లైఫ్ పార్టనర్స్‌కి కూడా క్లారిటీ ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియుడు శ్రీహాన్‌తో పెళ్లి గురించి మాట్లాడుతూ.. తను ఎప్పుడంటే అప్పుడే మా పెళ్లి. బయట ఒకవేళ సినిమా ఆఫర్స్ వస్తే అవి చేస్తూనే పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తా అని పేర్కొంది. -
ఆ లేఖలే అమ్మాయిల నుదుటి రాతల్ని మార్చాయి
‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. కేంద్రం మహిళల వివాహ వయసును పెంచడానికి జయా జైట్లీ నేతృత్వంలో 2020 జూన్ నాలుగున టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రంలో కదలిక తీసుకొచ్చే ప్రయత్నానికి బీజం వేసింది మాత్రం కొందరు యువతుల పోస్ట్‌కార్డ్ రాతలే!. చదవండి: 21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి పాట్నా (బీహార్) వాసి సోనమ్ కుమారి, హిసార్(హరియాణా)కు చెందిన 16 ఏళ్ల పూనమ్ మిథర్వాల్ లాంటి అమ్మాయిలు చేపట్టిన పోస్ట్‌కార్డ్ ఉద్యమం కేంద్రం నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటని చెప్పొచ్చు. 19 ఏళ్ల సోనమ్‌కు ఇంట్లో వాళ్లు పెళ్లిచేయబోయారు. చదువుతానని, ఇప్పుడే పెళ్లి వద్దని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక సోనమ్ ఈ ఏడాది ఆగస్టులో ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువును కొనసాగిస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా వివాహ వయసు 21 ఏళ్లకు పెంచాలని ప్రధాని మోదీకి ఆగస్టులోనే లేఖ రాసింది. చదవండి: పెళ్లికి అమ్మాయి కనీస వయసు పెంపు! మన దగ్గరే ఇలాగనా? సోనమ్ సంధించిన లేఖ హరియాణాలో ఏంతోమంది బాలికలను ఆలోచింపజేసింది. నిశ్శబ్ద ఉద్యమం మొదలైంది. వందలాది మంది బాలికలు ప్రధానికి లేఖలు రాశారు. పూనమ్ ఆగస్టులో ఒకరోజు కాలేజీ ముగిశాక నేరుగా పోస్ట్ ఆఫీసుకు వెళ్లింది. ఆమెతో పాటే మరో ఆరుగురు స్నేహితురాళ్లు కూడా. ‘మోదీ జీ.. అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచండి’ అని పోస్ట్‌కార్డుపై హిందీలో చాలా క్లుప్తంగా తమ విజ్ఞప్తికి అక్షర రూపమిచ్చారు. ‘నా స్నేహితురాళ్లు, తెలిసిన వాళ్లలో చాలామందికి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేసి పంపించి వేశారు వాళ్ల కుటుంబసభ్యులు. చదువు మాన్పించారు. వివాహ వయసు పెంచితే తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువులు కొనసాగించడానికి వీలుంటుంది’ అని పూనమ్ వాదన. –నేషనల్ డెస్క్, సాక్షి -
యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, ధర్మపురి(కరీంనగర్): యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి, కిడ్నాప్‌కు యత్నించిన ఘటన ధర్మపురిలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన ఓ యువతి(23)కి వెల్గటూర్ మండలంలోని కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో సోమవారం పెళ్లి నిశ్చయమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఇది చూసిన వెంటనే సారంగాపూర్ మండలంలోని రేచపెల్లికి చెందిన మంగళారపు రాజేందర్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. లోపల ఉన్న ఆమెను లాక్కొచ్చి, కారులో ఎక్కించారు. జాతీయ రహదారి పక్కనున్న దుర్గమ్మ కాలనీ నుంచి కమలాపూర్ రూట్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కారు ఆగిపోయింది. బాధితురాలు రోదిస్తూ కేకలు వేయడంతో రాజేందర్ కోపోద్రిక్తుడై కత్తితో ఆమెను గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం జరగగా యువతి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు, సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ నలుగురు పారిపోయారు. పోలీసులు కారును ఠాణాకు తరలించారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషను చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. ఇద్దరూ డిగ్రీ క్లాస్మేట్స్.. రాజేందర్, బాధిత యువతి డిగ్రీ క్లాస్మేట్స్. ఈ క్రమంలో రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుంటానని రాజేందర్ ఆమె తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు నిరాకరించారని సమాచారం. రెండు రోజుల కిందట కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో యువతికి పెళ్లి నిశ్చయించారు. ఇది తెలుసుకున్న రాజేందర్ తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమయ్యాడు. చదవండి: పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య -
కత్రీనా పెళ్లి వేడుకలు.. ఎన్ని కిలోల మెహందీ వాడారంటే ?
To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent: బీటౌన్‌లో హాట్ టాపిక్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం. 38 ఏళ్ల కత్రీనా కైఫ్, 33 సంవత్సరాల విక్కీ కౌశల్ ఒక ఏడాదికిపైగా డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విక్ట్రీనా (విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్‌లను అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు) వివాహ వేడుకలు మంగళవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభమయ్యాయి. కత్రీనా కైఫ్, కౌశల్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లారు. రెండు కుటుంబాలు 15 కంటే ఎక్కువ కార్లతో కూడిన కాన్వాయ్‌లో నేరుగా జైపూర్ నుంచి సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌కు చేరుకున్నారు. సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ హోటల్లో జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కత్రీనాకు సన్నిహితుడు చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్, అతని భార్య మినీ మాథూర్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార, నేహా ధూపియా-అంగద్ బేడీ దంపతులు, తదితరులు జైపూర్‌కు చేరుకున్నారని సమాచారం. మంగళవారం ఉదయం విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్ స్నేహితుడు శర్వారీ వాఘ్, రాధిక మదన్ కూడా హాజరయ్యారు. జైపూర్‌కు నుంచి సుమారు 120 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ హోటల్‌కు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ కూడా బుధవారం ఉదయం చేరుకున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకల్లో భాగమైన మెహందీ ఫంక్షన్‌కు సుమారు 20 కిలోల ఆర్గానిక్ మెహందీ పౌడర్ సరఫరా చేశారట. ఈ మెహందీని రాజస్థాన్‌లోని పాలి జిల్లా సోజత్ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు సమాచారం. అలాగే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరగనున్న విక్ట్రీనా పెళ్లికి మెహందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్లు పంపించారట. అయితే ఈ సోజత్ పట్టణం మెహందీ సాగుకు ప్రసిద్ధి. ఈ వివాహ కార్యక్రమం కోసం ఈ ఆర్గానిక్ మెహందీ ప్రాసెస్ చేయడానికి సుమారు 20 రోజులు పట్టిందని సోజత్‌లో మెహందీ తయారీ కంపెనీ అయినా 'నెచురల్ హెర్బల్' యజమాని నితేష్ అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
పెళ్లిని వాయిదా వేసుకున్న ఆలియా-రణ్‌బీర్
Ranbir Kapoor and Alia Bhatt Postpone Their Wedding: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ల పెళ్లి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా గతేడాది వీరి పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివర్లో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా తాజాగా మరోసారి ఆలియా-రణ్‌బీర్‌లు వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇద్దరూ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా పెండింగ్‌లో ఉండటం సహా ఇతర కారణాలతో తమ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారాం. తొలుత ముందుగా కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారంటా ఈ క్యూట్ కపుల్. అంతేకాకుండా పెళ్లి అయిన వెంటనే ఖరీదైన ప్లాట్‌లోకి మారాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి కూడా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయట. దీంతో అన్ని పనులు అనుకున్నట్లు పూర్తి అయ్యాక వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో లేదా 2022 డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. దీంతో ఆలియా-రణ్‌బీర్‌ల వివాహం కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందేనట. -
యాంకర్ శ్రీముఖికి ఇదివరకే పెళ్లయ్యిందా? ఇదిగో ప్రూఫ్
Was Anchor Sreemukhi Already Got Married Here Is The Proof: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని ఫన్నీ గేమ్ ఆడింది. ఇందులో నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటూ శ్రీముఖి అడగ్గానే.... మీకు ఇదివరకే పెళ్లయిందంటూ సమాధానం వచ్చింది. ఇది చూసి షాక్ అయిన శ్రీముఖి తొక్కా అంటూ రియాక్షన్ ఇచ్చింది. మొదట్లో నవ మన్మథుడా..అతి సుందరుడా నను వలచిన ఆ ప్రియుడు అంటూ ఎంతో హుషారుగా గేమ్ మొదలు పెట్టిన శ్రీముఖికి ఇన్స్టాగ్రామ్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిచూసిన నెటిజన్లు...ఇన్స్టాగ్రామ్ రాక్స్..శ్రీముఖి షాక్స్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి
'మౌనరాగం' సీరియల్‌తో అమ్ములుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ప్రియాంక జైన్. ఈ సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం 'జానకి కలగనలేదు' సీరియల్లో మెయిన్ లీడ్ పాత్ర పోషిస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంకకు బాగానే ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన అప్డేట్స్ను షేర్చేస్తూ ఎప్పకటిప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన తల్లిదండ్రుల 24వ వార్షికోత్సవం సందర్భంగా వారికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. 'ఈరోజు మా అమ్మానాన్నల పెళ్లిరోజు. అప్పట్లో వారు ఇంట్లో తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. కాబట్టి వాళ్లకు ఈ రోజు మళ్లీ పెళ్లి చేస్తున్నాం. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల క్షేమాన్ని, సంతోషాన్నే కోరుకుంటారు. కానీ పిల్లలుగా ఈసారి మేం వాళ్లకు మర్చిపోలేని సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. 24వ వివాహ వార్షికోత్సవాన్ని మరింత స్పెషల్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అందుకే వాళ్లకు మళ్లీ పెళ్లి చేశాం' అని పేర్కొంది. ఇక ఈ వీడియోలో హల్దీ, మెహందీ సహా అన్ని కార్యక్రమాలను ప్రియాంక దగ్గరుండి సెలబ్రేట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి : హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు అప్పుడే విలన్ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్ బాబు -
సినీ నటిని పెళ్లాడబోతున్న 'బిగ్‌బాస్' ఫేం స్నేహన్
చెన్నై: సినీ గీత రచయిత, నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. 700 పైగా చిత్రాలకు 2,500కు పైగా పాటలను రాసిన రచయిత స్నేహన్. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నటి కన్నిక రవిని స్నేహన్ వివాహం చేసుకోబోతున్నారు. పెద్దల సమ్మతితో ఈ నెల 29న నటుడు కమలహాసన్ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకుంటు న్నారు. స్నేహన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు తెలిపారు. -
డైరెక్టర్‌తో ప్రేమలో పడ్డ త్రిష!..త్వరలోనే వివాహం?
Trisha Marraige Rumours: చెన్నై బ్యూటీ త్రిష పెళ్లి టాపిక్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ తమిళ దర్శకుడిని త్రిష త్వరలోనే పెళ్లాడబోతుందంటూ ఓ వార్త కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని, ఈ నేపథ్యంలో త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం తెలియరాలేదు. గత కొన్నిరోజులుగా త్రిష పెళ్లి వార్తలపై జోరుగా ప్రచారం జరుగుతున్నా ఆమె ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి త్రిష పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. కొద్ది రోజుల క్రితమే త్రిషకు ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి నిశ్చయమైందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అది కేవలం పుకారు అని తేలింది. గతంలో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన త్రిష.. అతడితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. 40కి దగ్గర్లో ఉన్నా ఇప్పటికీ వన్నె తరగని అందంతో హీరోయిన్గా వరుస చిత్రాలు చేస్తూ సత్తా చాటుతుంది ఈ చెన్నై చిన్నది. ప్రస్తుతం త్రిష ‘పొన్నాయ్ సెల్వన్’, ‘సతురంగ వెట్టాయ్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. -
యంగ్ హీరోతో త్వరలోనే కత్రినా వివాహం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలోనే పెళ్లికూతురిగా మారనుందా అంటే అవుననే అంటున్నాయి బీటౌన్ వర్గాలు. ఇటీవలె కత్రినా 38వ బర్త్‌డే సందర్భంగా ఆమె పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సల్మాన్ ఖాన్ మేనేజర్, స్టయిలిస్ట్ యాష్లె షేర్ చేసిన ఓ పోస్ట్ మరింత బలం చేకూరుస్తుంది. కత్రినా పుట్టినరోజు సందర్భంగా ఆమె పెళ్లి డ్రెస్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసిన యాష్లె..త్వరలోనే ఇది నిజం కావాలంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీనికి కత్రినా కూడా 'థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. కానీ తమ లవ్ కహానీపై మాత్రం ఇంతవరకు ఎలాంటి కన్ఫార్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజాగా 40లోపు పెళ్లిచేసుకోవాలని కత్రినా భావిస్తుందని, దీంతో త్వరలోనే ఆమె పెళ్లి జరగనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రియుడు విక్కీ కౌశల్‌తోనే కత్రినా త్వరలోనే ఏడడుగులు వేస్తుందని, ముహూర్తం కూడా ఫిక్స్ అంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్లతో కత్రినా ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌తో పెళ్లిదాకా వెళ్లిన రిలేషన్ అనుకోకుండా బ్రేక్ అయ్యింది. మరోవైపు రణ్‌బీర్ సైతం ఆలియాను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. View this post on Instagram A post shared by deluxeBollywood (@deluxebollywood__) -
మరదలిపై ఇష్టం, పెళ్లి కాకపోవడంతో రచ్చ.. చేసేదేం లేక
లక్నో: సాధారణంగా వధువరులు తమ వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఓ పెద్ద ఫంక్షన్ హాల్ లేదా ప్రసిద్ది చెందిన దేవాలయంలో అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృభిస్తున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకల్లో పరిమిత సంఖ్యలో బంధువులు పాల్గొనాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు విధించిన సంగతి విధితమే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని ఓ వివాహ వేడుకకు పోలీసు స్టేషన్ వేదికైంది. వివరాల్లోకి వెళ్తే.. మరి కొద్ది నిమిషాల్లో వధువరులు వివాహం చేసుకొని ఒకటి కాబోతున్న వేళ పెద్ద గొడవ జరిగింది. వధువు క్రాంతి వర్మకు సంబంధించిన కొంత మంది బంధువులు వరుడు కమలేశ్ వర్మ బంధువులు, అతిథులపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా వధువు బావ వరుసయ్యే ఓ వ్యక్తి కమలేశ్ తండ్రి రామకృష్ణను కిందకు తోసేసి దాడి చేశాడు. కమలేశ్ సోదరుడు, బంధువులు ఎంత ఆపినా వారు వినకుండా మధ్యలో వచ్చినా వారిని తోసేస్తూ నానా హంగామా చేశారు. దీంతో ఏం చేయలేక వధువరుల కుటుంబ సభ్యులు అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తూ.. పోలీసు స్టేషన్లోనే సంప్రదాయబద్దంగా కమలేశ్వర్మ, కాంత్రివర్మ వివాహం జరిపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. వధువు బంధువులు వివాహ వేడుకలో గొడవ చేశారని తెలిపారు. దీంతో తమ సమక్షంలో పోలీసు స్టేషన్లో వివాహం చేశామని వివరించారు. రాత్రి 2.30గంటకు వివాహం పూర్తి అయిందని, పోలీసుల భద్రత కల్పిస్తూ.. ఉదయం 6.30 గంటలకు వారిని ఇంటి పంపించినట్లు తెలిపారు. గొడవకు పాల్పడిన వధువు బంధువులు, బావపై కేసు నమోదు చేసుకొని దర్పాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వరుడు కమలేశ్ సోదరుడు మాట్లాడుతూ.. వివాహ వేడుకలో గొడవ జరుగుతుందని అసలు ఊహించలేదన్నారు. పెళ్లి కూతురు క్రాంతి వర్మ తండ్రి చాలా మంచివారని, మద్యం కూడా సేవించరని అన్నాడు. అయితే క్రాంతికి బావ వరసయ్యే వ్యక్తి.. క్రాంతిని పెళ్లిచేసుకోవాలనుకున్నాడని అది జరగకపోవడంతో ఇలా దాడికి తెగపడ్డాడని తెలిపాడు. అయితే పోలీసుల సాయంతో తన తమ్ముడి విహహం జరిగిందని అన్నాడు. చదవండి: సెక్యూరిటీ గార్డుతో వివాహేతర సంబంధం, చీరతో గొంతు బిగించి -
Sudigali Sudheer: పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకున్న సుడిగాలి సుధీర్!
సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఈ పేరు తెలియని వారుండరేమో. పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ అతి తక్కువ కాలంలోనే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇక యాంకర్ రష్మీతో కెమెస్ర్టీ కూడా సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో వీరిద్దరు కలిసి చేసిన పలు స్కిట్లు, ఈవెంట్లు సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై గతంలోనే ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఆ రూమర్లకు మాత్రం తెరపడటం లేదు. ఇటీవలె సుధీర్ 34వ బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి వీరి పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సుధీర్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని, మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరోవైపు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన సుధీర్‌కు వెండితెర అంతగా కలిసి రాలేదు. ఇప్పటికే సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ప్రస్తుతం ఆయన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో గాలోడు అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. సుధీర్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి ‘గాలోడు’ అనే టైటిల్‌ను ప్రకటించారు. చదవండి : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం ఆ పనులు చేయడమంటే పిచ్చి ఇష్టం : నటి నవ్య స్వామి -
కూతురి పెళ్లి డబ్బు.. పేదలకు రూ.5 వేల చొప్పున..
సాక్షి, మైసూరు: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ కారణంగా వివాహా కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో జరుగుతున్నాయి. అదేవిధంగా పూర్తి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా తన కూతురి పెళ్లిని నిరాడంబరంగా నిర్వహించి, ఆ పెళ్లికయ్యే ఖర్చు మొత్తాన్ని పేద కుటుంబాలకు పంచిపెట్టారో మహానుభావుడు. మైసూర్‌లోని తిలక్ నగరకు చెందిన హరీశ్ అనే వ్యక్తి కుమార్తె వివాహం మే 12,13వ తేదీల్లో పెట్టుకున్నారు. కానీ, రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇంట్లోనే తన కుమార్తె పెళ్లిని నిరాడంబరంగా చేశారు. ఇక పెళ్లికని దాచుకున్న రూ.2లక్షల సొమ్మును 40పేద కుటుంబాలకు రూ.5వేల చొప్పున పంచిపెట్టారు. ఆయన చేసిన ఈ మంచి పనికి స్థానికులు ప్రశంసిస్తున్నారు. చదవండి: వైరల్: క్వారంటైన్లో ఎమ్మెల్యే చిందులు -
పెళ్లి పీటలెక్కిన 'ద కపిల్ శర్మ షో' కమెడియన్లు
"ద కపిల్ శర్మ షో"తో గుర్తింపు పొందిని హాస్య నటి సుగంధ మిశ్రా ప్రియుడు, కమెడియన్ సంకేత్ భోస్లేని పెళ్లాడింది. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పంజాబ్‌లోని లూధియానాలో వీరి పెళ్లి జరిగింది. వివాహానికి హాజరైన వారందరికీ ముందే కరోనా పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గత కొంతకాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమని తేల్చుతూ ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. ఇక వధువు సుగంధ మిశ్రా పింక్ లెహంగాలో అందంగా ముస్తాబవగా, సంకేత్ భోస్లే వైట్ అండ్ ఎల్లో కుర్తాలో కనిపించారు. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వారం రోజుల క్రితమే సంకేత్ భోస్లేతో కలిసి త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అంటూ సుగంధ మిశ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సంకేత్ భోస్లేతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. డిసెంబర్ నుంచే పెళ్లిపనులు మొదలుపెట్టానని, ఆన్లైన్లో పెళ్లి షాపింగ్ కూడా పూర్తైంది అని తెలిపింది. సంకేత్ డాక్టర్ కావడంతో కోవిడ్ నిబంధనల మధ్య అతి తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం, పెళ్లి ఒకేసారి జరుగుతాయని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Preeti Simoes (@preeti_simoes) చదవండి : మా డేటింగ్ను సీక్రెట్‌గా ఉంచాను, తప్పలేదు: నటి గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్ -
కరోనా నుంచి కాపాడాలని.. రావి, వేప చెట్లకు వివాహం
వేలూరు(తిరువణ్ణామలై): కరోనా నుంచి కాపాడాలని రాగి, వేప చెట్లకు వివాహం చేశారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా నరియంపేటలో శ్రీతంజయమ్మన్ ఆలయం ఉంది. పదేళ్ల కిందట గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి, కుంభాభిషేకం చేశారు. ఆ సమయంలో ఒక మహిళపై అమ్మవారు వాలి, ఆలయం ఉన్న ప్రాంతంలో రాగి–వేప చెట్లను నరకవద్దని ఈ చెట్లు రెండూ దేశ ప్రజలను కాపాడుతాయని చెప్పినట్లు గ్రామపెద్దల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో భక్తులు ప్రతి రోజూ ఈ చెట్లకు పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం అదే మహిళపై అమ్మవారు మళ్లీ వాలి, దేశంలో కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, ఆక్సిజన్ సమస్య రాకుండా ఉండేందుకు వేప, రాగి చెట్లకు వివాహం చేయాలని తెలిపింది. దీంతో గ్రామస్తులు పెళ్లి పత్రికలు కొట్టి, గ్రామంలో పంచి పెట్టి ఆలయ ప్రాంగణంలో అరటి చెట్లు కట్టి, పందిళ్లు వేసి రెండు చెట్లను కొత్తదుస్తులతో అలంకరించారు. శనివారం ఉద యం 6 గంటల సమయంలో మేళ తాళాల నడుమ వరుస తాంబూలను గ్రామంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో తాంబూలం మార్చుకుని సంప్రదాయం ప్రకారం బంగారం తాళి బొట్టును వేప చెట్టుకు కట్టి వివాహం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అక్సిజన్ ఉత్పత్తి పెరిగేందుకు చెట్లను పెంచాలని, మానవుడి తరహాలోనే చెట్లును రక్షించాలని, ప్రపంచ శాంతి కోసం,వేప–రాగి చెట్టుకు వివాహం చేయడంతో పలువురిని ఆశ్చర్యపరిచింది. వివాహ అనంతరం గ్రామస్తులందరికీ వివాహ వేడుకల తరహాలోనే విందు ఏర్పాటు చేశారు. చదవండి: యూకేలో 49శాతం వ్యాక్సినేషన్‌తో 97% తగ్గిన కేసులు -
జస్ప్రీత్ బుమ్రా పెళ్లి ఫోటోలు
-
ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు
సాక్షి, ఏలూరు: ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ట్రాన్స్‌జెండర్ అని తెలిసే ప్రేమాయణం సాగించాడు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ నువ్వు నాకు వద్దంటూ వేధింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంతకీ అతను ఏలూరు సత్రంపాడుకు చెందిన యువకుడు కావటం ఆసక్తిగా మారింది. ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడు హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ భూమితో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ప్రేమించుకున్నారు. అనంతరం 2020 జనవరిలో పెద్దలను ఒప్పించి మరీ భూమిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో యువకుడు భూమితో ఉండేందుకు నిరాకరించటంతోపాటు, అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు తారకను అరెస్టు చేశారు. చదవండి: మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు చదవండి: ముందు ఛాటింగ్ .. తర్వాత ఫోన్ -
ఆ ఒక్క కారణంతో పిల్లనివ్వడం లేదు
దొడ్డబళ్లాపురం: వ్యవసాయం బాటపడుతున్న యువ రైతులకు వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ పిల్లనివ్వడంలేదని, ఇందుకు సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని ఒక యువరైతు విజ్ఞప్తి చేసుకున్న ఆడియో రామనగరలో వైరల్‌గా మారింది. మళవళ్లికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఎమ్మెల్సీ యోగేశ్వర్‌కు కాల్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను ఉద్యోగం దొరక్క వ్యవసాయం చేసుకుంటున్నానని, వ్యవసాయం చేస్తున్నాననే ఒక్క కారణంతో తనకు వివాహం కావడం లేదని, అదే పట్టణంలో కూలి పనిచేస్తున్నా పిల్లనిస్తున్నారని, తనకు 35 సంవత్సరాలు వచ్చాయని, అందువల్ల ప్రభుత్వంతో చర్చించి ఒక చట్టం తీసుకురావాల్సిందిగా కోరాడు. స్పందించిన యోగేశ్వర్ ఈ విషయంపై చర్చిద్దాం అంటూ ఆ యువ రైతును ఓదార్చాడు. చదవండి: భవిష్యత్తు కోసం శుక్రవారాన్ని కేటాయించండి చదవండి: కూతురిని విక్రయించి.. భార్యపై ఇస్త్రీ పెట్టెతో కాల్చి -
మనిద్దరం ఒకరికొకరం జీవితంలో కలిసి నడుద్దాం
మనకు శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది. ఏడు అడుగులు కలిసి నడిస్తే సఖ్యత సిద్ధిస్తుంది–అని. అందుకే వివాహంలో సప్తపది చేస్తారు. ప్రారంభంలోనే ఒక మాట అంటారు. మనిద్దరం ఏడడుగులు వేస్తున్నాం సఖీ–అని పిలుస్తాడు. ‘‘ఓ నెచ్చెలీ! మనిద్దరం ఒకరికొకరం జీవితంలో కలిసి నడుద్దాం. ఇదిగో నా చేయి పట్టుకో’’.. అని తాను ముందుండి భార్యను నడిపించాల్సిన వాడు కాబట్టి ఆయన ముందు నడుస్తాడు. ఆయన వెంట ఆమె నడుస్తుంది. వయసులో కొద్దిగా పెద్దవాడిని భర్తగా తెస్తారు. అనుభవం ఉన్నవాడు, పరిణతి ఉన్నవాడు కాబట్టి నడిపించగలిగినవాడై ఉంటాడు. కాబట్టి ఆయన చిటికెన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆమె నడుస్తుంది. ఏడడుగులు వేస్తూ మంత్రాలు చెబుతారు. ఒక్కొక్క మంత్రం చెబుతూ ఒక్కొక్కటి కోరుతారు. మొదటి అడుగు చేత ‘అన్నం సమృద్ధిగా లభించుగాక’తో మొదలుబెట్టి వరుసగా బలం లభించుగాక, కర్మ లభించుగాక, కర్మ వలన సౌఖ్యాలు లభించుగాక, యజ్ఞం చేసెదము గాక, రుతు సంబంధమైన సుఖాలన్నిటినీ అనుభవించెదము గాక, పశుసమృద్ధిని పొందెదము గాక...అని ఏడు రకాలయిన సమృద్ధులను కోరుతూ జీవితంలో ప్రస్థానం చేసి కలిసి మెలిసి అన్ని సుఖాలు అనుభవించి చిట్టచివరకు – ఈ సుఖాలు కూడా సుఖాలేనా అన్న వైరాగ్యాన్ని పొంది భగవంతుని పరిపూర్ణ అనుగ్రహానికి నోచుకోవాలి.హోమప్రక్రియలో భర్త .. ఎన్నడూ నీవు జుట్టు విరబోసుకుని, రొమ్ము బాదుకుంటూ ఏడవవలసిన పరిస్థితి కలుగకుండుగాక! నీవు సంతోషంతో పదిమంది బిడ్డలను కనెదవు గాక! నేను నీకు 11వ కుమారుడిగా అగుదును గాక’’ అంటాడు. ఎందుకు 11వ కుమారుడు అవడం? పదిమంది పిల్లల్ని కనీపెంచీ పెద్దచేసీ ఆమె అనుభవాన్ని పొందుతుంది. ఇంతమందిని వృద్ధిలోకి తెచ్చిన–ఆయన మాటను పిల్లలు వినకపోతే పక్కకు వెళ్ళి అలిగి కూర్చుంటాడు. అప్పుడు పిల్లలు –‘‘నాన్నగారు కోపం వచ్చి కూర్చున్నారు. చెబితే వినరు. ఇంకా ఎందుకు మీకీ తాపత్రయం? మేం పెద్దవాళ్ళమయ్యాం కదా.. నాన్నగారూ...’’ అని వాళ్ళు నాన్నగారితో మాట్లాడడానికి భయపడి పక్కకు వెడతారు. నువ్వు కూడా అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోకేం. చిన్నతనంలో పిల్లలు మారాం చేస్తే వారిని బుజ్జగించినట్లు నన్ను కూడా బుజ్జగించు. నన్ను 11వ కుమారుని చేసుకో. నీవు నాకు శాంతి స్థానంగా ఉండు’’ అని అడుగుతాడు భర్త. వివాహక్రతువులో స్త్రీపురుషుల మధ్య, వధూవరుల మధ్య అటువంటి పరిణతి కల్పించి దంపతులుగా వాళ్ళ జీవితం పండించుకోవడానికి కావలసిన సమస్త క్రతువుల సమాహారమే వివాహం. అటువంటి వివాహ వ్యవస్థను ఆదరించి, గౌరవించి ఆ మంత్రాలకు అర్థం తెలుసుకోవాలి... మంత్రభాగం మీద, శాస్త్రం మీద, క్రతువు మీద, పెద్దల మీద గౌరవాన్ని ఉంచి వివాహం చేసుకుంటే అది అభ్యున్నతికి కారణమవుతుంది. అటువంటి వైవాహిక వ్యవస్థ వైభవం ఈ దేశంలో మరింత ద్విగుణీకృతంగా ప్రకాశించాలని ఆ పరమేశ్వరుని పాదాలను పట్టి ప్రార్థన చేస్తున్నా. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పెద్దలు నిర్ణయించారు. కానీ...
పితృరుణం నుండి విముక్తి పొందడానికి ధార్మికమైన సంతానాన్ని పొందాలి... అంటే ఎవరు తన పక్కన భార్యగా లేదా భర్తగా కూర్చోవడానికి అధికారాలను పొందవచ్చో పెద్దలు నిర్ణయించిన తరువాత అటువంటి వారిని జీవిత భాగస్వామిగా ఆహ్వానించడం జరుగుతుంది. తద్వారా దంపతులయిన వారు ధార్మికమైన సంతానాన్ని పొందుతారు. ఇది మొదటి ప్రయోజనం. గహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత భార్యపక్కన ఉన్న కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు చేసి చిత్తశుద్ధి పొందడం, దేవతల రుణాన్ని తీర్చుకోవడం రెండవ ప్రయోజనం. భార్యలేని నాడు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అర్హుడు కాడు. ఉత్తరీయం ఎడమ భుజంమీద ఉండడానికి అర్హత ఉండదు. అలా ఉండాలంటే భార్య ప్రాణాలతో ఉండాలి. భార్య ఉంటే తప్ప తన కడుపున పుట్టిన కూతురికి కూడా కన్యాదానం చేయడానికి పీటలమీద కూర్చునే అధికారం ఉండదు. కాబట్టి తాను గృహస్థాశ్రమంలో ధర్మాన్ని నిర్వర్తించడానికి– ధర్మపత్ని అవసరం. భర్త సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం. ఆమె తన జీవితంలో అభ్యున్నతిని పొందడానికి, భగవత్ సేవగా భర్తసేవ చేయడానికి, అమ్మా అని పిలిపించుకుని స్త్రీగా పరిపూర్ణత్వాన్ని పొందడానికి వివాహం అవసరం. అందుకే ఈ మూడూ (పితృ రుణం, రుషిరుణం, దేవరుణం) వివాహానికి ప్రధానమైన ప్రయోజనాలన్నారు. ఈ పద్ధతిలో ఏ పురుషుడికి పక్కన భార్యగా ఎవరు కూర్చోవాలి, ఏ స్త్రీ పక్కన భర్తగా ఎవరు కూర్చోవాలి.. అనేది ఎవరు నిర్ణయించాలి? అది వారి కన్న తల్లిదండ్రులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కారణం– తమ కడుపున పిల్లల సమర్ధత ఏమిటో, మానసికంగా ఉన్న బలాలు, బలహీనతలు ఏమిటో వాళ్ళ పక్కన ఎవరు వచ్చి కూర్చుంటే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా పండుతుందో ఏ శాస్త్ర పరిశీలనం చేయకుండానే తెలుసుకుని సమన్వయం చేయగల సమర్థత జన్మతః సిద్ధించేది ఒక్క తల్లిదండ్రులకే. అందుకే నిర్ణయించాల్సింది ఎవరు అంటే... తల్లిదండ్రులు మాత్రమే. నేనీ మాట అంటున్నప్పుడు ... దానికి ఎంత మాత్రం రంగు అద్దే ప్రయత్నం చేయకూడదు. బయట సమాజంలో మనం చూస్తుంటాం. దానికి ఫలానా ఆయన అధికారి–అని అంటూంటారు. ఒకరికి శరీరంమీద కురుపు వచ్చింది, దానిని కోయాలంటే వైద్యుడే తగిన అధికారి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎం.ఆర్.ఓ నే సరియైన అధికారి. నేరం చేస్తే నేరస్థుడాకాదా అని దర్యాప్తు చేయడానికి రక్షక భటుడే దానికి అధికారి. అలాగే నాకు ఎవరు భార్యగా ఉండాలనేది, నాకు ఎవరు భర్తగా ఉండాలనేది నిర్ణయించేది నా తల్లిదండ్రులు. వాళ్ళే సరైన అధికారులు. ఇది శాస్త్రం కల్పించిన మర్యాద. దేశంలో మనం రూపొందించు కున్న చట్టాలను మనం ఎలా గౌరవించి పాటిస్తున్నామో అలాగే శాస్త్రం ప్రతిపాదించిన విషయాలను కూడా మనం శిరసావహించాల్సి ఉంటుంది. అలా కాని నాడు ఆ సమర్ధత తల్లిదండ్రులకు లేదని ఎత్తి చూపడం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రధానమైన అధికారులు. పెద్దలు నిర్ణయించారు కాన... అని శుభలేఖల్లో వేస్తుంటారు. పెద్దలంటే ఎవరు... శాస్త్రం తెలిసిన వారు. వారిని తల్లిదండ్రులు ఎందుకు సంప్రదిస్తారు... వారు దేన్ని ప్రమాణం చేసుకుని వివాహాన్ని నిర్ణయిస్తారు– అంటే.. శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం, లక్షణం... ఈ ఐదు విషయాలను పరిగణనలోకి తీసుకుని వారు నిర్ణయిస్తారు. -
విషాదం: ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, బల్మూర్(అచ్చంపేట): పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమజంట కలిసి బతకకపోయినా.. కలిసి తనవు చాలించాలని నిర్ణయించుకొని ఉరేసుకొని మృతిచెందారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బిల్లకల్ అటవీ ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. బిల్లకల్‌కు చెందిన రాయ అఖిల(19), చెంచుగూడెంకు చెందిన అనిల్(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబాల పెద్దలకు తెలియటంతో పెళ్లికి నిరాకరించి మందలించారు. దీంతో కలిసి చావాలని నిర్ణయించుకొని సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని రుసుల చెరువు అటవీశాఖ బేస్ క్యాంప్ వద్దకు బైక్‌పై వెళ్లారు. క్యాంప్ వెనుక భాగంలో ఉన్న చెట్టుకు చున్నీతో ఇద్దరూ ఉరేసుకుని మృతిచెందారు. అటుగా వెళ్లిన మేకల కాపరులు గుర్తించి ఇరువురి కుటుంబ»సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనలో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఎంపీపీ అరుణ, సర్పంచ్ అంజనమ్మ బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోక్సో కేసు నమోదు గోపాల్పేట: మండలంలోని తాడిపర్తికి చెందిన సురేశ్‌పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామగౌడ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఓ యువతిని సురేశ్ ప్రేమించి ఆరునెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వరకట్నం తీసుకురావాలని సురేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. యువకుడి బలవన్మరణం పెబ్బేరు(కొత్తకోట): మండలంలోని తోమాలపల్లిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఏఎస్ఐ జయన్న కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుడిసె వెంకటేష్ (25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరేసుకుని మృతిచెందాడు. పారిశుద్ధ్య పనులకు వెళ్లిన తల్లి ఇంద్రమ్మ ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అయిదు నెలల క్రితమే వివాహమైందని.. తరచూ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతుండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి ఇంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని ఏఎస్ఐ వివరించారు. -
రణ్‌బీర్, అలియా వివాహం అప్పుడే!
ముంబై : బాలీవుడ్ ప్రేమ జంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో త్వరలో ఒక్కటవుతారని బాలీవుడ్లో ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రణ్‌బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో రణ్‌బీర్, అలియా మ్యారేజ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. స్టార్ జంట వివాహానికి రిహార్సల్స్ కోసమే నీతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని కపూర్ కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. ఈ ఏడాది వివాహ వేడుక లేదని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే శుభకార్యంపై స్పష్టత వస్తుందని కపూర్ కుటుంబ సభ్యులు ఒకరు వెల్లడించారు. రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించారని, దీంతో 2021 ద్వితీయార్ధం వరకూ పెళ్లి ఊసే ఉండదని పేర్కొన్నారు. మరోవైపు వివాహంపై రణ్‌బీర్, అలియా సానుకూలంగా ఉంటే నీతూజీకి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని చెప్పుకొచ్చారు. అసలు రణ్‌బీర్, అలియా భట్‌లో ఏ ఒక్కరూ ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని అన్నారు. వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు చాలా సమయం పడుతుందని తేల్చేశారు. చదవండి : తెలుగు పాఠాలు -
ప్రియురాలితో నటుడి వివాహం
సాక్షి, బెంగళూరు: కన్నడ నటుడు వినాయక్ జోషి ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు వర్షా బెలవాడితో ఆర్య సమాజం ఆచారాల ప్రకారం పరస్పరం ఉంగరాలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక శుక్రవారం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలన పాటిస్తూ నిరాడంబరంగా వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లి కార్యక్రమాన్ని బంధువులు, స్నేహితులు, అభిమానుల కోసం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వినాయక్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు వినాయక్, వర్షాలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షా బెలవాడి జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం వర్షా బాడ్మింటన్ అకాడమీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. వినాయక్, వర్షా చిన్ననాటి స్నేహితులు. ఏడేళ్ల వయసులో వీరిద్దరు ఒకే చోట డాన్స్ నేర్చుకున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మళ్లీ కలుసుకొని ప్రేమలో పడ్డారు. ఇక సినిమాలో విషయానికి వస్తే.. హీరో వినాయక్ 70 సినిమాల్లో నటించారు. అమృతా వర్షిని, లాలి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునిచ్చాయి. అదే విధంగా బిగ్ బాస్ కన్నడ సీజన్3లో వినాయక్ పాల్గొని సందడి చేశారు. -
లైబ్రరీ ఫోటోలు పోస్ట్ చేస్తే పెళ్లి ప్రపోజల్స్!
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గలేదు. ట్విటర్లో తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్ చేసిన షౌమిక్ అనే యూజర్‌కు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువెత్తాయి. ‘నేనేంటో తెలియని వారి కోసం...నేను లైబ్రరీలో నివసిస్తున్నా’ అంటూ తన లైబ్రరీ ఫోటోలను పోస్ట్ చేసిన షౌమిక్కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ ఫోటోల్లో ఒక చోట స్టడీ కమ్ వర్క్ డెస్క్ ఉండగా, మరో మూల కుర్చీ కనిపించాయి. వేలాది బుక్స్ మధ్య డెస్క్, కుర్చీ ఉన్న ఫోటోలు అమితంగా ఆకట్టుకున్నాయి. చదవండి : ఒక్కో బుక్... ఒక్కో కిక్ ఈ ట్వీట్‌ను షౌమిక్ పోస్ట్ చేయగానే పుస్తక ప్రియులు అతను విస్తారంగా చేపట్టిన పుస్తక సేకరణ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు 8000కు పైగా లైక్స్ దక్కగా పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు అతడి పుస్తక అభిరుచిని అభినందించగా, మరికొందరు అతడి రూమ్మేట్గా ఉంటామన్నారు. అంతేకాదు..షౌమిక్ పుస్తక కలెక్షన్‌కు మెచ్చి పలువురి నుంచి ఆయనకు పెళ్లి ప్రతిపాదనలూ అందాయి. ఇక తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన రావడంతో ఉద్వేగానికి గురైన షౌమిక్ ఇవి తాను సేకరించిన మొత్తం బుక్స్‌లో 75 శాతమని, తన వద్ద 8000కు పైగా బుక్స్ ఉన్నాయని మరో ట్వీట్ చేశారు. -
బంగ్లా నటితో దర్శకుడి వివాహం
కొల్కత్తా: ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ వివాహం నిరాడంబరంగా శుక్రవారం జరిగింది. ఆయన బంగ్లాదేశ్‌కు చెందిన నటి, మోడల్ రఫియాత్ రషీద్ మిథిలాని వివాహమాడారు. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులైన బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు రుద్రనీల్ ఘోష్, జిషు సేన్‌గుప్తా, కవి శ్రీజాటోలు పాల్గొన్నారు. వివాహమహోత్సవంలో మిథాలా ఎరుపు జమ్దానీ చీరలో, శ్రీజిత్ నల్లపు రంగు కుర్తా, నెహ్రూ జాకెట్లో మెరిసిపోయారు. మిథిలా బ్రాక్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా చిన్నపిల్లలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మిథిలా గతంలో బంగ్లాదేశ్‌కి చెందిన సంగీతకారుడు తహ్సాన్ రెహ్మాన్ ఖాన్‌ను 2006లో వివాహం చేసుకుంది. అనంతరం 2017లో వీరు చట్టప్రకారం విడిపోయారు. వారికి ఓ కూతురు కూడా ఉన్నారు. కాగా ఇటీవల శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో భారత స్వాతంత్ర్య వీరుడు సుభాస్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అంశంపై ‘గుమ్నామి’ అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటుడు ప్రొసేన్‌జిత్ ఛటర్జీ.. సుభాస్ చంద్రబోస్ పాత్రలో కనిపించారు. కూతురుతో మిథిలా,శ్రీజిత్ ముఖర్జీ -
ఎనిమిదో అడుగు
మొదటి అడుగు: దైవం మనిద్దరినీ ఒకటి చేయుగాక. రెండవ అడుగు: మనిద్దరికీ శక్తి లభించుగాక. మూడవ అడుగు: వివాహ వ్రత సిద్ధి కలుగుగాక. నాలుగు అడుగు: మనకు ఆనందం కలుగుగాక ఐదవ అడుగు: దైవం మనకు పశుసంపదను కలిగించుగాక ఆరవ అడుగు: రుతువులు మనకు సుఖమిచ్చుగాక ఏడవ అడుగు: దైవం మనకు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణను అనుగ్రహించుగాక. వివాహ వేడుకలో వేసే ఏడు అడుగుల అర్థం ఇది. ఈ ఏడు అడుగులతో పాటు మరో అడుగు కూడా వేసింది బబితా పోగట్. తోటి రెజ్లింగ్ క్రీడాకారుడు వివేక్సుహాగ్తో బబిత వివాహం మొన్న ఆదివారం జరిగింది. ఈ వివాహ వేడుకలో సంప్రదాయంగా వేసే ఏడు అడుగులతో పాటు ఆడపిల్లల అభ్యున్నతి కోరుతూ అదనంగా మరో అడుగు వేశారీ దంపతులు. ‘ఆడపిల్లలను కాపాడుదాం, అడపిల్లలను చదువుకోనిద్దాం, ఆడపిల్లలను ఆడుకోనిద్దాం’ అని ఎనిమిదో అడుగు వేశారు ఈ యువదంపతులు. భారతప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారానికి కొనసాగింపుగా ‘ఆడపిల్లలను క్రీడాకారులుగా తీర్దిద్దిదుదాం’ అని కొత్త ఆలోచనకు ఇలా నాంది పలికారు వీళ్లు. దేశమెరిగిన సిస్టర్స్ బబిత పోగట్ పరిచయం అవసరం లేని క్రీడాకారిణి. మల్లయుద్ధ క్రీడాకారిణులు పోగట్ సిస్టర్స్‌లో రెండవ అమ్మాయి బబిత. పదేళ్ల కిందట కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో మొదలు పెట్టి ఈ పదేళ్లలో కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. బబిత అక్క గీత కూడా ఇదే స్థాయిలో విజయాలనందుకుంది. ఈ మల్లయోధురాళ్ల జీవితం ఆధారంగా గత ఏడాది హిందీలో ‘దంగల్’ సినిమా వచ్చింది. అప్పటి వరకు క్రీడాభిమానులకు మాత్రమే తెలిసిన రెజ్లింగ్ సిస్టర్స్ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు. మరో ముందడుగు బబిత తండ్రి మహావీర్‌సింగ్ పోగట్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత. అతడు తన కూతుళ్లు నలుగురినీ మల్లయోధులుగా తీర్చిదిద్దడం ద్వారా హరియాణా సమాజంలో ఆడపిల్లల అభ్యుదయానికి దార్శనికుడయ్యాడు. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే చిదిమేసే దుష్ట సంప్రదాయం వేళ్లూనుకుని పోయిన హరియాణా రాష్ట్రంలో పోగట్ సిస్టర్స్ సంప్రదాయ పరిధులను చెరిపేసి విజయశిఖరాల వైపు అడుగులు వేశారు. ఇప్పుడు హరియాణాలో వారి సొంతూరు బలాలి గ్రామంలో జరిగిన వివాహ వేడుక సందర్భంగా బబిత దంపతులు.. సామాజిక చైతన్యం కోసం వివాహవేడుకలో ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయాన్ని సవరించి కొత్త సంప్రదాయం వైపు అడుగులు వేశారు.తొలి ఏడు అడుగులు తమకు సంపూర్ణమైన జీవితం సిద్ధించాలని కోరుకున్న ఈ కొత్త దంపతులు ఎనిమిదో అడుగుని సమాజ హితం కోసం వేశారు. తాను ఈ ఏడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నియోజకవర్గం నుంచి బరిలో దిగడం కూడా విధాన నిర్ణయాల్లో భాగం పంచుకునే అధికారం ఆడవాళ్లకు కూడా ఉందని తెలియచేయడానికేనని ఆమె ఎన్నికల సందర్భంగా చెప్పారు. – మంజీర ఇది సమష్టి నిర్ణయం మేము ప్రాక్టీస్ కోసం గోధుమ చేలలో పరుగులు తీసేటప్పుడు అందరూ మమ్మల్ని వింతగా చూసేవాళ్లు. వాళ్ల దృష్టిలో స్త్రీ ఎలా ఉండాలంటే... దేహాకృతి స్పష్టంగా తెలియనంత వదులుగా దుస్తులు ధరించాలి. అలాంటి భావజాలం రాజ్యమేలుతున్న రోజుల్లో మేము నిక్కర్, టీ షర్ట్ వేసుకుని జుట్టు పొట్టిగా కత్తిరించుకుని పరుగులు తీయడం మా ఊరి వాళ్లకు ఓ పెద్ద విచిత్రం. ఇన్నేళ్ల మా ప్రయాణంలో మేము ఎక్కడ తప్పటడుగు వేస్తామా అని ఎదురు చూసిన వాళ్లే ఎక్కువ. అలాంటి సమాజంలో ఆడపిల్ల తన జీవితాన్ని తాను జీవించే పరిస్థితులు నెలకొనాల్సిన అవసరం చాలా ఉంది. అడ్డంకులను దాటుకుని ముందడుగు వేసిన మాలాంటి వాళ్లందరం రాబోయే తరాలకు కొత్తదారిని నిర్మించాలి. ఇందులో భాగంగానే గత ఏడాది మా కజిన్ వినేశ్ కూడా తన పెళ్లిలో ఎనిమిది అడుగులు వేసింది. ఇది మేమంతా సమష్టిగా తీసుకున్న నిర్ణయం. – బబిత పోగట్, రెజ్లింగ్ క్రీడాకారిణి -
అందుకే ఆ పెళ్లి ఆగిపోయింది!
హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే దానిపై ప్రియాంక తల్లి మధు చోప్రా పెదవి విప్పారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని, కొంచెం సమయం కావాలని సిద్ధార్థ చెప్పడంతో పెళ్లి రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో సిద్ధార్థ చోప్రా వివాహం జరగాల్సింది. అయితే చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇషితకు అత్యవసర శస్త్రచికిత్స జరగడం వల్లే పెళ్లి రద్దైందని తొలుత ఊహాగానాలు వచ్చాయి. సిద్ధార్థ సిద్ధంగా లేకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయిందని తాజాగా రుజువైంది. మరోవైపు ఇషితా కుమార్‌కు ఆమె తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. పెళ్లి ఆగిపోయినందుకు బాధ పడొద్దని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భరోసాయిచ్చారు. సిద్ధార్థ కంటే మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరుకుతాడని ధైర్యం చెప్పారు. (చదవండి: ఆగిన ప్రియాంక చోప్రా తమ్ముడి పెళ్లి!) -
అలా లోబరుచుకోవడం లైంగిక దాడే : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : పెళ్లి పేరుతో మహిళను లోబరుచుకోవడం లైంగిక దాడిగా పరిగణించాలని, ఇది మహిళ గౌరవానికి భంగకరమేనని సర్వోన్నత న్యాయస్ధానం సంచలన తీర్పు వెలువరించింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ డాక్టర్ 2013లో్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించిన కేసులో జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడైన డాక్టర్‌తో విలాస్‌పూర్‌కు చెందిన బాధితురాలికి 2009 నుంచి పరిచయం ఉంది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగా పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు బాధితురాలిని వంచిస్తూ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడిని చత్తీస్‌గఢ్ హైకోర్టు లైంగిక దాడిలో దోషిగా తేల్చింది. హైకోర్టు నిందితుడికి పదేళ్ల కఠిన శిక్షను విధించడంతో నిందితుడు కింది కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కాగా, బాధితురాలిని వివాహం చేసుకునే ఉద్దేశం నిందితుడికి లేకున్నా ఆమెను శారీరకంగా లోబరుచుకునేందుకు పెళ్లిని సాకుగా చూపాడని, ఇది లైంగిక దాడి కిందకే వస్తుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అదే నేరం కింద శిక్షను అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పింది. -
భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఇంట పెళ్లి సందడి
-
పేదింటి పెళ్లి కానుక ఇక రూ.1,00,116
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్లో మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకు ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పేరుతో ప్రభుత్వం నాలుగేళ్లుగా ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేద కుటుంబాల్లో ఆడ పిల్లలకు పెళ్లి కానుకగా ప్రస్తుతం రూ.75,116 ఆర్థిక సాయం అందిస్తోంది. త్వరలోనే ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచబోతోంది. వచ్చే బడ్జెట్లో అందుకు తగినన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సంక్రాతి పండుగ తర్వాత అధికారికంగా ఈ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. -
పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు
శృంగవరపుకోట రూరల్: ప్రేమించి... పెళ్లి చేసుకుని ఆనక ముఖం చాటేసి... మరో వివాహానికి సిద్ధపడుతున్నాడంటూ విజయనగరం జిల్లా కొట్టాం గ్రామానికి చెందిన బొడబళ్ల సతీష్ ఇంటి ఎదుట బెంగళూరుకు చెందిన కుమారి అనాంబ బుధవారం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన తాను హైదరాబాద్‌లో ఓ ఎన్జీవో సంస్థలో ఉద్యోగం చేస్తూ మెహదీపట్నంలో ఉండేదాన్నని తెలిపారు. మూడున్నరేళ్ల క్రితం ఏపీఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ బొడబళ్ల సతీష్ తనను పరిచయం చేసుకుని ప్రేమించి హైదరాబాద్‌లోని శివాజీ ఆలయంలో 2015 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన పెళ్లాడినట్టు తెలిపింది. తరువాత తనను వదిలేసి తప్పించుకు తిరుగుతున్నాడని, మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుండటంతో నిలదీసేందుకే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. సతీష్ కారణంగా తాను రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్లు చేయించాడని వాపోయింది. తాను సతీష్ భార్యగానే ఓటరు ఐడెంటిటీ కార్డు కూడా ఉందనీ, హైదరాబాద్ నుంచి సతీష్ నాలుగు నెలల కిందట కాకినాడ బెటాలియన్‌కు బదిలీ చేసుకుని వచ్చి, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపించింది. తనను చంపేసినా సరే కదిలేది లేదని ఆ ఇంటిముందు దీక్షకు దిగింది. కాగా తన కుమారుడినుంచి డబ్బు గుంజేందుకు ఈమె నాటకం ఆడుతోందని సతష్ తల్లి బొడబళ్ల రామాయమ్మ ఆరోపిస్తున్నారు. కాగా సతీష్‌ను ఫోన్లో సంప్రదించగా కుమారి అనాంబతో తనకు హైదరాబాద్‌లో పరిచయం ఉందనీ, అనాథ అని తెలిసి పెళ్లి చేసుకుందామనుకున్నాననీ, కానీ ఆమెకు ఇదివరకే వివాహం అయినట్టు తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపారు. -
పెళ్లైన మరుసటి రోజే వధువు...
అన్నానగర్: వివాహం జరిగిన మరుసటి రోజే నూతన వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం ఆనైమలైలో చోటుచేసుకుంది. కోవై జిల్లా ఆనైమలై సమీపంలో ఉన్న దివాన్‌సా. పుదూరైకి చెందిన మణికంఠన్. ఇతని కుమారుడు విజయ్ (21) కూలీ. ఇతనికి అదే ప్రాంతంలో ఉన్న జీవా (19) అనే అమ్మాయికి గత 28వ తేదీ మీనాక్షిపురంలో వివాహం జరిగింది. మరుసటి రోజు జీవా అమ్మమ్మ కమల ఇంట్లో పెళ్లి మరవలి జరిగింది. అనంతరం మరుసటి రోజు మంగళవారం జీవా భర్త విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ స్నానం చేయడానికి వెళ్లిన జీవా అరగంట అయినా బయటికి రాలేదు. దీంతో బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా కొత్త జీవా చీరతో ఉరి వేసుకుని వేలాడుతుంది. విషమ స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను వెంటనే పొల్లాచ్చిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ జీవా మృతి చెందింది. ఆనైమలై ఎస్ఐ వల్లియమ్మాల్, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి వేడుక... గాజుల కానుక
అమలాపురం టౌన్ :ఆడంబరాలదే పైచేయి అవుతున్న నేటి వివాహ తంతులో సంప్రదాయానికి పెద్దపీట వేసి అందరినీ ఆకట్టుకున్నారు వంటెద్దు నారాయణ స్వామి. ఎన్ని పిండివంటలు పెట్టామా? ఎంత అట్టహాసంగా వివాహం చేశామా? అని తలపోస్తున్న ఈ ఆధునిక కాలంలో సంప్రదాయానికి ఆయన ఊపిరులూదారు. ఒకప్పుడు ఏ ఇంటైనా పెళ్లి జరుగుతుంటే ఆ ఉళ్లో ముత్తైదువలందరినీ ఇంటికి సాదరంగా ఆహ్వానించి గాజుల మూటలతో ఊరూరా...తిరిగి అమ్మే గాజులమలారం వారిని రప్పించి అందరికీ గాజులు తొడిగించేవారు. ఆ సంప్రదాయ వేడుకనే ‘గాజుల కానుక’ అంటారు. ఆ సంప్రదాయాన్నే నారాయణ స్వామి తన కుమారుడి వివాహంలో పునరుద్ధరించారు. ఆ విశేషాన్నే వివాహ ఆహ్వాన పత్రికపై ముద్రించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరంలో రైల్వే ఉద్యోగిగా పని చేసి ఇటీవలే వంటెద్దు నారాయణ స్వామి పదవీవిరమణ చేశారు. నారాయణస్వామి, సుబ్బలక్షి ్మ దంపతుల కుమారుడు శ్రీరామ భూషణం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతని వివాహం ఈనెల 11న జరగనుంది. ఆ సందర్భంగా అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో తమ ఇంటికి ఆవీధి, కల్వకొలనువారి వీధిలలోని ముత్తైదువలను పిలిపించి గాజుల వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గతంలో గాజుల అమ్మేవారిని తీసుకు వచ్చారు. అనేక రకాల గాజులను ప్రదర్శనగా ఉంచారు. వాటిని ముత్తైదువులకు తొడిగించారు. కనుమరుగైపోయిన ‘గాజుల పండుగ’ను సంప్రదాయబద్దంగా చేసిన నారాయణస్వామి దంపతులను ఆ ముత్తైదువలు అభినందించారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
యల్లాయపాలెం(కొడవలూరు) : బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న సంఘటన మండలంలోని యల్లాయపాలెంలో శనివారం రాత్రి చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మసీదు వీధికి చెందిన ఓ బాలికకు (15) మేనమామ వరుసైన వ్యక్తితో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 26వ తేదీన పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. వివాహ శుభలేఖలు ముద్రించి పంపిణీ ప్రారంభించారు. వివాహ విషయం ఐసీడీఎస్ సూపర్వైజర్ సాయికుమారి దష్టికి వెళ్లడంతో ఆమె ఐసీపీఎస్ అధికారిణి సుజాతతో కలిసి శనివారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేశారు. బాల్య వివాహం చట్ట రీత్యా నేరమని, అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేసి వివాహం జరిపితే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహం రద్దు చేసుకునేందుకు అంగీకరించి అందుకు కట్టుబడి ఉంటామని అధికారులకు ఒప్పంద పత్రం రాసిచ్చారు. -
నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు
నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటున్నారు సంచలన తార త్రిష. ఈమె పెళ్లి వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌తో నిశ్చయమై పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనుకున్న సమయంలో అనూహ్యంగా పెళ్లి రద్దయిన విషయం తెలిసిందే. ఈ విషయం సినీరంగానంతా కలకలం పుట్టించినా త్రిష, ఆమె కుటుంబం మాత్రం గుంబనంగా ఉండిపోయారు.ఆ తరువాత చాన్నాళ్లకు త్రిష తల్లి మౌనం వీడారు.కొందరు కుటుంబ పెద్దలే వివాహ రద్దుకు కారణం అంటూ ముక్త సరిగా ముగించారు. అలాంటిది తాజాగా వరుణ్‌మణియన్‌తో తన వివాహ రద్దుకు చాలా మంది కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం గురించి త్రిష ఏమంటున్నారో చూద్దాం వరుణ్‌మణియన్ తో నా పెళ్లి పెద్దలు నిశ్చయించినదే. వారి కోరికతో నేను అంగీకరించాను. అయితే వాటితో పాటే కొన్ని నిబంధనలు విధించారు. అందుకే పెళ్లి రద్దు చేసుకున్నాం. అయితే ఈ రద్దు వెనుక చాలా మంది ఉన్నారు. నాకు వివాహ సంప్రదాయంపై నమ్మకం ఉంది. అలాగే సంస్కృతి, సంప్రదాయాలపైనా గౌరవం ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు తగ్గ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకర్ని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. అని అంటున్న త్రిష ప్రస్తుతం కేరీర్ పరంగా మంచి పీక్‌లో ఉన్నారు. జయంరవి సరసన నటించిన భూలోకం విడుదల కావలసి ఉండగా, ఆయనతో నటించిన మరో చిత్రం అప్పాటక్కర్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కమల్ సరసన తూంగానగరంతో పాటు భోగీ అనే ఒక తెలుగు చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. -
నూతన వధూవరులు
గత రెండు రోజుల్లో ఒక్కటైన నూతన వధూవరులతోపాటు దుర్గమ్మ సన్నిధిలో పెళ్లి చేసుకునేందుకు వచ్చినవారితో ఆదివారం ఇంద్రకీలాద్రిపై సందడి వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని షెడ్డుతో పాటు ఉపాలయాల వద్ద పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. నూతన వధూవరులతో పాటు సాధారణ భక్తులు కూడా భారీగా రావడం తో ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు 50వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వ దర్శనం క్యూలైనైఉలో అమ్మవారి దర్శనా నికి మూడు గంటల సమయం పట్టింది. శీ్రౌు్ఛ దర్శనం క్యూలైనైఉ షాపింగ్ కాంెౌ్ఛ్లక్స్ దాటింది. మహానివేదన, సాయంత్రం పంచహారతుల సమయంలో రద్దీ మరింతగా నెలకొంది. భక్తుల వాహనాలు నిలపడంతో ౌూ్ఛటైఉరోడ్డుపై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఉదయం 11 గంటల నుంచే కొండపైకి ద్విచక్రవా హనాలు మినహా ఇతర వాహనాలను అను మతించలేదు. కార్లు, వ్యాన్లు, ఇతర వాహనాలను కనక దుర్గనగర్‌లో నిలుపుకోవాలని దేవస్థాన సిబ్బంది సూచిస్తుండగా, అక్కడా ఖాళీ లేకపోవ డంతో భక్తులు తమ వాహనాలను అర్జున వీధిలో నిలుపోవాల్సి వచ్చింది. -
పెళ్లి చేసుకోమంటే నిప్పు పెట్టాడు!
బాధితురాలు బీటెక్ విద్యార్థిని, పరిస్థితి విషమం సాక్షి, నల్లగొండ: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రేమికురాలిపై కిరోసిన్‌పోసి నిప్పంటిం చాడో ఘనుడు. ఈ ఘటన మంగళవారం నల్లగొండలో జరిగింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఇదే మండల పరిధిలోని దర్వేశిపురానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నకిరేకంటి సైదులు, అరుణ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇతను జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌లో ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. అప్పటికే వివాహం జరిగిన సైదులుకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అరుణ కొంతకాలంగా అడుగుతూ వస్తోంది. ఈ క్రమంలో సైదులు తన కార్యాలయంలోకి మధ్యాహ్నం సమయంలో ఆమెను పిలిచాడు. ఒక్కసారిగా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అరుణకు 95 శాతానికిపైగా గాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.